nation
-
ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం: రాష్ట్రపతి
ఢిల్లీ: గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకం అని.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దేశం మొత్తం గర్వించదగ్గ సందర్భం ఇదని.. మన లక్ష్యాల దిశగా నిజమైన ప్రయాణం సాగుతోందన్నారు. అంతర్జాతీయంగా నాయకత్వం వహించేలా భారత్ ఎదిగిందన్న రాష్ట్రపతి.. భరతమాత విముక్తి కోసం త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఎల్లప్పుడూ మన నాగరిక వారసత్వంలో భాగంగా ఉన్నాయి. మన వారసత్వ గొప్పతనానికి నిదర్శనం మహా కుంభమేళా. ఈ ఏడాది బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకొన్నాం. వెలుగులోకి రాని మరికొందరు ధైర్యవంతులను స్మరించుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలు మార్చుకున్నాం. ఈ ఏడాది కొత్త చట్టాలు రూపొందించి అమల్లోకి తెచ్చాం. జమిలి ఎన్నికలు పాలనలో స్థిరత్వాన్ని అందించడంతో పాటు ఆర్థికపరమైన భారాన్ని కూడా తగ్గిస్తాయి’’ అని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. -
యుద్ధ నౌకలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
-
ఆ దేశంలో తుపాకీ పట్టని పోలీసులు.. కారణమిదే
మరికొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కొందరు కొత్త సంవత్సరంలో విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ నేపధ్యంలో ఆ ప్రదేశంలో ఎన్నో ప్రత్యేకతలు ఉండాలని కోరుకుంటారు. అలాంటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అత్యంత సురక్షిత దేశంఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి భద్రత గురించి మనకు ముందుగా తెలియదు. అటువంటి పరిస్థితిలో భద్రత కలిగిన ప్రాంతాల గురించి మనం అన్వేషిస్తాం. ఇటీవల అమెరికన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ బెర్క్‌షైర్ హాత్వే ట్రావెల్ తాజాగా ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి పేరు ఐస్లాండ్. ఈ దేశం 2025లో సందర్శించడానికి అత్యంత సురక్షితమైన ప్రదేశంగా ఆ కంపెనీ తెలిపింది.పలు అంశాలపై సర్వేఈ జాబితాను సిద్ధం చేసేందుకు బెర్క్‌షైర్ హాత్వే ట్రావెల్ కంపెనీ ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో, క్రైమ్ రేట్, మహిళల భద్రత, ఎల్‌జీబీటీఐక్యూ ప్లస్, ప్రయాణికుల అనుభవం, రవాణా వ్యవస్థ, ఆరోగ్య సేవలు తదితర వివరాలను ప్రయాణికుల నుంచి సేకరించారు. ఈ సంస్థ 2016 నుంచి ఈ విధమైన సర్వేలు నిర్వహిస్తోంది.పోలీసులు తుపాకులు పట్టుకోరుగత సంవత్సరం ఈ జాబితాలో ఐస్లాండ్ తొమ్మిదో స్థానంలో ఉంది. అయితే 2024లో ప్రయాణికులు అందించిన వివరాలు, రేటింగ్ ఆ దేశాన్ని అగ్రస్థానానికి తీసుకువెళ్లాయి. ఈ ద్వీపం చాలా చిన్నది. నాలుగు లక్షల జనాభా మాత్రమే ఇక్కడ ఉంటోంది. ఇక్కడ హింసాత్మక నేరాల రేటు చాలా తక్కువ. పోలీసులు తుపాకులను పట్టరు. ఐస్లాండ్కు సైన్యం కూడా లేదు. ఐస్లాండ్ 2024లో అనేక అగ్నిపర్వత విస్ఫోటనాలను చవిచూసింది. ఇది పర్యాటకుల తాకిడిపై ఏ మాత్రం ప్రభావం చూపకపోవడం విశేషంఐస్లాండ్లో ఏమిటి ఫేమస్?ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్ పర్యాటకులలో నిత్యం అత్యంత రద్దీగా ఉంటుంది. నగరం నడిబొడ్డున ఉన్న అతిపెద్ద చర్చి పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. ఐస్లాండ్లో వివిధ ఆకారాలు, పరిమాణాలు కలిగిన మంచుకొండలను దగ్గరి నుంచి చూడవచ్చు. దేశంలో పర్యాటకులను ఆకర్షించేలా అనేక ప్రదేశాలు ఉన్నాయి.సురక్షిత దేశాల జాబితాలో.. ఈ జాబితాలో ఆస్ట్రేలియా రెండవ స్థానంలో ఉంది. ఈ దేశాన్ని పర్యాటకులకు సురక్షితం దేశంగా భావిస్తారు. నేరాల రేటు కూడా ఇక్కడ చాలా తక్కువ. పర్యాటకులు ఈ దేశ రవాణా భద్రతను ఉత్తమంగా రేట్ చేశారు. సురక్షితమైన దేశాల జాబితాలో కెనడా మూడవ స్థానంలో నిలిచింది. ఈ దేశం మహిళలకు, ఎల్జీబీటీక్యూఐఏ ప్లస్ వర్గాలకు సురక్షితమైనదని, నేరాల రేటు తక్కువగా ఉందని సర్వే పేర్కొంది. నయాగరా జలపాతం, బాన్ఫ్ నేషనల్ పార్క్ కెనడాలో ప్రత్యేక పర్యాటక ఆకర్షణలు.ఈ జాబితాలో తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఉంది. ఈ దేశంలో నేరాల రేటు చాలా తక్కువ. ఈ దేశంలో 50 లక్షల జనాభా ఉంది. ఈ దేశం ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచింది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ ఐదో స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్, జర్మనీ, నార్వే, జపాన్, డెన్మార్క్, పోర్చుగల్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, నెదర్లాండ్స్, స్వీడన్ తదితర దేశాలు ఈ జాబితాలో తదుపరి స్థానాల్లో ఉన్నాయి.ఇది కూడా చదవండి: నేడు సుబ్రహ్మణ్య షష్టి: ఈ 10 ఆలయాల్లో విశేష పూజలు -
సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనిలో భాగంగా అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi at Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/uLPn4EYnFM — ANI (@ANI) February 25, 2024 దీనికి ముందు ప్రధాని మోదీ ద్వారక ఆలయంలో పూజలు నిర్వహించారు. సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980 కోట్ల రూపాయలతో నిర్మించిన సుదర్శన్ సేతును ద్వారకలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi performs pooja and darshan at Beyt Dwarka temple. pic.twitter.com/U2gZUVB3k4 — ANI (@ANI) February 25, 2024 -
త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ.. ఎందుకంటే..
మొబైల్ సబ్స్క్రైబర్లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్ఫ్రాడ్ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్‌లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్‌కార్డ్‌లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్‌కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్ కనెక్షన్ల సమాచారం తెలిసే వీలుంది. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ సిమ్‌కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్‌ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్ ఐడీ సహాయపడుతుందని సమాచారం. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఇటీవల టెలికామ్ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్‌ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. -
‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ఏమిటి? ఎవరికి ప్రయోజనం?
దేశంలోని వైద్యులకు సంబంధించిన ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ ప్రాజెక్ట్ అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నేషనల్ హెల్త్ కమిషన్ పూర్తి బ్లూప్రింట్ సిద్ధం చేసిందని, దీని ట్రయల్ రాగల ఆరు నెలల్లో ప్రారంభం కానున్నదని సమాచారం. ట్రయల్ అనంతరం ఈ ప్రాజెక్టును జాతీయ స్థాయిలో అమలు చేయనున్నారు. ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’ కింద దేశంలోని ప్రతి డాక్టర్‌కి యూనిక్ ఐడీ అందజేస్తారు. ఈ యూనిక్ ఐడీ ద్వారా వైద్యునికి గుర్తింపు కల్పిస్తారు. ఈ ఐడీలో ఆ వైద్యుని శిక్షణ, అతని లైసెన్స్‌కు సంబంధించిన అన్ని పత్రాల గురించిన సమాచారం ఉంటుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ఈ ప్రత్యేక ఐడీని ఐటీ ప్లాట్ఫారమ్నకు లింక్ చేస్తుంది. జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి డాక్టర్ యోగేంద్ర మాలిక్ మాట్లాడుతూ ‘వన్ నేషన్, వన్ రిజిస్ట్రేషన్’పై ఇప్పటికే చాలా కసరత్తు జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో వైద్యునికి రెండుసార్లు యూనిక్ ఐడీ ఇస్తారు. అతను ఎంబీబీఎస్ కోర్సులో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మొదటిసారిగా ఇస్తారు. ఆ సమయంలో ఇచ్చిన ఐడీ తాత్కాలికంగా ఉంటుంది. అతని చదువు పూర్తయ్యాక అతనికి శాశ్వత సంఖ్య ఇస్తారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు శాశ్వత యూనిక్ ఐడీ ఇస్తారు. ఈ ప్రత్యేకమైన ఐడీని అందుకున్న వైద్యులు దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ప్రాక్టీస్ చేసే అవకాశం కలుగుతుంది. అలాగే ఆ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో తన పేరు నమోదు చేయించుకోవచ్చు. ప్రస్తుతం దేశంలో దాదాపు 14 లక్షల మంది నమోదిత వైద్యులు రోగులకు సేవలందిస్తున్నారు. దేశంలోని 200కి పైగా మెడికల్ కాలేజీల్లో 1.08 లక్షలకు పైగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ప్రతి వెయ్యిమంది జనాభాకు ఒక వైద్యుడు ఉండటం అవసరం. అయితే భారతదేశం చాలా కాలం క్రితమే ఈ ప్రమాణాన్ని అధిగమించిందని జాతీయ ఆరోగ్య కమిషన్ చెబుతోంది. ఇది కూడా చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు ‘వీర్యం నీరు’.. తరువాత జరిగిందిదే! -
ఇజ్రాయెల్ ‘స్టార్టప్ నేషన్’ ఎందుకయ్యింది? టెక్ దిగ్గజాల దృష్టిని ఎలా ఆకర్షించింది?
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కొనసాగుతోంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఒక్కసారిగా వందలాది మంది పౌరులను కోల్పోయింది. ప్రపంచానికి సాంకేతికతతో సహా వివిధ ఉత్పత్తులను విక్రయించే ఇజ్రాయెల్ ఇప్పుడు కష్టాల కొలిమిలో చిక్కుకుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా హమాస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. దీన్ని స్టార్టప్ కంట్రీ అని కూడా అంటారు. ఇంతటి ఘనమైన పేరు ఇజ్రాయెల్‌కు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇజ్రాయెల్ పలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా స్టార్టప్ వ్యవస్థను అమితంగా ప్రోత్సహించింది. స్టార్టప్‌లకు నిధులను సమకూరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార వ్యవస్థలకు తగిన మద్దతును అందిస్తుంది. ఇటువంటి స్నేహ పూర్వక వాతావరణం కారణంగానే దేశంలో స్టార్టప్‌ల సంఖ్య వేగంగా పెరిగింది. 1990లలో ఇజ్రాయెల్.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో హైటెక్ విప్లవాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ స్టార్టప్‌లు టెల్ అవీవ్ సాంకేతిక కేంద్రం నుండి జెరూసలేం వరకు విస్తరించాయి. దక్షిణ ఎడారి నగరమైన బీర్-షేవాలో కూడా ఇజ్రాయెల్ స్టార్టప్‌లు కనిపిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్టార్టప్‌ల భాగస్వామ్యం కారణంగా ఇజ్రాయెల్.. ‘స్టార్టప్ నేషన్’ హోదాను దక్కించుకుంది. స్టార్టప్ దేశంగా మారిన ఇజ్రాయెల్ ఆర్థికంగా మరింత బలోపేతంగా మారింది. ఇక్కడి స్టార్టప్‌లు దేశ ఆర్థిక వ్యవస్థలోకి $4.8 బిలియన్ల మూలధనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇందులో 85 శాతం విదేశీ పెట్టుబడిదారులు ఉండటం విశేషం. ఇజ్రాయెల్ తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 4.3 శాతం పరిశోధన, అభివృద్ధి రంగాలకు కేటాయిస్తోంది. గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీల పరిశోధనా కేంద్రాలు ఇజ్రాయెల్‌లోనే ఉన్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇజ్రాయెల్‌లోని పలు స్టార్టప్‌లు హెల్త్ టెక్, మొబైల్ యాప్‌లు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలపై దృష్టి సారిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టార్టప్‌లను కలిగిన దేశంగా పేరుగాంచింది. ఈ దేశంలో ప్రతి 1,400 మందికి ఒక స్టార్టప్ ఉంది. అంటే దేశంలోని ప్రతి 1,400 మంది పౌరులలో కనీసం ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు లేదా సహ వ్యవస్థాపకుడు కనిపిస్తారు. ఇజ్రాయిలీలు పరిశోధన ఆవిష్కరణలకు పెట్టిందిపేరుగా నిలిచారు. ఈ దేశంలో 3,000కు మించిన హై-టెక్ స్టార్టప్‌లు ఉన్నాయి. ఇజ్రాయెల్ కార్మికులు సగటును అత్యధిక వేతనం పొందుతున్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి దగ్గర కంప్యూటర్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది కూడా చదవండి: యూదుల ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది? -
స్వాతంత్రం వచ్చాక మహాత్మాగాంధీ ఏం చేశారు?
అక్టోబర్ 2 గాంధీ జయంతిగా జరుపుకుంటారు. భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ 1869, అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు. గాంధీజీ పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ. బాపూజీ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్ర్య పోరాటంలో భారతీయులను ఏకంచేసి, అహింసా మార్గాన్ని అనుసరించి, దేశానికి స్వాతంత్ర్యం సాధించడంలో ముఖ్యమైన భూమికను అందించారు. భారతదేశంలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసిన మోహన్‌దాస్ అనంతరం ఇంగ్లండ్‌కు వెళ్లారు. తరువాత స్వదేశానికి తిరిగి వచ్చారు. తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లి, వలసదారుల హక్కులను కాపాడేందుకు అక్కడ సత్యాగ్రహం నిర్వహించారు. నేడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుని జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ ఎలా జాతిపిత అయ్యారు? ప్రతి భారతీయుడు ఆయనను బాపు అని ఎందుకు పిలుస్తారనే దానికి ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం. గాంధీజీ స్వాతంత్ర్యం కోసం అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఇందులో సత్యాగ్రహం, ఖిలాఫత్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, దండి మార్చ్ మొదలైనవి ఉన్నాయి. దేశ స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ అహింసా సూత్రాన్ని పాటించారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంచేందుకు నిరంతరం ప్రయత్నించారు. భారత స్వాతంత్ర్యం తరువాత గాంధీజీ భారతీయ సమాజానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం పనిచేశారు, హిందూ-ముస్లిం ఐక్యతను ప్రోత్సహించారు. సత్యం, సంయమనం, అహింసల మార్గాన్ని అనుసరించాలని చెబుతూ, అందుకు స్ఫూర్తిగా నిలిచారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ తన సర్వస్వం త్యాగం చేశారు. సాదాసీదా జీవితమే మనిషికి ఆనందాన్నిస్తుందని ఆయన తన నడత ద్వారా చూపారు. గాంధీజీ ఒక అన్వేషకునిగానూ ప్రసిద్ధి చెందారు. సరళత, నిర్లిప్తత, ఆత్మతో అనుసంధానం అనే భావనలతో గాంధీజీ జీవించారు. ధోతీ ధరించి, ఎక్కడికైనా కాలినడకనే ప్రయాణించి, ఆశ్రమాలలో కాలం గడిపిన గాంధీజీ భారతీయులకు తండ్రిలా మారారు. ఈ కారణంగానే ప్రజలు ఆయనను బాపు అని పిలవడం ప్రారంభించారు. మహాత్మా గాంధీని ‘జాతి పితామహుడు’ అని పిలిచిన మొదటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ గాంధీజీని ‘జాతి పితామహుడు’ అని పిలిచి గౌరవించారు. మహాత్మాగాంధీ భారత స్వాతంత్ర్య పోరాటంలో విశేష కృషి చేసిన కారణంగానే బోస్.. గాంధీజీని ఉన్నతునిగా పేర్కొన్నారు. అప్పటి నుండే అందరూ గాంధీజీని ‘జాతిపిత’ అని పిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: ఆత్మగౌరవం గురించి బాపూజీ ఏమన్నారు? -
జమిలి ఎన్నికలపై కేంద్రం కసరత్తు.. రాజ్యాంగ సవాళ్లు ఇవే..
ఢిల్లీ:జమిలి ఎన్నికల నిర్వహణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కేంద్రం కమిటీని నియమించింది. దానికితోడు ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఒకే దేశం- ఒకే ఎన్నికల బిల్లు చర్చకు రానుందని రాజకీయ వర్గాల సమాచారం. బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే జమిలి ఎన్నికలకు సిద్ధపడిందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సవాళ్ల గురించి కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపడానికి సరిపడా పోలింగ్ సామాగ్రి మన వద్ద లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలు జరపడానికి రాజ్యాంగ పరంగా కూడా చిక్కులు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. సవరణలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ‘One Nation One Election’ possible, Constitutional amendment needed: say experts Read @ANI Story | https://t.co/QkRUL3m1Vf#OneNationOneElection #ParliamentSpecialSession pic.twitter.com/AwHG1QF3Gq — ANI Digital (@ani_digital) September 1, 2023 ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే చేయాల్సిన రాజ్యాంగ సవరణలు.. జమిలీ ఎన్నికలకు అనుగుణంగా ఈ ఆరు ఆర్టికల్లలో విధివిధానాలను సవరించాల్సి ఉంటుంది. ► ఆర్టికల్ 83(2): ఈ ఆర్టికల్ ప్రకారం లోక్‌సభ గడువు ఐదేళ్లు. ముందుగా కూడా రద్దు చేయవచ్చు. ► ఆర్టికల్ 85: లోక్‌సభను రద్దు చేయడానికి రాష్ట్రపతికి అధికారం ఉంటుంది. ప్రస్తుత సభ రద్దు అయిన వెంటనే సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త సభ ఆరంభం అవుతుంది. ► ఆర్టికల్ 172(1): రాష్ట్ర అసెంబ్లీ రద్దు కానంతరవరకు ఐదేళ్ల పాటు గడువు ఉంటుంది. ► ఆర్టికల్ 174(2): కేబినేట్ సూచన మేరకు అసెంబ్లీని రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంటుంది. మెజారిటీ సందిగ్ధంలో ఉన్నప్పుడు గవర్నర్ తన విచక్షణను వినియోగిస్తారు. ► ఆర్టికల్ 356: ఈ ఆర్టికల్ ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంటుంది. అవిశ్వాస తీర్మాణం విపక్షాలు నెగ్గినప్పుడు ప్రభుత్వం రద్దు అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో జమిలి ఎన్నికలకు అనుగుణంగా సవరణ చేయాల్సి ఉంటుంది. ► ఈ ఆర్టికల్‌ల సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో మూడొంతుల్లో రెండోంతుల సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాల ఆమోదం తప్పనిసరి. పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత సగం రాష్ట్రాల అసెంబ్లీలు దానికి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. వనరుల కొరత.. లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు వచ్చేలా రాజ్యాంగాన్ని సవరించినా.. ఎన్నికల నిర్వహణకు భారీ వనరులు అవసరమవుతాయి. 25 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (EVM)లు, 25 లక్షల VVPATలు (ఓటర్-వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయిల్) కావాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం వద్ద ప్రస్తుతం కేవలం 12 లక్షల ఈవీఎంలు మాత్రమే ఉన్నాయి. అత్యధిక సంఖ్యలో సిబ్బంది కూడా అవసరమవుతారు. మొదట్లో జమిలీ ఎన్నికలే.. 1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు. విదేశాల్లో ఇలా.. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ దక్షిణాఫ్రికాను ఉదాహరణగా చూపుతోంది. అక్కడ జాతీయ, స్థానిక స్థానాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. స్వీడన్లో కూడా ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్ణీత తేదీల్లో మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. నేషనల్ లెజిస్లేచర్ (రిక్స్‌డాగ్), ప్రావిన్షియల్ లెజిస్లేచర్ (ల్యాండ్‌స్టింగ్), స్థానిక సంస్థలు/మునిసిపల్ అసెంబ్లీలకు సెప్టెంబర్ రెండో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు.. -
జనరల్ డయ్యర్‌ను గాంధీ ఎందుకు క్షమించారు?
జలియన్‌వాలాబాగ్ మారణకాండలో ప్రధాన పాత్రపోషించిన బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ భారతీయుల మధ్య విద్వేషాలను కూడా రగిలించాడని అంటారు. అయితే జాతిపిత మహాత్మా గాంధీ పదేపదే జనరల్ డయ్యర్‌ను క్షమిస్తూ వచ్చారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ దేశానికి అహింస, క్షమాగుణాలతో కూడిన భిన్నమైన మార్గాన్ని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ జరిగిన దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా మహాత్మా గాంధీ తిరిగి డయ్యర్‌ను క్షమించారు. ‘డయ్యర్‌ను క్షమించడం ఒక వ్యాయామం’ మహాత్మా గాంధీ మాట్లాడుతూ ‘నేను జనరల్ డయ్యర్‌కు సేవ చేసినా, అమాయకులను కాల్చి చంపడంలో అతనికి సహకరించినా అది పాపం అవుతుంది. అయితే అతను ఏదైనా శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అతన్ని క్షమించి, సాయం అందించడం అనేది నాలో క్షమాగుణం పెరిగేందుకు, ప్రేమను పెంచుకునేందుకు ఒక వ్యాయామంలా ఉపకరిస్తుంది’ అని పేర్కొన్నారు. మరోచోట గాంధీ.. ‘డయ్యర్ కొన్ని శరీరాలను మాత్రమే నాశనం చేశాడు. మరికొందరైతే ఒక జాతి యొక్క ఆత్మను చంపడానికి ప్రయత్నించారు. జనరల్ డయ్యర్‌పై వ్యక్తమైన కోపం చాలావరకు తప్పు దిశగా సాగిందని నేను అనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. డయ్యర్ పక్షవాతానికి గురైనపుడు.. డయ్యర్ తన జీవితపు చివరి దశలో పక్షవాతానికి గురైనప్పుడు గాంధీ స్నేహితుడొకరు ‘అతని అనారోగ్యానికి జలియన్‌వాలాబాగ్ మారణకాండనే కారణమని’ అన్నారు. భగవద్గీతను నమ్మిన గాంధీ దీనిపై హేతుబద్ధంగా స్పందించారు. ‘జలియన్‌వాలాబాగ్‌లో అతను సాగించిన మారణకాండకు అతనికి వచ్చిన పక్షవాతానికి సంబంధం ఉందని నేను అనుకోవడం లేదు. అటువంటి నమ్మకాలను మీరు కలిగివుంటారా? అయితే నాకు వచ్చిన విరేచనాలు, అపెండిసైటిస్, తేలికపాటి స్ట్రోక్‌కు.. నేను కొందరు బ్రిటీషర్లపై వ్యక్తం చేసిన తీవ్ర నిరసనే కారణమని అంటే నాకు బాధ కలుగుతుంది’ అని అన్నారు. డయ్యర్‌ను కలవాలని ఆకాంక్ష ‘నా హృదయంలో డయ్యర్‌పై ఎలాంటి దురుద్దేశం లేదు. నేను అతనిని వ్యక్తిగతంగా కలవాలని కోరుకున్నాను. అయితే అది కేవలం నా ఆకాంక్షగానే మిగిలిపోయిందని’ గాంధీ పేర్కొన్నారు. మనలో ద్వేషం లేకపోవడం అంటే దోషులను స్క్రీనింగ్ చేయడం కాదని గాంధీ స్పష్టం చేశారు. ‘మనం ఇతరులు చేసిన నేరాలను మరచిపోయి, వారిని క్షమించామని చెబుతున్నప్పటికీ, కొన్ని విషయాలను మరచిపోతే పాపం అవుతుంది’ అని గాంధీ పేర్కొన్నారు. 'జలియన్ వాలా ఊచకోతకు కారకులైన డయ్యర్, ఓ డయ్యర్(జలియన్ వాలాబాగ్ మారణకాండ సమయంలో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్)లను మనం క్షమించగలం. కానీ మనం ఆనాటి ఘటనను మరచిపోలేం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: ‘స్మైలింగ్ డెత్’ అంటే ఏమిటి? చనిపోయే ముందు ఎందుకు నవ్వుతుంటారు? -
అభివృద్ధి కోసం నాలుగు మంత్రాలు
న్యూఢిల్లీ: భారత్‌ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాల బలోపేతం (ఇన్ఫ్రా), పెట్టుబడులు, ఆవిష్కరణలు, అందరికీ ఆర్థిక ఫలాలు (సమ్మిళితత్వం) అందించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్ధేశించిన అభివృద్ధి భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు కావాల్సిన అన్ని సామర్థ్యాలు ఉన్నాయని చెప్పారు. కేంద్ర సర్కారు పెట్టుబడిదారుల అనుకూల సంస్కరణలు ఎన్నింటినో తీసుకొచ్చినట్టు గుర్తు చేశారు. భారత్‌లో శక్తివంతమైన యువ జనాభా ఉందంటూ, ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా వారికి కావాల్సిన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. 25 ఏళ్లలో సాధించేందుకు.. ‘‘మౌలిక సదుపాయాల కల్పనను పెద్ద ఎత్తున చేపట్టాం. గత 3–5 ఏళ్లలో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ వ్యయాలు పెద్ద ఎత్తున పెంచడంతో 2023–24 నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరాయి. మౌలిక సదుపాయాలు అనేవి పెట్టుబడుల వల్లే సాధ్యపడతాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. మౌలిక సదుపాయాలు అంటే కేవలం బ్రిడ్జ్‌లు, రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టులే కాకుండా, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పనకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాం. అలాగే, ఆవిష్కరణలను సైతం ప్రోత్సహిస్తున్నాం. అంతరిక్షం, అణు ఇంధనం విభాగాల్లో అవకాశాలకు ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. అలాగే సంప్రదాయ శిలాజ ఇంధనాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. నేడు యువత తగిన పరిష్కారాలను అందిస్తుందని విశ్వసించేందుకు తగిన కారణాలు ఉన్నాయి. చివరిగా అందరికీ ఆర్థిక ఫలాలను అందించడం ద్వారా 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. కనుక భారత్‌లో ప్రతీ వర్గం, సామాన్య వ్యక్తి కూడా ప్రభుత్వం చేపట్టే పెట్టుబడులు, సంస్కరణలు, తదితర చర్యల ద్వారా ప్రయోజనం పొందుతారు’’అని మంత్రి సీతారామన్ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. జీ20 ముందు ఎన్నో లక్ష్యాలు జీ20 కూటమికి అధ్యక్ష స్థానంలో భారత్ చేస్తున్న కృషిని సైతం మంత్రి సీతారామన్ ప్రస్తావించారు. కరోనా అనంతరం ఎదురైన సవాళ్ల పరిష్కారం, పునరుద్ధరణ ప్రణాళికలపై పనిచేస్తున్నట్టు చెప్పారు. 21వ శతాబ్దపు సవాళ్లను మలీ్టలేటరల్ బ్యాంకులు ఎలా పరిష్కరించగలవనేది తమ తొలి ఏజెండా అని చెప్పారు. మార్కెట్, ప్రైవేటు రంగం నుంచి అవి మరిన్ని నిధులను తీసుకురాగల సామర్థ్యాలు కలిగి ఉన్నట్టు తెలిపారు. చాలా దేశాలు ఎదుర్కొంటున్న రుణ భారం కూడా తమ అజెండాలో ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వేగంగా రుణ భారాన్ని ఎలా పరిష్కరించుకోగలమన్న దానిపై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. శ్రీలంకను ఈ సందర్భంగా ప్రస్తావించారు. క్రిప్టో కరెన్సీలపై సెంట్రల్ బ్యాంకుల నియంత్రణ అవసరాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైతే భారత్ నియంత్రణ విషయంలో తొందర పడడం లేదని చెబుతూ.. ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్టు సంకేతం ఇచ్చారు. ఇది టెక్నాలజీ ఆధారంగా నడిచే కరెన్సీ కనుక దీనిపై నియంత్రణ అవసరమన్నారు. అన్ని దేశాలు ఉమ్మడి వైఖరిని అనుసరించినప్పుడే దీని నియంత్రణ సాధ్యమని అభిప్రాయపడ్డారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలన్నవి తమ నాలుగో ప్రాధాన్య అంశంగా ఉన్నట్టు తెలిపారు. ఈ విషయంలో భారత్ తన సామర్థ్యాలు ఏంటో చూపించిందన్నారు. -
రాహుల్ ప్రధాని అయితే స్కాములే గతి
ఉదయ్‌పూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశం కుంభకోణాలు, అవినీతిమయంగా మారుతుందని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి అయితే మోసగాళ్లంతా కటకటాల వెనక్కి వెళ్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. పట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్ష నేతల భేటీపై ఆయన..‘అక్కడ సమావేశమైన వారంతా అవినీతితో సంబంధం ఉన్నవాళ్లే. వారి ఆరాటమంతా తమ కుమారుల భవిష్యత్తు కోసమే తప్ప ప్రజలకు మంచి చేయడం కాదు’అని విమర్శించారు. ‘రాహుల్ గాం«దీని ప్రధానమంత్రిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యం. లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యం తేజస్వీయాదవ్‌ను ప్రధానిని చేయడం, తన మేనల్లుడు అభిషేక్‌ను సీఎంను చేయడమే మమతా బెనర్జీ లక్ష్యం. కొడుకు వైభవ్ గెహ్లాట్‌ను సీఎంను చేయడం అశోక్ గెహ్లాట్ లక్ష్యం’అని ఆయన ఎద్దేవా చేశారు. రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే, ఇప్పటికే నిందితులకు ఉరిశిక్ష పడి ఉండేదని పేర్కొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం గహ్లోత్ వల్లే నిందితులకు శిక్ష పడటం ఆలస్యమవుతోందని ఆరోపించారు. సస్పెండైన బీజేపీ నేత నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కన్హయ్య లాల్ అనే దర్జీని గత ఏడాది ఇద్దరు దుండగులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కన్హయ్యలాల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కలి్పంచలేకపోయిందని మంత్రి అన్నారు. -
'దేశానికి క్షమాపణలు చెప్పండి' ఆదిపురుష్ టీంపై మహిళా ఎంపీ ఫైర్..
ఢిల్లీ: శివ్ సేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే)ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆదిపురుష్ సినిమా టీంపై విరుచుకుపడ్డారు. హిందూ పురాణమైన రామాయణానికి తగ్గట్టుగా సినిమాలో డైలాగ్స్ లేవని ఆరోపించారు. చిత్ర బృందం దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 'డైలాగ్ రచయిత మనోజ్ముంతాషిర్, డైరెక్టర హోం రౌత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. డైలాగ్‌లు గౌరవప్రదంగా లేవు. ముఖ్యంగా హనుమంతుని డైలాగ్‌లు సరిగా లేవు. వినోదం పేరుతో హిందు దేవుళ్లపై తీసిన సినిమాలో హిందువుల మనోభావాలు దెబ్బతినే భాషను వాడారు. మర్యాద పురుషోత్తమ రామునిపై సినిమా తీసి.. త్వరగా రిలీజ్ చేయాలని మర్యాదను మరిచారు' అని ప్రియాంక చతుర్వేది అన్నారు. మైథాలాజికల్ యాక్షన్ ఫిల్మ్ ఆదిపురుష్ శుక్రవారం రిలీజ్ అయింది. రూ.500 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతీ షోలో ఓ సీటు హనుమంతుని కోసం ఉంటుందని దర్శకుడు హోం రౌత్ చెప్పారు. సినిమా బాలేదని చెప్పిన ప్రేక్షకులపై దాడులు జరిగిన సందర్భాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే.. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సినిమాలో దృశ్యాలు ఉన్నాయని దిల్లీ హైకోర్టులో ఇప్పటికే హిందూ సంఘాలు ఫిర్యాదులు కూడా చేశాయి. ఇదీ చదవండి:మనోభావాలు దెబ్బతిన్నాయ్.. ఆదిపురుష్‌పై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ -
Civil Services Day: దేశ ప్రయోజనాలే పరమావధిగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు తీసుకొనే ప్రతి నిర్ణయానికీ దేశ ప్రయోజనాలే పరమావధి కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. మీపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని అధికారులకు సూచించారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత్ భారత్’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును అధికారంలో ఉన్న పార్టీ సొంత ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందా? లేక దేశ అభివృద్ధి కోసం వెచ్చిస్తోందా? అన్నది విశ్లేషించాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులపై ఉందని మోదీ చెప్పారు. జాతి నిర్మాణంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. వారి క్రియాశీల భాగస్వామ్యం లేకపోతే దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ అధికారి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని వెల్లడించారు. మీరు తీసుకొనే ప్రతి నిరం్ణయానికి దేశ ప్రగతే ఆధారం కావాలన్నారు. ప్రపంచంలో భారత్ ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని, అధికార యంత్రాంగం సమయం వృథా చేయకుండా దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’ ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ పాలనా వ్యవస్థ అండగా నిలవాలని, వారి కలలు సాకారం అయ్యేందుకు ప్రభుత్వ అధికారులు సాయం అందించాలని ప్రధాని మోదీ సూచించారు. వికసిత భారతదేశానికి ఇది అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ ప్రతికూలత ఆవరించి ఉండేదని, అది ఇప్పుడు సానుకూలతగా మారిందని వివరించారు. ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని, దేశంలో బలహీనవర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మీ కోసం మీరు ఏం చేసుకున్నారు అనే దాన్నిబట్టి కాకుండా ప్రజల కోసం ఏం చేశారన్న దాన్నిబట్టే మీ పనితీరు, ప్రతిభను గుర్తించవచ్చని సివిల్ సర్వీస్ అధికారులకు సూచించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న గాఢమైన ఆకాంక్షతో పనిచేస్తే చిరస్మరణీయమైన వారసత్వాన్ని మిగిల్చిన వారవుతారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నమైన సిద్ధాంతాలు, భావజాలాలున్న పార్టీలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. యువత కలలు ఛిద్రం కావడానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కొనసాగిన విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్ట వేశామని రూ.3 లక్షల కోట్లు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నామన్నారు. సివిల్ సర్వెంట్ల సేవలు ప్రశంసనీయం: రాష్ట్రపతి ‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా సంబంధిత అధికారులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారి సేవలు ప్రశంసనీయ మంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. దేశ ప్రగతిలో వారి కృషి, అంకితభావం, సేవలను ప్రశంసించాలంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఏటా ఏప్రిల్ 21న కేంద్రం సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. -
మన దేశానికి ఇద్దరు పితామహులు: డిప్యూటీ సీఎం భార్య కీలక వ్యాఖ్యలు
నాగ్‌పూర్: మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృతా ఫడ్నవిస్ ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్ర పితామహులుగా అభివర్ణించారు. మన దేశానికి ఇద్దరు పితామహులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కాలానికి జాతి పితా మహాత్మా గాంధీ అయితే నేటీ సరికొత్త భారతావనికి పితామహులు నరేంద్ర మోదీ అంటూ ప్రధానిపై పొగడ్తలు జల్లు కురిపించారు అమృతా ఫడ్నవిస్. ఈ మేరకు అమృతా ఫడ్నవిస్ నాగ్‌పూర్ రచయితల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె నరేంద్ర మోదీని రాష్ట్ర పితాగా వ్యవహరించారు. దీంతో మరి మహాత్మా గాంధీ ఏమవుతారంటూ విలేకరులు ప్రశ్నించారు. దీంతో ఆమె సమర్థించుకుంటూ ఆ కాలంలో మహాత్మా గాంధీ జాతి పితా, ప్రస్తుతం నరేంద్ర మోదీ అంటూ కవర్ చేశారు. ఆమె ఇలా మోదీని పొగడ్తలతో ముంచెత్తడం మొదటి సారి కాదు. 2019లో ప్రధానికి పంపిన ట్విట్టర్ సందేశంలో కూడా మన దేశ పితామహుడు నరేంద్ర మోదీజీకి జన్మదిన శుభాకాంక్షలు. సమాజ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా పనిచేయడంలో మాకు స్ఫూర్తి మీరే అని పోస్ట్ చేశారు. ఆమె తరుచు ఇలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతూ వార్తలో నిలుస్తుంటారు. అంతకు మునుపు ఉద్ధవ్ థాక్రేపై విరుచుపడి వార్తల్లో నిలిచారు. కాగా, శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ షిండే సీఎం కాగానే ఆమె భర్త దేవేంద్ర ఫడ్నవిస్ డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యిన సంగతి తెలిసిందే. (చదవండి: ముంబైలో దారుణం..అందరూ చూస్తుండగా కత్తితో దాడి చేసి..) -
Tuvalu: ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశం.. ఉనికి మాటేమిటి?!
తాజాగా ఈజిప్టులో ముగిసిన కాప్ 27 సదస్సు మరోసారి ప్రపంచ పర్యావరణ సమస్యలు, గ్లోబల్ వార్మింగ్ ప్రమాదాలపై చర్చకు వేదిక అయ్యింది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో జరిగిన ఈ సమావేశం చివరకు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోగలిగినందుకు సంతోషించాల్సిందే. పర్యావరణ మార్పుల వల్ల నష్టపోతున్న బడుగు దేశాలను ఆదుకోవడానికి ప్రత్యేక నిధి ఏర్పాటుకు ఈ సమావేశంలో అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించాయి. వాస్తవంగా ప్రపంచం పర్యావరణ ప్రమాదం బారిన పడటానికి ప్రధాన కారణం కాలుష్య కారకాలుగా మారిన ఈ అభివృద్ధి చెందిన పారిశ్రామిక దేశాలే. గ్రీస్‌హౌస్ ఉద్గారాలను తగ్గించుకోవాల్సిన బాధ్యత ఈ దేశాల పైనే ఉంటుంది. అది ఒక చర్చనీయాంశం. ఈ సమావేశం సందర్భంగా అందరి దృష్టిని ఆకర్షించింది పసిఫిక్ మహా సముద్రంలోని చిన్న ద్వీప దేశం ‘టువాలు’. ఐక్యరాజ్యసమితి ఆధ్వ ర్యంలో జరిగిన కాప్ 27 సమావేశంలో టువాలు ప్రపంచం ముందు ఒక సవాలుగా నిలబడింది. ప్రపంచ బాధ్యతను గుర్తు చేసింది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన అంశమే. ఈ పెరుగుదల ఇలానే కొనసాగితే మరో 60, 70 ఏళ్ళల్లో ఈ ద్వీప దేశం జల సమాధి కాకుండా ఎవరూ ఆపలేరు. టువాలు మొత్తం 9 ద్వీపాల సమూహం. హవాయి, ఆస్ట్రేలియా దేశాల మధ్య ఒకదాని వెంట ఒకటిగా చిన్న చిన్న దీవులు బారులు తీరి ఉంటాయి. దేశం మొత్తం కేవలం 26 చదరపు కిలోమీటర్లు మాత్రమే. అంటే సుమారు 6400 ఎకరాలు. 2022 జనాభా అంచనా ప్రకారం ఈ దేశ జనాభా సుమారు 11 వేల 200. బ్రిటన్ నుండి 1978లో స్వాతంత్య్రం పొందింది. ఈ దేశం సముద్ర మట్టానికి కేవలం నాలుగున్నర మీటర్ల ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి హైదరాబాద్ నగరం 542 మీటర్ల ఎత్తున ఉంటే... సముద్రం ఒడ్డునే ఉన్న విశాఖపట్నం 45 మీటర్ల ఎత్తున ఉంది. దీన్ని బట్టి టువాలు పరిస్థితిని అంచనా వేయవచ్చు. సముద్ర మట్టానికి ఇంకా తక్కువలో ఉన్న మరో ద్వీప దేశం మాల్దీవులు. సముద్ర మట్టాలు పెరుగుతున్న కొద్దీ ఈ దేశాల ఉనికి ప్రమాదం దిశగా పయనిస్తున్నట్లే. టువాలు కంటే ఆర్థికంగా కాస్త బలమైన మాల్దీవులు తమ దేశాన్ని కాపాడు కోవటానికి తేలియాడే నగరాన్ని నిర్మిస్తోంది. 20 వేల మంది జనాభాకు కృత్రిమంగా నిర్మిస్తున్న ఫ్లోటింగ్ సిటీ ఆవాసంగా మారనుంది. ఇటువంటి ఏర్పాట్లు చేసుకునే స్థోమత టువాలుకి లేదు. అందుకే అది తమ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, భాష, భౌగోళిక స్వరూపం, రోడ్లు, నిర్మాణాలు.. మొత్తంగా తన అస్తిత్వాన్ని భద్ర పరుచుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. తమ దేశాన్ని వర్చ్యువల్ రియాలిటీ సాంకేతికత ఉపయోగించి ప్రపంచంలో మొదటి వర్చ్యు వల్ దేశంగా అయినా మార్చాలనే సంకల్పంతో ఉంది. ఇక్కడే కొన్ని కీలకమైన సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ దేశంలోని జనాభాకు భౌతికంగా భూ మండలంపై ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది అనేది పెద్ద ప్రశ్న. పోనీ ఏదో ఒక దేశం స్వాగతించినా వీరు ఆ దేశానికి వలసదారులు, లేదంటే ఆ దేశ పౌరులు అనే హోదాను మాత్రమే పొందగలుగుతారు. మరి టువాలు సార్వభౌమత్వం సంగతి ఏంటి? స్వయం పాలనకు అవకాశం కోల్పోవటమేనా? దేశం సముద్రంలో మునిగిపోతే అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఇప్పుడు ఉన్న హక్కులు, మెరైన్ సరిహద్దు పరిధిలో ఉండే సహజ వనరులను కోల్పోక తప్పదా? భౌతికంగా కనిపించని టువాలును ఐక్యరాజ్యసమితి ఒక దేశంగా గుర్తించే అవకాశం ఉంటుందా? టువాలు ఇవాళ ప్రపంచం ముందు ఒక ప్రశ్నగా నిలబడి ఉంది. (క్లిక్ చేయండి: ముందు నుయ్యి... వెనుక గొయ్యి) - రెహాన సీనియర్ జర్నలిస్ట్ -
దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పెరగాలంటే...
న్యూఢిల్లీ: దేశీయంగా సుస్థిరమైన విద్యుత్ వాహనాల వ్యవస్థను తీర్చిదిద్దాలంటే స్థానిక సరఫరా వ్యవస్థలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సమాఖ్య ఎస్ఎంఈవీ పేర్కొంది. పర్యావరణహిత వాహనాల అవసరంపై ప్రజలు తమ కుటుంబాలు, మిత్రుల్లో అవగాహన పెంచాలని సూచించింది. వరల్డ్ ఈవీ డే సందర్భంగా ఎస్ఎంఈవీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 2024 నాటికి 18,000 చార్జింగ్ స్టేషన్లను కొత్తగా నెలకొల్పాలన్న ఢిల్లీ ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికను ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టెరి), ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రశంసించాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా వ్యూహాలు అమలు చేయాలని కోరాయి. ఈవీల వినియోగం పెద్ద యెత్తున పెరగాలంటే చార్జింగ్ మౌలిక సదుపాయాలు సులభంగా అందుబాటులో ఉండేలా అభివృద్ధి చేయాల్సి ఉంటుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ) వీరేందర్ గోయల్ చెప్పారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరుగుతుందని మహీంద్రా అండ్ మహీంద్రా ఈడీ (ఆటో, వ్యవసాయ రంగాలు) రాజేష్ జెజూరికర్ పేర్కొన్నారు. ఎంఅండ్ఎం వచ్చే ఏడాది జనవరిలో తమ తొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ మోడల్ ఎక్స్‌యూవీ400ను వచ్చే ఏడాది జనవరిలో ప్రవేశపెట్టే ప్రణాళికల్లో ఉంది. -
‘ఒకే దేశం, ఒకే ఎలక్షన్’లో మర్మం?
ఐదేళ్లకోసారి ఎన్నికలు జరిగే దేశంలో ఐదేళ్లపాటు ఎక్కడో ఒక చోట ఎప్పుడూ ఎన్నికలు జరుగుతూనే ఉండటమన్నది అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్నది మాత్రమే కాదు.. దేశ అభివృద్ధి ప్రణాళికల అమలుకు అంతరాయంగా మారే ప్రమాదమూ ఉంటుంది. అలాగని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఒకేసారి ‘జమిలి’ ఎన్నికలు జరిపించాలనుకోవడంలోని హేతుబద్ధత ఏమిటి? సాధించే ప్రయోజనం ఏమిటి? ఇందులోని సాధ్యా సాధ్యాలు అటుంచితే ‘ఒక దేశం.. ఒక ఓటు’ ను ఆచరణాత్మకం చేయాలని చూస్తున్న పాలకుల ఆలోచనలోని మర్మం ఏమై ఉంటుంది? పాలనా విధా నాలు ఒంటెత్తు పోకడలయ్యేందుకు ఈ విధానం దారి తియ్యదని నమ్మకం ఏమిటి? తాజా ‘పెగసస్’ వెల్లడింపుల సాక్షిగా జవాబు లేని ప్రశ్నలెన్నో! ఒక దేశానికి ఒక ఎన్నికే ఉండాలి. ‘వన్ నేషన్, వన్ ఓటర్’ జాబితానే ఉండాలి. ఏడాది పొడవునా ఏదో ఒకచోట ఎన్నికలు జరుగుతూ ఉంటే అభి వృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది కాబట్టి ఈ ఏర్పాటు అవసరం. అందుకు ఓటింగ్‌లో అందరూ పాల్గొనేటట్టు చేయాలి.. అని చెబుతున్న సమయంలోనే ఇజ్రాయెల్‌తో 2017లో రక్షణ ఒప్పం దంలో భాగంగా ‘పెగసస్’ గూఢచర్య సాఫ్ట్వేర్ కొనుగోలుకు భారత ప్రభుత్వం కుదుర్చుకున్న రహస్య ఒప్పందం గురించి ‘న్యూయార్క్ టైమ్స్’ తిరుగులేని సంచలన కథనాన్ని ప్రకటించింది. అలాంటిదేమీ లేదని దేశ ప్రజలకు ఇన్నాళ్లుగా వివరణ ఇస్తూ వచ్చిన వైనాన్ని ‘టైమ్స్’ వివరాలతో ప్రచురించడంతో ప్రభుత్వం మరింతగా జవాబు దారీ అయింది. అంతేగాదు, ఈ పరిణామం వల్ల ఇజ్రాయెల్‌తో ‘స్నేహం’ గాఢం అయిన తరువాత పశ్చిమాసియాతో, అరబ్ దేశాలతో ఉన్న భారత్ సంప్రదాయ సంబంధాలు కూడా అస్థిమితం అయ్యే పరిస్థి తులు తలెత్తాయి! భారతదేశాన్ని, భారత ప్రయోజనాలను, రాజకీయాలను ఇజ్రా యెలీ గూఢచారి సంస్థ చేతిలో పెట్టడంతో ఇటు భారత పార్లమెంట్‌కు, అటు పశ్చిమాసియా సభ్య దేశాలకు సమాధానం చెప్పగల దశ దాటి పోయి ‘ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షి’ చందాన మన దేశ పరిస్థితి మారింది. బహుశా అందుకే అన్నాడేమో ప్రపంచ ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త ఐన్‌స్టీన్: ఈ ప్రపంచం చెడ్డవారివల్ల ప్రమాదకరంగా మార లేదు, జరుగుతున్న చెడును చూస్తూ కూడా సకాలంలో స్పందించలేని వారివల్లనే అలా మారింది. అది ఎంత వాస్తవమో పాలకుల విధా నాలు అక్షర సత్యాలుగా నిరూపి స్తున్నాయి. మన ఒంటెత్తు పోకడల ద్వారా మనమే గాక ‘పెగసస్’ గూఢచర్యం సహాయంతో పార్ల మెంటును, దేశ ప్రజలను పక్కతోవ పట్టించడంతో చివరికి ఇజ్రాయెలీ ప్రభుత్వం ఆడిన అబద్ధాలకు మనమే బలి కావలసిన పరిస్థితులు వచ్చాయి. అందుకే ఒకవైపున దేశ అత్యున్నత న్యాయస్థానం, ప్రధాన న్యాయమూర్తి – ఎప్పుడైతే ‘పెగసస్’తో రహస్య లావాదేవీల వ్యవహా రాన్ని పసిగట్టారో ఆ క్షణం నుంచీ పార్లమెంటుకు వివరించవలసిన అవసరాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి, జాగ్రత్త పడవలసి వచ్చింది. గౌరవ ప్రధాన న్యాయమూర్తి.. విచారణకు సంబంధించిన లోతు పాతుల్ని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న కొద్దీ కొత్త ప్రశ్నలు, అనుమానాలు తలెత్తాయి. ‘పెగసస్’ వ్యవహారం ఆనుపానుల్ని లోతుగా లాగే ప్రయత్నంలో న్యాయమూర్తి తలమునకలై ఉన్నారు. దీంతో ప్రభుత్వం తన ఇజ్రాయెలీ గూఢచర్య సంబంధాలను దాచు కోగల పరిస్థితి లేకనే భారత పౌరహక్కుల నేతలపైన, ప్రజాస్వామ్య సంస్థల కార్యకర్తలపైన బాహాటంగానే ఎదురు దాడులు ప్రారంభించి, కొనసాగిస్తూ వచ్చింది. ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలనంగా పేర్కొన్న పెగసస్ గూఢచర్యత్వం భారతీయులకు కొత్త వెల్లడి కాదు! కొత్తదన మల్లా – ‘పెగసస్’ గూఢచర్యం బట్టబయలయిన తర్వాత ఆకస్మి కంగా ఇజ్రాయెల్‌కు పరుగెత్తవలసిన అవసరం ఎందుకు వచ్చిందీ, అందువల్ల కొత్తగా ప్రభుత్వానికి ఎదురైన ఇబ్బంది ఏమిటన్నది అసలు ప్రశ్నగా తలెత్తింది. ‘పెగసస్’ సాఫ్ట్‌వేర్‌ను అందించిన ఇజ్రాయెలీ సైబర్ ఆయుధ విక్రయ సంస్థ (ఎన్ఎస్ఒ) ఒక ప్రైవేట్ సంస్థేగానీ ప్రభుత్వ సంస్థ కాదని, అందువల్ల ఇజ్రాయెలీ ప్రభుత్వ విధానాలు ఆ సంస్థకు వర్తించవనీ ఇజ్రాయెలీ పాలకులు బొంక బోవడాన్ని ‘టైమ్స్’ ఖండించాల్సి వచ్చింది. ఎప్పుడైతే పేరు పేరునా ‘పెగసస్’ గూఢ చర్యం ద్వారా ప్రజా ఉద్యమకారుల, పౌర సంస్థల, ఆందోళనాకారు లయిన కార్యకర్తలపైన నిఘాకు దిగిన ఆ మరుక్షణమే వివరాలన్నీ కేంద్రానికి అందిస్తూ రావడం గూఢచారి సంస్థ కర్తవ్యంగా మారింది. పైగా ‘పెగసస్’ గూఢచర్యంపై ఎన్నిసార్లు కేంద్ర సమాచార శాఖకు లేఖలు పంపినా సమాధానం రావడం లేదు. ప్రతిపక్ష సభ్యుల ఫోన్స్ టాపింగ్ అన్నది ఎన్ని పర్యాయాలు జరిగినా, వాటిని గూర్చిన ‘అజ–పజ’ ఇన్నాళ్లుగా తెలియరాలేదు. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం ‘పెగసస్’ విషయంలో ఆడుతున్న, లేదా ఆడటానికి ప్రయ త్నిస్తున్న నాటకానికి ‘కత్తెర’ పడుతుందా లేదా అన్నది విచారణ చర్యలకు చొరవ తీసుకున్న ప్రధాన న్యాయమూర్తి తుది తీర్పుపై ఆధారపడి ఉంది. నిజానికి తుది తీర్పు వాయిదా పడటంతో అవకా శానికి ద్వారాలన్నీ మూతపడ్డాయి. కనుకనే ‘ఆసులో గొట్టాం’ మాదిరిగా దేశ పాలకులు ఇజ్రాయెల్‌కు పదే పదే పరుగులు తీస్తూ అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెలీ గూఢ చర్యలకు వత్తాసు పలుకుతూ కాలం గడపాల్సిన దుఃస్థితి వచ్చింది. అంతేగాదు, ‘పేదవాడి కోపం పెదవికి చేటన్న’ మాట ఎంత నిజమో, ఇటీవల బడుగు దేశాల్ని దోపిడీ చేసి బలిసిన సంపన్న దేశాలు మురిగిపోయిన వంద మిలియన్ల కోవిడ్–19 ఇంజక్షన్ డోసుల్ని పేద దేశాలకు పంపి, సొమ్ము చేసుకున్నాయని ప్రపంచ సంస్థ ‘ఐక్యరాజ్య సమితి శిశు సంరక్షణ విభాగం’ (14.1.2022) వెల్లడించడంతో మరోసారి రుజువైంది. ప్రపంచంలోని అతి నిరుపేద దేశాలలో పెక్కుమంది ఆఫ్రికాలో ఉన్నందున సంపన్న దేశాలు ఈ దోపిడీకి వరుసకట్టాయి. ఇది ఇలా ఉండగానే, ‘రాబోయే కోవిడ్ వైరస్లు కొత్తగా తలెత్తిన ‘ఒమిక్రాన్’ వైరస్ కన్నా తీవ్రంగా ఉంటాయని, రానున్న మరిన్ని వైరస్ క్రిములు తక్కువ ప్రమా దకరమని భావించరాదని కోవిడ్–19 సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ హెచ్చరికలతో దాన్ని అంటి పెట్టుకొన్న ‘వ్యాపార ప్రయోజనం’ కాస్తా బయటపడింది. అమెరికాలోని ప్రభుత్వాన్ని సాకుతున్న 84 మందుల గుత్త కంపెనీలు (ఫార్మా కంపెనీలు) రాజ్యమేలుతున్నంత కాలం ఫార్మా కంపెనీలదే ‘ఆడింది ఆట, పాడింది పాట’! అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ వైద్య నిపుణులే ఆ సంగతి చెబుతూ, ప్రజల్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, అమె రికాలో పాలకులు డెమో క్రాట్లయినా, రిపబ్లికన్లు అయినా పాలనా విధానాలకు సంబంధించి ‘దొందూ దొందే’నని అమెరికా కార్మికుల అనుభవం. అందుకే రెండింటినీ కలిపి జమిలిగా ‘డెమో–పబ్లికన్స్’ (డెమోక్రాట్స్ –రిపబ్లికన్స్) అని పేరుపెట్టారు. ఇద్దరూ కలిసే ప్రపంచ సంస్థ తమ చేతుల నుంచి జారిపోకుండా నిధులతో సాకుతూంటారు. నిర్ణయాలు వారివి, అనుభవాలు, బాధలు ప్రజలవీ! అందుకే ‘ఒమిక్రాన్’ వ్యాధి అయినా, మరొక వైరస్ క్రిమి అయినా ప్రజల ఆరోగ్యాన్ని శాసించేది ఫార్మా కంపెనీలే అవు తున్నాయి. అలాగే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ నినాదం కూడా క్రమంగా ఒకే దేశం, ఒకే నాయకుడిగా; ఒకే దేశం, ఒకే పార్టీగా ఉండిపోతే సుఖంగా ఉంటుందని భావించవచ్చునా? ఆలోచించండి! ఈ సంద ర్భంలో ‘మలజుల్’ అనే కార్టూనిస్టుకు తట్టిన ఓ గొప్ప ఐడియాని మనం కూడా పంచుకుని ఆనందిద్దాం: ఆ కార్టూన్లో ఓ దిమ్మ మీద ఓ వ్యక్తిని పెట్టి అతని మెడలో దండ వేశారు. ఆ బొమ్మలోని వ్యక్తిని చూస్తున్న ఇద్దరు పెద్ద మనుషులకు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరై ఉంటారో బోధపడక వాళ్లే సమాధానం కూడా చెప్పుకుంటారు– ‘అయినా గాంధీ, నెహ్రూలకు పచ్చి వ్యతిరేకని తెలిసిన తర్వాతనే మనం ఈ విగ్రహాన్ని నెలకొల్పాం’ అని! దేశంలో నేటి రాజకీయాల తీరు తెన్ను లను ఈ వ్యంగ్య రేఖా చిత్రణ ఒక చక్కటి ప్రతిఫలనం. abkprasad2006@yahoo.co.in ఏబీకే ప్రసాద్ -
రెండు రోజుల సంబరమే,మరోసారి పెరిగిన పెట్రో ధరలు
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు రెండు నెలల తరువాత జులై 12 నుంచి చమురు ధరలు కాస్త తగ్గి స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు చమురు ధరలు అలాగే ఉన్నా.. గురువారం రోజు వాటి ధరలు స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్ ధర 31 నుంచి 39 పైసా వరకు పెరగ్గా..డీజిల్ ధర 15 నుంచి 21 పైసా వరకు పెరిగింది. దీంతో చెన్నై, ముంబై వంటి మెట్రో నగరాల్లో చమురు ధరలు రికార్డ్ స్థాయిల్ని నమోదు చేశాయి. గురువారం రోజు ప్రధాన నగరాల్లో చమురు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.52, డీజిల్ ధర రూ.97.96 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.101.54, డీజిల్ ధర రూ.89.87 చెన్నైలో పెట్రోల్ రూ.102.23, డీజిల్ ధర రూ.94.39 ముంబై పెట్రోల్ ధర రూ.107.54 డీజిల్ ధర రూ.97.45 కోల్ కతా లో పెట్రోల్ ధర రూ.101.74, డీజిల్ ధర రూ.93.02 కాగా, జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దేశంలో చమురు ధరల పెరగడానికి కారణమైందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ముఖ్యంగా అమెరికన్ మార్కెట్లో క్రూడ్ అయిల్ స్టాక్స్ ప్రభావం లేకపోవడంతో పాటు సెప్టెంబర్ నాటికి చమురు ధరల రవాణా తగ్గిపోతుండడంతో వాటి ప్రభావం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలకు కారణమైనట్లు తెలుస్తోంది. -
కరోనా : మానవజాతిని పట్టి పీడిస్తోంది
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో పుట్టిన కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది. రోజు రోజుకు విస్తరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ ప్రపంచ యుద్ధాలకంటే తీవ్రమైన ఆందోళన రేపుతోందని మోదీ పేర్కొన్నారు. మొత్తం మానవజాతినే ప్రమాదంలోకి నెట్టేసిందని మోదీ వ్యాఖ్యానించారు. గత రెండు నెలలుగా ఈ సంక్షోభం ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోందన్నారు. అయితే ఈ విషయంలో భారతదేశం విజయం సాధిస్తుందని ప్రధాని భరోసా ఇచ్చారు. అయితే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి వాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు రేగడం సహజం. కానీ ప్రజలు అప్రమత్తంగా వుండి, ఈ వైరస్ బారినుంచి సురక్షితంగా బయటపడవచ్చు అని ప్రధాని మోదీ పిలుపు నిచ్చారు. మనం ఆరోగ్యంగా వుంటే.. ప్రపంచం ఆరోగ్యంగా వుంటుంది. సంకల్పం, అప్రమత్తత మాత్రమే కరోనాకు మందు అని ప్రధాని సూచించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. సాధారణంగా ఎప్పుడైనా, ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏవో కొన్ని దేశాలకు లేదా కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ, ప్రస్తుతం వచ్చిన ఈ సంక్షోభం ప్రపంచ ప్రజలందరినీ విపత్తులోకి ముంచివేసింది. తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ, రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కానీ ఇన్ని దేశాలలో ప్రభావం కనిపించలేదు. ఈ రోజు కరోనా దుష్ప్రభావం అనేక దేశాలలో కనిపిస్తోంది. గత రెండు నెలలుగా నిరంతరం ప్రపంచమంతా కరోనా వైరస్ కు సంబంధించి విషాదకర వార్తలు వస్తున్నాయి. మనం వింటూ ఉన్నాం. గత రెండు నెలలుగా భారతదేశం లోని 130 కోట్ల మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిలా విజృంభించిన కరోనా వైరస్ ను ప్రతిఘటిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి గురించి నిశ్చింతగా ఉండడమనేది అంత సులువైన అంశం కాదు. అందువల్ల ప్రతి ఒక్క భారతీయుడు జాగ్రత్తలు పాటించి, అప్రమత్తులై ఉండాలి. ఇది చాలా అవసరం. సంకల్పం, సంయమనం అవసరం.. నేను కోరినప్పుడు నా దేశవాసులందరూ ఆ కోరికను మన్నించారు. నన్ను ఏనాడు నిరాశపర్చలేదు. మీ అందరి ఆశీర్వాద బలంతో మన ప్రయత్నాలన్నీ సఫలమవుతున్నాయి. ఈ రోజు నేను భారతీయులందరికీ ఒక విజ్ఞప్తి చేయడానికి వచ్చాను. ముందు ముందు రాబోయే మీ సమయంలో కొన్ని వారాలు నాకు కావాలి. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు మన విజ్ఞానం ఎలాంటి ఉపాయాన్ని అందించలేకపోయింది. ఈ రోగానికి ఎలాంటి టీకా మందులను ఎవరూ కనిపెట్టలేకపోయారు. ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కడెక్కడైతే విజృంభించిందో, అక్కడ ఒక విషయం తేటతెల్లమైంది. ఈ దేశాలలో ప్రారంభావస్థలో కొన్నిరోజుల తర్వాత అనుకోకుండా ఉన్నట్టుండి అకస్మాత్తుగా భయంకరమైన రీతిలో వ్యాధి ప్రబలింది. ఈ దేశాలలో కరోనా వ్యాధి సంక్రమించిన వారి సంఖ్య వేగంగా పెరిగిపోతోంది. భారత ప్రభుత్వం ఈ స్థితిపై నిఘా వేసింది. కరోనా వ్యాప్తి చెందే తీరుపై దృష్టి సారించింది. కొన్ని దేశాలు వెంటనే నిర్ణయం తీసుకున్నాయి. వ్యాధి సోకినవారిని ఇతరులకు దూరంగా పెట్టి ఈ పరిస్థితులను అధిగమించాయి. 130 కోట్ల మంది ప్రజలున్న భారతదేశంలో, నిరంతరం అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న మన దేశం ముందుకు కరోనా విపత్తు రావడం సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాల్లో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపించడాన్ని మనం చూస్తున్నాం. అయితే, దీని ప్రభావం భారత్ పై పడదని భావించడం తప్పు. ప్రపంచ స్థాయి లో విజృంభిస్తున్న ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రెండు అంశాలు అవసరం.. మొదటిది సంకల్పం, రెండవది సంయమనం. ప్రపంచంలోని ప్రజలందరినీ ఇబ్బందికి గురిచేస్తున్న ఈ మహమ్మారిని నియంత్రించేందుకు దేశ పౌరులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. అందరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన మార్గదర్శక సూత్రాలను పాటిద్దాం. ఈ రోజు మనం సంకల్పం చేసుకోవాలి. ఈ వ్యాధి మనకు రాకుండా చూసుకోవాలి. ఇతరులు కూడా ఈ వ్యాధిబారిన పడకుండా చర్యలు చేపట్టాలి. తప్పనిసరైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి ప్రపంచస్థాయిలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మనకు కార్యసాధనను అందించే మంత్రం ఒక్కటే. మన ఆరోగ్యమే ప్రపంచ ఆరోగ్యం. ఈ వ్యాధి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరిగా మనకు కావల్సింది సంయమనం. సంయమనం అంటే ‘గుంపుల నుంచి దూరంగా ఉండడం’ ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం. ఈ రోజుల్లో దీనినే సామాజికంగా దూరంగా ఉండడం అంటారు. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ తరుణంలో ఇది చాలా అవసరం. మన సంకల్పం, సంయమనం ఈ ప్రపంచ మహమ్మారి దుష్ప్రభావాన్ని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తాయి. అంతమాత్రాన మీరు ఆరోగ్యంగా ఉన్నారని, మీకేం కాదని, కరోనా నుంచి రక్షింపబడతారని ఆలోచించడం సరైంది కాదు. దానివల్ల మీరు, మీతోపాటు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేసిన వారవుతారు. అందువల్ల మనదేశ పౌరులందరికీ నా మనవి ఏమిటంటే, రానున్న కొన్ని వారాలపాటు బయటకు రాకూడదు. తప్పనిసరైతేనే ఇంటి నుంచి బయటకు రావాలి. సాధ్యమైనంత వరకు మీ పనులను, వాణిజ్య కార్యకలాపాలు కానివ్వండి, ఆఫీసుకు సంబంధించిన పనులను ఇంటి నుంచే చేయండి. ప్రభుత్వ ఉద్యోగులు, ఆస్పత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది క్రియాశీలంగా పనిచేయడం అవసరమే. అయితే, సమాజంలోని ఇతరులందరినీ, మీతోపాటు సమాజానికి దూరంగా ఉంచాలి. నాదొక మనవి.. మన కుటుంబంలోని వయో వృద్ధులు, అరవై అయిదు సంవత్సరాలు పైబడినవారు, వీరంతా ఒక వారం వరకు ఇంటి నుండి బయటకు వెళ్ళవద్దు. నేటి తరానికి ఈ విషయం తెలియకపోవచ్చు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఈ వేళలో మనం కూడా అటువంటి ప్రక్రియలను అనుసరించక తప్పదు. జనతా కర్ఫ్యూ... నేను ప్రతిఒక్క భారతీయ పౌరుడి నుంచి ఒక మద్ధతును కోరుతున్నాను. అదే ‘జనతా కర్ఫ్యూ’ .. ప్రజల కర్ఫ్యూ. ‘ప్రజల కర్ఫ్యూ’ అంటే ప్రజల ద్వారా ప్రజలే విధించుకున్న కర్ఫ్యూ. ఈ ఆదివారం(మార్చి 22)వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పౌరులందరూ ‘జనతా కర్ఫ్యూ’ను పాటించాలి. ఈ సమయంలో మనం ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదు. రోడ్ల మీదకి రాకూడదు. వీధుల్లో సంచరించరాదు. అత్యవసరమైన పనులకు మాత్రమే మార్చి 22న ప్రజలు బయటకు వెళ్లాలి. మార్చి 22వ తేదీన మనం పాటించే ఈ సంయమనం, చేసే ప్రయత్నం, దేశ సంక్షేమానికి చేపట్టిన సంకల్పానికి ప్రతీకగా నిలిచిపోతుంది. మార్చి 22న విధించుకునే ప్రజా కర్ఫ్యూ విజయం, దాని నుంచి నేర్చుకున్న అనుభవాలు మున్ముందు రాబోయే సవాళ్లకు మనల్ని సంసిద్ధుల్ని చేస్తాయి. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ నా మనవి ఏమిటంటే, ప్రజా కర్ఫ్యూ అమలుకు సారథ్యం వహించాలి. ఇందుకోసం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ల సేవలతో సంబంధాలున్న యువతీ యువకులు, పౌర సమాజం, ఇతర సంస్థలు అన్నింటికీ నేను చేసే మనవి ఏమిటంటే.. ఇప్పటి నుంచి రాబోయే రెండు రోజులు ప్రజా కర్ఫ్యూ ను గురించి ప్రజలలో చైతన్యాన్ని కలుగజేయాలి. అందుకు వారిని సంసిద్ధులను చేయాలి. అవసరమైతే.. ప్రతి ఒక్క వ్యక్తి కనీసం 10 మందికి ఫోన్ చేసి కరోనా వైరస్ నుంచి తప్పించుకునే ఉపాయాలను వివరించాలి. అలాగే.. జనతా కర్ఫ్యూ గురించి కూడా వివరించాలి. మన కోసం శ్రమిస్తున్న వారి కోసం.. ఈ జనతా కర్ఫ్యూ అనేది మనకు, మనదేశానికి ఒక పరీక్షా సమయం లాంటిది. ఇదే సమయంలో ప్రపంచ స్థాయిలో అల్లకల్లోలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారితో పోరాటం చేయడానికి భారత్ ఏ మాత్రం సంసిద్ధంగా ఉందనే అంశాన్ని తెలుసుకోవాల్సిన తరుణమిది. మీ ప్రయత్నాలు ఈ దిశలో సాగుతుండగా.. ప్రజా కర్ఫ్యూ రోజున మార్చి 22న మీ నుంచి మరొక సహకారం నేను పొందగోరుతున్నాను. గత రెండు నెలలుగా లక్షలాది మంది సిబ్బంది ఆస్పత్రులలో, విమానాశ్రయాలలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. వారు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఆస్పత్రి సిబ్బంది కావచ్చు, సఫాయి కర్మచారి సోదర సోదరీమణులు, ఎయిర్ లైన్స్ సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు, ప్రసార మాధ్యమాల సిబ్బంది, రైల్వే సిబ్బంది, బస్సు, ఆటోరిక్షా లాంటి సేవలకు సంబంధించిన వ్యక్తులు, హోం డెలివరీ చేసే వారు, వీరంతా తమ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా, ఇతరుల సేవలో నిమగ్నులై ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరు చేసే సేవలు అసాధారణమైనవి. వీళ్లకు కూడా వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అయినప్పటికీ వీరు తమ కర్తవ్య నిర్వహణలో రేయింబవళ్ళు నిమగ్నమై ఉన్నారు. పరోపకార పరాయణత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. మనకు, కరోనా మహమ్మారి కి మధ్యలో నిలబడి ఉన్నారు. వీరికి దేశమంతా కృతజ్ఞతలు చెబుతోంది. నా కోరిక ఒక్కటే. మార్చి 22వ తేదీ ఆదివారం నాడు మనం ఇటువంటి వ్యక్తులందరికీ ధన్యవాదాలు సమర్పించాలి. ఆదివారం సరిగ్గా 5 గంటలకు మనం అందరమూ ఇంటి వాకిటి వద్ద నిలబడి, బాల్కనీలో గాని, లేదా కిటికీల దగ్గర గాని నిల్చొని 5 నిమిషాల పాటు ఇటువంటి వ్యక్తులకు కృతజ్ఞతలు తెలపాలి. చప్పట్లు కొట్టడం ద్వారా, ప్లేట్లను వాయించడం ద్వారా, లేదా గంట కొట్టడం ద్వారా వీరందరికీ వందనాలు సమర్పించాలి. వీరి మనోబలాన్ని ద్విగుణీకృతం చేయాలి. దేశంలోని స్థానిక ప్రభుత్వాలకు నా మనవి ఒక్కటే. మార్చి 22వ తేదీన సరిగ్గా 5 గంటలకు సైరన్ మోత వినిపించడం తోనే ప్రజలకు ఈ సందేశాన్ని అందించాలి. మన సంస్కారం సేవాహీ పరమో ధర్మః. దీనిని ప్రజలందరికీ తెలియచేయాలి. శ్రద్ధ తో ఈ భావాన్ని అభివ్యక్తం చేయాలి. ఎకనామిక్ టాస్క్‌ఫోర్స్ ఈ విపత్కర సమయం లో మీరందరూ ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి. అత్యవసర సేవలకు డిమాండ్ పెరిగిపోతోంది. మన ఆస్పత్రులపై ఒత్తిడి బాగా పెరిగిపోతోంది. అందువల్ల నా మనవి ఒక్కటే. నియమిత చర్య గా చేసుకునే వైద్య పరీక్షల కోసం వీలైనంత వరకు ఆస్పత్రుల చుట్టూ తిరగడం ఆపివేయాలి. మీకు అత్యవసరమైతే.. మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకు వెళ్లండి. మీ కుటుంబ వైద్యుడి దగ్గరకు వెళ్లవచ్చు. లేదా మీ బంధువులలో ఎవరైనా వైద్యులు ఉంటే.. ఫోన్ చేసి అవసరమైన సలహాలను పొందవచ్చు. మీరు ఏదైనా శస్త్ర చికిత్స చేసుకోవాలనుకుంటే.. ముందుగా తేదీని నిర్ణయించుకుని ఉంటే.. దానిని వాయిదా వేసుకోండి. ఒక నెల రోజుల తరువాత ఆ కార్యక్రమాన్ని పెట్టుకోండి. కరోనా మహమ్మారి దుష్ప్రభావం మన ఆర్థిక వ్యవస్థ ను అతలాకుతలం చేసేసింది. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన ఆర్థికమైన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక మంత్రి నేతృత్వంలో ఒక ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ అవసరమైన వారందరితో మాట్లాడుతూ.. ప్రతిస్పందనలను స్వీకరిస్తూ పరిస్థితులను అంచనా వేస్తూ వీలైనంత త్వరలో నిర్ణయాలు తీసుకుంటుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో అవసరమైన చర్యలను చేపట్టేందుకు ఈ టాస్క్ ఫోర్స్ సముచిత నిర్ణయం తీసుకుంటుంది. వాటిని అమలు చేస్తుంది కూడా. ఈ మహమ్మారి కారణంగా మధ్యతరగతి ప్రజల, పేద ప్రజల ఆర్థికాభివృద్ధి కి విఘాతం కలిగింది. ఈ విపత్కర సమయం లో మన దేశంలోని వ్యాపారవర్గాలకు అత్యధిక ఆదాయమున్న ప్రజలకు మనవి చేసేది ఏమిటంటే అవసరమైతే మీరు ఎవరి నుంచి సేవలు పొందుతున్నారో వారి ఆర్థిక సంక్షేమాన్ని గురించి ఆలోచించండి. ఇటువంటి వారు కొన్ని రోజుల పాటు ఆఫీసు కు రాలేకపోవచ్చు. మీ ఇంటికి రాకపోవచ్చు. ఇలాంటి స్థితి లో వీరి జీతాల్లో కోతల ను విధించవద్దు. సంపూర్ణమైన మానవతా దృక్పథంతో స్పందిస్తూ నిర్ణయాలు తీసుకోండి. ఒక సంగతి ని నిరంతరం జ్ఞాపకం పెట్టుకోండి.. వారు కూడా వారి కుటుంబాలను కాపాడుకోవాల్సి ఉంది. కుటుంబ సభ్యులను కరోనా బారి నుంచి సంరక్షించుకోవలసి ఉంటుంది. మన దేశ వాసులందరికీ కావలసిన పాలు, తినుబండారాలు, మందులు, జీవితానికి అవసరమైన ఇతర సామగ్రి.. వీటన్నింటి కి ఏ మాత్రం లోటు రాకుండా చూసుకోవాలి. అందువల్ల దేశ ప్రజలందరికీ అనవసరమైన సామగ్రి ని సేకరించే కార్యక్రమాలు చేపట్టవద్దని మనవి చేస్తున్నాం. మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మామూలుగానే కొనుక్కోండి. అంతేగాని నిత్యావసర వస్తువులను భయాందోళనలతో కొనేసి దాచిపెట్టకండి. దృఢసంకల్పంతో ముందుకు సాగాలి.. గత రెండు నెలలుగా 130కోట్ల మంది భారతీయులలో ప్రతి ఒక్క పౌరుడు దేశం ఎదుర్కొంటున్న ఈ విపత్తు ను తన విపత్తు గా భావించారు. ప్రతిఒక్కరూ తనకు చేతనైనంతగా సేవలందించారు. మున్ముందు కూడా మీరందరూ మీ కర్తవ్యాలను నిర్వహిస్తారని, బాధ్యతలను నెరవేరుస్తారని నా నమ్మకం. ఇటువంటి సమయాలలో కొన్ని ఇబ్బందులు రావడం సహజం. కొన్ని వదంతులు వ్యాపించి వాతావరణమంతా విచిత్రంగా మారిపోవచ్చు. కొన్నిసార్లు పౌరుడి గా మన కోరికలు కొన్ని తీరకపోవచ్చు. ఏది ఏమైనప్పటికి, ఈ విపత్కర సమయం లో దేశ ప్రజలందరూ ఈ కష్టాల మధ్యలోనే దృఢసంకల్పం తో ఇబ్బందులన్నింటిని ఎదుర్కోవాలి. మనమందరమూ కలసి కరోనా ను ఎదుర్కోవడంలో మన సామర్థ్యాన్ని ప్రదర్శించాలి. దేశం లో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి.. రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి.. స్థానిక సంస్థలు కానివ్వండి.. పంచాయతీ లు కావచ్చు.. ప్రజాప్రతినిధులు కావచ్చు.. పౌర సంఘాలు కావచ్చు.. ప్రతి ఒక్కరూ మహమ్మారి ని తరిమి కొట్టడానికి వారి వంతుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలి. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న ఈ వాతావరణం లో మానవాళి కి విజయం చేకూరాలి. మన దేశం విజయపథం లో మున్ముందుకు సాగాలి. ఇంకా కొద్ది రోజులలో నవరాత్రి పండుగ రానుంది. ఇది శక్తి ఉపాసన కు సంబంధించిన పర్వదినం. భారతదేశం దృఢశక్తి తో ప్రగతిపథం లో ముందంజ వేయాలి. మీకు ఇవే నా శుభాకాంక్షలు. మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు’ అని తెలిపారు. -
దేశానికే రోల్‌మోడల్ తెలంగాణ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: తెలంగాణలో ఆరోగ్య శాఖను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతకుమారి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ వైద్య, విధాన పరిషత్ కమిషనర్ రమేశ్‌రెడ్డితో కలసి వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 9 జిల్లా ఆసుపత్రులను అప్‌గ్రేడ్ చేయడానికి కేంద్రం రూ.550 కోట్ల నిధులు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట, మ హబూబ్‌నగర్ జిల్లాల్లోని ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని జనాభా, వ్యాధులను పరిగణనలోకి తీసుకొని పీహెచ్‌సీలను రేషనైజేషన్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. పీహెచ్‌సీల సంఖ్య తగ్గించకుండానే అవసరమున్న చోటికి తరలించే లా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. కుటుంబం యూ నిట్‌గా ఆరోగ్య సమస్యలపై నివేదిక తయారు చేసినట్లు చెప్పారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఉన్న ఆసుపత్రులన్నింటిలో స్టాఫ్‌ను రిక్రూట్ చేసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో హెల్త్‌హబ్‌గా కరీంనగర్ 1000 పడకల ఆసుపత్రిగా కరీంనగర్ హాస్పిటల్ ను తీర్చిదిద్దబోతున్నట్లు మంత్రి చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతోపాటు అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బందిని నియమించి రాష్ట్రంలోనే హెల్త్ హబ్‌గా మార్చుతామన్నారు. ప్రస్తుతం 33 మెడికల్ కళాశాలలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత కొత్తగా నాలుగు మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని, మరో ఏడు మెడికల్ కళాశాలల మంజూరుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపామన్నారు. -
జాతి పిత - మహాత్మ గాంధీ.. జాతి మాత..?
డెహ్రడూన్ : ఆవును గో మాతగా పూజించడం హిందూ సంప్రదాయం. కానీ త్వరలోనే ఆవు ఖాతాలో మరో రికార్డ్ చేరబోతుంది. ఆవును జాతీయ మాతగా గుర్తించాలంటూ ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీర్మానించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ పశు సంవర్ధక శాఖ మంత్రి రేఖ ఆర్య ప్రవేశపెట్టిన బిల్లుకు రాష్ట్ర శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ విషయం గురించి రేఖ ఆర్య మాట్లాడుతూ ‘చెట్లు కార్బన్ డయాక్సైడ్ని పీల్చుకుని, ఆక్సిజన్ని విడుదల చేస్తాయనే సంగతి తెలుసు. కానీ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవులు ఆక్సిజన్ శ్వాసించడమే కాక.. ఆక్సిజన్న్నే విడుదల చేస్తాయి. అంతే కాకా గో మూత్రం చాలా శ్రేష్ఠమైనది. అప్పుడే పుట్టిన పిల్లలకు తల్లి పాల తర్వాత ఆవు పాలు ఎంతో ఉత్తమం’ అంటూ ఆవులు, వాటి వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. చివర్లో ‘ఇన్ని గొప్ప ప్రయోజనాలు ఉన్న ఆవును జాతి మాత(మదర్ ఆఫ్ ద నేషన్)గా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇలా చేయడం వల్ల గో సంరక్షణ ప్రయత్నాలు మరింత బలపడతాయని రేఖా ఆర్య తెలిపారు. అందువల్లనే మేం ఆవును జాతి మాతా గుర్తించే బిల్లును ప్రవేశ పెట్టాం. ప్రతిపక్షం కూడా దీనికి పూర్తి మద్దతు తెలిపింది అని ప్రకటించారు. -
అమెరికా మాకు శత్రుదేశమే
వాషింగ్టన్ : గత 15 ఏళ్లుగా పాకిస్తాన్‌కు లక్షల కోట్ల రూపాయల నిధులను ఉదారంగా ఇస్తున్నా.. అక్కడి ప్రజలు మాత్రం అమెరికాను శత్రుదేశంగానే పరిగణిస్తున్నారని ప్యూ సర్వే సంస్థ ప్రకటించింది. ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరులో అమెరికా సైనికులు భారీగా మృత్యుపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు, ఆల్ ఖైదాతో జరిగిన పోరులో 499 మంది అమెరికా సైనికులు మరణించారు. ఆఫ్ఘనిస్తాన్‌తో యుద్ధం మొదలైన క్షణం నుంచీ పాకిస్తాన్‌కు అమెరికా భారీగా నిధులు మంజూరు చేస్తూ వస్తోంది. లక్షల కోట్ల అమెరికా నిధులు తీసుకుంటున్నా.. మెజారిటీ పాకిస్తానీలు మాత్రం ఆ దేశాన్ని శత్రుదేశంగా పరిగణించారని సర్వే సంస్థ బట్టబయలు చేసింది. మొత్తం పాకిస్తాన్ జనాభాలో 70 శాతం మంది అమెరికాను ద్వేషిస్తున్నారని ప్రకటించింది. అమెరికాలో పేరొందిన ప్యూ రీసెర్చ్ సర్వే సంస్థ 2008 నుంచి పాకిస్తాన్ ప్రజల అభిప్రాయలపై సర్వే నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది ఇక్కడి ప్రజల్లో అమెరికాపై ద్వేషభావం పెరుగుతున్న విషయాన్ని సర్వేలో అధికారులు గుర్తించారు. ఇక 2012 సర్వేలో అయితే.. ప్రతి నలుగురు పాకిస్తానీల్లో ముగ్గురు అమెరికాను శత్రుదేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. ఇది 2008లో 64 శాతం ఉండగా.. 2009 నాటికి 69 శాతానికి పెరిగింది. ఇక 2012లో అయితే 74 శాతం మంది పాకిస్తానీలు అమెరికాపై ద్వేషంతో ఉన్నారు. ఈ సంఖ్య ఇప్పుడు మరింత పెరిగి ఉండొచ్చని ప్యూ రీసెర్చ్ సర్వే సంస్థ అంచనా వేసింది. ఇదిలావుండగా.. అమెరికా విడుదల చేస్తున్న నిధులు దేశంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని.. ప్రతి పదిమందిలో నలుగురు పాకిస్తానీలు భావిస్తున్నారు. మొత్తం పాకిస్తాన్ జనాభాలో కేవలం 17 శాతం మంది మాత్రమే అమెరికా సహకారాన్ని తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
పటేల్ జయంతి సందర్భంగా ఐక్యతా దివస్
-
ఎయిర్ కోస్టా.. ఇక దేశవ్యాప్తం!
♦ కంపెనీకి పాన్ ఇండియా లైసెన్సు ♦ చిన్న నగరాలకూ విమాన సేవలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రాంతీయ విమానయాన రంగంలో ఉన్న ఎయిర్ కోస్టా ప్రయాణంలో మరో కీలక మలుపు. ఇక నుంచి దేశవ్యాప్తంగా ఏ నగరం నుంచైనా సేవలు అందించేందుకు కంపెనీకి మార్గం సుగమం అయింది. ఈ మేరకు డీజీసీఏ నుంచి లైసెన్సు దక్కించుకుంది. ఇప్పటి వరకు ప్రాంతీయ లైసెన్సు కలిగిన ఈ సంస్థ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జైపూర్, అహ్మదాబాద్, తిరుపతి, వైజాగ్ నగరాలకు సర్వీసులను నడిపింది. పాన్ ఇండియా లెసైన్సుతో కొత్త నగరాల్లో అడుగు పెట్టేందుకు కంపెనీ కసరత్తు ప్రారంభించింది. తాజా లైసెన్సుతో సంస్థ ఢిల్లీ, ముంబై, లక్నో, భువనేశ్వర్, చండీగఢ్, ఇండోర్ వంటి నగరాల పై దృష్టి పెట్టనుంది. చిన్న పట్టణాలు, నగరాలను మెట్రోలతో అనుసంధానించాలన్న సంస్థ విధానాన్ని కొనసాగిస్తామని ఎయిర్ కోస్టా సీఈవో వివేక్ చౌదరి ఈ సందర్భంగా తెలిపారు. ఢిల్లీ, ముంబైని దేశవ్యాప్తంగా ఉన్న చిన్న నగరాలతో కనెక్ట్ చేస్తామని చెప్పారు. డిసెంబరు నుంచే..: కొత్త నగరాల కు ఈ ఏడాది డిసెంబరు నుంచి ఎయిర్ కోస్టా విమానాలు ఎగరనున్నాయి. ప్రస్తుతం కంపెనీ ప్రతి రోజు 24 సర్వీసులను నడిపిస్తోంది. సంస్థ వద్ద ఒక్కొక్కటి 110 సీట్ల సామర్థ్యం గల మూడు ఎంబ్రార్ ఇ-190 ఫ్లైట్స్ ఉన్నాయి. అక్టోబరులో మరో విమానం వచ్చి చేరుతోంది. ఏడాదిలో మరో రెండు మూడు ఫ్లైట్స్ జత కూడనున్నాయి. 2018 నాటికి అంతర్జాతీయంగా సేవలు అందించాలని ఎయిర్ కోస్టా చైర్మన్ రమేష్ లింగమనేని కృతనిశ్చయంతో ఉన్నారు. 2013 అక్టోబరు 15 నుంచి కంపెనీ తన సేవలను ప్రారంభించింది. ఇ-195ఇ2, ఇ190ఇ2 రకం 50 విమానాల కోసం 2014లో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ విమానాలు 2018 నుంచి ఎయిర్ కోస్టా ఖాతాలోకి రానున్నాయి. అంతర్జాతీయ సేవలను దృష్టిలో పెట్టుకునే సంస్థ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇప్పటి దాకా 20 లక్షల పైచిలుకు కస్టమర్లు ఎయిర్ కోస్టా విమానాల్లో ప్రయాణించినట్టు సమాచారం. -
వైభవంగా జగన్నాథుని రథ యాత్ర
ప్రపంచ ప్రఖ్యాత రథయాత్రగా పేరొందిన పూరీ జగన్నాథ రథయాత్ర సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ శుక్ల విదియ బుధవారం నాడు అట్టహాసంగా ప్రారంభమైన రథయాత్ర 9 రోజులపాటు కొనసాగుతుంది. భక్తజన వల్లభుడు పూరీ జగన్నాధుడు దేశ ప్రజలందరినీ చల్లాగా చూసి కాపాడాలని ప్రధాని ఈ సందర్భంగా కోరుతూ ట్వీట్ చేశారు. పూరీ జగన్నాథ యాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రథయాత్ర నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథుని ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. జగన్నాథుని ఆశీస్సులతో గ్రామాలు అభివృద్ధి చెందాలని, పేద ప్రజలు, రైతులు మంచి ఫలితాలను సాధించి భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగగలదని ఆకాంక్షిస్తున్నట్లు మోదీ తన ట్వీట్లో తెలిపారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో ఆలయ ప్రాంతం కిక్కిరిసింది. జగన్నాథుని భారీ రథయాత్రకు లక్షలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం పూరీ ప్రాంతంలో భద్రతా చర్యలను పటిష్టం చేసింది. బుధవారం ఉదయం 4 గంటలకు మంగళహారతి అనంతరం గోపాల వల్లభ సేవతో పూరీ శ్రీ క్షేత్రంలో జగన్నాథుని రథయాత్రను ప్రారంభించారు. రథయాత్ర జరిగే ప్రాంతమైన బొడోదండో జగన్నాథస్వామి నామస్మరణతో మారుమోగుతోంది. May the blessings of Lord Jagannath lead to development of villages, well-being of poor & farmers and take India to new heights of progress. — Narendra Modi (@narendramodi) 6 July 2016 On the occasion of Rath Yatra, my warmest greetings to you all. May Lord Jagannath continue to shower his blessings on everyone. — Narendra Modi (@narendramodi) 6 July 2016 -
'జేఎఫ్ఆర్ జాకబ్'కు ఘననివాళి
-
అమరవీరులకు సలాం
-
మెక్సికో తర్వాత మనమే!
అభివృద్ధిలో దూసుకుపోతున్నామంటూ చెబుతున్న భారత్ మాటలు... అవాస్తవాలంటోంది ఓ తాజా సర్వే. ఎంతో విజ్ఞానవంతులుగా చెప్పుకుంటున్న భారతీయులు... మెక్సికో తర్వాత ప్రపంచంలో అత్యంత అమాయకులు, అజ్ఞానులని ఈ సర్వే తేల్చి చెప్పింది. అసమానతలు, మహిళల ఉపాధి, మత సంబంధం లేని జనాభా, ఇంటర్నెట్ సదుపాయం వంటి అంశాలపై లండన్ ఆధారిత పరిశోధనా సంస్థ ఇప్ సోస్ మోరీ... 33 దేశాల్లో 25 వేలమంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో భారత్ ప్రధాన సమస్యలను కూడా తక్కువ అంచనా వేస్తున్నట్లు గుర్తించింది. అయితే మెక్సికో, భారత్ లు ఈ సమస్యలను అవాస్తవంగా పరిగణిస్తున్నాయని, ఐరిష్, దక్షిణ కొరియన్లు మాత్రం ఈ విషయంలో కచ్చితంగా ఉన్నారని సర్వే చెప్తోంది. అభివృద్ధి చెందుతున్న దేశంగా చెబుతున్న భారత్.. మెక్సికో, సౌతాఫ్రికా, చిలీ వంటి దేశాల్లో మహిళలు నేటికీ ఉద్యోగం చేయాలంటే ఎంతో ఆలోచిస్తున్నారని, అలాగే రాజకీయాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం అట్టడుగుకు చేరిపోయిందని సర్వే పేర్కొంది. కొలంబియా, రష్యా, ఇండియా, బ్రెజిల్ దేశాలు మహిళా ప్రాతినిధ్యం ఎక్కువగా ఉన్నట్లుగా అవాస్తవాన్ని నమ్ముతున్నాయని సర్వే తెలిపింది. అలాగే గ్రామీణ జనాభా, ఇంటర్నెట్ యాక్సెస్ విషయంలోనూ భారత్ అవాస్తవాలను నమ్ముతోందని చెబుతోంది. -
బ్రాండ్ విలువ పెంచుకున్న భారత్
ప్రపంచ ప్రఖ్యాత 'బ్రాండ్ ఫైనాన్స్' వెలువరించిన వార్షిక నివేదికలో అత్యధిక బ్రాండ్ విలువ గల దేశాల జాబితాలో భారత్ 7 వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అమెరికా అగ్ర స్థానంలో ఉండగా చైనా, జర్మనీలు రెండు, మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి. గత ఏడాది నివేదికతో పోలిస్తే 32 శాతం వృద్ధిని సాధించి 2.1 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో భారత్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకోవడం విశేషం. ఈ నివేదికలో బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్ దేశాలు వరుసగా నాలుగు, ఐదు, ఆరో స్థానాల్లో నిలిచాయి. -
తోటపల్లి ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన సీఎం
-
నా ఉద్దేశం అదికాదు..
జైపూర్: యుద్ధాలు లేకపోవడం వల్లే సైన్యం ప్రాధాన్యం తగ్గిందన్న కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ...ఆయన వివరణ ఇచ్చారు. 'తన ఉద్దేశం అది కాదంటూ' చెప్పుకొచ్చారు. గడిచిన 40-50 సంవత్సరాల నుంచి ఏ విధమైన యుద్ధంలో పాల్గొనకపోవడంతో భారత సైన్యం ప్రాధాన్యత తగ్గిపోయిందని మనోహర్ పారికర్ నిన్న జైపూర్‌లో జరిగిన ఓ సదస్సులో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విమర్శలు చెలరేగడంతో పారికర్ 'నా ఉద్దేశం అదికాదు' అంటూ నాలిక్కరుచుకున్నారు. దేశంలో యుద్దాలు రావాలని నేను ఆకాంక్షించడంలేదు.. సైన్యం లేకపోతే దేశ అభివృద్ధి లేదు అంటూ వివరణ ఇచ్చుకున్నారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించి ఇద్దరు ముఖ్యమంత్రులకు లేఖలు రాసినా కొన్ని విషయాలను పట్టించుకోలేదనీ, అందుకే సైన్యానికి ప్రాధాన్యత తగ్గిందని వ్యాఖ్యానించానని చెప్పుకొచ్చారు. అంతే తప్ప యుద్ధాలు రావాలని తాను కోరుకోవడం లేదన్నారు. దేశంలో శాంతియుత వాతావరణం ఉన్న సమయంలో సైనికులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రజలకు సైనికుల పట్ల ఉన్న గౌరవం తగ్గుతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీంతోపాటు దాదాపు రెండు తరాలు యుద్ధాలను చూడకుండానే రిటైరయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. -
‘జాతి నిర్మాణంలో యువత పాల్గొనాలి’
హైదరాబాద్: నవ భారత నిర్మాణంలో యువతరం కీలక భాగస్వాములు కావాలని అప్పుడే సరైన ఫలితాలు లభిస్తాయని ప్రధానమంత్రి సలహా మండలి (నేషనల్ కౌన్సిల్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్) సభ్యులు, టీసీఎస్ వైస్ చైర్మన్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) పాలకమండలి చైర్మన్ ఎస్. రామదొరై పేర్కొన్నారు. ఆయన మంగళవారం జరిగిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ హైదరాబాద్ క్యాంపస్ తొలి స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో సవాళ్లను పరిష్కరించడానికి సమర్థులైన యువతను తీర్చిదిద్దడంలో టిస్ ముందంజలో ఉండటం హర్షణీయమన్నారు. ఈ సందర్భంగా 120 మందికి ఎస్. రామదొరై పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో టిస్ డెరైక్టర్ ఎస్. పరశురామన్, టిస్ హైదరాబాద్ క్యాంపస్ డిప్యూటీ డెరైక్టర్ ప్రొఫెసర్ లక్ష్మి లింగ్, మెగసేసే అవార్డు గ్రహీత, ప్రొఫెసర్ శాంతాసిన్హా తదితరులు పాల్గొన్నారు. -
నల్లధనం దేశ భద్రతకు సవాల్: మోదీ
బ్రిస్బేన్: నల్లధనం దేశ భద్రతకు సవాల్ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విదేశాల్లో దాచుకున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించడానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు దేశాధినేతల బ్రిక్స్ సదస్సులో మోదీ ప్రసంగించారు. నల్లధనం వల్ల దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విదేశాల నుంచి నల్లధనాన్ని స్వదేశం తీసుకురావడానికి సమన్వయ సహకారం అవసరమని మోదీ అన్నారు. శనివారం బ్రిస్బేన్ లో జరిగే జీ 20 సదస్సులో మోదీ ప్రసంగించనున్నారు. -
భవిష్యత్తు.. క్లౌడ్ టెక్నాలజీదే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘ప్రపంచ సాంకేతిక రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి. క్లౌడ్ టెక్నాలజీలో అపార అవకాశాలున్నాయి. ఇక క్లౌడ్‌పై మరింత దృష్టి సారించండి. మీ సామర్థ్యాలకు పదును పెట్టండి’ ఇవీ సాఫ్ట్వేర్ రంగ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈవో సత్య నాదెళ్ల అన్న మాటలు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ కు (ఎంఐడీసీ) సోమవారం విచ్చేసిన నాదెళ్ల.. సంస్థ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే ఎంఐడీసీ ఉద్యోగులతో ఈ సందర్భంగా ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగం ఆసాంతం సరదాగా సాగింది. ప్రతిభ, వనరులు, పట్టుదల సమృద్ధిగా ఉన్నాయని మైక్రోసాఫ్ట్ నిరూపించిందంటూ కితాబిచ్చారు. ఉద్యోగులకు ఈ సందర్భంగా ఆయన భవిష్యత్ దిశా నిర్దేశం చేశారని ఉన్నతోద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. క్లౌడ్ టెక్నాలజీ సత్య నాదెళ్ల బ్యాక్‌గ్రౌండ్ కావడంతో ఆయన సందేశం ప్రధానంగా క్లౌడ్‌పైనే సాగిందని చెప్పారు. సీఈవోగా బాధ్యతలు స్వీకరించే వరకు ఆయన మైక్రోసాఫ్ట్ క్లౌడ్, ఎంటర్ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. సంస్థ క్లౌడ్ రంగంలోకి ప్రవేశించడంలో ఆయనది కీలక పాత్ర. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో..: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేయనుందని సత్య నాదెళ్ల ఉద్యోగులను ఉద్ధేశించి అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఆదివారం ఆయన మర్యాదపూర్వకంగా కలసిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని చూస్తోంది. అలాగే హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా చేసుకుంది కూడా. ఈ నేపథ్యంలో ఎంఐడీసీలో సత్య నాదెళ్ల మాటలనుబట్టి చూస్తుంటే తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ మధ్య సాంకేతిక సహకార ఒప్పందం కుదిరే అవకాశాలు ఉన్నాయి. డిజిటల్ ఇండియా ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు ప్రభుత్వంతో, పరిశ్రమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు మైక్రోసాఫ్ట్ సీఈవో ఇప్పటికే ప్రకటించారు. సీఈవోగా తొలి పర్యటన.. మైక్రోసాఫ్ట్ సీఈవోగా అత్యున్నత పదవిని చేజిక్కించుకున్న తర్వాత సత్య నాదెళ్ల హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి. అలాగే భాగ్యనగరిలోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్లో అడుగు పెట్టడం కూడా మొదటిసారి కావడం గమనార్హం. ఉద్యోగులతో మాట్లాడుతున్నంత సేపు మొహంపై చిరునవ్వుతోనే ఉన్నారు. ఉద్యోగులు సైతం ఆనందంగా గడిపారు. సమావేశమందిరం వేదికపై నుంచి ఉద్యోగులను ఉద్ధేశించి నాదెళ్ల మాట్లాడారు. వేదికకు ముందు వైపు సమయాన్ని తెలిపే డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఎంఐడీసీ షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రసంగం సాగింది. మీడియాను ఎవరినీ కార్యాలయం లోనికి అనుమతించ లేదు. సమావేశ వివరాలను సైతం గోప్యంగా ఉంచారు. ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సత్య నాదెళ్ల ఫోన్లో మాట్లాడినట్టు తెలిసింది. వైజాగ్‌లో మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబు కోరినట్టు సమాచారం. హైదరాబాద్‌లో విస్తరణ.. సత్య నాదెళ్ల నోటి వెంట హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ ‘విస్తరణ’ అన్న మాటలు వెలువడ్డాయి. క్లౌడ్ టెక్నాలజీ ఏర్పాట్లతోపాటు ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన సందేశాన్నిబట్టి అర్థమవుతోందని మైక్రోసాఫ్ట్ అధికారి చెప్పారు. హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ కార్యాలయం 54 ఎకరాల్లో ఏర్పాటైంది. అమెరికా వెలుపల అతిపెద్ద పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఇదే. సర్వర్, టూల్స్ బిజినెస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ బిజినెస్ సొల్యూషన్స్, విండోస్, విండోస్ లైవ్, ఆన్లైన్ సర్వీసెస్ విభాగాలు ఇక్కడ విస్తరించాయి. ఆఫీస్, విండోస్, విజువల్ స్టూడియో, డెవలపర్ టూల్స్ ఫర్ విండోస్ ఫోన్, బింగ్ అభివృద్ధిలో ఎంఐడీసీ ఇంజనీర్ల పాత్ర అత్యంత కీలకం. -
కులం.. దేశానికి పట్టిన దెయ్యం
-
కులం.. దేశానికి పట్టిన దెయ్యం
సాక్షి, హైదరాబాద్: ఏ సమస్యకైనా ఉత్తమ పరిష్కార మార్గం చర్చలేనని ప్రముఖ ఆర్థిక వేత్త, నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ అమర్త్యసేన్ అన్నారు. కులం దేశానికి పట్టిన అతిపెద్ద దెయ్యమని అభివర్ణించారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అమర్త్యసేన్‌కు గురువారం డాక్టరేట్‌ను అందజేసింది. అనంతరం వర్సిటీలోని ఆడిటోరియంలో ‘విశ్వవిద్యాలయాల్లో కాఫీ షాపుల ఆవశ్యకత’ అనే అంశంపై అమర్త్యసేన్ ప్రసంగిస్తుండగా దళిత విద్యార్థులు అడ్డుతగిలారు. యూనివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల తీవ్ర వివక్ష చూపుతున్నారని, దీనిపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైస్ చాన్స్‌లర్, భద్రతా సిబ్బంది విద్యార్థులను బుజ్జగించారు. అనంతరం అమర్త్యసేన్ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, అదే సరైన మార్గమని సూచించారు. తానూ అనేక ఉద్యమాల్లో స్వయంగా పాల్గొన్నానని.. ఆహార భద్రతా చట్టం, దళిత, మైనారిటీ హక్కులు, బాలల పోషకాహారం వంటి సమస్యలపై నేరుగా పోరాడానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో అన్ని విషయాల్లో సమానత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. ‘నిరసించు, చైతన్యపరచు, వ్యవస్థీకరించు’ అనే అంబేద్కర్ సూచనను అందరూ పాటించాలని నొక్కి చెప్పారు. విద్య, వైద్యం, పోషకాహారం వంటి కీలక అంశాల్లో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ అథమ స్థానంలో ఉందన్నారు. దేశంలో మూడో వంతు ప్రజలకు ఇప్పటికీ విద్యుత్ కనెక్షన్ లేదని, ఇలాంటి సామాజిక అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని, అందుకు ప్రసార మాధ్యమాలు సహకరించాలని అమర్త్యసేన్ కోరారు. చివరిగా విద్యార్థులడిగిన పలు ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చాన్స్‌లర్ హనుమంతరావు, వైస్ చాన్స్‌లర్ రామకృష్ణ రామస్వామి, రిజిస్ట్రార్ రాజశేఖర్, ఆర్థికశాస్త్ర విభాగం డీన్ నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.