Ambati Rayudu
-
అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదు.. రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
టీమిండియా మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై సంచలన ఆరోపణలు చేశాడు. టీమిండియా మాజీ ఆటగాడు, ఆంధ్ర ప్లేయర్ అంబటి రాయుడు అంటే విరాట్ కోహ్లికి నచ్చేది కాదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కారణంగానే రాయుడు 2019 వన్డే వరల్డ్‌కప్ జట్టు నుంచి చివరి నిమిషంలో తప్పించబడ్డాడని అన్నాడు. వరల్డ్‌కప్‌కు సంబంధించిన కిట్‌బ్యాగ్‌లు, బట్టలు, సూట్లు రాయుడు ఇంటికి చేరాయని, ఆతర్వాత కోహ్లి జోక్యం చేసుకోవడంతో రాయుడుకు వరల్డ్‌కప్ బెర్త్ దక్కలేదని బాంబు పేల్చాడు.కోహ్లికి ఎవరైనా నచ్చకపోతే జట్టులో చోటు దక్కేది కాదని అన్నాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి తీసుకున్న నిర్ణయాలను ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ సందర్భంగా ఎండగట్టాడు. అంబటి రాయుడు విషయంలో కోహ్లి చాలా అన్యాయంగా ప్రవర్తించాడని దుయ్యబట్టాడు. రాయుడుకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదని వాపోయాడు. రాయుడు వరల్డ్‌కప్ జట్టులో ఉంటానని ఎన్నో కలలు కన్నాడని, అలాంటి వ్యక్తికి చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. కాగా, 2019 వన్డే వరల్డ్‌కప్ కోసం ప్రకటించిన భారత జట్టులో అంబటి రాయుడును కాదని చివరి నిమిషంలో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజయ్ శంకర్ త్రీడి ప్లేయర్ అని.. అందుకే రాయుడు స్థానంలో అతన్ని ఎంపిక చేశామని అప్పటి చీఫ్ సెలెక్టర్, తెలుగువాడు ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. దీనిపై రాయుడు త్రీడి అద్దాలు పెట్టుకుని బహిరంగంగా తన అసంతృప్తికి వెల్లగక్కాడు.కోహ్లితో పోలిస్తే రోహిత్ గ్రేట్ లీడర్రాబిన్ ఉతప్ప కోహ్లి కెప్టెన్సీని రోహిత్ శర్మ కెప్టెన్సీతో కంపేర్ చేశాడు. కెప్టెన్‌గా నిర్ణయాలు తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడంలో కోహ్లికి రోహిత్ శర్మకు చాలా తేడా ఉందని అన్నాడు.రాయుడుకు జరిగినట్టే 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు ముందు సంజూ శాంసన్‌కు జరిగిందని గుర్తు చేశాడు. అయితే ఆ సందర్భంలో రోహిత్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించాడని తెలిపాడు. రోహిత్ సర్ది చెప్పాక శాంసన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టంచుకోలేదని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో కోహ్లితో పోలిస్తే రోహిత్ చాలా బెటర్ అని కొనియాడాడు.కాగా, 2024 వరల్డ్‌కప్ ఫైనల్లో సంజూ శాంసన్ ఆడాల్సి ఉండిది. అయితే చివరి నిమిషంలో శాంసన్ స్థానంలో శివమ్ దూబే తుది జట్టులోకి వచ్చాడు. ఫైనల్ మ్యాచ్ టాస్ తర్వాత రోహిత్ శాంసన్ దగ్గరికి పర్సనల్‌గా వెళ్లి అతన్ని ఎందుకు పక్కకు పెట్టాల్సి వచ్చిందో వివరించాడు. రోహిత్ వివరణ తర్వాత శాంసన్ కామ్ అయిపోయాడు. ఈ విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.యువరాజ్ సింగ్ కెరీర్ ముగియడానికి కూడా కోహ్లినే కారణం..!రాయుడు విషయాన్ని ప్రస్తావించడానికి ముందు ఉతప్ప కోహ్లికి వ్యతిరేకంగా సంచలన ఆరోపణలు చేశాడు. సిక్సర్ల వీరుడు, వన్డే, టీ20 వరల్డ్‌కప్ విన్నర్ యువరాజ్ సింగ్ కెరీర్ అర్దంతరంగా ముగిసిపోవడానికి కూడా కోహ్లినే కారణమని అన్నాడు. క్యాన్సర్‌పై విజయం సాధించిన అనంతరం యువరాజ్ కోహ్లి కోరుకున్నట్లు ఫిట్నెస్ సాధించలేకపోయాడని.. ఈ కారణంగానే కోహ్లి యువరాజ్‌కు మెల్లమెల్లగా చెక్ పెట్టాడని వ్యాఖ్యానించాడు. -
అంబటి రాయుడిని అప్పట్లో నెక్ట్స్ సచిన్ అన్నారు: హీరో శ్రీ విష్ణు
చాలామంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. కానీ తెలుగు హీరో శ్రీ విష్ణు మాత్రం క్రికెటర్ కాబోయి హీరో అయినట్లు ఉన్నాడు. గతంలో ఓసారి చెప్పాడు. ఇప్పుడు మరోసారి తన క్రికెట్ కెరీర్ గురించి బయటపెట్టాడు. అదే టైంలో అంబటి రాయుడు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: నాలుగో పెళ్లికి సిద్ధమైన ప్రముఖ నటి.. డేట్ ఫిక్స్)అతిథి పాత్రలతో కెరీర్ మొదలుపెట్టిన శ్రీ విష్ణు.. క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించాడు. ఇప్పుడు హీరోగా వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. ఇతడు నాలుగు పాత్రల్లో నటించిన 'స్వాగ్' మూవీ అక్టోబరు 4న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఓ పాడ్ కాస్ట్లో తన క్రికెట్ జర్నీ గురించి రివీల్ చేశాడు.తాను ఆంధ్రా జట్టు తరఫున అండర్-19 క్రికెట్ ఆడానని, తన టైంలో అంబటి రాయుడు.. హైదరాబాద్ తరఫున ఆడేవాడని, అప్పట్లో అతడిని నెక్స్ట్ సచిన్ అని పిలిచేవారని శ్రీ విష్ణు చెప్పుకొచ్చాడు. నిజ జీవితంలో క్రికెటర్ కానప్పటికీ 'అప్పట్లో ఒకడుండేవాడు' అనే మూవీలో మాత్రం శ్రీ విష్ణు క్రికెటర్‌గా నటించాడు. రాయుడు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Permit Room (@thepermitroommedia) -
IND VS PAK: రాయుడు, యూసఫ్ విధ్వంసం.. పాక్ చిత్తు! టోర్నీ విజేతగా భారత్
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీ విజేతగా ఇండియా ఛాంపియన్స్ నిలిచింది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసి భారత్ టైటిల్‌ను ముద్దాడింది.ఈ ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అతడితో పాటు కమ్రాన్ ఆక్మల్(24), మసూద్(21) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అనురీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, నేగి, ఇర్ఫాన్ పఠాన్ తలా వికెట్ సాధించారు.రాయుడు ఫిప్టీ.. యూసఫ్ విధ్వంసంఅనంతరం 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఓపెనర్ అంబటి రాయుడు మెరుపు హాఫ్ సెంచరీతో మెరిశాడు.30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు చేసి 50 పరుగులు చేసి రాయుడు ఔటయ్యాడు. ఆఖరిలో యూసఫ్ పఠాన్(16 బంతుల్లో 30 పరుగులు, 1 ఫోర్, 3 సిక్స్‌లు) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాక్ బౌలర్లలో యమీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. షోయబ్ మాలిక్,అఫ్రిది, రియాజ్ తలా వికెట్ సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంబటి రాయుడు నిలవగా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు యూసఫ్ పఠాన్‌కు వరించింది. -
ఆరెంజ్ క్యాప్ తో ఐపీఎల్ ట్రోఫీని గెలవలేరు.. కోహ్లిపై రాయుడు ఫైర్!?
ఐపీఎల్-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చెపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసి కేకేఆర్ ముచ్చటగా మూడో సారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే కేకేఆర్ విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు.. సంబంధం లేకుండా ఆర్సీబీ ప్రస్తావన తీసుకువచ్చాడు. అంతేకాకుండా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లిని రాయుడు మరోసారి టార్గెట్ చేశాడు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శనలే ఛాంపియన్‌గా నిలబెడుతాయని పరోక్షంగా కోహ్లిపై రాయుడు విమర్శలు గుప్పించాడు. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌లో నిష్క్రమించినప్పటకి.. ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లి తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సీజన్లో 15 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 61.75 సగటుతో 741 పరుగులు చేశాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా విరాట్ నిలిచాడు.ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్‌కు కంగ్రాట్స్. సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది. ఈ దిగ్గజాలు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించేలా సపోర్ట్ చేసింది.ఐపీఎల్లో ఓ జట్టు గెలుపొందాలంటే సమిష్టి కృషి అవసరం. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేం. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300 లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోందని"జియో సినిమా షోలో రాయుడు పేర్కొన్నాడు. కాగా విరాట్‌పై రాయుడు విమర్శల గుప్పించం ఇదేమి తొలిసారి కాదు. ఎలిమేనిటర్‌లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత కూడా విరాట్‌ను పరోక్షంగా ఉద్దేశించి రాయుడు ఓ పోస్ట్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం టీమ్‌కు మంచిది కాదుంటా రాయుడు ఎక్స్‌లో రాసుకొచ్చాడు. -
SRH vs RR: ‘సన్‌రైజర్స్ కాదు!.. రాజస్తాన్‌కే గెలిచే ఛాన్స్’
ఐపీఎల్-2024 ఆరంభం నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్ రాయల్స్.. ఆ తర్వాత చతికిల పడింది. వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్ చేరినప్పటికీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికే పరిమితమైంది.ఈ క్రమంలో అమీ తుమీ తేల్చుకోవాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ రాజస్తాన్ గెలిచే అవకాశాల్లేవంటూ విశ్లేషకులు పెదవి విరిచారు. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ స్వదేశానికి వెళ్లిపోవడం.. యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించకపోవడం.. బౌలింగ్ విభాగంలోనూ లోపాలు అంటూ రాజస్తాన్‌ను విమర్శించారు.ఆర్సీబీని చిత్తుచేసి.. క్వాలిఫయర్-2లోఇక సునిల్ గావస్కర్ వంటి దిగ్గజాలు సైతం ఆర్సీబీ- రాజస్తాన్ వార్ వన్‌సైడ్ అంటూ బెంగళూరు జట్టుకు మద్దతు పలికారు. ఈ క్రమంలో రాజస్తాన్ ఆర్సీబీకి ఊహించని షాకిచ్చింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో బెంగళూరును నాలుగు వికెట్ల తేడాతో ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది.ఫైనల్ రేసులో నిలిచే క్రమంలో చెన్నై వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్సన్రైజర్స్- రాజస్తాన్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. వాళ్లు ఇక్కడిదాకా చేరుకున్న తీరు అద్బుతం.చెన్నై పిచ్ పరిస్థితులు కూడా రాజస్తాన్ స్పిన్నర్లకు బాగా నప్పుతాయి. కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసేటపుడు ఆటగాళ్లు తమ మెదళ్లను బాగా ఉపయోగించాలి.అది హైదరాబాద్ వికెట్ కాదు. చెన్నైలో మీరు వికెట్లు తీయలేరు. అందుకే బ్యాటింగ్‌పై దృష్టి సారించాలి. నిజానికి చెన్నై పిచ్ మీద పరుగులు రాబట్టాలంటే కచ్చితంగా ఆచితూచి ఆడుతూ బ్యాట్స్‌మన్‌షిప్ చూపాలి’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఫైర్అయితే, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ రాయుడు వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు. సన్‌రైజర్స్ ఆటగాళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. రాజస్తాన్ మాదిరే సన్‌రైజర్స్ కూడా ఆది నుంచి దూకుడుగా ఆడుతూ ఇక్కడిదాకా వచ్చిందని పేర్కొంటున్నారు.హైదరాబాద్ జట్టులోనూ షాబాజ్ అహ్మద్, మయాంక్ మార్కండే, విజయకాంత్ వియస్కాంత్, వాషింగ్టన్ సుందర్ వంటి స్పిన్నర్లు ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అనుభవం లేకపోయినా మొమెంటమ్ తీసుకురావడంలో వీళ్లు సఫలమవుతారంటూ అంబటి రాయుడుకి కౌంటర్లు వేస్తున్నారు. కాగా రాజస్తాన్ రాయల్స్ జట్టులో చెన్నై దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు యజువేంద్ర చహల్ రూపంలో ఇద్దరు మేటి స్పిన్నర్లు ఉన్న విషయం తెలిసిందే.చదవండి: Hardik Pandya: భార్యతో హార్దిక్ పాండ్యాకు విభేదాలు?.. అతడి వల్లే అంటూ నటాషా పోస్ట్ వైరల్ -
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను ఉద్దేశించి ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని పట్ల వారి అభిమానం తనకు, రవీంద్ర జడేజాకు చిరాకు తెప్పించేందన్నాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై ఒకటి. దీనికి ముఖ్య కారణం టీమిండియా దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అనడంలో అతిశయోక్తి లేదు. ఎంతో మంది యువ ఆటగాళ్లు అతడి సారథ్యంలో మెరికల్లా తయారై జాతీయ జట్ల తరఫున అదరగొడుతున్నారు.ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో జట్టుపై నిషేధం పడినా.. తిరిగి సీఎస్కేను నిలబెట్టిన ఘనత ధోని సొంతం. రోహిత్ శర్మ(ముంబై ఇండియన్స్) తర్వాత రికార్డు స్థాయిలో ఐదుసార్లు ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా ధోని మాత్రమే నిలవగలిగాడు.తదుపరి తన వారసుడిగా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు పగ్గాలు అప్పగిస్తే.. ఒత్తిడి తట్టుకోలేక 2022 మధ్యలోనే బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. ఈ క్రమంలో 42 ఏళ్ల ధోని 2023లో టైటిల్ సాధించిన తర్వాత.. ఈ ఏడాది రుతురాజ్ గైక్వాడ్‌కు తన బాధ్యతలను బదిలీ చేశాడు.ఇక చాలా ఏళ్లుగా సీఎస్కే ముఖచిత్రమైన మిస్టర్ కూల్ ధోనికి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తలా అని ముద్దుగా పిలుచుకునే తమ నాయకుడిని చూసేందుకు కేవలం చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు.. దేశంలో ఎక్కడున్నా అతడి అభిమానులు మ్యాచ్ చూసేందుకు మైదానానికి పోటెత్తుతారు.ఈ క్రమంలో అతడు త్వరగా బ్యాటింగ్‌కు రావాలంటూ కోరుకునే అభిమానులు బ్యాటింగ్ ఆర్డర్లో ముందున్న జడ్డూ లాంటి వాళ్లు త్వరగా అవుట్ కావాలంటూ గతంలో ప్లకార్డులు కూడా ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో జడ్డూ వాళ్లపై అసహనం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డాడు. దీంతో ఫ్యాన్స్ సైతం అతడికి ధీటుగానే బదులిచ్చారు.ఈ నేపథ్యంలో అంబటి రాయుడు తాజాగా స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. "మనం సిక్స్, ఫోర్ కొట్టినా ప్రేక్షకులు సైలెంట్‌గా ఉంటారు. జడేజాకు, నాకు ఈ విషయం విసుగు తెప్పించేది.నిజానికి సీఎస్కే ఫ్యాన్స్ ముందు జట్టుకు అభిమానులు కాదు.. వాళ్లు కేవలం ధోని అభిమానులు మాత్రమే. అందుకే జడ్డూకు కూడా చిరాకు వచ్చేది. కానీ అతడు మాత్రం ఏం చేయగలడు అని వ్యాఖ్యానించాడు. కాగా 2018 నుంచి 2023 వరకు సీఎస్కే ఆడిన అంబటి రాయుడు గతేడాది ఐపీఎల్‌కు వీడ్కోలు పలికాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో సీఎస్కే పదమూడింట ఏడు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. -
టీ20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఇదే .. ఆ ముగ్గరు స్టార్ క్రికెటర్లకు నో ఛాన్స్?
టీ20 వరల్డ్‌కప్-2024లకు అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్1న అమెరికా, కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. అయితే ఈ టోర్నీలో భాగమయ్యే ఆయా జట్లు తమ వివరాలను మే1లోపు ఐసీసీకి సమర్పించాలి. ఈ క్రమంలో భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించనుంది.ఐపీఎల్లో ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపికను అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. ఈ సెలక్షన్ మీటింగ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పాల్గోనున్నాడు. అయితే సెలక్టర్లు కంటే ముందు చాలా మంది మాజీ ఆటగాళ్లు టీ20 వరల్డ్‌కప్‌లో భాగమయ్యే భారత జట్టును అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి భారత మాజీ బ్యాటర్ అంబటి రాయుడు చేరాడు.టీ20 ప్రపంచకప్‌కు తన 15 మంది ప్రాబబుల్స్‌ని రాయుడు ఎంచుకున్నాడు. రాయుడు ఎంచుకున్న జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు చోటు దక్కలేదు. హార్దిక్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ జట్టులో అతడి స్ధానం ప్రశ్నార్థకంగా మారింది.అదేవిధంగా ఐపీఎల్లో అదరగొడుతున్న పేస్ సంచలనం మయాంక్ యాదవ్.. రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్‌లకు రాయడు తన ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ ఇచ్చాడు. అయితే అనుహ్యంగా రాయుడు వికెట్ కీపర్ కోటాలో రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను కాకుండా దినేష్ కార్తీక్‌కు చోటు ఇవ్వడం గమనార్హం.దినేష్ కార్తీక్ ఈ ఏడాది సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఫినిషర్‌గా వచ్చి డీకే అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే రాయుడు కార్తీక్‌కు అవకాశమిచ్చాడు. అంబటి ఎంచుకున్న జట్టులో టాప్-4లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి,సూర్యకుమార్‌లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్ కోటాలో శివమ్ దూబే, రవీంద్ర జడేజాలకు రాయుడు అవకాశమిచ్చాడు. ఫాస్ట్ బౌలర్లగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. స్పెషలిస్టు స్పిన్నర్లగా కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్‌ను రాయుడు ఎంపిక చేశాడు. #IncredibleStarcast expert @RayuduAmbati has picked 15 ambitious players for his #TeamIndia squad ahead of #T20WorldCup2024 & there's only one all-rounder, @imjadeja! 👀Participate in the biggest opinion poll ever on our social media handles (23rd April-1st May) and see if you… pic.twitter.com/1PB3TwATc8— Star Sports (@StarSportsIndia) April 24, 2024 -
LSG VS CSK: గెలిచినప్పుడు ధోనిని పొగిడి, ఓడితే రుతురాజ్‌ను నిందిస్తారా..?
ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సీఎస్కేతో నిన్న (ఏప్రిల్ 23) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని లక్నో మరో మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. స్టోయినిస్ అజేయమైన మెరుపు శతకంతో (63 బంతుల్లో 124 నాటౌట్; 13 ఫోర్లు, 6 సిక్సర్లు) లక్నోను విజయతీరాలకు చేర్చాడు. స్టోయినిస్‌కు పూరన్ (15 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), దీపక్ హుడా (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్) సహకరించారు. గెలిస్తే ధోని ఓడితే రుతురాజా..?మ్యాచ్ అనంతరం జరిగిన డిబేట్లో నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ, అంబటి రాయుడు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సీఎస్కే ఓటమికి రుతురాజ్ చెత్త కెప్టెన్సీ కారణమని రాయుడు అంటే.. గెలిచినప్పుడు ధోని పేరు చెప్పి ఓడినప్పుడు రుతురాజ్ నిందించడం సమంజసం కాదని సిద్దూ అభిప్రాయపడ్డాడు. Ambati Rayudu - Poor field placements in deaths overs by Ruturaj. We clearly saw lack of experience as captainN. Sidhu - If you credit Dhoni for CSK wins then blame him for the losses too. Dhoni is still the main think tank#LSGvsCSK #CSKvLSG #CSKvsLSG pic.twitter.com/R4VnEwWUKY— Richard Kettleborough (@RichKettle07) April 24, 2024 తొలుత రాయుడు మాట్లాడుతూ.. డెత్ ఓవర్లలో రుతురాజ్ ఫీల్డింగ్‌ను మొహరించడంలో విఫలమయ్యాడు. కెప్టెన్‌గా అతని అనుభవ రాహిత్యం స్పష్టంగా బయటపడింది. స్టోయినిస్ విధ్వంసకర మూడ్‌లో ఉన్నప్పుడు రుతురాజ్ సిల్లీ ఫీల్డ్ సెటప్ చేసి అతను మరింత రెచ్చిపోయేలా చేశాడని అన్నాడు.ఇందుకు సిద్దూ కౌంటరిస్తూ.. సీఎస్కే గెలిచినప్పుడు ధోనికి క్రెడిట్ ఇచ్చి, ఓడినప్పుడు రుతురాజ్‌ను నిందించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు. గెలిచినప్పుడు ధోనిని పొగిడిన నోళ్లు ఓడినప్పుడు కూడా అతన్నే నిందించాలని అన్నాడు. సీఎస్కే కెప్టెన్సీని ధోనినే ఇంకా మోస్తున్నాడన్న విషయం బహిరంగ సత్యమని తెలిపాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే.. రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సెంచరీతో (60 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. రుతురాజ్ మెరుపులకు శివమ్ దూబే (27 బంతుల్లో 66; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం తోడు కావడంతో సీఎస్కే భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన లక్నో.. తొలి ఓవర్లోనే డికాక్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే స్టోయినిస్.. పూరన్, హుడా సహకారంతో లక్నోకు అపురూప విజయాన్ని అందించాడు. చివరి ఓవర్లో లక్నో గెలుపుకు 17 పరుగులు అవసరం కాగా.. మస్తాఫిజుర్ బౌలింగ్‌లో ప్టోయినిస్ వరుసగా 6, 4, 4, 4 పరగులు సాధించాడు. ఫలితంగా లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. -
టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేష్ కార్తీక్..? అతడికి అంత సీన్ లేదు!
ఐపీఎల్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్, భారత వెటరన్ దినేష్ కార్తీక్ అదరగొడుతున్నాడు. లేటు వయస్సులో ఖతర్నాక్ ఇన్నింగ్స్‌లతో కార్తీక్ దుమ్మలేపుతున్నాడు. ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చి మెరుపులు మెరిపిస్తున్నాడు. గత సీజన్లో నిరాశపరిచిన కార్తీక్ ..ప్రస్తుత సీజన్లో మాత్రం పూర్తి భిన్నంగా కన్పిస్తున్నాడు. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 పరుగుల భారీ లక్ష్య చేధనలో డీకే అద్బుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఓ దశలో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా కన్పించిన కార్తీక్.. ఆఖరికి నటరాజన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. దినేష్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కార్తీక్‌కు టీ20 వరల్డ్‌కప్ 2024 భారత జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలోకి భారత మాజీ క్రికెటర్ అంబటి రాయడు చేరాడు. డీకేను టీ20 వరల్డ్‌కప్‌లో ఆడించాలని రాయడు అన్నాడు. "కార్తీక్ తన కెరీర్లో ఎక్కువగా ఎంఎస్ ధోనితో పోటీపడ్డాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా జట్టులో ఉండడంతో కార్తీకు పెద్దగా ఆడే అవకాశాలు రాలేదు. అయితే డీకే ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడికి తన కెరీర్లో చివరిసారిగా వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం దక్కుతుందని నేను భావిస్తున్నానను. అతడికి ఛాన్స్ ఇస్తే టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే అవకాశముంది. అంతేకాకుండా భారత్‌కు వరల్డ్‌కప్‌ను అందించి, తన కెరీర్‌ను ఘనంగా ముగించిడానికి కార్తీక్‌కు కూడా ఇది మంచి అవకాశం. కాబట్టి డికేనే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలని సెలక్టర్లను కోరుతున్నానని" రాయడు స్టార్‌స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. ఇక ఇదే షోలో పాల్గోన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. రాయడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. పఠాన్ నవ్వుతూ ఐపీఎల్ వేరు, వరల్డ్‌కప్ వేరు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా వరల్డ్‌కప్ వంటి టోర్నీల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదని, కచ్చితంగా తీవ్రమైన ఒత్తడి ఉంటుందని పఠాన్ చెప్పుకొచ్చాడు. -
IPL 2024: ఆర్సీబీ లాంటి జట్లు ఎప్పటికీ ట్రోఫీ గెలవలేవు!
"This is why they have not won the IPL for so many years": రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ఉద్దేశించి టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘స్టార్ల’ వైఫల్యం కారణంగానే ఆర్సీబీ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదని వ్యాఖ్యానించాడు. కోట్లకు కోట్లు తీసుకునే అగ్ర శ్రేణి అంతర్జాతీయ క్రికెటర్లు మైదానంలో కంటే డ్రెసింగ్ రూంలోనే ఎక్కువగా ఉండటం వల్లే ఆర్సీబీ రాత మారడం లేదని రాయుడు అభిప్రాయపడ్డాడు. కాగా 2008 నుంచి బెంగళూరు జట్టు ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఫాఫ్ డుపెస్లిస్, మహ్మద్ సిరాజ్ వంటి టాప్ క్లాస్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. తాజాగా ఐపీఎల్-2024లోనూ పరాజయాల పరంపర కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 28 రన్స్‌తో ఓడి మూడో ఓటమిని చవిచూసింది. బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి వైఫల్యం కారణంగా సొంత మైదానంలో పరాభవం మూటగట్టుకుంది. A win at home followed by a win away from home for the Lucknow Super Giants! 👏👏 They move to number 4⃣ on the Points Table! Scorecard ▶️ https://t.co/ZZ42YW8tPz#TATAIPL | #RCBvLSG pic.twitter.com/uc8rWveRim — IndianPremierLeague (@IPL) April 2, 2024 స్టార్లు ఒక్కసారైనా రాణించారా? ఈ నేపథ్యంలో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ వాళ్ల బౌలర్లు ఎల్లప్పుడూ అత్యధికంగా పరుగులు సమర్పించుకుంటూనే ఉంటారు. ఇక బ్యాటర్లేమో స్థాయికి తగ్గట్లు ఆడరు. ఆర్సీబీ కష్టాల్లో ఉన్న సమయంలో.. మేటి బ్యాటర్‌గా పేరున్న ఒక్క ఆటగాడు కూడా రాణించడం ఇంత వరకు చూడలేదు. అలాంటి జట్లు ఎప్పటికీ టైటిల్ గెలవలేవు. అందుకే ఇన్నేళ్లుగా ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీ సాధించలేకపోయింది. బిగ్ ప్లేయర్లంతా టాపార్డర్‌లో ఉంటారు. కేక్ తినగా మిగిలిన క్రీమ్‌ను వదిలేసినట్లు డౌన్ ఆర్డర్లో ఉన్న యువ ఆటగాళ్లపై భారం వేస్తారు. ఒత్తిడిలో యువ ఆటగాళ్లతో పాటు దినేశ్ కార్తిక్ మాత్రమే ఆడటం చూస్తున్నాం. పదహారేళ్లుగా ఆర్సీబీ కథ ఇదే ఒత్తిడిలో మరింత మెరుగ్గా రాణించాల్సిన ఆర్సీబీలోని అగ్ర శ్రేణి అంతర్జాతీయ ప్లేయర్లు ఎప్పుడు బాధ్యత తీసుకున్నారు? వాళ్లంతా ఎక్కువగా డ్రెసింగ్ రూంలోనే ఉంటారు. ఈ ఒక్కరోజు మాత్రమే ఇలా జరగలేదు. పదహారేళ్లు ఆర్సీబీ కథ ఇదే’’ అని అంబటి రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెటిజన్లు.. కోహ్లి, మాక్స్ వెల్, డుప్లెసిస్, కామెరాన్ గ్రీన్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే రాయుడు ఇలా అని ఉంటాడని భావిస్తున్నారు. ఆ అదృష్టం అందరికీ ఉండదు బ్రో! అయితే, ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం రాయుడు అభిప్రాయంతో విభేదిస్తున్నారు. ఒక్కోసారి అదృష్టం కలిసి వస్తే కూడా ఆరుసార్లు టైటిల్ గెలిచిన జట్లలో భాగమయ్యే ఛాన్స్ ఉందని రాయుడును ఉద్దేశించి సెటైర్లు వేస్తున్నారు. కాగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు ఆ జట్లు ట్రోఫీలు గెలిచిన సందర్భాల్లో(మూడేసి సార్లు) జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గతేడాది సీజన్ తర్వాత ఐపీఎల్‌కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: రూ.11 కోట్లు టైమ్‌కి తీసుకుంటాడు.. అతడికేమో 17 కోట్లు! మరి ఆట? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
#Dhoni: బ్యాడ్‌న్యూస్.. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఇక అంతే!
IPL 2024 CSK vs DC: విశాఖపట్నంలో అద్భుత బ్యాటింగ్‌తో అసలైన టీ20 మజాను అందించాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో తనదైన శైలిలో షాట్లు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. నలభై రెండేళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ఐపీఎల్-2024లో బ్యాటింగ్ వచ్చిన తొలిసారే తన పవరేంటో చూపించాడు. ముఖ్యంగా ఒంటిచేత్తో ధోని బాదిన షాట్ అతడి ఇన్నింగ్స్‌కే కాదు మ్యాచ్‌లోనూ హైలెట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు.అయితే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇంత చేసినా ధోని సీఎస్కేను గెలిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచింది. కానీ.. తదుపరి మ్యాచ్ నుంచి ధోని బ్యాటింగ్ మెరుపులు చూసే అవకాశం తప్పక వస్తుందనే నమ్మకం కుదిరిందని సంతోషిస్తున్నారు. అయితే, మాజీ క్రికెటర్, సీఎస్‌కు ఆడిన అంబటి రాయుడు మాత్రం ఇప్పుడే అంతగా సంబరపడిపోవద్దని అంటున్నారు. ఇకపై బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ముందు వచ్చే ఛాన్స్ ఉందా ప్రశ్నకు బదులిస్తూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అతడు కచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాడు.ఎందుకంటే.. లోయర్ ఆర్డర్లో వచ్చి సీఎస్కేను గెలిపించగల సత్తా ఉన్న ధోని ఆత్మవిశ్వాసం ఈ ఇన్నింగ్స్‌తో మరింత పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి.. ధోని ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వస్తే చూడాలనుకునే మనలాంటి వాళ్ల ఆశలకు ఇక గండిపడినట్లే’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో కామెంటేటర్‌గా ఉన్న రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో.. ఇలా తన అభిప్రాయం పంచుకున్నాడు.కాగా ఐపీఎల్-2024 సందర్భంగా కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన వికెట్ కీపర్ బ్యాటర్ ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ధోని .. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. -
#Dhoni: బ్యాడ్‌న్యూస్.. ఈ ఇన్నింగ్స్ తర్వాత ఇక అంతే!
IPL 2024 CSK vs DC: విశాఖపట్నంలో అద్భుత బ్యాటింగ్‌తో అసలైన టీ20 మజాను అందించాడు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ మహేంద్ర సింగ్ ధోని. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో తనదైన శైలిలో షాట్లు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. నలభై రెండేళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ ఐపీఎల్-2024లో బ్యాటింగ్ వచ్చిన తొలిసారే తన పవరేంటో చూపించాడు. ముఖ్యంగా ఒంటిచేత్తో ధోని బాదిన షాట్ అతడి ఇన్నింగ్స్‌కే కాదు మ్యాచ్‌లోనూ హైలెట్‌గా నిలిచిందనడంలో సందేహం లేదు. అయితే.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఇంత చేసినా ధోని సీఎస్కేను గెలిపించకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరిచింది. కానీ.. తదుపరి మ్యాచ్ నుంచి ధోని బ్యాటింగ్ మెరుపులు చూసే అవకాశం తప్పక వస్తుందనే నమ్మకం కుదిరిందని సంతోషిస్తున్నారు. అయితే, మాజీ క్రికెటర్, సీఎస్‌కు ఆడిన అంబటి రాయుడు మాత్రం ఇప్పుడే అంతగా సంబరపడిపోవద్దని అంటున్నారు. ఇకపై బ్యాటింగ్ ఆర్డర్లో ధోని ముందు వచ్చే ఛాన్స్ ఉందా ప్రశ్నకు బదులిస్తూ ఈమేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత అతడు కచ్చితంగా బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు రాడు. ఎందుకంటే.. లోయర్ ఆర్డర్లో వచ్చి సీఎస్కేను గెలిపించగల సత్తా ఉన్న ధోని ఆత్మవిశ్వాసం ఈ ఇన్నింగ్స్‌తో మరింత పెరిగిందని చెప్పవచ్చు. నిజానికి.. ధోని ఇంకాస్త ముందుగానే బ్యాటింగ్‌కు వస్తే చూడాలనుకునే మనలాంటి వాళ్ల ఆశలకు ఇక గండిపడినట్లే’’ అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. ఐపీఎల్-2024లో కామెంటేటర్‌గా ఉన్న రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో.. ఇలా తన అభిప్రాయం పంచుకున్నాడు. కాగా ఐపీఎల్-2024 సందర్భంగా కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించిన వికెట్ కీపర్ బ్యాటర్ ధోని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో సీఎస్కే ఆడిన మూడు మ్యాచ్‌లలో రెండు గెలిచింది. ధోని .. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. There is nothing beyond Thala's reach 🔥💪 #IPLonJioCinema #Dhoni #TATAIPL #DCvCSK pic.twitter.com/SpDWksFDLO — JioCinema (@JioCinema) March 31, 2024 -
IPL 2024: రోహిత్ శర్మను సీఎస్కే కెప్టెన్‌గా చూడాలని ఉంది..!
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తన మాజీ కెప్టెన్ (ముంబై ఇండియన్స్) రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాయుడు రోహిత్‌పై తన మనసులో దాగి వున్న విషయాలను బహిర్గతం చేశాడు. తన మరో కెప్టెన్ ఎంఎస్ ధోని రిటైరయ్యాక రోహిత్ సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించాడు. ఇదే సందర్భంగా రాయుడు రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్‌కు మరో ఐదారేళ్లు ఐపీఎల్ ఆడగల సత్తా ఉందని ఆకాశానికెత్తాడు. ధోని తర్వాత రోహిత్ సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపడితే చూడాలని ఉందని అన్నాడు. రోహిత్ కావాలనుకుంటే విశ్వవ్యాప్తంగా జరిగే ఏ లీగ్‌లోనైనా కెప్టెన్సీ చేపట్టగలడని తెలిపాడు. రోహిత్ గడిచిన పదేళ్లలో ముంబై ఇండియన్స్‌ను అద్భుతంగా ముందుండి నడిపించాడని కితాబునిచ్చాడు. రోహిత్ మరో సీజన్ పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా కొనసాగాల్సి ఉండిందని అన్నాడు. రోహిత్ విషయంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం తొందరపడిందేమోనన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్ ఇంకా టీమిండియా కెప్టెన్‌గా కొనసాగుతున్నాడన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఎంఐ యాజమాన్యం కెప్టెన్‌గా హార్దిక్ ట్రాక్ రికార్డును పరిగణలోకి తీసుకుని ఉంటుందని తెలిపాడు. గుజరాత్ పరిస్థితులతో పోలిస్తే ముంబై ఇండియన్స్ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని.. ముంబై ఇండియన్స్‌కు ముందుండి నడిపించడం ఆషామాషీ విషయం కాదని పరోక్షంగా తన మద్దతు రోహిత్ శర్మకు తెలిపాడు. అంతిమంగా కెప్టెన్సీ చేపట్టాలా వద్దా అన్నది రోహిత్ వ్యక్తిగతమని అభిప్రాయపడ్డాడు. అంబటి రాయుడు.. రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్‌కు.. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాడు. ఈ తెలుగు క్రికెటర్ గతేడాదే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా, 36 ఏళ్ల రోహిత్ శర్మ 2013-2020 మధ్యలో ముంబై ఇండియన్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపాడు. ఇంతటి విజయవంతమైన కెప్టెన్‌ను ముంబై ఇండియన్స్ ఇటీవలే సారథ్య బాధ్యతల నుంచి తొలగించి, అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పింది. రోహిత్ ఇష్టపూర్వకంగానే ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని కొందరంటుంటే, మరికొందరేమో హార్దిక్ పాండ్యా కోసం ఎంఐ యాజమాన్యం హిట్‌మ్యాన్‌ను అవమానించిందని అనుకుంటున్నారు. -
తుస్సుమన్పించిన అంబటి రాయుడు.. కేవలం ఒక్క పరుగుకే
ఇంటర్నేషనల్ టీ20 లీగ్-2024ను టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు పేలవంగా ఆరంభించాడు. ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌కు చెందిన ఎంఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీకి రాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు దారుణంగా విఫలమయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన రాయుడు 2 బంతుల్లో 1 పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. సికిందర్ రాజా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా ఐపీఎల్ 2023 విజయానంతరం అన్ని రకాల క్రికెట్‌కు రాయుడు గుడ్‌బై చెప్పాడు. బీసీసీఐతో పూర్తిగా బంధాన్ని తెంచుకున్న రాయుడు కరేబియన్ ప్రీమియర్ లీగ్-2023 సీజన్లో భాగమయ్యాడు. అనంతరం ఐఎల్ టీ20 టోర్నీ-2024లో ఆడేందుకు ఎంఐ ఎమిరేట్స్‌తో రాయుడు ఒప్పందం కుదర్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరెట్స్పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో ముహమ్మద్ వసీం(51) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 16 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దుబాయ్ బ్యాటర్లలో హ్మనుల్లా గుర్బాజ్(89) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగాడు. చదవండి: గొడవకు దిగిన టీమిండియా కెప్టెన్.. కొట్టుకునేంత పని చేశారుగా! వీడియో వైరల్ -
వృద్దాప్యంలో ఉన్నారు కదా! రామోజీ కళ్లకు కాస్త మసక వచ్చి ఉండొచ్చు..
పదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తి పెద్దవాడవుతాడా? లేక ఒక క్రికెటర్‌గా ఉండి రిటైరైన వ్యక్తి పెద్ద వ్యక్తి అవుతారా? ఎవరైనా ఏమంటాం. ఒక రాజకీయ వేత్తగా రెండుసార్లు ఎంపీగా గెలిచారంటేనే అతనికి ప్రజాభిమానం ఉందనే కదా! దేశంలో చట్టాలు చేసే అత్యున్నత చట్టసభలో ఉండడం కన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది. రాజకీయాలలో అదే కదా ఎవరైనా కోరుకునేది. క్రికెటర్‌గా రాణించడం మంచి విషయమే. కాదనం. ఆయన రాజకీయాలలోకి వచ్చి ప్రజాదరణ పొందితే అది వేరే సంగతి. పదేళ్లు ఎంపీగా ఉన్న నేత చిన్నవాడట ఒక పార్టీలో చేరి వారం రోజులకే మనసు మార్చుకున్న వ్యక్తి చాలా పెద్దవాడట. పదేళ్లుగా ఎంపీగా ఉన్న నేత చాలా చిన్నవాడట. ఇది ఈనాడు మీడియా అధిపతి రామోజీరావు చిత్రీకరణ. తెలుగుదేశం పార్టీకి ఏది అనుకూలం అయితే అదే కరెక్ట్ అనేంత పతనావస్తకు ఈనాడు మీడియా చేరింది. క్రికెటర్ అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అంతకుముందు ఏపీలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు, ఇతర సంస్థలలో జరుగుతున్న అభివృద్దిని చూసి మెచ్చుకున్నారు. వాటికి ఆకర్షితులై ఆయన పార్టీలో చేరానన్నారు. తదుపరి ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నానని ప్రకటించారు. అంతే! మోసపూరిత కథనాలతో తప్పుడు కథనాలు ఈనాడు మీడియాకు కోతికి కొబ్బరికాయ దొరికిన చందం అయిపోయింది. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో అచ్చేసి ఆనందపడింది. పైగా దీనికి వంచన అంటూ మరో ముక్తాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఈయనను వంచించేశారట. ఇలాంటి మోసపూరిత కథనాలు రాసి ప్రజలను తప్పుదారి పట్టించాలని ఈనాడు ఎంత నీచంగా ప్రయత్నిస్తోందో అర్ధం అవుతుంది. ఏబీఎన్‌తో పోటీ పడి నిసిగ్గుగా మద్దతు పదేళ్లపాటు ఎంపీగా ఉన్న కేశినేని అటు ఎంపీ పదవికి, ఇటు తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెబితే మాత్రం దానిని చాలా చిన్న విషయంగా పది లైన్ల వార్తగా ఇచ్చి సరిపెట్టుకుంది. అంటే దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. ఈనాడు మీడియా ఆంద్రజ్యోతితో పోటీ పడి తెలుగుదేశం పార్టీకి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తోందనే కదా!అదేమీ కొత్త విషయం కాకపోయినా, ఒకటికి రెండుసార్లు ఈ విషయం చెప్పి వక్కాణించవలసి వస్తోంది. కేశినేని నాని 2014లో మొదటిసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ వేవ్‌ను కూడా తట్టుకుని నిలబడి స్వల్ప ఆధిక్యంతో అయినా గెలవగలిగారు. కేశినేని కుటుంబంలో లోకేష్ చిచ్చు అలాంటి వ్యక్తి తన కుటుంబంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిచ్చుపెట్టారని అంటున్నారు. తన సోదరుడు చిన్నిని లోకేష్ ఎంకరేజ్ చేసి డబ్బు ఖర్చు పెట్టించి, తనకు పోటీగా తయారు చేశారని, అందుకే తనకు టికెట్ లేదని చంద్రబాబు ప్రకటించారని అంటున్నారు. ఇవేవి ఎల్లో మీడియాకు విశేషాలు కావు. టీడీపీలో చంద్రబాబు పెత్తనం కన్నా లోకేష్‌దే ఎక్కువ ఆధిపత్యం అని ఈ ఘటన తెలియచేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 2014-19 కాలంలో తన కొడుకు లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వంలో అంతా తానై లోకేష్ చక్రం తిప్పారు. జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా? చంద్రబాబు చాలా సందర్భాలలో నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారని కొందరు అంటారు. అంతేకాక, తనవద్ద ఎవరైనా పనులకు వస్తే లోకేష్‌ను కలిశావా అని అడిగేవారని కూడా కొందరు చెబుతారు. అంటే దాని అర్ధం తెలుసుకదా! ఈ నేపథ్యంలో లోకేష్ తన సొంత టీమ్‌ను తయారు చేసుకుంటున్నారన్నమాట. ముఖ్యమంత్రి జగన్ వాళ్లను కలవలేదు. వీళ్లను కలవలేదు అని ఎల్లో మీడియా వారు తప్పుడు ప్రచారం చేస్తుంటారు? కనీసం కేశినేని నానిని పిలిచి టికెట్ విషయం ఎందుకు చర్చించలేదని మాత్రం కథనం ఇవ్వరు. అదేదో పరాయి వ్యక్తికి చెప్పినట్లు నలుగురు మనుషులను పంపించి టికెట్ ఇవ్వడం లేదని నానికి చెప్పిస్తారా? తిరువూరు సభ ఏర్పాట్లలో జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా? పైగా తెల్లవారి లేస్తే ప్రజాస్వామ్యం అని ఒకటే సోది చెబుతారు! ఎంపీ రాజీనీమా పెద్ద వార్త కాదా? చంద్రబాబు ఎవరికైనా టిక్కెట్లు ఇవ్వకపోతే అదేదో పార్టీ ప్రయోజనాల కోసం. వేరే పార్టీవారు అదే పని చేస్తే అన్యాయం, వంచన చేసినట్లట! దీనిని ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా భుజాన వేసుకుని తప్పుడు ప్రచారం చేస్తుంటాయి. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తే అది పెద్ద వార్తకాదని ఈ దిక్కుమాలిన మీడియా అబిప్రాయం. అసలు రాజకీయాలలోకి దాదాపు రాని, కేవలం వారం రోజుల వ్యవధిలో తప్పుకుంటే మాత్రం అది వంచన అని, ఇంకేవో రాసిపారేశారు. ఈనాడు చెత్తరాతలు అంబటి రాయుడుకు గుంటూరు టికెట్ ఇస్తానని జగన్ చెప్పారని, ఇప్పుడు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీచేమంటున్నారని ఇది మోసం అని ఈనాడు చెత్తరాతలు రాసింది. పార్టీ అవసరాల కోసం ఒకవేళ టికెట్ మార్చుకుంటే అది వంచన అవుతుందా? అదే పార్టీ ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలిచిన కేశినేని నాని ఇంటిలో స్వయంగా చంద్రబాబో లేక లోకేషో చిచ్చు పెడితే అది మోసం కాదా? నాని ఇప్పుడు తన కార్యాయలం నుంచి టీడీపీ జెండాలు కూడా పీకేశారట. అయినా ఎల్లో మీడియా దానిని వార్తగా ఇవ్వదు. నోరు మూసేసుకుంది. అంబటి రాయుడు స్టోరీని అడ్డుపెట్టుకుని ఇంతకు ముందు రాసిన విషయాలనే మళ్లీ, మళ్లీ రాసి పాఠకులను విసిగించింది. ఈ మద్యకాలంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ కార్యకలాపాలకు అంటిముట్టనట్లు ఉంటున్నారని చెబుతున్నారు. అయినా అవేవి ఈనాడు రామోజీరావు కళ్లకు వార్తలు కావు. ఎంతైనా వృద్దాప్యంలో ఉన్నారు కదా! రామోజీరావు కళ్లకు కాస్త మసక వచ్చి ఉండవచ్చు. వివరణ ఇవ్వని అనైతిక పరిస్థితి తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అంబటి రాయుడు ఊపీఎల్ పోటీలలో ఆడడానికి ఎంపికయ్యారు. వారు ఏ రాజకీయపార్టీలలో ఉండకూడదట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీంతో ఈనాడు మీడియాకు నోరు పడిపోయినంత పనైంది. తాను రాసింది తప్పుడు వార్త అని తెలిసినా కనీసం వివరణ కూడా ఇవ్వని అనైతిక పరిస్థితికి ఈనాడు మీడియా వెళ్లింది. నెల్లూరు నుంచి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రబాకరరెడ్డి పోటీచేయడం లేదని, ఆయన టీడీపీ వైపు చూస్తున్నారంటూ ఒకటే ప్రచారం చేసింది. అన్నిసార్లు రాస్తే నమ్మకపోతారా అన్నది వారి గోబెల్స్ ఆలోచన అన్నమాట. తీరా వేమిరెడ్డి తానే నెల్లూరునుంచి వైఎస్సార్సీపీ నుంచి పోటీచేస్తున్నానని స్పష్టంగా చెప్పారు. ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు? పైగా ఆయన ఒక మాట అన్నారు. ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు! తనకు విసుగువచ్చి పదే, పదే జవాబు ఇవ్వడం మానివేశానని అన్నారు. ఈనాడు తదితర ఎల్లో మీడియా అంత అసహ్యంగా మారాయనే కదా ఆయన వ్యాఖ్యల సారాంశం. వైఎస్సార్సీపీ తమ అభ్యర్దులను మార్చినా వ్యతిరేక ప్రచారమే. మార్చకపోయినా దుష్ప్రచారమే. చంద్రబాబు కాంగ్రెస్ వారితో కలిసి మంతనాలు జరిపితే అది వ్యూహం. అదే వేరే వారు చేస్తే కుట్ర. కేశినేని నాని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారట. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట. టీడీపీ జెండాలు పీకేస్తే ఎందుకు రాయలేదు ఎవరైన వైఎస్సార్సీపీ నేతను పార్టీ అధిష్టానం ఏదైనా అంశంపై ప్రశ్నిస్తే ఇంకేముంది.. ఇదేనే ప్రజాస్వామ్యం అని ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రశ్నిస్తూ నీచంగా కథనాలు ఇస్తాయి. కేశినేని నాని తన ఆఫీస్ వద్ద టీడీపీ జెండాలు పీకేశారట. మరి దానికి టీడీపీ జెండా పీకేశారని ఈనాడు మీడియా ఎందుకు రాయలేదు? అంటే టీడీపీపై వల్లమానిన ప్రేమ. తన స్వార్ధ వ్యాపార రాజకీయం కోసం రామోజీరావు ఎంతకైనా దిగజారుతున్నారు. ఆంద్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విషం చిమ్మించడానికి యత్నించారు. రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ జగన్ ఫోన్ చేసి పలకరించలేదని చెప్పించారు. ఓకే. ఇదే రాధాకృష్ణ అంతకుముందు ఒకసారి రేవంత్‌కు జగన్ ఫోన్ చేయడానికి ప్రయత్నించారని, కాని రేవంత్ సిద్దపడలేదని రాసిందే. మరి దాని గురించి ఏమంటారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్దం అంటే వారికే తెలియాలి. రాజకీయవర్గాలలో ఒక ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ చేసి తన వద్దకు ఇంటర్వ్యూ నిమిత్తం రప్పించుకున్నారని అంటున్నారు. తొలుత రేవంత్ ఒక టీవీ చానల్‌కు వెళితే మిగిలిన చానళ్లు కూడా అడుగుతాయని అనుకుని వద్దని చెప్పారట. కాని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్‌కు తట్టుకోలేక ఇంటర్వ్యూ ఇచ్చారట. సహజంగానే రాదాకృష్ణ మానసికి పరిస్థితిని బట్టి అది నిజమేనేమో అనిపిస్తుంది. అదే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరు కదా! అందుకే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల ఏడుపు అని అనుకోవాలి. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
అందుకే రాజీనామా చేశా
-
క్రికెట్ కోసమే రాజకీయాలకు దూరం: అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెట్ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బ్యాట్ పట్టనున్నట్లు ప్రకటించాడు. వృత్తిపరమైన క్రీడను ఆడుతున్నందున రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటూ ఎక్స్‌లో ట్వీట్ చేసిన అంబటి రాయుడు.. త్వరలో దుబాయ్‌లో జరుగనున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఆడనున్నట్లు వెల్లడించారు. ప్రొఫెషన్ క్రికెట్ లీగ్‌లో ఆడాలంటే ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండకూడదు. అందుకే వైసీపీ రాజీనామా చేసినట్లు రాయుడు చెప్పుకొచ్చాడు. ఇంటర్నేషనల్ లీగ్‌లో రాయుడు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీతో జతకట్టనున్నాడు. రాయుడు గతంలో ఐసీఎల్‌లోనూ ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. ఇంటర్నేషనల్ టీ20 లీగ్ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది. I Ambati Rayudu will be representing the Mumbai Indians in the upcoming ILt20 from jan 20th in Dubai. Which requires me to be politically non affiliated whilst playing professional sport. — ATR (@RayuduAmbati) January 7, 2024 -
YSRCPలో చేరిన తరువాత అంబటి రాయుడు ఫస్ట్ ఇంటర్వ్యూ
-
YSRCPలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
-
పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ : అంబటి రాయుడు
సాక్షి,అమరావతి: టీమిండియా క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిటిక్స్ .. నా సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాలు తన సెకండ్ ఇన్నింగ్స్ అని టీమిండియా అంబటి తిరుపతి రాయుడు తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి సీఎం జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని, ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని అంబటి రాయుడు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చాలా ఆరోపణలు చేశారని, అయితే ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశి్నంచారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అంబటి రాయుడు అన్నారు. యువత ఆకాంక్షలకు అద్దం పడుతున్న రాయుడి అరంగేట్రం రాజకీయాల్లో నైతిక విలువలకు పట్టం కట్టి, ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో ఆదరణ రోజు రోజుకు పెరుగుతోంది. ప్రధానంగా యువతలో జగన్‌కు మద్దతు నానాటికీ అధికమవుతోంది. పలు సంస్కరణలతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా రాష్ట్రంలోని విద్యార్థులను తీర్చిదిద్దుతుండడం.. విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తూ భారీ ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుండడమే ఇందుకు నిదర్శనం. రాజకీయాల్లో నైతిక విలువలకు వలువలు వదిలి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. ఆయనకు వంతపాడుతున్న జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ను మెజార్టీ ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రధానంగా వారిద్దరి రాజకీయ వ్యవహారశైలిపై యువతలో అసహనం పెల్లుబికుతున్నది. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. వైఎస్సార్సీపీలో చేరడం రాష్ట్రంలో యువత ఆకాంక్షలకు అద్దంపడుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు క్రికెట్‌కు వీడ్కోలు పలకక ముందు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించేవారు. క్రికెట్‌కు వీడ్కోలు పలికాక అంబటి రాయుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృ తంగా పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనకు ప్రజలు జేజేలు పలుకుతుండడం.. ప్రధానంగా యువతలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండడాన్ని గమనించారు. అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు యువత ఆకాంక్షలకు అద్దం పడుతూ.. వైఎస్సార్సీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో రాయుడికి వైఎస్సార్సీపీ కండువా కప్పిన సీఎం జగన్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. పాలిటిక్స్.. నా సెకండ్ ఇన్నింగ్స్: రాయుడు అనంతరం సాక్షి టీవీతో క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ..రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని తెలిపారు. సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరటం సంతోషంగా ఉందని తెలిపారు. మొదటి నుంచి జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని.. ఆయన కులమతాలు, రాజకీయాలతో పనిలేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు చెప్పారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారని.. ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. కాగా గత కొన్నాళ్లుగా జిల్లాల్లో పర్యటిస్తోన్న అంబటి రాయుడు.. విద్యార్థులు, యువతను కలిసి మాట్లాడుతున్న విషయం తెలిసిందే. చదవండి: రాయచోటి: సామాజిక జైత్రయాత్ర.. ఇదీ సీఎం జగన్ పాలన ఘనత -
క్రికెట్ అంటే చిన్ననాటి నుంచే మక్కువ! ఆంధ్ర క్రికెటర్ల కోసం రాష్ట్రంలో..
పాఠశాల స్థాయి నుంచే జగన్‌కు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ.. ముఖ్యంగా క్రికెట్ అంటే మరీ ఇష్టం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సన్నిహితులు చెప్పే మాట ఇది! హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యనభ్యసించిన వైఎస్ జగన్.. క్రికెట్‌తో పాటు బాస్కెల్ బాల్ వంటి ఇతర క్రీడల్లోనూ భాగమయ్యే వారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబం బంజారాహిల్స్‌లో నివాసం ఉండేవారు. కేవలం పాఠశాలలోనే కాకుండా.. ఇంటి దగ్గర కూడా స్నేహ బృందం ఏర్పాటు చేసుకున్న జగన్.. వారితో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. స్కూలైనా.. బయట అయినా ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో నాయకుడిగా ఉండేందుకే ఇష్టపడే జగన్.. హెచ్‌పీఎస్‌లో హౌజ్ కెప్టెన్‌గా అరుదైన ఘనత దక్కించుకున్నారు. పన్నెండవ తరగతిలో ఉన్నపుడు.. మిగితా మూడు హౌజ్‌ల జట్లను ఓడించి రెడ్ హౌజ్‌కు ఆల్‌రౌండర్ చాంపియన్‌షిప్ అందించారు జగన్. కేవలం ఆటలే కాకుండా వ్యాసరచన వంటి పోటీలలోనూ తమ టీమ్ ముందుండేలా చేసి తన నాయకత్వ పటిమతో టైటిల్ సాధించారు. ఈ విషయాలను యువకెరటం పుస్తకంలో ఎఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ వెల్లడించారు. ఏపీఎల్‌తో ఆంధ్ర క్రికెటర్లకు మరింత ప్రోత్సాహం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడా రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న క్రికెట్లో ఆంధ్ర క్రీడాకారుల సంఖ్య పెరిగేలా చొరవ తీసుకుంటోంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. సీఎస్కే ముందుకు వచ్చేలా చర్యలు ఇందులో భాగంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు కావాల్సినంత ప్రోత్సాహం అందిస్తోంది. అంతేకాదు.. విశాఖపట్నంలో మరో అత్యాధునిక క్రికెట్ స్టేడియం నిర్మించే దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది. విశాఖలో ఉన్న వైఎస్సార్ స్టేడియంను క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉంది. అంతేకాదు రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇక వైఎస్ జగన్ హయాంలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరిట ఏసీఏ సరికొత్త క్రికెట్ టోర్నీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 2022లో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ టీ20 లీగ్‌లో రాయలసీమ కింగ్స్, కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగాయి. విజయవంతంగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు సీజన్లు అరంగేట్ర ఎడిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏసీఏ.. తాజాగా రెండో సీజన్‌ను కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తి చేసింది. ఏపీఎల్ తొలి సీజన్లో కోస్టల్ రైడర్స్ విజేతగా నిలవగా.. ఈ ఏడాది రాయలసీమ కింగ్స్ టైటిల్ సాధించింది. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ రాణించిన ఆటగాళ్లకే ఇటీవలి కాలంలో బీసీసీఐ సెలక్టర్లు పెద్దపీట వేస్తున్న విషయం తెలిసిందే. అందుకే ఔత్సాహిక ఆంధ్ర క్రికెటర్లు కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడేలా ఏసీఏ ఇలా ఏపీఎల్ పేరిట తమ వంతు ప్రయత్నం చేస్తోంది. క్రికెట్ దిగ్గజాలను ఆహ్వానిస్తూ 1983 వరల్డ్‌కప్ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్ సహా టీమిండియా క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ తదితరులను ఈ ఈవెంట్లకు ఆహ్వానించడం ద్వారా జాతీయ మీడియా దృష్టిని కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. కొత్త ప్రభుత్వ హయాంలో ఏపీ క్రీడల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందంటూ బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా పనిచేసిన ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం విశేషం. ఏపీ సీఎం కప్, ఆడుదాం ఆంధ్రా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ ప్రభుత్వం.. ఏపీ సీఎం కప్ పేరిట క్రికెట్‌తో పాటు క్రికెటేతర క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ గల క్రీడా ఆణిముత్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్రా పేరిట క్రీడా సంబరానికి శ్రీకారం చుట్టింది. అంబాసిడర్‌గా అంబటి రాయుడు ఈ ఈవెంట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్లో అరుదైన ఘనతలు సాధించిన అంబటి రాయుడిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి, రాష్ట్రానికి ఖ్యాతి తీసుకువచ్చిన పీవీ సింధు(బ్యాడ్మింటన్), జ్యోతి సురేఖ వెన్నం(ఆర్చరీ), కేఎస్ భరత్(క్రికెటర్) తదితరులను సమున్నతరీతిలో సత్కరించింది. -
ఏలూరులో కదంతొక్కిన విద్యార్థులు
ఏలూరు టౌన్: ‘వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్... జయహో జగన్..’ నినాదాలతో ఏలూరు నగరం మార్మోగింది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరులో విద్యార్థి సాధికారత ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన ఈ ర్యాలీలో నగరంలోని పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల దినేష్‌రెడ్డి నేతృత్వంలో ఏలూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. తొలుత ఏలూరు జెడ్పీ కార్యాలయ ప్రాంతం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జీజీహెచ్ మీదుగా రామచంద్రరావుపేట వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న సీఎం జగన్: రాయుడు అంబటి రాయుడు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాటలు వేస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ‘ఆడుదాం–ఆంధ్ర’లో ప్రతి విద్యార్థి, యువత పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎంఆర్ పెద్దబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి భరత్‌రెడ్డి, ఏలూరు అధ్యక్షుడు ఏలూరు అంజి, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ వైఎన్వీ శివరావు తదితరులు పాల్గొన్నారు. -
అంబటి రాయుడు బైక్ ర్యాలీలో పాల్గొన్నారు
-
దేశంలో ఏ సీఎం చేయలేనిది జగన్ చేసారు: అంబటి రాయుడు
-
దేశంలో ఏ సీఎం చేయలేనిది జగన్ చేసారు అంబటి రాయుడు ప్రశంసలు
-
విశాఖలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ
-
‘ఆడుదాం ఆంధ్ర’పై అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: ఆడుదాం ఆంధ్ర పేరుతో విశాఖపట్నంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. విశాఖ వెస్ట్, నార్త్ నియోజక సమన్వయకర్తలు ఆడారి ఆనంద్, కేకే రాజు అధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. ఎన్ఏడీ నుంచి డీఎల్బీ గ్రౌండ్ వరకు భారీ బైక్ ర్యాలీ కొనసాగింది. బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ విచ్చేశారు. ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ.. ఆడుదాం ఆంధ్ర అద్భుతమైన కార్యక్రమం. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాన్ని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేపట్టలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రీడలను ప్రొత్సహించేందుకు అద్భుతమైన కార్యక్రమం తీసుకువచ్చారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ బయటపడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మంచి క్రీడాకారులకు మంచి ప్లాట్‌ఫామ్‌ను సీఎం జగన్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారుల ప్రతిభ బయటకు వస్తుంది. దీంతో, క్రీడాకారులను గుర్తించడమే కాకుండా వారికి కావాల్సిన ఖర్చులను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. సరైన అవకాశాలు లేక క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభ మరుగున పడిపోతోంది. ఆడుదాం ఆంధ్ర ద్వారామట్టిలో మాణిక్యాలను వెతికి తీయవచ్చు’ అంటూ కామెంట్స్ చేశారు. ( ఫైల్ ఫోటో ) మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. క్రీడలకు రాజకీయాలను ముడి పెట్టవద్దు. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెతికి తీయడం కోసమే ఆడుదాం ఆంధ్ర. ఓటు హక్కు లేని వారు కూడా ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో పాల్గొంటున్నారు. నాడు-నేడు ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు సీఎం జగన్ మేలు చేస్తున్నారు. మీరందరికి ఓట్లు లేవన్న సంగతి ప్రతిపక్షాలు గుర్తుపెట్టుకోవాలి అని అన్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ‘ఆడుదాం–ఆంధ్ర’ క్రీడా పోటీల విజేతలకు ప్రభుత్వం భారీగా నగదు బహుమతులు ప్రకటించింది. గ్రామ/వార్డు సచివాలయ స్థాయి నుంచి ఐదు దశల్లో పోటీలను నిర్వహించనుంది. ప్రతి దశలోనూ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడంతో పాటుగా విజేతలను సర్టిఫికెట్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించనుంది. క్రీడా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో 15ఏళ్లు పైబడిన వయస్కులు (మెన్, ఉమెన్) అందరూ పోటీల్లో భాగస్వాములయ్యేలా ‘ఓపెన్ మీట్’ను చేపడుతున్నది. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఐదు క్రీడా విభాగాలైన.. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, బ్యాడ్మింటన్ డబుల్స్‌లో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనుంది. మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ సాంప్రదాయ యోగా, టెన్నీకాయిట్, మారథాన్ పోటీలను ఏర్పాటు చేస్తోంది. -
అదే అతడి బలం.. టీమిండియా కెప్టెన్ కాగలడు: అంబటి రాయుడు
టీమిండియా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించాడు. రుతు ప్రతిభావంతుడని.. భవిష్యత్తులో భారత జట్టు కెప్టెన్ కాగల సత్తా ఉన్నవాడని పేర్కొన్నాడు. బీసీసీఐ అతడి సేవలను దీర్ఘకాలం పాటు ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు రాబట్టవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్ర కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్న రుతురాజ్ గైక్వాడ్.. బ్యాటర్‌గానూ అద్భుతంగా రాణిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ప్రపంచ రికార్డులు సాధిస్తున్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. టీమిండియా తరఫున వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో మూడో మ్యాచ్ సందర్భంగా సంచలన సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లోనే 100 పరుగుల మార్కును అందుకున్న రుతురాజ్ గైక్వాడ్.. 57 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ అంబటి రాయుడు ఓ పాడ్‌కాస్ట్ లో మాట్లాడుతూ ఒకప్పటి తన సహచర ఆటగాడు రుతు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ప్రస్తుతం భారత క్రికెట్ ఎక్కువగా ఉపయోగించుకుంటున్న ఆటగాడు ఎవరంటే రుతురాజ్ గైక్వాడ్ పేరు చెప్పొచ్చు. అతడు అత్యంత ప్రతిభావంతుడు. భవిష్యత్తులో జట్టుకు మరింత ఉపయోగపడతాడు. తనకున్న టాలెంటే తన బలం. షాట్ సెలక్షన్, అనుకున్న రీతిలో తన వ్యూహాలను అమలు పరిచే విధానం.. అన్నింటికీ మించి ఫిట్నెస్ విషయంలో శ్రద్ధ రుతును మరింత ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కూల్‌గా తన పని తాను చేసుకుపోతాడు. ఏం చేయాలో.. ఏం చేయకూడదో తనకు తెలుసు. సైలెంట్‌గా ఉంటూనే దూకుడు ప్రదర్శించగలడు. టీమిండియాకు దొరికిన విలువైన ఆటగాడు. ఇలా చెప్పడం తొందరపాటే అయినా.. ధోని భాయ్ రిటైర్ అయిన తర్వాత సీఎస్కే కెప్టెన్‌గా రుతుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో టీమిండియా సారథి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పటికే ఆసియా క్రీడల్లో జట్టును ముందుండి నడిపించాడు” అని అంబటి రాయుడు పేర్కొన్నాడు. కాగా చైనాలో జరిగిన ఏసియన్ గేమ్స్ లో కెప్టెన్‌గా వ్యవహరించిన రుతు భారత్‌కు స్వర్ణ పతకం అందించాడు. కాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా సారథిగా రోహిత్ శర్మ తర్వాత హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టనుండగా.. శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇప్పుడు రుతురాజ్ పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది. -
IPL 2024: అన్నంత పని చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఆ ముగ్గురిని వదిలించుకుంది
ఐపీఎల్ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ (నిలబెట్టుకోవడం), రిలీజ్ (వదిలించుకోవడం) ప్రక్రియకు ఇవాళ (నవంబర్ 26) ఆఖరి తేదీ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను, వదిలించుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అన్ని ఫ్రాంచైజీల కంటే ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ తాము వదిలించుకోబోయే ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ముందుగా అనుకున్న ప్రకారం సీఎస్కే ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు అల్విదా చెప్పింది. కోట్లు కుమ్మరించి కొనుక్కున్న బెన్ స్టోక్స్ (16.25 కోట్లు), అంబటి రాయుడు (6.75), కైల్ జేమీసన్‌ను (1 కోటి) వివిధ కారణాల చేత రిలీజ్ చేసింది. వీరితో పాటు సీఎస్కే మరో ఐదుగురికి కూడా గుడ్‌బై చెప్పింది. విదేశీ ఆటగాళ్లు డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు), సిసండ మగాల (50 లక్షలు)తో పాటు లోకల్ ప్లేయర్స్ ఆకాశ్ సింగ్ (20 లక్షలు), భగత్ వర్మ (20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతిలను (20 లక్షలు) సీఎస్కే రిలీజ్ చేసింది. ఈ ఎనిమిది మందిని రిలీజ్ చేశాక సీఎస్కే పర్స్‌లో 32.2 కోట్లు మిగిలాయి. ప్రస్తుతం ఆ జట్టుకు ఆరుగురిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. ఇందులో ముగ్గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. కెప్టెన్‌గా మళ్లీ ధోనినే.. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనిని రికార్డు స్థాయిలో 15వ సారి తమ కెప్టెన్‌గా ఎంపిక చేసింది. రిలీజ్ చేసే ఆటగాళ్ల జాబితాతో పాటు తాము నిలబెట్టుకునే ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించిన సీఎస్కే ముందుగా ధోని పేరును ప్రకటించి, అతడే 2024 సీజన్‌కు కూడా మా కెప్టెన్ అని స్పష్టం చేసింది. ధోని ఐపీఎల్ మొదలైనప్పటి (2008) నుంచి (మధ్యలో 2016, 2017 సంవత్సరాలు మినహా) సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ రిలీజ్ చేసిన ఆటగాళ్లు వీరే.. బెన్ స్టోక్స్ (16.25 కోట్లు) అంబటి రాయుడు (6.75 కోట్లు) కైల్ జేమీసన్ (కోటి) డ్వేన్ ప్రిటోరియస్ (50 లక్షలు) సిసండ మగాల (50 లక్షలు) ఆకాశ్ సింగ్ (20 లక్షలు) భగత్ వర్మ (20 లక్షలు) సుభ్రాన్షు సేనాపతి (20 లక్షలు) సీఎస్కే రీటైన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. ఎంఎస్ ధోని (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, షేక్ రషీద్, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, శివమ్ దూబే, నిషాంత్ సింధు, అజయ్ మండల్, రాజ్వర్ధన్ హంగార్గేకర్, దీపక్ చాహర్, మహీష తీక్షణ, ముకేశ్ చౌదరీ, ప్రశాంత్ సోలంకి, సిమ్రన్‌జీత్ సింగ్, తుషార్దేశ్ పాండే, మతీశ పతిరణ -
సీఎం జగన్ గురించి అంబటి రాయుడు గొప్ప మాటలు
-
ఏపీలో విద్యా వ్యవస్థ భేష్ అంబటి రాయుడు ప్రశంసలు
-
యువత ఎంచుకునే రంగలో రాణించాలి: అంబటి రాయుడు
-
విద్యారంగంలో ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చింది: అంబటి రాయుడు
-
వరల్డ్ కప్ లో టాప్ గేర్ లో దూసుకెళ్తున్న టీమ్ ఇండియా
-
సీఎం జగన్ ప్రభుత్వంపై అంబటి రాయుడు ప్రశంసల జల్లు
-
కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీ ప్రభుత్వ బడులు అద్భుతం: అంబటి రాయుడు
సాక్షి, తెనాలి : కార్పొరేట్ స్కూళ్ల కంటే ఏపీలోని ప్రభుత్వ స్కూళ్లలో సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కొనియాడారు. తెనాలి నియోజకవర్గం సంగం జాగర్లమూడిలోని రైతు భరోసా కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రభుత్వ పాఠశాలను రాయుడు పరిశీలించారు. విద్యార్థులు కూడా తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మకంతో ఉన్నారని తెలిపారు. ‘ఏపీలో స్కూళ్లలో ఉన్న సదుపాయాలు దేశంలో ఎక్కడా లేవు. మధ్యాహ్న భోజన పథకంలో ఇచ్చే ఆహారం రుచికరంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతోంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. వైద్య ఆరోగ్య రంగంలో ఏ రాష్ట్రం మన రాష్ట్రంతో సరితూగలేదు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులు ఆనందంగా ఉన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ప్రజలంతా ఆనందంగా ఉన్నారు’ అని రాయుడు అన్నారు. ఇదీచదవండి... ఎమ్మెల్యే డోల శ్రీబాలవీరాంజనేయస్వామికి ఝలక్ -
చంద్రబాబు జీవితమే అక్రమ రాజకీయం
సాక్షి, అమరావతి: చంద్రబాబు జీవితాంతం అన్యాయాలు, అక్రమాలు, మోసాలతోనే రాజకీయాలు చెలాయించారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సోమవారం ప్రశ్నోత్తరాల అనంతరం అసెంబ్లీలో మంత్రి మాట్లాడుతూ.. దేశంలో రాజకీయాలను డబ్బు మయం చేసిన వ్యక్తి చంద్రబాబేనని మండిపడ్డారు. ఇక్కడ దొరికినవి ఒకట్రెండు స్కామ్‌లేనని.., అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అనేక తప్పిదాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజా ఖజానా నుంచి డబ్బును విపరీతంగా దోచుకున్నారని చెప్పారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కుటుంబ సభ్యులూ ఏం మాట్లాడట్లేదన్నారు. కొడుకు ఢిల్లీలో కూర్చుంటే.. మద్దతిస్తానని వచి్చన వ్యక్తి ఎక్కడున్నారో తెలీదని, చంద్రబాబుకు మద్దతే కరవైందని ఎద్దేవా చేశారు. న్యాయస్థానం తగిన ఆధారాలతోనే చంద్రబాబు వేసిన ప్రతి పిటిషన్‌ను తిరస్కరిస్తోందని, కేసులో బలం, తీవ్రతకు ఇది అద్దం పడుతోందని చెప్పారు. దీనిద్వారా స్కిల్ స్కామ్‌పై ఆధారాలతో సహా దొరికిన దొంగ ఇక తప్పించుకోలేరన్న విషయం ప్రపంచానికి అర్థమైందన్నారు. ప్రభుత్వానికి రాజకీయంగా క్షక్ష సాధించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రెండు రోజుల విచారణలో సీఐడీకి చంద్రబాబు సహకరించలేదని, కోర్టుకు మాత్రం సహకరించానంటూ అసత్యాలు చెబుతున్నారని అన్నారు. అంతకుముందు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు ముగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత వాతావరణంలో సంపూర్ణంగా ప్రశ్నోత్తరాలు పూర్తవడం సంతోషంగా ఉందన్నారు. ప్రశ్నలు అడిగిన సభ్యులు సభలో ఉన్నా, లేకున్నా.. ప్రజలకు సమాధానాలు అందించడంలో సభ తన కర్తవ్యాన్ని నిష్పాక్షికంగా నెరవేర్చిందన్నారు. దీనికి మంత్రి అంబటి స్పందిస్తూ.. ప్రశ్నోత్తరాలు ప్రశాంతంగా జరగడం శుభ పరిణామమన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్షం సభలో లేకపోవడం బాధాకరమన్నారు. స్కిల్ స్కామ్‌పై చర్చించాల్సి వస్తుందనే భయంతోనే టీడీపీ సభ్యులు అసెంబ్లీలో రెండు రోజులు చిత్రవిచిత్ర విన్యాసాలు చేసి ఈలలు ఊదుకుంటూ పారిపోయారని అన్నారు. -
ముచ్చటగా 3 మ్యాచ్‌లు ఆడి ఇంటికొచ్చేసిన అంబటి రాయుడు
కరీబియన్ ప్రీమియర్ లీగ్-2023లో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రయాణం మూన్నాళ్ల ముచ్చటగా సాగింది. వ్యక్తిగత కారణాల చేత రాయుడు సీపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వచ్చేశాడు. ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ లీగ్ ఆడిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కిన రాయుడు.. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తూ మూడు మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో ఓ మ్యాచ్‌లో (తొలి మ్యాచ్) డకౌట్ కాగా.. మిగతా రెండిటిలో 32, 15 పరుగులు చేశాడు. 3 మ్యాచ్‌ల్లో రాయుడు 15.66 సగటున 117.50 స్ట్రయిక్‌రేట్‌తో 47 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఐపీఎల్ 2023 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు, భారత దేశవాలీ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రాయుడు బీసీసీఐతో బంధాన్ని తెంచుకుని కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. 37 ఏళ్ల రాయుడు ఐపీఎల్ 2023 ఎడిషన్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌లో సభ్యుడిగా ఉండిన విషయం తెలిసిందే. మరోవైపు అంబటి రాయుడుతో పాటు జింబాబ్వే పేస్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ కూడా కరీబియన్ ప్రీమియర్ లీగ్ నుంచి మధ్యలోనే నిష్క్రమించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కే ప్రాతినిథ్యం వహిస్తున్న ముజరబానీ కూడా వ్యక్తిగత కారణాలచే సీపీఎల్‌ను మధ్యలోనే వీడాడు. ఇతను కూడా రాయుడు లాగే మూడంటే మూడే మ్యాచ్‌లు ఆడాడు. ఈ 3 మ్యాచ్‌ల్లో అతను కేవలం ఒకే వికెట్ పడగొట్టి దారుణంగా విఫలమయ్యాడు. రాయుడు, ముజరబానీ జట్టును వీడటంతో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ వీరికి రీప్లేస్‌మెంట్‌గా ఇంగ్లండ్ ఆటగాళ్లు విల్ స్మీడ్, బెన్నీ హోవెల్లను తమ పంచన చేర్చుకుంది. వీరిలో స్మీడ్ విధ్వంసకర బ్యాటర్ కాగా.. హోవెల్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు. ఇదిలా ప్రస్తుత సీపీఎల్ ఎడిషన్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ ప్రదర్శన దారుణంగా ఉంది. ఆ జట్టు ఇంత వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. తొలి 2 మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆతర్వాత ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఎవిన్ లెవిస్ సేన ఓటమిపాలైంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో కొనసాగుతుంది. -
CPL 2023: రాణించిన రాయుడు.. అయినా..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భారత ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడు. సీపీఎల్-2023లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. గయానా వారియర్స్‌తో నిన్న (ఆగస్ట్ 25) జరిగిన మ్యాచ్‌లో ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అయితే రాయుడు రాణించినా అతని జట్టు సెయింట్ కిట్స్ మాత్రం ఓటమిపాలైంది. రాయుడుతో పాటు ఎవిన్ లెవిస్ (24 బంతుల్లో 48; ఫోర్, 6 సిక్సర్లు) చెలరేగాడు. సెయింట్ కిట్స్ ఇన్నింగ్స్‌లో రాయుడు, లెవిస్, జాషువ డిసిల్వ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. గయానా బౌలర్ గుడకేశ్ మోటీ (4-0-29-4) తన స్పిన్ మాయాజాలంతో సెయింట్ కిట్స్ పతనాన్ని శాశించాడు. మోటీకి ఇమ్రాన్ తాహిర్ (2/35), ఓడియన్ స్మిత్ (1/13), కీమో పాల్ (1/25), రొమారియో షెపర్డ్ (1/14), డ్వేన్ ప్రిటోరియస్ (1/12) సహకరించారు. అంతకుముందు గయానా తొలుత బ్యాటింగ్ చేస్తూ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. షాయ్ హోప్ (54) అర్ధసెంచరీతో రాణించగా.. సైమ్ అయూబ్ (31), హెట్‌మైర్ (26), కీమో పాల్ (25), రొమారియో షెపర్డ్ (25 నాటౌట్) పర్వాలేదనిపించారు. సెయింట్ కిట్స్ బౌలర్లలో ఓషేన్ థామస్ 3 వికెట్లు పడగొట్టగా.. డోమినిక్ డ్రేక్స్ 2, కాట్రెల్, నవీద్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సెయింట్ కిట్స్.. మోటీ ధాటికి 16.5 ఓవర్లలోనే (132 ఆలౌట్) చాపచుట్టేసింది. -
అయ్యో రాయుడు.. తొలి మ్యాచ్‌లోనే ఇలా? వీడియో వైరల్
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ అండ్ పేట్రియాట్స్ తరపున కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేశాడు. అయితే తన తొలి మ్యాచ్‌లోనే రాయుడు నిరాశపరిచాడు. గురువారం జమైకా తల్లావాస్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయుడు డకౌట్‌గా వెనుదిరిగాడు. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. సెయింట్స్ కిట్స్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన సల్మాన్ ఇర్షద్ బౌలింగ్‌లో రాయుడు భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అయితే బంతి ఎడ్జ్‌తీసుకుని థర్డ్‌మాన్ ఫీల్డర్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో ఇమాద్ వసీం క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో నిరాశతో రాయుడు మైదాన్ని వీడాడు. అతడు ఔట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయ్యో రాయుడు తొలి మ్యాచ్‌లోనే ఇలా జరిగిందేంటి అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా సీపీఎల్‌లో ఆడిన రెండో భారత ఆటగాడిగా రాయుడు నిలిచాడు. ఇక ఐపీఎల్-2023 తర్వాత అన్నిరకాల ఫార్మాట్లకు రాయుడు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఐదోసారి చెన్నైసూపర్ కింగ్స్ ఛాంపియన్స్‌గా నిలవడంలో రాయుడు కీలక పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్‌తో జరిగిన ఫైనల్లో రాయుడు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫైనల్లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఇక సీఎస్కే విజయంతో ఓ అరుదైన ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టులో భాగమైన రెండో ఆటగాడిగా చరిత్రకెక్కాడు. రాయుడు మొత్తంగా ఆరుసార్లు (ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3)టైటిల్స్ సాధించిన జట్లలో రాయుడు భాగంగా ఉన్నాడు. రాయుడు కంటే ముందు ఈ ఘనత సాధించిన జాబితాలో రోహిత్ శర్మ ముందన్నాడు. ఇక ఐపీఎల్లో 203 మ్యాచ్‌లు ఆడిన అంబటి.. 4348 పరుగులు చేశాడు. అతడి ఐపీఎల్ కెరీర్లో ఒక సెంచరీ ఉంది. చదవండి: Virat Kohli: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. Super Salman 🇵🇰 Salman Irshad takes the wickets of Ambati Rayudu, Andre Fletcher and Corbin Bosch in the same over 🤯 #CPL23 #SKNPvJT #CricketPlayedLouder #BiggestPartyInSport pic.twitter.com/eNS4sS2Kib — CPL T20 (@CPL) August 23, 2023 -
దుబాయ్ క్యాపిటల్స్‌లోకి వార్నర్, వుడ్.. అఫ్రిది, షాదాబ్ ఖాన్ మరో జట్టుతో..!
యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషన్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం ఆయా ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లు తమ పాత ఆటగాళ్లను కొందరిని రిటైన్ చేసుకోవడంతో పాటు కొత్తగా 50 మంది ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకున్నాయి. అబుదాబీ నైట్‌రైడర్స్ 8, డెజర్ట్ వైపర్స్ 6, దుబాయ్ క్యాపిటల్స్ 11, గల్ఫ్ జెయింట్స్ 5, ఎంఐ ఎమిరేట్స్ 8, షార్జా వారియర్స్ 12 మంది ఆటగాళ్లను తమ పంచన చేర్చుకున్నాయి. కొత్తగా లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చే వాళ్లలో డేవిడ్ వార్నర్ (దుబాయ్ క్యాపిటల్స్), మార్క్ వుడ్, షాదాబ్ ఖాన్ (డెజర్ట్ వైపర్స్), షాహీన్ అఫ్రిది (డెజర్ట్ వైపర్స్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (గల్ఫ్ జెయింట్స్), అంబటి రాయుడు (ఎంఐ ఎమిరేట్స్), కోరె ఆండర్సన్ (ఎంఐ ఎమిరేట్స్), మార్టిన్ గప్తిల్ (షార్జా వారియర్స్) లాంటి స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఆటగాళ్ల ఎంపిక సంబంధించిన మొత్తం తంతును ఆయా ఫ్రాంచైజీలు ఇవాళ (ఆగస్ట్ 21) పూర్తి చేశాయి. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. DP వరల్డ్ ILT20 సీజన్ 2 కోసం ఆయా ఫ్రాంచైజీ ఆటగాళ్ల పూర్తి జాబితా.. అబుదాబి నైట్ రైడర్స్ కొత్త ఆటగాళ్లు: బ్రాండన్ మెక్‌ముల్లెన్, డేవిడ్ విల్లీ, జేక్ లింటాట్, జోష్ లిటిల్, లారీ ఎవాన్స్, మైఖేల్ పెప్పర్, రవి బొపారా, సామ్ హైన్ రిటెన్షన్స్: అలీ ఖాన్, ఆండ్రీ రసెల్, చరిత్ అసలంక, జో క్లార్క్, సాబిర్ అలీ, సునీల్ నరైన్, మర్చంట్ డి లాంజ్, మతియుల్లా ఖాన్ డెజర్ట్ వైపర్స్ కొత్త ఆటగాళ్లు: ఆడమ్ హోస్, ఆజం ఖాన్, బాస్ డి లీడ్, మైఖేల్ జోన్స్, షాదాబ్ ఖాన్, షాహీన్ ఆఫ్రిది రిటెన్షన్స్: అలెక్స్ హేల్స్, అలీ నసీర్, కొలిన్ మున్రో, దినేష్ చండిమాల్, గుస్ అట్కిన్సన్, ల్యూక్ వుడ్, మతీష పతిరణ, రోహన్ ముస్తఫా, షెల్డన్ కాట్రెల్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, టామ్ కర్రన్, వనిందు హసరంగ దుబాయ్ క్యాపిటల్స్ కొత్త ఆటగాళ్లు: ఆండ్రూ టై, దసున్ షనక, డేవిడ్ వార్నర్, మార్క్ వుడ్, మాక్స్ హోల్డెన్, మొహమ్మద్ మొహ్సిన్, రహ్మానుల్లా గుర్బాజ్, నువాన్ తుషార, రోల్ఫ్ వాన్ డెర్ మెర్వ్, సదీర సమరవిక్రమ, సామ్ బిల్లింగ్స్ రిటెన్షన్స్: దుష్మంత చమీర, జో రూట్, రాజా అకిఫ్, రోవ్‌మన్ పావెల్, సికందర్ రజా గల్ఫ్ జెయింట్స్ కొత్త ఆటగాళ్లు: డొమినిక్ డ్రేక్స్, జోర్డాన్ కాక్స్, కరీం జనత్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, సౌరభ్ నేత్రవల్కర్ రిటెన్షన్స్: అయాన్ అఫ్జల్ ఖాన్, కార్లోస్ బ్రాత్‌వైట్, క్రిస్ జోర్డాన్, క్రిస్ లిన్, గెర్హార్డ్ ఎరాస్మస్, జేమ్స్ విన్స్, జేమీ ఓవర్టన్, రెహాన్ అహ్మద్, రిచర్డ్ గ్లీసన్, సంచిత్ శర్మ, షిమ్రాన్ హెట్‌మైర్ ఎంఐ ఎమిరేట్స్ కొత్త ఆటగాళ్లు: అకీల్ హోసేన్, అంబటి రాయుడు, కోరె అండర్సన్, కుశాల్ పెరీరా, నోస్తుష్ కెంజిగే, ఓడియన్ స్మిత్, విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలాంఖైల్ రిటెన్షన్స్: ఆండ్రీ ఫ్లెచర్, డేనియల్ మౌస్లీ, డ్వేన్ బ్రేవో, ఫజల్ హాక్ ఫారూకీ, జోర్డాన్ థాంప్సన్, కీరన్ పొలార్డ్, మెక్కెన్నీ క్లార్క్, ముహమ్మద్ వసీమ్, నికోలస్ పూరన్, ట్రెంట్ బౌల్ట్, విల్ స్మీడ్, జహూర్ ఖాన్ షార్జా వారియర్స్ కొత్త ఆటగాళ్లు: క్రిస్ సోల్, డేనియల్ సామ్స్, దిల్షన్ మధుశంక, జేమ్స్ ఫుల్లర్, జాన్సన్ చార్లెస్, కుశాల్ మెండిస్, లూయిస్ గ్రెగొరీ, మహేశ్ తీక్షణ, మార్క్ వాట్, మార్టిన్ గప్తిల్, సీన్ విలియమ్స్, కైస్ అహ్మద్ రిటెన్షన్స్: క్రిస్ వోక్స్, జో డెన్లీ, జునైద్ సిద్ధిక్, మార్క్ దెయాల్, ముహమ్మద్ జవాదుల్లా, టామ్ కోహ్లర్-కాడ్మోర్ -
మళ్లీ ముంబై ఇండియన్స్ గూటికి అంబటి రాయుడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు మరోసారి ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో చేరాడు. 2010 నుంచి 2017 వరకు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రాయుడు.. యూఏఈ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 (2024) కోసం మళ్లీ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఎంఐ ఎమిరేట్స్‌గా బరిలోకి దిగే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ, వచ్చే సీజన్ కోసం 8 మంది కొత్త ఆటగాళ్లతో డీల్ కుదుర్చుకుంది. వీరిలో రాయుడుతో పాటు కోరె ఆండర్సన్ (న్యూజిలాండ్), ఓడియన్ స్మిత్ (వెస్టిండీస్), అకీల్ హొసేన్ (వెస్టిండీస్), కుశాల్ పెరీరా (శ్రీలంక) లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. వీరితో పాటు శ్రీలంక యువ ఆటగాడు విజయకాంత్ వియాస్కాంత్, వకార్ సలామ్‌కీల్, నోష్తుష్ కెంజిగే లాంటి కొత్త ఆటగాళ్లు కూడా ఎంఐ ఫ్యామిలీలో చేరారు. పై పేర్కొన్న 8 మంది చేరికతో ఎంఐ ఎమిరేట్స్ జట్టు సంఖ్య 20కి చేరింది. ఇక ఎంఐ ఫ్యామిలీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల విషయానికొస్తే.. ఎంఐ ఎమిరేట్స్ 12 మంది పాత వారిని తిరిగి తమతో చేర్చుకుంది. విండీస్ ఆటగాళ్లు కీరన్ పోలార్డ్, డ్వేన్ బ్రావో, నికోలస్ పూరన్, ఆండ్రీ ఫ్లెచర్, న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఫజల్ హక్ ఫారూఖీ, ముహ్మమద్ వసీం, జహూర్ ఖాన్, జోర్డన్ థాంప్సన్, విలియమ్ స్మీడ్, మెక్కెన్నీ క్లార్క్, డేనియల్ మోస్లీలను ఎంఐ ఎమిరేట్స్ తిరిగి రిటైన్ చేసుకుంది. కాగా, ఇంటర్నేషనల్ లీగ్ టీ20 సీజన్-2 వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరీబియన్ లీగ్ 2023లో రాయుడు.. ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం కొద్ది కాలంపాటు గ్యాప్ తీసుకుని, ప్రస్తుతం జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. ఈ లీగ్‌లో రాయుడు సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న రెండో భారత క్రికెటర్‌గా రాయుడు రికార్డుల్లోకెక్కాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. -
కరీబియన్ ప్రీమియర్ లీగ్ బరిలోకి అంబటి రాయుడు.. రేపే ముహూర్తం
టీమిండియా మాజీ క్రికెటర్, ఐపీఎల్ సూపర్ స్టార్ అంబటి తిరుపతి రాయుడు కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అధికారికంగా జాయిన్ అయ్యాడు. రేపు (ఆగస్ట్ 19) ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌తో సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్ తరఫున సీపీఎల్ అరంగేట్రం చేయనున్నాడు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ ట్రిస్టన్ స్టబ్స్‌కు ప్రత్యామ్నాయంగా రాయుడు రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. దీంతో ప్రవీణ్ తాంబే తర్వాత కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు. 2020 సీజన్లో ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరఫున సీపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. Awesome to be back on the park.. excited to be a part of the @sknpatriots and the @CPL.. pic.twitter.com/dsHC4xtsi8 — ATR (@RayuduAmbati) August 17, 2023 సీపీఎల్‌లో తన తొలి మ్యాచ్‌కు ముందు రాయుడు తన ట్విటర్ ఖాతా ద్వారా ఓ మెసేజ్ షేర్ చేశాడు. మళ్లీ బ్యాట్ పట్టి బరిలోకి దిగడం అద్భుతంగా ఉంది.. కరీబియన్ లీగ్‌లో, ముఖ్యంగా సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌లో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉందంటూ పేట్రియాట్స్ జెర్సీలోని తన ఫోటోను షేర్ చేశాడు. ఇదిలా ఉంటే, 2023 సీజన్ తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. ఇటీవల అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగుతాడని అంతా అనుకున్నారు. అయితే, ఏదో బలమైన కారణం చేత రాయుడు ఆ లీగ్‌లో ఆడలేకపోయాడు. మరోవైపు రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడనే ప్రచారం కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. -
అంబటి రాయుడు కీలక నిర్ణయం.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఆంధ్ర ఆటగాడు
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరోసారి అభిమానలను అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ నెల ఆఖరిలో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయుడు బరిలోకి దిగనునున్నాడు. ఈ లీగ్‌లో సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుకు రాయుడు ప్రాతినిథ్యం వహించనున్నాడు. తద్వారా సీపీఎల్‌లో ఆడనున్న రెండో భారత క్రికెటర్‌గా అంబటి రికార్డులకెక్కనున్నాడు. అంతకముందు 2020 సీజన్లో భారత స్పిన్నర్ ప్రవీణ్ తాంబే ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ తరపున సీపీఎల్‌లో ఆడాడు. అయితే బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం సీపీఎల్‌లో ఆడేందుకు రాయుడుకు అటంకం కలిగే ఛాన్స్ ఉంది. కూలింగ్ ఆఫ్ పీరియడ్ రూల్ ప్రకారం.. ఇటీవల కాలంలో రిటైర్డ్ అయిన భారత క్రికెటర్లు ఇతర దేశాల ప్రాంఛైజీ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగం కాకుడదు. ఈ నిబంధన కారణంగానే అమెరికా వేదికగా జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్లో భాగం కాలేదు. లేదంటే ఈ ఏడాది సీజన్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు తరపున రాయుడు ఆడాల్సింది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత అన్నిఫార్మాట్ల క్రికెట్ నుంచి రాయుడు తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక సెయింట్ కిట్స్ ఫ్రాంచైజీతో కుదుర్చుకోవడంపై రాయుడు స్పందించాడు. సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ జట్టుతో జత కట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది సీపీఎల్‌లో సెయింట్ కిట్స్‌కు నావంతు సహకారం అందిస్తానని రాయుడు పేర్కొన్నాడు. కాగా సీపీఎల్-2023 సీజన్ ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో నాలుగో టీ20.. గిల్‌పై వేటు! విధ్వంసకర ఆటగాడికి మరో ఛాన్స్ -
చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ అతడే: అంబటి రాయుడు
ఐపీఎల్లో ధోని తర్వాత చెన్నైసూపర్ కింగ్స్ కెప్టెన్ ఎవరన్న విషయంపై చాలా రోజుల నుంచి చర్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఎందుకంటే వచ్చే ఏడాది సీజన్లో ధోని ఆడుతాడో లేదో కచ్చితంగా తెలియదు. వచ్చే సీజన్లో ఆడేది, ఆడకపోవడం తన ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం మిస్టర్ కూల్ సృష్టం చేశాడు. ఈ నేపథ్యంలో సీఎస్కే తదుపరి కెప్టెన్ రుత్‌రాజ్ గైక్వాడ్ అవుతాడని ఆ జట్టు మాజీ ఆటగాడు అంబటి రాయుడు జోస్యం చెప్పాడు. "రుత్‌రాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఆటగాడు. అదే విధంగా అతడికి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. నాకు తెలిసి మహీ బాయ్ మరో సీజన్ ఆడుతాడు. కాబట్టి భవిష్యత్తులో రుత్‌రాజ్ కచ్చితంగా చెన్నై సారధి అవుతాడు. అతడు 7 నుంచి 8 ఏళ్ల పాటు సీఎస్కేకు కెప్టెన్‌గా ఉండగలడు. రుతు ఇప్పటికే ధోని, హెడ్‌కోచ్ ఫ్లెమింగ్ నేతృత్వంలో రాటుదేలాడు. ఇక అతడు భారత జట్టు తరపున కూడా అన్ని ఫార్మాట్లలో అదరగొడతాడు. కానీ జట్టు మెనెజ్‌మెంట్ కూడా తగినన్ని అవకాశాలు ఇవ్వాలి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు పేర్కొన్నాడు.కాగా రుత్‌రాజ్ ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నాడు. విండీస్‌తో టెస్టు, వన్డే జట్టులో రుత్‌రాజ్‌కు చోటు దక్కింది. కానీ టెస్టు సిరీస్‌లో మాత్రం అతడికి ఆడే అవకాశం రాలేదు. చదవండి: Deodhar Trophy 2023: క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్.. చూస్తే మైండ్ బ్లాంక్! వీడియో వైరల్ -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అంబటి రాయుడు అదిరిపోయే కౌంటర్
-
బురద చల్లుతూనే ఉంటారు.. పట్టించుకోవద్దు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల -
రాయుడు రిటైర్ అయ్యాడు.. మీకు తప్పకుండా జట్టులో చోటిస్తాం.. కానీ: ధోని
MS Dhoni Hilarious Response Over Yogi Babu Wanting To Join CSK: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. ఆఫ్ ది ఫీల్డ్ అంతే సరదాగా ఉంటాడు. ఆటలో కెప్టెన్సీ నైపుణ్యాలతో ఆకట్టుకునే తలా.. ప్రస్తుతం సినీ నిర్మాతగా కొత్త అవతారమెత్తిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో పెనవేసుకున్న బంధాన్ని మరింత పదిలం చేసుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో ధోని ఎంటర్టైన్మెంట్ పేరిట నిర్మాణ రంగంలోకి దిగాడు. లెట్స్ గెట్ మ్యారీడ్ తమ బ్యానర్‌పై తెరకెక్కిన తొలి సినిమా LGM (Let's Get Married) ట్రైలర్, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. చెన్నైలో జరిగిన ఈ ఈవెంట్లో ధోని, అతడి సతీమణి సాక్షి తమ చేతుల మీదుగా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. LGMలో నటించిన హరీశ్ కళ్యాణ్, నదియా, ఇవానా, కమెడియన్ యోగిబాబు, ఆర్జే విజయ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎస్కేకు ఆడాలని ఉంది ఈ సందర్భంగా యోగిబాబు తనదైన శైలిలో హాస్యం పండించాడు. అంతేకాదు తనకు చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగం కావాలని ఉందంటూ తన మనసులో ఉన్న కోరికను ధోని ముందు బయటపెట్టాడు. ఇందుకు ధోని కూడా అంతే సరదాగా స్పందించాడు. ‘‘రాయుడు రిటైర్ అయ్యాడు. కాబట్టి సీఎస్కేలో మీకు తప్పకుండా చోటు ఉంటుంది. మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. కానీ మీరిప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నారు కదా!నేనైతే మీరు ఎల్లప్పుడు జట్టుతో ఉంటూ నిలకడగా ఆడాలని కోరుకుంటా. కానీ వాళ్లు మాత్రం ఫాస్ట్ బౌలింగ్‌తో మిమ్మల్ని గాయపరుస్తారు మరి జాగ్రత్త’’ అని తలా యోగిబాబుకు బదులిచ్చాడు. దీంతో అక్కడ నవ్వులు పూశాయి. రాయుడు అరుదైన ఘనత అంబటి రాయుడు ఐపీఎల్-2023 తర్వాత క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ ఎడిషన్‌లో చెన్నై టైటిల్ గెలిచి ఏకంగా ఐదోసారి చాంపియన్‌గా నిలవడంతో రాయుడు అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్లో మొత్తంగా ఆరుసార్లు(ముంబై ఇండియన్స్ తరఫున 3, సీఎస్కే తరఫున 3) విజేతగా నిలిచిన జట్టులో భాగమైన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ముంబై సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. చదవండి: సిక్సర్ల రింకూ.. ఎక్కడా తగ్గేదేలే! వీడియోతో సెలక్టర్లకు దిమ్మతిరిగేలా! తల్లిదండ్రుల కష్టం ఏమిటో అర్థం చేసుకోలేని స్థితిలోనూ! శెభాష్ బిడ్డా.. -
అంబటి రాయుడు కీలక నిర్ణయం..
న్యూఢిల్లీ: ఐపీఎల్‌నుంచి రిటైర్మెంట్ ప్రకటించి త్వరలో అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)లో పాల్గొనేందుకు సిద్ధమైన అంబటి రాయుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. అతను ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్‌కే చెందిన టెక్సాస్ సూపర్ కింగ్స్‌కు రాయుడు ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. ‘వ్యక్తిగత కారణాలతో రాయుడు తొలి ఎంఎల్‌సీలో పాల్గొనడం లేదు’ అని టెక్సాస్ టీమ్ ప్రతినిధి ప్రకటించారు. అయితే విదేశీ లీగ్‌లలో పాల్గొనే విషయంలో బీసీసీఐ తాజాగా చేసిన ప్రతిపాదన అతను ఆడకపోవడానికి కారణం కావచ్చు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’ ముగిసిన తర్వాతే వారిని అనుమతించాలని బోర్డు భావిస్తోంది. అధికారికంగా నిబంధన అమల్లోకి రాకపోయినా ఇదే కారణంతో రాయుడు వెనక్కి తగ్గినట్లు సమాచారం. -
కంగ్రాట్స్ తిలక్.. అక్కడ కూడా దుమ్మురేపాలి: రాయుడు
వెస్టిండీస్ టీ20 సిరీస్‌కు హైదారాబాద్ యువ ఆటగాడు తిలక్ వర్మ ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో తిలక్ వర్మకు చోటు దక్కింది. కొన్నేళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తూ.. ఐపీఎల్లో చెలరేగడంతో తిలక్ వర్మకు సెలెక్టర్లు పిలుపునిచ్చారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలో కూడా తిలక్ వర్మ అద్బుతమైన ప్రదర్శరన కనబరిచాడు. గతేడాది సీజన్లో 14 మ్యాచ్‌లాడిన తిలక్.. 36.09 సగటుతో 303 పరుగులు చేసి ముంబై తరఫున రెండో అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్లో కూడా అతడు అదరగొట్టాడు. 11 మ్యాచ్‌ల్లో 42.87 సగటుతో 343 పరుగులు సాధించాడు. ఇక తొలిసారి భారత జట్టుకు ఎంపికైన తిలక్ వర్మకు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు అభినందనలు తెలిపాడు. "భారత జట్టుకు ఎంపికైనందుకు హృదయపూర్వక అభినందనలు. ప్రతీ ఫార్మాట్లో టీమిండియా తరపున అద్భుతంగా రాణిస్తావని ఆశిస్తున్నాను. ఆల్‌ది బెస్ట్ తిలక్" అంటూ రాయుడు ట్వీట్ చేశాడు. అదే విధంగా టీమిండియా విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మ ఎంపికపై స్పందిచాడు. "తొలిసారి భారత టీ20 జట్టుకు ఎంపికైనందుకు అభినందనలు. తిలక్ జట్టులోకి రావడం పట్ల చాలా సంతోషంగా ఉన్నా. అతనితో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా" అని సూర్య ట్విటర్లో పేర్కొన్నాడు. విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. Hearty congratulations @TilakV9 on being picked for the Indian team.. I am sure you will have a super career in every format for India.. wishing you all the very best.. — ATR (@RayuduAmbati) July 6, 2023 చదవండి: IND vs WI: అతడిని ఎందుకు సెలక్ట్ చేశారు.. ఏం చేశాడని! పాపం రుత్‌రాజ్ -
విద్యారంగంలో ప్రభుత్వం మంచి మార్పులు తీసుకొచ్చింది
-
అందుకే సీఎం జగన్‌ను కలిశాను.. రైతులు సంతోషంగా ఉన్నారు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: విద్యారంగంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంచి మార్పులు తీసుకువచ్చిందని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఎంతో బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు కూడా గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా.. తెనాలి రూరల్ మండలం కొలకలూరులో రైతు భరోసా కేంద్రాన్ని(ఆర్బీకే) పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన.. రైతులతో కాసేపు ముచ్చటించారు. రైతులు సంతోషంగా ఉన్నారు ‘‘రైతు భరోసా కేంద్రాలను పరిశీలించాను. అన్ని ప్రాంతాలు తిరిగి విషయాలు తెలుసుకుంటున్నాను. రైతులందరూ ప్రభుత్వపరంగా తమకు మంచి మద్దతు అందుతుందని చెప్తున్నారు. తాము సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు’’ అని అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న చర్యలు బాగున్నాయన్నారు. అందుకే సీఎం జగన్‌ను కలిశాను విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని కొనియాడారు. ఇక స్పోర్ట్స్ గురించి మాట్లాడేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశానన్న అంబటి రాయుడు.. రాష్ట్రంలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పినట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయాలని తమ తాత నుంచి నేర్చుకున్నానన్న అంబటి రాయుడు.. గత కొన్నాళ్లుగా ప్రజలతో మమేకమవుతూ పర్యటనలు చేస్తున్నారు. అరుదైన ఘనత కాగా ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అంబటి రాయుడు.. ఆ జట్టు ట్రోఫీ గెలవడంతో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ముంబై ఇండియన్స్, సీఎస్కేకు ఆడిన రాయుడు.. ఏకంగా ఆరుసార్లు టైటిల్ చాంపియన్‌గా నిలిచాడు. ముంబై మూడు, చెన్నై మూడుసార్లు విజేతగా నిలిచిన సందర్భాల్లో జట్టులో భాగమై.. రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. చదవండి: గుంటూరులో క్రికెటర్ అంబటి, ప్రజలతో మమేకం, త్వరలో ప్రకటన -
మాజీ సెలెక్టర్ MSK ప్రసాద్‌తో విభేదాలపై స్పందించిన రాయుడు
-
AP: ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడా సంబురాలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో క్రీడలు, యువజన సర్వీసులశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా క్రీడా సంబురాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రతీ ఏటా ఈ ఆటల పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. అంబటి రాయుడు, కేఎస్ భరత్ సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. పోటీల కోసం ప్రతీ మండలంలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామం/వార్డు, మండల, నియోజకవర్గం, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబాడీ, ఖో–ఖో పోటీలు నిర్వహిస్తారు. బాలురు, బాలికలకు పోటీలతో పాటుగానే, 3 కి.మీ మారథాన్, యోగా, టెన్నీకాయిట్, సంప్రదాయ ఆటల పోటీలు ప్రభుత్వం నిర్వహించనుంది. సచివాలయాల స్థాయిలో మొదలుకుని, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మొత్తం 46 రోజులపాటు ఆటలు కొనసాగుతాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీ గ్రౌండ్లు, మున్సిపల్ స్టేడియంలు, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూనివర్సిటీ గ్రౌండ్లు తదితర మైదానాల్లో పోటీలు జరుగనున్నాయి. సీఎం జగన్ ఏమన్నారంటే.. – ప్రతిఏటా కూడా ఈ ఆటల పోటీలు నిర్వహించాలి: – క్రికెట్ లాంటి ఆటలో సీఎస్కే మార్గదర్శకం చేస్తుంది, నిర్వహణలో పాల్గొంటారు. – భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ లాంటి జట్టు సహాయం కూడా తీసుకుంటాం. – ప్రస్తుతం చెన్నై సూపర్‌కింగ్స్‌కు మూడు క్రికెట్ స్టేడియంలలో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తాం. – భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం దిశగా ముందుకుసాగాలి. – దీనివల్ల ప్రొఫెషనలిజం బాగా పెరుగుతుంది. – అంబటిరాయుడు, కేఎస్ భరత్ లాంటి వాళ్లు రాష్ట్రంలోని యువకులకు స్ఫూర్తిదాయకులు. – వీరి సేవలను మనం వినియోగించుకోవాలి. – మొదట జిల్లాస్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో ప్రొఫెషనల్‌గా క్రికెట్ ఆడించే పరిస్థితి ఉండాలి. – ప్రస్తుతం నిర్వహిస్తున్న పోటీలకోసం ప్రతి మండలంలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలి. – ఈ పోటీల్లో మండలస్థాయికి వచ్చేసరికి ప్రొఫెషనలిజానికి ప్రాధాన్యత ఇవ్వాలి. – గ్రామస్థాయిలో ఆడేవారికి కూడా క్రీడా సామగ్రిని అందించాలి. – ఆటల్లో గెలిపొందిన వారికి బహుమతులతో పాటు కీడ్రా సామగ్రితో కూడిన కిట్లను కూడా అందించాలి. – భవిష్యత్తులో సచివాలయానికి కూడా క్రీడా సామగ్రితో కూడిన కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలి. – ప్రభుత్వ పాఠశాలల్లో కూడా క్రీడా సామగ్రిని ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలి. – హైస్కూల్ ఆ పైస్థాయిలో తప్పనిసరిగా క్రీడాసామగ్రిని ఏర్పాటు చేయాలి. – ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలి. – భవిష్యత్తులో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేయాలి. దీనిపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, క్రీడలు, యువజన సర్వీసులుశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జి.వాణీమోహన్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఎస్‌ఎఎపీ) ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధరెడ్డి, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ వీసీ అండ్ ఎండీ కె.హర్షవర్ధన్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇది కూడా చదవండి: మారుమూల ప్రాంతాలకు 4జీ సేవలు, జియో టవర్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్ -
వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు
2019 వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. నాటి సెలెక్షన్ కమిటీలోని కీలక సభ్యుడితో తనకు మనస్పర్దలు ఉండేవని, అతనితో కలిసి క్రికెట్ ఆడే రోజుల్లో విభేదాలు ఏర్పడ్డాయనని, నన్ను వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేయకపోవడానికి అదే కారణం అయ్యుండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఓ లోకల్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయుడు ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, నాటి జాతీయ సెలెక్టర్లైన ఎంఎస్కే ప్రసాద్ (చీఫ్ సెలెక్టర్), దేవాంగ్ గాంధీ, శరణ్‌దీప్ సింగ్, గగన్ ఖోడా, జతిన్ పరంజపేలు.. అప్పటి ఐపీఎల్ సీజన్లో టాప్ ఫామ్‌లో ఉండిన రాయుడును కాదని త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను 2019 వన్డే వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ వరల్డ్‌కప్‌లో రాయుడు స్థానంలో టీమిండియాకు ఎంపికైన విజయ్ శంకర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ అంశంపై అప్పట్లో పెద్ద చర్చలే జరిగాయి. రాయుడు సైతం సెలెక్టర్ల వైఖరిని బహిరంగంగా విమర్శించాడు. ఫామ్‌లో ఉన్న తనను ఎంపిక చేయకపోవడంతో మనస్థాపం చెందిన రాయుడు.. ఉన్నపలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఆ తర్వాత తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియా అవకాశాలు దక్కలేదు. ఇదిలా ఉంటే, అంబటి రాయుడు ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023 సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌కు కూడా వీడ్కోలు పలికేశాడు. సీఎస్కే టైటిల్ గెలిచిన జట్టులో రాయుడు సభ్యుడిగా ఉన్నాడు. ఇటీవలే అతను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా కలిశాడు. రాయుడు తన రాజకీయ అరంగేట్రం కోసమే ఏపీ సీఎం చుట్టూ తిరుగుతున్నాడని ప్రచారం జరుగుతుంది. -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. అంబటి రాయుడితో పాటు సీఎస్కే ఫ్రాంచైజీ ఓనర్ ఎన్.శ్రీనివాసన్ కుమార్తె రూపా గురునాథ్ కూడా సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఇటీవల తమ జట్టు గెలిచిన ఐపీఎల్ 2023 ట్రోఫీని సీఎంకు చూపించారు. ఈ సందర్భంగా ఏపీలో క్రీడారంగం అభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం జగన్‌కు అంబటి రాయుడు వివరించారు. వారి సూచనల మేరకు పటిష్టమైన కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఐపీఎల్లో అంబటి రాయుడు ప్రాతినిధ్యం వహించిన సీఎస్కే ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించి, ఐదో సారి విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫైనల్ మ్యాచ్ ఆడి రాయుడు ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికాడు. కాగా, రాయుడు.. సీఎం జగన్ కలవడం ఇటీవలికాలంలో ఇది రెండోసారి. ఐపీఎల్ ఫైనల్‌కు ముందు కూడా రాయుడు ఓసారి సీఎంను కలిశారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు.- మిడుతూరి జాన్ పాల్, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు -
అంబటి రాయుడికి ట్విస్ట్ ఇచ్చిన బీసీసీఐ అనిల్ కుంబ్లే షాకింగ్ రియాక్షన్..!
-
అంబటి రాయుడు: లగ్జరీ కార్లు, ఇల్లు, బిజినెస్,నెట్‌వర్త్ గురించి తెలుసా?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్‌తో జరగబోయే ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ అని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ సందర్బంగా అంబటి రాయుడు ఏం చేయబోతున్నాడు. అతని ఆస్తి, నికర విలువ ఎంత అనే అంశాలపై ఆసక్తి నెలకొంది. (యాపిల్ లవర్స్ బీ రెడీ: రూ. 8,900కే యాపిల్ ఐప్యాడ్) ఫ్యాన్స్ అభిమానంగా రాయుడు అని పిలుచుకునే ఆల్ రౌండర్‌గా అత్యుత్తమ ప్రదర్శనతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. భారత క్రికెట్ జట్టులో రైట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ,రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్‌గా క్రికెట్లోకి ప్రవేశించాడు. 2010లో ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి సుదీర్ఘకాలం అంటే 2017 దాకా ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2013 సీజన్లో ఐపీఎల్ టైటిల్ సాధనలోనూ, ఆ తరువాత 2018లో సీఎస్కే జట్టులోకి మారిన తరువాత 2018, 2021లో టైటిల్ గెలిచిన కీలక ఆటగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. (IPL 2023 విజేత, కెప్టెన్ ఎంఎస్ ధోని నెట్‌వర్త్ ఎంతో తెలుసా?) నికర విలువు అంబటి రాయుడు మొత్తం నికర విలువ దాదాపు రూ. 50 కోట్లు. సంవత్సరానికి రూ 7 కోట్లకు పైనే. ఐపీఎల్ ద్వారా లభించిన ఫీజు 6.25కోట్లు. లగ్జరీ కార్ల విలువ 1.5 నుంచి 2 కోట్ల రూపాయలు. అలాగే బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కోటి దాకా ఆర్జిస్తాడనేది తాజా నివేదికలద్వారా తెలుస్తోంది. (CSK ఓనరు, నికర విలువ ఎంత? ఈ విషయాలు తెలుసా?) అంబటి రాయుడు ఇల్లు కార్లు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లగ్జరీ డిజైనర్ ఇల్లు ఉంది. అలాగే దేశవ్యాప్తంగా అనేక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ అనంతగరిలో రిసార్ట్ బిజినెస్, సిద్దిపేట వైపు ఫార్మింగ్ బిజినెస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. అధిక బ్రాండ్ వాల్యుయేషన్ కారణంగా గత కొన్నేళ్లుగా అంబటి రాయుడు నికర విలువ 40 శాతం పెరిగిందట. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా రాయుడి నికర ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుందనేది నిపుణుల మాట. వ్యవసాయ చేసుకుంటూ ఫామ్‌హౌస్‌లో ఎక్కువ సమయం గడుపుతానని ఒక ఇంటర్వ్యూలో అంబటి చెప్పినప్పటికీ ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పిన తరువాత ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న నేపథ్యంలో రాజకీయాల్లో చేరతాడనే ఊహాగానాలున్నాయి. కార్లు : రూ. 1.5 నుంచి 2 కోట్లు అంబటి రాయుడు కార్ల కలెక్షన్ చాలా చిన్నది. అయినా ఆడి కారుతోపాటు ప్రపంచంలోని ది బెస్ట్ లగ్జరీ కార్లు కొన్ని అంబటి రాయుడు సొంతం. కరియర్ 2004 అండర్-19 ప్రపంచకప్‌లో అంబటి రాయుడు కెప్టెన్ ఇంగ్లండ్‌పై అజేయంగా 177 పరుగులు చేసి టైటిల్ సాధించాడు వయసు కేవలం 16 ఏళ్లు. ఇక అప్పటినుంచి మరో సచిన్ పేరు తెచ్చుకున్నాడు.తరువాత హైదరాబాద్ దేశవాళీ జట్టుకు ఎంపిక, కేవలం 17 సంవత్సరాల వయస్సులో నే ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు . భారత జట్టులో ఎంపికై 2013లో జింబాబ్వేపై మ్యాచ్‌లో రావడం 63 పరుగులతో అజేయంగా పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్లో 203 ఐపీఎల్ మ్యాచులాడిన రాయుడు. 127.26 స్ట్రైక్‌రేట్‌తో 4,329 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 1985, సెప్టెంబర్ 23న గుంటూరులో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు అంబటి రాయుడు. 1992లో మూడో తరగతి చదువుతున్నప్పుడే రాయడిని తండ్రి హైదరాబాద్‌లోని విజయ్ పాల్ క్రికెట్ అకాడమీలో చేర్చించారు. 14 ఫిబ్రవరి 2009న తన స్నేహితురాలు విద్యను పెళ్లి చేసుకున్నాడు రాయుడు. ఈ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
అది చాలా పెద్ద తప్పు.. అంబటి రాయుడికి అన్యాయం చేశారు: కుంబ్లే
భారత మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు అంబటి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం తన ఐపీఎల్ కెరీర్‌కు రాయుడు ముగింపు పలికాడు. కాగా ఐపీఎల్లో రాయుడు ఆరు టైటిల్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు టైటిల్స్ ముంబై ఇండియన్స్ తరపున సాధించగా.. మరో మూడు టైటిల్స్ సీఎస్కే తరపున గెలుచుకున్నాడు. ఇక ఐపీఎల్ విషయాన్ని పక్కన పెడితే.. రాయుడి వంటి అద్భుతమైన టాలెంట్ ఉన్న ఆటగాడికి బీసీసీఐ మాత్రం అన్యాయం చేసిందనే చెప్పుకోవాలి. భారత్ తరపున రాయుడు కేవలం 55 వన్డేలు, ఆరు టీ20లు మాత్రమే ఆడాడు. 2018-19 మధ్య కాలంలో భారత జట్టులో నాలుగో స్థానంలో సరైన ఆటగాడు లేని లోటు సృష్టంగా కన్పించింది. Throw back to an india -A game which was almost 2 decades ago.. when you see that 99% of the guys you have played with are either commentators, coaches,mentors and some politicians..you realise that it’s been quite a journey but the end is near.. 😂 pic.twitter.com/qm7iX7HCrV— ATR (@RayuduAmbati) May 3, 2023 ఈ సమయంలో రాయుడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతంగా రాణించాడు. దీంతో భారత జట్టు కష్టాలు తీరి పోయాయి అని, నాలుగో స్ధానానికి సరైన ఆటగాడు దొరికాడని అంతా భావించారు. ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్‌లో రాయుడు అడుతాడని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే అస్సలు ట్విస్ట్ చోటుచేసుకుంది. 2019 వన్డే ప్రపంచకప్‌కు రాయుడును కాదని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ క్రమంలో తనను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర నిరాశ చెందిన రాయుడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అయితే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ భారత్ తరపున ఆడే అవకాశం రాలేదు. ఇక ఇదే విషయంపై తాజాగా టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. "రాయుడు 2019 ప్రపంచకప్ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అది సెలక్షన్ కమిటీతో పాటు జట్టు మేనెజ్మెంట్ చేసిన పెద్ద తప్పు. అతడిని నాలుగో స్థానం కోసం సిద్ధం చేశారు. అటువంటిది ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. అది చాలా ఆశ్చర్యం కలిగించింది" అని ఐపీఎల్ ఫైనల్ తర్వాత జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లి, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నారు. చదవండి: WTCFinal2023: ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టిన ఆ ఐదుగురు! ఫోటోలు వైరల్ -
అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు
-
'అచ్చం నాలాగే.. రాయుడుకు ఆ అలవాటు లేదు'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ అనంతరం సీఎస్కే స్టార్ అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా సీఎస్కేలో అంబటి రాయుడు కీలకపాత్ర పోషించాడు. గతంలో సీఎస్కే టైటిల్స్ సాధించడంలోనూ రాయుడు పాత్ర కీలకం. కాగా తన చివరి ఐపీఎల్ మ్యాచ్‌లోనూ రాయుడు తన ఇంపాక్ట్ చూపించాడు. వర్షంతో 15 ఓవర్లలో 171 పరుగుల టార్గెట్ ఫిక్స్ చేయడంతో సీఎస్కే బ్యాటర్స్ వేగంగా ఆడేందుకే ప్రయత్నించారు. ఈ క్రమంలో రాయుడు ఐదో స్థానంలో వచ్చి 8 బంతుల్లో రెండో సిక్సర్లు, ఒక ఫోర్‌తో 19 పరుగుల దనాధన్ ఇన్నింగ్స్ ఆడి ఔటయ్యాడు. అయితే రాయుడు మెరుపు ఇన్నింగ్స్ సీఎస్కే లక్ష్యాన్ని కరిగించిందని చెప్పొచ్చు. ఈ క్రమంలో అంబటి రాయుడుపై సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడుతో తన అనుబంధాన్ని ధోని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నాడు. ''మైదానంలో ఉన్నప్పుడు 100 శాతం శ్రమించడం రాయుడు లక్షణం. మేమిద్దరం ఒకప్పుడు ఇండియా ‘ఎ’ తరఫున కలిసి ఆడాం. అటు పేస్‌ను, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఆడగల నైపుణ్యం అతని సొంతం. అతను జట్టు కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయగలడని నేను ఎప్పుడైనా నమ్మేవాడిని. నాలాగే రాయుడుకు కూడా ఎక్కువగా ఫోన్ వాడే అలవాటు లేదు'' అని ధోని అన్నాడు. కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్‌తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 203 మ్యాచ్‌లాడి 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. చదవండి: #MSDhoni: దాయాది అభిమానులే మెచ్చుకునేలా! -
ఇంతకంటే నాకింకేం కావాలి.. జీవితాంతం నవ్వుతూనే ఉండొచ్చు: అంబటి రాయుడు
IPL 2023- Ambati Rayudu: ‘‘అవును.. ఐపీఎల్ కెరీర్ అద్భుతంగా ముగిసింది. ఇంతకంటే నాకింకేం కావాలి. అసలు ఇది నమ్మశక్యంగా లేదు. ఇది నిజంగా అదృష్టమనే చెప్పాలి’’ అని టీమిండియా మాజీ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశాడు. It feels so great to finally hold the trophy for a sixth time..been a great night for csk and also me personally… pic.twitter.com/Il5RNDGJwr — ATR (@RayuduAmbati) May 30, 2023 కాగా 2010లో ముంబై ఇండియన్స్ తరఫున.. ఐపీఎల్లో అరంగేట్రం చేసిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు.. తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌కు మారాడు. ముంబై ట్రోఫీ గెలిచిన మూడు సందర్భాల్లో ఆ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న రాయుడు.. మొత్తంగా ఆరో టైటిల్‌తో తన ఐపీఎల్ కెరీర్ ముగించాడు. 2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏 — ATR (@RayuduAmbati) May 28, 2023 చెన్నై ఐదోసారి.. రాయుడు ఖాతాలో ఆరు ఐపీఎల్-2023 ఫైనల్‌కు ముందు తాను క్యాష్ రిచ్ లీగ్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు అంబటి రాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా చెన్నై- గుజరాత్ టైటాన్స్ మధ్య మే 28న జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్‌డేకు మారింది. ఈ క్రమంలో సోమవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి చెన్నై ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. pic.twitter.com/rwUaptbvSr — ATR (@RayuduAmbati) May 30, 2023 ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఐదుసార్లు చాంపియన్ జట్టులో సభ్యుడిగా ఉన్న అంబటి రాయుడు ఖాతాలో మరో టైటిల్ చేరింది. దీంతో రాయుడు ఉద్వేగానికి లోనయ్యాడు. తనకు ఇంతకంటే గొప్ప బహుమతి ఏదీ ఉండదని వ్యాఖ్యానించాడు. In life and sport ups and downs are a constant part. We need to be positive and keeping working hard and things will turn around.. results are not always a measure of our effort. So always keeping smiling and enjoy the process.. pic.twitter.com/1AYAALkGBM — ATR (@RayuduAmbati) April 28, 2023 మా నాన్న వల్లే చెన్నై విజయానంతరం కామెంటేటర్ హర్షా భోగ్లేతో అంబటి రాయుడు మాట్లాడుతూ.. ‘‘ఇక నేనిలాగే జీవితాంతం చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోవచ్చు. గత 30 ఏళ్లుగా హార్డ్‌వర్క్ చేస్తున్నా. నా ప్రయాణంలో నాకు సహాయసహకారాలు అందించిన నా కుటుంబానికి, ముఖ్యంగా మా నాన్నకు ధన్యవాదాలు చెప్పాలి. వాళ్ల మద్దతు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు. నాకు ఇంతకంటే ఇంకేం కావాలి’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. కాగా ఈ సీజన్లో అంబటి రాయుడు మొత్తంగా 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 158 పరుగులు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. Photo Credit : AFP రోహిత్ శర్మ తర్వాత రాయుడు ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. కాగా 37 ఏళ్ల అంబటి రాయుడు తన ఐపీఎల్ కెరీర్ మొత్తంలో 4348 పరుగులు సాధించాడు. ఆరుసార్లు.. విజేతగా నిలిచిన జట్లలో భాగమై ట్రోఫీలను ముద్దాడాడు. అదే విధంగా ఆటగాడిగా టీమిండియా సారథి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. కాగా రిజర్వ్ డే మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో సీఎస్కే 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: జడేజాను ఎత్తుకుని ధోని సెలబ్రేషన్! ఇంతకంటే ఏం కావాలి? వీడియో వైరల్ ఇలా జరగాలని రాసి పెట్టి ఉందంతే! ధోని చేతిలో ఓడినా బాధపడను: హార్దిక్ Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
చెన్నై పాంచ్ పటాకా
-
ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు, చెన్నైసూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్-2023 ఫైనల్ అనంతరం ఈ క్యాష్‌రిచ్ లీగ్ నుంచి తప్పుకోనున్నట్లు రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా ఆదివారం రాయుడు వెల్లడించాడు. కాగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న తుదిపోరులో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇక 2010లో ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాయుడు.. ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడాడు. 2010 నుంచి 2017 సీజన్ వరకు ముంబైఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 2018 సీజన్లో చెన్నైసూపర్‌కింగ్స్ జట్టులోకి రాయుడు చేరాడు. 2013, 2015,2017 సీజన్లో ఛాంపియన్‌గా నిలిచిన ముంబై జట్టులో రాయుడు భాగంగా ఉన్నాడు. "ముంబై, సీఎస్కే వంటి రెండు అద్భుతమైన జట్లకు ప్రాతినిద్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది. 204 మ్యాచ్‌లు, 14 సీజన్లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు నా కెరీర్లో ఉన్నాయి. ఈ రోజు ఆరో టైటిల్ సాధిస్తాని ఆశిస్తున్నాను. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాను. నా ఈ అద్భుతప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు. మళ్లీ యూ టర్న్ తీసుకోను" అంటూ ట్విటర్లో రాయుడు పేర్కొన్నాడు. తన ఐపీఎల్ కెరీర్లో ఇప్పటివరకు 202 మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 4329 పరుగులు సాధించాడు. అతడి కెరీర్లో ఒక సెంచరీ ఉంది. చదవండి: IPL 2023 Final: అప్పుడు అంచనాలే లేవు.. కానీ ఇప్పుడు! అచ్చం ధోనిలాగే.. 2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏 — ATR (@RayuduAmbati) May 28, 2023 -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన అంబటి రాయుడు
సాక్షి, తాడేపల్లి: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇవాళ (మే 11) తాడేపల్లిలోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, క్రీడారంగంలో యువతకు అవకాశాలు, శిక్షణ తదితర అంశాలపై రాయుడు సీఎం జగన్‌తో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అంబటి రాయుడు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2023లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. -
కంగ్రాట్స్ రాయుడు! ఆ రెండు ఇన్నింగ్స్ నా ఫేవరెట్! థాంక్యూ ఆకాశ్!
IPL 2023- Ambati Rayudu: తెలుగు క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ అంబటి రాయుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. గత కొన్నేళ్లుగా సీఎస్కేకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ రైట్‌హ్యాండ్ బ్యాటర్.. బుధవారం నాటి మ్యాచ్‌తో ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సీఎస్కేతో పాటు ముంబై ఇండియన్స్ కూడా అంబటి రాయుడు అరుదైన ఘనతను గుర్తిస్తూ ట్రిబ్యూట్ ఇచ్చింది. మూడు ట్రోఫీలు కాగా గతంలో ముంబై ఫ్రాంఛైజీకి ప్రాతినిథ్యం వహించిన రాయుడు ఆ జట్టు తరఫున 114 మ్యాచ్‌లు ఆడాడు. ఐదుసార్లు చాంపియన్ అయిన ముంబై ట్రోఫీలు గెలిచిన మూడు సందర్బాల్లో జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ముంబై ఫ్రాంఛైజీ యజమాని ఆకాశ్ అంబానీ రాయుడికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఆ రెండు ఇన్నింగ్స్ నా ఫేవరెట్ ఇందుకు సంబంధించిన వీడియోను ఎంఐ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘‘హాయ్ అంబటి.. ఐపీఎల్లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు. ముంబై ఇండియన్స్ విజయాల్లో నీకూ భాగం ఉంది. ముంబై తరఫున నువ్వు ఆడిన ఇన్నింగ్స్‌లో రెండు నా ఫేవరెట్. ఒకటి.. రాజస్తాన్ రాయల్స్ మీద 10 బంతుల్లో 30 పరుగులు చేశావు. 2014 నాటి ఆ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన అత్యుత్తమ మ్యాచ్‌లలో అదీ ఒకటి అని కచ్చితంగా చెప్పగలను. ఇక రెండోది.. బెంగళూరులో మ్యాచ్‌లో నువ్వూ, పొలార్డ్ కలిసి అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ ఇన్నింగ్స్ కూడా నాకిష్టం. ముంబై ట్రోఫీలు గెలిచిన ప్రతీ సందర్భంలో నీ వంతు పాత్ర పోషించావు. కెరీర్లో నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న నీకు మరోసారి శుభాకాంక్షలు. నీ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉండాలి’’ అని ఆకాశ్ అంబానీ.. అంబటి రాయుడుకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. థాంక్యూ ఆకాశ్ ఇక ముంబై ఇండియన్స్ తనపై కురిపించిన ప్రేమకు బదులిస్తూ.. ‘‘నాపై నమ్మకం ఉంచి 2010 నుంచి నాకు అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించారు. ముంబైతో నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ట్రోఫీ గెలిచిన సందర్భాలు ఎల్లప్పుడూ నా మదిలో మెదులుతూ ఉంటాయి. థాంక్యూ సో మచ్ ఆకాశ్. ఎంఐ పల్టన్’’ అంటూ అంబటి రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌తో అంబటి రాయుడు 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఎదుర్కొన్న రాయుడు 23 పరుగులు సాధించాడు. ఇక చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఢిల్లీపై 27 పరుగుల తేడాతో గెలుపొందింది. చదవండి: Virat Kohli-SKY: కాలం మారుతుంది! సూర్య అవుట్ కాగానే దగ్గరికి వచ్చిన కోహ్లి.. ఆ తర్వాత; వీడియో వైరల్ Thank you so much Akash and mi paltan..it really means a lot and have immense gratitude for giving me an opportunity and believing in me from 2010..I have such great memories with mi and I have cherished each and every trophy win that I have been a part of… 😊😊😊🙏🙏 https://t.co/BLuAEn8A5p — ATR (@RayuduAmbati) May 10, 2023 ATR going double the Ton Distance!🔥#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 pic.twitter.com/HbwBr8vRM4 — Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేను బ్యాటింగ్‌కు రాగానే వారికి నిరాశ! వీడెప్పుడు అవుట్ అవుతాడా అని..
IPL 2023- CSK Vs DC: మహేంద్ర సింగ్ ధోని.. ఆ పేరే ఓ పవర్‌హౌజ్. టీమిండియాకు మూడు ఐసీసీ టైటిళ్లు అందించడంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను నాలుగు సార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ మిస్టర్ కూల్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ధోని క్రీజులో ఉంటే చాలు ప్రేక్షకులు పూనకంతో ఊగిపోతారు. ఒక్క షాట్ కొట్టినా చాలు తనదైన శైలిలో ఒక్క షాట్ కొట్టినా చూడాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఇక ఐపీఎల్-2023 ధోనికి చివరి సీజన్ అన్న వార్తల నేపథ్యంలో సీఎస్కే ఆడే ప్రతీ మ్యాచ్‌లోనూ.. స్టేడియం ఏదైనా ధోని నామస్మరణతో దద్దరిల్లిపోతోంది. మ్యాచ్ చెన్నైలోనా లేదంటే ప్రత్యర్థి సొంతమైదానంలోనా అన్న తేడా లేకుండా పసుపు వర్ణంతో స్టేడియం నిండిపోతోంది. ఎక్కడ చూసినా ధోని నామస్మరణే ఈడెన్ గార్డెన్స్‌లో ఇటీవల ధోనికి మద్దతుగా వేలాది మంది తరలిరావడం ఇందుకు ఓ ఉదాహరణ. ఇక ముంబైలోని వాంఖడే స్టేడియంలో ధోనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకున్నా తన పేరును జపిస్తున్న ఫ్యాన్స్ కోసం ప్యాడ్స్ కట్టుకుని సమాయత్తమవుతున్నట్లు నటించి వారిని కాసేపు మురిపించాడు ధోని. అలాంటిది చెపాక్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం వస్తే.. ఊరుకుంటాడా?! యాడ్ కూడా వేయలేదు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అంబటి రాయుడు అవుట్ కాగానే క్రీజులోకి వచ్చిన ధోని.. 9 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌ల సాయంతో ఏకంగా 20 పరుగులు రాబట్టాడు. తన మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానులను ఖుషీ చేశాడు. ఇక ధోని క్రేజ్ దృష్ట్యా బ్రాడ్‌కాస్టర్ యాడ్ కూడా వేయకుండా అతడు మైదానంలో అడుగుపెడుతున్న దృశ్యాలను చూపించిందంటే తలా క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు అవుట్ అవుతానా అని ఎదురుచూశారు! ఈ నేపథ్యంలో సీఎస్కే ప్రధాన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఏడో స్థానంలో నేను బ్యాటింగ్‌కు రాగానే ప్రేక్షకులు నిరాశ చెందారు. మహీ భాయ్ నామస్మరణ మొదలుపెట్టారు. ఒకవేళ నేను ఎక్కువ సేపు క్రీజులో ఉంటే.. వీడు ఎప్పుడెప్పుడు అవుట్ అవుతాడా అని వేచి చూసేవారేమో!’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. జడ్డూ ఆల్‌రౌండ్ ప్రతిభతో ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జడ్డూ 16 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అదే విధంగా 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఒక వికెట్ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ స్కోరర్ రిలీ రొసోవ్(35) రూపంలో కీలక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా ధోని క్రేజ్ గురించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. చదవండి: అతడిని బాగా మిస్ అవుతున్నాం.. కానీ తప్పదు! చాలా అరుదుగా ఉంటారు: ధోని అదృష్టం కలిసొచ్చింది.. ప్రపంచకప్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా Super show with the ball from @ChennaiIPL! 👏 👏 The @msdhoni-led unit beat #DC by 2⃣7⃣ runs in Chennai to seal their 7⃣th win of the season! 👌 👌 Scorecard ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC pic.twitter.com/SnF0uo2uu4 — IndianPremierLeague (@IPL) May 10, 2023 Super show with the ball from @ChennaiIPL! 👏 👏 The @msdhoni-led unit beat #DC by 2⃣7⃣ runs in Chennai to seal their 7⃣th win of the season! 👌 👌 Scorecard ▶️ https://t.co/soUtpXQjCX#TATAIPL | #CSKvDC pic.twitter.com/SnF0uo2uu4 — IndianPremierLeague (@IPL) May 10, 2023 Spinning and Winning! That’s the trick! 🪄#CSKvDC #WhistlePodu #Yellove 🦁💛 @imjadeja pic.twitter.com/mzWIb9pnoF — Chennai Super Kings (@ChennaiIPL) May 11, 2023 -
'పొరపాటులో మరిచిపోయాడు.. వదిలేయండి!'
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా బుధవారం చెన్నై వేదికగా సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అయితే టాస్ సమయంలో ధోని సీఎస్కే తుది జట్టు విషయంలో చిన్న పొరపాటు చేశాడు. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న ధోని.. తుది జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా అని అడగ్గా.. ''అవును.. దూబే స్థానంలో రాయుడు జట్టులోకి వచ్చాడు'' అని పేర్కొన్నాడు. అయితే వాస్తవానికి దూబే తుది జట్టులో ఉన్నాడు. అంబటి రాయుడు కూడా జట్టులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ పేరు చెప్పబోయి పొరపాటున దూబే పేరు చెప్పాడు. ఇది చూసిన కొంతమంది యాంటీ సీఎస్కే ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ''తుది జట్టులో ఎవరున్నారన్న దానిపై కెప్టెన్‌కే క్లారిటీ లేదు'' అంటూ కామెంట్ చేశారు. దీనిపై ఆగ్రహించిన సీఎస్కే ఫ్యాన్స్.. ''అంత సీన్ లేదు.. కెప్టెన్ అన్నప్పుడు ఒత్తిడి ఉంటుంది.. అయినా ఏదో పొరపాటులో మరిచిపోయాడు.. ఇక్కడితో వదిలేయండి'' అంటూ పేర్కొన్నారు. WON THE TOSS, BATTING FIRST AND RAYUDU IN PLACE OF DUBE. pic.twitter.com/314EXJ6mS3 — Heisenberg ☢ (@internetumpire) May 10, 2023 చదవండి: ఆస్కార్ గెలిచిన వీరులతో ఎంఎస్ ధోని -
CSK VS SRH: మార్కండే సూపర్ డెలివరీ..అయ్యో ఎంత పని జరిగిపోయింది!
ఐపీఎల్ 2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 21) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని దళం ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి, సూపర్ విక్టరీ సాధించింది. జడేజా అదిరిపోయే బౌలింగ్ పెర్ఫార్మెన్స్ (4-0-22-3), డెవాన్ కాన్వే (77 నాటౌట్) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో సీఎస్కేకు సునాయాస విజయాన్ని అందించారు. వీరితో పాటు జట్టులోని అందరూ తలో చేయి వేయడంతో సీఎస్కే కంఫర్టబుల్ విక్టరీ సాధించింది. తద్వారా 8 పాయింట్లు (0.355) ఖాతాలో వేసుకుని, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్థాన్ రాయల్స్ (1.043), లక్నో సూపర్ జెయింట్స్ (0.709) సైతం ఎనిమిదే పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. Deceived and How! A beaut of a delivery THAT by Mayank Markande 🔥 Follow the match ▶️ https://t.co/0NT6FhLKg8#TATAIPL | #CSKvSRH pic.twitter.com/bgvGctoeCN — IndianPremierLeague (@IPL) April 21, 2023 ఇన్ని సానుకూల అంశాల నడుమ సీఎస్కేను ఒక్క విషయం మాత్రం తీవ్రంగా బాధిస్తుంది. అదే, ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ అంబటి రాయుడు ఫామ్ లేమి. ప్రస్తుత సీజన్లో రాయుడు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. లక్నో (27 నాటౌట్), ముంబై (20 నాటౌట్)లపై ఓ మోస్తరు ప్రదర్శనలు మినహాయించి, మిగతా 4 మ్యాచ్‌ల్లో అతను దారుణంగా విఫలమయ్యాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ నెగ్గి కెరీర్‌ను ఘనంగా ముగించాలనుకుంటున్న అతనికి, అతని కెప్టెన్ ధోనికి ఈ విషయం అస్సలు సహించడం లేదని సమాచారం. మరి ముఖ్యంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయుడు ఔటైన విధానం, కెప్టెన్‌తో పాటు ఫ్యాన్స్‌కు సైతం విస్మయాన్ని కలిగించింది. మయాంక్ మార్కండే బౌలింగ్‌లో బంతిని జడ్జ్ చేయడంలో విఫలమైన రాయుడు (9).. చాలా చీప్‌గా క్లీన్ బౌల్డయ్యాడు. రాయుడు చీప్ డిస్మిసల్పై సీఎస్కే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. రకరకాలుగా స్పందిస్తున్నారు. ఏమయ్యా రాయుడు.. మరీ ఇంత చీప్‌గా బౌల్డ్ అయిపోతివి అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
ప్రజలందరి నమ్మకం మీపైనే.. సీఎం జగన్‌పై అంబటి రాయుడు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసలు కురిపించారు. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి మూలస్తంభమైన మూలపేట పోర్టుకు బుధవారం శంకుస్థాపన చేసిన తర్వాత.. సీఎం జగన్ నౌపడలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ ప్రసంగాన్ని వైఎస్సార్సీపీ ట్విట్టర్లో పోస్టు చేసింది. దానిని అంబటి రాయుడు రీట్వీట్ చేస్తూ.. ‘మన సీఎం వైఎస్ జగన్ ప్రసంగం అత్యద్భుతం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పూర్తిగా నమ్మేది, విశ్వసించేది మిమ్మల్నే సర్’ అంటూ కొనియాడారు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నా నమ్మకం, నా ఆత్మవిశ్వాసం మీరే!! #CMYSJagan #MaaNammakamNuvveJagan pic.twitter.com/0qYpgtMtVp — YSR Congress Party (@YSRCParty) April 19, 2023 -
GT Vs CSK: ప్లీజ్.. అతడిని తప్పించండి! ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు!
Gujarat Titans vs Chennai Super Kings: టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివం దూబేపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు మండిపడుతున్నారు. జిడ్డు బ్యాటింగ్‌తో సీఎస్కే ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి మ్యాచ్‌లో అతడిని తప్పించాలంటూ సోషల్ మీడియా వేదికగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2023 మెగా ఈవెంట్‌కు శుక్రవారం తెరలేచిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ధోని సేనకు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(92) శుభారంభం అందించాడు. కానీ మిగతా వాళ్ల నుంచి అతడికి సహకారం లభించలేదు. ముఖ్యంగా అంబటి రాయుడు, శివం దూబే బంతులు వృథా చేశారు. రాయుడు 12 బంతుల్లో 12 పరుగులు సాధించగా.. దూబే 18 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 20 ఓవర్లలో 178 పరుగులు చేసిన చెన్నై.. లక్ష్య ఛేదనలో గుజరాత్ విజయవంతం కావడంతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా శివం దూబేపై విమర్శల వర్షం కురుస్తోంది. నీ స్వార్థం కారణంగా చెన్నై ఓడిపోయింది. ఒక్కడి వల్ల ఇన్ని అనర్థాలు ‘‘శివం దూబే వల్లే జోష్ మీదున్న గైక్వాడ్ మొమెంటమ్ కోల్పోయాడు. సెంచరీ చేజార్చుకున్నాడు. ధోని అభిమానులకు ఒక్క సిక్సర్ కూడా చూసే అవకాశం లేకుండా పోయింది. ఐపీఎల్-2023లో సీఎస్కేకు ఆరంభ మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఇన్నిఅనర్థాలకు దూబేనే కారణం’’ అని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. కాగా శివం దూబే తమకు ఆప్షన్ మాత్రనేనని, ఏదేమైనా బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సిందంటూ ధోని తమ ఓటమికి బ్యాటింగ్ వైఫల్యం కారణమని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. అంబటి రాయుడు స్థానంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ తుషార్ దేశ్‌పాండే నోబాల్స్‌తో పాటు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడిపై కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నాడు. కొత్త రూల్ వల్ల ఈ మహానుభావుడిని ఆడించి సీఎస్కే భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: IPL 2023: సచిన్ రికార్డు బద్దలు కొట్టిన రుతురాజ్.. తొలి భారత క్రికెటర్‌గా! WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్’ రేసులో.. We Had Lost This Match Because Dube And Rayudu .Especially Shivam Dube .Because He Had Wasted The Lots Of Balls And Overs. So Especially Kindly Drop These 2 Players In Upcoming Every Matches — Sam (@samkutty865) April 1, 2023 Because of Shivam Dube: -Gaikwad lost his momentum to score hundred. -Jaddu lost his wicket. -Dhoni fans not able to see more than 1 six. -CSK lost their momentum and gave below par target(yes its below par for this pitch). -CSK lost their opening match against GT.#CSKvsGT pic.twitter.com/VEMHDeFLpF — 𝐑𝐮𝐠𝐠𝐚™ (@LoyalYashFan) March 31, 2023 Shivam Dube just retire hurt man. What a selfish cricketer. Thank God, we have sleeper cell in Vijay Shankar ik opposite team. Or else we'd be screwed — VRS (@azizdopleganger) March 31, 2023 -
సిద్దిపేటలో హీరో నాని, క్రికెటర్ అంబటి రాయుడు సందడి..
-
కేసీఆర్ కారణజన్ముడు
సాక్షి, సిద్దిపేట: కే.. అంటే కారణజన్ముడు.. సీ.. అంటే చిరస్మరణీయుడు.. ఆర్.. అంటే మన తలరాతలను మార్చిన మహనీయుడు కేసీఆర్ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుక్రవారం. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దిపేట జయశంకర్ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్–3ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘దసరా’సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ 373 టీమ్‌లతో ప్రపంచంలో ఎక్కడ కూడా క్రికెట్ టోర్నమెంట్ జరగలేదన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌ను అభినందించారు. క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ తాను కేసీఆర్ అభిమానినన్నారు. -
అప్పుడు రాయుడు.. ఇప్పుడు సంజూకు అన్యాయం: పాక్ మాజీ క్రికెటర్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మూడో వన్డేకు కూడా శాంసన్‌కు భారత తుది జట్టులో చోటు దక్కలేదు. ఈ క్రమంలో భారత జట్టు మేనేజేమెంట్‌పై విమర్శల వర్షం కురిస్తోంది. తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కీలక వాఖ్యలు చేశాడు. వరుసగా విఫలమవుతున్న రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లకు ఇవ్వకపోవడం పట్ల బీసీసీఐపై కనేరియా విమర్శల వర్షం కురిపించాడు. అదే విధంగా భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడుకు జరిగిన ఆన్యాయమే ఇప్పుడు శాంసన్‌కు జరుగుతోంది అని అతడు అభిప్రాయపడ్డాడు. కాగా ఇంగ్లండ్ వేదికగా జరిగిన జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టులో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న రాయుడుకి చోటు దక్కుతుందని అంతా భావించారు. అయితే ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనూహ్యంగా రాయుడిని ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. దీంతో నిరాశకు గురైన రాయుడు 2019లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. రాయుడికి జరిగిన అన్యాయమే ఇప్పుడు సంజూకు "సంజూ శాంసన్ లాంటి అద్భుతమైన ఆటగాడికి తరుచూ ఆన్యాయం జరుగుతోంది. ప్రతీ ఒక్క ఆటగాడికి కొంతవరకే సహనం, ఓపిక ఉంటుంది. అతడు నిరాశకు గురై రిటైర్మెంట్ ప్రకటిస్తే.. అప్పుడు భారత జట్టు ఒక మంచి ఆటగాడిని కచ్చితంగా కోల్పోతుంది. ఏ జట్టు అయినా మంచి ఫుల్ పాట్లు, ఎక్స్ట్రా కవర్ డ్రైవ్‌లు ఆడే ఆటగాడు కావాలని భావిస్తోంది. కానీ భారత జట్టు మాత్రం సంజూ లాంటి అద్భుతమైన ఆటగాడిని పక్కన పెడూతూ వస్తుంది. అంబటి రాయుడు కెరీర్ కూడా ఇలాగే ముగిసింది. అతడు భారత తరపున అద్భుతంగా రాణించాడు. కానీ అతడి పట్ల బీసీసీఐ చిన్నచూపు చూసింది. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ అంతర్గత రాజకీయాలకు రాయడు బలైపోయాడు" అని తన యూట్యూబ్ ఛానల్లో కనేరియా పేర్కొన్నాడు. -
బరోడా జట్టుకు ఆడనున్న అంబటి రాయుడు
సీనియర్ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు దేశవాళీ క్రికెట్లో మరోసారి బరోడా జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని బరోడా క్రికెట్ అసోసియేషన్(బీసీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ శిశిర్ హట్టంగడి ధ్రువీకరించారు. గత సీజన్ వరకు రాయుడు ఆంధ్ర తరఫున ఆడాడు. దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, ఆంధ్ర, విదర్భలతో పాటు 2012–14 మధ్య రాయుడు బరోడా తరఫునే బరిలోకి దిగాడు. కాగా గతంలో బరోడాకు ప్రాతినిథ్యం వహించిన 36 ఏళ్ల రాయుడు.. మరోసారి ఈ జట్టుకు ఆడాలని ఉందని బీసీఏను సంప్రదించిన నేపథ్యంలో ఈ మేరకు సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. అతడు ప్రొఫెషనల్ కేటగిరీలో ఆడనున్నాడు. ఇక అంబటి రాయుడు టీమిండియాకు 55 వన్డేలు, 6 టి20ల్లో ప్రాతినిధ్యం వహించాడు. చివరిసారిగా 2019 మార్చిలో జాతీయ జట్టుకు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2022లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్! ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా? Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే! -
బరోడా జట్టు తరపున ఆడనున్న అంబటి రాయుడు
టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు రాబోయే దేశవాళీ సీజన్లో బరోడా జట్టు తరపున ఆడునున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. రాయుడు ఇప్పటికే బరోడా క్రికెట్ అసోసియేషన్‌తో చర్చలు జరిపినట్లు సమాచారం. కాగా రాయుడు తన కెరీర్లో ఇప్పటికే బరోడా తరఫున నాలుగు సీజన్లు ఆడాడు. కాగా జూన్‌లో బరోడా సన్నాహక శిబిరంలో రాయుడు చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక గతేడాది సీజన్లో బరోడా సారథి కృనాల్ పాండ్యాతో విభేదాలు ఏర్పాడిన తర్వాత.. దీపక్ హుడా బరోడా జట్టు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే దీపక్ హుడా ప్రస్తుతం రాజస్థాన్ తరపున ఆడుతున్నాడు. అయితే అతడి స్థానంలో రాయుడును భర్తీ చేయాలని బరోడా క్రికెట్ అసోసియేషన్ భావిస్తోంది. చదవండి: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.. ఉమ్రాన్, డీకేలకు అవకాశం -
CSK VS GT: అందుకే రాయుడిని పక్కకు పెట్టారట..!
ఐపీఎల్ 2022 సీజన్లో భాగంగా ఇవాళ (మే 15) గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్లోగా మారుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం (బ్యాటింగ్) తీసుకున్నట్లు ఆ జట్టు కెప్టెన్ ధోని తెలిపాడు. టాస్ గెలిచిన అనంతరం ధోని మాట్లాడుతూ.. ఈ సీజన్లో తీక్షణ, డెవాన్ కాన్వే అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడాడు. నామమాత్రపు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్ కోసం భారీ మార్పులు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. సీనియర్లైన రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో, మహీశ్ తీక్షణలను బెంచ్‌కు పరిమితం చేసి యువ ఆటగాళ్లు ఎన్ జగదీషన్, ప్రశాంత్ సోలంకీ, మతీష పతిరన, మిచెల్ సాంట్నర్‌లను అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపాడు. కొత్తవారికి అవకాశం కల్పించేందుకు సీనియర్లకు రెస్ట్ ఇచ్చామని వివరణ ఇచ్చాడు. అయితే సీఎస్కే జట్టులో ఈ స్థాయి మార్పులు జరగడంపై అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్‌తో మ్యాచ్‌కు ముందు రోజే అంబటి రాయుడు రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించి ఆ తర్వాత తిరిగి వెనక్కు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రాయుడుపై వేటు పడిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక మిగతా సీనియర్లు ఊతప్ప, బ్రావోలను ఇంటికి పంపేందుకే (వచ్చే ఏడాది) ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సందేహాలు కలుగుతున్నాయి. మొత్తంగా సీఎస్కేలో ఏదో జరుగుతుందని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 53; 6 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించగా.. జగదీషన్ (33 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) పర్వాలేదనిపించాడు. ధోని (10 బంతుల్లో 7) మరోసారి దారుణంగా నిరుత్సాహపరిచాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి సీఎస్కేను కట్టడి చేశారు. షమీ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, అల్జరీ జోసఫ్, సాయికిషోర్ తలో వికెట్ సాధించారు. తుది జట్లు.. సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, శివం దూబే, ఎన్ జగదీషన్, ఎంఎస్ ధోని(కెప్టెన్), మిచెల్ సాండ్నర్, ప్రశాంత్ సోలంకి, సిమ్రన్‌జిత్ సింగ్, మతీష పతిరన, ముఖేశ్ చౌదరి గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా(కీపర్), మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ, సాయి కిషోర్, యశ్ దయాల్ చదవండి: సైమండ్స్ మృతికి సంతాపం.. నల్ల బ్యాండ్లతో బరిలోకి దిగిన గుజరాత్, చెన్నై ఆటగాళ్లు.. -
తూచ్.. రిటైర్ కావట్లేదు.. రిటైర్మెంట్ ప్రకటనపై వెనక్కు తగ్గిన రాయుడు
Ambati Rayudu Deletes Retirment Tweet: చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు.. రిటైర్మెంట్ (ఐపీఎల్) విషయంలో మనసు మార్చుకున్నట్లున్నాడు. ఈ సీజన్ (2022) తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 14) ఉదయం ట్వీట్ చేసిన రాయుడు.. నిమిషాల వ్యవధిలో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు. రాయుడు ఇచ్చిన ఈ ట్విస్ట్‌తో అభిమానులు కన్ఫ్యూజన్లో పడిపోయారు. రాయుడు రిటైర్మెంట్పై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథ్ స్పందించాడు. రాయుడు రిటైర్ కావట్లేదని క్లారిటీ ఇచ్చాడు. గత కొంత కాలంగా సరైన ప్రదర్శన చేయలేకపోతున్నానన్న బాధలో రాయుడు ఉన్నాడని, ఆ నిరాశలోనే అతను రిటైర్మెంట్ ప్రకటన చేశాడని, వచ్చే సీజన్ కూడా రాయుడు తమతోనే ఉంటాడని వివరణ ఇచ్చాడు. 36 ఏళ్ల రాయుడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 12 మ్యాచ్‌ల్లో 27.10 సగటున 271 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందకనే రాయుడు రిటైర్మెంట్ ప్రకటన చేసినట్లు సీఎస్కే సీఈవో పేర్కొన్నాడు.రాయుడు తన ట్వీట్లో ఈ విధంగా స్పందించాడు. 'ఐపీఎల్లో ఇదే నా ఆఖరు సీజన్ అని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల తరఫున తన 13 ఏళ్ల ఐపీఎల్ ప్రస్థానం చాలా సంతృప్తిని ఇచ్చింది.. ఆ రెండు జట్లతో గొప్ప క్షణాలు గడిపాను.. ముంబై, సీఎస్కేకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ (2010-2017), సీఎస్కే (2018 నుంచి) జట్లకు ప్రాతినిధ్యం వహించిన రాయుడు.. 187 మ్యాచ్‌ల కెరీర్లో 127.26 స్ట్రైయిక్ రేట్‌తో 29.28 సగటున 4187 పరుగులు చేశాడు. 2022 మెగా వేలంలో సీఎస్కే రాయుడుని 6.75 కోట్లకు తిరిగి దక్కించుకుంది. ఈ సీజన్లో సీఎస్కే తరఫున రుతురాజ్ (313 పరుగులు), శివమ్ దూబే (289) తర్వాత అత్యధిక పరుగులు చేసింది రాయుడే (271) కావడం విశేషం. చదవండి: సీఎస్కే షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన -
సీఎస్కే షాకిచ్చిన స్టార్ క్రికెటర్.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటన
Ambati Rayudu Retires From IPL: ఐపీఎల్ 2022 సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు అస్సలు కలిసి రాలేదు. వరుస గాయాలు, పరాజయాలు, కెప్టెన్సీ మార్పు, సీనియర్ ఆటగాళ్ల పేలవ ప్రదర్శన, అంపైరింగ్ తప్పిదాలు.. ఇలా ప్రతి ఒక్క విషయంలో ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. వరుసగా పరాజయాలను ఎదుర్కొని ఆతర్వాత కెప్టెన్ మార్పుతో తిరిగి విన్నంగ్ ట్రాక్ ఎక్కినప్పటికీ.. కీలక మ్యాచ్‌లో దారుణ పరాజయాన్ని (ముంబై) మూటగట్టుకుని ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. మరో రెండు మ్యాచ్‌లు ఆడితే ఈ సీజన్లో సీఎస్కే ప్రస్థానం ముగుస్తుంది. I am happy to announce that this will be my last ipl. I have had a wonderful time playing it and being a part of 2 great teams for 13 years. Would love to sincerely thank Mumbai Indians and Csk for the wonderful journey. — Ambati Rayudu (@RayuduAmbati) May 14, 2022 ఇదిలా ఉంటే, లీగ్ నుంచి నిష్క్రమించిన బాధలో ఉన్న చెన్నై జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ ప్లేయర్, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ట్విటర్ వేదికగా షాకింగ్ ప్రకటన చేశాడు. రాయుడు అకస్మాత్తుగా ఈ ప్రకటన చేయడంతో సీఎస్కే యాజమాన్యానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ధోని, రాయుడు లాంటి సీనియర్లు వచ్చే సీజన్‌కు అందుబాటులో ఉండకపోతే తమ పరిస్థితి ఏంటని వారు ఆలోచనలో పడ్డారు. మరో పక్క రాబిన్ ఉతప్ప, డ్వేన్ బ్రావో లాంటి వెటరన్లు కూడా రిటైర్మెంట్కు దగ్గర పడ్డారు. కెప్టెన్సీ వివాదం కారణంగా జడేజా కూడా సీఎస్కేతో బంధం తెంచుకుంటే ఆ జట్టు భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారనుంది. ప్రస్తుతానికి ఆ జట్టు ఆశలన్నీ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, ముకేశ్ చౌదరీపైనే ఉన్నాయి. కాగా, అంబటి రాయుడుకి ఐపీఎల్లో సీఎస్కేతో చాలా అనుబంధం ఉంది. రాయుడు.. తన 13 ఏళ్ల క్యాష్ రిచ్ లీగ్ కెరీర్లో ముంబై ఇండియన్స్ తర్వాత అత్యధిక సీజన్లు సీఎస్కేతోనే ఉన్నాడు. ఐపీఎల్లో మొత్తం 187 మ్యాచ్‌లు ఆడిన రాయుడు 29.28 సగటున 4187 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: IPL 2022: ధోని తర్వాత సీఎస్కే కెప్టెన్‌గా రుతురాజ్..!