Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఎదురులేకుండా దూసుకెళుతుంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం అనంతరం కెప్టెన్ ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తక్కువ అవకాశాలు వస్తున్నప్పటికీ చెన్నై తరఫున ఫినిషింగ్ రోల్ పోషించడం ఆనందంగా ఉందని అన్నాడు. పరిగెత్తి ఒత్తిడి తెచ్చుకోవడం కంటే బౌండరీలు బాదడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నాడు.
ఈ సీజన్‌లో ధోని బ్యాటింగ్‌ను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సింగిల్స్ తీయడం కన్నా బౌండరీలు, సిక్సర్లతోనే ఎక్కువ పరుగులు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే ధోని పరిగెత్తడం కంటే క్రీజులో ఉండి ఆడేందుకే ఇష్టపడుతున్నాడు. ఇదే విషయాన్ని ధోని తన శైలిలో పేర్కొన్నాడు.
"నేను చేయాల్సిన పనే ఇది. నా బ్యాటింగ్ రోల్ కరెక్ట్‌గానే ఉంది. నేను ఏం చేయాలనుకుంటున్నానో అదే చేయనివ్వండి అని వారికి చెప్పాను. ఎక్కువగా పరుగెత్తే అవకాశమివ్వద్దని చెప్పా. అది నా విషయంలో వర్క్ అవుతుంది కూడా. నాకు కావాల్సింది కూడా ఇదే. ఈ విధంగా ప్రదర్శన చేయడంపై సంతోషంగా ఉన్నా.అనవసరంగా పరిగెత్తి స్ట్రెయిన్ అవ్వడం కంటే ఉన్నంతసేపు దాటిగా ఆడడం మేలు" అని తెలిపాడు.
చదవండి: జోరు వర్షంలోనూ ఆగని పరుగు.. గెలిచినోళ్ల కంటే ఎక్కువ పేరు
Comments
Please login to add a commentAdd a comment