సాక్షి, హైదరాబాద్: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో తన సెంచరీని దివంగత మేనమామ మెండు సత్యనారాయణకు అంకితమిస్తున్నానని రాయుడు చెప్పాడు. కేంద్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగి అయిన సత్యనారాయణ (68) ఆదివారం కన్నుమూశారు. గుంటూరు జిల్లా ఖాజీపాలెంకు చెందిన సత్యనారాయణ సెంట్రల్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండ్ హోదాలో పని చేశారు. రిటైర్మెంట్ అనంతరం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లో నివాసముంటున్నారు. గత నెలలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు సాయంత్రం హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి రాయుడు హాజరయ్యే అవకాశముందని రాయుడి తండ్రి సాంబశివరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment