IPL 2023: DC Vs CSK Match 67 Live Updates And Highlights - Sakshi
Sakshi News home page

IPL 2023 DC Vs CSK: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లేఆఫ్స్‌లో సీఎస్‌కే!

Published Sat, May 20 2023 3:39 PM | Last Updated on Sat, May 20 2023 7:24 PM

IPL 2023: Delhi Capitals Vs CSK Live Match Updates-Highlights - Sakshi

IPL 2023: Delhi Capitals Vs CSK Live Match Updates:

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 224 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. డేవిడ్‌ వార్నర్‌ 58 బంతుల్లో 86 పరుగులతో ఒంటరిపోరాటం చేశాడు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌ మూడు వికెట్లు తీయగా.. మతీశా పతిరానా, మహిష్‌ తీక్షణలు రెండు వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయంతో సీఎస్‌కే ఖాతాలో 17 పాయింట్లు చేరడంతో ప్లేఆఫ్‌కు చేరుకున్నట్లే. అయితే లక్నో సూపర్‌జెయింట్స్‌ గెలుపోటములపై రెండు లేదా మూడో స్థానంలో ఉంటుందా అనేది నిర్థారణకు రానుంది.

ఓటమి దిశగా ఢిల్లీ క్యాపిటల్స్‌.. ప్లేఆఫ్స్‌లో సీఎస్‌కే
సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమి దిశగా పయనిస్తోంది. 224 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 15 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. వార్నర్‌ 73 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తున్నాడు. 30 బంతుల్లో 108 పరుగులు చేయడం అసాధ్యం కాబట్టి సీఎస్‌కే ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టినట్లే.

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం ఢిల్లీ 12 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. వార్నర్‌ 54, అక్షర్‌ పటేల్‌ ఏడు పరుగులతో ఆడుతున్నారు.

9 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 61/3
224 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 9 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. వార్నర్‌ 43, యష్‌  దుల్‌ 11 పరుగులతో ఆడుతున్నారు.

టార్గెట్‌ 224.. మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
224 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఒకే ఓవర్లు రెండు వికెట్లు కోల్పోయింది. దీపక్‌ చహర్‌ తొలుత సాల్ట్‌ను వెనక్కి పంపాడు. అనంతరం మరుసటి బంతికే గత మ్యాచ్‌ హీరో రొసౌను గోల్డెన్‌ డకౌట్‌ చేశాడు. ప్రస్తుతం సీఎస్‌కే 5 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ 224
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌(79), డెవన్‌ కాన్వే(87) పరుగులతో రాణించడంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఆఖర్లో జడేజా ఏడు బంతుల్లో 20 నాటౌట్‌, శివమ్‌ దూబే 9 బంతుల్లో 22 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, నోర్ట్జే, ఖలీల్‌ అహ్మద్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

కాన్వే(87) ఔట్‌..  సీఎస్‌కే 195/3
87 పరుగులు చేసిన కాన్వే నోర్ట్జే బౌలింగ్‌లో అమన్‌ హకీమ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది.

16 ఓవర్లలో సీఎస్‌కే 167/1
16 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్‌ నష్టానికి 167 పరుగులు చేసింది. డెవన్‌ కాన్వే 75, శివమ్‌ దూబే 8 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు 50 బంతుల్లో 79 పరుగులు చేసిన రుతురాజ్‌ చేతన్‌ సకారియా బౌలింగ్‌లో రిలీ రొసౌకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

దంచుతున్న రుతురాజ్‌.. సీఎస్‌కే 13 ఓవర్లలో  127/0
సీఎస్‌కే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తన సూపర్‌ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. 13 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్‌ నష్టపోకుండా 127 పరుగులు చేసింది. రుతురాజ్‌ 46 బంతుల్లో 78, కాన్వే 32 బంతుల్లో 47 పరుగులతో ఆడుతున్నారు.

దాటిగా ఆడుతున్న సీఎస్‌కే.. 5 ఓవర్లలో 50/0
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ను సీఎస్‌కే దూకుడుగా ఆరంభించింది. 5 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్‌ నష్టానికి 50 పరుగులు చేసింది. డెవన్‌ కాన్వే 27, రుతురాజ్‌ గైక్వాడ్‌ 21 పరుగులతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా శనివారం(మే 20న) ఢిల్లీ వేదికగా 67వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌, సీఎస్‌కే తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కన్నా సీఎస్‌కేకు ముఖ్యం. మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిస్తేనే ప్లేఆఫ్‌కు వెళుతుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్ (వికెట్‌ కీపర్‌), రిలీ రోసోవ్, యష్ ధుల్, అమన్ హకీమ్ ఖాన్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement