Dedicated
-
బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల పెంపు అధ్యయన ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటివరకు రాష్ట్రంలో పనిచేసిన రెండు బీసీ కమిషన్లు వెనుకబడిన వర్గాల ఆర్థిక స్థితిగతులు, విద్య, ఉద్యోగ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించినప్పటికీ... ప్రభుత్వం తాజాగా జి.నిరంజన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ కమిషన్‌ను డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషన్ జిల్లాల వారీగా పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేయాలని నిర్ణయించడంతో ఈ ప్రక్రియ మళ్లీ మొదట్నుంచి ప్రారంభం కానున్నట్లు కనిపిస్తోంది.ప్రభుత్వం ఈనెల 6న జి.నిరంజన్ చైర్మన్‌గా ముగ్గురు సభ్యులతో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాధ్యతలు స్వీకరించిన కమిషన్ చైర్మన్, సభ్యులు తాజాగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం పూర్వపు బీసీ కమిషన్ చైర్మన్లు, సభ్యులతో సమావేశం నిర్వహించి సూచనలు స్వీకరించిన అనంతరం కులగణన కార్యాచరణ ప్రణాళికను త్వరలో రూపొందిస్తామని చెప్పారు. ఆ తర్వాత జిల్లాల వారీగా పర్యటనల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన చేసిన తర్వాతే బీసీ రిజర్వేషన్లు తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత అధ్యయనం అటకెక్కినట్లే...ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక రెండు బీసీ కమిషన్లు పని చేశాయి. బీఎస్ రాములు చైర్మన్‌గా వ్యవహరించిన కమిషన్ మూడేళ్లపాటు పనిచేసి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ) లెక్కలు తేల్చడంతోపాటు మైనార్టీ రిజర్వేషన్లపై కసరత్తు చేసింది. రాములు కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా అప్పటి ప్రభుత్వం ఎంబీసీ కేటగిరీని విభజించింది. ఆ తర్వాత ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు... వరుసగా మూడేళ్లపాటు రూ.వెయ్యి కోట్ల చొప్పున బడ్జెట్ కేటాయించింది.ఆ తర్వాత వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన రెండో బీసీ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ బీసీ రిజర్వేషన్ల పెంపుపై లోతైన అధ్యయనం చేసింది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి.. అక్కడి బీసీ కమిషన్లు రూపొందించిన అధ్యయనాలను సైతం పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఇదే డెడికేటెడ్ కమిషన్..రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కుల గణనకు సంబంధించి నిపుణులు, సామాజికవేత్తలతో సమావేశాలు నిర్వహించి, దేశవ్యాప్తంగా అనుసరించిన విధానాలను అధ్యయనం చేసి 64 ప్రశ్నలతో కూడిన ‘ముసాయిదా ప్రశ్నావళి’ని వకుళాభరణం కమిషన్ ప్రభుత్వానికి సమర్పించింది. గత ఆగస్టు 31న వకుళా భరణం కమిషన్ పదవీ కాలం ముగియడంతో సర్కార్ కొత్తగా డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.స్థానిక సంస్థల్లో కోటా పెంపుపై ఇప్పటికే రెండు కమిషన్లు నివేదికలు సమర్పించినప్పటికీ.. ప్రభుత్వం తాజా కమిషన్నే డెడికేటెడ్ కమిషన్‌గా ప్రకటించడం, విధివిధా నాలు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించడంతో గత కమిషన్లు చేసిన అధ్యయనాలు అటకెక్కినట్లే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
సుదర్శన్ సేతును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనిలో భాగంగా అరేబియా సముద్రంపై నిర్మించిన దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ‘సుదర్శన్ సేతు’ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi at Sudarshan Setu, country’s longest cable-stayed bridge of around 2.32 km, connecting Okha mainland and Beyt Dwarka. pic.twitter.com/uLPn4EYnFM — ANI (@ANI) February 25, 2024 దీనికి ముందు ప్రధాని మోదీ ద్వారక ఆలయంలో పూజలు నిర్వహించారు. సుదర్శన్ సేతు దేశంలోనే అతి పొడవైన సిగ్నేచర్ బ్రిడ్జిగా నిలిచింది. ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ సుమారు 980 కోట్ల రూపాయలతో నిర్మించిన సుదర్శన్ సేతును ద్వారకలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. #WATCH | Gujarat: Prime Minister Narendra Modi performs pooja and darshan at Beyt Dwarka temple. pic.twitter.com/U2gZUVB3k4 — ANI (@ANI) February 25, 2024 -
సరుకు రవాణా ఇక రయ్ రయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా సరుకు రవాణా దిశగా కీలక ముందడుగు పడింది. ప్రత్యేకంగా సరుకు రవాణా కోసం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఇప్పటికే విజయవాడ–ఖరగ్‌పూర్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్ సన్నాహక పనులు ప్రారంభం కాగా... తాజాగా విజయవాడ–నాగ్‌పూర్–ఇటార్సీ ఫ్రైట్ కారిడార్‌కు రైల్వే శాఖ ఆమోదించింది. ఈ మేరకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక(డీపీఆర్) రూపొందించాలని ఆదేశించింది. దీంతో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీఎఫ్‌సీసీఐఎల్) కార్యాచరణను వేగవంతం చేసింది. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 75 కి.మీ. వేగంతో సాగుతున్న సరుకు రవాణా.. ఈ కారిడార్ల నిర్మాణం తరువాత గంటకు 125 కి.మీ. వేగానికి చేరుతుంది. తూర్పు, మధ్య భారతాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ రెండు ఫ్రైట్ కారిడార్లతో రాష్ట్రంలో సరుకు రవాణా ఊపందుకోనుంది. ఏపీలో పోర్టుల ద్వారా ఎగుమతి, దిగుమతి వాణిజ్యం అమాంతంగా పెరగడంతోపాటు పోర్టు అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతుంది. రూ.44 వేల కోట్లతో ఈస్ట్ కోస్ట్ కారిడార్ తూర్పు తీరం ప్రాంతంలో గల పోర్టులను అనుసంధానిస్తూ సరుకు రవాణా కోసం ప్రత్యేకంగా ఈస్ట్ కోస్ట్ ఫ్రైట్ కారిడార్ నిర్మాణాన్ని రైల్వే శాఖ చేపట్టింది. విజయవాడ నుంచి ఖరగ్‌పూర్ వరకు మొత్తం 1,115 కి.మీ. ఈ ఫ్రైట్ కారిడార్ కోసం డీపీఆర్‌ను ఖరారు చేసింది. రూ.44వేల కోట్లతో దీని నిర్మాణాన్ని ఆమోదించింది. ఏపీలోని బందరు, కాకినాడ, గంగవరం, విశాఖ, మూలాపేట పోర్టుతో పాటు ఒడిశాలోని గోపాల్పూర్, ధమ్రా, పారాదీప్ పోర్టులను అనుసంధానిస్తూ దీనిని నిర్మిస్తారు. విశాఖపట్నం, కాకినాడ పారిశ్రామిక ప్రాంతాలతో కూడిన విశాఖపట్నం–చెన్నై పారిశ్రామిక కారిడార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కాళీనగర్ పారిశ్రామిక ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధికి ఈ కారిడార్ దోహదపడుతుంది. ఈ కారిడార్ సర్వే పనులను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసి పనులు ప్రారంభిస్తారు. 975 కి.మీ. సౌత్‌వెస్ట్ కారిడార్ ఆంధ్రప్రదేశ్ ద్వారా దక్షిణ, మధ్య భారతాలను అనుసంధానిస్తూ సౌత్ వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ నిర్మించాలని రైల్వే శాఖ తాజాగా నిర్ణయించింది. విజయవాడ నుంచి నాగపూర్ (మహారాష్ట్ర) మీదుగా ఇటార్సీ (మధ్యప్రదేశ్) వరకు మొత్తం 975 కి.మీ. మేర ఈ కారిడార్ నిర్మిస్తారు. అందుకోసం డీపీఆర్ రూపొందించాలని రైల్వే శాఖ ఇటీవల ఆదేశించింది. డీపీఆర్ రూపొందించిన తరువాత ప్రాజెక్ట్ అంచనా వ్యయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రధానంగా సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతాన్ని తూర్పు తీరంలోని పోర్టులతో అనుసంధానిస్తూ ఈ కారిడార్‌ను నిర్మిస్తారు. డీపీఆర్ త్వరగా ఖరారు చేసి 2030 నాటికి ఈ కారిడార్‌ను నిర్మాణాన్ని కూడా పూర్తి చేయాలని రైల్వే శాఖ భావిస్తోంది. -
Commonwealth Games 2022: అన్నయ్య అభయహస్తమై...స్ఫూర్తిదాయకం అచింత ప్రస్థానం
సాక్షి, క్రీడావిభాగం: పసిడి పతకం గెలవగానే అన్నింటికంటే ముందు అచింత నోటి నుంచి వచ్చిన మాట... ‘ఈ పతకం నా అన్నయ్యకు అంకితం’... అతడిని దగ్గరి నుంచి చూసిన వారికి ఇది ఆశ్యర్యం కలిగించలేదు. ఎందుకంటే ఈ రోజు అచింత కామన్వెల్త్ పతకధారిగా సగర్వంగా నిలబడ్డాడంటే దాని వెనక అలోక్ ఉన్నాడు. తమ్ముడి కోసం తన ఆటకు దూరమైన ఆ అన్నయ్య, అంతటితో ఆగకుండా అన్నీ తానై, అంతటా వెనకుండి నడిపించాడు. అతి సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన కూడా ఆటలో అత్యుత్తమ స్థాయికి ఎదగవచ్చంటూ అన్ని రకాలుగా స్ఫూర్తినిచ్చేలా అచింత జీవితం కనిపిస్తుంది. కోల్‌కతాలోనే హౌరా నుంచి రెండు గంటలు ప్రయాణం చేస్తే వస్తుంది దియూల్పూర్ గ్రామం. అక్కడ ఎక్కువ మందికి ‘జరీ’ పనినే జీవనాధారం. రిక్షా కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి 2014లో హఠాత్తుగా చనిపోయిన సమయంలో అచింత వయసు 12 ఏళ్లు! ఏం జరిగిందో అర్థం చేసుకునే లోపే తల్లి ‘జరీ’ పనిలో చేరిపోయింది. ఆమెకు అండగా తనకంటే ఏడేళ్లు పెద్ద అయిన అన్నయ్య కూడా వెళ్లక తప్పలేదు. వయసు చిన్నదే అయినా తన చిట్టి చేతులతో అచింత తానూ ఆ పనిలో సాయం చేయడం మొదలు పెట్టేశాడు. ఇలాంటి ఆర్థిక స్థితిలో ఆటలు అనేవి ఆలోచనకు కూడా అందవు. దాంతో అప్పటి వరకు తన ఆసక్తి కొద్దీ వెయిట్‌లిఫ్టింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటూ వచ్చిన అన్న అలోక్ ఆ బరువును పక్కన పడేసి ఇంటి భారం తన మీద వేసుకోవాల్సి వచ్చింది. సాయంత్రం ‘జరీ’ వర్క్‌తో పాటు ఉదయం వేళ హౌరా మిల్లుల్లో లేబర్‌గా పని చేసేందుకు సిద్ధమైన అలోక్... అదే సమయంలో తన తమ్ముడిలో తనకంటే మంచి ప్రతిభ ఉందని గుర్తించడం మర్చిపోలేదు. అందుకే ఏం చేసైనా అచింతను తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యాడు. అన్న కష్టాన్ని అచింత వృథా పోనీయలేదు. ఒకవైపు వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆటకు పదును పెట్టుకుంటూనే మరోవైపు తనకు ఇచ్చే డబ్బుల్లో ఒక్కో పైసాను అతి పదిలంగా కాపాడుకుంటూ వచ్చాడు. 2014 జాతీయ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో వచ్చినా... కోచ్ దృష్టిని ఆకర్షించడంతో పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో చేరే అవకాశం వచ్చి ంది. దాంతో అచింత రాత మారింది. తీవ్ర సాధన తో సత్తా చాటుతూ ఆసియా యూత్ చాంపియన్ షిప్లో రజతం, కామన్వెల్త్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం తర్వాత గత ఏడాది వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రజతంతో అచింత సంచలనం సృష్టించి దూసుకుపోయాడు. ఆర్మీ ఉద్యోగం ఉండటంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగు కావడంతో పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టిన ఈ బెంగాల్ కుర్రాడు ఇప్పుడు కామన్వెల్త్ క్రీడల స్వర్ణ ఘనతను సగర్వంగా అందుకున్నాడు. అరంగేట్రంలోనే అదుర్స్... కామన్వెల్త్ గేమ్స్‌లో బరిలోకి దిగిన తొలిసారే అచింత షెయులి స్వర్ణ పతకంతో మెరిశాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల వెయిట్‌లిఫ్టింగ్ 73 కేజీల విభాగంలో అచింత భారత్‌కు పసిడి పతకం అందించాడు. 20 ఏళ్ల అచింత (స్నాచ్‌లో 143+క్లీన్ అండ్ జెర్క్‌లో 170) మొత్తం 313 కేజీలు బరువెత్తి విజేతగా నిలిచాడు. అజయ్‌కు నిరాశ 81 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ అజయ్ సింగ్‌కు నిరాశే ఎదురైంది. సోమవారం జరిగిన ఈ ఈవెంట్లో అజయ్ నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయాడు. అజయ్ స్నాచ్‌లో 143 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 176 కేజీలు (మొత్తం 319 కేజీలు) బరువెత్తాడు. ఈ కేటగిరీలో క్రిస్ ముర్రే (ఇంగ్లండ్; 325 కేజీలు), కైల్ బ్రూస్ (ఆస్ట్రేలియా; 323 కేజీలు), నికోలస్ వాకన్ (కెనడా; 320 కేజీలు) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. -
మీ కుటుంబానికి ఉన్నారా స్నేహితులు?
Rajinikanth Dadasaheb Phalke Award 2021: ‘నా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు’ నా స్నేహితుడు రాజ్ బహదూర్‌కు అంకితం అన్నాడు నటుడు రజనీ కాంత్. 50 ఏళ్ల నాటి స్నేహం వారిది. ఇవాళ్టికీ రజనీకాంత్ తన స్నేహితుడి ఇంటికి వెళ్లి మంచం మీద స్నేహితుడు పడుకుంటే తాను కింద పడుకుంటాడు. కుటుంబాలు కేవలం తల్లి, తండ్రి, పిల్లలతో మనలేవు. స్నేహితులు కావాలి. గాఢమైన స్నేహాలే బతుకు నావలో సంతోషాన్ని, కష్టం వచ్చినప్పుడు సపోర్ట్నీ ఇస్తాయి. మరి మనకు ఉన్నాయా అంతటి గట్టి స్నేహాలు. మన పిల్లలకు నేర్పిస్తున్నామా ఆ సంస్కారాలు? ‘ఒక మనిషికి అసలైన నష్టం ఏమిటంటే నిజమైన మిత్రుణ్ణి కోల్పోవడమే’ అని సూక్తి. సంపదలు ఎన్ని రకాలైనా ‘స్నేహ సంపద’ వాటిలో ఉంది. స్నేహితుల్ని కోల్పోవడం అంటే సంపదను శాశ్వతంగా కోల్పోవడం. ‘నీ స్నేహితులెవరో చెప్పు... నువ్వెవరో చెప్తా’ అనేది ఎందుకంటే ఆ స్నేహితుల సంఖ్యను, వ్యక్తిత్వాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్థారించవచ్చు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటొచ్చు. కాని కళ్లు తడవకుండా, ఆ సమయంలో పక్కనే స్నేహితుడు లేకుండా జీవితాన్ని దాటడం కష్టం. స్నేహ సంబంధాలు నిలబెట్టు కోవడానికి సమయం ఇస్తున్నామా? స్నేహితులను కోల్పోతే మళ్లీ పొందగలమా? ‘ఫ్యామిలీ ఫ్రెండ్స్’ అనే మాట ఉంది. మనకిప్పుడు ఎంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందరు మన ఇంటికి వచ్చి ఎందరి ఇంటికి మనం వెళ్లగలిగేలా ఉన్నాము. చెక్ చేసుకోవడం తప్పనిసరి. స్నేహంలో ఉండే ఆనందమే బలం. ఆయుష్షు. రజనీకాంత్ మరియు అతడు మొన్న ఢిల్లీలో రజనీకాంత్ తన నట జీవితానికి సంబంధించి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని తన గురువు కె.బాలచందర్‌తో పాటు స్నేహితుడు రాజ్ బహదూర్‌కు కూడా ఇచ్చాడు. రజనీకాంత్‌కు బెంగళూరులో రాజ బహదూర్ అనే స్నేహితుడు ఉన్నట్టు చాలా మందికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్లీ ఆ స్నేహం... స్నేహానికి ఉండే విలువ చర్చకు వచ్చాయి. ‘నాలోని నటుణ్ణి రాజ్ బహదూర్ గుర్తించి నన్ను మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేయమని ప్రోత్సహించాడు’ అని రజనీకాంత్ అన్నాడు. ఒక స్నేహితుడు అన్న మాట, అతని ప్రోత్సాహమే ఇవాళ దేశానికి రజనీకాంత్ వంటి సూపర్‌స్టార్‌ని ఇచ్చింది. అందుకే రజనీకాంత్ ఆ స్నేహం పట్ల కృతజ్ఞతతో... ఆ స్నేహాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. ఎప్పటి స్నేహం? 1970 నాటి సమయం. అప్పుడు రజనీకాంత్ బెంగళూరులో తన అసలు పేరు శివాజీరావు గైక్వాడ్‌గా ఉన్నాడు. బస్ కండక్టర్‌గా కర్ణాటక ఆర్.టి.సిలో ఉద్యోగంలో చేరాడు. అతని బస్ నంబర్ 10 ఏ. మెజెస్టిక్ నుంచి శ్రీనగర్ స్టాప్ల మధ్య తిరిగేది. దాని డ్రైవర్ రాజ్ బహదూర్. రాజ్ బహదూర్ రజనీ కన్నా ఏడేళ్లు పెద్దవాడు. కాని వారికి స్నేహం కుదిరింది. ‘ఆ సమయంలోనే రజనీకాంత్‌లో మంచి స్టయిల్ ఉండేది. ప్రయాణికులకు చిల్లర ఇవ్వాల్సి వస్తే కాయిన్ ఎగరేసి ఇచ్చేవాడు. ఏ కార్యక్రమాలు జరిగినా స్టేజ్ మీద నాటకం వేసేవాడు. అందరికంటే బాగా నటించేవాడు.’ అని 77 ఏళ్ల రాజ్ బహదూర్ గుర్తు చేసుకున్నాడు. అతను అప్పటి నుంచి ఇప్పటి వరకూ చామరాజ్నగర్లోనే ఉంటున్నాడు. రజనీకాంత్ అప్పట్లో దానికి దగ్గరగా ఉండే హనుమంతనగర్ లో ఉండేవాడు. డ్యూటీ సమయాల్లోనూ డ్యూటీ లేనప్పుడూ ఇద్దరూ కలిసి తిరిగేవారు. స్నేహితుడే దారి రజనీకాంత్‌ను సినిమాల్లో చేరమని రాజ్ బహదూర్ శత పోరు పెట్టాడు. కాని ఉద్యోగాన్ని వదిలి మద్రాసు వెళ్ళడం రజనీకి పెద్ద రిస్క్. నీకెందుకు నేనున్నా అన్నాడు రాజ్ బహదూర్. ఆ రోజు ల్లో రాజ్ బహదూర్ జీతం 400. అందులో 200 రజనీకాంత్‌కు పంపేవాడు. రజనీకాంత్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న రోజులకు, స్ట్రగుల్ అయిన రోజులకు రాజ్ బహదూర్ పంపిన డబ్బే పెద్ద ఆధారం. ‘ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో కోర్స్ పూర్తయ్యాక ముగింపు ఫంక్షన్‌కు కె.బాలచందర్ చీఫ్ గెస్ట్. ఆ టైమ్‌లో ఆయన రజనీకాంత్‌ని చూసి ‘తమిళం నేర్చుకో’ అని మాత్రం చెప్పి వెళ్లిపోయారు. రజనీ నా దగ్గరకు వచ్చాడు. బాలచందర్ ఈ మాట అన్నాడ్రా అన్నాడు. అంతేకాదు.. ఇవాళ్టి నుంచి నాతో తమిళంలోనే మాట్లాడు అన్నాడు. నేను తమిళం మాట్లాడుతూ తమిళం నేర్చుకోవడంలో సాయం చేశాను’ అన్నాడు రాజ్ బహదూర్. కృష్ణ–కుచేల నిజానికి రజనీకాంత్ ఇప్పుడు కృష్ణుడు. కాని రాజ్ బహదూర్ దగ్గర ఎప్పుడూ కుచేలుడిగానే ఉంటాడు. ఫోన్లు చేయడు. మెసేజ్‌లు పెట్టడు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాజ్ బహదూర్ ఇంటికి వచ్చి బెల్లు కొడతాడు. ఆర్టిసిలో రిటైర్ అయ్యి తమ్ముడి కుటుంబంతో సొంత ఇంట్లో జీవిస్తున్న రాజ్ బహదూర్ దగ్గర రజనీ కాంత్ కోసమే ఎప్పుడూ ఒక గది సిద్ధంగా ఉంటుంది. ఆ గదిలో ఒక సింగిల్ కాట్ ఉంటుంది. రాజ్ బహదూర్ దానిమీద రజనీకాంత్ కింద నిద్రపోతారు. రజనీకాంత్ వచ్చాడంటే స్నేహితులిద్దరినీ ఆ గదిలో వదిలి కుటుంబ సభ్యులు ఏమీ ఎరగనట్టుగా ఉండిపోతారు. ఇక రేయింబవళ్లు వాళ్ల కబుర్లు సాగుతాయి. రజనీకాంత్ ఒక్కోసారి రాజ్ బహదూర్ దగ్గర వారం పది రోజులు ఉండిపోతాడు. ఇద్దరూ చీకటి పడ్డాక మామూలు మనుషుల్లా బెంగళూరు రోడ్ల మీద తిరుగుతారు. కొనసాగే బంధం సినిమా రంగంలోని కృత్రిమత్వం నుంచి పారిపోవడానికి రజనీకాంత్ తన స్నేహాన్ని ఒక సాధనం చేసుకున్నాడు. ఒక్క రాజ్ బహదూర్ దగ్గర మాత్రమే రజనీ మామూలు మనిషిలా ఉండగలడు. మనల్ని భ్రమల్లో నుంచి, అహంలో నుంచి బయటపడేలా చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ మన పిల్లలకు ‘మావయ్యగానో బాబాయిగానో’ ఉంటూ మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఉండాలని అనిపిస్తుంది. ఇలాంటి స్నేహాలు పొందడం కష్టం కాదు. కాపాడుకోవడమే కష్టం. అందుకు ప్రయత్నించినవాళ్లే ధన్యులు. -
ఫ్రంట్‌లైన్ వర్కర్ల కోసం ‘దారే లేదా’ అంటున్న నాని
హైదరాబాద్: టాలీవుడ్లో వైవిధ్యభరితమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు యంగ్ హీరో సత్యదేవ్. తాజాగా ఈ బ్లఫ్‌మాస్టర్ నటిస్తున్న చిత్రంలో‘దారే లేదా’ అనే పాట విడుదల అయ్యింది. ఈ పాటను కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో తమ జీవితాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు అండగా ఉంటూ, వారికి సేవలు అందించిన కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్ కు ఈ ‘దారే లేదా’ స్పెషల్ సాంగ్‌ను అంకితం ఇస్తున్నట్లు నేచురల్ స్టార్ నాని తెలిపారు. ఈ సందర్భంగా తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ సాంగ్‌ను విడుదల చేశారు. నాని స్వీయ నిర్మాణసంస్థ వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను సమర్పిస్తున్నారు. విజయ్ బులగానిన్ ‘దారే లేదా’ పాటకు సంగీతం అందించారు. ఈ స్పూర్తి దాయకమైన పాటకు కేకే లిరిక్స్ అందించారు. నాని, సత్యదేవ్‌లతో పాటు రూప కడువయుర్ కూడా ఈ ‘దారే లేదా’ పాటలో అసోసియేట్ అయ్యారు. ఈ నెల 18న సాయంత్రం 4గంటల 32 నిమిషాలకు ఈ సాంగ్ విడుదల చేశారు. Our little tribute to our Heroes, incidentally on the day lakhs of doctors are protesting against the violence on them 💔 Share it with every frontline warrior you know. I’m sure it will put a smile on them 🙏🏼#DhaareLedha https://t.co/aQ7dzQvXQ6 pic.twitter.com/raGLISS82G — Nani (@NameisNani) June 18, 2021 చదవండి: రూ. 4.65 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్న బ్రహ్మాజీ!.. ట్వీట్ వైరల్ -
ఈ శతకం నాన్నకు అంకితం: విహారి
కింగ్స్టన్: టెస్టుల్లో సాధించిన తొలి శతకాన్ని తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ హనుమ విహారి ప్రకటించాడు. ఇదే సందర్భంలో తాను సెంచరీ చేసేందుకు సహకరించిన పేసర్ ఇషాంత్ శర్మకు కృతజ్ఞతలు తెలిపాడు. శనివారం ఆట ముగిశాక విహారి మాట్లాడుతూ... ‘ఇదో భావోద్వేగమైన రోజు. నాకు 12 ఏళ్లున్నప్పుడు మా నాన్న చనిపోయారు. అంతర్జాతీయ క్రికెట్లో నమోదు చేసే తొలి సెంచరీని ఆయనకు అంకితం ఇవ్వాలని అప్పుడే నేను నిర్ణయించుకున్నా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నా సంతోషించి ఉంటారు’ అని పేర్కొన్నాడు. తన ఇన్నింగ్స్ పట్ల ఆనందం వ్యక్తం చేసిన విహారి... ఇందులో ఇషాంత్ పాత్రను కొనియాడాడు. ఇషాంత్ అచ్చమైన బ్యాట్స్‌మన్‌లా ఆడాడని, బౌలర్లు ఏం చేస్తారో మాట్లాడుకుంటూ ఇన్నింగ్స్ కొనసాగించామని, అతడి అనుభవం ఉపయోగపడిందని విహారి అన్నాడు. -
దళితుల కోసం జీవితం అంకితం
‘ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టవోయ్’ అనే మాటను ఆచరణాత్మకంగా చేసి చూపారు సుధావర్గీస్. నారీ గుంజాన్ స్వచ్ఛంద సంస్థను స్థాపించి దళితులకు తన జీవితాన్ని అంకితం చేశారు. వారి వికాసం కోసం ఒకవైపు పాటుపడుతూనే మరోవైపు వారి హక్కుల సాధనే శ్వాసగా జీవనం సాగిస్తున్నారు. కేరళలోని కొట్టాయంకు చెందిన సుధా వర్గీస్ మూడు దశాబ్దాల కిందట బిహార్‌లో స్థిరపడ్డారు. ఈ రాష్ట్రంలో ముసహరాలుగా పిలిచే దళితుల వికాసమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారు. యుక్తవయస్సులో ఉండగా బిహార్‌కు వెళ్లిన సుధకు అక్కడి కులవ్యవస్థ గురించి తెలిసింది అంతంతమాత్రమే. ఆరంభంలో ఆమెకు ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా వాటిని లెక్కచేయలేదు. భాష అర్థమవకపోవడంతో పట్టుదలతో మెల్లమెల్లగా నేర్చుకున్నారు. ముసహరాల హక్కులను కాపాడాలనే లక్ష్యంతో న్యాయవాద డిగ్రీ చదివారు. దీంతో న్యాయపరమైన అడ్డంకులను అధిగమించడం ఆమెకు మరింత సులువైంది. ఆ తర్వాత ముసహరాల సాధికారత కోసం చెమటోడ్చారు. 1987లో నారీ గుంజాన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దళిత మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించారు. 2005లో పట్నా శివారులోని దానాపూర్‌లో దళిత బాలికల కోసం ప్రత్యేకంగా ఓ పాఠశాల నెలకొల్పారు. దానికి ప్రేరణ అని నామకరణం చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా కూలీకి వెళుతున్న బాలికలకు ఉచితంగా విద్యాబోధన చేశారు. నారీ గుంజాన్ సంస్థ ప్రస్తుతం బిహార్‌లోని ఐదు జిల్లాల్లో పనిచేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 850 స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఈ గ్రూపులు అంగన్వాడీ పాఠశాలలనూ నడుపుతున్నాయి. వయోజన విద్యా కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఆమె అంకితభావం గురించి తెలియడంతో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గయలోనూ ఇలాంటి పాఠశాలను నెలకొల్పాల్సిందిగా కోరారు. దానాపూర్, గయల్లోని రెండు పాఠశాలల్లో ప్రస్తుతం మూడు వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరోవైపు నారీ గుంజాన్ సంస్థ యువతకు సంగీతం, క్రీడలు, నాట్యం, కళలు వంటి అంశాలపై శిక్షణ ఇచ్చింది. ఆయా విభాగాల్లో తర్ఫీదు పొందిన యువతీయువకులు దేశ, విదేశాల్లో నిర్వహించిన అనేకపోటీల్లో పాల్గొని సత్తా చాటారు. సుధ 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం నుంచి పద్మశ్రీ పురస్కారం పొందారు. ‘ఏదో ఒకటి చేయాలనిపించింది’ ఈ విషయమై సుధ మాట్లాడుతూ ‘ముసహరాలతో పరిచయమయ్యేదాకా అస్పృశ్యత, వివక్ష అనే పదాలు నాకు కొత్త. వారికి ఏదో ఒకటి చేయాలనిపించింది. దీంతో వారి ఇళ్ల వద్దే నివాసం ఏర్పరుచుకున్నా. వారి హక్కుల కోసం పోరాడుతున్నా. వారి అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటా’ అని అన్నారు. –సాక్షి, స్టూడెంట్ ఎడిషన్ -
నా సెంచరీ మామయ్యకు అంకితం: రాయుడు
సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తన సెంచరీని దివంగత మేనమామ మెండు సత్యనారాయణకు అంకితమిస్తున్నానని రాయుడు చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అయిన సత్యనారాయణ (68) ఆదివారం కన్నుమూశారు. గుంటూరు జిల్లా ఖాజీపాలెంకు చెందిన సత్యనారాయణ సెంట్రల్ డ్రగ్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెండ్ హోదాలో పని చేశారు. రిటైర్మెంట్ అనంతరం హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో నివాసముంటున్నారు. గత నెలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత్రం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాయుడు హాజరయ్యే అవకాశముందని రాయుడి తండ్రి సాంబశివరావు తెలిపారు. -
ఈ రోజు కశ్మీర్ స్వేచ్ఛకు అంకితం
భారత్‌లో పాక్ హైకమిషనర్ బాసిత్ తీవ్ర వ్యాఖ్య ►పీఓకే విముక్తి మాత్రమే అపరిష్కృత అంశమని భారత్ ఘాటు జవాబు న్యూఢిల్లీ/జమ్మూ: కశ్మీర్ అంశంపై భారత్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలను పాక్ కొనసాగిస్తోంది. ఈ స్వాతంత్య్ర దినోత్సవాన్ని కశ్మీర్ స్వాతంత్య్రానికి అంకితం చేస్తున్నామని, కశ్మీరీ ప్రజలకు దౌత్యపరమైన, రాజకీయ, నైతిక మద్దతు ఇవ్వడాన్ని కొనసాగిస్తామని ఆదివారం భారత్‌లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీ ప్రజల త్యాగాలు వృథా పోవని, వారి రాజకీయ ఆకాంక్షలను సాయుధ బలంతో అణచేయలేరన్నారు. ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో జరిగిన పాక్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ కూడా ఇస్లామాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. స్వయం పాలన కోసం కశ్మీరీలు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు కొనసాగిస్తామని ప్రకటించారు. మమ్నూన్ హుస్సేన్, అబ్దుల్ బాసిత్ వ్యాఖ్యలపై భారత ప్రధానమంత్రి కార్యాలయం తీవ్రంగా స్పందించింది. పాక్ అక్రమ అధీనంలో ఉన్న జమ్మూ కశ్మీర్‌లోని ప్రాంతాలను విముక్తి కల్పించడమే ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న అపరిష్కృత అంశమని తేల్చిచెప్పింది. ‘జమ్మూకశ్మీర్‌కు సంబంధించి మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు పాక్‌తో ఏమైనా సమస్య ఉందంటే అది పాక్ అక్రమంగా ఆక్రమించిన జమ్మూకశ్మీర్(పీఓకే) భాగానికి స్వేచ్ఛ కల్పించడమే’ అని పీఎంవో సహాయ మంత్రి జితేందర్‌సింగ్ పేర్కొన్నారు. అలాగే, జమ్మూకశ్మీర్‌కు నిత్యావసర వస్తువులు పంపుతామన్న పాకిస్తాన్ ప్రతిపాదనపై కూడా భారత్ ఘాటుగా స్పందించింది. భారత్‌తో పాటు పొరుగు దేశాలకు మీరు ఇప్పటి వరకూ ఎగుమతి చేసిన ఉగ్రవాదం, చొరబాట్లు చాలని ఎద్దేవా చేసింది. కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్ జమ్మూ కశ్మీర్‌లోని వాస్తవాధీనరేఖ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది. ఈ విషయాన్ని భారత్ వెల్లడించింది. పాక్ సైనికులు రాష్ట్రంలోని రెండు చోట్ల కాల్పులకు తెగబడ్డారని, పూంచ్ సెక్టార్లో మోర్టార్లతో దాడి చేశారని లెఫ్టినెంట్ కల్నల్ మనీశ్ మెహతా తెలిపారు. -
చెన్నై సినీ చిత్రోత్సవాలు బాలచందర్‌కు అంకితం
తమిళసినిమా: 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమం స్ఫూర్తి దాయకంగా ప్రోత్సాహకరంగా జరిగింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు జరిగిన చిత్రోత్సవ కార్యక్రమాలు 46 దేశాలకు చెందిన చెన్నై సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన 171 చిత్రాల ప్రదర్శన చెన్నై సినీ ప్రముఖులను పులకరింప చేసింది. అదే విధంగా ఉన్నత విలువలతో కూడిన మంచి కథా వస్తువుగా తమిళ చిత్రాలకు చక్కనిగుర్తింపు, గౌరవం దక్కింది. ఈ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో యువతరానికి తగిన ప్రాధాన్యత లభించిందని చెప్పవచ్చు. గురువారం సాయంత్రం స్థానిక రాయపేటలోని ఉడ్‌ల్యాండ్ థియేటర్లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందించారు. కుట్రం కడిదల్కు ప్రథమ అవార్డు ముందుగా ప్రతి ఏడాదీ అందిస్తున్న టెలిఫిలిం బఫ్ అవార్డు కోసం అత్యధికంగా 138 ఎంట్రీలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. వాటిలో టెలిఫిలిం బఫ్ అవార్డును మద్రాసు స్కూల్ ఆఫ్ ఎకనామిక్ అధ్యాపకుడు ఎస్.వినాయక్ గెలుచుకున్నారు. అదేవిధంగా ఎంజీఆర్ ఫిలిం ఇన్స్టిట్యూట్ విద్యార్థులు రూపొం దించిన ఐదు షార్ట్ ఫిలింస్లు ‘ఛీ’ అనే షార్ట్ ఫిలిం అమ్మా అవార్డును గెలుచుకున్నాయి. ఈ లఘు చిత్రరూపకర్త మనోజ్‌కుమార్ ఈ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. అమితాబ్‌బచ్చన్ యూత్ ఐకాన్ అవార్డును ఈ ఏడాది యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు దక్కింది. ఆయన అవార్డుతో పాటు లక్ష రూపాయల బహుమతిని అందుకున్నారు. కాగా తమిళ చిత్రాల పోటీలు మహిళాదర్శకురాలు తావిత్ షమీమ్ తెరకెక్కించిన పూవరసం పీపీ, నట దర్శకుడు పార్దీపన్ రూపొందించిన కథై తిరె కథై ఇయక్కం చిత్రంలో ప్రత్యేక జూరి అవార్డులను గెలుచుకున్నాయి. వీటికి తలా లక్షరూపాయల నగదు బహుమతుల్ని అందించారు. ఇక రెండో ఉత్తమ కథా చిత్రంగా నవ దర్శకుడు హబ్ వినోద్ దర్శకత్వంలో నటుడు మనోబాల నిర్మించిన చదరంగవేట్టై గెలుచుకుంది. ఈ అవార్డుతో పాటు నిర్మాతకు లక్ష, దర్శకుడిగి లక్ష నగదు బహుమతితో సత్కరించారు. ప్రథమ ఉత్తమ కథా చిత్రంగా కుట్రం కడిదల్ చిత్రం ఎంపికైంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన బ్రహ్మజీకి రెండు లక్షలు, నిర్మాతలు సతీష్‌కుమార్, కిష్టి సిలువప్పన్లకు లక్ష రూపాయల నగదు బహుమతిని అందుకున్నారు. ఇండో సినీ అప్రిషియోషన్ సంస్థ నిర్వహించిన ఈ చిత్రోత్సవాల ముగింపు కార్యక్రమంలో దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్ రాధిక ఫిలిం చాంబర్ అధ్యక్షుడు వాసుదేవన్, నటి సుహాసిని, పూర్ణిమా భాగ్యరాజ్, శ్రీప్రియన రాజ్‌కుమార్, పీ.వాసు మొదలగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్తమ చిత్రాల ఎంపిక కష్టమనిపించింది ముందుగా అవార్డు బ్యూరీ కమిటీ సభ్యుడు, దర్శకుడు పీ.వాసు మాట్లాడుతూ ఈ రోజు తమిళ సినిమా హెడ్మాస్టర్ లేని పాఠశాలగా మారిపోయిందన్నారు. కారణం అందరికీ తెలిసిందే. కె.బాలచందర్ లేని లోటు తీర్చలేనిదన్నారు. ఇక ఈ చిత్రోత్సవాల గురించి చెప్పాలంటే 171 విదేవీ చిత్రాలను తమిళ సినీ ప్రేక్షకుల చూసే భాగ్యం కలిగిందన్నారు. అవార్డుల పోటీలో పాల్గొన్న 12 తమిళ చిత్రాలలో ఉత్తమ చిత్రాన్ని ఎంపిక చేయడం చాలా కష్టమైందని అన్నారు. మంచి కథా చిత్రాలను చూడాలంటే ఇంతకుముందు కోల్కత్తా, బెంగళూరు, కేరళ చిత్రాలను ఉదాహరణగా చెప్పేవారన్నారు. అలాంటిదిప్పుడు తమిళ సినిమా అని గర్వంగా చెప్పుకునే స్థాయికి మన చిత్రాలు ఉంటున్నాయని అన్నారు. కె.బాలచందర్ అవార్డు గత ఏడాది ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్‌బచ్చన్ యువ కళాకారులను ప్రోత్సహించే విధంగా 11 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని అమితాబ్ యువ ఐకాన్ అవార్డును ప్రవేశ పెట్టి ప్రతి ఏడాదీ ఒకవర్ధమాన కళాకారుడికి అవార్డుతో పాటు *లక్ష అందిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మరో అవార్డు నెలకొననుంది. అదే బాలచందర్ అవార్డు. ఈ అవార్డు కోసం ప్రతి ఏడాది నటి శ్రీప్రియ రాజ్‌కుమార్ *లక్ష రఅందించనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ 12వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలను దర్శక శిఖరం బాలచందర్‌కు అంకితం ఇస్తున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు.