IPL 2023, CSK Vs DC Updates And Highlights: Chennai Super Kings Beat Delhi Capitals By 27 Runs At Chepauk - Sakshi
Sakshi News home page

IPL 2023 CSK Vs DC: ఎదురులేని సీఎస్‌కే.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం

Published Wed, May 10 2023 7:09 PM | Last Updated on Thu, May 11 2023 10:38 AM

IPL 2023:CSK Vs Delhi Capitals Match Live Updates-Highlights - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఎదురు లేకుండా సాగుతుంది. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులకే పరిమితమైంది.

రిలీ రొసౌ 35 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మనీష్‌పాండే 27, అక్షర్‌పటేల్‌ 21 పరుగులు చేశారు. సీఎస్‌కే బౌలర్లలో మతీషా పతీరానా మూడు వికెట్లు తీయగా.. దీపక్‌చహర్‌ రెండు, రవీంద్ర జడేజా ఒక వికెట్‌ పడగొట్టాడు.

91 పరుగులకే ఐదు వికెట్లు డౌన్‌.. కష్టా‍ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌
168 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 91 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్‌పటేల్‌ 1, రిపల్‌ పటేల్‌ 4 పరుగులతో ఆడుతున్నారు.

9 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌ 63/3
9 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ మూడు వికెట్ల నస్టానికి 63 పరుగులు చేసింది. రిలీ రొసౌ 24, మనీష్‌ పాండే 15 పరుగులతో ఆడుతున్నారు.

టార్గెట్‌ 168.. ఢిల్లీ క్యాపిటల్స్‌  47/3
168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. రిలీ రొసౌ 15, మనీష్‌ పాండే 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ 168
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సీఎస్‌కే బ్యాటర్లలో ఎవరు పెద్దగా రాణించకపోయినా తలా ఇన్ని పరుగులు చేశారు. శివమ్‌ దూబే 25, అంబటి రాయుడు 23, రుతురాజ్‌ గైక్వాడ్‌ 24, జడేజా 21, ధోని 20 పరుగులు సాధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో మిచెల్‌ మార్ష్‌ మూడు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌ రెండు, కుల్దీప్‌ యాదవ్‌, ఖలీల్‌ అహ్మద్‌లు చెరొక వికెట్‌ తీశారు.

రాయుడు(23) ఔట్‌.. ఆరో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే
23 పరుగులు చేసిన అంబటి రాయుడు ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో రిపల్‌పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 17 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. జడేజా 6, ధోని 1 పరుగుతో ఆడుతున్నారు.

14 ఓవర్లలో సీఎస్‌కే 111/4
14 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే నాలుగు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. దూబే 25, రాయుడు 18 పరుగులతో ఆడుతున్నారు. కాగా 21 పరుగులు చేసిన రహానే లలిత్‌ యాదవ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌కు వెనుదిరగాల్సి వచ్చింది.

మూడో వికెట్‌ కోల్పోయిన సీఎస్‌కే..
ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. ఏడు పరుగులు చేసిన మొయిన్‌ అలీ కుల్దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌లో మిచెల్‌ మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది.

6 ఓవర్లలో సీఎస్‌కే 49/1
6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్‌ నష్టానికి 49 పరుగులు చేసింది. రుతురాజ్‌ 21, రహానే 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. 10 పరుగులు చేసిన కాన్వే అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరగడంతో సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సీఎస్‌కే
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో బుధవారం చెన్నై వేదికగా 55వ మ్యాచ్‌లో సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన సీఎస్‌కే బ్యాటింగ్‌ ఎంచుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): ఎంఎస్‌ ధోని(వికెట్‌ కీపర్‌/కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్(కెప్టెన్‌), ఫిలిప్ సాల్ట్(వికెట్‌ కీపర్‌), మిచెల్ మార్ష్, రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ.

వరుస విజయాలతో దూకుడు మీదున్న సీఎస్‌కేను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎలా అడ్డుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇరుజట్లు గతంలో 27 సార్లు ఎదురుపడగా.. సీఎస్‌కే 17 సార్లు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ 10 మ్యాచ్‌లు గెలిచింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement