
'వెంకన్నా ప్రత్యేక హోదా నీవైనా ఇప్పించు'
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం బాగుపడాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరి అని...
తిరుమల: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం బాగుపడాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా ప్రత్యేక హోదా తప్పనిసరి అని, అలాంటి ప్రత్యేక హోదాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేలా చూడాలని వైకుంఠ నాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
సోమవారం ఆయన సతీమణి స్వర్ణలతారెడ్డితో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రజలందరూ కొత్త సంవత్సరంలోనూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానన్నారు. ఈసారి టీటీడీ ఏర్పాట్లు బాగా చేసిందని ఎంపీ కితాబిచ్చారు.