droupadi murmu
-
రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్‌రత్న, అర్జున అవార్డుల ప్రదానం (ఫొటోలు)
-
రాష్ట్రపతి మెచ్చిన మిట్టీ కేఫ్..దివ్యాంగులకు చేయూత
కంటోన్మెంట్: దివ్యాంగుల సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మిట్టీ కేఫ్ ఆధ్వర్యంలో బొల్లారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో నూతన కెఫే ఏర్పడింది. పూర్తిగా దివ్యాంగుల ఆధ్వర్యంలో నిర్వహణ సాగే ఈ కెఫే ఏర్పాటుకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్/ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చేయూతను అందిస్తుంది. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది సందర్భంగా ఈ మిట్టీ కేఫ్‌ను అధికారికంగా ప్రారంభించారు. మానసిక, శారీరక ఆరోగ్య వైకల్యం కలిగిన వారి సమస్యలను సమాజం దృష్టికి తెచి్చ, స్పందించేలా చేసేందుకు ఈ మిట్టీ కేఫ్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, సుప్రీం కోర్టు కాంప్లెక్స్‌తో పాటు పలు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన 47కి పైగా ప్రదేశాల్లో మీట్టీ కేఫ్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకురాలు స్వర్ణభ మిత్ర వివరించారు. ఏమిటీ మిట్టీ కేఫ్? ఈ కేఫ్‌లలో ప్రత్యేకంగా నెలకొల్పిన స్టాల్లో దివ్యాంగులు స్వయంగా రూపొందించిన గృహాలంకరణ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు, నోటు పుస్తకాలు, పెన్నులు విక్రయిస్తున్నారు. సామాజిక దృక్పథంతో ఏర్పాటు చేస్తున్న మిట్టీ కేఫ్ ఆలోచనను గుర్తించి, వాటి నిర్వహణకు సీఎస్ఆర్ కింద పలు ప్రభుత్వరంగ, ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు ఆర్థికంగా సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ కేఫ్‌లను పలువురు సెలిబ్రిటీలు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. దివ్యాంగులకు ఉపాధి.. నగరంలోని రాష్ట్రపతి నిలయం అధికారులు ఉచితంగా కేటాయించిన స్థలంలో మిట్టీ కేఫ్‌ను నెలకొల్పారు. ఇందులో 15 మంది మానసిక, శారీరక వైకల్యం కలిగిన వ్యక్తులు ఈ కేఫ్‌ను స్వయంగా నడుపుతున్నారు. వీరికి నెలకు రూ.15 వేల నుండి రూ.50 వేల వరకూ వేతనంగా అందుతుంది. ఆర్థిక స్వావలంబన, ఆత్మ గౌరవంతో జీవించేందుకు మిట్టీ కేఫ్ అండగా ఉంటున్నట్లు నిర్వాహకురాలు స్వాతి తెలిపారు. కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ.. మిట్టీ కేఫ్‌లలో సమోసా, చాట్, పకోడీ, మసాలా టీ, బిస్కెట్లు, కాఫీ, మ్యాగీ, శాండ్ విచ్, పలు రకాల ఐస్‌క్రీమ్స్, ఇతర చిరుతిండ్లు స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. వీటికి అవసరమైన పెట్టుబడి, నిర్వహణా ఖర్చులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆ్రస్టేలియా–న్యూజిలాండ్ బ్యాంకింగ్ గ్రూపులు భరిస్తున్నాయి. దీనికి తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ సిఎస్ఆర్ వింగ్ చొరవ తీసుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతోంది. రూ. 36–46 లక్షలు టర్నోవర్ దిశగా కృషి చేస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవల శీతాకాల విడిదికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిట్టి కేఫ్‌ను సందర్శించారు. పలు వస్తువులు కొనుగోలు చేసి నిర్వాహకులను, ఉద్యోగులను అభినందించారు. -
బుల్డోజర్ కూల్చివేతలు.. హైడ్రాపై రాష్ట్రపతికి లేఖ
సాక్షి,ఢిల్లీ : తెలంగాణ హైడ్రా బుల్డోజర్ల కూల్చేవేత అంశం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చేరింది. తెలంగాణ కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై రాష్ట్రపతికి పిర్యాదు చేశాను. గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థులు చనిపోయారు. హైడ్రాను ఒక మాఫియా లాగ మార్చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇల్లు చెరువు కింద ఉంది. పేదోడి ఇళ్లను కులగొడుతున్నారు. పేద ప్రజలకు భూములు,ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.👉చదవండి : 'అలా ఎలా కూల్చేస్తారు?'.. హైడ్రాపై హైకోర్టు సీరియస్కానీ ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రిపై 88 కేసులు ఉన్నాయి. లగచర్లలో ఎస్టీల భూములు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీని సినిమా ప్రమోషన్ అడ్డగా చేశారు. ముఖ్యమంత్రికి గురుకుల, హైడ్రా ఇతర సమస్యలు పట్టవు. అలివి కానీ హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను ముంచారు. అత్యంత మనువాద పార్టీ కాంగ్రెస్. అంబేద్కర్ హక్కులను ఆలోచలను తెలంగాణ కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నారు’ అని బక్క జడ్సన్ ఆరోపించారు. -
అందరికీ ఆనందం పంచాలని ఆశిస్తున్నా ప్రజలకు ప్రధాని
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ కొత్త ఆశలు, ఆశయాలకు నెలవైన నూతన సంవత్సరానికి అందరూ ఆనందంగా స్వాగతం పలికారు. కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో నూతన సంతోషాలు, అవకాశాలు, విజయాలు, అంతులేని ఆనందాలను తీసుకు రావాలని ఆశిస్తున్నా. ఆయురారోగ్యాలతో ఉండేలా కొత్త సంవత్సరం అందర్నీ దీవించనుంది’’ అని మోదీ అన్నారు. ‘‘ సమష్టిగా ప్రయత్నించి గత సంవత్సరం మనందరం అనేక అద్భుత విజయాలు అందుకున్నాం. 2025 సంవత్సరంలోనూ మరింతగా కష్టపడి పనిచేసి వికసిత్ భారత్ దిశగా వడివడిగా అడుగులు వేద్దాం’’ అని అన్నారు. గత ఏడాది కాలంలో భారతదేశం సాధించిన పురోగతి, ఐక్యత, అభివృద్ధి ప్రస్థానం వైపు వేసిన అడుగులను వివరిస్తూ మోదీ ఈ సందర్భంగా ఓ వీడియోను ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. Wishing everyone a very Happy New Year! May the year 2025 bring joy, harmony and prosperity to all! On this occasion, let us renew our commitment to work together for creating a brighter, more inclusive and sustainable future for India and the world.— President of India (@rashtrapatibhvn) January 1, 2025గ్రీటింగ్స్ చెప్పిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిమరింత సమ్మిళితమైన, సుస్థిరమైన భారత్‌తో పాటు ప్రపంచ శాంతి కోసం దేశ ప్రజలంతా ఉమ్మడిగా కష్టపడి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం తన నూతన ఏడాది సందేశంలో పిలుపునిచ్చారు. ‘‘ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షులు. 2025 ఏడాది మీ జీవితాల్లో కొత్త వెలుగులు తేవాలని, నూతనోత్సాహం, సా మరస్యం, సంతోషం వెల్లివిరియాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఆమె అన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ సైతం ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు. లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సైతం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. Happy 2025! May this year bring everyone new opportunities, success and endless joy. May everybody be blessed with wonderful health and prosperity.— Narendra Modi (@narendramodi) January 1, 2025 -
రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్
సాక్షి, సిటీబ్యూరో: పర్యాటక నిలయంగా ప్రసిద్ధి చెందిన బొల్లారం రాష్ట్రపతి నిలయంలో సందర్శకులకు నూతన సంవత్సర కానుకగా జనవరి 2 నుంచి 13 వరకూ ఉద్యాన్ ఉత్సవ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన ఈ కార్యక్రమం వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మద్దతుతో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రదర్శన పుష్పాలు, ఇతర ప్రదర్శనలకు వేదిక కానుందని, ఉద్యానవన స్పృహను పెంపొందించేందుకు రాష్ట్రపతి నిలయం పరిపాలనాధికారి రజనిప్రియా శనివారం వెల్లడించారు. మొదటి సారి నిర్వహించే ఈ ఉద్యాన్ ఉత్సవ్ పన్నెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామని, ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగుతుందని చెప్పారు. సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గార్డెన్ డెకర్, హారీ్టకల్చర్ డోమైన్లు ఉంటాయని, ఇందులో 50 స్టాళ్ళతో గ్రాండ్ ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద, గిరిజన ప్రదర్శనలు, వంటకాలు, ఇంటరాక్షన్ సెషన్లు ఉంటాయని తెలిపారు. పలువురు ఎగ్జిబిటర్లు, ప్రభుత్వ, కమ్యూనిటీ సంస్థలు, ఎన్జీవోలు, ప్రైవేటు కంపనీలు భాగాస్వామ్యం ఉంటుందని తెలిపారు. ఒడిశ్సా శంఖ్ వదన్ నృత్యం, మధ్యప్రదేశ్ యుద్ధ కళ నృత్యం వంటి ప్రదర్శనలు ఉన్నాయని, సందర్శకులకు ప్రవేశం పూర్తిగా ఉచితమని చెప్పారు. -
భారత‘రత్న’ వాజ్‌పేయి శతజయంతి.. ప్రముఖుల నివాళి (చిత్రాలు)
-
అటల్ బిహారి వాజ్ పాయి 100వ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు
-
వాజ్‌పేయికి రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన స్మృతివనం ‘సదైవ్ అటల్’ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రధాని మోదీ(PM MODI) నివాళులర్పించారు. వీరితో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు కేబినెట్ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.దేశం కోసం జీవితాన్ని అంకితం చేశారు: ప్రధాని మోదీసుసంపన్న, బలమైన భారత దేశ నిర్మాణం కోసం వాజ్‌పేయి తన జీవితాన్ని అంకితం చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. వాజ్‌పేయి శతజయంతి సందర్భంగా ప్రధాని బుధవారం(డిసెంబర్25) ఎక్స్‌లో ఒక పోస్టు చేశారు. వాజ్‌పేయి విజన్,మిషన్ భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించేందుకు తమకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.ఇదీ చదవండి: రాజకీయ కవి సార్వభౌముడు -
రాష్ట్రపతి ముర్ము శీతాకాల విడిది.. అబ్బురపరుస్తున్న బొల్లారం రాష్ట్రపతి భవన్ (ఫొటోలు)
-
నేడు మంగళగిరికి రాష్ట్రపతి రాక
సాక్షి, అమరావతి/మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో మంగళవారం నిర్వహించే స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రపతితో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు తదితరులు హాజరవుతారని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మాధభానందకర్ చెప్పారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు ప్రదానం చేస్తారని తెలిపారు. -
హైదరాబాద్ లో రాష్ట్రపతి
-
హైదరాబాద్ టూర్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఘన స్వాగతం
సాక్షి,హైదరాబాద్ : రెండురోజుల తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్,మేయర్ గద్వాల్ విజయలక్ష్మిలు స్వాగతం పలికారు.రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటనలో భాగంగా..శిల్పారామం వేదికగా నవంబర్ 21 (ఈరోజు) నుంచి 24వ తేదీ వరకు లోక్‌మంథన్-2024 కార్యక్రమం జరగనుంది. లోక్‌మంథన్-2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కొద్ది సేపటి కిత్రమే బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము ఈ రోజు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఉండనున్నారు. ఈ రోజు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. -
రాష్ట్రపతి ముర్ము తెలంగాణ పర్యటన
-
తెలంగాణ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన!
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పర్యటించనున్నారు. శిల్పారామం వేదికగా ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే లోక్‌మంథన్-2024 కార్యక్రమం జరగనుంది. లోక్‌మంథన్-2024లో 22న వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే మేధోమథన కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారు.ఇందులో భాగంగా రేపు, ఎల్లుండి తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు రానున్నారు. రేపు సాయంత్రం 6.20 గంటల నుంచి 7.10 గంటల వరకు రాజ్‌భవన్‌లో ఉండనున్నారు. రేపు రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 12.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు. -
రాష్ట్రపతిని కలిసేదాకా ఇక్కడే ఉంటాం: లగచర్ల బాధితులు
న్యూఢిల్లీ, సాక్షి: లగచర్ల ఫార్మా బాధితులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దగ్గరికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ నేతలు.. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినట్లు సమాచారం. అయితే..ఇప్పటికే లగచర్ల లో గిరిజన కుటుంబాలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్ట్ లపై ఎస్సి,ఎస్టీ,మహిళ, మానవహక్కుల కమిషన్ లను కలిసి కాంగ్రెస్ ప్రభుత్వంపై భాదితులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో.. లగచర్ల లో గిరిజనులపై జరిగిన అణిచివేత తాలుకు సమాచారాన్ని రాష్ట్రపతి కార్యాలయ అధికారులు కోరింది. దీంతో బలవంతపు భూ సేకరణ ఘటన, పోలీసులు చేసిన దుర్మార్గపు దాడులను, లైంగిక దాడి వంటి అంశాలతో కూడిన పత్రాలను బీఆర్ఎస్ నేతలు రాష్ట్రపతి కార్యాలయానికి అందజేసినట్లు సమాచారం. అలాగే.. రాష్ట్రపతి ని కలసి తమ గోడు వినిపించాలని.. అప్పటిదాకా హస్తినలోనే ఉండాలని గిరిజన మహిళలు నిర్ణయించుకున్నారు. దీంతో బాధితులను రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ భావిస్తోంది.ఇదీ చదవండి: మాగొంతులు పిసికారు.. కళ్లకు బట్టలు కట్టి కొట్టారు -
ఘోరాతి ఘోరంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఝాన్సీ: యూపీలోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి హృదయ విదారకమన్నారు. ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా విచారం వ్యక్తం చేశారు.పీఎం మోదీ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. పిల్లలను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. ఈ దుఃఖాన్ని భరించే శక్తి భగవంతుడు వారికి ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులను ఆదుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తోంది’ అని దానిలో పేర్కొన్నారు.రాష్ట్రపతి ముర్ము సోషల్ మీడియా వేదికగా.. ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు బాధిత తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. గాయపడిన చిన్నారులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…— PMO India (@PMOIndia) November 16, 2024తక్షణ పరిహారం రూ. 5 లక్షలుఈ ఘటనపై యూసీ సీఎం యోగి విచారం వ్యక్తం చేస్తూ, మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన చిన్నారులకు రూ.50 వేలు చొప్పున సాయం అందించాలని సీఎం యోగి ఆదేశించారు. ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్ని ప్రమాదం జరిగిన మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ ఘటనపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.ఇది కూడా చదవండి: యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం -
‘లోక్‌మంథన్’కు భారత రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి..ఏకత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించే ద్వైవార్షిక సాంస్కృతిక మహోత్సవమైన ‘లోక్‌మంథన్’కు భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హాజరవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేటలోని పర్యాటక భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞాభారతి అఖిల భారత కన్వీనర్ నందకుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శిల్పకళావేదిక, శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు ‘లోక్‌మంథన్ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారని చెప్పారు.అంతకంటే ముందు 21వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిల్పకళావేదికలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. వసుదైక కుటుంబమని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ సాంస్కృతిక విశిష్టతను ఈ వేడుకల్లో వీక్షించొచ్చని పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనాపరులు, ఆచరణీయులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు ఈ వేడుకల్లో భాగస్వాములవుతారని కిషన్‌రెడ్డి చెప్పారు. నందకుమార్ మాట్లాడుతూ దేశవిదేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు తరిలిరానున్నట్టు చెప్పారు. లిథువేనియా, ఆర్మేనియా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన విశిష్ట కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారన్నారు. లోక్మాత నాటకంతోపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి రుద్రమదేవి నాటక ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ముగింపు ఉత్సవాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లు పాల్గొంటారని చెప్పారు. ⇒ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఇప్పటివరకు భోపాల్, రాంచీ, గువాహటిల్లో జరిగాయి.‘లోక్–అవలోకన్, లోక్ విచార్–లోక్ వ్యవహార్’అనే ప్రధాన థీమ్‌తో ఈసారి లోక్‌మంథన్–2024 వేడుకలను నిర్వహిస్తున్నారు. ⇒ ఈ వేడుకల్లో ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రతి రోజూ లక్ష మందికి పైగా సందర్శకులు తరలిరానున్నట్టు అంచనా.1,500 మందికి పైగా కళాకారులు సుమారు వెయ్యి కళారూపాలను ప్రదర్శించనున్నారు. ⇒ఫొటో జర్నలిస్ట్ అంధేకర్ సతీలాల్ వనవాసీ సంస్కృతి, జీవనశైలిపైన తీసిన ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శిస్తారు. -
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ గురువారం ఈ విషయం ‘ఎక్స్’లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సంప్రదించి నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జస్టిస్ ఖన్నా నియామకం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త సీజేఐ వచ్చే నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన స్వల్పకాలమే పదవిలో ఉంటారు. 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్‌గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీíÙయల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. కీలక తీర్పులు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్‌కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచి్చన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
ఎందరికో స్ఫూర్తిదాత రతన్ టాటా మృతిపట్ల ప్రముఖుల సంతాపం
-
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
రాజఘాట్ లో నివాళులర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ
-
సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలి
సాక్షి, హైదరాబాద్: దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడం, ప్రోత్సహించడం అందరి సమష్టి బాధ్యతని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వైవిధ్యం, సంగీతం, కళలు, సంప్రదాయ వస్త్రధారణను దేశ వారసత్వంగా అభివరి్ణంచారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజల సంప్రదాయాలు, జాతుల గురించి దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకే ‘భారతీయ కళా మహోత్సవ్’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భారతీయ కళా మహోత్సవ్ తొలి ఎడిషన్‌ను సికింద్రాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపదీ ముర్ము శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ ఈశాన్య, దక్షిణాది ప్రాంతాల మధ్య వార ధిగా ఈ ఉత్సవం నిలుస్తుందన్నారు.కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ మాట్లాడుతూ దేశంలోని విభిన్న సంస్కృతుల ప్రదర్శన దేశ ఐక్యతను చాటుతుందన్నారు. మంత్రి సీతక్క తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్రపతిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ కె. త్రివిక్రమ్ పటా్నయక్, మణిపూర్, అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, మేఘాలయ గవర్నర్ సీ.హెచ్. విజయశంకర్, సిక్కిం గవర్నర్ ఓం ప్రకాశ్ మాథుర్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయా రాష్ట్రా ల కళాకారులు, అధికారులు పాల్గొ న్నారు.ఈ ఉత్సవంలో ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించనున్నారు. అక్టోబర్ 6 వరకు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల మధ్య సందర్శకులను అనుమతి https://visit.rasht rapatibhavan.gov.in ద్వారా స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. ముగిసిన రాష్ట్రపతి రాష్ట్ర పర్యటన: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక రోజు రాష్ట్ర పర్యటన ముగిసింది. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ, సీఎం రేవంత్, మంత్రులు పొన్నం, సీత క్క, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేంద్ర, సీపీ సీవీ ఆనంద్ స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శామీర్‌పేటలోని నల్సార్ లా వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఆ తరువాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘కళామహోత్సవ్’ను ప్రారంభించారు. రాత్రి తిరిగి ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. -
నల్సార్ స్నాతకోత్సవానికి హాజరైన రాష్ట్రపతి ముర్ము
హైదరాబాద్, సాక్షి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం నగరానికి వచ్చారు. శనివారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, అధికారులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి.. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయాలనికి వెళ్లారు. అక్కడ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమం తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు. అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రారంభిస్తారు. -
Kolkata: ప్రధాని మోదీ, రాష్ట్రపతికి వైద్యుల లేఖ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వెంటనే విధుల్లో చేరాలని అటు సుప్రీంకోర్టు ఆదేశించినా, ఇటు చర్యలకు బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానించినా.. వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ ఘటనపై జోక్యం చేసుకొని ప్రతిష్టంభను ముగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్, వైద్యారోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన నాలుగు పేజీల లేఖలో.. ‘‘కామాంధుడి చేతిలో బలైన మా సహోద్యోగికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము(వైద్యులు), ఆరోగ్య కార్యకర్తలు బెంగాల్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి భయం లేకుండా మా విధులు నిర్వర్తించగలం. మేము నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి మాపై బెదిరింపులు, హింసలు, ఆసుపత్రులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరిగాయి. ఈ క్లిష్ట సమయాల్లో మీ జోక్యం మా అందరికీ వెలుగుగా పనిచేస్తుంది. మేము ధైర్యంగా ముందుకు నడిచే మార్గాన్ని చూపుతుంది. మా చుట్టూ అలుముకున్న చీకటి నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.’ అని పేర్కొన్నారు.చదవండి: కోల్‌కతా అభయ కేసులో కీలక మలుపు.. సీబీఐ సంచలన నిర్ణయం!కాగా ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసినప్పటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. ఇటీవల తాజాగా వైద్యులు మంగళశారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసనలు ఆపని వైద్యులపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు బెంగాల్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తోపాటు.. వైద్యశాఖలో పలువురి ఉన్నతాధికారుల రాజీనామా కోరుతూ వైద్యులు అయిదు డిమాండ్లను దీదీ సర్కార్ ముందు ఉంచారు.ఈ విషయంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మూడుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. కానీ చర్చల భేటీని లైవ్ టెలికాస్ట్ చేస్తేనే తాము వస్తామని నిరసన కారులు తేల్చి చెబుతున్నారు. దీంతో వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేసిన దీదీ.. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. -
అభయ ఘటన భయానకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా అభయ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్జీకార్ ఘటన తనని భయబ్రాంతులకు గురిచేసిందని అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూతుళ్లు, అక్కాచెల్లెళ్లు ఇలాంటి అఘాయిత్యాలకు గురికావడాన్ని ఏ నాగరిక సమాజం అనుమతించదు.. చాలు’అని సూచించారు. నిర్భయ ఘటన జరిగిన 12 ఏళ్లలో లెక్కలేనన్ని దారుణాలు జరిగాయి. సమాజం వాటిని మర్చిపోయింది. ఇటువంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైందని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో నర్సులపై అఘాయిత్యాలు, మలయాళ చిత్ర పరిశ్రమలో వివాదాలపై రాష్ట్రపతి ముర్ము పరోక్షంగా స్పందించారు. కోల్‌కతా అభయ కేసులో విద్యార్థులు, వైద్యులు, పౌరులు నిరసనలు చేస్తున్నప్పటికీ నేరస్థులు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు.