ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం అని.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భం ఇదని.. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్న రాష్ట్రపతి.. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఎల్లప్పుడూ మన నాగరిక వారసత్వంలో భాగంగా ఉన్నాయి. మన వారసత్వ గొప్పతనానికి నిదర్శనం మహా కుంభమేళా. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకొన్నాం. వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం. జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందించడంతో పాటు ఆర్థికపరమైన భారాన్ని కూడా తగ్గిస్తాయి’’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment