sri venkateswara swamy temple
-
శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర్ స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చిన ముస్లింలు
-
వైభవంగా కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
రథోత్సవం.. పోటెత్తిన భక్తులు (ఫొటోలు)
-
వైభవంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)
-
అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు..
-
అరుకు లోయలో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలు
-
తిరుమల వేంకటేశ్వరుడికి ఎంత బంగారం ఉందంటే..?
ఆపదమొక్కులవాడు, వడ్డీ కాసుల వాడు అయిన వేంకటేశ్వరుడు శేషాచల కొండలపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం. ఆ శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రపంచంలోనే అపర కుబేరుడు విరాజిల్లుతున్నాడు. ఆయన సిరి సంపదలు ఎంతో తెలియాలంటే, ఆయన వైభోగం చూస్తే చాలు . ఆయనకు ప్రతి రోజు చేసే అలంకరణలో పెట్టే ఆభరణాలు చూస్తేనే తెలుస్తుంది. ఆయన వద్ద ఉన్న బంగారు నిల్వలు ఎన్ని ఉన్నాయనేది. అంతేగాదు ఒకచిన్నపాటి దేశం వద్ద ఉన్నంత బంగారం స్వామివారి వద్ద ఉన్నాయంటే అతిశయోక్తి కాదేమో..!. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం భక్తుల రద్దీతో ఉంటుంది. కోరి కొలిచే వారికి కొంగు బంగారమై నిలిచే కోనేటి రాయుడికి కావాల్సినంత బంగారం ఉంది . నిత్యం దేశ విదేశాల నుంచి స్వామి వారిని దర్శించుకునే భక్తులు స్వామివారికి బోలెడన్ని కానుకలు సమర్పిస్తారు. బంగారం అయితే లెక్క లేనంత స్వామి వారి ఖాజానా కు చేరుతుంది . ప్రతీ సంవత్సరం కోట్ల సంఖ్యలో స్వామిని దర్శించుకునే భక్తులు స్వామి వారికి బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు కానుకగా సమర్పించుకుంటున్నారు. చాలా విలువైన, అపురూపమైన ఆభరణాలు స్వామి వారి సొంతం . టన్నుల కొద్ది బంగారం.. టీటీడీకి సంబంధించిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్న వివరాల ప్రకారం స్వామివారి వద్ద టన్నుల కొద్దీ బంగారు నిల్వలు ఉన్నాయి.మొత్తం స్వామివారి వద్ద ఉన్న ఆభరణాలతో కలిపి 11 టన్నుల బంగారం ఉంది. స్వామి వారి పేరు మీద బ్యాంకుల్లో 9,259 కేజీల బంగారం నిల్వలు ఉన్నాయంటే ఆయన ఎంతటి కుబేరుడో అర్ధం చేసుకోవచ్చు. . ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లోనే 5,387 కిలోల బంగారం డిపాజిట్లు ఉండగా, ఆ తర్వాత 1,938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. ఇటీవలే తమిళనాడులోని పంజాబ్ నేషనల్ బ్యాంకు 1,381 కేజీల బంగారాన్ని డిపాజిట్ కాలపరిమితి ముగియడంతో స్వామివారికి తిప్పిపంపడం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆ బంగారం బయటకు రావటం కూడా పెద్ద వివాదంగా మారింది. తిరిగి అంతా క్లియర్ గానే ఉందని తేలింది. ఇక మొత్తంగా శ్రీవారి దగ్గర బంగారు ఆభరణాలు 1.2 టన్నులు, వెండి 10 టన్నులు ఉన్నట్లు సమాచారం. తిరుమల దేవస్థానం బ్యాంకుల్లో జమ చేస్తున్న బంగారం హుండీలో భక్తులు కానుకగా సమర్పించుకున్నవే. అవి రకరకాల బంగారు ఆభరణాల తోపాటు బిస్కెట్ల రూపంలోనూ వస్తాయి. వీటిని టీటీడీ బ్యాంకుల్లోడిపాజిట్ చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి బంగారు డిపాజిట్ల మెచ్యూరిటీపై, ఆలయ నిర్వాహకులు వడ్డీ మొత్తాన్ని కూడా బంగారంగా మార్చారు. అది ఇప్పటికే బ్యాంకుల వద్ద ఉన్న కుప్పలు కుప్పలుడి బంగారు రాసి ఉండటం గమనార్హం. ఇక టీటీటీ ఇచ్చి సమాచారం ప్రకారం.. 023-24 వార్షిక సంవత్సరంలో 1031 కిలోల బంగారం డిపాజిట్ అయ్యింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 11,329 కిలోల బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసింది. అంతేగాదు టీటీడీ గత మూడేళ్లలోనే 4 వేల కిలోల వరకు బంగారాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం గమనార్హం. ఇక నగదు రూపంగా శ్రీ వేకంటేశ్వర స్వామి పేరు మీద రూ. 17 వేల కోట్లు పైనే డిపాజిట్ అయ్యి ఉంది. (చదవండి: భద్రాచలం: రామా కనవేమిరా!) -
తిరుమల వేంకటమే.. అక్కడున్నది వేంకటేశ్వరుడే
తిరుమలపై కొన్ని అసత్య కథనాలు ప్రచారంలో ఉన్న, ప్రచారంలోకి వస్తున్న పూర్వ రంగంలో తిరుమల గురించి సరైన విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక విషయంపై తెలివి లేకుండా ఏదో అనుకోవడమూ, అసత్యాల్ని ప్రచారం చెయ్యడమూ పెనుదోషాలు. తిరుమలలో దైవం వేంకటేశ్వరుడు కాదు అది అమ్మవారు అనీ, అక్కడ ఉన్నది సుబ్రహ్మణ్య స్వామి అనీ, 9వ శతాబ్ది వరకూ అది బౌద్ధ క్షేత్రం ఆ తరువాతి కాలంలో దాన్ని వేంకటేశ్వరుడి ఆలయంగా మార్చేశారు అనీ విన వస్తున్నవి పూర్తిగా అసత్యాలు అని తెలుసుకోగలిగే ఆధారాలు ఉన్నాయి! తిరుమల విషయమై తెలివిడిలోకి వెళదాం రండి... వామన, గరుడ పురాణాల్లో వేంకటాచల క్షేత్ర ప్రస్తావన ఉంది. బ్రహ్మాండ, వరాహ పురాణాల్లో 'వేంకట' శబ్దానికి వివరణలున్నాయి. "వికటే" అనేదే "వేంకట" పదానికి పూర్వ రూపమనీ, "వేం" అంటే పాపం "కటతి" అంటే కాల్చేది అనీ చెప్పబడింది. పురాతనమైన తమిళ కావ్యాల్లో వెంకటాద్రి ప్రస్తావన ఉంది. సాధారణ శకం 2వ శతాబ్దికి చెందింది తమిళ్ష్ సంగ కాల సాహిత్యం. ఆ సంగ కాలంలోని ఒక తమిళ్ష్ కవి కల్లాడనర్ రాసిన అగనానూరు కావ్యంలో 83వ పద్యం (సెయ్యుళ్)లో శ్రీ వేంకటగిరి పైన ఒక ఆటవిక తెగ యువరాజు విహరించిన విశాలమైన మంచి ప్రదేశంలోని వేంకటం అని సూచిస్తూ "తిరువేంగడమలై కళ్షియినుమ్ కల్లా ఇళయర్ పెరుమగన్ పుల్లి వియందలై నన్ నాట్టు వేంగడం" అని చెప్పబడ్డది. ఇక్కడ శ్రీ వేంకటగిరి ప్రసక్తీ, వేంకటం ప్రసక్తీ కనిపిస్తున్నాయి. ఆ కావ్యంలో మరికొన్ని చోట్ల కూడా ఈ వేంకట శబ్దం చెప్పబడ్డది. అంతే కాదు ఆ రచనలో "ఏళీర్ కున్ఱం" అంటే ఏడుకొండలు అన్న ప్రస్తావన కూడా ఉంది. ఈ సంగ కాల సాహిత్యం అన్నది కొందరు రచయితల రచనల సంకలనం. సంగ కాల సాహిత్యం సాధారణ శకం 2వ శతాబ్ది కన్నా పూర్వంది అంటున్న పరిశీలనలు కూడా ఉన్నాయి. ఈ తమిళ సంగ కాల సాహిత్యంలో మరి కొందరు కవులు కూడా వేంగడం (వేంకటం) గురించి ప్రస్తావించారు. "ఉత్తర వేంకటం నుంచి దక్షిణ కన్యాకుమారి మధ్యన ఉంది తమిళ్ష్ మాట్లాడే మంచి లోకం (వడ వేంగడం తెన్ కుమరి / ఆయిడై తమిళ్ష్ కూఱుమ్ నల్ ఉలగం)" అనే లోకోక్తి చాల పాత నాళ్లలోనే తమిళ్ష్‌లో ఉంది. సాధారణ శకం 3వ శతాబ్దిలో ఇళంగో కవి రాసిన తమిళ్ష్ కావ్యం సిలప్పదిగారమ్లో వేంకటేశ్వరుడి వర్ణన ఉంది. ఆ రచనలో "తిరువరంగత్తిల్ కిడంద తిరుక్కోలముమ్, వేంగడత్తిల్ నిన్ఱ తిరుక్కోలముమ్" అని ఉంది. అంటే శ్రీరంగంలో (తిరువరంగత్తిల్) పడుకుని ఉన్న పవిత్ర రూపమూ, వేంకటంలో (వేంగడత్తిల్) నుంచుని ఉన్న పవిత్ర రూపమూ అని అర్థం. ఆ రచనలో నుంచుని ఉన్న ఈ రూపంపై వర్ణన పునరావృతం అయింది. వేంకటమూ, వేంకటేశుడూ గురించి 2, 3 శతాబ్దులకు లేదా అంతకు పూర్వ కాలానికి చెందిన తమిళ్ష్ కావ్యాలలో ప్రస్తావన ఉంది. అటు తరువాత 3-8 శతాబ్దులకు చెందిన ఆళ్ష్వారుల కాలానికి వేంకటేశుడు వేంకటాద్రితో సహా ప్రసిద్ధమయ్యాడు. ఆళ్ష్వారులు వందల పాసురాల్లో వేంకటేశుణ్ణి కీర్తించారు. ఈ ఆళ్ష్వారుల్లో తొలి తరానికి చెందిన పేయ్ ఆళ్వార్ తిరుమలై అనే పదాన్ని వాడారు. పేయ్ ఆళ్వార్ సాధారణ శకానికి పూర్వం 300 - 200 మధ్య కాలం వారు అని కొన్ని పరిశీలనలు తెలియజేస్తున్నాయి. తిరుమలై లేదా తిరుమల, తిరుపతి అన్నవి తమిళ పదాలు. తిరు అంటే శ్రీ అని, ఉన్నతమైన అని, మేలిమి అని, పవిత్రమైన అని అర్థాలు. తిరుమలై అంటే శ్రీ పర్వతం లేదా పవిత్రమైన పర్వతం, ఉన్నతమైన పర్వతం లేదా మేలికొండ అనీ, తిరుపతి అంటే శ్రీపతి లేదా పవిత్రమైన, ఉన్నతమైన నాథుడు అనీ అర్థాలు. ఈ వివరణల ద్వారా కొందరు ప్రచారం చేస్తున్నట్టుగా 9వ శతాబ్ది వఱకూ బౌద్ధ క్షేత్రంగా ఉండి ఆ తరువాత అది వేంకటేశం అవలేదని తేట తెల్లంగా తెలియవస్తోంది. అది అమ్మవారి ఆలయమో సుబ్రహ్మణ్య ఆలయమో కాదు అని కూడా తెలుస్తోంది. అన్నమయ్య "తిరు వేంకటశుడు" అనే పాడారు కదా? అది అమ్మవారో లేదా సుబ్రహ్మణ్యస్వామో అయుంటే అన్నమయ్య వంటి కవికి, భక్తునికి, జ్ఞానికి ఆ విషయం తెలియకుండా ఉంటుందా? అన్నమయ్య కాలానికి తిరుమల దైవం వేంకటేశుడే అని అప్పటి ప్రజలకు బాగా తెలుసు అని మనం గ్రహించాలి. నిజం కానిది, ప్రజల్లో లేనిది అయిన తిరుమల బౌద్ధ క్షేత్రం అనే అబద్ధాన్ని ఇటీవల కొందరు సృష్టించారని స్పష్టంగా అర్థమౌతోంది. (వెంకట్ అనీ వెంకటేష్ అనీ మనకు అలవాటయింది. అది తప్పు. అది వేంకటం, వెంకటం కాదు. వేంకట్ అనో వేంకటేశ్ అనో అనడమే సరైంది. ఈ వేంకటేశ అనే పేరు వేదాంత దేశికుల పేరు. వారే ఈ పేరుకు తొలివ్యక్తి.) 7-5-1820 నుండి 10-5-1820 వరకు తిరుమల ఆలయం మూసివెయ్యబడింది. అంతకు ముందు ఆలయం పూర్తిగా వడగలై సంప్రదాయంలో ఉండేది. ఆ మూడునాళ్ల తరువాత తిరుమల ఆలయం వడగలై, తెన్‌గలై సంప్రదాయాల వాళ్లకు ఆమోదయోగ్యంగా ఉండే విధానాల్లోకి మారింది. ఆ సమయంలోనే వేంకటేశ్వరుడి నామం వడగలై, తెన్‌గలై పద్ధతుల్లో కాకుండా ப గా మారింది. కానీ ధ్వజ స్థంభం, రథం, ఏనుగు, గరుడ వాహనం వంటి వాటిపై నామాలు మారకుండా నేటికీ వడగలై పద్ధతిలోనే ఉన్నాయి. మొదట్లో తిరుమల ఆలయం పాంచరాత్ర ఆగమ విధానంలో ఉండేది. పాంచరాత్ర ఆలయాల్లో ముందు ధ్వజ స్తంభం తరువాత బలిపీఠం ఉంటాయి. తిరుమలలో మనకు ఈ నిర్మాణమే కనిపిస్తుంది. పాంచరాత్ర ఆలయాలు కొండలపైనా, నదీ తీరాల్లోనూ ఉంటాయి. (శ్రీరంగం నదీ తీరంలో ఉంది) వైఖానస ఆగమ ఆలయాలు ఊరి లోపల ఉంటాయి. విజయనగర రాజు అచ్యుత దేవరాయల కాలంలో తిరుమల ఆలయం పాంచరాత్ర ఆగమం నుండి వైఖానస ఆగమంలోకి మారింది. అచ్యుతరాయలు వ్యక్తిగత కారణాలతో ఈ మార్పుకు కారణమయ్యాడు. మధ్యలో కొంత కాలం తిరుమల ఆలయం వ్యాసరాయర్ పర్యవేక్షణలో మార్ధ్వ సంప్రదాయంలోనూ ఉండేది. ఇవాళ ప్రధాన గోపురంలో మనం చూస్తున్న విమాన వేంకటేశ్వరుడు ఈ వ్యాసరాయర్ ఏర్పఱిచిందే. తిరుమలకు ఇవాళున్న ప్రశస్తి, ప్రాచుర్యం రావడానికి ప్రధానమైన కారణం రామానుజులు. రామానుజులు జన్మతః వైష్ణవుడు కాదు! స్మార్తుడు లేదా వైదికుడు. జన్మతః స్మార్తుడైన రామానుజులు వైష్ణవ సంప్రదాయ పంచ సంస్కార దీక్షను తీసుకుని వైష్ణవుడు ఆయ్యారు. రామానుజుల్ని వైష్ణవుడుగా మార్చిన గురువు పెరియనంబి. ఈ పెరియనంబి బ్రాహ్మణుడు కాదు శూద్ర అనబడుతున్న వర్గానికి చెందినవారు. ఇది మనకు దిశా నిర్దేశం చేసే చారిత్రిక సత్యం! ఆళ్ష్వారుల కాలం నుండే వైష్ణవం ఉంది. పొదిగై ఆళ్ష్వార్, బూదత్తు ఆళ్ష్వార్, పేయ్ ఆళ్ష్వార్ వీళ్లు మొదటి ముగ్గురు ఆళ్వార్లు. ఈ ముగ్గురూ వ్యావహారిక లేదా సామాన్య శకానికి పూర్వం 300 - 200 మధ్య కాలంవారు అని కొన్ని పరిశీలనలు, వ్యావహారిక లేదా సామాన్య శకం తొలి శతాబ్దివారు అని కొన్ని పరిశీలనలు చెబుతున్నాయి. అటు తరువాత తిరుమళ్షిసై ఆళ్ష్వార్, నమ్మ ఆళ్ష్వార్, తిరుమఙ్‌గై ఆళ్ష్వార్, తొణ్డర్ అడిప్పొడి ఆళ్ష్వార్, పెరియ ఆళ్ష్వార్, ఆణ్డాళ్, కులశేఖర ఆళ్ష్వార్, మదుర కవి ఆళ్ష్వార్, తిరుప్పాణ ఆళ్ష్వార్లు వచ్చారు. బెంగాల్ లో 15వ శతాబ్దిలో చైతన్య ఏర్పఱిచిన గౌడియ వైష్ణవం, వల్లభాచార్యుల రుద్ర సంప్రదాయం, కర్ణాటక ఉడిపిలో 13వ శతాబ్దిలో మధ్వాచార్యుల మధ్వ సంప్రదాయం, నింబారకుల నింబారక సంప్రదాయం వంటివి వైష్ణవంలో ఉన్నాయి. రామానుజుల గురువు పెరియనంబికి పూర్వం వైష్ణవ గురు పరంపర ముక్కాల్ నంబి, ఆళవందార్ వంటి వారి మీదుగా శ్రీమత్ నాదమునిగళ్ వఱకూ వెళుతుంది. ఈ నాదమునిగళ్ను ఈనాడున్న వైష్ణవానికి ఆదిగా తీసుకోవచ్చు. రామానుజుల తరువాత ఈనాటి వైష్ణవ సంప్రదాయానికి ఊపు వచ్చింది. రామానుజుల తరువాత వైష్ణవంలో వేదాంత దేశికులు ఉన్నతమైన గురువు. అటు తరువాత మనవాళ మామునిగళ్ కాలంలో వడగలై సంప్రదాయమూ, తెన్‌గలై సంప్రదాయమూ ఏర్పడ్డాయి. ఈ మనవాళ మామునిగళ్ జన్మతః బ్రాహ్మణులు కాదు! ఈడిగ అనబడుతున్న వర్గానికి చెందినవారు మనవాళ మామునిగళ్. ఈ చారిత్రిక సత్యం మనకు కనువిప్పు కలిగిస్తూ సామాజిక వర్గాల అసమానతల్ని తొలగించేది కావాలి. వడగలై, తెన్‌గలై సంప్రదాయాల్లో నుదుటిపై పెట్టుకునే నామాలలో తేడాలున్నాయి. వడగలై నామం U. ఈ U కి కింద చిన్న గీత పెడితే తెన్‌గలై నామం అవుతుంది. మాధవా, కేశవా అంటూ నామాలు చెప్పుకుంటూ గీతలు గీసుకోవడం వల్ల ఈ ముద్రలకు నామాలు అని అనడం వచ్చింది. ఇవాళున్న ఈ వైష్ణవ నామాలు రామానుజుల కాలంలో లేవు. రామానుజులు ఈ నామాల్ని పెట్టుకుని ఉండరు. ఆయన శ్రీచందనంతో ఊర్ధ్వ పుండరాన్ని పెట్టుకుని ఉంటారు. వడగలై నామం వేదాంత దేశికర్తోనూ, తెన్‌గలై నామం మనవాళ మామునిగళ్తోనూ మొదలైనట్టుగా తెలుస్తోంది. కర్ణాటక, ఉత్తరాది వైష్ణవ సంప్రదాయాల్లో శ్రీచందనంతో ఉర్ధ్వ పుండరమే ఉంది. ఇస్కాన్ కూడా ఈ నామాన్నే తీసుకుంది. ఇవాళ రామానుజల విగ్రహానికి తెన్‌గలై నామం కనిపిస్తోంది. అది ఎంత మాత్రమూ సరికాదు. రామానుజులకు ముందు, రామానుజులకు తరువాత అని వైష్ణవాన్ని పరిగణించాల్సి ఉంటుంది. అదే విధంగా తిరుమలను కూడా రామానుజులకు ముందు, రామానుజులకు తరువాత అని పరిగణించాల్సి ఉంటుంది. రామానుజులు తిరమలలో పూజా విధానాలు, సేవలు, పద్ధతులలో పెనుమార్పులు తీసుకువచ్చారు. రామానుజులు తిరుమలకు రంజనను, రాణింపును తీసుకువచ్చారు. సరైన విషయాల్ని తెలుసుకుని తెలివిడితో తిరుమల విషయమై ఇకనైనా సరైన అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. తిరుమల అమ్మవారి ఆలయమో, సుబ్రహ్మణ్య ఆలయమో, ఏ బౌద్ధ క్షేత్రమో, మరొకటో కాదు. తిరుమల వేంకటమే; అక్కడున్నది వేంకటేశ్వరుడే. రోచిష్మాన్ 9444012279 -
అయోధ్యకు లక్ష వెంకన్న లడ్డూలు
తిరుమల: అయోధ్యలో సోమవారం జరుగనున్న బాల రాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు పంపిణీ చేయడానికి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ప్రసాదం అయిన లక్ష లడ్డూలను రామ మందిర ట్రస్టు ప్రతినిధులకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆదివారం అందజేశారు. తొలుత రామ మందిరానికి చేరుకున్న కరుణాకరరెడ్డికి రామ మందిర ట్రస్టు ప్రతినిధి సాధ్వి రితంబరి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆయన రామాలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులతో మాట్లాడారు. కలియుగంలో తిరుమలలో స్వయంభువుగా వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి అని చెప్పారు. శ్రీవారి ప్రథమ సేవకుడిగా ఉన్న తనకు రామ మందిర ప్రారంభ మహోత్సవంలో పాల్గొనే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆనందం వ్యక్తం చేశారు. రసరమ్యంగా అయోధ్యకాండ అఖండ పారాయణం లోకకల్యాణం కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం జరిగిన 6వ విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్తిసాగరంలో ముంచెత్తింది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అయోధ్యకాండలోని 18 నుంచి 21వ సర్గ వరకు మొత్తం నాలుగు సర్గల్లో 199 శ్లోకాలు, యోగవాశిష్టం, ధన్వంతరి మహామంత్రంలోని 25 శ్లోకాలు కలిపి మొత్తం 224 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు కె.రామానుజాచార్యులు, అనంత గోపాలకృష్ణ, మారుతి శ్లోక పారాయణం చేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ
సాక్షి, తిరుపతి: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం ప్రధాని మోదీ ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న విషయం తెలిసిందే. ప్రధానమంత్రి సోమవారం ఉదయం 9 గంటలకు మహాద్వారం వద్దకు చేరుకోగా, అర్చకులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ధర్మారెడ్డి, వేదపండితులు ఆలయ మర్యాదలతో వేదమంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. మహాద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించిన ప్రధాని ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. అనంతరం బంగారు వాకిలి ద్వారా గర్భగుడిలోకి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వైభవం, ప్రాశస్త్యం గురించి ప్రధానికి ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. ఆలయ జీయర్లు శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం వకుళామాతను ప్రధాని దర్శించుకున్నారు. అక్కడి నుంచి విమాన ప్రాకారం మీదుగా విమాన వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఆ తర్వాత వెండివాకిలి మీదుగా వెలుపలకు వచ్చిన ప్రధాని ధ్వజస్తంభాన్ని మొక్కారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా, భూమన కరుణాకరరెడ్డి, ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం, టీటీడీ 2024 క్యాలెండర్, డైరీ, పంచగవ్యాలను అందజేశారు. అక్కడి నుంచి అతిథి గృహానికి చేరుకున్న ప్రధాని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం అల్పాహారాన్ని స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ శ్రీవారిని దర్శించుకోవడం ఇది నాలుగోసారి. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమల వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రార్థించానని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు. ప్రధానికి సాదర వీడ్కోలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరివెళ్లారు. విమానాశ్రయంలో మోదీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వరరెడ్డి వీడ్కోలు పలికారు. -
ద్వారకా తిరుమలలో అంగరంగ వైభవంగా చినవెంకన్న తిరుకళ్యాణం
-
కల్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
-
సిద్ధిపేట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన హరీశ్
-
ముంబైలో శ్రీబాలాజీ ఆలయ నిర్మాణానికి భూమిపూజ
తిరుపతి కల్చరల్: నవీ ముంబైలోని ఉల్వేలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో శ్రీవేంకటేశ్వర స్వామి (బాలాజీ) ఆలయ నిర్మాణానికి బుధవారం శాస్త్రోక్తం గా భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘వేంకటరమణా గోవిందా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. నవీ ముంబైలో తిరుపతి బాలాజీ మందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగడం మహారాష్ట్రకు మరుపురాని రోజు అని చెప్పారు. మహారాష్ట్ర ప్రజల చిరకాల కోరికను నెరవేర్చి మనల్ని ఆశీర్వదించడానికి తిరుమల బాలాజీ నవీ ముంబైలో కొలువుదీరబోతున్నారని తెలిపారు. ముంబై ట్రాన్స్‌హార్బర్ లింక్‌లోని 22 కిలోమీటర్ల పొడవైన సింగిల్ బ్రిడ్జిని త్వరలో మహాలక్ష్మి ఆలయానికి అనుసంధానించనున్నట్లు తెలిపారు. ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయడానికి ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందని ఆయన చెప్పారు. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ అయిన బాలాజీ ఆలయాన్ని తిరుమల ఆలయం తరహాలో నిర్మించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సూచించారని తెలిపారు. ఆలయ నిర్మాణ ఖర్చును రేమండ్ గ్రూప్ సీఎండీ గౌతమ్ హరి సింఘానియా భరిస్తున్నారని చెప్పారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ అందరి సహకారంతో ఆలయాన్ని అత్యంత వేగంగా నిర్మిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఎ.వి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యుడు మిలిందర్ నర్వేకర్, ఆమోల్ కాలే, రాజేష్‌శర్మ, సౌరభ్ బోరా, సిడ్కో వీసీ డాక్టర్ సంజయ్ ముఖర్జీ, టీటీడీ ఎస్ఈ జగదీశ్వర్‌రెడ్డి, మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
నవీ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి పూజా
ముంబై: నవీ ముంబైలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆలయానికి అర్చకులు భూమి పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, రేమాండ్స్ అధినేత సింఘానియా, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తిరుమల తరహలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్థికంగా ముందుకు వెళ్తుందని భావిస్తున్నామన్నారు. ఆలయానికి సమీపంలోని తీర ప్రాంతం నుంచి నిర్మింస్తున్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ లక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.తిరుమల వెళ్ళి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు.. నవీ ముంబైలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామివారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందన్నారు. శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఏకరాల స్థలం కేటాయించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయ తరహలోనే నవీ ముంబైలో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణంపూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పారు. -
కరీంనగర్లో శ్రీవారి ఆలయం.. టీటీడీ ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో..
కరీంనగర్: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కరీంనగర్ లో కొలువుదీరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే సీఎం కేసీఆర్ కరీంనగర్లో 10 ఎకరాల స్థలాన్ని టీటీడీ ఆలయానికి కేటాయించారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో కరీంనగర్ టీటీడీ ఆలయ నిర్మాణ అనుమతి పత్రాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, టీటీడీ తెలంగాణ లోకల్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ జి.భాస్కర్రావులకు అందజేశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఏపీ సీఎం జగన్ ఆదేశాలతో కరీంనగర్ పట్టణంలో రూ.20 కోట్ల వ్యయంతో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. అదే రోజు శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం ఈనెల 31న ఉదయం 7.26 గంటలకు శంకుస్థాపన కార్యక్రమం వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం అదే ప్రాంగణంలో సాయంత్రం నుంచి ప్రజలకు శ్రీవారి ఆశీస్సులు అందించేలా శ్రీవేంకటేశ్వరుని కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తామన్నారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, త్వరలోనే వినోద్‌రావు, భాస్కర్‌రావుతో కలిసి తిరుమలకు వెళ్తామని, ఆగమశాస్త్రం ప్రకారం కరీంనగర్ పద్మనగర్‌లో నిర్మించే శ్రీవేంకటేశ్వరసామి ఆలయం అంతరాలయం, గోపురాలు, బాహ్యాలయ నిర్మాణాల నమూనాలతో పాటు మూల విరాట్, పోటు, ప్రసాద వితరణ కేంద్రం తదితర అంశాలను పరిశీలిస్తామని చెప్పారు. చదవండి: 16 బోగీలతో సికింద్రాబాద్–తిరుపతి వందేభారత్.. ఎప్పటి నుంచి అంటే? -
కనులపండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ టీటీడీ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఆదివారం జరిగిన పూజల్లో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, చేవెళ్ళ ఎంపీ. రంజిత్‌రెడ్డిలు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చంద్రప్రభ వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. నగరం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తిరువీధుల్లో స్వామివారి వాహన సేవల్లో పాల్గొని ఈ అపురూప దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున సుప్రభాతం తోమాల అర్చన అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎల్ఏసీ కమిటీ ఉపాధ్యక్షులు వెంకట్‌రెడ్డి, రవి ప్రసాద్, కోమటిరెడ్డి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరాలయంలో సీఎం సతీమణి పూజలు
వేంకటేశ్వర కాలనీ: వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ సతీమణి శోభ సోమవారం శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమెకు వేద ఆశీర్వచనం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో లావణ్య, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి పాల్గొన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం ఆంధ్రపదేశ్‌కి వచ్చిన రాష్ట్రపతి ముర్ము విశాఖలోని నేవిడేకి హాజరైన తదనంతరం రాత్రి 8 గంటలకు తిరుమలకు పయనమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము తిరుమలలో ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ రంగనాయకులు మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. తదనంతరం రాష్ట్రపతికి శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అధికారులు అందజేశారు. ఆ తర్వాత పద్మావతి అతిధి గృహానికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్ చేసి తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో భేటీ అవుతారు. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి మధ్యాహ్నం నేరుగా డిల్లీకి పయనం అవుతారు. ఐతే ఆమె ఈ నెల 28నశీతాకాల విడిది కోసం తెలంగాణ వెళ్లనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) (చదవండి: విశ్వగురు భారత్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
Photos : ఎన్టీఆర్ స్టేడియంలో కనుల పండువగా శ్రీవారి వైభవోత్సవాలు..
-
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
-
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం
-
మలేసియాలో శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవ వేడుకలు (ఫొటోలు)
-
నెల్లూరులో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు
-
సదా శ్రీవారి సేవలో..!
సాక్షాత్ శ్రీమహా విష్ణువే వైకుంఠాన్ని వీడి శేషాద్రీశుడై ఆనంద నిలయంలో శ్రీ వేంకటేశ్వరుడుగా కొలువయ్యాడు. సువర్ణ కాంతులు వెదజల్లే బంగారు మేడలో కటాక్షిస్తున్న శ్రీనివాసుడిని దర్శించి..తరించడానికి రోజుకు వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. వారందరికీ స్వామి వారి దర్శన భాగ్యం కల్పించడానికి ఎంతో మంది టీటీడీ ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తుంటారు. కొండ మీదకు చేరుకునే మొదలు శ్రీవారి దర్శనం అయినంతవరకు భక్తులు వీరి సేవలను పొందుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో టీటీడీలో ఎన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా సేవలందిస్తున్నారనే వివరాలతో ‘సాక్షి ’ప్రత్యేక కథనం తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కనులారా దర్శించుకోవడానికి దేశవిదేశాల నుంచి భారీగా భక్తులు నిత్యం తిరుమలకు వస్తుంటారు. శ్రీవారి ఆలయంలో ఉన్న భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా రోజుకు 80 వేల నుంచి 95 వేల మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం లభిస్తోంది. ఇంతమంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడానికి శ్రీవారి ఆలయంలో ఉద్యోగులు నిరంతరాయంగా విధులు నిర్వర్తిస్తుంటారు. స్వామి వారికి వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై అర్ధరాత్రి 2.30 గంటలకు ఏకాంత సేవను నిర్వహించే వరకు ఉద్యోగుల పాత్ర విశేషంగా ఉంటుంది. శ్రీవారి ఆలయ భద్రతను పర్యవేక్షించడానికి నిరంతరాయంగా భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహిస్తుంటారు. శ్రీవారి ఆలయ భద్రతా వ్యవస్థ పర్యవేక్షించడానికి టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్, ఏఆర్, ఏపీఏస్పీ పోలీసులు విధుల్లో ఉంటారు. భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం కల్పించడానికి ఒక్క శ్రీవారి ఆలయంలోనే 35 విభాగాలకు చెందిన ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అర్చకులు, జీయ్యంగార్ల వ్యవస్థ ఇలా... స్వామి వారి ఆలయంలో వేంకటేశ్వరునికి పూజా కైంకర్యాలు నిర్వహించడానికి గాను అర్చకులు, జీయ్యంగార్ల వ్యవస్థ ఉంటుంది. ప్రధాన అర్చకులు నలుగురు విధుల్లో ఉండగా మరో 45 మంది అర్చకులు వీరికి సహకరిస్తుంటారు. వీరికి సహకారంగా అర్చన పఠించే వ్యక్తి ఒకరు, భాష్యకార్ల సన్నిధి వద్ద ఇద్దరు, పరిచారకులు 19 మంది, తాళ్లపాక వంశస్తులు ఇద్దరు, సన్నిధి గొల్లలు ఇద్దరు, తరిగొండ వెంగమాంబ వంశస్తులు ఒకరు, వేదపారాయణదారులు ఇద్దరు, మరో 26 మంది విధుల్లో ఉంటారు. వీరంతా కూడా స్వామివారి కైంకర్యాల నిర్వహణ కోసం కేటాయించబడిన సిబ్బందే. వీరంతా ప్రతి నిత్యం మూడు షిప్టుల్లో స్వామివారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తుంటారు. స్వామి వారికి నిత్యం నిర్వహించే సేవల కోసం మంగళవాయిద్యకారులు 27 మంది ఉంటారు. స్వామివారి ఉత్సవ మూర్తులు ఊరేగింపు కోసం వాహనబేరర్లు 36 మంది విధుల్లో ఉంటారు. క్యూ లైన్ కోసం.. శ్రీవారి భక్తులు క్యూ లైన్ నిర్వహణ కోసం ఆలయానికి డిప్యూటీ ఈవో ఒకరు, ఏవోలు నలుగురు, సూపరింటెండెంట్లు 14 మంది, సీనియర్ అసిస్టెంట్లు 9 మంది, జూనియర్ అసిస్టెంట్లు 19 మంది, దఫేదార్లు 6 మంది, షరాఫ్‌లు 10 మంది, అటెండర్లు 59 మంది, తోటమాలీలు 20 మంది, మల్టీపర్పస్ ఉద్యోగులు 13 మంది, ప్యాకర్లు 7 మంది, సర్వర్లు ముగ్గురు, ఆరోగ్య సిబ్బంది 5 మంది విధుల్లో ఉంటారు. వీరికి తోడు స్వామి వారి ప్రసాదాల తయారీకి 400 మంది ఉంటారు. ఇలా మొత్తంగా క్యూ లైన్ నిర్వహణ కోసం దాదాపుగా 300 మంది విధుల్లో ఉంటే ప్రసాదాల తయారీకి 400 మంది, భధ్రత కోసం 300 మంది సిబ్బంది ఉంటారు. -
తిరుమల: మే నెలలో భారీగా శ్రీవారి హుండీ ఆదాయం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి మే నెలలో హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో అక్షరాలా రూ.130.29 కోట్లు వచ్చింది. మే నెలకు సంబంధించి 22 లక్షల 62 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాలు 1.86 కోట్లు జరిగాయి. భక్తుల సౌకర్యార్థం టైమ్ స్లాట్ సర్వదర్శన విధానాన్ని పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఇదిలా ఉంటే గడిచిన కొద్ది రోజులుగా స్వామివారి హుండీ ఆదాయం రోజుకు రూ.4 కోట్లుగా ఉంటుంది. రద్దీ రోజుల్లో ఈ మొత్తం రూ.5 కోట్లు దాటుతోంది. కరోనా కారణంగా తగ్గిన హుండీ ఆదాయం ఇప్పుడు భక్తుల రాకతో మళ్లీ సిరులతో కళకళలాడుతోంది. చదవండి: (CM Jagan: రెవెన్యూ ఎర్నింగ్ శాఖలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష) -
జూన్ 9న వెంకటపాలెం శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణ
సాక్షి, అమరావతి/తాడికొండ: అమరావతి సమీపంలోని వెంకటపాలెం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు (టీటీడీ) నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ సందర్భంగా ఈనెల నాలుగోతేదీ నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గురువారం (తొమ్మిదో తేదీ) ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు విగ్రహప్రతిష్ట, మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. మహాసంప్రోక్షణకు భక్తులు పెద్దసంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో ఆలయం ఎదురుగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేశారు. 40 మొబైల్ మరుగుదొడ్లు అందుబాటులో ఉంచారు. మూడు స్వాగత ద్వారాలు, నగరంలోని ముఖ్యమైన 50 ప్రాంతాల్లో మహాసంప్రోక్షణకు భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆలయం నుంచి ప్రధాన రోడ్డుకు అప్రోచ్ రోడ్డు, రెండులైన్ల బ్యారికేడ్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక తదితర ఏర్పాట్లు చేశారు. ఆలయంలో సేవలందించేందుకు వివిధ విభాగాల నుంచి దాదాపు 400 మందిని డిప్యుటేషన్‌పై నియమించారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు భజన బృందాల వారు కలిపి రెండువేల మంది రానున్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి, టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తదితరులు మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాలను టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తిచానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మహాసంప్రోక్షణ అంటే.. నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ట చేయడానికి మహాసంప్రోక్షణ నిర్వహిస్తారు. కార్యక్రమాల ప్రారంభానికి ముందు విష్వక్సేనపూజ, అంకురార్పణ నిర్వహిస్తారు (ఈ కార్యక్రమాలను ఈనెల 4న నిర్వహించారు). మరుసటి రోజు నుంచి ఐదురోజుల పాటు విగ్రహానికి వివిధ రకాల శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామి శక్తిని కుంభాల్లోకి (కలశాల్లోకి) ఆవాహన చేసి ప్రతిరోజు రుత్వికులు నియమనిష్టలతో ఆరాధనలు, ఉక్త హోమాలు చేస్తారు. ఈ క్రమంలో విగ్రహానికి మొదటిరోజు పంచగవ్య ఆరాధన, రెండోరోజు క్షీరాధివాసం, మూడోరోజు జలాధివాసం, నాలుగోరోజు విమాన గోపుర కలశస్థాపన, విగ్రహస్థాపన, అష్టబంధన కార్యక్రమాలు చేపడతారు. చివరిరోజైన ఐదోరోజు మహాసంప్రోక్షణ ద్వారా కుంభాల్లోని స్వామి శక్తిని మూలమూర్తి (బింబం)లోకి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ట చేస్తారు. ఈ కార్యక్రమం గురువారం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు స్వామి దర్శనం ప్రారంభమవుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 నుంచి శాంతి కల్యాణం జరుగుతుంది. ఇక్కడ స్వామి చతుర్భుజాలు, శంఖుచక్రాలు, వరద, కటిహస్తాలతో వక్షస్థలంలో శ్రీమహాలక్ష్మి అమ్మవారితో దర్శనమిస్తారు. ప్రత్యేక ఆకర్షణగా శంఖుచక్ర నామాలు నూతన ఆలయం వద్ద విద్యుత్ దీపాలతో ఏర్పాటుచేసిన శంఖుచక్ర నామాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయ ప్రాకారం, విమానం, గోపురాలపై రంగురంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ఆలయం ప్రాంగణంలో రెండున్నర టన్నుల వివిధ రకాల పుష్పాలు, 20 వేల కట్ ఫ్లవర్లతో సుందరంగా అలంకరించారు. -
9న అమరావతి శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ
తాడికొండ: అమరావతిలో నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో 9వ తేదీన ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ప్రాణ ప్రతిష్ట, మహాసంప్రోక్షణ జరగనున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లను టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి సుబ్బారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహాసంప్రోక్షణ కార్యక్రమానికి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి విచ్చేస్తారని తెలిపారు. ఈ ఆలయాన్ని రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించామన్నారు. ఆర్టీసీ అధికారులతో చర్చించి భక్తులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. -
రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కల్యాణోత్సవం (ఫొటోలు)
-
ఉత్తరాంధ్ర భక్తులకు కొంగు బంగారంగా ఉపమాక శ్రీ వెంకటేశ్వరస్వామి
-
శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి దంపతులు
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రెటీలు ఏపీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో తన సోదరి పూరందేశ్వరి ఇంట్లో బంధువులతో కలిసి సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక నిన్న(శుక్రవారం) మెగాస్టార్ చిరంజీవి కృష్ణా జిల్లా డోకిపర్రుకి మెగాస్టార్ సతీసమేతంగా వచ్చారు. భోగి సందర్భంగా డోకిపర్రులోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో చిరు ఆయన భార్య సురేఖ దంపతులు పాల్గొన్నారు. ఆలయ వర్గాలు, వేదపండితులు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. వేదపండితులు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి పూర్ణకుంభంతో చిరు దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కొత్త సంవత్సరపు క్యాలెండర్, డైరీలను చిరంజీవి ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదాదేవి కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని, తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణం అనంత్సరం చిరంజీవి,సురేఖ దంపతులు డోకిపర్రు గ్రామంలో బస చేశారు. ఈ రోజు ఉదయం (శనివారం) ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. -
ద్వారకాతిరుమల ఆలయ ఈవోపై విచారణ
ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారి జీవీ సుబ్బారెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి బి.సూర్యనారాయణ, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్లకు గతనెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుబ్బారెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని భీమడోలుకు చెందిన శ్రీవేంకటేశ్వరస్వామి సేవాసమితి అధ్యక్షుడు పరిమి వేంకటేశ్వరరెడ్డి గతేడాది నవంబర్ 16న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. గత ఆగస్టు 8న శ్రీవారి కొండపై వైష్ణవ సంప్రదాయాలకు విరుద్ధంగా జంతుబలి ఇచ్చారని, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆ వివాదంపై విచారణాధికారిగా నియమితులైన ఏఈవో బీవీఎస్ రామాచార్యులపై ఒత్తిడి తెచ్చి, ఆయన గుండెపోటుతో మృతిచెందడానికి ఈవో సుబ్బారెడ్డి కారకుడయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆలయ పరిసరాల్లోనే నివాసం ఉంటున్న ఈవో.. భక్తులు కాళ్లు కడుక్కునే బహిరంగ ప్రదేశంలో టవల్ కట్టుకుని స్నానం చేయడం వల్ల మహిళా భక్తులు ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. గత అక్టోబర్ 20న స్వామి కల్యాణంలో పాల్గొనేందుకు వచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, స్థానిక ప్రజాప్రతినిధులను అవమానించారని పేర్కొన్నారు. ఆలయ ఆస్తిని కాజేస్తున్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. ప్రసాదాల తయారీ, సెంట్రల్ స్టోర్, లీజియస్ విభాగాల నుంచి ఈవో ప్రతినెలా రూ.10 లక్షలు వసూలు చేస్తున్నారని, తలనీలాల కాంట్రాక్టరుకు లాభం చేకూరుస్తూ ఆలయానికి నష్టం కలుగజేస్తున్నారని ఆరోపించారు. -
తిరుపతి వెంకన్నస్వామికి గద్వాల ఏరువాడ పంచెలు రెడీ
సాక్షి, గద్వాల: తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా పంపించే గద్వాల ఏరువాడ జోడు పంచెలు సిద్ధమయ్యాయి. గద్వాల సంస్థానాదీశుల కాలం నుంచి తిరుమల శ్రీవెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు ఏరువాడ జోడు పంచెలను ఏటా అందజేయడం సంప్రదాయం. గత 400 సంవత్సరాలుగా కొనసాగుతోంది ఈ ఆనవాయితీ. ఈసారి చేపట్టిన శ్రీవారి జోడు పంచెల నేత ఇటీవలే పూర్తయింది. ఐదుగురు చేనేత కార్మికులు 41 రోజులు నిష్టతో వీటిని తయారుచేశారు. చదవండి: అక్టోబర్ 5న వీఐపీ బ్రేక్ దర్శనం లేదు: టీటీడీ అక్టోబర్ 7 నుంచి 15వ తేదీ వరకు జరిగే దసరా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శ్రీవారి అలంకరణలో జోడు పంచెలను ధరింపజేస్తారు. గురువారం ఈ పంచెలను టీటీడీ అధికారులకు అందజేస్తామని పంచెల తయారీని పర్యవేక్షించిన మహం కాళి కరుణాకర్ తెలిపారు. ఏరువాడ పంచెలు 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు, 15 అంగుళాల వెడల్పు అంచుతో ఉంటాయి. తుంగభద్ర, కృష్ణానదుల మధ్య గద్వాల ఉండడంతో వీటికి ఏరువాడ పంచెలు అనే పేరు వచ్చింది. చదవండి: బ్రహ్మోత్సవాల నుంచి నడకదారిలో భక్తులకు అనుమతి గద్వాల సంస్థానాధీశులు సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం ఆనవాయితీ. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానం వారసురాలిగా ఉన్న శ్రీలతాభూపాల్ ఆధ్వర్యంలో జోడు పంచెలను శ్రీవారికి పంపే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. -
ఆర్జిత సేవలకు భక్తుల అనుమతి వాయిదా
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆర్జిత సేవలకు ఈనెల 14 నుంచి భక్తులను అనుమతించే నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు టీటీడీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 6న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఈనెల 13న శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని 6వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 6 నుంచి 11గంటల వరకు ఆలయ శుద్ధి చేస్తారు. మధ్యాహ్నం 12 నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి సేవలో ప్రముఖులు ఎంపీ శ్రీధర్, సినీ నిర్మాత విశ్వప్రసాద్, సీఐడీ ఎస్పీ సరిత, అపోలో డైరెక్టర్ సునీత శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. -
శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా మంగళవారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్థానిక పద్మావతి అతిథిగృహం నుంచి బయలుదేరిన రాష్ట్రపతి క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీవరాహస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు వచ్చిన రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి.. అర్చకులతో కలసి ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ఆలయంలో ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు స్వామివారి శేషవస్త్రం అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలను, స్వామి చిత్రపటాన్ని, 2021 క్యాలెండర్, డైరీలను అందజేశారు. రాష్ట్రపతితోపాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుచానూరు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ కుటుంబ సమేతంగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జేఈవో బసంత్‌కుమార్, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వస్త్రం, తీర్థప్రసాదాలను చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. తిరుమల నుంచి సాయంత్రం రోడ్డు మార్గంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి 5.30 గంటలకు వైమానికదళ విమానంలో అహ్మదాబాద్ వెళ్లారు. రాష్ట్రపతి దంపతులకు శ్రీవారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి రేణిగుంటలో ఘనస్వాగతం తిరుమల శ్రీవారి దర్శనం కోసం చెన్నై నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి స్వాగతం పలికినవారిలో ఉన్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆర్కే రోజా, బియ్యపు మధుసూదనరెడ్డి, వెంకటేగౌడ్, ఎంఎస్ బాబు, ఆదిమూలం, శ్రీనివాసులు, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, మేడా మల్లికార్జునరెడ్డిలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రపతికి పరిచయం చేశారు. కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త, డీఐజీ క్రాంతిరాణా టాటా, టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, తిరుపతి అర్బన్ ఎస్పీ రమే‹Ùరెడ్డి, చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ను అడ్డగించిన విజిలెన్స్ అధికారులు తిరుమల శ్రీవారి ఆలయం వద్ద జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తను టీటీడీ విజిలెన్స్ అధికారులు అడ్డుకున్నారు. రాష్ట్రపతి ఆలయంలోకి వెళ్లిన అనంతరం కలెక్టర్‌ను, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ విజయారావును లోపలికి వెళ్లకుండా ఆపేశారు. తాను కలెక్టర్‌నని చెప్పినా.. ‘మీ పేర్లు నా వద్ద ఉన్న లిస్టులో లేవు’ అంటూ నిలువరించారు. దీంతో కలెక్టర్ వెనుదిరిగి తన వాహనం వద్దకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అదనపు ఎస్పీ సుప్రజ కలెక్టర్ వద్దకు వెళ్లి ఆయన్ని ఆలయంలోకి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రికి ఘనస్వాగతం రేణిగుంట (చిత్తూరు జిల్లా): రాష్ట్రపతి కోవింద్‌కు స్వాగతం పలికేందుకు మంగళవారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌కు ఘనస్వాగతం లభించింది. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో గన్నవరం వెళ్లారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ దర్శనం సమయంలో హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మిక మందన్నా స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. 'అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. శర్వానంద్, రష్మిక 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివిశేషాలు వెల్లడిస్తామన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, నిడదవోలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు, తెదేపా ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, శివసేన పార్టీ ప్రధాన కార్యదర్శి మిలింద్ నవదేకర్ వేరు వేరుగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. స్వామి వారి దర్శనాంతరం ఆలయ వెలుపల నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసుల నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. దసరా సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామి వారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రల ప్రజలంతా సుఖసంతోషాలతో దసరా వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. -
హంస వాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ మలయప్ప
సాక్షి, తిరుమల : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజున శ్రీవారి ఆలయంలోని కల్యాణ మండపంలో శ్రీ మలయప్ప స్వామివారు హంస వాహనంపై వీణ ధరించి సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తాడు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి కలిగించేందుకే హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలు కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణోత్సవ మండపంలో వాహన సేవల జరుగుతుంది.. కాగా, నవరాత్రి బ్రహ్మోత్సవాలలో మూడవ రోజైన ఆదివారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీమలయప్పస్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 89కోట్లు
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారిని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో 21.68 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ.. శ్రీవారి దర్శనం, హుండీ ఆదాయం, లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల పంపిణీ, తలనీలాలు, గదుల వివరాలను వెల్లడించింది. దర్శనం : గతేడాది ఫిబ్రవరిలో 19.93 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 21.68 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం : శ్రీవారి హుండీ ఆదాయం గతేడాది ఫిబ్రవరిలో రూ.83.44 కోట్లు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో రూ.89.07 కోట్లు వచ్చింది. అన్నప్రసాదం : గతేడాది ఫిబ్రవరిలో 43.94 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు అందివ్వగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 48.40 లక్షల మంది భక్తులకు అన్నదాన సేవలు అందించారు. లడ్డూలు : గతేడాది ఫిబ్రవరిలో 83.91 లక్షల లడ్డూలు అందించగా, ఈ ఏడాది ఫిబ్రవరి లో 82.38 లక్షల లడ్డూలను అందించారు. తలనీలాలు : గతేడాది ఫిబ్రవరిలో 6.70 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించగా, ఈ ఫిబ్రవరిలో 7.77 లక్షల మంది తలనీలాలు సమర్పించారు. గదులు : గదుల ఆక్యుపెన్సీ గతేడాది ఫిబ్రవరిలో 102 శాతం నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో 103 శాతం నమోదైంది. -
నేత్రపర్వం శ్రీవారి కల్యాణోత్సవం
-
కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం
రాజమండ్రి: కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలోని వాడపల్లి వెంకటేశ్వరస్వామి దివ్యకల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రధానాలయం నుంచి పల్లకిపై కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. విశ్వక్సేన పూజ, రక్షాబంధనం, మధు పర్కప్రాసన, కన్యాధానం కార్యక్రమాలను వేద పండితులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. -
కోనసీమ తిరుపతిలో వైభవంగా దివ్యకల్యాణం
-
అందని ఆహ్వానం.. డిప్యూటీ సీఎం కేఈ అసంతృప్తి!
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల తీరుపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో టీటీడీ వారి ఆలయ భూకర్షణ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈకి ఆహ్వానం అందలేదు. దేవాదాయశాఖ అధికారులు కూడా ఆయనకు ఈ కార్యక్రమం గురించి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. రాజధాని ప్రాంతంలోని తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నూతన ఆలయ నిర్మాణానికి భూఆకర్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టీటీడీ అధికారులు హాజరయ్యారు. ఏడు ఎకరాల్లో రూ. 150 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని టీటీడీ ఇక్కడ నిర్మించనుంది. అయితే, పెద్ద ఎత్తున జరిగిన ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడం, కనీసం సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కేఈ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సాక్షి, తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 16 గంటలు, స్లాట్ దర్శనానికి 7 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారి హుండీ ద్వారా రూ. 3.37 కోట్ల ఆదాయం వచ్చింది. రేపు పెరటాని మాసంలో మూడవ శనివారం కావడంతో తమిళనాడు నుండి భారీగా భక్తులు తరలిరానున్నారు. శని, ఆదివారం వీఐపీ దర్శనాలు, సిఫారసు లేఖలను రద్దు చేశారు. -
శ్రీవారి అపురూపమైన ఫొటోలను పంపించండి
సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని, పౌరాణిక ప్రాశస్త్యాన్ని తెలిపే అపురూపమైన పాత చిత్రాలు ఉంటే ఈనెల 7వ తేదీలోగా తమకు పంపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ప్రతి ఏటా తిరుమలలోని కల్యాణ వేదిక వద్ద ‘నాడు–నేడు’ పేరిట ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం, తిరుపతిలోని ఆలయాలు, ఇతర టీటీడీ అనుబంధ ఆలయాలకు సంబంధించిన అపురూపమైన పాత ఫొటోలను ‘ప్రజాసంబంధాల అధికారి (పీఆర్ఓ), టీటీడీ పరిపాలన భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి –517520’ చిరునామాకు పంపించాలని టీటీడీ కోరింది. మరిన్ని వివరాలకు 0877–2264217 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొంది. కాగా, ఈనెల 13 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 10 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఫొటోల ప్రదర్శన నిర్వహించనుంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలో నిత్య పూజల సందర్భంగా వినియోగించే పాత్రలు, పూజా ద్రవ్యాలు, ప్రత్యేక పర్వదినాలు, ఇతర ఉత్సవాల దినాల్లో పూజలు అందుకునే ఉత్సవమూర్తుల ఫొటోలతో విడివిడిగా గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. 80 ఏళ్లనాటి శ్రీవారి ఆలయ చరిత్రను కళ్లకు కట్టే అరుదైన ఫొటోలను కూడా ప్రదర్శనలో ఉంచుతారు. 1950వ సంవత్సరానికి ముందు, ఆ తరువాత శ్రీవారి సేవలో పాల్గొన్న రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్వామీజీలు, ఇతర ప్రముఖుల ఫొటోలను కూడా ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయనున్నారు. -
తియ్యటి కబురు
1960లో విడుదలైన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి ఆత్రేయ రచయిత. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్.వరలక్ష్మి, శాంతకుమారి నటించిన ఈ మూడు గంటల సినిమాకు పి.పుల్లయ్య దర్శకుడు. ప్రేక్షకులు దేవుడిలా దండం పెట్టేంత ఇమేజ్ ఎన్టీఆర్‌కు ఇచ్చింది ఈ చిత్రం. అందులో ఒక చోట ‘కబురు’ అనే మాట వస్తుంది. ఖబర్ అనే ఉర్దూ మాట నుంచి ఈ కబురు అనే మాట పుట్టింది. ఈ ‘పొరపాటు’కు ఆత్రేయ నొచ్చుకున్నారు. ‘అయ్యో, పౌరాణిక చిత్రంలో కబురు అనే మాట వాడానే’ అని తన అసమర్థతకు విలపించారు. ఇదే సంగతిని ఓసారి గీత రచయిత, కథకుడు అయిన మల్లాది రామకృష్ణశాస్త్రితో చెప్పుకుని బాధపడ్డారు. ‘వేంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లాడాడు కదా, అంటే ఆ కాలంలో ఉరుదూ ఉన్నట్టే, అప్పుడు కబురు అనే మాట తప్పు ఎలా అవుతుంది?’ అని సాంత్వన వచనాలు పలికారు రామకృష్ణశాస్త్రి. అప్పుడుగానీ ఆత్రేయ మనసు కుదుటపడలేదు. -
అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభం
తిరుపతి: తిరుమలలో ఆదివారం నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ ప్రారంభమైంది. ఈ రోజు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంలోని మూలవర్లతో పాటు అన్ని ఉప ఆలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం(కలశం)లోకి ఆవాహన చేస్తారు. మూలవిరాట్టులోని 64 కళల్లో 63 కళల్ని కంభంలోకి అర్చకులు ఆవాహన చేయనున్నారు. శ్రీవారి శక్తిని కుంభంలోకి ఆవాహన చేసిన అనంతరం బాలాలయం ప్రారంభం అవుతుంది. తిరుమల శ్రీవారిని ఆదివారం సుమారు 28 వేల మంది దర్శించుకునే అవకాశం ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. -
ఈ నెలలో శ్రీవారికి రెండు గరుడ సేవలు
-
తెలంగాణ వచ్చిన సంతోషం ఒక్కరిలోనూ లేదు
తిరుమల: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. స్వామివారి దయతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సంవృద్ధిగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్ధించానని తెలిపారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2019లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో పాలకులు తప్ప, ప్రజలు సంతోషంగా లేరు..తెలంగాణ వచ్చిన సంతోషం ఓ ఒక్కరిలోనూ లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబసభ్యులకు తప్ప ఇతర మంత్రులకు అధికారాలు లేవని ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూతురు కవితతో సహా టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మద్ధతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అభివృద్ధి కాగితాలపై తప్ప వాస్తవంగా లేదని వ్యాఖ్యానించారు. గురువారం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారిని దర్శించుకున్నారు.శ్రీవారి ని దర్శించుకున్న వారిలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు. ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామి, పీఠాధిపతులు సుగునేంద్ర తీర్ధ స్వామిజీ, రఘునేంద్ర తీర్ధ స్వామిజీలు ఉన్నారు. -
శ్రీవారి ఆభరణాలపై భక్తుల్లో అనుమానం
-
అందుకే ప్రభుత్వం దిగి వచ్చింది: ఎమ్మెల్యే రోజా
సాక్షి, తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని నగరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో రోజా మాట్లాడారు. నిత్యం స్వామివారికి సేవ చేసే రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీడీపీపై మండిపడ్డారు. చంద్రబాబు నిరంకుశత్వానికి ఇది నిదర్శనమన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించకపోతే నిరసన తెలియజేశామని.. దీంతో ప్రభుత్వం దిగి వచ్చిందని తెలిపారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి ఆభరణాల వివరాలు ఆన్లైన్లో ఉంచాలని, గతంలో ఆన్లైన్లో ఉంచుతామని చెప్పిన జేఈఓ శ్రీనివాస రాజు ఇప్పటివరకు వాటిని పెట్టలేదని వివరించారు. తిరుమల శ్రీవారి ఆభరణాలు మాయం అయ్యాయని భక్తుల్లో అనుమానాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. వాటిని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విజయనగరంలో గిరిజన గర్భిణీ మహిళ 12 కిలో మీటర్లు నడుచుకుంటూ వెళ్లి బిడ్డను పోగొట్టుకుంది.. కనీస వైద్య సదుపాయం లేకపోవడం వల్లే ఇలా జరిగిందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు అంటే చంద్రబాబుకు పట్టదు.. అందుకే గిరిజన మంత్రిని కూడా నియమించలేదని వెల్లడించారు. -
మాటలకే చంద్రబాబు పరిమితం: యార్లగడ్డ
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తెలుగు బాషను ఓ సబ్జెక్టుగా పెడతామని చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. చంద్రబాబు తెలుగు భాషాభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన మాటపై నిలబడి తెలుగు భాషకు ప్రాణం పోశారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తెలుగు భాష వ్యతిరేకి అని మండిపడ్డారు. సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీవారిని మొక్కుకున్నట్లు యార్లగడ్డ తెలిపారు. -
మహాసంప్రోక్షణా... నిర్బంధమా?
సంప్రోక్షణ సమయంలో భక్తుల రాకను నిరోధిస్తూ తిరుమల ఆలయాన్ని పూర్తిగా మూసేయాల్సిన అవసరం ఏముంది? తాజా వివాదంపై డాక్టర్ సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రజలు ఆసక్తి ప్రదర్శించడమేగాక, దేన్నో కప్పిపుచ్చుకోవడానికే టీటీడీ తాజా చర్యలకు ఉపక్రమించిందని అనుమానిస్తున్నారు. గర్భగుడికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాములవారి మేడ వరకూ 500 రంధ్రాలు వేయడం గురించి జనం మాట్లాడుకుంటున్నారు. రహస్య నిధి అన్వేషణకు శాస్త్రీయ పద్ధతిలో ఏమైనా పరిశోధన జరుగుతోందా? అసలు టీటీడీ పథకం ఏంటి? ఈ ప్రశ్నలకు జవాబులు అవసరం. అన్ని ప్రధాన హిందూ దేవాలయాల్లో మహా సంప్రోక్షణం (వైష్టవాల యాల్లో) లేదా కుంభాభిషేకం (శివాలయాలు, ఇతర గుడుల్లో) పన్నెండేళ్లకోసారి చేయాలనే సంప్రదాయం ఉంది. తిరుమల గుడిలో వైఖానస ఆగమ సంప్ర దాయం పాటిస్తారు కాబట్టి 12 ఏళ్లకు ఇలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని వైఖానస భృగులో ‘మహానిమితే సంప్రాసే మహాసంప్రోక్షణం మాచరితే’ అని సూచించారు. మహానిమితే అంటే– ఆలయంలో దోపిడీ జరిగినపుడు, పద్మపీఠంపై విగ్ర హం ఊగిపోయే స్థితిలో ఉన్నప్పుడు, ఏదైనా కార ణాల వల్ల నైవేద్యం, పూజలు లేదా ఆరాధన ఆగి పోతే మహాసంప్రోక్షణం తప్పనిసరి అని అర్థం. కాని, తిరుమలలో మిరాసీ అర్చకులు నిర్ణయం మేరకు పన్నెండేళ్లకోసారి మహాసంప్రోక్షణం జరిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇది నిర్వహించడం జరుగుతోంది. ఆలయం లోపల, కొన్నిసార్లు చిన్న, పెద్ద మరమ్మతులు జరపడానికి, అలంకారంలో భాగంగా కొన్నాళ్లకు నగల బరువు వల్ల విగ్రహం పద్మపీఠంపై కదిలే పరిస్థితి వచ్చినప్పుడు ఇది నిర్వహిస్తారు. ఏ గుళ్లో అయినా భక్తులు పెద్ద సంఖ్యలో చేరి ఆనందంతో గడిపే సందర్భం మహా సంప్రోక్షణం. గర్భగృహ గోపురంపైనున్న కుంభం నుంచి జాలువారే పవిత్ర సంప్రోక్షణ తీర్థం కోసం వారు పోటీపడతారు. తీర్థం చుక్కలు పడితే తలలు పవిత్రమవుతాయనేది వారి నమ్మకం. ఈసారి ఆగస్టు 9 సాయంత్రం నుంచి 17 ఉదయం 6 గంటల వరకూ శ్రీవారి ఆలయం మూసివేయాలని తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నిర్ణయిం చింది. ఇలాంటి సంప్రోక్షణ గురించి టీటీడీ బోర్డుకు తెలియదనే అభిప్రాయంతో నేను తిరుమలలో 1800 సంవత్సరం నుంచి ఈ విషయంపై నేను అధ్య యనం చేశాను. అప్పటి నుంచి సంప్రోక్షణ జరిగిన ఏ సందర్భంలోనూ ఇప్పటి బోర్డు నిర్ణయించినట్టు శ్రీవారి దర్శనాన్ని భక్తులకు నిరాకరించలేదు. ఇలా చేయడం మహా నిర్బంధమే. 1800 నుంచి మహా సంప్రోక్షణాలు 1800లో మిరాసీ అర్చకుడు శ్రీనివాస దీక్షితులు శ్రీవారి రెండు హస్తాలకు బంగారు పూత కోసం ఈ కార్యక్రమం జరిపించిన సమయంలో ప్రజలను మూలవిరాట్టు దర్శనానికి అనుమతించారు. 1908 సెప్టెంబర్ 30న ఆనంద నిలయంలో కొత్త బంగారు కలశం అమర్చినప్పుడు భక్తులకు దర్శనం కొన సాగించారు. ఇంకా 1934, 1946లో శ్రీవారికి కొత్త నగలతో ఇతర అలంకారాలు జరిగిన సందర్బంగా కూడా మూలవిరాట్టు దర్శనంపై ఆంక్షలేవీ లేకుండా మామూలుగానే భక్తులను అనుమతించారు. 1958 ఆగస్టులో పెద్ద స్థాయిలో జరిగిన బంగారు తాపడం పని సందర్బంగా మూల విరాట్టు దర్శనాన్ని మధ్యా హ్నం 12 నుంచి 3 గంటల మధ్యే కొనసాగించారు. 1970లో కూడా తిరుమల గుడిలో భారీ అదనపు ఏర్పాట్లు చేసినప్పుడు కూడా శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించారుగాని కొన్ని గంటలకు కుదించారు. 1982లో బంగారు తాపడంతో కొత్త ధ్వజస్తంభం నిలబెట్టినప్పుడు కూడా కొన్ని నిర్ణీత వేళల్లో మూలవిరాట్టును దర్శించుకోవడానికి అనుమ తించారు. 1994, 2006లో చేపట్టిన సంప్రోక్షణ సందర్భంగా ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు కుంభం నుంచి పవిత్ర తీర్థాన్ని భక్తులపై స్వయంగా చల్లారు. ఈ రెండుసార్లూ సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనానికి ఆటంకం కలగలేదు. 2006లో సర్వ దర్శనం ఆపకుండా దాన్ని కొన్ని గంటలకే పరిమితం చేశారు. ఈ వాస్తవాలు గమనిస్తే 1800 నుంచి 2006 వరకూ సంప్రోక్షణ జరిగిన సందర్భాల్లో మూల విరాట్టు దర్శనం ఆగలేదు గాని నిర్ణీత సమయాలకే పరిమితం చేశారనే విషయం స్పష్టమౌతోంది. దర్శనంతో పాటు హోమాలూ చూశారు! సంప్రోక్షణకు సంబంధించిన అన్ని పనులూ ఆనంద నిలయ ప్రాకారంలోని పాత కల్యాణ మండపం లోనే(ప్రస్తుత పరకామణి) గతంలో నిర్వహించారు. ప్రదక్షిణ చేస్తూ దేవుడి దర్శనంతోపాటు భక్తులకు యాగశాలలో జరిగే హోమాలు చూసే అవకాశం కూడా దక్కింది. సంప్రోక్షణ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 70 మంది రుత్విక్కులను ఎంపిక చేసి వారితో హోమాలు జరిపిస్తారు. వేద మంత్రా లతో చేసే దివ్య హోమాలు చూడటానికి భక్తులు కిట కిటలాడతారు. ఇంకా వేదాలు, మహాభారతం, భాగ వతం పారాయణం కూడా వారిని ఆకట్టుకునేలా సాగుతుంది. అయితే, ఈ ఏడాది ఇవన్నీ జరిగే సమ యంలో ఆలయంలోకి భక్తులను టీటీడీ అనుమతిం చడం లేదు. ఈ కార్యక్రమాలు చూడడానికి, పురా ణాల పఠనం వినడానికి భక్తులను విమాన ప్రదిక్షణ సమయంలో యాగశాల మీదుగా నడవడానికి అవ కాశం లేకుండా చేశారు. ఏకాంతంలో తప్ప బహిరం గంగా నిర్వహించే అన్ని ఇలాంటి పవిత్ర కార్యక్ర మాల్లో భక్తులు పాల్గొనడాన్ని మిరాసీ అర్చకులు ప్రోత్సహించేవారు. ప్రస్తుత ప్రధాన అర్చకుడు పూర్వపు ప్రధాన మిరాసీ అర్చకుల్లాంటి వ్యక్తి కాదు. టీటీడీ బోర్డు అంటే ఒక రకంగా తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను నియమించింది. ఇతర అర్చ కులు టీటీడీ ఉద్యోగం కారణంగా కాంట్రాక్టుపై ఉన్న వారు. ఈ కారణంగా వారు సంప్రోక్షణ వంటి పవిత్ర కార్యక్రమాల్లో టీటీడీ అధికారుల జోక్యాన్ని అడ్డు కోలేరు. ఆలయ నిర్వహణ, అర్చనపై పూర్తి పట్టు, నియంత్రణ సంపాదించడానికి ఈ అధికారులు ఎప్పుడూ ఉవ్విళ్లూరుతుంటారనేది వాస్తవం. టీటీడీ నిర్వహణ సక్రమ మార్గంలో నడిచేలా మిరాసీ అర్చ కులు ప్రయత్నిస్తున్నారు. ఫలితంగా వారు రాజకీయ కారణాలతో నియమితులైన టీటీడీ పాలకవర్గం లక్ష్యాలకు అవరోధంగా మారారు. భక్తులకు దర్శనభాగ్యం లేకుండా చేస్తారా? సంప్రోక్షణ సమయంలో భక్తుల రాకను నిరోధిస్తూ ఆలయాన్ని పూర్తిగా మూసేయాల్సిన అవసరం ఏముంది. భక్తుల రద్దీని తట్టుకోవడం కష్టమని చెబు తున్న కారణం సహేతుకంగా లేదు. సెప్టెంబర్, అక్టో బర్ మాసాల్లో వచ్చే పురత్తాసి శనివారాల్లో ఎప్పుడూ లేనంత సంఖ్యలో భక్తులు వస్తారు. చాలా మంది ఈ సమయంలో మందిరం బయటి నుంచే వరాహ స్వామి, బేడీ ఆంజనేయ స్వామి దర్శనంతోపాటు గోపుర దర్శనం చేసుకుంటారు. ఆనంద నిలయాన్ని కూడా చూస్తారు. తన దర్శనంపై నిర్ణయాధికారం వేంకటేశ్వరస్వామికి మాత్రమే ఉంటుందని అత్యధిక ప్రజానీకం నమ్ముతారు. ఒక వేళ ఎవరికైనా దర్శన భాగ్యం కలగకపోతే ఇది తమ ప్రాప్తమని భావిస్తారు. తాజా వివాదంపై డాక్టర్ సుబ్రమణ్యస్వామి సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రజలు ఆసక్తి ప్రదర్శించడమేగాక దేన్నో కప్పిపుచ్చుకోవడా నికే టీటీడీ తాజా చర్యలకు ఉపక్రమించిందని అను మానిస్తున్నారు. గర్భగుడికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాములవారి మేడ వరకూ 500 రంధ్రాలు వేయడం గురించి జనం మాట్లాడుకుంటు న్నారు. రహస్య నిధి అన్వేషణకు శాస్త్రీయ పద్ధతిలో ఏమైనా పరిశోధన జరుగుతోందా? ఇందులో ఏమైనా నిజం ఉందా? ఈ ప్రశ్నలకు జవాబులు అవసరం. తిరుమలలోని మూడు ప్రదేశాల్లో రహస్య నిధులున్నాయనే నమ్మకం విస్తృతంగా వ్యాపించింది. ఈ మూడింటిలో మొదటిది వేయి కాళ్ల మండపం. గతంలో మాస్టర్ ప్లాన్ పేరిట దాన్ని పద్ధతి లేకుండా తొలగించారు. రెండోది వకుళ మాత పోటు. ఇక్కడే శ్రీవారికి అన్న ప్రసాదాలు, నైవేద్యం తయారు చేస్తారు. ఇటీవల ఇక్కడ కూడా తవ్వకాలు జరిపారు. నేలను, గోడ పలకలను మార్చేశారు. మూడోది గర్భ గృహానికి దారితీసే బంగారు వాకిలి నుంచి రాము లవారి మేడ వరకూ ఉన్న ప్రదేశం. దీనికి, ఆగస్టు 9 నుంచి 16 వరకూ భక్తులకు దర్శనం నిలిపివేయడా నికి ఏమైనా సంబంధం ఉందా? ఈ సందర్భంగా అనేక మంది మందిరం ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసినట్టు కూడా చెబు తున్నారు. అంతేగాక సంప్రోక్షణ సమయంలో సీసీ టీవీ కెమేరాలు పనిచేయవని కూడా కొందరంటు న్నారు. ఈ అంశాలపై టీటీడీ వివరణ ఇస్తుందా? గతంలో కొత్త ఏర్పాట్లు, అలంకారాల కోసం మరమ్మ తులు జరిపిన సందర్భంగా చేసిన సంప్రోక్షణల సమ యంలో భక్తులను మూలవిరాట్టు దర్శనానికి అను మతించినప్పుడు ఈ ఏడాది జరిపే ఈ కార్య క్రమంలో ప్రజలు రాకుండా గుడిని పూర్తిగా ఎందుకు మూసేయాల్సి వస్తోంది? అంతటి గొప్ప ఆలయ నవీకరణ, మరమ్మతులు ఏం జరుగుతాయి? గుడిలో పాతవాటి స్థానంలో కొత్తవి ఏమేమి ఏర్పాటు చేస్తారు? స్వయంభూ సాలగ్రామ విగ్రహాన్నే మారు స్తున్నారా? సంప్రోక్షణ జరిగే రోజుల్లో అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లే రహదారిని ఎందుకు మూసేస్తు న్నారు? ఈ కాలంలో ఎటువంటి తనిఖీలు లేకుండా టీటీడీ వాహనాలు కిందికి, పైకి పోవడానికి ఎలా అనుమతిస్తారు? అసలు టీటీడీ పథకం ఏంటి? టీటీడీ ధర్మాచార్యులు నిలదీయాలి! వీటినే కాకుండా, మరిన్ని ముఖ్య ప్రశ్నలతో మన ధర్మాచార్యులు టీటీడీని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. పాలకమండలి నుంచి జవాబులు రాబట్టే స్థాయి, అర్హత వారికున్నాయి. అలాగే హిందూ సమాజం సంక్షేమం కాపాడాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. అందుకే వారు ప్రజల సమ క్షంలో ఈ ప్రశ్నలు లేవనెత్తాలి. హిందూ సమాజం కూడా స్పష్టమైన బాధ్యతతో నడుంబిగించాలి. మహాసంప్రోక్షణ సమయంలో లోపలికి అనుమతిం చకపోవడంపై నిరసన తెలుపుతూ టీటీడీ ఈఓకు లేఖలు రాసే అవకాశం ఉపయోగించుకోవాలి. తాజాగా ఏపీ సీఎం బాబు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోక తప్పలేదు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల నిరసనతో దిగిరాక తప్పలేదు. టీటీడీ బోర్డు ఇంతకు ముందు తీసుకున్న నిర్ణయం గురించి ఆయనకు తెలి యదనుకోలేం. గత మహాసంప్రోక్షణాల కాలాల్లో మాదిరిగానే భక్తులను శ్రీవారి దర్శనానికి పరిమిత సమయాల్లో అనుమతించాలని సోషల్ మీడియా కారణంగా ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. వ్యాసకర్త ఎస్వీ బద్రి తమిళనాడు ఆలయ పరిరక్షణ సంఘం వ్యవస్థాపక సభ్యులు contact@globalhinduheritagefoundation.org -
శ్రీవారి దర్శనం రద్దుపై టీటీడీ పునరాలోచన
సాక్షి, తిరుపతి: శ్రీవారి దర్శనం రద్దుపై తిరుమల తిరుపతి దేవస్థానం పునరాలోచనలో పడింది. మహా సంప్రోక్షణ సమయంలో పరిమితంగా భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించే విషయంపై చర్చకు సిద్ధమైంది. భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుని ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈనెల 24న మరోసారి పాలకమండలి సమావేశం నిర్వహించి శ్రీవారి దర్శనం రద్దు విషయమై స్పష్టత ఇవ్వనున్నట్లు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ వెళ్లడించారు. తిరుమల ఆలయంలో ఆగస్టు 11 నుంచి 15 వరకు మహా సంప్రోక్షణ సందర్భంగా భక్తులకు శ్రీవారి దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈనెల 14న అన్నమయ్యభవన్‌లో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆలయంలో సీసీ కెమెరాలను సైతం పనిచేయకుండా ఆపేయాలనే నిర్ణయంపైనా చర్చ జరిగింది. అదే విధంగా మహా సంప్రోక్షణ సమయంలో కేవలం టీటీడీ బోర్డు సభ్యులు, వీఐపీలు, వీవీఐపీలకు ప్రత్యేక దర్శనాలు కల్పించాలని భావించినట్లు ప్రచారం జరిగింది. టీటీడీ పాలకమండలి తీసుకున్న వివాదాస్పద నిర్ణయంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రసార మాధ్యమాల్లో దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో టీటీడీ పునరాలోచనలో పడింది. టీటీడీలోని ముఖ్య అధికారి ఇచ్చిన సలహా మేరకు మొదట దర్శనం రద్దు నిర్ణయం తీసుకున్నట్లు చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. సాధ్యమైనంత మందికి శ్రీవారి దర్శనం మహాసంప్రోక్షణ సమయంలో సాధ్యమైనంత మందికి శ్రీవారి భాగ్యాన్ని కల్పిస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పేర్కొన్నారు. మంగళవారం అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసంప్రోక్షణ జరిగే సమయంలో సెలవు రోజులు కావడంతో ఎక్కువ మంది భక్తులు తరలివస్తే భక్తులకు ఇబ్బంది కలుగుతుందని పాలకమండలి దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించిందన్నారు. భక్తుల అభిప్రాయాలను ఈనెల 24న పాలకమండలిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. కుదింపు సమయాల్లోనే శ్రీవారి దర్శనం అష్టబంధన బాలలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 15వతేదీ వరకు జరగనుంది. ఇందులో ఆగస్టు 11వతేదీ శనివారం రోజు మొత్తంలో 9గంట ల సమయాన్ని దర్శనానికి కేటాయించామన్నారు. 12వతేదీ ఆదివారం 4 గంటల సమయం, 13వతేదీ సోమవారం 5 గంటలు సమయం, 14వతేదీ మంగళవారం 5 గంటల సమయం, 15వతేదీ బుధవారం 6 గంటల సమయం మాత్రమే భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. ఈరోజులలో సుమారు 30 గంటల సమయంలో మాత్రమే శ్రీవారి దర్శనాలు చేయించగలుగుతామన్నారు. రోజుకు సుమారు15వేల మందికి మాత్రమే అవకాశం ఉంటుందని ఈవో పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం మూసివేతపై బాబు ఆగ్రహించినట్లు లీకులు సాక్షి, అమరావతి: తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని ఆరు రోజులపాటు మూసివేయాలనే నిర్ణయంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవడంతో దానిపై తాను ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మంగళవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూల మీడియాలో లీకులిప్పించారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
సాక్షి, తిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగిసినా కొండపై భక్తుల రద్దీ తగ్గలేదు. దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లన్నీ నిండి వెలుపల రెండు కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి దర్శనానికి 35 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 13 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరగడంతో స్వామి దర్శనం చేసుకోకుండానే పలువురు భక్తులు వెనుతిరుగుతున్నారు. మరోవైపు వసతి సదుపాయాలు దొరక్క భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
శ్రీవారి ఆభరణాల మాయం నిజమే: చెన్నారెడ్డి
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్ధానం (టీటీడీ) పై జరుగుతున్న పరిణామాలపై తాజాగా పురావస్తుశాఖ మాజీ డైరెక్టర్ పెద్దారపు చెన్నారెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీకి శ్రీ కృష్ణ దేవరాయులు ఇచ్చిన అనేక వజ్రాలు, ఆభరణాలు మాయమయ్యాయని వెల్లడించారు. వెంకన్న స్వామిని కృష్ణ దేవరాయులు ఏడు సార్లు దర్శించుకున్నారన్నారు. ఆసమయంలో ఆయన ఇచ్చిన అభరణాలను చాలావరకు కరిగించారని, పలు వజ్రాలు విదేశాలకు తరలిపోయాయని పేర్కొన్నారు. కృష్ణ దేవరాయలు ఇచ్చిన ఆభరణాలు, వజ్రాలు పదిశాతం కూడా లేవని తెలిపారు. తాను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు భక్తులు ఇచ్చిన అభరణాలపై 2012 లో ఓ కమిటి వేశామని, సదరు కమిటీ విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని స్పష్టం చేశారు. మరోవైపు టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ఈవో మాట్లాడుతూ...టీటీడీ నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారమే పనులు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చట్టప్రకారం ముందుకు వెళతామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఈవో తెలిపారు. స్వామివారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని, వాటికి సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రికి అందచేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆమరణ దీక్ష యోచనలో రమణ దీక్షితులు!
సాక్షి, న్యూఢిల్లీ : టీటీడీలో పదవీ విరమణ పంచాయితీ ఢిల్లీకి చేరింది. పాలకమండలి పదవీ విరమణ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న రమణ దీక్షితులు తన దూకుడు పెంచుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీ వైఖరికి నిరసనగా ఆయన ఆమరణ దీక్షకు దిగే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆభరణాల మాయం, కైంకర్యాలలో లోపంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటూ రమణ దీక్షితులు మంగళవారం సాయంత్రం బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామిని కలిసే అవకాశం ఉంది. కాగా 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉద్యోగ విరమణ వర్తింపు నిర్ణయం వంశపారంపర్య అర్చకుల్లో తీవ్ర అలజడి రేపుతోంది. మిరాశీ, నాన్ మిరాశీ కుటుంబాలుగా చెప్పుకునే అర్చకులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. టీటీడీ పరిణామాలపై సీఎం సమీక్ష మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరుతుఉన్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు పాలకమండలి చైర్మన్‌తో పాటు, టీటీడీ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. -
రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్ధానం అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం టీటీడీ పాలక మండలి, అధికారులు, ఏపీ ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా రమణ దీక్షితులుకు అధికారులు నోటీసు జారీ చేశారు. అయితే టీటీడీ అధికారులు నోటీసులు ఇచ్చేందుకు రమణ దీక్షితులు ఇంటికి వెళ్లగా.. ఆ సమయంలో ఆయన లేరు. దీంతో నోటీసులను అధికారులు ఇంటికి అంటించారు. కాగా, మంగళవారం చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రమణ దీక్షితులు.. టీటీడీ అధికారులు, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనాదిగా వస్తున్న అర్చక వారసత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయడం ఆగమ శాస్త్ర విరుద్ధమంటూనే ఎన్నో అవమానాలను భరించాల్సి వస్తోందని ఆవేదన వెలిబుచ్చారు. టీటీడీలోని అధికారులు కొంతమంది అధికార బలంతో ఆలయ నిబంధనలను విస్మరిస్తున్నారని, సినీ, రాజకీయ ప్రముఖులకు భజన చేస్తూ ఆలయ సంప్రదాయాలను, కైంకర్యాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. రమణ దీక్షితులు చేసిన విమర్శలు, ఆరోపణలు టీటీడీ అధికారులు, వేదపండిత, ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపాయి. ఇది జరిగిన అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చకుల వయోపరిమితిపై ధర్మకర్తల మండలి వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. 65 ఏళ్లు దాటిన అర్చకులను విధుల నుంచి తొలగించి ఉద్యోగ విరమణ వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో రమణ దీక్షితులు సహా నలుగురు ప్రధాన అర్చకులు తమ పదవులను కోల్పోయారు. రమణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీటీడీ నూతనంగా నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. -
రమణ దీక్షితులకు నోటీసులు జారీ
-
టీటీడీలో సరికొత్త శకం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నూతన ప్రధాన అర్చకులు నియమితులయ్యారు. నలుగురు అర్చకులను నియమిస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. అనూహ్య పరిణామాల మధ్య గొల్లపల్లి వంశం నుంచి రమణ దీక్షితులకు బదులుగా వేణుగోపాల దీక్షితులు, తిరుపతమ్మ కుటుంబం నుంచి గోవిందరాజ దీక్షితులు, పెద్దింటి వంశం నుంచి శ్రీనివాస దీక్షితులు, పైడిపల్లి కుటుంబం నుంచి కృష్ణ శేషాచల దీక్షితులను నియమించారు. ఎన్నో ఏళ్ల తర్వాత టీటీడీ సరికొత్త శకానికి శ్రీకారం చుట్టింది. శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుల పాత్ర ప్రత్యేకమైంది. స్వామివారి కైంకర్యాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు ప్రధాన అర్చకులు నిర్వహిస్తారు. రమణదీక్షతుల వ్యవహారంతో శరవేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో టీటీడీ నలుగురు ప్రధాన అర్చకులను నియమించింది. వేణుగోపాల దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, కృష్ణ శేషాచల దీక్షితులు తిరుమల శ్రీవారి ఆలయంలో, శ్రీనివాస దీక్షితులు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తారు. రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం 40 తరాలుగా మిరాశిగా స్వామి వారికి సేవలు చేస్తున్నాను. 1997 వరకు మిరాసిగా వ్యవహరిస్తూ వస్తున్నాం. 65 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ప్రకటన శుభపరిణామం. తర్వాతి తరాల వారికి కూడా అవకాశం కలిగించే భాగ్యం కలుగుతుంది. 65 సంవత్సరాలు పైబడిన వారికి హోదా మాత్రమే తగ్గుతుందే తప్ప మిగతా మర్యాదలతో పాటు స్వామి వారికి సేవలు చేసే భాగ్యం అలాగే ఉంటుంది. మిరాశిగా ఉన్నప్పుడు 8 ఏళ్లకు ఓసారి మారుతూ వచ్చేది. స్వామి వారి అభారణలపై విమర్శలు సరికాదు. టీటీడీ దగ్గర అని రికార్డ్స్ ఉన్నాయి. మహంతుల దగ్గర నుంచి తీసుకున్న అన్ని లెక్కలు ఉన్నాయి. వేణుగోపాల్ దీక్షితులు చాలా సంతోషంగా ఉంది ప్రధాన అర్చకుల హోదాలో మా నాన్నకు రిటైర్మెంట్ ఇచ్చి నాకు పోస్టింగ్ ఇచ్చారని పైడిపల్లి వంశానికి చెందిన శేషాచలం దీక్షితులు తెలిపారు. స్వామి వారికి సేవ చేసే భాగ్యం నాకు దక్కడం చాలా సంతోషంగా ఉంది. నాన్నగారి పర్యవేక్షణలోనే స్వామివారికి కైంకర్యాలు నిర్వహిస్తాను. మరో వైపు తిరుపతమ్మ వంశానికి చెందిన గోవిందరాజ దీక్షితులు మాట్లాడుతూ.. దేవస్థానం చైర్మన్, ఈఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అన్నీ సవ్యంగా ఉన్నాయి 1958 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు స్వామి వారికి సేవలు చేస్తూ వస్తున్నాను. ఆగమశాస్త్రం ప్రకారమే స్వామి వారికి కైంకర్యాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని సేవలు పద్దతి ప్రకారమే నిర్వహిస్తున్నారు. స్వామివారికి జరిపే పూజ కార్యక్రమాలలో ఎలాంటి దోషం లేదు. నైవేద్యం కూడా స్వామి వారికి సవ్యంగా జరుగుతుంది. షడ్కరా ఆరాధనలు స్వామి వారికి జరుగుతూనే ఉన్నాయి. పోటును మరమ్మత్తులు చేస్తున్నారే తప్ప లోపల కట్టడాలు ఏమీ కూల్చలేదు. సుధార వరధారాజన్, ఆగమశాస్త్ర సలహా దారులు -
నా జీవితంలో ఆనందమైన రోజు
-
శ్రీవారిని దర్శించుకున్న మహేశ్‌బాబు
తిరుమల: సినీనటుడు మహేశ్ బాబు శనివారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఇటీవల మహేశ్ బాబు నటించిన ‘ భరత్ అనే నేను’ చిత్రం విజయవంతం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు మహేశ్ బాబుతో పాటు, దర్శకుడు కొరటాల శివ, మహేశ్‌బాబు బావ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా వచ్చారు. సినీ హీరో రావడంతో ఆయనను చూడటానికి భక్తులు, అభిమానులు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా మహేశ్ బాబు మాట్లాడుతూ..నా జీవితంలో ఇది చాలా ఆనందకరమైన రోజు అని చెప్పారు. స్వామి వారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ..భరత్ అనే నేను చిత్రం భారీ విజయం సాధించిందని, అందుకనే శ్రీవారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చామని తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో నందమూరి కల్యాణ్ రామ్, తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, ఇస్రో చైర్మన్ శివన్ స్వామి ఈరోజు ఉదయం స్వామిని దర్శించుకున్నారు. రేపు ఉదయం 4:04 గంటలకు పీఎస్ఎల్వీసీ-41 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంతన ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్టు శివన్ స్వామి తెలిపారు. అదే విధంగా కల్యాణ్ రామ్ కుటుంబంతో స్వామివారిని దర్శించుకుని మెక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను ఆలయ అధికారులు అందించారు. కల్యాణ్‌రామ్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చిత్రం విజయం సాధించి, మంచి వసూళ్ళు రాబడుతున్న సందర్భంగా స్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు. -
శ్రీవారిని దర్శించుకున్న సీఎం, కుటుంబసభ్యులు
తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం వైకుంఠం నుంచి ఆలయంలోకి ప్రవేశించారు. మహాద్వారం వద్ద ఇస్థికాపాల్‌తో టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హోదాలో మహాద్వార ప్రవేశం ఉన్నప్పటికీ.. భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణీ, మనవడు దేవాన్ష్, బావమరిది బాలకృష్ణ కుటుంబంతో కలిసి వైకుఠం నుంచి ఆలయ ప్రవేశం చేశారు. బుధవారం మనవడు దేవాన్ష్ పుట్టినరోజు కావడం వల్లనే స్వామి ఆశ్సీస్సుల కోసం సీఎం చంద్రబాబు, కుటుంబసభ్యులు వచ్చినట్లు సమాచారం. -
శ్రీవారి భక్తురాలు.. శ్రీదేవి
సాక్షి, తిరుమల: దివంగత సినీనటి శ్రీదేవికి తిరుమల శ్రీవారంటే ఎనలేని భక్తి. తరచూ స్వామిని దర్శించుకునే సంప్రదాయం ఉంది. తిరుపతిలోని బంధువుల ఇళ్లకు వచ్చిన ప్రతిసారీ తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునేవారు. చిత్ర సీమలో అగ్రనటిగా స్థిరపడిన తరువాత కూడా ఆమె శ్రీవారిని మరువలేదు. గులాబి చిత్రం ఫేమ్ మహేశ్వరి కుటుంబ రీత్యా శ్రీదేవికి చెల్లెలు అవుతారు. మహేశ్వరి వివాహం సెప్టెంబర్ 17, 2008లో తిరుమలలో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి శ్రీదేవి, భర్త బోనికపూర్, ఇద్దరు కుమార్తెలతో కలసి హాజరయ్యారు. సెప్టెంబర్ 10, 2011లో భర్తతో కలసి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకున్నారు. సెప్టెంబర్ 6, 2012, టీటీడీ ట్రస్టుబోర్డు మాజీ చైర్మన్ టీ సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీరెడ్డి, ఇతర స్నేహితులతో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. మే 1వ తేదీ 2015లో అభిషేక సేవ, జూన్ 25, 2017లో భర్త బోనీ కపూర్, ఇద్దరు కుమార్తెలతోపాటు మరిది అనిల్‌కపూర్, ఇతర కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. -
పుణేలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
పుణే సిటీ : పుణే ఘోర్పడి ప్రాంతంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి మందిరంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిర్వహించిన కల్యాణోత్సవంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసి పోయింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీవారి కల్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామ స్మరణతో మారుమ్రోగి పోయింది. కల్యాణోత్సవంలో శ్రీవారికి పట్టువస్త్రాలను అందించారు. దాదాపు నాలుగు గంటల పాటు ఉత్సవం నిర్వహించారు. శ్రీవారికి శ్రీదేవి, భూదేవిల అప్పగింతల కార్యక్రమం భక్తులను కనువిందు చేసింది. ఈ వేడుకలు చూసేందుకు పట్టణంలోని తెలుగువారితోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు శ్రీవారి ప్రసాదం లడ్డూను భక్తులకు అందజేశారు. కాగా, దాదాపు 30 వేల మందికి మహాప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమాలలో ఆదివారం పుణే పార్లమెంట్ సభ్యులు అనిల్ శిరోలె పాల్గొనగా, సోమవారం స్థానిక కార్పొరేటర్లు మంగళా మంత్రి ఉమేష్ గైక్వాడ్, మాజీ డిప్యూటీ మేయర్ ప్రకాశ్ మంత్రి పాల్గొన్నారు. కాగా, సప్తగిరి శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్ అధ్యక్షులు దొంగరి సుబ్బారాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్ల మాధవ రావు, రాజేంద్ర రావు, కల్లూరి భాస్కర్‌రెడ్డి, కె.బలరాం, కామనబోయిన చెంచయ్య, ఉపాధ్యక్షులు దుగ్గిరెడ్డి మాధవరెడ్డి, వి.ఎస్.చలసాని, పాలగిరి చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ అధ్యక్షులు సావ నారాయణ, శ్రీనివాస్ భండారి, బొర్రాజు తిరుపతయ్య, పాలగిరి భాస్కర్‌రెడ్డి, సురేశ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
లడ్డూ కావాలా నాయనా!
సాక్షి, తిరుమల : శ్రీవారి భక్తులకు కోరినన్ని అదనపు లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఉచిత లడ్డూ, సబ్సిడీ లడ్డూలు కొనసాగిస్తూనే పెంచిన లడ్డూ ప్రసాదాల రాబడితో లోటు భారాన్ని పూడ్చు కోవాలని ధార్మిక సంస్థ కసరత్తు చేస్తోంది. ఇటీవల టీటీడీ రూ.25 ధరతో విక్రయించే చిన్నలడ్డూ (175 గ్రాములు) రూ.50, కల్యాణోత్సవం లడ్డూ రూ.100 నుండి రూ.200, వడ ప్రసాదం రూ.25 నుండి రూ.100కి పెంచిన విషయం తెలిసిందే. దీంతో బ్లాక్‌లో లడ్డూల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. అయినా, డిమాండ్‌కు తగ్గట్టుగా సరఫరా జరగడంలేదు. రూ.50 ధర ఉన్న లడ్డూకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దీంతో అదనపు లడ్డూల 30 వేల సంఖ్యను 50వేలకు పెంచాలని టీటీడీ యోచిస్తోంది. తగ్గనున్న ఆర్థిక భారం 2017–2018 వార్షిక లెక్కల ప్రకారం.. లడ్డూ తయారీ ఖర్చు రూ.37కి చేరింది. టీటీడీ ఉచిత లడ్డూ, రూ.10 చొప్పున రెండు సబ్సిడీ లడ్డూలు, రూ.25 ధరతో రెండు లడ్డూల సరఫరా కొనసాగిస్తోంది. దీని వల్ల ఏటా టీటీడీపై రూ.250 నుండి రూ.300 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. పెంచిన ధరలతో రోజూ అదనంగా 30వేల లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ సంఖ్యను 50వేలకు పెంచడంతోపాటు వడ ప్రసాదం, కల్యాణోత్సవం లడ్డూల విక్రయాలు కూడా పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. -
కనిమొళి వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలి
సాక్షి, చెన్నై: రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ.. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. డీఎంకే ఎంపీ కనిమొళి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వెంకన్నపై ఎంపీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధమైన వ్యాఖ్యలు చేసి వివాదం సృష్టించడం ఇది ఒక కొత్త రాజకీయ ఎత్తుగడలో భాగమని కేతిరెడ్డి అన్నారు. ప్రజలను ఆశాంతికి గురిచేయటం తమిళ రాజకీయ నాయకుల లక్ష్యమని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిపై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు. హిందువుల మనోభాబాలను కనిమొళి దెబ్బతీశారని కేతిరెడ్డి మండిపడ్డారు. సంచలనం వ్యాఖ్యలు చేసి వార్తలో ఉండాలనుకోవడం సిగ్గు చేటు.. మీరు ఇదే వ్యాఖ్యలను ఇతర మతస్తులపై చేసే దమ్ము ఉందా అని కేతిరెడ్డి ప్రశ్నించారు. మీరు చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం త్వరలో చెల్లించటం ఖాయమని ఆయన అన్నారు. ఆమె చేసిన నాస్తిత్వం ప్రసంగంలో వెంకన్నను ఉదాహరణగా చేప్పిన విషయం తెలిసిందే. హిందూ సమాజంను అవమాపరిచిన రాజ్యసభ సభ్యురాలు కనిమొళిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి: తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ కనిమొళి హిందూ మతాన్ని కించపరిచేలా మాట్లాడారని, ఆమెపై తక్షణమే కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. కనిమొళిపై గురువారం ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతికి ఫిర్యాదు చేశారు. అనంతరం భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రూ.కోట్లు ఇచ్చే వారికే బాలాజీ దేవుడంటూ కనిమొళి వ్యాఖ్యానించడం దారుణమన్నారు. పేదవాడిని కాపాడలేని దేవుడు ఎందుకంటూ.. భక్తుల మనోభావాలను ఆమె దెబ్బతీశారని మండిపడ్డారు. -
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్ధీ
సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. 35 కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాలి నడకన వచ్చిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. నేడు శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3 కోట్ల 2లక్షలు. -
శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి ఆస్థానం
సాక్షి, తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా వ్యవహరిస్తారు. సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతి ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది. స్నపనమూర్తిగా పిలువబడే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా (ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే) సూర్యోదయాతూర్వం, తెల్లవారుజామున 4.30 గంటల నుండి 5.30 గంటలలోపు ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఉరేగించారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా నిర్వహించారు. -
క్యూలైన్లోని భక్తులు రేపు ఉదయం 11కు రావాలి!
సాక్షి, తిరుమల: దసరా పండుగ, వరుస సెలవులు కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం ఏడుకొండల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తిరుమలతో కిటకిటలాడుతోంది. గంటగంటకు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. శ్రీవారి దర్శనం కోసం 60 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. వెలుపల నాలుగుకిలోమీటర్ల మేర భక్తులు క్యూలైన్లో నిలబడి ఉండటం గమనార్హం. దీంతో వెంకన్న దర్శనానికి భక్తులకు 30 గంటల సమయం పడుతోంది. స్వామివారి దర్శన కోసం మడవీధుల్లోనూ భక్తులు వేచి ఉన్నారు. అత్యంత భారీస్థాయిలో భక్తుల రద్దీ ఉండటంతో టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. భారీ క్యూలైన్లలో నిలుచున్న భక్తులు సోమవారం ఉదయం 11 గంటలకు దర్శనానికి రావాలని విజ్ఞప్తి చేసింది. -
గోవిందా శ్రిత గోకులనందా
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామి చిన్న శేష వాహనంపై శ్రీకృష్ణావతారంలో భక్తులను కటాక్షించారు. పట్టు పీతాంబరాలు, మరకత మాణిక్యాదుల విశేషాభరణాలు, పరిమళాలు వెదజల్లే పుష్పమాలలు ధరించి ఐదు శిరస్సుల శేషుని నీడన వేణువు చేతబట్టి మురళీకృష్ణుడి రూపంలో తిరువీధుల్లో విహరించారు. ఊరేగింపు ముందు గజరాజులు, అశ్వాలు, నందులు కదులుతుండగా.. జీయర్ స్వాములు దివ్య ప్రబంధ గానం ఆలపిస్తుండగా.. భజన, కళాబృందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచి 11వరకు వాహన సేవ జరిగింది. అశేష భక్తుల గోవిందనామస్మరణతో తిరువీధులు మార్మోగాయి. రాత్రి హంస వాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు కొలువుదీరి భక్తులను అనుగ్రహించారు. –సాక్షి, తిరుమల నేటి వాహన సేవలు ఉదయం : సింహ వాహనం బ్రహ్మోత్సవాలలో మూడోరోజు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సింహ వాహనంపై శ్రీవేంకటేశ్వరుడు భక్తులకు దర్శనమివ్వనున్నారు. జంతువులకు రాజైన సింహం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. యోగశాస్త్రంలో సింహ వాహన శక్తికి, గమన శక్తికి ఆదర్శంగా భావిస్తారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి ఈ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని ఆర్యోక్తి. రాత్రి : ముత్యపు పందిరి వాహనం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. సుకుమారసేవగా ముత్యపు పందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈవాహనం ద్వారా స్వామి వారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోరంజకంగా దర్శనమిస్తారు.రాత్రి 9గంటలకు తిరువీధుల్లో ఈ వాహన సేవ ప్రారంభమై 11వరకు సాగుతుంది. భక్త వాణి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ కల్పిస్తున్న వసతులు వారి మాటల్లో.. తిరుపతి (అలిపిరి)/అర్బన్ కనులారా దర్శించుకున్నాం తిరుమల శ్రీవారిని కనులారా దర్శించుకున్నాం. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు అద్భుతంగా ఉన్నాయి. హరినామ సంకీర్తన , సాంస్కృతిక ప్రదర్శనల నడుమ వాహన సేవలు కట్టిపడేస్తున్నాయి. టీటీడీ భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసింది. – శ్రీనివాస్, వేలూరు, తమిళనాడు వాహన సేవలో తరించాం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం చిన్నశేష వాహన సేవలో పాల్గొన్నా.. గోవిందనామ స్మరణ మధ్య వాహన సేవలో శ్రీనివాసున్ని దర్శించుకున్నాం. గత బ్రహ్మోత్సవాలకు వచ్చాం. కానీ వాహన సేవను కనులారా చూడలేకపోయాం. ఈ సారి శ్రీవారిని దగ్గర నుంచి చూసే భాగ్యం కలిగింది. – వైఎస్ దేవేంద్ర, రాణిపేట, తమిళనాడు ఆర్జిత సేవలకు లాటరీ సరికాదు తిరుమలలో ఆర్జిత సేవలకు లాటరీ విధానం రద్దు చేయాలి. ఆన్లైన్ విధానంలో ఆర్జిత సేవలను భక్తలకు అందించాలి. క్యూలైన్లలో తోపులాట జరుగుతోంది, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తులు రెండు లైన్లలో క్యూలో వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.– గౌరీదేవి, హైదరాబాద్ మెరుగైన వసతులు కల్పించాలి భక్తులకు మెరుగైన సేవలందించేలా టీటీడీ చర్యలు తీసుకోవాలి. తిరుమలకు వచ్చే భక్తులకు సులభంగా వసతి కల్పించాలి. చంటి బిడ్డలతో తిరుమలకు వచ్చే వారికి మంచి సౌకర్యాలు కల్పించాలి. – పుష్పావతి, విజయవాడ విద్దుదీపాలంకరణ చాలాæ బాగుంది తిరుమల క్షేత్రంలో విద్యుద్దీపాలంకరణ బాగుంది. రాత్రివేళల్లో శ్రీవారి నమూనాలు, కటౌట్లు, ఆర్చిలు దేదీప్యమానంగా వెలుగుతూ కనువిందు చేస్తున్నాయి. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం అంటే తిరుమల గిరుల్లోనే చూసి తరలించాలి. అందుకే ఏటా బ్రహ్మోత్సవాలకు వస్తున్నాం – శిరీష, అమలాపురం -
కలియుగ వైకుంఠుని కమనీయ వైభవం
నాటి సినిమా ఈ నెల 23 నుంచి బ్రహ్మోత్సవాల సందర్భంగా... కలియుగాన పాపం పెరిగింది. కలి పురుషుని మహత్యాన మానవుడు వశం తప్పి చిత్తం చెదిరి చెడుత్రోవ పడుతున్నాడు. భూదేవికి పాపభారం పెరిగింది. వరాహస్వామి తన ముట్టె మీదమోస్తున్న భూమండలపు భారంతో సతమతమవుతున్నాడు. పాపహరణం చేసి మోక్షమార్గం చూపే వేల్పు కావాలి. ఇలవేల్పు కావాలి. అందుకని మహర్షులందరూ యజ్ఞానికిపూనుకొనగా నారదుని ప్రమేయంతో కథ మలుపులు తిరిగి వైకుంఠనాథుడు భూలోక దేవుడుగా ఎలా వెలిశాడనేదే ‘శ్రీ వెంకటేశ్వర మహత్మ్యంభృగువు అహంకారం అణిచి...కలియుగ కల్యాణం కొరకు మహర్షులు యజ్ఞం మొదలుపెట్టారు. హాజరైన నారదుడు ‘ఈ యజ్ఞానికి హవిర్భోక్త ఎవరు’ అని ప్రశ్నించాడు. త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తులో వారేహవిర్భోక్తగా ఉంటే బాగుంటుందని సూచిస్తాడు. త్రిమూర్తులలో శాంతమూర్తులు ఎవరో తేల్చుకోవడాని భృగు మహర్షి బయలుదేరుతాడు. మొదట సత్యలోకం చేరుకుంటాడు. అక్కడ శారద వీణానాదంలో తలమునకలయ్యి తన రాకను పట్టించుకోని బ్రహ్మను చూసి ‘నీకు భూలోకంలో గుళ్లూ గోపురాలు ఉండకుండా పోవుగాక’ అని శాపమిచ్చి కైలాసం చేరుకుంటాడు.అక్కడ పరమ శివుడు పార్వతీదేవితో కలిసి ఆనంద తాండవంలో మునకలై ఉంటే చూసి ఆగ్రహోదగ్రుడై ‘నీకు బెల్లం, విభూతి తప్ప మరో నైవేద్యం దక్కకుండా పోవుగాక’ అనికమండలం విదిలించి అక్కణ్ణుంచి సరాసరి వైకుంఠం చేరుకుంటాడు. అక్కడ లక్ష్మీదేవి శుశ్రూషతో స్వాంతన పొందుతున్న శ్రీహరి భృగువు రాకను విస్మరించగా భృగువు సరాసరి వచ్చి విష్ణువు వక్షస్థలంపై పాదాన్ని తాటిస్తాడు. అది చూసి లక్ష్మీదేవి హతాశురాలవుతుంది. తాను నివాసముండే వక్షస్థలాన్ని తన్ని తనకు అవమానం చేసినా శ్రీమన్నారాయుణుడు చిన్న మాట కూడా అనకుండా భృగువుకు మర్యాదలు చేయడం భరించలేకపోతుంది. మరోవైపు శ్రీహరి భృగువుకు పాదపూజ చేస్తున్న నెపంతో ఆయన పాదంలో ఉన్న కంటిని చిదిమి ఆయనలోని అహంకారాన్ని అణిచేస్తాడు. కాని జరిగిన అవమానాన్ని సహించలేక లక్ష్మి భూలోకం చేరుకుంటుంది. ఆమెను వెతుక్కుంటూ శ్రీహరి సామాన్య మానవుని వలే శేషాచల సానువుల్లో అవతరిస్తాడు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ ఆకలి దప్పులతో పుట్టలో సేదతీరిన హరికి గోవు పాలు పడుతుంది. కాని పిండడానికి పాలు ఇవ్వని గోవును వెతుక్కుంటూ వచ్చిన గొల్ల శరభయ్య గోవును దండించబోయి హరికి గాయం చేస్తాడు. అందుకుబదులుగా శాపం పొంది భూతంగా మారుతాడు. తల మీద దెబ్బతో పుట్ట వీడిన హరి నేరుగా వకుళమాత ఆశ్రమానికి చేరుకుని ఆశ్రయం పొందుతాడు. ఆమె అతడికి తల్లి అవుతుంది.అతడికి శ్రీనివాసుడు అని నామకరణం చేస్తుంది. పూర్వజన్మలో యశోద అయిన వకుళమాత శ్రీకృష్ణుని కల్యాణం చూడలేకపోయినందుకు ఈ జన్మలో వకుళమాతగా అవతరించిశ్రీనివాసుని కల్యాణం కోసం వేచి ఉంది. పద్మావతితో పరిణయందండెత్తడానికి వచ్చిన ఏనుగుల గుంపును అదుపు చేయడానికి బయలుదేరిన శ్రీనివాసుడు వసంతోత్సవం ఆడుతున్న పద్మావతీదేవిని చూసి మనసు పారేసుకున్నాడు. మరుక్షణంఆమెను ప్రియసఖిగా తలంపు చేశాడు. అంతటి అపురూపమూర్తిని చూసిన పద్మావతి కూడా వెనువెంటనే తన హృదయాన్ని శ్రీనివాసునికి సమర్పణం చేసింది. ఒకరికి వొకరు నచ్చారు.ఒకరిని ఒకరు మెచ్చారు. ఇక కల్యాణమే మిగిలింది. కాని ఆకాశరాజు భార్య ధరణీ దేవి ఇందుకు ససేమిరా అంటుంది. ‘దారిన పోయే నిరుపేదకు నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడమా’ అని అడ్డం తిరుగుతుంది. చివరకు పద్మావతి పూర్వజన్మలో వేదవతి అని, మాయా సీతగా రావణుని చెరను అనుభవించి సీతను కాపాడినందుకు బదులుగా శ్రీరాముని పత్నిగా అయ్యేవరం ఇమ్మని అడుగక ఈ జన్మలో సాధ్యం కాదన్న రాముడు మరు జన్మలో తీరుస్తానని మాట ఇచ్చాడనీ ఆ మాట ప్రకారమే శ్రీనివాసునిగా పుట్టి పద్మావతిగా జన్మించిన వేదవతినివివాహమాడనున్నాడని తెలుసుకుని వివాహానికి అంగీకరిస్తుంది. పరమేశ్వరుడూ పరబ్రçహ్మా హాజరవ్వగా పెళ్లి ఖర్చులకు కుబేరుడు కాసుల వర్షం కురిపించగా అంగరంగ వైభవంగాపద్మావతీ కల్యాణం జరిగింది. కాని అలగి తపోదీక్షలో ఉన్న లక్ష్మీదేవికి ఈ సంగతి తెలిసింది. అంతే. ఇంకేముంది. ఆమె ఆవేశంతో అక్కసుతో రగిలిపోయింది. తన పతికి మరొక సతిరావడాన్ని చూసి ప్రాణత్యాగం చేయాలన్నంతగా కన్నీరు మున్నీరయ్యింది. కాని శ్రీనివాసుడు నిస్సహాయుడు. ఇటు శ్రీదేవికి సర్ది చెప్పలేడు. అటు భూదేవిని బుజ్జగించలేడు. ఇరువురు భామల మధ్య ఆయన మెల్లగా పక్కకు జరిగి కలియుగ దైవంగా శిలరూపు దాల్చాడు. ‘కలియుగాంతం వరకు ఆయన స్థావరం ఇక్కడే’ అని తెలుసుకున్న శ్రీదేవి, భూదేవులు కూడాచెరోవైపు ఆయన సమక్షంలో వేల్పులుగా అవతరించారు. తదాదిగా తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠంగా పూజలందుకుంటోంది. శ్రీనివాసుని వైభవంతో భక్తుల పుణ్యక్షేత్రంగాఅలరారుతోంది. పి.పుల్లయ్య ప్రతిభ శ్రీ వేంకటేశ్వరుని మహత్మ్యం పేరున రెండుసార్లు సినిమా తీసే అవకాశం దర్శకుడు పి.పుల్లయ్యకే దక్కింది. ఆయన 1939లో ఒకసారి ‘బాలాజీ’ పేరుతో ఆ సినిమా తీసి పెద్ద హిట్సాధించి తనివి తీరక 1960లో తిరిగి ఎన్టీఆర్, సావిత్రి, జి.వరలక్ష్ములతో అదే సినిమాను నిర్మించి మరోసారి ఘనవిజయం సాధించారు. వేంకటేశ్వర స్వామి జన్మవృత్తాంతంతెలుసుకోవాలనుకునే ప్రేక్షకులకు పామరులకు కూడా ఎంతో సులువుగా ఆ కథను చెప్పి భక్తి పారవశ్యం కలిగించిన దర్శకుడు ఆయన. ఈ సినిమాలో శ్రీనివాసునిగా ఎన్టీఆర్ ఎంతోసాత్వికంగా దైవగుణంతో కనిపించి ఆరాధన భావం కలిగిస్తారు. ఇక లక్ష్మిగా జి.వరలక్ష్మి తన సహజమైన అతిశయాన్ని ప్రదర్శిస్తే పద్మావతిగా సావిత్రి ఎంతో అణకువను చూపిస్తుంది. ఈ ఇద్దరు దేవేరులను తన ఇరవైపులా పరిగ్రహించిన ఆ స్వామి వైభోగం ఎన్నిసార్లు చూసినా తనివి తీరుతుందా? అందుకే ఈ సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది. సాధారణంగా ‘డ్రామా’ ను రాసి మెప్పించే ఆత్రేయ ఈ సినిమాకు జనరంజకమైన మాటలు రాయడం ఒక విశేషం. ఇందులోనే ఆత్రేయ రాయగా ఘంటసాల పాడిన ‘శేషశైలావాస శ్రీవేంకటేశా’.. పాట ఇప్పటికీ బహుశా ఎప్పటికీ ఒక ప్రభాతగీతమే. ఇందులోనే పద్మావతికీ శ్రీనివాసునికీ మధ్య వచ్చే యుగళగీతం ‘కలగా కమ్మని కలగా’ కూడా కమ్మగా ఉంటుంది. గొల్ల శరభయ్యగా నటించిన రమణారెడ్డి అచ్చ నెల్లూరు గ్రామ్యంలో మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. పుట్టలో పాలుపోస్తున్న గోవును కనిపెట్టిన ఆ గొల్లల సంతతికే తొలి దర్శనం వరం శ్రీనివాసుడు కలుగజేయడం అది నేటికీ కొనసాగుతూ ఉండటం స్వామి లీల. ఈ లీల ఒక్కటేనా... శ్రీనివాసుని లీలలు వేనవేలు. ఆ లీలతో తరియించే భక్తులు ఉన్నంత కాలం ‘శ్రీ వేంకటేశ్వర మహాత్య్మం’ సినిమా నిలిచే ఉంటుంది. ఆ తిరుపతి ఈ తిరుపతి ఈ సినిమా షూటింగ్ కోసం వాహిని స్టూడియోలో తిరుమల గుడి సెట్ వేస్తే ఆ సెట్టే గుడి అన్నంతగా షూటింగ్ జరిగినంత కాలం భక్తుల హడావిడి, పూజలు ప్రసాదాలు కొనసాగాయి. షూటింగ్ అయిపోయాక కూడా భక్తుల తాకిడి వల్ల కొంత కాలం ఆ సెట్‌ను అలాగే ఉంచాల్సి వచ్చింది. ఇక బండ్లు కట్టుకొని వందల మంది ఈ సినిమా చూడటానికి వచ్చేవారు. సినిమా హాళ్లు కూడా వెంకటేశ్వరస్వామి విగ్రహం పెట్టి హుండీలు పెట్టి వాటిని కూడా గుడులకు మల్లే సినిమా ఆడినంతకాలం నిర్వహించారు. ఇక ఈ సినిమాతో ఎన్టీ రామారావు వేంకటేశ్వరునిగా ప్రేక్షకుల గుండెల్లో ముద్ర పడిపోగా తిరుపతికి వెళ్లిన భక్తులు అటు నుంచి అటు చెన్నై వెళ్లి ఎన్టీఆర్‌ని చూసుకొని రావడం ఆనవాయితీగా మారింది. తిరుపతి–చెన్నై టూర్ ఆపరేటర్లు ఆ రోజుల్లో విపరీతంగా కలెక్షన్లు చేసుకున్నారనడం ఒక చెప్పుకోవాల్సిన జ్ఞాపకం. - కె -
శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి అష్టదళ పాద పద్మారాధన సేవలో వారు పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి హుండీలో కానుకలు సమర్పించి రంగనాయకుల మండపం వద్దకు చేరుకున్నారు. అక్కడ పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం తితిదే జేఈవో భాస్కర్ పళనిస్వామి దంపతులను సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. ఆర్మీ వైస్ చీఫ్, లెఫ్ట్‌నెంట్ జనరల్ శరత్చంద్ర దంపతులు కూడా మంగళవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న తమిళనాడు సీఎం
-
వెంకన్న సేవలో పలువురు ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి సన్నిధికి పలువురు ప్రముఖులు వచ్చారు. ఆయా సేవల సందర్భంగా స్వామిని దర్శించుకున్నారు. నిజపాద దర్శనంలో స్వామివారిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దంపతులు దర్శించుకున్నారు. ఈయనతో పాటు రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడు స్వామిని దర్శించుకున్నారు. అలాగే అభిషేక సేవలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆకాష్ అంబానీలు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి అధికారులు ప్రత్యేక దర్శనం చేయించి లడ్డూ ప్రసాదాలు అందజేశారు. కాగా, టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ నటరాజన్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. -
శ్రీవారికి రూ.10 లక్షల విరాళం
తిరుమల: టీటీడీ అన్నదానం ట్రస్టుకు ఓ భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. బెంగుళూరుకు చెందిన వినయ్‌బాబు, అర్చన దంపతులు రూ.10, 00,116 లు స్వామి వారికి విరాళంగా ఇచ్చారు. మంగళవారం ఈ మొత్తానికి సంబంధించిన డిమాండ్ డ్రాఫ్టును టీటీడీ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట, కాలినడకన కొండపైకి వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 68,610 మంది దర్శించుకోగా శ్రీవారి హుండీకి రూ. 2.30 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. -
వెంకన్నను దర్శించుకున్నరకుల్
తిరుమల: ఏడుకొండలపై కొలువుతీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు, రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శ్రీవస్రసాద్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్‌లు శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి సన్నిధిలో నటుడు రాజేంద్రప్రసాద్
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని సినీనటుడు రాజేంద్రప్రసాద్ శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమమంలో అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అఖిలాండం వద్ద ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ప్రముఖులు
తిరుమల: శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు మంగళవారం దర్శించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు రమణాచారి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెల్లవారుజామున వీఐపీ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకుంటారని, బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. అలాగే తెలంగాణ రాష్ట్రం తరపున మొక్కుకున్న ప్రకారం రూ. 5 కోట్ల విలువైన స్వర్ణాభరణ కానుకలను సీఎం సమర్పించనున్నట్లు చెప్పారు. అక్కడి నుంచి తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకుంటారన్నారు. -
ఘనంగా రథసప్తమి వేడుకలు
తిరుమల : తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో రథ సప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య భగవానుడి జన్మ తిథి అయిన రథ సప్తమి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తిరుమలలో సప్తగిరీశుడైన వెంకటేశ్వరస్వామి సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఏడు వాహహనాలపై తిరువీధులలో ఊరేగుతారు. స్వామి వారిని దర్శించుకునేందుకు కొండపైకి భక్తులు భారీగా చేరుకున్నారు. మొదటగా సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఊరేగారు. అనంతరం చిన్న శేషవాహనంపై ఊరేగుతారు. రథ సప్తమి ఒక్కరోజే ఇన్ని వాహనాలపై శ్రీవారు ఊరేగడం విశేషం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అలాగే తిరుపతిలోని దక్షిణ మాడా వీధిలో కొలువై ఉన్న కోదండ రామమూర్తిని కూడా సూర్యప్రభ వాహనంపై ఊరించారు. భద్రాచలం : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి అర్చకులు విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం రెండు కంపార్టెమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. స్వామి వారిని సోమవారం 73,092 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ.2.17 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఒక కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శ్రీవారిని ఆదివారం 79,137 మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ఆదాయం రూ. 2.33 కోట్ల వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
భక్తజన వైకుంఠం
-
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు 7 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. నిన్న(శుక్రవారం) శ్రీవారిని 65,842మంది దర్శించుకోగా.. స్వామి వారి హుండీ ఆదాయం రూ.2.58 కోట్లు వచ్చింది. 28,585 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. -
శ్రీవారి ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం
తిరుమల: శ్రీవెంకటేశ్వర స్వామివారి ప్రసాదాలు తయారు చేసే ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. మితిమీరిన వేడి వలన వ్యర్థాలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. -
స్వామి సేవకు వేళాయెరా!
* రెండువేల ఏళ్ళ చరిత్ర కలిగిన తిరుమలేశుని ఆలయంలో అర్చక వ్యవస్థకు 1800 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామి ఆత్మసాక్షాత్కారంగా విఖనసముని తొలిసారిగా పూజా కైంకర్యాలు నిర్వహించినట్టు ఐతిహ్యం. ఆ తర్వాత ఆలయంలో మొదటిసారిగా భరద్వాజ గోత్రానికి చెందిన గోపీనాథ్ దీక్షితులు వేంకటేశుడికి పూజాకైంకర్యాలు నిర్వహించారు. తర్వాత కౌశిక గోత్రానికి చెందిన శ్రీనివాస దీక్షితులు వచ్చారు. 1996 వరకు శ్రీవారి ఆలయంలో అర్చక మిరాశి వ్యవస్థ కొనసాగింది. ఆలయ వ్యవహారాలు, నగల రక్షణ బాధ్యత వీరి చేతుల్లోనే ఉండేది. * 1977 నుంచి ప్రస్తుతం భరద్వాజ గోత్రంలో అర్చక పైడిపల్లి, అర్చక గొల్లపల్లి, కౌశిక గోత్రంలో అర్చక పెద్దింటి, అర్చక తిరుపతమ్మగారి అనే నాలుగు కుటుంబాలు శ్రీవారి ఆలయంలో అర్చక వ్యవస్థను కొనసాగిస్తున్నాయి. * భరద్వాజ గోత్రానికి చెందిన అర్చక గొల్లపల్లి రమణ దీక్షితులు, పైడిపల్లి శ్రీనివాస నారాయణ దీక్షితులు, కౌశిక గోత్రానికి చెందిన పెద్దింటి శ్రీనివాసమూర్తి దీక్షితులు, అర్చక తిరుపతమ్మగారి శ్రీనివాస నరసింహ దీక్షితులు ఇప్పుడు శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. * వీరు వేకువజామున 1గంటకు నిద్రలేస్తారు. చల్ల నీటి స్నానం చేసి మడికట్టుకుంటారు. ద్వాదశి ఊర్వపుండ్రాళ్లు (నామాలు) పెట్టుకుంటారు. * అర్చక నిలయంలో కొలువైన విఖన స ముని వద్ద ప్రార్థన చేస్తారు. సన్నిధి గొల్ల దివిటీ చేతబట్టి అర్చకులను ఆలయానికి తీసుకెళుతారు. జీయర్ ఆదేశాలతో సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తీస్తారు. గోవింద గోవింద అంటూ అర్చకులు ఆలయ ప్రవేశం చేస్తారు. * గర్భాలయంలో కైంకర్య పూజా విధులు నిర్వహిస్తున్నందున మూలమూర్తిపై ఎక్కడ నోటి గాలి, లాలాజలం పడుతుందో? అని శిరోవస్త్రం (నోటికి వస్త్రం కట్టుకుంటారు). * జీయర్ ఇచ్చే పుష్పాలను స్వామికి అలంకరించి, హారతులు సమర్పిస్తారు. వారపు, పర్వదినాల్లో విశేష అలంకరణ చేస్తారు. వేకువజామున 2.30 గంటలకు సుప్రభాతంలో మేల్కొలుపు నుంచి తిరిగి అర్ధరాత్రి 1.30 గంటలకు పవళింపు (ఏకాంత) సేవ వరకు నిత్య కైంకార్యల్లోనూ అర్చకులు పాత్ర విశేషంగా ఉంది. ఇలా అర్చకులు స్వామి సేవకులుగా సపర్యలు చే స్తూ పరమానందం పొందుతున్నారు. -
మహంతులే మార్గదర్శకులుగా...
ఐదువందల ఏళ్ళ కిందట ఢిల్లీకి సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని ‘క్రేడల్క్రేల’ గ్రామంలో రామానంద మఠం ఉండేది. ఆ మఠాధిపతి అభయ ఆనంద్జీ. ఈయన శిష్యుడే హథీరాంజీ. దక్షిణభారత దేశ యాత్రలో భాగంగా వేంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వర స్వామిని అయోధ్య రాముడి అంశగా భక్తితో కొలుస్తూ ప్రసన్నం చేసుకున్నాడు. బావాజీ భక్తికి ముగ్ధుడైన స్వామి నిత్యం ఆనంద నిలయం దాటి హథీరాం మఠం విడిదికి వెళ్లి, బావాజీతో పాచికలాడేవారట. అయితే ఆటలో తానే ఓడిపోయి భక్తుని గెలిపిస్తూ ఆనందించేవారట. తిరుమలలో హథీరాంజీ స్థాపించిన మఠం ఆలయానికి ఆనుకుని ఆగ్నేయదిశలో ఉంది. 90 ఏళ్ల మహంతుల పాలన క్రీ.శ.13వ శతాబ్దం తర్వాత విజయనగర రాజులు, ఆ తర్వాత 1843 ముందు వరకు ఈస్టిండియా కంపెనీ మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలోని ఉత్తర ఆర్కాటు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ పాలన సాగింది. 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు 90 ఏళ్లపాటు ఆలయ పాలన హథీరాం మఠం మహంతుల చేతుల్లోనే సాగింది. 1843 జూలై 10 తేదీన హథీరాం మఠం తరపున శ్రీవారి ఆలయానికి తొలి ధర్మకర్తగా మహంత్ సేవాదాస్ బాధ్యతలు చేపట్టారు. ఆణివార ఆస్థానం రోజున బ్రిటీషు ప్రభువుల నుండి శ్రీవారి ఆలయ ఆస్తిపాస్తులు, స్వామికి అలంకరించే తిరువాభరణాలు, ఉత్సవమూర్తులు, ఉత్సవ వర్ల ఊరేగింపులో వాడే వాహనాలు, కైంకర్యాల్లో వినియోగించే పురాతన వస్తువులు, వస్త్రాలు, పాత్రలు, ఆలయానికి సంబంధించిన అన్ని రికార్డులు సేవాదాస్కు అప్పగించారు. ఇందుకు తార్కాణంగానే తిరుమల ఆలయ లెక్కల అప్పగింతలు వంటి కార్యక్రమాలన్నీ ‘ఆణివార ఆస్థానం’ రోజునే నిర్వహించే ఆచారాన్ని టీటీడీ అమలు చేస్తుండటం విశేషం. మహంతుల అధికారిక ముద్ర ‘విష్వక్సేన’ మహంతుల అధికారిక ముద్ర (సీలు) విష్వక్సేనుడు. సేవాదాస్ హయాంలోనే పుష్కరిణిలోని ‘జలకేళి మండపోత్సవం’ పేరుతో తెప్పోత్సవం ప్రారంభించారు. రెండవ ధర్మకర్తగా బాధ్యతలు తీసుకున్న ధర్మదాస్ తిరుపతి కపిలతీర్థం పుష్కరిణి, సంధ్యావందన మండపాన్ని జీర్ణోద్ధారణ చేశారు. 1878లో తిరుమల ఆలయంలోని పడికావలి గోపురం (మహద్వార గోపురం)కు మరమ్మతులు చేయించారు. ప్రయాగదాస్ హయాంలో అభివృద్ధి వేగవంతం మహంతుల పాలనలో చివరి విచారణకర్తగా బాధ్యతలు చేపట్టిన మహంత్ ప్రయాగదాస్ హయాంలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పన వేగవంతం అయ్యాయి. 1900 సంవత్సరం నుంచి 1933లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆవిర్భవించే వరకు 33 సంవత్సరాల పాటు ఆయన పాలన సాగింది. ఆ కాలంలో ఆయన చేపట్టిన కార్యక్రమాలు, పనులు నేటి తరం టీటీడీ పాలకులకు కూడా మార్గదర్శకంగా నిలిచాయి. 1908లో ఆనంద నిలయం శిఖరంపై బంగారు కలశాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు సులభంగా తిరుమలకు వచ్చేందుకు ప్రధాన మార్గాలైన అలిపిరి, శ్రీవారి మెట్టు, కాలిబాట మార్గాలు అభివృద్ధి చేశారు. జంతుదాడుల నుంచి రక్షించుకోవటంతోపాటు వెలుతురు కోసం అటవీ కాలిబాటల్లో వాషింగ్టన్ (ఆధునిక బల్బులు) విద్యుత్ బల్పులు ఏర్పాటు చేయించారు. అలిపిరిమార్గంలో గాలిగోపురం నిర్మించారు. తిరుమల, తిరుపతిలో ధర్మసత్రాలు నిర్మించారు. రహదారులు, తాగునీరు, శుభ్రత, ఆరోగ్యం, వైద్య సదుపాయం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించి పనులు వేగవంతం చేయించారు. పరిపాలన సౌలభ్యం కోసం తిరుపతిలో పాత హుజారు ఆఫీసు నిర్మాణం, మద్రాసులో దేవస్థానం ముద్రణాలయం, తిరుపతిలో శ్రీవేంకటేశ్వర ఉన్నత పాఠశాల నిర్మాణం, వేదపాఠశాల విస్తరణ, ఓరియంటల్ కళాశాల, ఆయుర్వేద పాఠశాల నిర్మాణాలు చేపట్టారు. మూలమూర్తి, ఉత్సవమూర్తులకు ఆభణాలు, కిరీటాలు వంటి విలువైన నగలు తయారు చేయించారు. దేవాలయాల శిలాశాసనాలు పరిశోధన చేయించారు. 1933లో అప్పటి ఉమ్మడి మద్రాస్ ప్రభుత్వం ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఏర్పాటు చేయటంతో మహంతుల పాలన ముగిసింది. శ్రీవారికి మహంతుల ‘నిత్యహారతి ’ మహంతు బాబాజీ పేరుతో తిరుమల ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారికి సుప్రభాత సేవలో గోక్షీర నివేదనం, నవనీత హారతి సమర్పించే ఆచారం నేటికీ కొనసాగుతోంది. ఆ నాటి నుంచి నేటి హథీరాం మహంత్ అర్జున్‌దాస్ లేదా మఠానికి చెందిన సాధువులు/బైరాగులు ప్రతిరోజూ వేకువజాము సుప్రభాతవేళకు ముందు ఆలయానికి వెళ్లి సంప్రదాయంగా హారతి అందజేస్తున్నారు. ఇక గోకులాష్టమి పర్వదినం సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు హథీరాంమఠానికి విడిదికి వచ్చి ప్రత్యేక పూజలందుకుంటారు. మఠం మహంతుకు ఆలయ మర్యాదలు పరివట్టం, తీర్థం, శఠారి మర్యాదలు అందజేస్తారు. మహంతుల కాలంలోనే స్థానికులకు కొండమీద స్థలాలు అప్పటి వాతావరణ పరిస్థితుల వల్ల తిరుమలకొండ మీద ఆలయంలో పనుల నిర్వహణ కోసం సిబ్బంది కొరత ఉండడంతో సదుపాయాల్లేక భక్తులు ఇబ్బంది పడేవారు. దాంతో మహంతులు చొరవ తీసుకుని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, వెంకటగిరి తదితర సమీప గ్రామ ప్రాంతాల్లో దండోరా వేసి అక్కడివారిని తిరుమలకు రప్పించారు. వారికి స్థలాలను, అనుభవ హక్కులు ఇచ్చారు. స్థిరనివాసం కల్పించారు. వ్యాపారాలకు అనుమతులిచ్చారు. కొండకు వచ్చే భక్తులకు అండగా ఉంటూ జీవనం సాగించుకునేందుకు స్థానికులకు మహంతులు భరోసా ఇచ్చారు. విచారణ కర్త పాలన కాలం సం. 1. మహంతు సేవాదాస్ 1843-1864 21 2. మహంతు ధర్మదాస్ 1864-1880 16 3. మహంతు భగవాన్‌దాస్ 1880-1890 10 4. మహంతు మహావీర్‌దాస్ 1890-1894 04 5. మహంతు రామకృష్ణదాస్ 1894-1900 06 6. మహంతు ప్రయాగదాస్ 1900-1933 33 రూ.వేల కోట్లలో మఠం ఆస్తులు హథీరాం మఠం నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ వేల కోట్లలో ఉంటుందని అనధికారిక లెక్కలు. ప్రధానంగా తిరుమల, తిరుపతిలో మఠాలతోపాటు ఆలయాలు ఉన్నాయి. వాటితోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి. మఠం నిర్వహణా బాధ్యతను 1962 నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయశాఖ నిర్వహిస్తోంది. మఠాధిపతిగా అర్జున్‌దాస్ హథీరాం మఠం మహంతుగా అర్జున్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1987లో మహంతుగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఆయన్ను బాధ్యతల నుండి తప్పించింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులతో 2007లో తిరిగి మఠం మహంత్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి మహంత్ అర్జున్‌దాస్ కొనసాగుతున్నారు. -
తరాలు మారినా... సంప్రదాయాలు మారలేదు!
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు శ్రీవేంకటేశ్వర స్వామివారి కైంకర్యంలో ఎన్నెన్నో సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. ఉత్సవ ప్రియుడైన స్వామివారి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భక్తులు వందలయేళ్లుగా ప్రత్యేక కానుక లు సమర్పిస్తూ తమ భక్తి ప్రపత్తులు చాటుతున్నారు. వీటిలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు మాలలు, చెన్నయ్ నుండి గొడుగులు, తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల సంస్థానం నుండి ఏరువాడ జోడు పంచెలు ప్రధానమైనవిగా పేర్కొనవచ్చు. వాటి విశేషాల గురించి తెలుసుకుందామా!! తరాలుగా తిరుమలేశుని సేవలో చెన్నయ్ గొడుగులు తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నయ్ (నాటి చెన్నపట్నం) నుండి గొడుగులు సమర్పించే సంప్రదాయం వందలయేళ్లుగా వస్తోంది. చెట్టియార్లు, హిందూధర్మార్థ ట్రస్టుతోపాటు ఎన్నెన్నో కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. నాడు దివిటీ వెలుగుల్లో... సౌకర్యాలు అంతగా లేని నాటి రోజుల్లో దివిటీల వెలుగుల ఎడ్లబండ్లు, కాలినడకన ఊరేగింపుగా తీసుకొచ్చేవారట. దశాబ్దమున్నరకాలంగా గొడుగుల సమర్పణలో అనేకరకాల వివాదాలు చోటు చేసుకోవటంతో తిరుమల ఆలయ మర్యాదలు లేకుండా కేవలం భక్తులు గొడుగులు సమర్పిస్తే తీసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఈ కారణంగా అనేకమంది భక్తులు శ్రీవారికి ఛత్రిలు సమర్పిస్తున్నారు. ఇందులో హిందూ ధర్మార్థ సమితి గత 12 ఏళ్లుగా గొడుగులు సమర్పించే కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహిస్తోంది. * శ్రీవారి బ్రహ్మోత్సవం తొలిరోజు చెన్నయ్‌లోని చెన్నకేశవాలయం నుంచి 11 గొడుగులతో భక్తబృందం కాలినడకన బయలుదేరుతారు. తొలుత తిరుచానూరు అమ్మవారికి రెండు గొడుగులు సమర్పిస్తారు. తర్వాత గరుడసేవ రోజున ఆలయం వద్ద మరో 9 గొడుగులు సమర్పిస్తారు. స్వామివైభవం, దర్పానికి ప్రతీకగా ఆలయాల్లో గొడుగులను వాడే సంప్రదాయాన్ని వెయ్యేళ్ల క్రితమే భగవద్రామానుజులవారు ఆరంభించినట్టు చరిత్ర. 4 నుండి10 అడుగుల ఎత్తు వరకు... శ్రీవారికి సమర్పించే గొడుగులను 4 నుండి 10 అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు. గరుడసేవ కోసం 10 అడుగులు, ఇతర వాహనాలకు 9 అడుగులు, సూర్య, చంద్రప్రభ వాహనాలకు 7.5 అడుగులు, బంగారు తిరుచ్చి వాహనాలకు 4 నుండి 6 అడుగుల ఎత్తులో తయారు చేస్తారు. ఇవి ఒక్కొక్కటి రూ.5 వేల నుండి రూ.50 వేల వరకు ధర పలుకుతాయి. వీటి అలంకరణకు వెండి కలశాలు, ఇతర సామగ్రి వాడతారు. తరతరాలుగా గొడుగుల తయారీలోనే... తిరుమలతోపాటు తమిళనాడులోని ప్రముఖ దేవాలయాలకు గొడుగులు తయారు చేసే కుటుంబాలలో ప్రధానంగా చిన్నస్వామి షా కుటుంబాన్ని చెప్పొచ్చు ఈయన పూర్వీకులది మహారాష్ర్టలోని సౌరాష్ట్ర ప్రాంతం. వలసల ద్వారా చెన్నయ్‌లోని చింతాద్రిపేటలోని అయ్యామెదలువీధిలో స్థిరపడ్డారు. చిన్నస్వామి కుమారుడు స్వామి షా, మనుమలు గజేంద్రషా, సుబ్రమణి షా. ఈ కుటుంబ సభ్యులు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మూడు నెలల ముందు చెన్నయ్ ప్యారిస్‌లోని చెన్నకేశవ స్వామి ఆలయంలో పూజలు చేసి భక్తి శ్రద్ధలతో గొడుగుల తయారీపై దృష్టిపెడతారు. ఇలా తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ), మధుర మీనాక్షి, శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయం, తిరువళ్లూరు వీర రాఘవస్వామి, కాంచీపురం వరదరాజస్వామి, చెన్నయ్‌లోని పార్థసారథి స్వామి ఆలయం, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, ద్వారకా తిరుమల, నెల్లూరు రంగనాథ స్వామి ఆలయాలకు కూడా వీరు గొడుగులు సమర్పించారు. * పూర్వం వీటిని కాగితంతో తయారు చేసేవారట. తాజాగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ పద్ధతి, డిజిటల్, బోల్డ్ సిల్క్, ప్యూర్సిల్క్ పద్ధతుల్లో గొడుగులు సిద్ధమవుతున్నాయి. వాటిపై ఆయా ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల బొమ్మల అల్లికలు చేస్తున్నారు. ఊరేగింపులో ఉత్సవమూర్తి పక్కనే గొడుగులు ఉండేలా తయారీదారులు జాగ్రత్త పడతారు. లోకకల్యాణం కోసమే గొడుగుల సమర్పణ లోకకల్యాణం కోసం పదకొండేళ్ల్ల్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వందల కిలోమీటర్ల నుంచి కాలిబాటలో వీటిని తీసుకొస్తాం. మార్గంలో అడుగడుగునా పూజలు అందుకుంటాయి. ఈ గొడుగులు స్వామి వారికి సమర్పించటం వల్ల సకాలంలో వర్షాలు కురిసి, అందరూ క్షేమంగా ఉంటారని పెద్దల విశ్వాసం. ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ కార్యక్రమాన్ని దీక్షగా నిర్వహిస్తున్నాం. ఈ యజ్ఞానికి టీటీడీ యాజమాన్యం సంపూర్ణంగా సహకరిస్తోంది. - ఆర్ఆర్. గోపాలన్ చైర్మన్, హిందూ ధర్మార్థ ట్రస్టు మహద్భాగ్యం తిరుమల వెంకన్నను దర్శించుకోవడమే మహాభాగ్యం. అటువంటి స్వామికి మరింత దర్పాన్ని తీసుకొచ్చే గొడుగులను మా ఇంటి నుండి తీసుకు వెళ్లటం మహద్భాగ్యం... గర్వకారణంగా, పూర్వజన్మ సకృతంగా భావిస్తాం. - గజేంద్రషా, చెన్నయ్ పూర్వజన్మ సుకృతం ఈ భాగ్యం పూర్వజన్మసుకృతం. ఇంతకంటే ఆనందం లేదు. తిరుపతికి వెళ్లినప్పుడు స్వామి ఊరేగింపులో మా చేత తయారైన గొడుగుల చూసి ఆనందించే క్షణాలు విలువ చెప్పలేము. - సుబ్రమణి షా, చెన్నయ్ జగన్మోహనుడి అలంకరణలో శ్రీవిల్లిపుత్తూరు పుష్పమాలలు, చిలుక ప్రతియేటా బ్రహ్మోత్సవం గరుడ రోజున శ్రీవిల్లిపుత్తూరు నుండి గోదాదేవి అమ్మవారికి అలంకరించిన పూలమాలలను తిరుమలేశునికి అలంకరించటం సంప్రదాయం. ♦ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులోని వటపత్రశాయి శ్రీమహావిష్ణువును శ్రీకృష్ణునిగా, తనను గోపికగా భావించి రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు పాశురాలను గానం చేశారు. ఆమె నిష్కల్మష భక్తికి మెచ్చిన శ్రీరంగనాథుడు ఆమెను పరిణయమాడారు. నాటినుంచి గోదాదేవి (ఆండాళ్)గా ప్రసిద్ధి పొందారు ♦ దానికి గుర్తుగానే తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో నెలరోజులపాటు సుప్రభాతం బదులు గోదాదేవి ‘తిరుప్పావై’ పఠిస్తారు. ♦ బ్రహ్మోత్సవం ఐదోరోజు అలంకార ప్రియుడైన మలయప్ప స్వామివారు మోహినీ రూపంలో శ్వేతవర్ణ పట్టు శేషవస్త్రం, శిఖపై కొప్పు, వజ్రాలు పొదిగిన బంగారు వాలు జడ, ఎదపై పచ్చలహారం, కుడిచేతిలో బంగారు చిలుకను, ఎడమవైపు శ్రీవిల్లిపుత్తూరు చిలుకను ధరించి ఆసీనులై జగన్మోహనాకారంగా భక్తలోకాన్ని సమ్మోహపరుస్తూ దివ్యమంగళరూపంలో దర్శనమివ్వటం సంప్రదాయం ♦ ఐదోరోజు రాత్రి ఉత్కృష్టైమైన గరుడవాహన సేవలో గర్భాలయ మూలవిరాట్టుకు అలంకరించే మకర కంఠి, లక్ష్మీహారం, సహస్ర నామమాల ధరించి మలయప్పస్వామి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడిపై ఊరేగుతూ అశేష భక్తజనాన్ని అనుగ్రహిస్తారు. అదేసందర్భంగా గోదాదేవి పనుపున శ్రీవిల్లి పుత్తూరు ఆలయం నుండి వచ్చిన తులసిమాలలు అలంకరిస్తారు. -
ఏడుకొండల వెంకన్నకు ఏరువాడ జోడు పంచెలు
తెలంగాణాప్రాంతంలోని మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ సంస్థానాధీశుల కాలం నుంచి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి చేనేత ఏరువాడ జోడుపంచెలు సమర్పించటం సంప్రదాయం. తిరుమలేశుని బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ జోడు పంచెలు గద్వాల్ సంస్థానం నుండి కానుకగా అందే సంప్రదాయం నాలుగు వందల యేళ్ల నుండి నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఏరువాడ జోడు పంచెలంటే? ఏరు అంటే నదీపరివాహక ప్రాంతం అని అర్థం. మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల్ నగరం పవిత్రమైన తుంగభద్ర, కృష్ణానది మధ్య ఉంది. ఈ రెండు నదుల మధ్య ఉండే ఈ ప్రాంతంలో చేనేత మగ్గాలపై జోడుపంచెలు తయారు చేయటం సంప్రదాయం. అందుకే ఈ పంచెలు ఏరువాడ జోడు పంచెలుగా ప్రసిద్ధి పొందాయి. గద్వాల సంస్థానాధీశుల వారసత్వం గద్వాల సంస్థానాధీశులలో ఒకరైన సీతారాంభూపాల్ తన ఇష్టదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఏరువాడ జోడు పంచెలు సమర్పించటం సంప్రదాయం. అదే సంప్రదాయం వారి వంశీయులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుత గద్వాల్ సంస్థానాధీశురాలు శ్రీలతాభూపాల్ వీటిని తిరుమలేశునికి కానుకగా సమర్పించారు. 41 రోజుల పాటు దీక్షతో జోడు పంచెలు గద్వాల సంస్థానాధీశుల విజ్ఞప్తి మేరకు ఐదేళ్లుగా గద్వాల లింగంబాగ్ కాలనీలోని చేనేత పంచెల తయారీ నిర్వాహకుడు మహంకాళి కరుణాకర్ తన ఇంటిమీద తయారు చేశారు. వీటిని ఇప్పటికే సిద్ధం చేశారు. * సాక్షాత్తు కలియుగ దేవదేవునికి అలంకరించే వ స్త్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రత్యేక మగ్గంతో ఐదుమంది సహచర చేనేత కార్మికులు గద్దె మురళి, సాక సత్యన్న, దామర్ల షణ్ముఖ రావు, కరుణాకర్, మేడం రమేష్‌తో కలసి సిద్ధం చేశారు. * మొత్తం 41 రోజుల పాటు దీక్షతో ఈ జోడు పంచెలు తయారు చేశారు. 11 గజాల జోడు పంచెలు గద్వాల ఏరువాడ పంచె 11 గజాల పొడవు, రెండున్నర గజాల వెడల్పు ఉంటుంది. 15 అంగుళాల వెడల్పు అంచుతో తయారు చేశారు. ఈ జోడు పంచెలపై రాజకట్టడాల గుర్తుగా ఎనిమిది కోటకొమ్మ అంచులతో కళాత్మకంగా తయారు చేశారు. ఒక్కోపంచెను తయారు చేయడానికి 20 రోజులు పడుతుంది. బ్రహ్మోత్సవాల్లో మూలమూర్తికి అలంకరణ గద్వాల సంస్థానం నుండి అందిన ఈ పంచెలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలకు ముందు అలంకరిస్తారు. అలా స్వామివారికి అలంకరించిన వాటిలో ఓ పంచెను శేషవస్త్రంగానూ, శ్రీవారి ప్రసాదాలను కానుకగా గద్వాల సంస్థానానికి పంపటం తిరుమల ఆలయ సంప్రదాయం. పూర్వజన్మసుకృతం గద్వాల సంస్థానం ఆచారం ప్రకారం మా ఇంట్లో తయారైన జోడుపంచెలు సాక్షాత్తు తిరుమల గర్భాలయ మూలమూర్తి అలంకరణకు వాడుతుండటం మా పూర్వజన్మసుకృతం. ఆ ఆనందాన్ని మాటలతో వర్ణించలేము. - మహంకాళి కరుణాకర్ -
నిజరూప దర్శన భాగ్యం
దేవదేవుడు శ్రీవేంకటేశ్వర స్వామివారిని నిజరూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు గురువారం మాత్రమే దక్కుతుంది. ప్రతి గురువారం వేకువజామున రెండవ అర్చన తర్వాత ఎలాంటి ఆభరణాలు, అలంకారాలు లేకుండా స్వామి నిరాడంబర స్వరూపంతో దర్శనమిస్తారు. గురువారం నాటి దర్శనాన్నే నేత్రదర్శనం అని అంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి, పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్క, తలకు చుట్టూ సొగసుగా చుట్టిన తలగుడ్డ (పరివీటం, పరివేష్ఠనం) తో నగుమోముతో దేదీప్యమానంగా దర్శనమిస్తాడు స్వామి. ఆభరణాలే కాకుండా నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని (ఊర్థ్వపుండ్రాలు) బాగా తగ్గిస్తారు. ఆ రోజంతా భక్తులు శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహ ద్భాగ్యం కలుగుతుంది. ఆ రోజు ఆభరణాల బదులు 24/ 4 కొలతలు గల పట్టుధోవతి ధరింపచేస్తారు. 12/ 2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టువస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగాను చుడతారు. మెడలో వక్షఃస్థల బంగారు అలమేలు మంగహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖచక్రాలు, బంగారు కర్ణభూషణాలు, సాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్లకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. ఇలా ద్వాపర యుగంలో నల్లని కృష్ణయ్యే వెంకటాద్రిలో గోవిందుడయ్యా అన్న రీతిలో దర్శనమిస్తారు. భక్తుల్లో కొందరికి తాము చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాల్సిందిగా హెచ్చరించినట్టుగా స్వామివారికి గోచరిస్తారు. గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఏ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు. -
స్వామి సన్నిధి... శుభకార్యాలకు పెన్నిధి
ఆపదమొక్కులవాడికి భక్తులు వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. నిత్యపెళ్లికొడుకైన ఆ స్వామి సన్నిధిలో వివాహబంధంతో ఒక్కటవుతుంటాయి కొత్తజంటలు. మరికొందరు భక్తులు నామకరణం, అన్నప్రాశసన, చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం, కేశఖండన, ఉపనయనం, సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తూ తరిస్తున్నారు భక్తకోటి. ఇందుకు టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణ వేదిక కేంద్రమైంది. పురోహిత సంఘం తిరుమలలో సనాతన హైందవ సంప్రదాయానికి లోబడి వైదిక కర్మలు నిర్వహించేందుకు టీటీడీ పౌరోహిత సంఘం ఉంది. ఇక్కడ నిష్ణాతులైన పురోహితులు ఉన్నారు. మొత్తం 120మంది పౌరోహితులు, మంగళవాయిద్యాలు వాయించటం, చెవిపోగులు కుట్టడం వంటి వాటిలో నాయీ బ్రాహ్మణుల 24 గంటలూ మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వెంకన్న సన్నిధిలో ముహూర్తంతో పనిలేదు! దేవదేవుని సన్నిధి అయిన తిరుమల క్షేత్రంలో నిత్యం పెళ్లి మంత్రాలు వినిపిస్తాయి. బాజాభజంత్రీలు మోగుతూనే ఉంటాయి. ఇలా తిరుమలలో రోజూ వివాహాలు జరుగుతూనే ఉంటాయి. శుభలగ్నాలతో పనిలేకుండా కూడా పెళ్లి వేడుకలు సాగుతుండటం ఇక్కడి ప్రత్యేకత. ఉచిత ‘కల్యాణం’ భారతీయ ఆశ్రమ ధర్మాలకు ఊపిరైన వివాహ బంధం పటిష్టతకు టీటీడీ గట్టి పునాదులు వేసింది. అదే తరహాలోనే ‘కల్యాణం’ పేరుతో కొత్త పథకానికి టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శ్రీకారం చుట్టారు. వివాహానికి కావాలసిన వాటినన్నిటినీ ఉచితంగా సమకూర్చుటం వల్ల ధార్మిక ప్రచారంతోపాటు మానవసేవకూ మార్గం ఏర్పడుతుందని టీటీడీ భావించింది. * తిరుమల కల్యాణవేదిక పౌరోహిత సంఘం కేంద్రంగా 2016, ఏప్రిల్ 25 నుండి ‘కల్యాణం’ పథకానికి శ్రీకారం చుట్టారు. పురోహితుడు, మంగళవాయిద్యాలు, పెళ్లివేడుక వీడియో విద్యుత్ చార్జీలకు రూ.860 వసూలు చేసే విధానాన్ని రద్దు చేశారు. * వివాహం సందర్భంగా శ్రీవారి కానుకగా పసుపు, కుంకుమ, అక్షింతలు, కంకణాలు అందజేస్తారు. ఇదే సందర్భంగా రూ.300 టికెట్ల క్యూలైను నుండి కొత్తజంటలతోపాటు వారి అమ్మానాన్నలు, బంధుమిత్రులు మొత్తం 6 మందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కొత్త జంటకు శ్రీవారి ప్రసాద బహుమానంగా పది చిన్న లడ్డూలు అందజేస్తారు. * చట్టప్రకారం వధూవరులు మేజరై ఉండాలి. వారి వయసు తెలిపే 10వ తరగతి మార్కుల జాబితా, ప్రభుత్వ గుర్తింపు కార్డులు చూపాలి. పెళ్లికి పెద్దల అంగీకారం ఉండాలి. వధువు, వరుడి తల్లిదండ్రులు లేదా కుటుంబ పెద్దలు హాజరు కావాలి. * ఫొటోమెట్రిక్ పద్ధతిలో అందరూ వేలి ముద్రలు వేసి రిజిస్టర్ చేసుకున్నాకే పెళ్లి వేడుక నిర్వహిస్తారు. పెళ్లి తర్వాత ఎస్‌ఎంసీలోని 232 కాటేజీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. * పౌరోహిత సంఘంలో సామూహిక పెళ్లి వేడుక నిర్వహించుకునేందుకు టీటీడీ కొత్తగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌక ర్యం కల్పించింది. www.ttdseva online.com ద్వారా భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. * తిరుమలలో 23 మఠాలు, ప్రైవేట్ సత్రాలు, టీటీడీకి సంబంధించిన శంకుమిట్ట కాటేజీ (ఎస్ఎంసీ) 6, ట్రావెల్స్ బంగ్లా కాటేజీ (టీబీసీ) 2 కల్యాణ మండపాల్లోనూ పెళ్ళిళ్లు చేసుకోవచ్చు. వీటికి మాత్రమే నగదు చెల్లించాలి? టీటీడీ పౌరోహిత సంఘం కల్యాణవేదికలో వివాహాలు మాత్రం ఉచితం. అయితే, మిగిలిన వాటికి నగదు చెల్లించాలి. వీటి నిర్వహణకోసం కేవలం గంట ముందు వచ్చి నగదు చెల్లించి రశీదు పొందితే చాలు టీటీడీ అవసరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నగదు చెల్లింపు వివరాల్లోకి వెళితే..., ఉపనయనం:రూ.300, చెవులు కుట్టించడం: రూ.50, అన్నప్రాశన-రూ.200, నామకరణం-200, కేశఖండన-రూ.200, అక్షరాభ్యాసం:రూ.200, సత్యనారాయణ స్వామి వ్రతం:రూ.300, నవగ్రహ హోమం: రూ.300, రూ.100, ప్రార్థనావివాహం-రూ.200. నామకరణం హిందువులు నిర్వహించే షోడ శ కర్మలలో నామకరణం, అన్నప్రాశన, కర్ణవేధ, కేశఖండన, అక్షరాభ్యాసం, ఉపనయనం అతిముఖ్యమైనవి. వీటన్నింటినీ వెసులుబాటును బట్టి ఇండ్లలోనూ, లేదా ఎవరికి ఎక్కడ మొక్కుబడి ఉంటే అక్కడి దేవాలయాలలోనూ నిర్వహిస్తుంటారు. అయితే తిరుమలలో ఆయా కార్యక్రమాలు చేయిస్తామని మొక్కుకున్నవారు తిరుమలకు వచ్చి, ఆయా కార్యక్రమాలను జరిపించుకోవడాన్ని ఒక వేడుకగా నిర్వహించుకోవడం పరిపాటి. ముఖ్యంగా తమ పిల్లలకు ఏవైనా గండాలు లేదా ఆపదలు కలిగితే, అటువంటప్పుడు వారు సవ్యంగా ఉంటే ఆయా కార్యక్రమాలను తిరుమల స్వామివారి సన్నిధిలో జరిపించుకుంటామని మొక్కుకుంటారు. స్వామి వారి అనుగ్రహంతో వారికి ఆ గండాలు లేదా ఆపదలు గడిచి, గట్టెక్కిన తర్వాత తిరుమల వచ్చి మొక్కుబడులు తీర్చుకోవడం పరిపాటి. సాధారణంగా ఈ కార్యక్రమాలను తిరుమల పౌరోహిత సంఘంలో నిర్వహిస్తారు. అలా నిర్వహించుకోవడాన్ని స్వామివారి ఆశీస్సులతో కూడిన అనుగ్రహంగా, తమ అదృష్టంగా భక్తులు భావిస్తారు. సత్యనారాయణ స్వామి వ్రతం దక్షిణాది రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా అనేక చోట్ల శ్రీసత్యనారాయణస్వామి వ్రతం చేయించే సంప్రదాయం ఉంది. ఈ పూజకు చాలా ఆదరణ ఉంది. విష్ణుమూర్తి అంశయైన శ్రీ సత్యనారాయణస్వామి అంటే హిందువులందరికీ అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరిజిల్లా అన్నవరంలో సుప్రసిద్ధ సత్యనారాయణస్వామి దేవాలయం ఉంది. అనేకమంది కుటుంబంతో సహా ఆ దేవాలయానికి వెళ్లి అక్కడ సత్యనారాయణస్వామి వ్రతం, పూజలు చేస్తారు. ఈ కార్యాన్ని తిరుమల పౌరోహిత సంఘంలోనూ నిర్వహిస్తారు. ప్రార్థనా వివాహం (మరుమాంగల్యం) హిందూ సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న జంటలకు అనేక రకాల దోషాల నివారణ కోసం ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. వివాహం జరిగినా సంతానం లేకపోతేనో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలవంటి కారణాలతో ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. తొలుత కొత్తమాంగల్యం ధరిస్తారు. అనంతరం వివాహం సందర్భంగా కట్టిన తొలి మంగళసూత్రాన్ని శ్రీవారి హుండీలో సమర్పిస్తారు. అలా చేయడం వల్ల వివాహబంధంలోని ఆటంకాలు తొలగినట్లుగా భావిస్తారు. -
భక్తులే కాదు.. విరాళాలూ వెల్లువే!
ధార్మిక సంస్థ అయిన టీటీడీ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలతోపాటు ఎన్నెన్నో సామాజిక, సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోంది. టీటీడీ ఏర్పాటైన నాటినుంచి ఇప్పటివరకు భక్తులకు ఉపయోగకరమైన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. కొండ కు వచ్చే ప్రతి భక్తుడు ఉచితంగా భోజనం చేయడానికి అన్నదానం, కార్పొరేట్ వైద్యం అందుకోలేని నిరుపేద రోగుల కోసం ప్రాణదానం, కన్నవారి ఆదరణకు నోచుకోని అనాథ పిల్లల కోసం బాలమందిరం, నా అన్నవాళ్ళు లేని వృద్ధుల పునరావాసం కోసం కరుణాధామం, వినికిడి శబ్దానికి నోచుకోని చెవిటి చిన్నారుల కోసం శ్రవణం ప్రాజెక్టుల ద్వారా ధార్మికసంస్థ ఆపన్న హస్తం అందిస్తోంది. ప్రాథమికస్థాయి నుంచి యూనివర్శిటీ స్థాయి వరకు విద్యాదానం, ఆసుపత్రుల ద్వారా నిరుపేదలకు ఉచితవైద్యం అందిస్తోంది. ఇందుకోసం వెంకన్న భక్తులు పెద్దమొత్తంలో విరాళాలు సమర్పిస్తూ టీటీడీ పథకాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. వేల రూపాయలతో ప్రారంభమైన అనేక పథకాలు నేడు సుమారు రెండువేల పైబడటం విశేషం. టీటీడీ పథకాల కోసం భక్తులు ఇచ్చే విరాళాల మొత్తానికి భారత ఆదాయపన్ను చట్టం అధికరణం 80(జి) కింద పన్ను మినహాయింపు ఉంది. రూ.లక్ష,ఆపైన విరాళం ఇచ్చే దాతలకు టీటీడీ తిరుమలలో బస, శ్రీవారి దర్శనం, ప్రత్యేక బహుమానాలు అందజేస్తోంది. టీటీడీ ఈవో పేరుతోనే డీడీ, చెక్‌లు ఈ ట్రస్టులకు విరాళాలు ఇవ్వాలనుకుంటున్న దాతలు డిమాండ్ డ్రాఫ్టు, చెక్కులను కార్యనిర్వహణాధికారి, టీటీడీ, తిరుపతి పేరుతో సమర్పించాలి. ♦ రూ. కోటి, అంతకుమించి విరాళాలిచ్చేదాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.2,500 అంతకుమించి అద్దెతో వీఐపీ సూట్ కేటాయిస్తారు. దీనిని ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా పొందవచ్చు. ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులు ఐదుగురికి ఒక సంవత్సరంలో మూడు రోజులు ఉచితంగా వీఐపీ బ్రేక్ కల్పిస్తారు. మూడు రోజులపాటు సుప్రభాత దర్శనం కల్పిస్తారు. దాత అభీష్టం మేరకు సంవత్సరంలో ఒకరోజు తిరుమల ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందజేస్తారు. సంవత్సరంలో ఓసారి ప్రసాదంగా పది పెద్ద లడ్డూలు, పది మహాప్రసాదం ప్యాకెట్లు ఇస్తారు. ♦ సంవత్సరానికి ఒకసారి ఒక శాలువా, ఒక రవికగుడ్డ బహూకరిస్తారు. ♦ దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన వెండి పతకంతో పాటుగా ఒక ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు. ♦ దాతలు తమ పేరుతో విరాళం ఇస్తే ఆ దాత జీవితకాలం; సంస్థలు, సమిష్టి దాతలతో విరాళం ఇస్తే 20 సంవత్సరాల పాటు టీటీడీ సదుపాయాలు అందుతాయి. ఈ పథకానికి ఆదాయపు పన్ను మినహాయింపు ప్రయోజనాలు వర్తిస్తాయి. దాత కోరిన విధంగా ఒకసారి శ్రీనివాస మంగాపురంలో సర్వకామప్రద లక్ష్మీ శ్రీనివాస మహాయజ్ఞం నిర్వహిస్తారు. లక్ష, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు... ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో ఒకరోజు రూ.100 అద్దె గది ఉచితంగా కేటాయిస్తారు. ♦ దాత, కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో ఒకరోజు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ ఏడాదిలో ఒకసారి ఆరు చిన్నలడ్డూలు, శాలువా, జాకెట్టు పీస్ బహూకరిస్తారు. ♦ రూ.ఐదు లక్షలు, అంతకు మించి విరాళాలిచ్చే దాతలకు... ♦ దాతతోపాటు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), సంవత్సరంలో మూడు రోజులు డోనర్స్ కౌంటరులో ఉచిత లేదా అద్దె చెల్లింపు ప్రాతిపదికపై వీఐపీ వసతి కల్పిస్తారు. ♦ దాతకు, అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు), మూడు రోజులు సుపథం ప్రవేశం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ సంవత్సరంలో ఒకసారి పది చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక రవిక బట్ట బహూకరిస్తారు. దాతకు మొదటిసారి శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకం, ఐదు మహాప్రసాదం ప్యాకెట్లు అందజేస్తారు. రూ.పది లక్షలు, అంతకు మించి... ♦ దాతకు అతని కుటుంబ సభ్యులకు (ఐదుగురు) రూ.500 అద్దె వీఐపీ సూట్ గది యేటా మూడు రోజులు ఉచితంగా కేటాయిస్తారు. ♦ దాతకు, వారి కుటుంబ సభ్యులకు (ఐదుగురు) సంవత్సరంలో మూడు రోజులు బ్రేక్ లేదా ప్రారంభ సమయంలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ♦ సంవత్సరంలో ఒకసారి ప్రసాదంగా ఇరవై (20) చిన్న లడ్డూలు, ఒక శాలువా, ఒక జాకెట్టు పీస్ బహూకరిస్తారు. ♦ దాత మొదటిసారి తిరుమలను సందర్శించినపుడు శ్రీవారి ప్రతిమలతో కూడిన ఒక వెండి పతకంతో పాటుగా ఐదు గ్రాముల బంగారు డాలరు ఇస్తారు. వ్యక్తిగత దాతలు సదుపాయాలిలా పొందాలి ♦ దాతలు సంబంధిత ట్రస్టు ద్వారా పొందిన పాసు పుస్తకాన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద చూపించాలి. ♦ దాతతోపాటు ఐదు మందిని శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. వారి వివరాలు ముందస్తుగా పేర్కొనవలెను. వారి ఫొటో గుర్తింపు కార్డులను చూపించాలి. ♦ పాసుపుస్తకం, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఆ దాతపేరుతోనే ఇస్తారు. ♦ ప్రతిసంవత్సరమూ దాత జీవిత సర్టిఫికేట్‌ను దాతల విభాగం, టీటీడీకి సమర్పించాలి. ♦ దాత ఏవైనా కారణాలచేత తిరుమలకువచ్చి ప్రసాదాలు, బహుమానాలు, దర్శనాలు స్వీకరించలేకపోతే వారి లైఫ్ సర్టిఫికేట్, సంతకంతో కూడిన గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత వ్యక్తికి సూచించినట్లయితే వారికి సౌకర్యాలు కల్పిస్తారు. ఈ వివరాలు ముందస్తుగా తిరుమలలోని దాతల విభాగంలో తెలిపి, వారి అనుమతి పొందాలి. ♦ దాతతోపాటు పేర్కొన్న న లుగురు సభ్యుల పేర్లు జీవితకాలంలో మూడుసార్లు మాత్రమే తగిన కారణాలు తెలిపి టీటీడీ కార్యనిర్వహణాధికారి అనుమతితో మార్పు చేసుకోవచ్చు. ♦ ముందస్తుగా దాతలకు తెలపకుండానే పై సవరణలలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసుకోవడానికై టీటీడీకి సర్వహక్కులు కలవు. కంపెనీల, ట్రస్టులు, సంస్థలు సదుపాయాలిలా పొందాలి ♦ పాతపద్ధతి ప్రకారం, ఐదుగురు సభ్యులతో కూడిన కంపెనీ, ట్రస్టు, సంస్థలకు ఈ క్రింద పేర్కొన్న షరతులు వర్తిస్తాయి. ♦ కేవలం డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు, మేనేజింగ్ట్రస్టీ, ఎవరైనా భాగస్వాములు, ఉద్యోగస్థులు వారి కుటుంబసభ్యులకు మాత్రమే ఈ సదుపాయాలు వర్తిస్తాయి. ♦ డెరైక్టరు, మేనేజింగ్ డెరైక్టరు లేక కంపెనీ సెక్రటరీ, మేనేజింగ్ ట్రస్టీ లేక సంస్థలోని ఇతరసభ్యులు కేవలం ఐదుమంది పేర్లను పేర్కొంటూ గుర్తింపు పత్రాలు జతపరచి అధికారిక పత్రాలు సమర్పించాలి. ఈ పత్రాలను 15 రోజులలోపు తిరుమలలోని దాతల విభాగంలో అందజేసి ముందస్తు అనుమతి పొందాలి. ♦ డెరైక్టర్, మేనేజింగ్ డెరైక్టర్, మేనేజింగ్ ట్రస్టీలు, భాగస్వాములు, ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులు తగు గుర్తింపుకార్డు చూపించగలిగితేనే వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఇట్టి సంస్థలు మనుగడలోనే ఉన్నట్లు దాతల విభాగానికి తగు పత్రాల్ని సమర్పించాలి. ♦ ఈ సంస్థలకు సంబంధించిన పై వారు ఏ కారణం చేతనైనా తిరుమలకు వచ్చి దర్శనం, ప్రసాదం, బహుమానం తీసుకోని ఎడల ఆ సంస్థలకు సంబంధించిన సర్టిఫికేట్‌ను, అధికారిక గుర్తింపు పత్రాన్ని నిర్దేశిత సంతకంతో ఎవరికి ఆ సౌకర్యాలు కలుగజేయాలో తిరుమలలోని దాతల విభాగానికి ముందే తెలుపుతూ వారి నుండి ఉత్తర్వులు ముందే పొందాలి. ♦ దాత ఆ సంస్థలకు సంబంధించిన చిరునామాతో విరాళాలు ఇచ్చినపుడు వారికి ఆ సంస్థల పేర్లతోనే పాసుపుస్తకం, ఇన్‌కం ట్యాక్స్ మినహాయింపు సర్టిఫికేట్ ఇస్తారు. ♦ ఈ సవరణలు 05-11-2011 తర్వాత విరాళాలిచ్చిన దాతలకు వర్తిస్తాయి. ♦ విరాళాలను డిమాండు డ్రాప్టు లేదా చెక్కు ద్వారా మాత్రమే అందజేయాలి. డీడీతో పాటుగా దాత రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను జతచేస్తూ, దాత కు సంబంధించిన వివరాలు అంటే- దాతతో కలుపుకుని ఐదుగురి కుటుంబ సభ్యులపేర్లు, బంధుత్వం, వారి వయస్సు, చిరునామా తెలియజేయాలి. ♦ తిరుమలలో విరాళాలను ఇవ్వడానికి (చెక్కు లేదా డిమాండ్ డ్రాప్టు ద్వారా మాత్రమే) ఉపకార్యనిర్వహణాధికారి కార్యాలయం, డోనార్ సెల్, టీటీడీ, తిరుమల వద్ద సంప్రదించండి. (ఫోను నెంబర్లు- 0877-2263472, 3727) టీటీడీ ట్రస్టులివి... 1. శ్రీ వేంకటేశ్వర నిత్య అన్నప్రసాదం ట్రస్టు 2. శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు 3. శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టు 4. శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టు 5. శ్రీ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స, పరిశోధన, పునరావాస సంస్థ (బర్డు) 6. శ్రీ వేంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టు 7. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టు 8. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం 9. శ్రీ వేంకటేశ్వర పురాతన ఆలయ వారసత్వ పరిరక్షణ ట్రస్టు 10. శ్రీ వేంకటేశ్వర బాలమందిరం ట్రస్టు -
శ్రీవారి సేవలో తరించిన హైందవేతరులు
సనాతన హైందవ క్షేత్రమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని హిందువులతోపాటు హైందవేతరులు కూడా సేవించి తరించారు. వారు నిర్దేశించిన వాటిలో చాలావరకు టీటీడీ కూడా అనుసరిస్తూ భక్తులకు విశిష్ట సేవలు అందిస్తోంది. శ్రీవారి ఆలయంలో మన్రో గంగాళం ♦ మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరుగా ఉన్న సర్ థామస్ మన్రో తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుండడంతో అతని కార్యదర్శుల్లో ఒకరు తిరుమలేశునికి మొక్కుకోమని సలహా ఇచ్చారు. ఆ సలహాను స్వీకరించటంతోనే మన్రో కడుపునొప్పి తగ్గింది ♦ మొక్కుని తీర్చుకునేందుకు ప్రతిరోజూ ఒక గంగాళానికి సరిపడా మిరియాల పొంగలిని భక్తులకు ప్రసాదంగా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన్రో. అందుకోసం మన్రోగంగాళం పేరుతో, చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు తాలూకా, కోటబయలు అనే గ్రామం నుంచి వచ్చే ఆదాయాన్ని వినియోగించేలా ఒక శాశ్వత నిధి ఏర్పాటు చేశారు ♦ ఆ నిధితో ఏర్పాటు చేసిన ప్రసాదాల పంపిణీ వ్యవస్థ తిరుమల ఆలయంలో నేటికీ నిర్విఘ్నంగా అమలవుతోంది. వెంకన్నపై లార్డ్ విలియమ్స్ భక్తి విశ్వాసాలు ♦ బ్రిటిష్ప్రభుత్వంలోని ఉన్నతాధికారి లార్డ్ విలియమ్స్ దీర్ఘకాలిక రోగంతో బాధపడేవాడట. తనకు నయమైతే శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తానని మొక్కుకొనమన్న ఓ హిందూ అధికారి సూచన మేరకు విలియమ్స్ స్వామివారికి దణ్ణం పెట్టుకున్నాడట. ఆ వ్యాధి ఆ రోజు నుండి క్రమంగా నయమైంది ♦ దాంతో లార్డ్ విలియమ్స్ ‘చలిపండిలి’ పేరుతో తిరుపతి నుండి తిరుమలకు వచ్చే కాలిబాటలోని తొలిమైలులో (నేరేడు మాకుల ప్రాంతం) చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కాలినడకలో వచ్చే భక్తుల దాహార్తిని తీర్చింది ♦ ఈ సేవను ఇప్పటికీ టీటీడీ కొనసాగిస్తోంది ♦ షేక్ హుస్సేన్ అనే భక్తుడు తన తాత, తండ్రుల సంకల్పం మేరకు స్వామివారికి ఒక్కొక్కటి 23 గ్రాముల బరువు కలిగిన 108 బంగారుపూలను బహూకరించారు. ప్రతి మంగళవారం గర్భాలయ మూలమూర్తికి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఈ బంగారు పుష్పాలే వాడతారు ♦ స్వామి సన్నిధిలో బీబీ నాంచారమ్మ అనే మహ్మదీయ భక్తురాలు సేవ చేసినట్టు చరిత్ర. ఈమె భక్తి పారవశ్యంపై రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి మొగలు చక్రవర్తులైన అక్బర్, జహంగీర్ చిత్రాలు ఉన్న 500 నాణేలతో ఉన్న దండను శ్రీవారికి సమర్పించారు ♦ కింగ్‌జార్జ్, విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 నాణేలతో మరో హారాన్ని తయారు చేశారు. 1972కు ముందు ఈ హారాలనే వినియోగించేవారు నాదస్వర చక్రవర్తి షేక్ చినమౌలానా ♦ నాదస్వర విద్వాంసులుగా సేవలందించారు. ఆయన ఏకైక కుమార్తె వీవీ జాన్ కుమారులు షేక్ ఖాసీం, షేక్ బాబు తిరుమలేశుని ఆలయం నాదస్వర విద్వాంసులుగా సేవలు అందిస్తున్నారు. -
బ్రహ్మాండపతికి బ్రహ్మోత్సవాలు
తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం, రాత్రివేళల్లో స్వామి ఒక్కో వాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో భక్తులను కటాక్షిస్తాడు. వేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన. అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిది రోజుల ముందు మొదలయ్యేవిధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. అంకురార్పణతో ఆరంభం... వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంతమండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీతప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తనప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మ్రిత్సవం గ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో(కుండలు) -నవధాన్యాలను పోసి, వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా నిత్యం నీరుపోసి అవి మొలకెత్తేలా జాగ్రత్తపడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం బ్రహ్మాండనాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి, ఒక నూత్నవస్త్రం మీద గరుడుని బొమ్మని చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజ పటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ‘ఆదిశేషుడి’గా, చిన్నశేషవాహనాన్ని ‘వాసుకి’గా భావించవచ్చు. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు సర్వ విద్యా ప్రదాయిని అయిన శారదామాత రూపంలో హంస వాహనంపై ఊరేగుతారు. హంస పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంస వాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమ హంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోమందిరమని కూడా అర్థం ఉంది. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారు. సింహవాహనం మూడోరోజు ఉదయం సింహ వాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానే నంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. ముత్యపు పందిరి వాహనం మూడోరోజు రాత్రి శ్రీస్వామివారికి జరిగే సుకుమారసేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మంచిముత్యం లాంటి స్వచ్ఛమెన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం.. అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. ఈ విషయాన్ని తన భక్తకోటి గ్రహించాలనే స్వామివారు నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలురు అంటే రాజులందరికీ భూపాలుడు తానేనని ప్రపంచానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ, సందర్శన భాగ్యం జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్తజనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమ శివుడిని సైతం సమ్మోహ పరచి, క్షీర సాగర మథనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. ఈ అవతార సందర్శనం వల్ల మాయామోహాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి. గరుడవాహనం స్వామివారి వాహనం గరుత్మంతుడు. ఐదోరోజు రాత్రి తనకు నిత్యసేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్ర నామ మాల ధరించి మలయప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడవాహనంలో అలంకరిస్తారు. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు. గజ వాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజ వాహనారూఢుడైన స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు. చంద్ర ప్రభ వాహనం ఏడోరోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్ర ప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని ఈ రెండు వాహనసేవల ద్వారా స్వామి లోకానికి తెలియజేస్తారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామి ఎనిమిదో రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పున ర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామి ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరోరూపమైన చక్రత్తాళ్వార్‌కు వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు, దీర్ఘరోగాలు నశించి కష్టాలు తీరుతాయని విశ్వాసం. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని ఆవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు. -
సామాన్య భక్తులకూ సకల సదుపాయాలు!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారిగా డాక్టర్ దొండపాటి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించి సుమారు రెండుసంవత్సరాలవుతోంది. ఈ రెండేళ్ల పాలన కాలంలో ఆయన ఎన్నెన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. స్వామిని సందర్శించు కోవడానికి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, ఎంతోదూరం నుంచి వచ్చే సామాన్య భక్తులకు ఏ లోటూ లేకుండా ఉండేందుకు, వారికి సకల సదుపాయాలను కల్పించేందుకు రకరకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. వాటి అమలులో కూడా అంతే నిబద్ధతతో పని చేస్తున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాక్షి ఫన్డే ప్రత్యేకసంచికతో ఆయన పంచుకున్న అనుభూతులు, అనుభవాల సమాహారమిది... టీటీడీ ఈవోగా దాదాపు రెండేళ్లు పూర్తి చేసుకున్నారు కదా, దీనిపై మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ పరంగా బయటప్రాంతంలో పనిచేయటానికి, ధార్మిక సంస్థలో పనిచేయటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. భక్తుల మనోభావాలతో ముడిపడిన సంస్థను నడిపించటం కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ పరిధి దాటకుండా, వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకుంటున్నాము. సామాన్య భక్తులకు టీటీడీ సదుపాయాలు అందాలన్న లక్ష్యంతోనే ధార్మిక సంస్థ కార్యక్రమాలు సాగుతున్నాయి. అదే సందర్భంలో టీటీడీ ఉద్యోగుల సంక్షేమానికీ ప్రాధాన్యత ఇస్తున్నాము. 2015లో రెండు బ్రహ్మోత్సవాలు పర్యవేక్షించారు కదా, ఈసారి ఏ మార్పులు తీసుకొస్తారు? గత ఏడాది వచ్చిన రెండు బ్రహ్మోత్సవాలను చక్కగా నిర్వహించాం. ఈసారి కూడా ఉత్సవాల్లో మార్పులు ఉండవు కానీ, గతంలో జరిగిన లోపాలను సవరించుకుంటూ, వాహన సేవల్లో ఉత్సవమూర్తిని భక్తులందరూ దర్శించుకునే ఏర్పాట్లు పెంచాం. అదేసమయంలో ఆలయంలో మూలవర్ల దర్శనమూ త్వరగా లభించేలా ఏర్పాట్లు చేశాం. గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే ప్రారంభిస్తున్నారట..? నిజమే! వాహన సేవలు ఉదయం 9 నుండి 11 గంటలవరకు, తిరిగి రాత్రి 9 నుండి 11 గంటల వరకు నిర్వహించటం సంప్రదాయం. విశేషమైన గరుడవాహనసేవను దర్శించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తుల కోసం కేవలం గరుడ వాహన సేవను రాత్రి 8 గంటలకే నిర్వహించటం దశాబ్దకాలంగా అమలవుతోంది. ప్రస్తుతం అంతకంటే రెట్టింపు స్థాయిలో భక్తులు వస్తున్నారు. అందరికీ సంతృప్తికర దర్శనం కల్పించడం అసాధ్యం. పోనీ 8 గంటల నుండి అర్ధరాత్రి దాటే వరకు కొనసాగిస్తే ఆలయంలో ఏకాంతసేవ నిర్వహణకు అడ్డంకులు ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని పండితుల సూచన మేరకు రాత్రి 7.30 గంటలకే వాహనసేవ ప్రారంభించాలని నిర్ణయించాం. ఈ విధానం వల్ల లక్షలాది మంది భక్తులు గరుడ వాహన సేవను దర్శించే అవకాశం ఉంది. ఆలయంలో మూడు క్యూలైన్ల విధానం అమలు తీరు ఎలా ఉంది? చక్కగా ఉంది. దీనివల్ల భక్తులకు స్వామి దర్శనం సంతృప్తిగా లభిస్తోంది. తోపులాటలు తగ్గాయి. స్వామిని దర్శించుకునే భక్తుల శాతం 10 శాతానికి పైగా పెరిగింది. ఆలయంలో ఈ మూడు క్యూలైన్ల విధానం అమలుపై మరింత దృష్టి పెట్టాం. తోపులాటలు లేకుండా, సంతృప్తికరమైన దర్శనం కల్పించడంలో ఉన్న అవకాశాలన్నింటినీ తప్పక అమలు చేస్తాం. మరి రూ. 300 టికెట్ల ఆన్లైన్ బుకింగ్..? రూ.300 టికెట్లకు విశేష స్పందన ఉంది. ఇలా టికెట్లు పొందిన భక్తులకు కేవలం రెండు గంటల్లోనే స్వామి దర్శనం లభిస్తోంది. ఈ ఆన్లైన్ బుకింగ్ ద్వారా 2015-2016 మధ్యకాలంలో 57,12,737 మంది టికెట్లు పొందారు. వారంతా స్వామిని సంతృప్తిగా దర్శించుకున్నారు. టికెట్లు పొందినవారిలో తమిళనాడు 32.40 శాతం, ఆంధ్రప్రదేశ్ 24.77 శాతం, కర్ణాటక 14.75 శాతం ఉంది. దక్షిణభారతదేశంలో 85.36 శాతం, మిగిలిన ప్రాంతంలో 14.64శాతం బుకింగ్ జరిగింది. పోస్టాఫీసుల ద్వారా 2,42,634 టికెట్లు పొందారు. మొత్తం 109 దేశాల్లోని ప్రవాస భారతీయల్లో అత్యధికంగా ఈ రూ.300 టికెట్ల అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సుపథం ద్వారా సింగపూర్, మలేషియా, శ్రీలంక, అమెరికా, ఇంగ్లండ్, గల్ఫ్ దేశాల్లో మొత్తం 65, 864 మంది ప్రవాస భారతీయులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు. మీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి... ఇంటర్నెట్ ద్వారా భక్తులకు శ్రీవారి ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతోపాటు ప్రతినెలా మొదటి శుక్రవారం వేలాది సేవాటికెట్లు విడుదల చేస్తున్నాం. * ఆన్లైన్లో ముందస్తుగా గదులు బుక్ చేసుకునే సదుపాయం కల్పించాం. ఆక్యుపెన్సీ శాతాన్ని బాగా పెంచాం. భక్తులకు సదుపాయంతోపాటు స్వామికి ఆదాయం కూడా పెరిగింది. * తిరుమలలోని పీఏసీ-1, 2, 3, 4 తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో కాషన్ డిపాజిట్ లేకుండా లాకర్ల వసతి కల్పిస్తున్నాం. దాతలకు, ముందస్తుగా గదులు బుక్ చేసుకునే భక్తులకు డిపాజిట్‌ను రద్దు చేశాం. టీటీడీకి విరాళాలు అందిస్తున్న దాతల సౌకర్యార్థం డోనార్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను ప్రారంభించాం. దాతలు 48 గంటలలోపు డిజిటల్ పాసుపుస్తకం పొందేలా, ట్రస్టుల వారీగా ఇ-రిజిస్ట్రేషన్ చేసుకునేలా సౌకర్యం కల్పించాం. తిరుమలకు వచ్చే భక్తులకు త్వరగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు టీసీఎస్ సహకారంతో నెక్ట్స్‌జెన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాం. సేవా టికెట్లు, గదుల ముందస్తు బుకింగ్ గడువును 60 నుంచి 90 రోజులకు పెంచాము. భక్తులు సులభంగా కానుకలు సమర్పించేందుకు ఈ-హుండీ ప్రవేశ పెట్టాం. దీనిద్వారా కానుకలు సమర్పించే భక్తులకు పేమెంట్గేట్ వే చార్జీలు (కమీషన్ చార్జీలు) రద్దు చేశాం. 2015, మార్చి 21న ప్రారంభమైన ఈ-పబ్లికేషన్స్‌లో 3700 గ్రంథాలున్నాయి. * 5 భాషల్లో వెలువడుతున్న సప్తగిరి మాస పత్రికను 2016, జనవరి నెల నుండి రంగుల్లో అందిస్తున్నాం. శ్రీవేంకటేశ్వరస్వామికి షేర్లు, సెక్యూరిటీల రూపంలో విరాళాలు సమర్పించాలనుకునే భక్తులకోసం డీమ్యాట్ ఖాతా ప్రారంభించాం. టీటీడీ కాల్ సెంటర్‌కు ఫోన్ చేయాలనుకుంటున్న భక్తుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు: 1800425333333, 18004254141 అందుబాటులో ఉంచాం. వీటితోపాటు కొత్తగా వాట్స్ యాప్ నంబరు: 9399399399, ఈ-మెయిల్: Helpdesk@tirumala.org ప్రవేశపెట్టాం. శ్రీనరసింహస్వామి సన్నిధి ఎదురుగా గల లక్ష్మీదేవి విగ్రహం వద్ద నూతన హుండీని, ఆలయం ఎదురుగా శ్రీవారి వెండి, బంగారు, రాగి డాలర్ల విక్రయకేంద్రాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి శిలావిగ్రహాలను రెండు నెలల్లో, పంచలోహ విగ్రహాలను మూడు నెలల్లో తయారు చేసి దరఖాస్తు చేసుకున్న వారికి అందించేందుకు ఏర్పాట్లు చేశాం. రాతి విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఆలయాలకు ఉచితంగా, ఇతరులకు 75 శాతం సబ్సిడీపై అందిస్తున్నాం. అదేవిధంగా పంచలోహ విగ్రహాలను ఎస్సీ, ఎస్టీ, కాలనీల్లోని ఆలయాలకు 90 శాతం సబ్సిడీపై ఇతరులకు 75 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం భక్తులకోసం కొత్తకాంప్లెక్స్ను పూర్తిచేశాం. ఇక్కడ భక్తుల సౌకర్యార్థం లగేజి డిపాజిట్ కౌంటర్, అల్పాహారం, టీ, కాఫీ తదితర వసతులను ఏర్పాటు చేశాం. ఇదే తరహాలోనే కాలినడక భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం కాంప్లెక్స్ నిర్మించాం. ఆధునిక వసతులు కల్పిస్తాం. తిరుపతి, తిరుమలలోని అన్ని వసతిగృహాల్లో పరిశుద్ధ తాగునీటి కోసం ఆర్వో జలప్రసాద కేంద్రాలు ఏర్పాటు చేశాం. శ్రీవారి భక్తులకు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అల్పాహారం అందిస్తున్నాం. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే హాళ్లను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేశాం. భక్తుల సౌకరార్థం గాలి, వెలుతురు, పరిశుభ్రత మెరుగ్గా ఉండేలా వేచి ఉండే గదిని, టోకెన్ మంజూరు కౌంటర్లను ప్రారంభించాం. కల్యాణవేదికలో వివాహాలు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్‌ను ప్రారంభించాం. కల్యాణంలో పాల్గొనే వారికి వసతి, దర్శనం, లడ్డూప్రసాదాలను ఉచితంగా ఇస్తున్నాం. తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో రూ.40 కోట్ల వ్యయంతో అదనంగా ఎనిమిది ఆపరేషన థియేటర్లు, ఓపీ బ్లాక్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాం. స్విమ్స్‌లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందించేందుకు ఏటా రూ.25 కోట్లు ఆర్థిక సాయం అందించాం. మధురైలోని అరవింద నేత్ర వైద్యశాల శాఖను ఏర్పాటు చేసేందుకు తిరుపతిలో స్థలాన్ని కేటాయించాం. ఈ వైద్యశాలలో ప్రజలకు మెరుగైన కంటి వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఎస్వీబీసీ కి నూతన స్టూడియో, పరిపాలనా భవనాలను రూ.14.70 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తాం. త్వరలో ఎస్వీబీసీ తమిళ ఛానల్‌ను ప్రారంభిస్తాం. భవిష్యత్ ప్రాధాన్యతాంశాలు తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు ప్రాధాన్యత పెంచటం; అదే సందర్భంలో వీఐపీలకు వారి స్థాయిని బట్టి ప్రోటోకాల్ నిబంధనలు చక్కగా అమలు చేయటం. తిరుమలలో యాత్రిసదన్లను అభివృద్ధి చేయటంతోపాటు వాటి సంఖ్యను పెంచటం. తిరుమల క్షేత్రంలో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే చర్యలు అమలు చేయటం. భక్తులందరికీ రుచికరమైన అన్నప్రసాదాలు వితరణ చేయటం. నీటి ఆదాను పెంచటం. వృథానీటిని సమృద్ధిగా ఉద్యానవనాలకు వినియోగించటం. విద్యుత్ వాడకంలో భాగంగా ఎల్ఈడీ బల్బుల వినియోగం పెంచడం. సోలార్ విద్యుత్‌ను వినియోగంలోకి తీసుకురావడం, తద్వారా పర్యావరణానికి మేలు జరిగే చర్యలు చేపట్టడం. -
భక్తులే సేవకులు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు భక్తులే సేవ చేసే మహద్భాగ్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. ‘శ్రీవారి సేవ’ పేరుతో 2000వ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 195 మందితో ప్రారంభమైన ఈ స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో గతపదహారేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల మందికి పైగా సేవకులు సాటి భక్తులకు విశేష సేవలందించారు. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు సాటి భక్తులే సేవలందించే మహదవకాశాన్ని శ్రీవారి సేవ పేరుతో టీటీడీ కల్పిస్తోంది. సేవకులుగా నమోదు ఎలా చేసుకోవాలి? శ్రీవారి సేవకులుగా నమోదు చేసుకోవాలంటే నెల ముందుగా ‘ప్రజాసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానాలు, టీటీడీ పరిపాలనా భవనం, కె.టి.రోడ్, తిరుపతి-517501, ఫోన్ నంబరు: 0877-2264392’ చిరునామాకు లేఖ రాయాలి. పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ తరహాలో సాధారణ సేవకు కూడా ఆన్లైన్ నమోదు సౌకర్యం కల్పించారు. నమోదు చేసుకున్న వారిని సేవకు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు (ప్రొసీడింగ్స్) కాపీతోపాటు దరఖాస్తు పత్రం పంపుతారు. లేదా మొబైల్ ఫోన్‌కు సంక్షిప్త సమాచారం పంపుతారు. డ్రెస్‌కోడ్: పురుషులు: తెలుపురంగు దుస్తులు - స్త్రీలు: మావిచిగురంచుతో కూడిన నారింజరంగు చీర, మావిచిగురంచు రవిక శ్రీవారి సేవకులకు మార్గదర్శకాలు శ్రీవారి సేవకుల వయస్సు 18 నిండి 60 ఏళ్ల లోపు ఉండాలి సేవకు వచ్చే వారి సేవకులందరూ ఆరోగ్య ధ్రువీకరణ పత్రం (మెడికల్ సర్టిఫికెట్) కాపీ సమర్పించాలి దరఖాస్తులకు పాస్‌పోర్టు సైజు ఫొటో, గుర్తింపు కార్డు జత చేసి సేవాసదన్‌లో సమర్పించాలి సేవకులకు కాషాయ రంగు స్కార్ఫ్‌లు అందజేస్తారు. విధుల్లో ఉన్నప్పుడు శ్రీవారి సేవ స్కార్ఫ్‌లు ధరించాలి. సేవాకాలం ముగిసిన వెంటనే వాటిని తిరిగి సేవాసదన్‌లో అప్పగించాలి సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. కనీసం ఆరుగంటలపాటు సేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి బ్రహ్మోత్సవాల సందర్భంగా రెండు రోజుల ముందే సేవకు హాజరై శిక్షణ తీసుకోవాలి ఎల్లప్పుడూ ‘గోవింద’ నామాన్ని స్మరిస్తూ, సాటి భక్తులను కూడా ‘గోవిందా, శ్రీనివాసా’ అని సంబోధించాలి తిరునామం, తిలకం లేదా కుంకుమ, చందనం బొట్టు ధరించాలి సాటి భక్తులలోనే స్వామివారిని దర్శిస్తూ అంకితభావంతో సేవ చేయాలి శ్రీవారి సేవలో నిర్దేశించిన నియమ నిబంధనలు ఏదేని పరిస్థితుల్లో శ్రీవారి సేవకులు అతిక్రమిస్తే వారిని రెండేళ్ళ వరకు సేవకు అనుమతించరు తిరుమలలోని ఆస్థానమండపంలో ప్రతి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు శ్రీవారి సేవకులకు శిక్షణ తరగతులు జరుగుతాయి. 24 విభాగాల్లో శ్రీవారి సేవ: తిరుమలలో ప్రధానంగా 24 విభాగాల్లో సేవలందిస్తున్నారు. వీటిలో నిఘా, ఆరోగ్య, అన్నదానం, ఉద్యానవనాలు, వైద్య, లడ్డూప్రసాదం, శ్రీవారి ఆలయం, రవాణా, కళ్యాణకట్ట, పుస్తక విక్రయ శాలలతోపాటు మరికొన్ని ఉన్నాయి. అందించే సేవలివి: టీటీడీ పరిపాలనలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఈ సేవ ఎంతో దోహదం చేస్తోంది స్వామి దర్శనానికి వచ్చే క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులరద్దీని క్రమబద్ధీకరిస్తారు క్యూలైన్లు, కంపార్ట్మెంట్ల లో వేచి ఉండే భక్తులకు ఆహారం, మంచినీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేస్తారు అన్నప్రసాద భవనంలో భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తారు భక్తులు వెంట తెచ్చుకున్న లగేజీని, బ్యాగులను స్కాన్ చేస్తారు ఉద్యానవన విభాగంలో పూలమాలలు తయారు చేస్తారు పుస్తక విక్రయశాలల్లో పర్యవేక్షిస్తారు దర్శన క్యూలైన్లు, వైద్యశాలల్లో వయోవృద్ధులకు, రోగులకు సహకరిస్తారు ఉచిత చిన్న లడ్డూలు తయారు చేస్తారు లడ్డూ టోకెన్లు మంజూరు చేస్తారు వృత్తి నిపుణులైన వైద్యులు, ఇంజనీర్లు, మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇతర నిపుణులు అవసరమైనపుడు ఆయా విభాగాల్లో సేవలందిస్తున్నారు. ఇతర సేవా విభాగాలు: సాధారణ సేవతో పాటు టీటీడీ కొన్ని అర్హతలు, మార్గదర్శకాలు పాటిస్తూ పరకామణి సేవ, లడ్డూప్రసాద సేవ లాంటి ప్రత్యేక సేవలు ప్రవేశపెట్టింది. పరకామణి సేవ: శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన కానుకలను పరకామణి సేవకులు లెక్కించాల్సి ఉంటుంది. 2012లో ప్రారంభించిన ఈ సేవలో 2016, జూన్ 23 వరకు 402 బృందాల్లో 42,558 మంది సేవలందించారు. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం భక్తులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో లడ్డూ కౌంటర్లలో 2013, జనవరి 13న ప్రారంభమైన సేవలో 2016, జూన్ 23 వరకు 359 బృందాల్లో 18,014 మంది సేవలందించారు. సేవకులకు టీటీడీ ప్రత్యేక వసతులు బస: పురుషులు, మహిళలు కలిపి మొత్తం 2300 మంది శ్రీవారి సేవకులకు బస ఉంది. శ్రీవారి సేవాసదన్‌లో సుమారు 700 మంది పురుష సేవకులకు, పీఏసీ-3లో 1600 మంది మహిళా సేవకులకు బస ఉంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు, వేసవి సెలవులు, వైకుంఠ ఏకాదశి లాంటి రద్దీ రోజుల్లో 5000 మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తారు. ఇందుకోసం అదనంగా పీఏసీ-2లో కొన్ని గదులను కూడా ఆ సమయంలో వినియోగిస్తారు. వారం రోజుల పాటు తోటి భక్తులకు సేవ చే స్తే ఎనిమిదోరోజు సుపథం మార్గం గుండా శ్రీవారి ఉచిత దర్శనం కల్పించి, రాయితీపై లడ్డూలు అందజేస్తారు. తిరుపతిలో శ్రీవారి సేవ 2014, మార్చి7న తిరుపతిలోని విష్ణునివాసం వసతిగృహంలో శ్రీవారి సేవ కార్యాలయం ప్రారంభించారు ఇప్పటివరకు 49,988 మంది శ్రీవారి సేవకుల సేవలందించారు. తిరుపతిలో మూడు షిప్టుల్లో శ్రీవారి సేవకులకు సేవావిధులు నిర్వహించాలి టీటీడీ స్థానిక ఆలయాలతోపాటు అన్నప్రసాదం, గోసంరక్షణశాల, మార్కెటింగ్ విభాగం, కేంద్రీయ వైద్యశాల, రిసెప్షన్ విభాగం, విష్ణు నివాసంలో ఎస్కలేటర్ వద్ద సేవలందిస్తున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వరస్వామి ఆలయం, కోదండరామాలయం, లక్ష్మీనారాయణస్వామి ఆలయం, తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సేవలందిస్తున్నారు. శ్రీసత్యసాయి సేవాసమితి శిక్షణ: శ్రీవారి సేవకుల్లో సేవానిరతి, ధర్మచింతన మరింతగా పెంచడం ద్వారా భవిష్యత్తులో వారిని హిందూ ధర్మ రథసారథులుగా తీర్చిదిద్దాలని టీటీడీ భావిస్తోంది. ఇందులో భాగంగా పుట్టపర్తిలో అత్యున్నత ప్రమాణాలతో భక్తులకు సేవలందిస్తున్న శ్రీసత్యసాయి సేవాసమితి సహకారంతో తిరుమల, తిరుపతిలో శ్రీవారి సేవకులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు శిక్షణ ఇస్తున్నారు. ఈ సమయంలో ధ్యానం, భజన, 30 నిమిషాలపాటు ‘సేవ’ ప్రాశస్త్యంపై తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో ఉపన్యాసం ఉంటుంది. సేవకులు భక్తులతో మెలిగే విధానం, తిరుమలలో చేయాల్సినవి, చేయకూడనివి తదితర విషయాలపై శిక్షణ ఇస్తున్నారు టీటీడీలో విభాగాలవారీగా అందించాల్సిన సేవలపై టీమ్ లీడర్లకు శిక్షణ ఇస్తారు. తర్వాత ఆ టీమ్ లీడర్లు గ్రూపులోని సేవకులకు అవగాహన కల్పిస్తారు. రూ.70 కోట్లతో సేవాసదన్: తిరుమలలో సుమారు 4 వేల మంది సేవకులకు బస కల్పించేలా రూ. 70 కోట్ల వ్యయంతో అత్యాధునిక వసతులతో త్వరలో శ్రీవారి సేవాసదన్ నిర్మించనున్నారు. వీఐపీలూ శ్రీవారి సేవకులే! శ్రీవారి సేవలో సాధారణ భక్తులే కాకుండా వీఐపీలు కూడా పాలు పంచుకున్నారు. క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, జస్టిస్ ఈశ్వరయ్య, సినీహీరో చిరంజీవి కుటుంబ సభ్యుల వంటి వివిధ రంగాలకు చెందిన ఎందరెందరో దిగ్గజాలు శ్రీవారి సేవలో పాల్గొని సాటి భక్తులకు సేవ చేశారు. ఈ సేవలను మరింతగా విస్తరిస్తాం..! భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తున్నారు. ఇందులో రైతులు, వ్యాపారులు, యువత, మహిళలు, ఇంజనీర్లు, వైద్యులు, ఉపాధ్యాయులు, బ్యాంకర్లు... ఇలా ఎవరికి వారు స్వామి సన్నిధిలో ఏడు రోజుల పాటు సాటి భక్తులకు సేవచేసి అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నారు. పదహారేళ్లకాలంలో ఏడున్నర లక్షలమంది స్వచ్ఛందంగా భక్తులు సేవ చేసిన ఘనత టీటీడీకే దక్కింది. ఈ స్వచ్ఛంద సేవాకార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని సంకల్పించాము. - కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుమల జేఈఓ -
స్వచ్ఛ భారత్... స్వచ్ఛ తిరుమల
నిత్య జనసందోహంతో కూడిన తిరుమల క్షేత్రంలో టీటీడీ కార్పొరేట్ స్థాయిలో పరిశుభ్రత అమలు చేస్తోంది. టీటీడీతోపాటు ఔట్ సోర్సింగ్ సంస్థలతో వందశాతం పారిశుద్ధ్యం నిర్వహించే ఏర్పాట్లు చేసింది. కేంద్రప్రభుత్వ స్వచ్ఛభారత్ మిషన్కి తిరుమల ఎంపిక కావడంతో ప్రభుత్వరంగ సంస్థలు కోలిండియా, ఓఎన్జీసీ సామాజిక బాధ్యతగా నిధులు మంజూరు చేస్తున్నాయి. తిరుమలలో చేపట్టాల్సిన పలురకాల అభివృద్ధి పనులకు అవసరమైన రూ.26 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేసింది మురుగు నీటి శుద్ధి ద్వారా సమకూరిన 5 ఎంఎల్డీ నీటిని తిరిగి ఉద్యానవనాలు, శ్రీగంధం మొక్కలు, ఘాట్రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకానికి వాడుతున్నారు. ఇందుకోసం రూ.6 కోట్లు, ఘనవ్యర్థాల నిర్వహణకు రూ.1.5 కోట్లు, ప్రస్తుత విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్ఈడీ బల్బులు అమర్చేందుకు రూ.5.5 కోట్లు ఖర్చవుతోంది కాలుష్యాన్ని నివారించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, బ్యాటరీ కార్ల వినియోగానికి రూ.6 కోట్లు ఖర్చవుతుంది భక్తులకు పరిశుద్ధ తాగునీటిని అందించడానికిగానూ మరో 20 ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.2 కోట్లు ఖర్చవుతోంది. ఈ పనులు పూర్తి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. -
ఆభరణాల ఆనందనిలయుడు
బంగారు, వజ్ర. వైఢూర్య, మరకత, మాణిక్యాదుల అభరణాలు అలంకరణలో దేదీప్యమానంగా దర్శనమిస్తూ శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలిచిన భక్తుల కోర్కెలు తీరుస్తూ తిరుమల ఆలయంలో కొలువైనాడు. నాడు ఆకాశ రాజు నుంచి నేటి వరకు స్వామివారికి సమర్పించిన అమూల్యమైన ఆభరణాలు కానుకల రూపంలో స్వామి ఖజానాలో చేరిపోతున్నాయి. సాక్షాత్తూ స్వామికి అలంకరించే ఆభరణాలతోపాటు బాంకుల్లో డిపాజిట్ల రూపంలోని సుమారు 11 టన్నుల పైబడి బంగారం నిల్వల మదింపు అమూల్యం. ఆభరణాల జాబితాను టీటీడీ సిద్ధం చేసి భద్రపరిచింది. అందులో గర్భాలయ మూలమూర్తి అలంకరణలో అతిముఖ్యంగా 120, ఉత్సవవరులైన శ్రీదేవి, భూదేవి మలయప్పస్వామివారికి 383 ఆభరణాలు వాడుతున్నారు. ఆ జాబితాలోని ఆభరణ విశేషాలేమిటో తెలుసుకుందాం!! మూలవర్ల అలంకరణకు విశేష ఆభరణాలు ≈ బంగారు పీతాంబరం, బంగారు కవచం - 19.410 కేజీలు ≈ నవరత్నాలు పొదిగిన పెద్ద కిరీటం - 13.374 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన వామ్చెట్ బంగారు కటి హస్తం - 8.129 కేజీలు ≈ బంగారు సాలిగ్రామాల హారం - 8.150 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన బంగారు కత్తి - 7.420 కేజీలు ≈ 108 బంగారు శంఖాలు - 6.100 కేజీలు ≈ వైకుంఠ హస్తం చైనుతో సహా - 5.908 కేజీలు ≈ మకర కంఠి మొదటిభాగం - 5.616 కేజీలు ≈ బంగారు గొడుగు - 5.530 కేజీలు ≈ జెమ్చెట్ శంఖు - 4.013 కేజీలు ≈ జెమ్చెట్ చక్రం - 4.077 కేజీలు ≈ జెమ్చెట్ రెండు కర్ణపత్రాలు - 3.100 కేజీలు ≈ రెండు బంగారు నాగాభరణాలు - 3.320 కేజీలు ≈ పచ్చలు, తెలుపు, ఎరుపు రాళ్లు పొదిగిన బంగారు కిరీటం - 3.145 కేజీలు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప ఆభరణాలు ≈ మలయప్పస్వామివారి బంగారు కవచాలు - 3.990కేజీలు ≈ శ్రీదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.400 కేజీలు ≈ భూదేవి అమ్మవారి తొమ్మిది బంగారు కవచములు - 2.430 కేజీలు ≈ పద్మపీఠం - 2.869కేజీలు ≈ కొలువు శ్రీనివాసమూర్తి బంగారు తోరణం - 2.090 కేజీలు ≈ బంగారు పద్మాలు - 2.313 కేజీలు ≈ నూతన యజ్ఞోపవీతం - 2.043 కేజీలు ≈ 108 లక్ష్మీ డాలర్ల హారం - 2.560 కేజీలు ≈ బంగారు చేతి గంట - 2.794 కేజీలు ≈ కెంపులు పొదిగిన వైకుంఠ హస్త నాగాభరణం - 2.100 కేజీలు ≈ కెంపులు పొదిగిన బంగారు కఠికాహస్త - నాగాభరణం - 2.070 కేజీలు ≈ రత్నాలు పొదిగిన వజ్ర కవచ కిరీటం - 2.750 కేజీలు ≈ వజ్రాల కిరీటం - 2.935 కేజీలు ≈ బంగారు బిందె - 2.370 కేజీలు ≈ బంగారు గిన్నెలు - 2.080 కేజీలు ≈ బంగారు గోముఖ పళ్లెం - 2.085 కేజీలు ≈ శ్రీరాములవారి బంగారు ధనుస్సు, ఇతర ఆభరణాలు - 1.202 కేజీలు ≈ బంగారు తట్ట - 1.029 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు నడుము వజ్రకవచం - 1.831 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు కంఠ వజ్రకవచం - 1.661 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు పాదపద్మ వజ్రకవచం - 1.495 కేజీలు ≈ రత్నాలు పొదిగిన బంగారు వెనుక వజ్రకవచం - 1.837 కేజీలు ≈ సీమ కమలాలు పొదిగిన హారం - 1.020 కేజీలు ≈ మకర కంటి రెండవ భాగం - 1.552 కేజీలు ≈ బంగారుపళ్లెం - 1.195 కేజీలు ≈ వజ్రాలు పొదిగిన బంగారు కాసుల దండ - 1.955 కేజీలు ≈ సీమకమలాలు, పచ్చలు, కెంపులు పొదిగిన బంగారు కిరీటం - 1.893కేజీలు ≈ మకర కంటి మూడవ భాగం - 1.434 కేజీలు ≈ బంగారు చెంబు - 1.020 కేజీలు ఠి బంగారు బెత్తం - 1.380 కేజీలు ≈ రత్నాలు చెక్కిన బంగారు కిరీటం - 1.185 కేజీలు ≈ రాళ్లకొండై బంగారు కిరీటం - 1.365 కేజీలు ≈ బంగారు కి రీటం - 1.190 కేజీలు జి బంగారు బిందె-1.995కేజీలు ≈ ఉత్సవవర్ల బంగారు కిరీటం-1.170 కేజీలు తిరుమల ఆలయంలో ఆభరణాల లెక్కలివి ♦ శ్రీవారి మూలమూర్తి ఆభరణాలు - 120 ♦ ఉత్సవ మూర్తులైన శ్రీదేవి, భూదేవి, మలయప్ప ఆభరణాలు-383 ♦ రాఘోజీ వారి తిరువాభరణాల రిజిస్టర్- 07 ♦ వెంకటగిరి రాజావారి తిరువాభరణాల రిజిస్టర్ - 11 ♦ వెండి ఆభరణాలు - 223 ♦ రాగి, ఇత్తడి, బంగారు తాపడం చేసిన వస్తువులు - 17 ♦ ముల్లెలు - 09 ♦ శ్రీవారి భాష్యకార్ల ఆలయానికి సంబంధించిన ఆభరణాలు, వస్తువులు -13 ♦ రికార్డు రూములోపల గల ఆభరణాలు - 08 ♦ తిరుమల శ్రీ భూ వరాహస్వామి ఆలయానికి చెందిన ఆభరణాలు - 28 తిరుపతి, అనుబంధ ఆలయాల్లో ⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు వస్తువులు-128 ⇒ తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయానికి సంబంధించిన వెండి వస్తువులు-253 ⇒ తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలోని బంగారు, రత్నాల ఆభరణాలు-162 ⇒ అమ్మవారి వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు-97 ⇒ అమ్మవారి ఆలయంలోని లోహవిగ్రహాలు, శిలా విగ్రహాలు - 23 ⇒ అమ్మవారి ఆలయంలోని రాగి, ఇత్తడి వస్తువులు-33 ⇒ తిరుచానూరు ఆలయంలోని శ్రీసుందరరాజ స్వామి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-44 ⇒ శ్రీకపిలేశ్వర స్వామి ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-73 ⇒ పంచలోహ విగ్రహాలు-148 ⇒ కార్వేటి నగరంలోని శ్రీవేణుగోపాలస్వామి వారి ఆలయంలోని ఆభరణాల వస్తువులు-78 ⇒ వేణుగోపాలస్వామి వారి బంగారు తాపడం చేసిన ఉత్సవ మూర్తుల ఆభరణాలు, వస్తువులు-31 ⇒ నగరిలోని కరియ మాణిక్యస్వామి ఆలయంలోని ఆభరణాలు వస్తువులు-36 ⇒ బుగ్గ అగ్రహారంలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-13 ⇒ నారాయణవనం శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, సంబంధిత ఆలయాలలోని బంగారు, వెండి ఆభరణాలు వస్తువులు-92 ⇒ నారాయణవనం శ్రీ అవనాక్షమ్మ ఆలయంలోని ఆభరణాలు, వస్తువులు-13 ⇒ నాగలాపురంలోని వేదనారాయణ స్వామి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి, రాగి ఆభరణాలు-54 ⇒ తిరుపతి పాదాల మండపంలోని శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని ఆభరణాలు బంగారు, వెండి, రాగి ఆభరణాలు-71 ⇒ తిరుపతిలోని శ్రీకోదండరామ స్వామి ఆలయంలోని బంగారు, రాగి ఆభరణాలు -47 ⇒ వెండి ఆభరణాలు వస్తువులు-92 ⇒ శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోని బంగారు ఆభరణాలు-112 - వెండి, రాగి వస్తువులు-20 ⇒ ఉత్తరాంచల్ రాష్ట్రంలోని రుషికేష్ ఆంధ్రా ఆశ్రమానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు-167 ⇒ అప్పలాయగుంట శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-56 ⇒ వాయల్పాడులోని శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయానికి సంబంధించిన బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు-77 శ్రీవారి ఆభరణాల విశేషాలెన్నెన్నో... ⇒ విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవ రాయలు తిరుమలదేవుడికి వెలకట్టలేనన్ని ఆభర ణరాశులను కానుకగా సమర్పించారు. ఇతర సామ్రాజ్యాలపై దాడులకు వెళ్ళి విజయుడై తిరిగి వస్తూ రాయలవారు స్వామివారిని దర్శించుకుని అమూల్యమైన ఆభరణాలు సమర్పించారు. వాటిలో అతిముఖ్యమైనవి. ⇒ 13.360 కిలోలు బరువుగల 3,308 కారెట్లు కలిగిన నవరత్న కిరీటం, త్రిసర హారం, మూడుపేటల నెక్లెస్, ఇంద్రనీలాలు, గోమేధికాలు, మాణిక్యాలు, కర్పూర హారతి కోసం 25 వెండిపళ్ళాలు, శ్రీవారి ఏకాంత సేవకు అవసరమైన 374 క్యారెట్ల బరువుగల రెండు బంగారు గిన్నెలు. బంగారు తీగె, రత్నాలతో చేసిన కంఠాభరణాలు, బంగారు కత్తి, రత్నాలు, మణులు పొదిగిన ఒర, ఎర్రలు, పచ్చలు పొదిగిన 132 క్యారెట్లు బరువున్న కత్తి, పచ్చలతో తయారు చేసిన పిడి కత్తి, మణులతో తయారు చేసిన పిడికత్తి ఒర, 87 క్యారెట్ల బరువుగల మణుల పతకం. శ్రీవారికి టీటీడీ తయారు చేయించిన ఆభరణాలు... వజ్రకిరీటం - 1940 వజ్రాల హారం - 1954 వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు - 1972 వజ్రాల కటిహస్తం - 1974 వజ్రాల కిరీటం - 1986 (బరువు 13.360 కేజీలు, అప్పటి విలువ రూ.5 కోట్లు) ⇒ శ్రీవారికి ఉన్న అరుదైన ఆభరణాల్లో గరుడ మేరు పచ్చ ఉంది. దీని బరువు 500 గ్రాములు. ⇒ స్వామివారికి అధికారికంగా ముఖ్యమైన ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటితోపాటు వినియోగంలోలేని పురాతన కిరీటాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్రకిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఒకేరకమైన ఆభరణాలు రెండు నుంచి మూడు సెట్లలో అనేక ఆభరణాలు ఉన్నాయి. -
వేంకటేశ్వరుని సేవలో వేయేళ్ల రామానుజుడు
ధర్మానికి హాని కలిగినపుడు భగవంతుడు అవతరిస్తాడని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. కలియుగంలో ధర్మోద్ధరణకు శ్రీమహావిష్ణువు ఉద్యుక్తుడయ్యాడు. త్రేతాయుగంలో శ్రీరామునికి లక్ష్మణుడిగా సేవలందించిన తన ప్రియ భక్తుడైన ఆదిశేషుడిని భగవద్రామానుజులుగా అవతరింపజేసి ధర్మరక్షకుయ్యాడు. కారణజన్ముడైన రామానుజుడు ధర్మరక్షణకు బీజాలు నాటి, సనాతన హైందవ ధర్మరక్ష ణతోపాటు సాంఘిక అసమానతలను రూపుమాపి సమతాభావాన్ని చాటారు. వైదిక ధర్మాన్ని విశ్వవ్యాపితం చేసి ఆదర్శప్రాయుడయ్యారు. తిరుమల క్షేత్రాన్ని విష్ణుక్షేత్రంగా నిరూపించారు. విశిష్టాద్వైత సిద్ధాంతంతో భక్తి మార్గాన్ని విస్తృతం చేశారు. శ్రీభాష్యాది గ్రంథాలతో ఆత్మతత్త్వాన్ని ఆవిష్కరించారు. కేశవసోమయాజి, కాంతిమతి దంపతులకు శ్రీరామానుజులు క్రీ.శ. 1017వ సంవత్సరంలో పింగళనామ సంవత్సరం చిత్తిర (మేష) మాసం ఆర్ద్రానక్షత్రంలో కంచి సమీపంలోని శ్రీపెరుంబుదూరులో జన్మించారు. వీరి మేనమామ తిరుమలనంబి (శ్రీశైలపూర్ణులు). ఆయన తిరుమల నుంచి శ్రీపెరుంబుదూరు వచ్చి, బాలునిలోని దివ్య తేజస్సు, లక్షణాలు గుర్తించి ‘ఇైళె యాళ్వార్’ (రామానుజుడు- లక్ష్మణుడు) నామకరణం చేశారు. ఐదేళ్లకు అక్షరాభ్యాసం, ఎనిమిదేళ్లకు ఉపనయనం చేశారు. వేదాది విద్యలన్నీ కారణజన్ముడైన రామానుజునికి కరతలామలకాలయ్యాయి. పదహారేళ్ల ప్రాయంలో ఆయనకు వివాహం జరిగింది. భార్య పేరు రక్షకాంబ. రామానుజులు కంచిలో యాదవప్రకాశుల దగ్గర వేదాంత విద్యను అభ్యసించారు. రామానుజుడి మేధావిలాసానికి పెద్దలు ముచ్చటపడేవారు. యాదవప్రకాశులు ఉపనిషత్ వాక్యాలకు చెప్పే వ్యాఖ్యానాలను రామానుజులు నిశితంగా గమనించేవారు. కొన్ని సందర్భాల్లో యాదవప్రకాశుల వివరణ సమంజసంగా తోచనప్పుడు తానే బుద్ధియుక్తంగా వివరణ ఇచ్చేవారు. అత్యుత్తమ శిష్యుడు ఆచార్యులు ఎంతటి కఠిన పరీక్ష పెట్టినా, దానికి నిలవడం ఉత్తమ శిష్య లక్షణం. గోష్ఠీపురం (తిరుక్కొట్టియూర్) అనే ఊరిలో గోష్ఠీపూర్ణులు (తిరుక్కొట్టియూర్ నంబి) వద్ద శ్రీకృష్ణ చరమ శ్లోకం ‘సర్వధార్మాన్ పరిత్యజ్య’ అనే గీతాశ్లోకంలోని అపూర్వ అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయని రామానుజులు తెలుసుకున్నారు. వాటిని స్వయంగా గ్రహించేందుకు తిరుక్కోట్టియార్ వెళ్లారు. నంబి మాత్రం రామానుజుడిని పరీక్షించారు. ‘‘ఈసారి కాదు, మళ్లీ రండి’’ అంటూ పద్దెనిమిది పర్యాయాలు పరీక్షించినా.. ఏమాత్రం విసుగు చెందకుండా రామానుజుడు శ్రీరంగం నుంచి తిరుక్కోట్టియూర్కు వెళ్లి నంబికి విశ్వాసానికి కల్గించారు. తర్వాత వారి ద్వారా చరమశ్లోకార్థాలను గ్రహించి, అత్యుత్త్తమ శిష్యుడిగా ప్రఖ్యాతి గడించారు. ఆదర్శవంతమైన ఆచార్యుడు తాను నేర్చిన విద్యను శిష్యులకు కూలంకషంగా ఉపదేశించడం ఉత్తమ ఆచార్య లక్షణం. తిరుక్కొట్టియూర్ నంబి చరమ శ్లోకార్థాలను ఉపదేశించేటపుడు, యోగ్యతను పరీక్ష చేయకుండా వాటిని ఎవ్వరికీ చెప్పవద్దని రామానుజుల దగ్గర ప్రమాణం చేయించుకొన్నారు. కానీ, తనకు ఆంతరంగిక శిష్యులు కూరేశులు, దాశరథికి ఆ అర్థాలను తెలుపకుండా ఉండలేనని, అందుకు అనుజ్ఞ ఇవ్వవలసినదని ప్రార్థించారు. నంబి సమ్మతిని పొంది తర్వాత వారికి ఉపదేశించారు. సహ జనులపై సమతాభావం కర్ణాటకలోని వైష్ణవ క్షేత్రం మేల్కోటె. అక్కడి అర్చామూర్తి మరుగున పడిపోయిన విషయాన్ని భగవానుడు స్వప్నంలో రామానుజులకు సాక్షాత్కరింపజేయగా, మేల్కోటెను పాలించే విష్ణువర్ధనుడి సహకారంతో ఆ మూర్తిని కనుగొని, ఆలయంలో పునఃప్రతిష్ఠించారు. ఈ కృషిలో తమకు సహకరించిన వారు ఆలయప్రవేశార్హత లేనివారుగా పరిగణింపబడే ఒక తెగ వారిపట్ల కృతజ్ఞత వ్యక్తీకరించారు. వారికి సంవత్సరంలో ఒకనాడు ఆలయంలో ప్రవేశించి, స్వామిని దర్శించుకొనే అవకాశాన్ని కల్పించారు. కాంచీపూర్ణులనే యామునుల శిష్యులు బ్రాహ్మణేతర కులానికి చెందినవారు. వారి శుద్ధమైన జ్ఞానాన్ని, అనుష్ఠానాన్ని రామానుజులవారు గుర్తించారు. కానీ, ఆకాలంలో సమాజంలోని కట్టుబాటును ఆచరించిన నంబి సున్నితంగా తిరస్కరించినా రామానుజులు మాత్రం సమతావాదాన్ని వీడలేదు. ప్రతిదినం కావేరీనదిలో స్నానం చేసి తిరిగి వచ్చేటపుడు రామానుజులు ధనుర్దాసు చేతిని ఆసరాగా తీసుకుని తిరిగి వచ్చేవారట. సకలశాస్త్ర పండితుడు శాస్త్రాలు అధ్యయనం చేయడం వేరు, అంశాల అనుకూల తర్కాలు ప్రయోగించి వాదించడం వేరు. ఈ సామర్థ్యం రామానుజులకు మెండుగా ఉండేది. తిరుమల ఆలయంలోని అర్చామూర్తి శ్రీవేంకటేశ్వరుడు శంఖచక్రహస్తుడై ఉండేవాడు కాడు. ఈ కారణంచేత తిరుమలలోని మూర్తి ఎవరు? అనే విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. వీటిని పరిష్కరించి, యథార్థ నిర్ణయం చేయడం కోసం తిరుమల ప్రాంతాన్ని పాలించే యాదంరాజు రామానుజులను ఆహ్వానించటంతో తిరుపతికి వచ్చారు. పురాణాగమాలు, ఆళ్వార్ల ప్రబంధాల ప్రమాణాల ప్రకారం ‘‘తిరుమలలోని మూర్తి శ్రీవేంకటేశ్వరుడే’’ అని నిరూపించారు. ఈ వాదప్రతివాదాలన్నీ రామానుజుల శిష్యులై న అనంతాచార్యులు తన ‘శ్రీవేంకటాచలేతిహాసమాల’ అనే గ్రంథంలో విశదీకరించారు. రచనా నైపుణ్యం రామానుజులు గొప్ప కవి కూడా. గీతాభాష్యంలో, శ్రీ భాష్యంలో, వేదార్థ సంగ్రహంలో పలుచోట్ల గల రామానుజుల సూక్తులు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. రామానుజులు బ్రహ్మసూత్రాలకు విశిష్టాద్వైతపరంగా భాష్యాన్ని విరచించి, దాన్ని కాశ్మీర్‌లోని శారదాపీఠానికి సమర్పించారు. శారదాదేవి దానిని శిరసావహించి, ‘‘భాష్యమంటే మీదే భాష్యం. మీరే భాష్యకారులు. ఇకపై మీ భాష్యం శ్రీ భాష్యమనే పేరులో ఖ్యాతి పొందుతుంది.’’ అని ప్రశంసించి, హయగ్రీవుల అర్చామూర్తిని రామానుజులకు బహూకరించారు. ఇతర సంప్రదాయానికి చెందిన విద్వాంసులు సైతం రామానుజుల శ్రీభాష్య రచనలోని మాధుర్యాన్ని మెచ్చుకుని ‘శ్రీవైష్ణవకాదంబరి’ అనే బిరుదుతో ప్రశంసించడం శ్రీ భాష్య ఘనతను, విశిష్టతను వ్యక్తం చేస్తున్నది. ద్రావిడభాషా ప్రావీణ్యం రామానుజులకు ద్రావిడభాషలో పాండిత్యం లేదని, అందువల్లనే వారు తమ గ్రంథాలను సంస్కృతంలో మాత్రమే రచించారని, ద్రావిడ గ్రంథాన్ని దేనినీ రచించలేదని కొందరి వాదన. కానీ. ఆళ్వార్ల ప్రబంధాలకు వ్యాఖ్యానాలు రచించిన శ్రీవైష్ణవ గురు పరంపరలోని పలువురు పూర్వాచార్యులచే తమ వ్యాఖ్యలలో నూటికిపైగా గల సందర్భాలలో రామానుజులు ఆయా ఆళ్వార్ల పాశురాలను విలక్షణమైన రీతిలో అన్వయించారు. అపూర్వమైన అర్థాలను తెలిపారు. ఇవన్నీ రామానుజుల వారి ద్రావిడ భాషాపాండిత్యానికి, సందర్భోచిత సమన్వయ సామర్థ్యానికి చిహ్నాలు. ఆలయ నిర్వహణలో సంస్కరణలు శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయ కైంకర్య నిర్వహణలో రామానుజుల కాలానికి ముందు పలు లోపాలు ఉండేవి. తన శిష్యుడైన కూరేశులద్వారా రామానుజులు ఆలయ నిర్వహణలో పలు సంస్కరణలు చేపట్టారు. ఆ విధంగానే తిరుమల ఆలయంలో కూడా పలు ఆచార వ్యవహారాలను, కట్టుబాట్లను సంస్కరించి సరిచేశారు. మేల్కోటె ఆలయంలో కూడా 52 మంది శ్రీవైష్ణవ కుటుంబాలను ద్రావిడ దివ్యక్షేత్రాలనుంచి రప్పించి, వారిని ఆయా సేవలలో నియమించారు. ఇప్పటికీ అక్కడ ఆ వ్యవస్థ కొనసాగుతుండటం విశేషం. సింహాచలం, శ్రీకూర్మం, అహోబిలం మొదలైన క్షేత్రాల్లోనూ తగిన సంస్కరణలను చేశారు. వైష్ణవాలయాల్లో జీయర్ వ్యవస్థకు పునాది రామానుజులు తిరుమల ఆలయంలో పలు సమయాచారాలను సంస్కరించారు. వ్యవస్థను సుస్థిరం చేశారు. వాటి నిర్వహణ బాధ్యతను తమ శిష్యులైన అనంతాచార్యులకు అప్పగించి, శ్రీరంగానికి వెళ్ళిపోయారు. కొంతకాలానికి అనంతాచార్యులు వృద్ధులైనందున, ఆ బాధ్యత కోసం అనంతాచార్యుల శిష్యులైన విష్వక్సేన ఏకాంగి అనే బ్రహ్మచారిని నియమించారు. ఆయనకు సన్యాసాశ్రమాన్ని ఇప్పించారు. శ్రీ వేంకటనాథ శఠగోపయతి అనే పేరు పెట్టి, ఆలయ కైంకర్య బాధ్యతను అప్పగించారు. శ్రీవైష్ణవ సన్యాసికి తమిళంలో ‘జీయర్’ అని పేరు. మొదట ఒక జీయర్ను మాత్రమే నియమించినా, తర్వాత ఆ జీయర్‌కు ఉత్తరాధికారి(చిన్నజీయర్)గా ఇంకొకరిని కూడా నియమించారు. తర్వాత ఈ విధమైన జీయర్ వ్యవస్థ శ్రీరంగం, తిరునారాయణపురం (మేల్కోటై)లో, కంచిలో కూడా ఏర్పడిన ఈ వ్యవస్థ ఈనాటికీ ఈ క్షేత్రాలలో కొనసాగుతోంది. జీయర్ పర్యవేక్షణలో ఆ ఆలయాల సమయాచారాల నిర్వహణ సాగుతుండటాన్ని నేటికీ గమనించవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి సేవలో .. వైకుంఠంలో ఆదిశేషుడుగా, తర్వాత త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరామునిగా, కలియుగంలో భగవద్రామానుజులుగా అవతరించారు. తన నూట ఇరవై ఏళ్ల ధార్మిక జీవనంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రాచీనమైన వైష్ణవమతాన్ని ఉద్ధరించారు. సంఘం చేత వెలివేయబడిన నిమ్న కులాలవారికి శ్రీవైష్ణవ మత స్వీకార అర్హతను కలిగించి, దాదాపు సహస్రాబ్ది కిందటే సాంఘిక సంస్కరణలకు నాంది పలికారు. సనాతన వైదిక సంస్కృతి, హైందవ ధర్మాన్ని పరిపుష్టం చెయ్యడానికి ఆసేతు హిమాచలం పర్యటించారు. శ్రీవైష్ణవ సిద్ధాంతానుసారంగా వ్యాఖ్యాన గ్రంథాలు రచించారు. ఎన్నో వైష్ణవ ఆలయాలను, శ్రీవైష్ణవ క్షేత్రాలను అభివృద్ధి చేశారు. ఆయా క్షేత్రాల్లో, ఆలయాల్లో అస్తవ్యస్తంగా, అసమగ్రంగా ఉన్న పూజలు, ఉత్సవాలు, ఆగమశాస్త్రాల నియమానుసారం సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దారు. తిరుమల వేంకటాచల క్షేత్రంలో అర్చనాది కార్యక్రమాలను, ఉత్సవాలను పటిష్ఠం చేశారు. తిరుమల క్షేత్రంలో వైకుంఠనాథుడైన శ్రీనివాసుడే సాలగ్రామ శిలామూర్తిగా వెలిశాడని, ఆ స్వామే మళ్లీ విఖనస మహర్షిగా అవతరించి, తన అర్చనా విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడని, వైఖానస ఆగమం ప్రకారమే పూజలు జరిపి తీరాలని నిర్ణయించారు. శేషాచలక్షేత్రానికీ శేషాంశంతో అవతరించిన రామానుజులవారికీ విడదీయరాని, విడదీయలేని దివ్య అనుబంధం పెనవేసుకుంది. మోకాళ్లతో పాకుతూ తిరుమల కొండకు తిరుమలకొండ సాక్షాత్తూ ‘శ్రీనివాస పరబ్రహ్మ’ అని ఆళ్వార్లు కీర్తించారు. వాళ్లలో కొందరు తిరుపతికి వచ్చినా, కొండ కింద నుంచే నమస్కరించారు. వాళ్ల అభిప్రాయాన్ని రామానుజులు కూడా గౌరవించి, అనుసరించారు. కొండను పాదాలతో తొక్కుతూ వెళ్లకూడదని నిశ్చయించారు. గురువు తిరుమలనంబి, శిష్యుడైన అనంతాళ్వారు, ఆలయంలో జరిగే అర్చనాదులు తీర్చదిద్దాలంటూ చేసిన అభ్యర్థన మేరకు భగవద్రామానుజులవారు కేవలం మూడుసార్లు మాత్రమే తిరుమల కొండపైకి వచ్చారు. అది కూడా మోకాళ్లతో పాకుతూ కఠోరదీక్షతో మాత్రమే కొండ మీదకు వెళ్లారు. శ్రీనివాసుడికి శంఖచక్రాలంకరణ పరమభక్తుడైన తొండమాన్ చక్రవర్తికి శత్రువుల నుంచి రక్షణగా శ్రీవేంకటేశ్వరస్వామి తన శంఖుచక్రాలను బహూకరించారు. మళ్లీ తిరిగి ఇవ్వడానికి రాగా, వాటిని ఈ కలియుగంలో ధరించనంటూ స్వామి స్వీకరించలేదు. అందువల్ల శంఖుచక్రాలు లేని తిరుమలలోని అర్చామూర్తి శివుడని వీరశైవులు వాదించారు. వారి వాదనను రామానుజులు ఖండించారు. వక్షఃస్థల మహాలక్ష్మితో విరాజిల్లుతూ ఉన్న ఈ స్వామివారికి, తన తపశ్శక్తి చేత శంఖుచక్రాలను స్వయంగా స్వామివారే ధరించునట్లు చేసి ఆ అర్చామూర్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశఅయిన శ్రీవేంకటేశ్వర స్వామివారే అని నిరూపించారు. తిరుమలను వైష్ణవ క్షేత్రంగా ప్రతిష్ఠించిన ఘనత శ్రీరామానుజులవారిదే. బంగారు వ్యూహలక్ష్మి శ్రీవారి వక్షఃస్థలంలో ఉన్న ‘వ్యూహలక్ష్మి’ని భక్తులందరూ దర్శించడం కుదరదు. అందుకే రామానుజులు ‘బంగారు లక్ష్మి’ ప్రతిమను అలంకరింపజేశారు. ఆనాటినుంచి నియమబద్ధంగా వక్షఃస్థల లక్ష్మితో కూడి ఉన్న శ్రీనివాసునికి శుక్రవారంనాడు మాత్రమే అభిషేకం జరగాలని నిర్ణయించి అమలు చేయించిన ఘనత రామానుజుల వారిదే. శ్రీవిల్లిపుత్తూరు గోదాదేవి మాలల అలంకరణ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవంలో ఐదవ రోజున గరుడోత్సవంనాడు శ్రీ విల్లిపుత్తూరు గోదాదేవి ధరించిన పూలమాలను తెచ్చి శ్రీవారికి ధరింపజేసే ఏర్పాటుతోపాటు, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని ఆండాళ్ ధరించిన పూలమాలను, కనుమ పండుగ రోజున గోదాకళ్యాణం రోజున తిరుమలకు తెచ్చి శ్రీవారికి సమర్పించే ఏర్పాటును రామానుజులవారు చేశారు. తిరుమల శ్రీస్వామి పుష్కరిణి ఒడ్డున ప్రాచీనమైన యోగ నరసింహస్వామి శిలావిగ్రహం పూజాపురస్కారాలు లేకుండా ఉండేది. ఆ మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠింపజేసి, నిత్యనివేదనాదులను ఏర్పాటు చేశారు శ్రీరామానుజులు. గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిష్ఠ రామానుజుల వారు తిరుపతి పుణ్యక్షేత్రంలో గోవిందరాజ స్వామిని ప్రతిష్ఠించారు. తర్వాత ఆ ఆలయం ఉత్తరోత్తరాభివృద్ధిని కాంక్షిస్తూ, గోవిందరాజస్వామికి దక్షిణ దిక్కులో గోదాదేవిని ప్రతిష్ఠించారు. ఆ ఆలయం చుట్టూ నాల్గు విశాలమైన వీథులను ఏర్పరిచారు. అక్కడే ఆలయ పరివారానికి నివాసాలు ఏర్పాటు చేశారు. ఏయే దిక్కులలో ఎవరెవరు నివసించాలో, ధాన్యాగారం ఏ దిశలో ఉండాలో.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వ్యవస్థీకరించారు. తిరుపతి నగర నిర్మాణ కౌశలం కపిలతీర్థంలో నాలుగు మూలలా శ్రీసుదర్శన చక్రయంత్ర స్తంభాలు ప్రతిష్ఠించారు. దానిని ‘చక్రత్తాళ్వార తీర్థం’గా మార్పుచేయడంతో పాటు, తిరుపతికి గోవిందరాజస్వామి, కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాల అనంతరం ఈ ‘చక్రత్తాళ్వార్ తీర్థం’లో ‘చక్రస్నానం’ అనే ‘అవబృధస్నానం’ జరిగే ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఆళ్వారుల విగ్రహాలను ప్రతిష్ఠింపజేశారు. ఇలా తిరుమల, తిరుపతి ఆలయాలలో అర్చనాది కార్యక్రమాలను, ఆలయ వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్ది భవిష్యత్తరాల వారికి అందించిన ఘనత రామానుజాచార్యుల వారికి దక్కుతుంది. రామానుజ పరంపరే జీయర్ల వ్యవస్థ తిరుమల శ్రీవారి ఆలయ పూజా కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాలు, టీటీడీ పరిపాలన నిర్వహణలో మూడు రకాల వ్యవస్థలు అమలవుతున్నాయి. శ్రీరామానుజాచార్యులు నెలకొల్పిన జీయంగార్ల వ్యవస్థ ఆలయంలో నేటికీ ప్రామాణికంగా అమలవుతోంది. ఇక భక్తుల సౌకర్యాలు, అభివృద్ధి పనులు, ఇతర విధాన నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పాటైంది. టీటీడీ తీసుకునే నిర్ణయాలను అమలు చేయించడం కోసం కార్యనిర్వాహక వ్యవస్థ పనిచేస్తోంది. తిరుమలలో జియ్యంగార్ల వ్యవస్థ ఇలా.. తిరుమలేశుని ఆలయంలో పూర్వం రాజులు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో పూజాకార్యక్రమాలను అమలు జరిపారు. రామానుజుల హయాం నుంచి తిరుమల ఆలయంలో పూజా కైంకర్యాలకు నిర్దిష్ట విధానాలను అమలు చేశారు. వైఖానస ఆగమం ప్రకారం ఆలయ నిర్వహణ జరిపించడం, స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించే బాధ్యతను అర్చకులు నిర్వహించటం, అర్చకులంతా వైఖానసులై ఉండేలా చూడటం, అర్చకులు నిర్వహించే నిత్యపూజాకైంకర్య కార్యక్రమాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పర్యవేక్షించడానికి రామానుజాచార్యులు జీయంగార్ల వ్యవస్థకు రూపకల్పన చేశారు. జీయంగార్లు అంటే సన్యాసులు కారు. ఈ పదవికి వచ్చేవరకు సంసార సాగరాన్ని ఈదిన వారినే చినజీయర్ (ఉత్తరాధికారి)గా ఎంపిక చేస్తారు. ఈ జీయర్ వ్యవస్థలో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వీరు సన్యాసధర్మాలను తప్పక ఆచరించాలి. మఠం పరిపాలన శ్రీవారి ఆలయంలో వేకువజాము సన్నిధి గొల్ల ఆలయ తలుపులు తెరిచే కార్యక్రమం నుండి రాత్రి ఏకాంతసేవ ముగిసే వరకు అన్నిరకాల పూజాకార్యక్రమాలను పెద్ద జీయర్, చిన్నజీయర్ లేదా వారి ప్రతినిధులైన ఏకాంగులు దగ్గరుండి పర్యవేక్షించాలి. శ్రీవారి పూజలకు సంబంధించిన పువ్వులు మొదలుకొని అన్ని రకాల వస్తువులను వీరి చేతుల మీదుగానే అర్చకులకు అందజేస్తారు. జీయంగార్ల మఠాల నిర్వహణ, సిబ్బంది జీత భత్యాల కోసం టీటీడీ ఏటా కోటిన్నర రూపాయలు కేటాయిస్తోంది. ఈ వ్యవస్థలో పెద్ద జీయంగార్, చిన జీయంగార్, ఏకాంగులు, అధ్యాపకులు ఉంటారు. జీయర్ స్వరూపమిది.. పెద్ద జీయంగార్: ఆలయ పూజాకార్యక్రమాల నిర్వహణలో ప్రధాన పర్యవేక్షకుడు. చిన్న జీయంగార్: పెద్ద జీయంగారికి ప్రధాన సహాయకుడిగా పని చేస్తారు. అధ్యాపకులు, ఏకాంగులు: బ్రహ్మచారులైన వీరు దివ్య ప్రబంధ పారాయణం చేస్తారు. వీరు వేద పాఠాలు చదువుతారు. పెళ్లయిన వారు కూడా ఉండవచ్చు. వీరు జీయంగార్లకు సహాయకులుగా పనిచేస్తారు. తొలిపూజ, తొలి నివేదనం, తొలి దర్శనం వేంక టాచల క్షేత్రంలో వెలసిన తొలిదైవం శ్వేతవరాహస్వామి. అందుకే ‘ఆదివరాహక్షేత్రం’ అనీ, ‘శ్వేత వరాహక్షేత్రం’ అని తిరుమల పేరు పొందింది. నిత్యం తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనాదుల క్షేత్రంలోని పూర్వసంప్రదాయాన్ని రామానుజులవారు పునరుద్ధరించారు. శ్రీమహావిష్ణువు శ్వేతవరాహస్వామిగా అవతరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి, భూదేవిని ఉద్ధరించి ఇక్కడే నిలిచాడు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీనివాసుడు వచ్చి తాను కలియుగాంతం వరకు ఇక్కడ ఉండడానికి వంద అడుగుల స్థలం దానంగా ఇమ్మని కోరుతూ, అందుకు ప్రతిఫలంగా యుగాంతం వరకు ‘తొలిపూజ, తొలి నివేదన, తొలి దర్శనం’ వరాహస్వామికి జరిగేటట్లుగా పత్రం రాసిచ్చాడు. ఈ క్షేత్ర సంప్రదాయం నిర్విఘ్నంగా అమలు జరిగేలా రామానుజులు ఇక్కడి విధివిధానాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో సన్నిధి భాష్యకారులు సన్నిధి అంటే ‘తిరుమల శ్రీవారి సన్నిధి’ అని అర్థం. ఆలయం విమాన ప్రదక్షిణ మార్గంలో ‘సన్నిధి భాష్యకారులు’గా రామానుజాచార్యులవారు కొలువై ఉన్నారు. శ్రీవారి కొప్పెర(హుండీ)కి ఎదురుగా తాళ్లపాక అరకు పక్కగా ‘సన్నిధి భాష్యకారుల’ను దర్శించవచ్చు. శ్రీవారికి నివేదనం జరిగిన ప్రతిసారీ శ్రీవారి సన్నిధి భాష్యకారులకు నివేదింపబడుతుంది. దీనిని 12వ శతాబ్దంలో అనంతాళ్వారులు శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించారు. తణ్ణీరముదు ఉత్సవం తిరుమలలోని పాపవినాశం నుంచి తీర్థజలాన్ని తెస్తున్న తిరుమలనంబికి శ్రీనివాసుడు బోయ యువకుడిగా అడ్డుపడి ‘నీళ్లివ్వు’ అన్నాడు. ‘శ్రీస్వామివారి కైంకర్యం కోసం తీసుకెళ్లే జలాన్ని ఇవ్వకూడదు’ అన్నాడు. కానీ, ఆ బోయవాడు వెనకనే నడుస్తూ, తన బాణంతో తిరుమలనంబి తలమీదనున్న కుండకు రంధ్రం చేసి దానినుండి జాలువారే నీటిని తాగాడు. ఖాళీ అయిన కుండను గమనించిన తిరుమలనంబి వెనక్కు తిరిగి బోయవాణ్ణి చూచి ‘ఎంత పాపం చేశావు.. ఇప్పటికే ఆలస్యమైంది. తీర్థాన్ని మళ్లీ తేవాలి కదా?’ అని చింతించారు. ‘తాతా! బాధపడకు. ఇదిగో ఈ కొండవాలులో చూడు. స్వచ్ఛమైన జలం ఉంది’ అంటూ బాణంతో కొట్టాడట. బాణం వల్ల పడిన రంధ్రం నుండి ఎగిసిపడిన జలాన్ని తీసుకొని తిరిగి బోయవానికోసం చూడగా అతడు అదృశ్యమయ్యాడట. దీనికి గుర్తుగా నేటికీ అదే రోజున తిరుమలలో ‘తణ్ణీరముదు ఉత్సవం’ జరుగుతుంది. దీన్ని కూడా రామానుజాచార్యులు ఏర్పాటు చేశారు. తిరుచానూరు పంచమి ప్రతి సంవత్సరం కార్తిక శుద్ధపంచమినాడు అనగా ‘శ్రీ అలమేలుమంగ’ అవతరించిన ‘తిరుచానూరు పంచమి’ రోజున మాత్రం తిరుమల శ్రీవారి పూలమాలలు, పసుపు, కుంకుమలతో కూడిన సారెను తిరుచానూరు పద్మావతి అమ్మవారికి పంపాలనే సంప్రదాయాన్ని కూడా రామానుజులవారే ఏర్పాటు చేశారు. మోకాళ్ల పర్వతంలో కొలువైన త్రోవ భాష్యకారులు భగవద్రామానుజులవారు శ్రీభాష్య గ్రంథాలను విరచించటంతో భాష్యకారులుగా ప్రసిద్ధి పొందారు. యాత్రలో మూడుమార్లు పాదాలతో తిరుమల కొండమెట్లను తొక్కకుండా మోకాళ్లతో మాత్రమే దేకుతూ, కొండకు వచ్చారు. అలా వెళుతున్న సమయంలో ‘మోకాళ్ల మెట్టు’ దగ్గర కొద్దిసేపు వారు విశ్రాంతి తీసుకొన్నారు. అందుకు గుర్తుగా ఆ తరువాతి కాలంలో ఆ దివ్య స్థలంలో రామానుజులవారి విగ్రహం ప్రతిష్టింపబడింది. వారినే ‘త్రోవభాష్యకారులు’ అని అంటారు. త్రోవభాష్యకారులకు ప్రతిరోజు తిరుమల శ్రీవారి ఆలయం నుంచి నివేదనలు చేస్తారు. జనబాహుళ్యంలోకి రామానుజ తత్వం వైష్ణవ భక్తాగ్రేసరుడు రామానుజులవారి సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొనటాన్ని అదృష్టంగా భావిస్తున్నా. ఇలాంటి బృహత్తర కార్యక్రమాన్ని టీటీడీ రూపొందించటం అభినందనీయం. రామానుజతత్త్వాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లటం ద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. - సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ నరసింహన్ సహస్రాబ్ది ఉత్సవాలు ఆచార్య పరంపరలో అగ్రగణ్యులు భగవద్రామానుజులు ఏర్పరచిన పూజా విధానాలే నేటికీ తిరుమలలో కొనసాగుతున్నాయి. ఆ మహనీయుడు అవతరించి వెయ్యి సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేవస్థానం తరఫున ఏడాదిపాటు రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాము. 108 దివ్యదేశయాత్రలు, ధార్మిక ప్రవచనాలు, గ్రంథ ప్రచురణలు వంటి కార్యక్రమాల ద్వారా రామానుజుల భక్తితత్త్వాన్ని జన బాహుళ్యంలోకి తీసుకెళుతున్నాము. - డాక్టర్ దొండపాటి సాంబశివరావు, ఈవో ఏడాదిపాటు సహస్రాబ్ది ఉత్సవాలు రామానుజాచార్యులవారి సహస్రాబ్ది ఉత్సవాలను టీటీడీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఈ ఏడాది మే 10న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా సంచార ప్రచార రథాన్ని సిద్ధం చేశారు. రథం వెనుక వైపు శ్రీవేంకటేశ్వర స్వామివారు, రామానుజులవారు, పక్కభాగంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్పస్వామి, రామానుజులవారి ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మే 10న ప్రారంభించిన ఈ సంచార రథం 108 దివ్యదేశాలలో పర్యటించి, రామానుజ తత్వానికి ప్రచారం కల్పించనుంది. తిరుమలలో బాగ్ సవారీ ఉత్సవం శ్రీనివాసుడు పుష్పాలంకార ప్రియుడు. ఈ క్షేత్రంలోని పూలన్నీ శ్రీవారి పూజకే వినియోగించాలని క్షేత్ర సంప్రదాయం. పుష్పకైంకర్యం కోసం అనంతాళ్వార్ అనే శిష్యుణ్ణి శ్రీరంగం నుంచి తిరుమలకు రప్పించారు పరమభక్తాగ్రేసరులైన రామానుజాచార్యులు. పుష్పకైంకర్యం కోసం తోటను పెంచాడు అనంతాళ్వారు. ఆ తోటను చూడడానికి రాత్రిపూట శ్రీనివాసభగవానుడు, లక్ష్మీదేవితోపాటు వచ్చి తోటను పాడుచేశాడు. దాన్ని గమనించి రాత్రిపూట కాపుకాసిన అనంతాళ్వారు వారిద్దరినీ బంధించాడు. కాని స్వామి తప్పించుకొని పోగా, లక్ష్మీదేవిని కట్టివేసి, స్వామిని వెంబడిస్తూ పరుగెత్తాడు. ఆలయానికి అప్రదక్షిణంగా పరుగెత్తి, పరుగెత్తి చివరకు పూలతోట దగ్గరకే వచ్చి స్వామి అదృశ్యమయ్యాడు. లక్ష్మీదేవి మాత్రం చెట్టుకు బంధింపబడి ఉందని సంతోషించాడు. ఇంతలో తెల్లవారింది. ఆలయంలో స్వామివారి వక్షఃస్థలంలో లక్ష్మీదేవి కనిపించలేదని అర్చకులు ఆందోళనపడగా, శ్రీస్వామివారు ‘అనంతాళ్వారులు ఆమెను పూలతోటలో బంధించాడని, సగౌరవంగా పిలుచుకొని రమ్మని’ చెప్పాడు. వారు ఆలయం చేరుకోగానే, అమ్మవారు అదృశ్యమై శ్రీవారి వక్షఃస్థలం చేరుకొంది. ఈ గాథను స్మరిస్తూ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ‘బాగ్సవారి ఉత్సవం’ ఏర్పాటు చేశారు రామానుజులవారు. ‘బాగ్’ అంటే తోట. సవారీ అంటే వ్యాహ్యాళి. తోటకు వెళ్లే ఉత్సవం కనుక ఇది ‘బాగ్సవారీ’ అంటారు. ఆ రోజు శ్రీనివాసుడు దేవేరులతో ఆలయానికి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు వెళ్లి పూజాకైంకర్యాలు అందుకుని, తిరిగి ఆలయం చేరుకుంటారు. శంషాబాద్‌లో 216 అడుగుల పంచలోహ సమతామూర్తి - వేయేళ్ల సందర్భంగా స్ఫూర్తికేంద్రం తెలంగాణాలో హైదరాబాద్నగరం శంషాబాద్‌కు సమీపంలోని శ్రీరామాపురం వద్ద 216 అడుగుల ఎత్తున శ్రీరామానుజుల పంచలోహ విగ్రహం (సమతామూర్తి) రూపకల్పన సాగుతోంది. స్వామి వారికి వెయ్యేళ్లు నిండుతున్న సందర్భంగా శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి నేతృత్వంలో ‘శ్రీ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) స్థాపన జరుగుతోంది. వచ్చే ఏడాది విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 45 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం నిర్మాణం పనులు 2022 నాటికి పూర్తయ్యేలా నిర్వాహకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే లక్ష్యంతో 2014లో పనులు ప్రారంభించారు ఈ ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.1000 కోట్లు. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 216 అడుగులు. ఈ విగ్రహం చైనాలోని నాన్జింగ్లో సిద్ధమవుతోంది. దాదాపు 1500 విడిభాగాల్లో మొత్తం సుమారు 700 టన్నుల బరువుతో సిద్ధమవుతోంది. విగ్రహ పీఠం భాగంలో 36 ఏనుగు బొమ్మలు ఉంటాయని, వాటిపై 27 అడుగుల పద్మపీఠం ఉంటుందని, ఈ పీఠంపై 108 అడుగుల రామానుజుల విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని, ఆయన చేతిలోని త్రిదండం 135 అడుగులు ఉంటుందని స్థపతి డీఎన్వీ ప్రసాద్ తెలిపారు. విజయకీలాద్రిపై 108 అడుగుల సుధామూర్తి ప్రతిపాదన విజయవాడలోని విజయ కీలాద్రి పర్వతంపై 108 అడుగుల ఎత్తై రామానుజుల సుధామూర్తి (సిమెంట్ విగ్రహం) ఏర్పాటు చేయాలని త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారు సంకల్పించారు. విగ్రహస్థాపన ప్రణాళిక దశలోనే ఉంది. ఇదే పర్వతం మీదున్న శిథిలావస్థకు చేరిన శ్రీవేంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి, భూ వరాహస్వామి, శ్రీకృష్ణ స్వామి, సుదర్శన చక్రత్తాళ్వారు, శ్రీలక్ష్మీనరసింహ స్వామి, వైకుంఠ పెరుమాళ్, అష్టలక్ష్మి ఆలయాల జీర్ణోద్ధారణకు చేశారు. -
అంగరంగవైభవంగా...
–భక్తుల సౌకర్యాలకు అగ్రాసనం –కైంకర్యాలు మినహా మిగిలిన సమయమంతా స్వామి దర్శనానికి కేటాయింపు –బ్రహ్మోత్సవ వేళ ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాటు సాక్షితో టీడీపీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు చెప్పారు. గత ఏడు బ్రహ్మోత్సవాలు సజావుగా, విజయవంతంగా నిర్వహించటంలో కీలక పాత్ర పోషించిన ఆయన శుక్రవారం సాక్షితో మాట్లాడారు. ఈసారి బ్రహ్మోత్సవాలకు మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. ఇంకా ఏమన్నారంటే.. భక్తులకు సంతృప్తికరంగా వాహన సేవల దర్శనం l బ్రహ్మోత్సవాలకు అశేష సంఖ్యలో భక్తజనం తరలివస్తారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశాం. ఉదయం, రాత్రి స్వామి వాహన సేవల్ని భక్తులందరూ దర్శించేలా ఏర్పాట్లు చేశాం. గరుడ వాహన సేవరోజున ఉత్సవమూర్తి ఊరేగింపు చాలా నిదానంగా నిర్వహిస్తాం. దానివల్ల భక్తులందరూ సంతృప్తిగా దర్శించుకుంటారు. ఈ సారి శాశ్వత ప్రాతిపదికన మరుగుదొడ్లు నిర్మించాం. తాగునీరు వసతి కల్పించాం. సంచార వైద్యశాలలు, ప్రత్యేకంగా అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచామని శ్రీనివాసరాజు వివరించారు. భక్తుల సౌకర్యార్ధం తీసుకున్న నిర్ణయాలివి: – కైంకర్యాలు మినహా మిగిలిన సమయమంతా స్వామి దర్శనం – సిఫారసు చెల్లవు. అన్ని రకాల వీఐపీ దర్శనాలు రద్దు.. వికలాంగులు, వృద్ధులు, చంటి బిడ్డ తల్లిదండ్రుల క్యూలైను , ఇతర సిఫారసు దర్శనాలు రద్దు. –ప్రోటోకాల్ నిబంధనలు మాత్రమే అమలు – ఇబ్బంది లేకుండా అన్నప్రసాద వితరణ – వాహన సేవల దర్శనం కోసం ఆలయ వీధుల్లో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ పంపిణీ. –అన్నప్రసాద కేంద్రంలో కూడా ఉదయం 8 గంటలకు అల్పాహారం మొదలు రాత్రి 12 గంటల వరకు వితరణ – రోజూ 7 లక్షల లడ్డూలు నిల్వ ఉండేలా ఏర్పాట్లు – అవసరాన్ని బట్టి అదనపు లడ్డూల కేటాయింపు. – అన్ని రకాల ఆర్జిత సేవలతోపాటు అడ్వాన్స్ బుకింగ్‌లోని గదులు రద్దు. –దాతలకు మాత్రమే గదులు కేటాయింపు. –జీఎన్సీ టోల్గేట్ కుడివైపున నుండి ఆర్టీసీ బస్సులు, ఎడమవైపు ప్రైవేట్ వాహనాలకు అనుమతి –ప్రత్యేక పార్కింగ్ కేంద్రాల సంఖ్య పెంపు. –గరుడ వాహన సేవకు ముందురోజు నుండే తిరుమలలో వన్‌వే ట్రాఫిక్ నిబంధన అమలు. నిమిషానికో ఆర్టీసీ బస్సు నడిచేలా చర్యలు తీసుకున్నట్లు జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. నిరంతరంభక్తులకు అందుబాటులో సెంట్రల్ కమాండెంట్ కంట్రోల్ రూమ్ తీసుకొచ్చామని..అత్యవసర పరిస్థిల్లో అన్ని విభాగాలు తక్షణమే స్పందించే ఏర్పాట్లు చేశామని సాక్షికి వివరించారు. -
తిరుమలలో భక్తుడిపై సైకో దాడి
సాక్షి, తిరుమల: తిరుమల ఆర్టీసీ బస్టాండు వద్ద సోమవారం మతిస్థిమితం లేని ఓ సైకో భక్తుడిపై దాడి చేశాడు. దీంతో భక్తుడు తీవ్రంగా గాయపడ్డాడు. తమిళనాడులోని వేలూరు జిల్లాకు చెందిన అక్కర్చికుప్పానికి చెందిన కన్నన్ (38) కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మ«ధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో తిరుగుప్రయాణమయ్యారు. ఇక్కడి బస్టాండ్ వద్ద బస్సు ఎక్కుతుండగా మతిస్థిమితం లేని ఓ వ్యక్తి రాయితో దాడి చేశాడు. ఈ ఘటనలో కన్నన్ తలకు గాయమైంది. అతన్ని స్థానికులు అశ్విని ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తిని అక్కడి సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుడు కర్ణాటక ప్రాంతానికి చెందిన వాడని, పూర్తి వివరాలు చెప్పలేని స్థితిలో ఉన్నాడని టూ టౌన్ ఎస్ఐ వెంకట్రమణ తెలిపారు. అలాంటి వ్యక్తులపై నిఘా ఉంచి , తిరుమలలో లేకుండా ఏరివేస్తామని ఎస్ఐ తెలిపారు. -
జయేంద్ర సరస్వతికి మళ్లీ అస్వస్థత
విజయవాడ (లబ్బీపేట): కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలోని శ్రీ చంద్రమౌళేశ్వర వేంకటేశ్వరస్వామి దేవాలయంలో చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయనకు బుధవారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఉదయం 11.30 సమయంలో ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి నిమోనియాగా మారినట్లు తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ టి.రవీంద్రనాథ్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది తలెత్తితే వెంటిలేటర్‌పై ఉంచాల్సివస్తుందని వైద్యులు తెలిపారు. -
శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ
పెరవలి : పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలంలోని అన్నవరప్పాడులో శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం అర్థరాత్రి దొంగలు పడ్డారు. ఆలయంలోని హుండీ దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఉదయం గుడి పూజారులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... చోరీ జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల : తిరుమలలో మంగళవారం ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు ఒక గంట సమయం పడుతోంది. గదుల వివరాలు: ఉచిత గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.50 గదులు - 10 ఖాళీగాఉన్నాయి రూ.100 గదులు - 5 ఖాళీగా ఉన్నాయి రూ.500 గదులు - ఖాళీగా లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు: ఆర్జిత బ్రహ్మోత్సవం - 70 ఖాళీగాఉన్నాయి సహస్ర దీపాలంకరణ సేవ - 150 ఖాళీగాఉన్నాయి వసంతోత్సవం - 100 ఖాళీగాఉన్నాయి మంగళవారం ప్రత్యేక సేవ - అష్టదళ పాదపద్మారాధన. -
కారు హల్చల్పై టీటీడీ ఈవో ఆగ్రహం
తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం వద్దకు ఓ కారు దూసుకురావడంపై ఈవో సాంబశివరావు స్పందించారు. ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేయడంతో పాటు కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓ ఎర్ర రంగు కారు మూడు గేట్లను దాటుకుని శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం ముందు వరకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కారు టీటీడీ బోర్డు సభ్యుడు దొరస్వామి రాజుకు చెందినదిగా అధికారుల విచారణలో తేలింది.అయితే, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో ఈవో ఆగ్రహంచి చర్యలకు ఆదేశించారు. -
శ్రీవారి ఆలయం ఎదుట కారు హల్చల్
తిరుమల : తిరుమలలో శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు కారు దూసుకువచ్చి శుక్రవారం హల్చల్ చేసింది. మూడు గేట్లు దాటి ఆలయం వద్దకు కారు వచ్చినా భద్రత సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో శ్రీవారి ఆలయం సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. అయితే సదరు కారు.... టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు వి.దొరస్వామిరాజుకు చెందిన కారుగా గుర్తించారు. -
తిరుమలలో పెరిగిన రద్దీ
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు పోటెత్తారు. 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గదులు ఏవీ ఖాళీ లేవు. శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామివారిని 77,619 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. గదుల వివరాలు: ఉచిత గదులు - ఖాళీ లేవు రూ.50 గదులు - ఖాళీ లేవు రూ.100 గదులు - ఖాళీ లేవు రూ.500 గదులు - ఖాళీ లేవు ఆర్జితసేవా టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం : ఖాళీ లేవు సహస్ర దీపాలంకరణ సేవ : ఖాళీ లేవు వసంతోత్సవం : ఖాళీ లేవు. -
శ్రీవారికి కానుకగా ఆటో
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ఓ భక్తుడు ఆటో కానుకగా ఇచ్చాడు. తిరుపతికి చెందిన వెంకటేశ్వర ఆటో టేడర్స్‌కు చెందిన శివ శ్రీవారికి రూ. 2.30 లక్షల విలువైన ఆటోను బహుమతిగా ఇచ్చాడు. శుక్రవారం టీటీడీ ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డిని కలిసి ఆటో తాళాలను అందజేశారు. -
వెంకటేశ్వరస్వామి ఆలయంలో మండలి చైర్మన్ పూజలు
నల్లగొండ జిల్లా హాలియా మండలం నారపల్లిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ఉదయం శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి రూ.5 లక్షలు కేటాయిస్తామని ప్రకటించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు నోముల నర్సింహయ్య తదితరులు ఉన్నారు. -
నేటి నుంచి శ్రీవారికి సుప్రభాతం
-
'వెంకన్నా ప్రత్యేక హోదా నీవైనా ఇప్పించు'
తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం బాగుపడాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరి అని, అలాంటి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా చూడాలని వైకుంఠ నాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డితో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ కొత్త సంవత్సరంలోనూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. ఈసారి టీటీడీ ఏర్పాట్లు బాగా చేసిందని ఎంపీ కితాబిచ్చారు. -
శ్రీవారికి రెండు అంబులెన్స్‌లు గిఫ్ట్
తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఆదివారం రూ.30 లక్షల విలువైన రెండు అంబులెన్స్‌లు వితరణగా అందాయి. కోల్‌కతాకు చెందిన ప్రకాష్ చౌదరి వీటిని బహూకరించారు. శ్రీవారి ఆలయంలో రెండు దశాబ్దాలకు పైగా పోటు విధులు నిర్వహించి, ఇటీవల గుండెపోటుతో మతిచెందిన రమేష్ జ్ఞాపకార్థం వీటిని కానుకగా ఇచ్చినట్టు ప్రకాష్ చౌదరి తెలిపారు. అంబులెన్స్ తాళాలను జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డికి అందజేశారు. కాగా.. సీబీఐ డెరైక్టర్ అనిల్ సిన్హా ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనీల్ సిన్హా కు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. స్వామి వారి దర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట లోపే సమయం పడుతోంది. -
ప్రతి రాష్ట్రంలో ఆలయం నిర్మిస్తాం
దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. దీనిలో భాగంగానే.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ లో బాలాజీ ఆలయ నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆలయం కోసం స్థలాన్ని కేటాయించింది.. నిర్మాణానికి సంబందించిన టెండర్ల ప్రక్రియ పూర్తైందని టీటీడీ జేఈఓ పోల భాస్కర్ మీడియాకు తెలిపారు. డిజైన్లు, ఆలయ ప్లాన్లు సిద్దంగా ఉన్నాయని.. అతి త్వరలో నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు వివరించారు. రెండేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. ఇప్పటికే హర్యాణా రాష్ట్రంలోని కురుక్షేత్రలో నిర్మితమైతున్న బాలాజీ ఆలయం మరో ఆరునెల్లో సిద్దమైతుందని తెలిపారు. టీటీడీ నిర్మించ తలపెట్టిన ఆలయానికి 5 నుంచి 10 ఎకరాల స్థలం కేటాయించాల్సిందిగా.. దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు టీటీడీ లేఖ రాసినట్లు వివరించారు. తమ విజ్ఞప్తికి మహరాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీ, చెన్నైల్లో టీటీడీ ఆలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో శ్రీవెంకటేశ్వర వైభవోత్సవం మరో వైపు ఈనెల 31 నుంచి నవంబర్ 8 వరకూ న్యూ ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో 'శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం' నిర్వహించనున్నారు. ఢిల్లీ లో తొలి సారి వెంకటేశ్వర వైభవోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వహాకులు దీపావెంకట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. -
అలంకారప్రియునికి అమూల్య ఆభరణాలు
* బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్యాలు శ్రీవారి సొంతం.. * మార్కెట్ ధర ప్రకారం రూ.50 వేల కోట్లకుపైగా విలువ సాక్షి, తిరుమల: దివ్యతేజోమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామివారు అలంకార ప్రియుడు. వస్త్రాలంకారం, పుష్పాలంకారంతోపాటు బంగారు, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య తదితర ఆభరణాల అలంకారాల్లో స్వామిని దర్శిస్తూ పరవశించిపోతోంది భక్తకోటి. స్వామికి అలంకరించే ఆభరణాల విలువ అమూల్యం. రూ.50 వేల కోట్లకు పైమాటే శ్రీవారి ఆభరణ సంపత్తి వివరాలను భద్రతా కారణాల రీత్యా టీటీడీ అత్యంత గోప్యంగా ఉంచింది. అనధికారిక లెక్కల ప్రకారం స్వామివారి ఆభరణాలు, బంగారు వస్తువులు మొత్తం 11 టన్నులు ఉండవచ్చని అంచనా. వాటి విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.32 వేల కోట్లకు పైగా ఉండవచ్చని నిపుణుల విశ్లేషణ. మార్కెట్ ధర ప్రకారం కనీసం రూ.50 వేల కోట్లకుపైగా ఉంటుందని సమాచారం. గర్భాలయమూర్తి, ఉత్సవమూర్తుల అలంకరణలకు అలనాడు రాజులు, రాజవంశీకులు, ఆర్కాటు నవాబులు, బ్రిటిష్ ప్రభువులు, మహంతులు ఎన్నెన్నో ఆభరణాలు తయారు చేయించారు. కిరీటాలు, నిలువెత్తు ఆభరణాలు, వజ్రాలు, ముత్యాలు, కెంపులు, పచ్చలు, నవరత్నాలు పొదిగిన నగ లు, ఇతర బంగారు సామగ్రిని కానుకగా అందజేశారు. మూలమూర్తి అలంకరణలో ఆభరణాలు సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, నూపురాలు, పాగడాలు, కాంచీ గునం, అంకెలు, వడ్డాణాలు, ఉదర బంధం, చిరుగంటలతో కూడిన దశావతార హారం, చిన్న కంఠాభరణం, బంగారు పులిగోరు హారం, గోపు హారం, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతుర్భుజ లక్ష్మీహారం, అష్టోత్తర శతనామ హారం, 32 కిలోల సహస్ర నామహారం, సూర్య కఠారి, వైకుంఠ హస్తం, కఠిహస్తం, కడియాలు, కర భూషణాలు, భుజదండ భూషణాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, కర్ణపత్రాలు, శంఖు చక్రాలు, ఆకాశరాజు కిరీటం, సాలిగ్రామ హారం, తిరుక్కాళం, వజ్ర అశ్వర్థపత్ర హారం, ఐదు పేటల కంఠి, చంద్రవంక కంఠి, ముఖపట్టీ, శ్రీవత్సం, కౌస్తుభం, బంగారు పీతాంబరాలు. కిరీటాలు ఎన్నెన్నో వజ్రాల హారం, వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, వజ్రాల కఠిహస్తం, వజ్రాల కిరీటం(బరువు 13.360 కేజీలు, విలువ రూ.5 కోట్లు) స్వామివారికి ఉన్నాయి. శ్రీవారి అరుదైన ఆభరణాల్లో అరుదైన గరుడ మేరు పచ్చ ఉంది. దీని బరువు 500 గ్రాములు. స్వామివారికి అధికారికంగా ముఖ్యమైన ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటితోపాటు పురాతన కిరీటాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు మరో ఏడు కిరీటాలు ఉన్నాయి. వీటిలో వజ్ర కిరీటం, గద్వాల మహారాణి కిరీటం ముఖ్యమైనవి. -
శ్రీవారి అందం,వైభవం, వైభోగం అంతా ఆభరణాలోనే...
-
శ్రీవారు.. మేటి శ్రీమంతుడు
* తిరుమలేశుని ఆస్తులు రూ. 2 లక్షల కోట్లకుపైనే * ఏటేటా పెరుగుతున్న భక్తులు, కానుకలు, బడ్జెట్ * పెట్టుబడులు రూ. 10 వేల కోట్లకుపైనే సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడు శ్రీవేంకటేశ్వరుడి సిరి సంపదలు యేటేటా పెరుగుతున్నాయి. ఘాట్ రోడ్లు ఏర్పడక ముందు వేలల్లో ఉండే ఆదాయం నేడు కోట్లకు చేరింది. శ్రీవారి స్థిరాస్తుల విలువ రూ. రెండు లక్షల కోట్లపైనే ఉంటుందని అంచనా. హైకోర్టు ఆదేశాలతో లెక్కలు తీసిన టీటీడీ శ్రీవారి ఆస్తులు ఎంత? ఎక్కడెక్కడున్నాయి? వాటి వివరాలేమిటీ? అన్న విషయంలో దశాబ్దాలుగా విమర్శలున్నాయి. రాష్ర్ట అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దేశ విదేశాల్లో ఉన్న శ్రీవారి స్థిరాస్తులను 2009లో టీటీడీ లెక్కలు తీసింది. ఈ మేరకు 4,143.67 ఎకరాల్లో భూములు, భవనాలు గుర్తించి ప్రభుత్వ ధర ప్రకారం కనీస ముఖ విలువ రూ. 33,447.74 కోట్లుగా నిర్ధారించారు. వాటికి సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించారు. వీటి విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ. 2 లక్షల కోట్ల కు పైబడే ఉంటుందని అంచనా. రూ.10 వేల కోట్లు దాటిన శ్రీవారి పెట్టుబడులు తిరుమల శ్రీవారికి పెట్టుబడుల(ఫిక్స్డ్ డిపాజిట్లు) రూపంలో బ్యాంకుల్లో రూ. 10వేల కోట్లకు పైబడి ఉన్నాయి. వీటిపై ఏడాదికి టీటీడీకి రూ. 744 కోట్ల మేరకు వడ్డీ రూపంలో వడ్డికాసులవాడి చెంతకు చేరుతోంది. రాబోవు రెండు మూడు ఏళ్లలోనే పెట్టుబడులపై వడ్డీ రూ. వెయ్యికోట్లు దాటే అవకాశముందని ఆర్థిక నిపుణుల అంచనా. ఇక వివిధ ట్రస్టులకు భక్తులు ఇచ్చే విరాళాలు అదనం. శ్రీవారి నిత్యాన్నప్రసాద ట్రస్టులో 2015 ఏప్రిల్ 5 నాటికి దాతలు ఇచ్చిన విరాళాలు రూ. 591 కోట్లకు చేరాయి. ప్రాణదాన ట్రస్టు కింద సుమారు రూ.200 కోట్లు, మిగిలిన ట్రస్టుల్లో మరో రూ. 300 కోట్లు ఉన్నాయి. ఇవిగాక రోజువారీగా భక్తుల నుంచి వచ్చే విరాళాలు ఏడాదికి సుమారు రూ. 100 కోట్లు వస్తుండడం గమనార్హం. రూ. 2,530 వేల కోట్లకు పెరిగిన బడ్జెట్ 1933 ప్రారంభంలో టీటీడీ బడ్జెట్ లక్షల్లో మాత్రమే ఉండేది. ప్రస్తుతం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,530 కోట్లతో ధార్మిక బడ్జెట్ నిర్ణయించారు. ఇక స్వామిని దర్శించే భక్తులు ప్రతియేటా పెరుగుతున్నారు. 2010లో 2.14 కోట్ల మంది దర్శించుకోగా 2015 అర్థసంవత్సరానికి 1.5 కోట్ల మందికిపైగా తరలి వచ్చారు. -
రాష్ట్రపతి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
- కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లలో పోలీసులు - ఐబీ జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణ - తిరుమల, తిరుచానూరులో దర్శన ఏర్పాట్లను సమీక్షించిన టీటీడీ అధికారులు - అధికారులతో పలుమార్లు కలెక్టర్ సమావేశం సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం జూలై 1న తిరుమలకు రానున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తిరుమలలో టీటీడీ ఈవో సాంబశివరావుతో పాటు అన్ని శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన సూచనల మేరకు రెవెన్యూ, టీటీడీ అధికారులు పలుమార్లు సమావేశమై దాదాపు ఏర్పాట్లు పూర్తిచేశారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ పలుమార్లు అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా వస్తున్నందున భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ముఖ్యంగా తిరుపతి ఆర్డీవో వీరబ్రహ్మయ్య ఇతర అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రపతి ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి తొలుత తిరుచానూరు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలోపే తిరుమలలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటున్నారు. శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుంచి సాయంత్రం 4 గంటలకు బయలు దేరుతారు. 5.50 గంటలకు రేణిగుంటకు చేరుకుని ప్రత్యేక విమానంలో తిరుగుపయనమవుతారు. సీఎం నారా చంద్రబాబునాయు డు జూలై 1వ తేదీన ఉదయం 10గంటలకు రేణిగుం ట విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతికి స్వాగతం పలుకుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకే ముఖ్యమంత్రి ముందుగా గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా రాజ మండ్రికి బయలుదేరి వెళతారు. రాష్ట్రపతి పయనిం చే రోడ్డు మార్గాలతో పాటు, ఆయన బసచేసే పద్మావతి అతిథి గృహాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లలో పోలీసులు నిమగ్నం రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులు తిరుపతిలోనే మకాం వేసి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డెరైక్టర్ చంద్రశేఖర్ అజాద్, ఇంటెలిజెన్స్ డీఐజీ పి.వి.యస్ రామకృష్ణ, తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి, సీఎం ముఖ్య భద్రతాధికారి జె.సత్యనారాయణ, గ్రెహౌండ్స్ ఎస్పీ శ్రీనివాసులు తిరుపతి అర్బన్ జిల్లాల పరిధిలోని ముగ్గురు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు సమావేశమై భద్రత ఏర్పాట్లపై సమీక్షించారు. తిరుచానూరులో దర్శన ఏర్పాట్ల పరిశీలన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ఆలయంలో ఏర్పాట్లను సోమవారం టీటీడీ ఈవో సాంబశివరావు నేతృత్వంలో పర్యవేక్షించారు. -
పవిత్రత గోవిందా!
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి పాదాల చెంత ఉన్న తిరుపతి నగరంలో పవిత్రతను మంటగలిపేందుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. తిరుమలకు వెళ్లే మార్గాలకు వంద అడుగుల దూరంలో మద్యం షాపులకు అనుమతులు ఇచ్చింది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : నిత్యం గోవింద నామస్మరణలతో మార్మోగుతున్న తిరుపతిలో అడు గు పెట్టే భక్తులు ఎంతో పవిత్రంగా తిరుమలకు చేరుకోవాలని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిని మద్యరహిత నగరంగా ప్రకటించాలని గతంలో పలు ఆందోళనలు జరిగాయి. అప్పటి ప్రభుత్వం దిగివచ్చి భక్తులు, యాత్రికులు ప్రయాణించే ప్రధాన మార్గాల్లో మద్యం దుకాణాలు, బార్లు తొలగిస్తూ సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పరిణామంతో తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులు, యాత్రికులు, స్థానికులూ సంతోషించారు. ఆ మార్గాలు భక్తులు, యాత్రికుల రాకపోకలతో ఆధ్మాత్మిక శోభను సంతరించుకున్నాయి. అయితే ప్రస్తుత ప్రభుత్వం భక్తుల మనోభావాలను తుంగలో తొక్కి తిరిగి ఆ మార్గాలకు సమీపం లోనే మద్యం షాపుల ఏర్పాటుకు పచ్చ జెండా ఊపింది. గతంలో అడ్డంకిగా మారిన నిబంధనలకు తిలోదకాలిస్తూ తమకు అనుకూలంగా మార్పులు తీసుకువచ్చింది. తిరుపతి పవిత్రతను మంటగలుపుతూ మద్యం షాపులు, బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో మద్యం షాపులను రద్దు చేసిన కూడళ్లు ఇవే.. తిరుపతికి వచ్చే భక్తులు రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్, పూర్ణ కుంభం సర్కిల్ నుంచి శ్రీనివాసం, లీలామహల్ సర్కిల్, కపిల తీర్థం మీదుగా తిరుమలకు వెళతారు. అలాగే టౌన్ క్లబ్ నుంచి స్విమ్స్ సర్కిల్ మీదుగా అలిపిరి ద్వారా కొంతమంది తిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి భక్తులు, యాత్రికులు ప్రయాణించే ఈ మార్గాల్లో ఒకప్పుడు మద్యం దుకాణాలను యథేచ్ఛగా నడిపేవారు. వివిధ రూపాల్లో పోస్టర్లను ఉంచి, భక్తులను ఆకట్టుకునేవారు. ఈ క్రమంలో కొంతమంది భక్తులు తిరుమలకు వెళ్లకుండా నేరుగా మద్యం షాపులకు వెళ్లి, తిరుపతి పవిత్రతకు భంగం కలిగించేవారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో పూర్తిగా మద్యం షాపులు ఉండకూడదన్న ఉద్యమం మొదలైంది. అదే క్రమంలో తిరుపతి పవిత్రను దృష్టిలో ఉంచుకుని తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడా బ్రాందీ షాపులు ఉండకూదని కోర్టులో ఫిల్ వేశారు. గతంలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నిరాహారదీక్ష సైతం చేశారు. అప్పుడు దిగి వచ్చిన ప్రభుత్వం భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని హామీల కమిటీని నియమించింది. ఆ కమిటీ తిరుపతిలో పర్యటించి, తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని షాపులను ఎత్తివేయాలని సూచించింది. ఈ మేరకు అప్పటి కలెక్టర్ 2012లో 18 మద్యం షాపులు, 2014లో 9 బార్ల అనుమతులను రద్దుచేశారు. తిరుమలకు ప్రయాణించే మార్గాల్లో ఉన్న వార్డుల్లో పూర్తిగా మద్యం షాపులను ఎత్తివేశారు. ఇప్పుడు ఆ నిబంధనలను కాస్త సడలించి రోడ్డుకు 100 అడుగుల దూరంలో మద్యం షాపులకు అనుమతులను ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తిరుమలకు వెళ్లే దారుల్లో సైతం తిరిగి మద్యం ఏరులై పారనుంది. తిరుమల ప్రాశస్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధిత మార్గాలకు సమీపంలో మద్యం షాపుల అనుమతుల ఉత్తర్వులు రద్దు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు. -
వెంకన్న సన్నిధిలో నామాల పంచాయితీ
- ముదురుతున్న అర్చకులు, జీయర్ల పోరు - ఓ అర్చకుడిని తప్పించిన అధికారులు - అభ్యంతరం తెలిపిన ప్రధాన అర్చకుడు సాక్షి,తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నామాల గొడవ మళ్లీ రాజుకుంది. ఆలయంలోని గర్భాలయ మూలమూర్తికి అలంకరించిన తిరునామంపై ఉద్దేశపూర్వంగా నామాన్ని మార్చినట్టు వచ్చిన ఫిర్యాదులతో ఓ అర్చకుడిపై ఇటీవల టీటీడీ అధికారులు వేటువేశారు. దీంతో వైష్ణవ తెగల్లోని ‘తెంగలై, వడగలై’ అనే రెండు వర్గాల మధ్య అంతర్గత వివాదం మళ్లీ రేగింది. అవకాశం దొరికితే ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకునేందుకు పోటీ పడే ఈ తెగ మధ్య.. గతంలో మహారథంపై అలంకరించే తిరునామం విషయంలో దుమారమే రేపింది. నామం విషయంలో కోర్టు వివాదాలు నడిచిన సందర్భాలున్నాయి. టీటీడీ ప్రతిష్టపై నామాల వివాదం? ఆలయంలో తెంగలై, వడగలై వైష్ణవ తెగల్లో తిరునామానికి ఎంతో విశిష్టత ఉంది. ఇందులో వడగలై వారు ఆంగ్లం లోని ‘యు’ ఆకారంలో ఊర్ధ్వపుండ్రాలు (నామం) దిద్దుకుంటారు. మరొక తెగలోని తెంగలై వారు ‘వై’ ఆకారంలో తిరునామం ధరిస్తారు. నుదుటపై దిద్దుకున్న నామాన్ని బట్టి వైష్ణవ తెగలను గుర్తించవచ్చు. శ్రీవేంకటేశ్వరస్వామి వారి తిరునా మం ఆ రెండు తెగలకు సంబంధం లేకుం డా ఉంటుంది. ‘‘యు, వై ’’ ఆకారాలకు మధ్యస్థంగా తమిళ అక్షరంలో ‘ప’ పోలి ఉంటుంది. దీన్నే ఆగమబద్ధంగా ‘తిరుమణికావు’ అని అంటారు. పొరపాట్లు లేవు: రమణదీక్షితులు ‘వైఖానస ఆగమం ప్రకారం తిరుమల ఆలయంలో గర్భాలయ మూలమూర్తికి కైంకర్యారాధనాలు, అలంకరణలు జరుగుతున్నాయి. అందులో ఎలాంటి పొరపాట్లు లేవు’ అని ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరైన ఏవీ రమణదీక్షితులు మీడియాతో అన్నారు. వైఖానస ఆగమ శాస్త్ర పరిజ్ఞానం లేనివారే ఆరోపణలు చేస్తుంటారని విమర్శించారు. అర్చకులను విధులను తప్పిం చడంపై కోర్టుకు వెళతామన్నారు. -
నేత్రపర్వం..కడపరాయుడి కల్యాణం
కడప కల్చరల్ : దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి క ల్యాణం బుధవారం ఆలయ ముఖ మండపంలో వైభవంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు మచ్చా శేషాచార్యులు, మయూరం కృష్ణమోహన్ స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశేష అభిషేకాలు చేసి అలంకరించి ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చారు. కల్యాణ క్రతువులను క్రమంగా నిర్వహించారు. అమ్మవారి మంగళసూత్రాన్ని భక్తులకు దర్శింపజేసి అర్చకులే స్వామి పక్షాన అమ్మవారికి అలంకరించారు. స్థానిక భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రూ. 7 లక్షల ఆదాయం.. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం హుండీలను బుధవారం లెక్కించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా జనవరి 12 నుంచి ఫిబ్రవరి 18 వరకు హుండీల ద్వారా రూ. 7,34,540 లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి, టీటీడీ కార్యాలయ సూపరింటెండెంట్ నీలాద్రి, విజిలెన్స్ అధికారులు, ఆలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తిరుమలలో పాటల మాంత్రికులు
తిరుమల: తిరుమలలో ఆదివారం సినీ గాయినీ, గాయకుల సందడి నెలకొంది. తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గాయకులు మనో, వందేమాతం శ్రీనివాస్, సునీత, శ్రీరామచంద్ర ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకుని శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మనో మాట్లాడుతూ ప్రజలందరికి మంచి జరగాలని స్వామిని ప్రార్థిం చి నట్లు తెలిపారు. సంగీతాన్ని దేవుడు తనకు ప్రసాదించడం ఎన్నోజన్మల పుణ్యంగా భావిస్తున్నానని చెప్పారు. వందేమాతం శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కళాకారులందరి తరుపున ప్రార్థించినట్టు తెలిపారు. గాయని సునీత మాట్లాడుతూ తిరుమలకు ఎప్పుడు వచ్చినా తెలియని కొత్త అనుభూతి లభిస్తుందని అన్నారు. స్వామి దయతో మంచి పాటలు పాడుతూ తెలుగు ప్రజలకు దగ్గరగా ఉండడంతో అదృష్టంగా భావిస్తునట్టు చెప్పారు. అంతకుముందు సుప్రభాత సేవలో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి ప్రసాదాలు అందజేశారు. -
శ్రీవారి సేవలో ప్రధాని సోదరుడు
సాక్షి,తిరుమల : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్న సోమాభాయ్ మోదీ ఆదివారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కుకుని, తర్వాత గర్భాలయ మూలమూర్తి, వకుళ మాతను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించారు. రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు వారికి ప్రసాదాలు అందజేశారు. -
బాబాయ్, తమ్ముడుతో కలిసి నటిస్తా
తిరుమల: శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులతోనే పదేళ్ల తరువాత ఓ హిట్ వచ్చిం దని సినీ హీరో నందమూరి కల్యాణ్ రామ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన శనివా రం ఉదయం నైవేద్య విరామ సమయంలో ‘పటాస్’ చిత్ర యూనిట్ తో కలసి శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఁపటాస్రూ. చిత్రం విజయవంతమైన నేపథ్యంలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని విజయయాత్ర ప్రారంభించాలనే ఉద్దేశంతో తిరుమలకు వచ్చామన్నారు. మంచి కథ వస్తే ఈ ఏడాదిలోనే బాబాయ్ బాలకృష్ణ, తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్‌తో కలసి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇందుకోసం చాలా రోజుల నుంచి వేచి ఉన్నానని చెప్పారు. ప్రస్తుతం ‘షేర్’ చిత్రంలో నటిస్తున్నాని తెలిపారు. తమ బ్యానర్లో చిత్రీకరిస్తున్న ‘కిక్2’ సినిమా త్వరలో అభిమానుల ముందుకు రానున్నట్టు వెల్లడించారు. దర్శకుడు అనిల్ మాట్లాడుతూ తన చిత్రాన్ని హిట్ చేసిన వారందరికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. వీరితో పాటు పటాస్ చిత్రంలో నటించిన నటులు రాఘవ, ప్రభాస్ శ్రీను, సురేష్, శివనారాయణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. -
శ్రీవారి భక్తులకు శుభవార్త
తిరుమల : శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించునేందుకు వచ్చే సామాన్య భక్తులకు అదనంగా మరో రెండు లడ్డూలు అందజేయాలని టీటీడీ నిర్ణయించింది. శనివారం టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు విలేకర్లతో మాట్లడుతూ... ఇప్పుడిస్తున్న రూ. 10 సబ్సిడీ లడ్డూతోపాటు అదనంగా రూ. 25 చొప్పున రెండు లడ్డూలు సామాన్య భక్తులకు అందివ్వాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిర్ణయాన్ని రెండు రోజుల్లో అమలు చేస్తామని శ్రీనివాసరాజు వెల్లడించారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుపతి: శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి, టాలీవుడ్ హీరో కళ్యాణ్ రామ్ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
వ్యక్తి దారుణ హత్య
ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మంగళవారం చోటుచేసుకుంది. చేవెళ్లలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ గుండం(పుష్కరిణి) వద్ద ఓ వ్యక్తిని దుండగులు దారుణంగా హత్య చేశారు. బండరాయితో మోది హత్య చేసినట్లుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఆలయ పుష్కరిణి వద్దకు చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల జాడను తెలుసుకునేందుకు జాగిలాలను రప్పించారు. మృతుడి వయసు 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. -
శ్రీవారి దర్శనానికి 30 గంటలు
సెలవుల నేపథ్యంలో తిరుమల శనివారం భక్తజన సందోహమైంది. సర్వదర్శనం, కాలిబాట క్యూల్లో అన్నిచోట్లా కిక్కిరిసిన జనం కనిపించారు. క్యూల్లో చంటిబిడ్డలు, చిన్నారులు, వృద్ధులు నలిగిపోయారు. చిన్నారుల రోదనలు మిన్నంటాయి. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 55,857 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండి, వెలుపల కిలోమీటరు వరకు క్యూకట్టిన భక్తులకు దర్శన సమయం 30 గంటలు పడుతోంది. శనివారం కావడంతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో కాలినడకన అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు 13 కంపార్ట్మెంట్లలో నిండడంతో పాటు వెలుపల కిలోమీటరు దూరం వరకు క్యూ కట్టారు. వీరికి 18 గంటల తర్వాత స్వామి దర్శనం లభించనుంది. గదుల కోసం పద్మావతి, సీఆర్వో, ఎంబీసీ-34 రిసెప్షన్ కేంద్రాల వద్ద భక్తులు పడిగాపులు కాచారు. తలనీలాలు సమర్పించేందుకు కల్యాణకట్టల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. రద్దీ పెరగడంతో ముందుజాగ్రత్తగా టీటీడీ అన్ని రకాల బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. రాజ్యాంగ హోదా కలిగిన వ్యక్తులకు పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లు కేటాయించారు. కాగా, ఈనెల 26వ తేదీ సోమవారం తిరుమలలో శ్రీవారి రథసప్తమి మహోత్సవం నిర్వహించనున్నారు. ఒకరోజు బ్రహ్మోత్సవంగా ప్రసిద్ధి పొందిన రథసప్తమి పర్వదినాన ఏడు వాహన సేవల్లో స్వామిని దర్శించి తరించే అవకాశం ఉంది. - సాక్షి, తిరుమల -
15 నుంచి సుప్రభాత సేవ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 15వ తేదీ నుంచి సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు. గత నెల 16న ధ నుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి ఆలయంలో సుప్రభాతసేవకు బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలను పారాయణం చేస్తున్నారు. ధనుర్మాసం 14వ తేదీతో ముగియనుండడంతో 15న సుప్రభాతసేవను పునఃప్రారంభించనున్నారు. ఈ నెల 16వ తేదీ పారువేట ఉత్సవం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉత్సవమూర్తులను ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలోని పారువేట మండపం వద్దకు తీసుకునివెళ్లి వేట కార్యక్రమం నిర్వహిస్తారు. తొమ్మిది గంటల్లో శ్రీవారి దర్శనం తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తగ్గింది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 38,130 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 16 కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు 9 గంటలు, కాలిబాట భక్తులకు 4 గంటల్లో దర్శనం లభించింది. -
క్రిస్మస్కు దేవుని ఆజ్ఞలు
యెహోవా మహిమల నేపథ్యంలో పి. మల్లికార్జున్ నిర్మించిన చిత్రం ‘ఇజ్రాయేల్ దేవుని ఆజ్ఞలు’. కె. మురళీమోహన్‌రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, కృష్ణుడు, విజయరంగరాజు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ఈ 25న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం కోసం శ్రీవెంకట్ స్వరపరచిన ఆరు పాటలకు మంచి స్పందన లభిస్తోంది. అన్ని మతాలవారికీ నచ్చే విధంగా చేసిన సినిమా ఇది. ఈ చిత్ర లాభాలను అనాథ పిల్లల సహాయార్థానికి వినియోగించబోతున్నాం’’ అని చెప్పారు. -
26న రాష్ట్రపతి రాక
అయిభీమవరం (ఆకివీడు) : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ నెల 26న అయిభీమవరం రానున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎంజీ గోపాల్ తెలిపారు. ఆకివీడు మండలం అయిభీమవరంలో వేద పాఠశాల నిర్మాణ పనులను సోమవారం గోపాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.5 కోట్లతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల నూతన భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్రపతి తొలుత వేద పాఠశాలలోని గోశాలకు వస్తారని, అక్కడి పుష్కరిణిని పరిశీలించి యాగశాలకు వెళతారని తెలిపారు. అనంతరం వేద పాఠశాల ప్రధాన భవనాన్ని ప్రారభించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. మొత్తంగా రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన కార్యక్రమాలు సుమారు 1.45 గంటలపాటు కొనసాగుతాయని చెప్పారు. ఆయన వెంట టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, జేఈవో పోల భాస్కర్, సీఈ చంద్రశేఖరరెడ్డి, ఈఈ డీవీ శ్రీహరి, డీఈఈ ఇ.రామకృష్ణ, వైదిక్ విభాగ్ పీవో విభీషణశర్మ, విద్యుత్ విభాగం ఎస్ఈ ఎ.వెంకటేశ్వర్లు, డీఈఈ ఇ.శ్రీనివాస్, ఆర్డీవో డి.పుష్పమణి తహ సిల్దార్ వి.నాగార్జునరెడ్డి ఉన్నారు. ఏర్పాట్ల పరిశీలన రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యూరు. నరసాపురం ఆర్డీవో డి.పుష్పమణి సోమవారం అయిభీమవరం వచ్చారు. పర్యటనకు సంబంధించిన అంశాలపై టీటీడీ ఈవో గోపాల్‌తో చర్చించిన ఆర్డీవో అనంతరం టీటీడీ మాజీ చైర్మన్ బాపిరాజుతో కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. లయన్స్ ఆడిటోరియంకు ఎదురుగా ఉన్న స్థలం రాష్ట్రపతి, ఆయనతోపాటు వచ్చే మరో రెండు హెలికాప్టర్లు దిగేందుకు అనువుగా ఉంటుందని నిర్ధారించారు. -
హరిహర సుతయే.. అయ్యప్ప స్వామియే..
పట్టణంలో పెరుగుతున్న అయ్యప్ప భక్తుల సంఖ్య భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలోని వివిధ భక్త మండళ్లు అయ్యప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. తెలుగు వారితోపాటు ఇతర రాష్ట్రాలవారు కూడా అయ్యప్ప మాలలు ధరించి ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్య ఉపవాసాలు పాటిస్తున్నారు. శనివారాలు వడి పూజలు చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపంలో... శ్రీవేంకటేశ్వర కల్యాణ మండపంలో వెంకటాచల అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మాలధారులు గత పక్షం రోజుల నుంచి ప్రతి శుక్రవారం మహిళలచే లలిత సహస్రనామం, కుంకుమార్చన, శనివారాలు వడిపూజ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనవరి ఒకటో తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా గడ్డం లక్ష్మణ్ గురుస్వామి చేతుల మీదుగా మహాపూజ నిర్వహించనున్నట్లు ఆ సంస్థ అధ్యక్షుడు మహేశుని శ్రీనివాస్ తెలిపారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో... దత్తమందిర్ ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి భక్త మండలి ఆధ్వర్యంలో 18 మంది తెలుగువారు అయ్య మాల ధరించారు. నిత్య పూజలతోపాటు ప్రతి శనివారం వడిపూజ భజన, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గురుస్వామి కట్టెకోల విష్ణు చెప్పారు. డిసెంబరు 25న మహాపూజ ఉంటుందని చెప్పారు. శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో... ప్రముఖ వరాలదేవి మందిరం ఎదురుగా ఉన్న శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో 26 మంది తెలుగువారు అయ్యప్ప మాలధారులయ్యారు. శ్రీ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య పూజలతోపాటు డిసెంబర్ 24న ప్రత్యేకంగా మహాపూజ ఉంటుందని గురుస్వామి సురేష్ తెలిపారు. అదేవిధంగా నయీబస్తీలోని గణేశ్ మందిరంలో శ్రీగణేశ్ తమిళ మిత్ర మండలి ఆధ్వర్యంలో డిసెంబరు 28న మహాపూజ నిర్వహిస్తున్నట్లు గురుస్వామి మురుగన్ తెలిపారు. -
శ్రీవారి సన్నిధిలో ఎంపీ వైవీ
సాక్షి,తిరుమల : రాష్ట్రంలో వర్షాలు బాగా కురిపించి, సస్యశ్యామలం చేయాలని శ్రీవేంకటేశ్వర స్వామిని వేడుకున్నట్లు ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం తన మనుమడు అగస్త్య పుట్టెంట్రుకలను శ్రీవారికి సమర్పించారు. ఆయన సతీమణి స్వర్ణమ్మ, కుమారుడు విక్రాంత్‌రెడ్డి, కోడలు అపూర్వ, తమ్ముడు భద్రారెడ్డితో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియూతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ అభివృద్ధిపథంలో నడిచేలా శ్రీవారు ఆశీస్సులు అందజేస్తారని ఆకాంక్షించారు. వారి వెంట వైఎస్ఆర్ సీపీ నేత తన్నీరు నాగరాజు ఉన్నారు. -
శ్రీవారి సేవలో దిల్షాన్...
సాక్షి,తిరుమల: శ్రీలంక క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ సోమవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నాడు. ఉదయం నైవేద్య విరామ సమయం తర్వాత దిల్షాన్ ఆలయానికి వచ్చారు. -
వెంకన్న సేవలో శ్రీలంక ప్రధాని జయరత్నే
శ్రీలంక ప్రధాన మంత్రి ఎండీ.జయరత్నే శుక్రవారం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి రోడ్డుమార్గం ద్వారా ఉదయం 8.30 గంటలకు తిరుమలకు వచ్చారు. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు స్వాగతం పలికారు. జయరత్నే ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత పచ్చకర్పూరపు వెలుగులో మూలమూర్తిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేద పండితులు జయరత్నేకు ఆశీర్వచనం చేశారు. - సాక్షి, తిరుమల -
వైభవంగా పుష్పాల ఊరేగింపు
తిరుమల : అలంకార ప్రియుడైన వేంకటేశ్వరస్వామి సేవకు పుష్పాలు తరలివచ్చాయి. తిరుమల వేంకటేశ్వరస్వా మి ఆలయంలో శుక్రవారం పుష్పయాగం జరిగింది. ఈ మేరకు శ్రీవారి పుష్పయాగంలో 6 రకాల ఆకులు, 12 రకాల పుష్పాలను వినియోగించారు. టీటీడీ ఉద్యానవనం నుంచి ఆలయ వరకు ఈ పుష్పాలను శ్రీవారిసేవకులు, టీటీడీ ఉద్యోగులు బుట్టల ద్వారా తీసుకువచ్చారు. గోవింద నామస్మరణలు చేస్తూ స్వామి సేవకు పుష్పాలను, పత్రాలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. స్వామిని తాకే పుష్పాలను తమ చేతుల ద్వారా తీసుకురావటం పూర్వజన్మ సుకృతమంటూ శ్రీవారి సేవకులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, అంతకుముందు ఊరేగింపునకు ప్రారంభంలో జేఈవో శ్రీనివాసరాజు, ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఉద్యానవనం సూపరిటెండెంట్ శ్రీనివాసులు ఉద్యానవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మాండం
- కోలాహలంగా వాహన సేవలు, గరుడసేవలో వీఐపీ దర్శనంపై విమర్శల వెల్లువ - 31 లక్షల మందికి అన్నప్రసాదాలు - ఆకట్టుకున్న విద్యుత్ అలంకరణలు - అన్నీ తానై నడిపించిన ఈవో గిరిధర్ గోపాల్ - జేఈవో నిరంతర పర్యవేక్షణ - డీఐజీ, సీవీఎస్వో, ఎస్పీ పటిష్ట భద్రత సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఉదయం చక్రస్నానంతో సేద తీరిన శ్రీవారు, రాత్రి ధ్వజావరోహణంతో ఉత్సవాలకు ముగింపు పలికారు. అంతకుముందు రోజైన శుక్రవారం ఉదయం రథోత్సవం, రా త్రి అశ్వవాహన సేవలు అంగరంగవైభవంగా సాగాయి. దేవదేవుడు పూటకో వాహనంపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరిస్తూ పరవశింప చేశారు. ఈసారి హుండీ కానుకలూ పెరిగాయి. గరుడవాహనంలో మూడు లక్షల మందికిపైగా పాల్గొనడం విశేషం. టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్ ఈసారి అన్నీ తానై వాహనసేవల్ని నడిపించారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించారు. వాహన సేవలు.. విమర్శలు గత నెల 26వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు ఈనెల 4వ తేదీ శనివారం వరకు తొమ్మిది రోజులపాటు అత్యంత వేడుకగా సాగాయి. తొలి రోజు పెద్ద శేషవాహనం తో ప్రారంభమై ఆఖరిరోజు తిరిచ్చివాహనంతో ముగిశాయి. ఆలయ విభాగం సమష్టిగా పనిచేసి సకాలంలో ఆలయం నుంచి ఉత్సవమూర్తులను వాహన మండపానికి తరలించి అక్కడ విశేష ఆభ రణాలు, పుష్పాలంకరణ చేశారు. నిర్ణీత సమయానికి ఉత్సవాలను నాలుగు మాడవీధుల్లో ప్రదర్శన నిర్వహిం చారు. కీలకమైన గరుడ వాహన సేవలో ఈసారి ఆలయంలోని మూలమూర్తి తరహాలో సుమారు 50 నిమిషాలపాటు వెయ్యిమందికి దర్శనం కల్పించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తర్వాత వెలుపలకు వచ్చిన గరుడ వాహనాన్ని తూర్పు మాడ వీధిలో సుమారు లక్ష మందికి భక్తులకు కేవలం పది హేను నిమిషాల్లోనే దూరంగా నుంచి చూపించి మమ అనిపించడం ఇంటాబయటా విమర్శలు మూటకట్టుకున్నారు. ఆరోజు సుమారు 3 లక్షల మంది ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు. ఆరో రోజు స్వర్ణరథం ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఎనిమిదో రోజు ఉదయం మహారథం భక్తుల గోవింద నామస్మరణల మధ్య వైభవంగా సాగింది. తూర్పు,దక్షిణమాడ వీధిలోని మలుపును వెడల్పు చేయడం వల్ల మహారథం ఊరేగింపు కార్యక్రమం వేగవంతమైంది. వాహన సేవల ముందు హిందూ ధర్మప్రచార పరిషత్తు, దాస సాహిత్య, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యం లో మూడువేల మందికిపైగా కళాకారులు తమ కళాభినయంతో భక్తులను అలంరిం చారు. 31 లక్షల మందికి అన్నప్రసాదాలు, అల్పాహారం - టీటీడీ నిత్యాన్న ప్రసాద ట్రస్టు నుంచి రికార్డు స్థాయిలో 31 లక్షల 44వేల 167 మంది భక్తులకు అన్ని రకాల అన్నప్రసాదాలు అందించారు. ఇందులో 12.13 లక్షల మందికి భోజనం, 8.32 లక్షల మందికి టిఫిన్లు, 10.98 లక్షల మందికి పాలు, కాఫీ, టీ, మజ్జిగ అందజేశారు. - ఐదోరోజు గరుడ వాహన సేవను 3 లక్షల మంది దర్శించుకున్నారు. స్వర్ణరథోత్సవం, మహారథోత్సవంలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. - ఈసారి ఎనిమిది రోజుల్లో 21 లక్షల 27వేల 379 లడ్డూలను భక్తులకు సరఫరా చేయగా, దాని ద్వారా రూ.3 కోట్ల్ల 11 లక్షల 84 వేలు లభించింది. గతంలో కంటే ఈసారి 9.3 శాతం పెరగడం విశేషం. అలాగే, దర్శన టికెట్ల అమ్మకం ద్వారా రూ.3 లక్షల 70 వేలు లభించింది. - గదుల అద్దె ద్వారా రూ.1కోటి 45 లక్షల 82 వేలు లభించగా, గత ఏడాది రూ.94 లక్షల 11వేల 210 అందింది. ఈసారి 49,624 మందికి ఉచిత వైద్యసేవలు అందించారు. - ఎనిమిది రోజుల్లో 246 లక్షల గ్యాలన్ల నీటి వాడకం - ఏపీఎస్ఆర్టీసీ ద్వారా 10 మొత్తం లక్షలా 30 వేల మందికి ప్రయాణ సౌకర్యం కల్పించారు. - పుస్తక విక్రయాల ద్వారా రూ.2,89,131 ఆదాయం - రోజుకు 3957 మంది శ్రీవారి సేవకుల సేవలు విజిలెన్స్, పోలీసుల పటిష్ట భద్రత శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అనంతపురం రేంజ్ డీఐజీ బాల కృష్ణ, సీవీఎస్వో ఘట్టమనేని శ్రీనివాస్, ఎస్పీ గోపీనాథ్జ ట్టి, అదనపు సీవీఎస్వో శివకుమార్‌రెడ్డి, తిరుమల ఏఎస్పి ఎంవీఎస్ స్వామి, డీఎస్పి నరసింహారెడ్డి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. సుమారు 3 వేల మందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. గరుడసేవ రోజున అదనంగా మరో 1500 మంది నియమించారు. టీటీడీ విజిలెన్స్ విభాగం మరో 2500 మందిని భద్రత కోసం వినియోగించారు. ఉత్సవాల్లో ప్రముఖుల సందడి బ్రహ్మోత్సవాల తొలిరోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. తర్వాత సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా తదితరులు వాహన సేవల్లో పాల్గొన్నారు. స్వర్ణరథం, మహారథంపై ఇంజనీర్ల ప్రత్యేక శ్రద్ధ ఈ బ్రహ్మోత్సవాల్లో స్వర్ణరథం, మహారథం ఊరేగింపును ఇంజనీరు చంద్రశేఖరరెడ్డి, ఇంజనీర్లు మూరె రమేష్‌రెడ్డి, జీవీ కృష్ణారెడ్డి,రాజశేఖర్, దేవరాజుల బృందం నిరంతర పర్యవేక్షణతో రెండు రథాలను ఊరేగించడంలో సఫలీకృతులయ్యారు. పుష్కరిణిలో నీటి ని తొలగించటం, మరమ్మతులు చేయడం, చక్రస్నానం కోసం పుష్కరిణిని పూర్తిస్థాయి క్లోరినేషన్తో సిద్దం చేయటం వరకు ఈఈ నరసింహమూర్తి ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. సాక్షాత్తు సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఎల్ దత్తు పుష్కరిణిలోని నీటి క్లోరినేషన్, పరిశుభ్రత చాలా బాగుందని కితాబిచ్చారు. ఆకట్టుకున్న పుష్ప, ఫొటో ప్రదర్శనలు.. విద్యుత్ అలంకరణలు భేష్ ఈసారి టీటీడీ ఉద్యానవనం, విద్యుత్ విభాగాలు పోటీపడి అలంకరణలు చేశాయి. గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు నేతృత్వంలో 30 టన్నుల పుష్పాలతో ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు సుగంధ పరిమళభరిత పుష్పాలతో అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యుత్ విభాగం ఎస్ఈ వేంకటేశ్వర్లు, డీఈ రవిశంకర్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేశారు. ఈసారి 30 భారీ విద్యుత్ కటౌట్లతోపాటు ఎల్ఈడీ అలంకరణలు భక్తులను ఆనంద పరిచాయి. అలాగే పుష్ప ప్రదర్శన, ఫొటో ఎగ్జిబిషన్లకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఎస్వీ మ్యూజియం డెరైక్టర్ విజయ్‌కుమార్, చిత్రకారుడు బత్తల ఆనంద్ ప్రత్యేక శ్రద్ధతో ఏర్పాటు చేసిన 108 దివ్యక్షేత్రాలు, ఇతర పురాతన వస్తువుల ప్రదర్శనకు విశేష స్పందన కనిపించింది. గతంలో పోల్చితే ఈసారి ప్రదర్శనలు తిలకించే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. -
స్వామి సేవలో పెరుమాళ్ పల్లె
‘పెరుమాళ్’ అంటే తమిళంలో శ్రీవేంకటేశ్వర స్వామి అని అర్థం. దిగవూరుకు చెందిన వందలాది కుటుంబాలు మహంతుల కాలం నుంచి తిరుమల ఆలయంలో సేవ చేశాయి. నిరంతరం పెరుమాళ్ సేవలో తరించిన దిగవూరు గ్రామం కాలానుగుణంగా ‘పెరుమాళ్’ పల్లెగా రూపాంతరం చెందింది. తిరుపతి నుంచి చంద్రగిరి మార్గంలో10 కి .మీ. దూరంలో తిరుమల శేషాచల కొండ కింద ఈ పల్లె ఉంది. 1843 నుంచి 1933 వరకు ఆలయ పాలనను ఉత్తరాదికి చెందిన హథీరాం మఠం మహంతులే పర్యవేక్షించారు. అప్పట్లో ఆయా పర్వదినాల్లో నిత్యపూజలు, ఆలయ ఆదాయపు లెక్కలు, పండుగలు ఎప్పుడు వస్తాయి, ఉత్సవాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎంతమంది సేవకులు, పనివాళ్లు అవసరం... అన్న విషయాలను మఠం పాలనాధికారులే నిర్ణయించేవారు. నాటి దిగవూరు నేటి ‘పెరుమాళ్’పల్లె తిరుమలలో మౌలిక వసతులు ఏమీ లేనప్పటికీ మహంతుల పిలుపు మేరకు తిరుపతి, దిగవూరు లాంటి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తొలిజాములోనే కాలినడకన తిరుమలకు చేరి, ఆలయ పనుల్లో భాగస్వాములయ్యేవారు. వీరిలో దిగవూరు గ్రామస్థులే కీలకంగా మారారు. వారితో మహంతులకు అవినాభావ సంబంధం ఏర్పడింది. వారి స్వామి సేవకు చిహ్నంగా దిగవూరును పెరుమాళ్పల్లెగా మార్పు చేశారు మహంతులు. మహంతులు ఏర్పడిన 1843 నుంచి 1933లో టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడేవరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. నాటి నుంచి అనేక రకాలు సేవలు చేసిన వీరు కాలక్రమంలో ఆలయ ఉద్యోగులుగా మారారు. పెరుమాళ్పల్లెకు కూతవేటు దూరంలోని తొండవాడకు చెందిన ఐఏఎస్ అధికారి ఎం.చంద్రమౌళిరెడ్డి 1969లో టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. అప్పటి వరకు రోజువారి కూలీలుగా పనిచేసే పెరుమాళ్ వాసులకు అవగాహన కల్పించి ఉద్యోగులుగా చేరాలని సూచన చేయటంతో వారు దేవస్థానం ఉద్యోగులుగా మారారు. నాటి నుంచి నేటికీ వందల కుటుంబాలు ఆలయ ఉత్సవాలను మోసే వాహన బేరర్లు, ఇతర విభాగాల సిబ్బందిగా పనిచేస్తున్నారు. నాడు దమ్మిడీ, అణాలు, రూకలు సంపాదించేవీరు ప్రస్తుత టీటీడీ ఉద్యోగులుగా రూ.30 వేల వరకు జీత భత్యాలు పొందే స్థాయిలో ఉన్నారు. పెరుమాళ్‌పల్లె వాసులతో ప్రత్యేక సైన్యం వెంకటగిరి సంస్థానం, శ్రీకాళహస్తి పాలెగాళ్లకు హథీరాంజీ మఠం పాలకులు అప్పటి సామాజిక పరిస్థితుల్లో కప్పంగా అనధికార చెల్లింపులు చేసేవారు. గత రికార్డుల ప్రకారం హథీరాం మఠం పాలకులు పాలెగాళ్లకు వందల రూకలు, స్వర్ణనాణాలు అప్పుగానూ, అనధికారికంగానూ చెల్లింపులు చేసినట్టు తెలుస్తోంది. పాలెగాళ్ల దర్పం తగ్గుతున్న సమయంలో హథీరాం మఠం పాలకులు సొంతంగా పెరుమాళ్లపల్లె వాసులు, చుట్టూ గ్రామాలకు చెందిన జనంతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సైన్యానికి మఠంలోని బైరాగులే నాయకత్వం వహించినట్టు రికార్డులు చెబుతున్నాయి. తిరుమలలో చిరు వ్యాపారాలు ఇక, పెరుమాళ్లపల్లెతోపాటు నరసింగాపురం, మిట్టపాళెం, చంద్రగిరి, నాగపట్ల రిజర్వుప్రాంతంలోని గ్రామాల ప్రజలు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మజ్జిగ, కూరగాయలు, పప్పుదినుసులు, తినుబండారాలు, రాగి, సజ్జ,జొన్నరొట్టెలు, చెక్కల బెల్లంగా పిలిచే నల్లబెల్లంతో తయారు చేసిన శెనక్కాయ తీపి పదార్థాలను తిరుమలకు తీసుకొచ్చి వ్యాపారాలు సాగించే వారు. స్వామివారితో వీరి అనుబంధం నేటికీ అలానే కొనసాగుతోంది. మా భుజాలపై స్వామి వాహనాలను మోసే భాగ్యం... దేవదేవుడైన స్వామినే భుజాలపై మోసే భాగ్యం దక్కటం మా పూర్వజన్మ సుకృతం. తిరుమలకు ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల నుంచే మా గ్రామస్తులు స్వామి సేవ చేశారు. మా పెద్దల ఉద్యోగ విరమణతో ఇతర విభాగాల దేవస్థానం ఉద్యోగులు మాతోపాటు స్వామి సేవలో భాగస్వాము లయ్యారు. 1991లో ఆలయంలో రంగనాయక మండపం నుంచి అద్దాల మండపం వరకు బరువులు మోయడంతో స్వామి వాహన సేవలు మోసే వాహన బేరర్‌గా మారాను. అప్పటి నుంచి స్వామి సేవలో ఉంటున్నాను. అందుకు ఆనందంగా ఉంది. - మధుసూధన్‌రెడ్డి, పెరుమాళ్‌పల్లె -
తిరుమలలో భక్తులు ఆచరించాల్సినవి
తిరుమలకు బయలు దేరేముందు ఇష్టదేవతలను పూజించుకోవాలి. శ్రీ వారిని దర్శించేముందు పుష్కరిణిలో స్నానంచేసి, ముందుగా వరాహస్వామిని పూజించాలి. ఆ తర్వాతే శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించాలి. ఆలయంలో నిశ్శబ్దాన్ని పాటిస్తూ ‘ఓం శ్రీవేంకటేశాయ నమః’ అని స్మరిస్తూ ఉండాలి. స్వామిపైనే ధ్యాసను ఉంచాలి. తిరుమల సమీపంలో ఉన్న ఆకాశగంగ, పాపవినాశనం తీర్ధాలలో స్నానం చేస్తే, సకల పాపాలు హరిస్తాయి. తిరుమలలో ఉన్నప్పుడు సనాతన భారతీయ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను విధిగా పాటించాలి. తిరుమల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. బయోడీగ్రేడబుల్ ప్లాస్టిక్ కవర్లను మాత్రమే వినియోగించాలి కానుకలు, ముడుపులను ఆలయంలోని స్వామి హుండీలోనే సమర్పించాలి. తిరుమలలో భక్తులు చేయకూడనివి ఆలయం చుట్టూ నాలుగు మాడవీధుల్లో పాదరక్షలు ధరించరాదు. ఈ వీధుల్లోనే ఉత్సవమూర్తులు నిత్యం ఊరేగుతూ భక్తులను కటాక్షిస్తుంటారు. విలువైన ఆభరణాలు, ఎక్కువ నగదు మీ వద్ద ఉంచుకోకూడదు. శ్రీవారి దర్శనం కోసం కాకుండా ఇతర ఉద్దేశాలతో తిరుమలకు రాకూడదు. స్వామి దర్శనం కోసం త్వరపడకుండా మీవంతు వచ్చేవరకు ఆగాలి. ఆలయార్హత లేని సందర్భాల్లో ఆలయంలోకి రాకూడదు. స్వామి కొలువైన తిరుమల క్షేత్రంలో పువ్వులు అలంకరించు కోరాదు. తిరుమల గిరుల్లోని విరులన్నీ స్వామి సేవకే. కాటేజీల్లో నీరు, విద్యుత్ వృథా చేయకూడదు. అపరిచితులను వసతి గృహాల్లోకి అనుమతించరాదు. వారిని నమ్మి, గది తాళాలను ఇవ్వకూడదు. పర్యావరణానికి హానిచేసే ఇతర ప్లాస్టిక్ కవర్లు వినియోగించరాదు. తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం మొదలైనవి పూర్తిగా నిషేధం. పేకాట, జూదం వగైరాలు పూర్తిగా నిషేధం. శ్రీవారి దర్శనం, వసతి కోసం దళారులను ఆశ్రయించరాదు. వారిని ప్రోత్సహించరాదు. దళారులనుంచి నకిలీ ప్రసాదాలను కొనుగోలు చేయరాదు. ఆలయప్రాంగణంలో ఉమ్మివేయరాదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. తిరుమలలో అన్యమతప్రచారం నిషేధం. వివిధ రాజకీయసభలు, బ్యానర్లు, ధర్నాలు, రాస్తారోకోలు, హర్తాళ్లు మొదలైనవి నిషేధం. ఆలయంలోకి సెల్ఫోన్లు, కెమెరాలు వంటి పరికరాలు తీసుకువెళ్లరాదు. ఆయుధాలు తీసుకురాకూడదు. జంతు వధ నిషేధం. భిక్షుకులను ప్రోత్సహించరాదు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలన్న నిబంధనను టి.టి.డి. కచ్చితంగా అమలు చేస్తోంది. పురుషులు ధోవతి-ఉత్తరీయం, కుర్త-పైజామా... మహిళలు చీర-రవిక, లంగా-ఓణి, చున్నీతో పాటు పంజాబీ డ్రస్, చుడీదార్ ధరించాల్సి ఉంటుంది. స్వచ్ఛంద సేవ ‘శ్రీవారి సేవ’లో పాల్గొనదలచిన వాలంటీర్లు కూడా డ్రెస్‌కోడ్‌ను విధిగా పాటించాలి. తొక్కిస లాటలకు, తోపులాటలు తావులేకుండా ఆలయ అధికారులకు, స్వచ్ఛంద సేవకులకు సహకరిస్తే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం లభిస్తుంది. తిరుమలకు వెళ్లిన ప్రతి ఒక్కరికీ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి దర్శనానుగ్రహాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుందాం. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యేక సంచిక కథనాలు, అరుదైన పాత ఫొటోల సేకరణ సహదేవ కేతారి సాక్షి, తిరుమల ఫొటోలు: కె.మోహన్‌కృష్ణ, సాక్షి, తిరుమల కొన్ని ఫొటోలు, సమాచార సౌజన్యం: టీటీడీ ప్రజా సంబంధాల విభాగం -
అద్దంలో చూసుకుని మురిసే స్వామి
శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల కింద దేదీప్యమైన దివ్యకాంతులతో వెలిగే భుజములు (కోణాలు) ఉన్న చిత్రం ఉన్నదని ... నమ్మాళ్వారు తన పాశురం ‘తిరుమాల్ - ఇరబ్- సోలై’ ద్వారా తెలియజేశారు. స్వామి రోజూ అద్దంలో చూసుకుంటారా? అంటే అవుననే చెబుతోంది వైఖానస ఆగమ శాస్త్రం. ప్రత్యూష కాల పూజల్లో గర్భాలయ మూలమూర్తికి ఆదర్శము (అద్దం), గోవు, సలక్షణమైనటువంటి కన్య, గజం, అశ్వం, గాయకుడు... ఇలా వరుసగా దర్శింప చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. ఇదే సంప్రదాయం ఆధునిక కాలంలోనూ స్పల్పమార్పులతో నేటికీ కొనసాగుతుండటం విశేషం. 8వ శతాబ్దంలో వైఖానస మహా పండితుడు శ్రీమాన్ నృసింహ వాజపేయ యాజులవారు తన ‘భగవదర్చాప్రకరణమ్’ అనే గ్రంథంలో తిరుమల ఆలయంలో నిత్యం వైఖానస ఆగమోక్తంగా జరిగే ఆరాధన గురించి తెలియజేశారు. శ్రీవారికి కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాల అమలు కోసం పూర్వం వైఖానస అర్చకులు దూరదృష్టితో కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ప్రత్యూష కాలంలో అర్చకులు ఆలయ ప్రవేశం చేసి కుంచెకోల (తాళాలు)తో మంత్ర పూర్వకంగా బంగారు వాకిలి ద్వారాలు తెరిచి వేదపఠనంతో అంతరాళంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలోని స్వామి మూర్తికి కుడివైపున దక్షిణ దిశలో దర్పణం ఏర్పాటు చేసి ఉంది. అర్చకులు ఆ అద్దంలోగుండానే స్వామిని చూస్తూ ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆగమ సంప్రదాయానికి లోబడే మూలమూర్తికి ఎదురుగా బంగారు వాకిలిలోని గరుడాళ్వారు సన్నిధికి పైభాగంలో టీటీడీ పెద్ద అద్దం ఏర్పాటు చేసింది. లేగదూడతో సహా గోవును స్వామి వారి ప్రథమ వీక్షణకై అంతరాళంగా పరిగణించే శయన మండపంలో నిలిపి ఉంచాలి. పూర్వం శ్రీవారికి ప్రత్యూష కాల కైంకర్యాల నిర్వహణ కోసం సన్నిధి గొల్ల ముందుగా ఆవు, దూడతో వెళుతుండగా, ఆయనను అనుసరించి అర్చకులు ఆలయ ప్రవేశం చేసేవారు. ఆవు, లేగదూడలను గర్భాలయ మూలమూర్తికి అభిముఖంగా నిలిపి, ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని పూర్తి చేయించాలి. తర్వాత సన్నిధి గొల్ల గోవు పొదుగు నుండి పాలు పితికి అర్చకులకు అందించేవాడు. ఆగమంలో చెప్పినట్టు ఆ పాలు ‘ధారోష్ణం’ అంటే ఆవు పొదుగు నుండి పాలు పితికినపుడు పాత్రలో పడిన పాల ధార వల్ల కొంత ఉష్ణం పుడుతుంది... అటువంటి ధారోష్ణం కలిగిన పాలను నివేదనగా సమర్పించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గోవు, లేగదూడను ఆలయంలోనికి ప్రవేశించే సంప్రదాయం లేదు. వైఖానస ఆగమంలో చెప్పబడిన ‘గో సూక్తం’ అనే వేద మంత్ర పఠనం ద్వారా పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆగమ సంప్రదాయంకోసం స్వామివారే యాదవ వంశస్థుడైన సన్నిధి గొల్లకు ప్రథమ దర్శనం చేసుకునే వరమిచ్చారు. అదే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. గజముఖాన్ని దర్శించే స్వామి స్వామివారు ప్రథమ వీక్షణ (తొలి చూపు)కై గజాన్ని దర్శించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. గర్భాలయ మూలమూర్తికి ప్రతినిధిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సమస్త పూజలను మూలమూర్తికి సమానంగానే నిర్వహిస్తారు. రాత్రి ఏకాంత సేవ కూడా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికే నిర్వహిస్తారు. ఇదే చివరగా నిర్వహించే పవళింపు పూజ. గర్భాలయానికి ముందున్న శయనమండపంలో వేలాడదీసిన నవారు మంచంపై దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి భోగ శ్రీనివాసుడిని శయనింప చేస్తారు. మరుసటి రోజు ప్రత్యూషకాల సుప్రభాత సేవలో భాగంగా, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొలుపుతారు. శయన మండపంలో స్వామివారికి ఉత్తర, దక్షిణ దిశల్లో రెండేసి శిలాస్తంభాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర దిశలో ఉన్న ఓ శిలా స్తంభం అగ్రభాగాన గజ శిర స్సు చెక్కబడి ఉంది. శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సుప్రభాత సేవలో మేల్కొలుపు తర్వాత ప్రథమంగా శిలాస్తంభంపై ఉన్న గజ ముఖాన్ని దర్శింప చేస్తారు. ఆ తర్వాతే భోగ శ్రీనివాసుడిని శయనమండపం నుంచి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉన్న సింహాసనంపై జీవస్థాపంలో వేంచేపు చేస్తారు. శ్రీవారి పద్మపీఠం: దివ్యతేజో రహస్య యంత్రం శ్రీవేంకటేశ్వర స్వామి వారు గర్భాలయంలోని ఉపద్యక పవిత్ర స్థానంలో స్వయంవ్యక్త సాలగ్రామ అర్చావతారంగా స్థానిక మూర్తి/ ధృవమూర్తిగా పద్మపీఠంపై కొలువయ్యారు. స్వామి పాద పద్మాల కింద రహస్య యంత్రం ఉంది. సాక్షాత్తు మూలమూర్తి అంశగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహ పరిశీలనలో ఈ విషయం తేలింది. క్రీ.శ.614 వ సంవత్సరంలో పల్లవ రాణి సామవై పెరుందేవి మహారాణి ఈ రజిత మూర్తిని ఆలయానికి సమర్పించారు. శంఖచక్రాలు ధరించి, అడుగున్నర పొడవు కలిగిన ఈ రజితమూర్తి పూర్తిగా మూలమూర్తిని పోలి ఉంటుంది. ఈ విగ్రహం కింద యంత్రం ఉన్నట్టు అర్చకులు గుర్తించారు. అందువల్ల కచ్చితంగా మూలవిరాట్టు పాద పద్మాల కింద యంత్రస్థాపన ఉండి ఉంటుందనీ అర్చకుల వాదన. వైష్ణవ పరంపరలో గొప్ప ఆచార్యుడైనటువంటి నమ్మాళ్వారు ఈ రహస్యాన్ని గురించి వివరణ ఇచ్చి ఉండటం అర్చకుల వాదనకు బలం చేకూరింది. మా చిరునామా: ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
పూజారిని చితకబాది ఆలయంలో నగదు చోరీ
అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయంలో చోరీకి యత్నించగా... అక్కడే ఉన్న పూజారి వారిని వారించారు. దీంతో ఆగ్రహించిన దొంగలు పూజారిపై ఆయుధాలతో దాడి చేశారు. ఆ దాడిలో పూజారి రక్తపు మడుగులో స్పృహా తప్పి పడిపోయారు. ఆలయంలోని మూడు హుండీలలోని నగదును దొంగలు అపహారించుకుని పోయారు. స్థానికులు వెంటనే స్పందించి పూజారిని ఆసుపత్రికి తరలించారు. పూజారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో చోరీ జరిగిన తీరును పోలీసులు పరిశీలించారు. హుండీలో దాదాపు రూ. 2 లక్షల నగదును దొంగలు అపహరించుకుని పోయారని పోలీసులు తెలిపారు. -
వెంకన్నా క్షమించు
నీ పూజకు కొబ్బరి కాయల్లేవు కర్పూరంతో సర్దుకో భక్తుల ఆవేదన సాక్షి, తిరుమల: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి పూజకు కొబ్బరికాయల కొరత ఎదురైంది. శనివారం అఖిలాండం వద్ద భక్తులు కర్పూరం, అగరబత్తీలు మాత్రమే వెలిగించి అసంపూర్తిగా మొ క్కులు చెల్లించారు. ఆలయ అధికారులు మాత్రం పట్టీపట్టనట్టుగా ఉన్నారు. సాధారణంగా భక్తులు నడిచి తిరుమల కొండెక్కడం, కల్యాణకట్టల్లో తలనీలాలు సమర్పించడం, పుష్కరిణి స్నానం, శ్రీవారి దర్శనం, అఖిలాండం వద్ద కొబ్బరికాయ సమర్పించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమలలో రోజులో స్వామిని దర్శించుకునే 60 వేల మందిలో 20 వేల మంది దాకా ఆలయ అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి పరిపూర్ణంగా మొక్కులు చేసుకుంటారు. కొబ్బరికాయలు విక్రయించేందుకు అఖిలాండం వద్ద టీటీడీ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. రూ.15 చొప్పున ఒక సెట్లో కొబ్బరికాయ, కర్పూరం, అగర్బత్తీ అందజేస్తుంది. మూడు రోజులుగా భక్తులు పోటెత్తారు. ముందుజాగ్రత్త లేకపోవడంతో మూడు రోజులుగా అఖిలాండం వద్ద కొబ్బరికాయలకు తీవ్ర కొరత ఏర్పడింది. అడపాదడపా కొబ్బరికాయలు వచ్చినా గంటలోపే అమ్ముడవుతున్నాయి. శనివారం కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయల్లేవు. కౌంటర్లు మూసివేయటంతో మొక్కు చెల్లించేందుకు వచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇదే ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తులు విక్రయించే కర్పూరం వెలిగించి ‘క్షమించు స్వామి.. కొబ్బరికాయ లేదు. కర్పూరం మాత్రమే వెలిగించా.. సర్దుకో’ అంటూ తీవ్ర ఆవేదనతో తిరుగుముఖం పట్టారు. కొబ్బరికాయల కొరతపై ఆలయ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. తరచూ భక్తులకు ఎదురయ్యే కొబ్బరికాయల స్టాకు సమస్యను పరిష్కరించటంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. -
వెంకన్నకు శఠగోపం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు నగరం ఆర్ఆర్ పేట ఆలయంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామికి వజ్ర కిరీటం పేరిట ఓ అధికారి లక్షలాది రూపాయలు దండుకున్నా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారు. నిలువెత్తు స్వామికి వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని బహూకరించి కనులారా వీక్షిద్దామన్న ఉద్దేశంతో భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన సొమ్ములను దిగమింగేసిన సదరు అధికారిని బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నారు. ఏడెనిమిదేళ్ల కిందట శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని బంగారు కిరీటంతో అలంకరించాలని భక్తులు, నగర ప్రముఖులు భావించారు. అందుకు అప్పటి దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకున్నారు. ధర్మకర్తలు, భక్తులు, ప్రముఖులు విరాళాల రూపంలో నగదు సేకరించాలని నిర్ణయించారు. భక్తుల కొంగు బంగారంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలోని వెంకన్నకు విరాళాలు వెల్లువలా వచ్చాయి. అతి తక్కువ వ్యవధిలోనే దాదాపు రూ.30 లక్షల వరకు సొమ్ము రావడంతో విజయవాడ వెళ్లి మింట్ ద్వారా 1.200 కేజీల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొనుగోలు చేశారు. ఈ బిస్కెట్లతోపాటు మిగిలిన లక్షలాది రూపాయల నగదును ఏలూరులో ఆంధ్రాబ్యాం కులో డిపాజిట్ చేశారు. ఆ తర్వాత కిరీటం పనులకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. కిరీటాన్ని చేయించే బాధ్యత తీసుకోవాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు ఇక్కడి అధికారులు పలుమార్లు లేఖలు రాసినా స్పందనా రాలేదు. ఇలా ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. బంగారంపై కన్ను ఈ నేపథ్యంలోనే దేవాలయ మేనేజర్‌గా వచ్చిన తల్లాప్రగడ విశ్వేశ్వరరావు కన్ను బ్యాంకులో మూలుగుతున్న నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లపై పడింది. ఇక్కడి నుంచే అసలు కథ మొదలైంది. వాస్తవానికి దేవాదాయ శాఖ రీజినల్ జారుుంట్ డెరైక్టర్, డెప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఆభరణాల తనిఖీ అధికారి, నగర ప్రముఖులతో ఓ కమిటీ ఏర్పాటైంది. కిరీటం తయూరు చేరుుంచే పనులకు సంబంధిం చిన ప్రతిపాదనలు పంపాలని ఉన్నతాధికారులు మేనేజర్ విశ్వేశ్వరరావుకు సూచించారు. ఆయన ఇవేమీ పట్టించుకోకుండా, ఎవరి అనుమతులు తీసుకోకుండా నిబంధనలను పక్కనపెట్టి యుద్ధప్రాతిపదికన కిరీటం తయూరీ పనులు మొదలుపెట్టేశారు. భీమవరం మావుళ్లమ్మకు నగలు తయారు చేసే ఓ స్వర్ణకారుడికి ఈ కిరీటం తయారీ బాధ్యతను అప్పగించారు. బిస్కెట్లను కరిగించగా వచ్చిన దాంట్లో 200 గ్రాముల బంగారాన్ని తనకు ఇవ్వాల్సిందిగా సదరు అధికారి స్వర్ణకారుడిని కోరినట్టు తెలుస్తోంది. అరుుతే, ఆ స్వర్ణకారుడు ‘దయచేసి ఇలాంటి పనులు చేయమని అడగొద్దు. దేవుడి సొమ్ము ముట్టుకోవాలంటే మాకు భయం’ అని కుండబద్దలుకొట్టినట్టు చెప్పడంతో అక్కడికి సరిపెట్టేసిన అధికారి లెక్కాపత్రం లేని నగదుపై పడ్డాడు. కిరీటానికి అవసరమైన వజ్రాల కొనుగోలు పేరిట బ్యాంకులోని మొత్తం నగదును డ్రా చేసి ఇష్టారాజ్యంగా ఖర్చుచేశారన్న ఆరోపణలను మూటకట్టుకున్నాడు. వజ్రాల కొనుగోళ్లలో దాదాపు సగం డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. ఈ వజ్రాలు కూడా నాణ్యమైనవి కాదని సమాచారం. అమెరికన్ డైమండ్లను పొదిగేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆనోటా ఈనోటా కిరీటం పనులపై పలురకాల వ్యాఖ్యలు, శాస్త్ర విరుద్ధంగా కిరీటం డిజైన్ తయరవుతోందన్న వాదనలు రావడంతో అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి కిరీటం పనులకు ఎలాగోలా అనుమతి తీసుకున్నాడు. ఈ అనుమతుల విషయంలోనే తనకు చాలా డబ్బులు ఖర్చయ్యాయని, పైనుంచి కిందిస్థాయి అధికారుల వరకు చాలామందికి ముట్టజెప్పాల్సి వచ్చిం దంటూ వారి పేరిట కూడా ఆలయ మేనేజర్ వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారం మరింత ముదరకుండా కొన్నాళ్ల కిందట బ్రహ్మోత్సవాల సమయంలో హడావుడిగా స్వామివారికి కిరీటం అలంకరింపజేసి చేతులు దులిపేసుకున్నాడు. బదిలీతో అవినీతి రూపుమాపుతారా? స్వామివారి కిరీటధారణ జరిగి నెలలు గడుస్తున్నా దాని తయారీ వెనుక చోటుచేసుకున్న అక్రమాల వ్యవహారం ఇంకా తేలలేదు. కిరీటం తయూరీకి సంబంధించిన వివరాలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద ఇటీవల కొందరు దరఖాస్తు చేయగా, విశ్వేశ్వరరావు రూ.30 వేలు ఖర్చుపెట్టి కోర్టుకెళ్లి మరీ స్టే తెచ్చుకున్నాడు. ఈ అధికారి నిర్వాకంతో తమకు ఎక్కడ ఏ మరక అంటుకుంటుందోనని భయపడిన ఉన్నతాధికారులు విశ్వేశ్వరరావును ఇటీవలే బదిలీ చేశారు. కేవలం బదిలీతోనే అతని అవినీతి రూపుమాపుతుందా.. భక్తులు స్వామివారికి ఇచ్చిన లక్షలాది రూపాయల మాటేమిటి.. ఆ సొమ్ము దేవుడి ఖజానాకు తిరిగి ఎలా జమవుతాయన్న ప్రశ్నలు భక్తుల నుంచి వస్తున్నాయి. -
కల్యాణ శ్రీనివాసం
అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం విశాఖపట్నం: విశాఖ తిరుమలైంది. బంగాళాఖాతం పాలకడలిగా మారింది. స్వర్ణభారతి స్టేడియం సకల దేవతలకు నెలవైంది. ఆదివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా విష్వక్సేనా ఆరాధనోత్సవంతో కల్యాణం ప్రారంభమైంది. శ్రీవారి నైద్యాధిపతి విష్వక్సేనుల ఆరాధన చేశారు. అనంతరం అంకురారోపణ కార్యక్రమం జరిగింది. స్వామివారి అత్యంత సన్నిహితుడు, సేవకుడు మన విన్నపాలని స్వామివారికి హనిస్సు రూపంలో చేర్చడానికి అగ్ని కార్యం జరిపారు. సామూహిక సంకల్పం జరిపారు. అనంతరం స్వామివారి దక్షిణ హస్తానికి, అమ్మవార్లు వామహస్తానికి కంకణధారణ చేశారు. తరువాత గోత్ర ప్రవరలు తెలిపారు. శ్రీదేవి, భూదేవిల గోత్ర నామాలు చెప్పిన అనంతరం మహా సంకల్పం చేశారు. స్వామివారిని నూతన వస్త్రధారణతో అలంకరించారు. అయ్యవారికి, అమ్మవార్లకు జీలకర్ర, బెల్లం పెట్టిన తరువాత కల్యాణం వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా స్టేడియం గోవింద నామాలతో దద్దరిల్లింది. కల్యాణం అనంతరం భక్తులు క్యూలో ఉండి స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మధుసూదనరావు, డా.జయంతి సావిత్రి ఆలపించిన అన్నమయ్య కీర్తనలు భక్తులకు అకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఎం.జి.గోపాల్, ఎస్.ఓ. రఘనాథ్, ప్రధాన అర్చకుడు గురురాజ్, చాగంటి కోటేశ్వరరావు, అన్నదానం డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, ఉత్సవాల ఇన్చార్జ్ సురేంద్రరెడ్డి, సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు. భక్తుల పరమానందం విశాఖపట్నం: శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు భక్తుల కనులపండువలా సాగుతున్నాయి. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఈనెల 23 నుంచి ప్రారంభమైన వైభవోత్సవాలకు ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులు ఇక్కడే వీక్షిస్తున్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతం,7 గంటలకు తోమాలసేవ, కొలువు, అర్చన, 8 గంటలకు నివేదన, శాత్తుమొర, 8.30 గంటలకు భక్తులచే సామూహిక సహస్రనామ తులసి అర్చన, 10 గంటలకు రెండో నివేదన, 10 గంటల తరువాత భక్తులకు వీలుగా సర్వదర్శనం, సాయంకాలం సహస్ర దీపాలంకరణసేవ, 6 గంటలకు కల్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు,7.30 గంటలకు రాత్రి కైంకర్యం, 8.30 గంటలకు స్వామివారికి ఏకాంత సేవ జరిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. ఎటువైపు చూసినా భక్తులతో స్టేడియం జనసంద్రంగా మారింది. స్వామివారి కల్యాణం చూడడానికి సుమారు 25 వేల మంది భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. భక్తి ప్రపత్తులతో వెంకన్న కల్యాణం వీక్షించారు. నేటి సేవ విశేషపూజ.. తిరుమలలో ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు జరిగే ప్రధాన సేవ విశేషపూజ. ఈ సేవలో సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపంలో శ్రీదేవి,భూదేవి సమేతంగా మలయప్ప స్వామికి జరుగుతుంది. ఈసేవ 1991 ఏప్రిల్ 8 నుంచి ప్రారంభించారు. తరువాత కాలంలో అర్జిత సేవగా రూపుదిద్దుకుంది. శ్రీవారి అలయం లో రెండవ అర్చన, రెండు నైవేద్యం తర్వాత దేవేరులతో కూడి శ్రీమలయ్యప్పస్వామి కల్యాణమండపానికి వేంచేస్తారు. వైఖానసాగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహిస్తారు. తరువాత శ్రీస్వామివారలకు (స్నపన) తిరుమంజనం నిర్వహిస్తారు. -
కనరో భాగ్యము..
బ్రహ్మ కడిగిన పాదము.. బ్రహ్మము తానైన పాదము.. శ్రీహరి దర్శనమే మహా భాగ్యం. సేవలలో పాల్గొనడం మహదానందం. విశాఖ నగరమే స్వర్ణభారతికి తరలివచ్చిందా.. అన్నట్టు సుప్రభాతం పలికేందుకు తెల్లవారుజాము 5 గంటల నుంచి రాత్రి ఏకాంత సేవ ముగిసేవరకు భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వేంకటేశుని వైభవాన్ని తిలకించి పరవశించిపోతున్నారు. మాటలకందని మధురానుభూ తికి లోనై అలౌకిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. గురువారం తిరుప్పావడ సేవను అర్చక స్వాములు కనుల పండువగా నిర్వహించారు. వారాంతపు సేవల్లో ఎంతో విశిష్టమైనది తిరుప్పావడ సేవ. తిరుమలలో ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి రెండవ అర్చనానంతరం జరిగే సేవ ఇది. వేంకటేశుని మూలవిరాట్టుకు ఉన్న ఆభరణాలన్నింటినీ తొలగించి, నొసటి నామాన్ని తగ్గించి నేత్రాలు స్పష్టంగా భక్తులకు కనిపించేవిధంగా చేశారు. అనంతరం స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందు ఏడుకొండల ఆకారంలో పులిహోరని రాశిగా ఏర్పాటు చేశారు. జిలేబీలను మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరించారు. పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదించారు. నివేదించిన ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి నేత్ర దర్శనంతో భక్తులు పులకించిపోయారు. చల్లని చూపుతో అందరినీ అనుగ్రహించేలా లోకలను ఏలే స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. గోవిందుని నేత్ర దర్శనం కోసం భక్తులు బారులుదీరారు. స్వామివారి నిజరూప దర్శనంతో పరవశించిపోయారు. భక్తుల ఆనంద తాండవం రెండో రోజు కూడా నిత్య సేవల్లో వేలాదిమంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో మొదలై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవ వరకు ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు వ్యాఖ్యానంతో సాగిన శ్రీవారి సేవలను భక్తులు తన్మయత్మంతో తిలకించారు. ఇంకా తోమలసేవ, అర్చన, సహస్రదీపాలంకరణ, వీధి ఉత్సవం నిర్వహించారు. ఉత్తరాంధ్ర, ఒరిస్సా నుంచి వచ్చిన భక్తులు గోవిందా.. గోవిందా అంటూ నృత్యాలు చేశారు. స్టేడియం భక్తులతో నిండిపోవడంతో బయట ఆవరణలో స్క్రీన్ల వద్ద నిలుచొని అనేకమంది భక్తులు పూజలను తిలకించారు. టీటీడీ అధ్యాత్మిక పుస్తక ప్రదర్శన వద్ద సైతం అధిక సంఖ్యలో సందర్శకులు కనిపించారు. ఆరోగ్య శిబిరం సేవలను అనేకమంది వినియోగించుకున్నారు. నేటి సేవ అభిషేకం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగే అభిషేకాన్ని శుక్రవారాభిషేకం అంటారు. ఈ సేవ 614వ సంవత్సరం పూర్వం నుంచే జరుగుతుందని అంచనా. భాగవద్రామానుజుల వారు స్వామివారి వక్ష స్థలంలో బంగారు ఆలివేలు మంగ ప్రతిమను అలంకరింప చేసింది శుక్రవారం కావడంతో అప్పటి నుంచి ఈ అభిషేకం జరిగేలా ఏర్పాటు చేశారు. శ్రీనివాసుని యధాతథమైన రూపాన్ని వక్ష స్ధల లక్ష్మీతో సహా ఈ అభిషేక సమయంలో మాత్రమే దర్శించుకునేందుకు వీలవుతుంది. -
శ్రీవారి సేవ మహద్భాగ్యం
ఎంవీపీకాలనీ : శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యసేవల్లో పాల్గొనడం మహద్భాగ్యమని రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్డేడియంలో బుధవారం టీటీడీ నిర్వహించే వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు-2014, టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి సేవ టోకెన్‌ను ఆయన అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించే స్వామి నిత్య సేవల్లో విశాఖ వాసులు పాల్గొనాలని కోరారు. ఎంవీపీకాలనీలోని ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి అధ్యాత్మిక కేంద్రంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు సూచించారు. టీటీడీ జేఈవో పొలా భాస్కరరావు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 29 వరకు తొలిసారిగా విశాఖలో వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరుపుతున్నామన్నారు. తొలి రెండు రోజులు చాగంటి కోటేశ్వరరావుచే తిరుమల వైభవంపై ప్రవచనాలు ఉంటాయన్నారు. 23 నుంచి 29 వరకు స్వామికి నిత్య కైంకర్యాలు వ్యాఖ్యాన సహితంగా జరుగుతాయని తెలిపారు. సుమారు ఎనిమిది వేల మందికి సేవలో పాల్గొనేందుకు ఉచితంగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవల టోకెన్లు ఇస్తారన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో ముగుస్తుందన్నారు. చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖలో టీటీడీ అధికారులు విశాఖలో వేంకటేశ్వరుని వైభవోత్సవాలు జరపడం విశాఖ ప్రజ లకు వరం అన్నారు. ఆరోగ్యం, ఆర్థిక కారణాలతో శ్రీవారిని దర్శించుకోలేని వారికి ఇక్కడే ఆ భాగ్యం దక్కుతుందని చెప్పారు. కార్యక్రమం లో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జీవి యంసీ సీఈ బి.జయరామిరెడ్డి, టీటీడీ స్పెషలాఫీసర్ రఘనాథ్, సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు.