సుదర్శన్‌ సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! | Prime Minister Modi dedicated Sudarshan Sethu to the nation | Sakshi
Sakshi News home page

Sudarshan Sethu: సుదర్శన్‌ సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ!

Published Sun, Feb 25 2024 9:28 AM | Last Updated on Sun, Feb 25 2024 11:23 AM

Prime Minister Modi dedicated Sudarshan Sethu to the nation - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనిలో భాగంగా అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 
 

దీనికి ముందు ప్రధాని మోదీ ద్వారక ఆలయంలో పూజలు నిర్వహించారు. సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్‌ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980 కోట్ల రూపాయలతో నిర్మించిన సుదర్శన్ సేతును ద్వారకలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement