IPL 2023, CSK Vs DC: Star Sports Didn't Telecast The Ad During MS Dhoni Entry - Sakshi
Sakshi News home page

#MSDhoni: క్రేజ్‌ మాములుగా లేదు.. యాడ్‌ వేయలేని పరిస్థితి!

Published Wed, May 10 2023 11:20 PM | Last Updated on Thu, May 11 2023 9:17 AM

Star Sports Didnt Telecast Add During MS Dhoni Entry What A-Craze - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మరోసారి ఫినిషర్‌ పాత్రను సమర్థంగా పోషించాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని ఆఖర్లో బ్యాటింగ్‌కు వచ్చాడు.  9 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 20 పరుగుల ధనాదన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ధోని ఆ 20 పరుగులు చేయకుంటే సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 140 వద్దే ఆగిపోయోదేమే. 

మాములుగానే ఈ సీజన్‌లో ధోనికున్న క్రేజ్‌ చూస్తే మతిపోతుంది. కేవలం అతని బ్యాటింగ్‌ చూడడం కోసమే అభిమానులు స్టేడియానికి పోటెత్తుతున్నారు. మహీ ఒక్క బంతి ఆడినా చాలు అన్నట్లుగా పరితపించిపోతున్నారు. తాజాగా చెపాక్‌ స్టేడియంలో మరోసారి అది నిరూపితమైంది.

రాయుడు ఔట్‌ కాగానే ధోని  ఎంటరవుతున్న సమయంలో స్టేడియం మొత్తం ధోని అరుపులతో దద్దరిల్లింది. ఇంకో విచిత్రమేంటంటే.. ఒక బ్యాటర్‌ ఔట్‌ అవడం లేదా ఓవర్‌ పూర్తవ్వగానే స్టార్‌స్పోర్ట్స్‌ యాడ్స్‌ వేయడం చూస్తుంటాం. కానీ ధోనికున్న క్రేజ్‌ స్టార్‌స్పోర్ట్స్‌ యాడ్‌ వేయలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం ధోని కోసం కోట్ల రూపాయల యాడ్‌ను వదులుకుంది. అది ధోనికున్న క్రేజ్‌.

ఇక ధోని బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో జియో సినిమాలో వీక్షకుల సంఖ్య 1.8 కోట్లు దాటడం విశేషం. నిజంగా ఇది సరికొత్త రికార్డు అని చెప్పొచ్చు. ఇంతకముందు 1.7 కోట్లు అత్యధికం కాగా.. తాజాగా ఆ రికార్డు కూడా బద్దలయ్యింది.

చదవండి: నువ్వు ఆడకపోతివి.. ఆడేటోడిని రనౌట్‌ జేస్తివి!'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement