సాక్షి, తిరుమల: కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన మహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశిక ద్వాదశిగా వ్యవహరిస్తారు. సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతి ఏటా టీటీడీ ఘనంగా నిర్వహిస్తుంది.
స్నపనమూర్తిగా పిలువబడే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా (ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే) సూర్యోదయాతూర్వం, తెల్లవారుజామున 4.30 గంటల నుండి 5.30 గంటలలోపు ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఉరేగించారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు కైశికద్వాదశి ఆస్థానాన్ని పురాణపారాయణం ద్వారా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment