నియమించిన రాష్ట్రపతి ముర్ము
వచ్చే నెల 11న ప్రమాణ స్వీకారం
ఆరు నెలలపాటు పదవిలో కొనసాగనున్న జస్టిస్ ఖన్నా
సాక్షి, న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ గురువారం ఈ విషయం ‘ఎక్స్’లో వెల్లడించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో సంప్రదించి నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
జస్టిస్ ఖన్నా నియామకం నవంబర్ 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. కొత్త సీజేఐ వచ్చే నెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన స్వల్పకాలమే పదవిలో ఉంటారు. 2025 మే 13న పదవీ విరమణ చేయనున్నారు. అంటే కేవలం ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్‌గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సరీ్వసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీíÙయల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు.
కీలక తీర్పులు
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్‌కు ఆయన నేతృత్వం వహించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచి్చన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచి్చన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment