
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా బుధవారం చెన్నై వేదికగా సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. అయితే టాస్ సమయంలో ధోని సీఎస్‌కే తుది జట్టు విషయంలో చిన్న పొరపాటు చేశాడు. టాస్ గెలిచిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకున్న ధోని.. తుది జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా అని అడగ్గా.. ''అవును.. దూబే స్థానంలో రాయుడు జట్టులోకి వచ్చాడు'' అని పేర్కొన్నాడు.
అయితే వాస్తవానికి దూబే తుది జట్టులో ఉన్నాడు. అంబటి రాయుడు కూడా జట్టులో ఉన్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ పేరు చెప్పబోయి పొరపాటున దూబే పేరు చెప్పాడు. ఇది చూసిన కొంతమంది యాంటీ సీఎస్‌కే ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ''తుది జట్టులో ఎవరున్నారన్న దానిపై కెప్టెన్‌కే క్లారిటీ లేదు'' అంటూ కామెంట్ చేశారు.
దీనిపై ఆగ్రహించిన సీఎస్‌కే ఫ్యాన్స్.. ''అంత సీన్ లేదు.. కెప్టెన్ అన్నప్పుడు ఒత్తిడి ఉంటుంది.. అయినా ఏదో పొరపాటులో మరిచిపోయాడు.. ఇక్కడితో వదిలేయండి'' అంటూ పేర్కొన్నారు.
WON THE TOSS, BATTING FIRST AND RAYUDU IN PLACE OF DUBE. pic.twitter.com/314EXJ6mS3
— Heisenberg ☢ (@internetumpire) May 10, 2023