Draupadi Murmu Visits Tirumala to take blessings from Lord Venkateswara - Sakshi
Sakshi News home page

శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Published Mon, Dec 5 2022 10:52 AM | Last Updated on Mon, Dec 5 2022 12:49 PM

Draupadi Murmu Take Blessings From Tirumala Lord Venkateswara  - Sakshi

సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఆదివారం ఆంధ్రపదేశ్‌కి వచ్చిన రాష్ట్రపతి ముర్ము విశాఖలోని నేవిడేకి హాజరైన తదనంతరం రాత్రి 8 గంటలకు తిరుమలకు పయనమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము తిరుమలలో ఉదయం  శ్రీవారిని దర్శించుకున్నారు. అక్కడ రంగనాయకులు మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు వేదాశీర్వచనం ఇచ్చారు.

తదనంతరం రాష్ట్రపతికి శ్రీవారి తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అధికారులు అందజేశారు. ఆ తర్వాత పద్మావతి అతిధి గృహానికి వచ్చి బ్రేక్‌ఫాస్ట్‌ చేసి తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని విద్యార్థులతో భేటీ అవుతారు. తిరుపతిలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత రాష్ట్రపతి మధ్యాహ్నం నేరుగా డిల్లీకి పయనం అవుతారు. ఐతే ఆమె ఈ నెల 28నశీతాకాల విడిది కోసం తెలంగాణ వెళ్లనున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

(చదవండి: విశ్వగురు భారత్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement