గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-1 పోరులో సీఎస్‌కే 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. 173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులకు ఆలౌట్ అయింది.
శుబ్‌మన్ గిల్ 42 పరుగులు చేయగా.. రషీద్ ఖాన్ 16 బంతుల్లో 30 పరుగులు మినహా మిగతావారు పెద్దగా రాణించలేదు. సీఎస్‌కే బౌలర్లలో జడేజా, దీపక్ చహర్, మతీశా పతీరానా, మహీష్ తీక్షణలు తలా రెండు వికెట్లు పడగొట్టగా.. తుషార్ దశ్‌పాండే ఒక వికెట్ తీశాడు. కాగా ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే ఫైనల్లో ప్రవేశించడం ఇది పదోసారి కావడం విశేషం.
15 ఓవర్లలో గుజరాత్ 102/6
15 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోక దిగిన గుజరాత్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విజయ్ శంకర్ 6 పరుగులు, రషీద్ ఖాన్ ఐదు పరుగులతో ఆడుతున్నారు.
తిప్పేసిన జడేజా, చహర్.. ఐదో వికెట్ డౌన్
సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన బౌలింగ్ మాయాజాలంతో ప్రమాదకర మిల్లర్‌ను బోల్తా కొట్టించాడు. 4 పరుగులు చేసిన మిల్లర్ జడ్డూ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మరుసటి ఓవర్లో దీపక్ చహర్ బౌలింగ్‌లో 42 పరుగులు చేసిన గిల్.. కాన్వేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 88 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
9 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 59/2
9 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. గిల్ 32, షనక 10 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 173.. రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్
173 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ 20 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు 8 పరుగులు చేసిన పాండ్యా తీక్షణ బౌలింగ్‌లో, 12 పరుగులు చేసిన సాహా దీపక్ చహర్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగారు.
గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 173
గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1లో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డెవాన్ కాన్వే 40 పరుగులు చేయగా.. ఆఖర్లో జడేజా 16 బంతుల్లో 22, మొయిన్ అలీ 4 బంతుల్లో 9 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు తీయగా.. దర్శన్ నల్కండే, రషీద్ ఖాన్, నూర్ అహ్మ్‌ద్‌లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
నాలుగో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. 125/4
గుజరాత్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసిన కాన్వే షమీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే నాలుగు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. రాయుడు 4, జడేజా 2 పరుగులతో ఆడుతున్నారు.
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. 13 ఓవర్లలో 99/2
శివమ్ దూబే(1 పరుగు) రూపంలో సీఎస్‌కే రెండో వికెట్ కోల్పోయింది. అంతకముందు 60 పరుగులు చేసిన రుతురాజ్ మోహిత్ శర్మ బౌలింగ్‌లో మిల్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే 13 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కాన్వే 31, రహానే 4 పరుగులతో ఆడుతున్నారు.
ఫిఫ్టీతో మెరిసిన రుతురాజ్.. 10 ఓవర్లలో సీఎస్‌కే 85/0
గుజరాత్‌టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అర్థసెంచరీ మెరిశాడు. సీజన్‌లో నాలుగో అర్థసెంచరీ సాధించిన గైక్వాడ్ 36 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఫిప్టీ సాధించాడు. ప్రస్తుతం సీఎస్‌కే 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. రుతురాజ్ 59, కాన్వే 24 పరుగులతో ఆడుతున్నారు.
ఆరు ఓవర్లలో సీఎస్‌కే 49/0
6 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. రుతురాజ్ 33, కాన్వే 14 పరుగులతో ఆడుతున్నారు.
నో బాల్‌తో బతికిపోయిన రుతురాజ్.. 3 ఓవర్లలో సీఎస్‌కే 23/0
గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-1 పోరులో సీఎస్‌కే ఓపెనర్ రుతురాజ్ నో బాల్ కారణంగా ఔట్ నుంచి తప్పించుకున్నాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్‌లో దర్శన్ నల్కండే వేసిన మూడో బంతికి రుతురాజ్ గిల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అయితే అది నోబాల్ కావడంతో బతికిపోయాడు. ఇక 3 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. రుతురాజ్ 18, కాన్వే 3 పరుగులతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం(మే 23న) క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్, సీఎస్‌కే తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దాసున్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
Hardik Pandya wins the toss & elects to do what his team does best - 𝘊𝘏𝘈𝘚𝘌 😎
Predict what total #CSK will restrict them to in Qualifier 1 💬#IPLonJioCinema #TATAIPL #GTvCSK #IPLPlayoffs #IPL2023 | @gujarat_titans @ChennaiIPL pic.twitter.com/kNV55gQl6J
— JioCinema (@JioCinema) May 23, 2023
ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ఫెవరెట్‌గా కనిపిస్తున్నప్పటికి హోంగ్రౌండ్‌లో ఆడడం సీఎస్‌కేకు కలిసొచ్చే అంశం. ఇరుజట్ల బలబలాలు సమానంగా ఉన్నప్పటికి గుజరాత్‌తో పోలిస్తే సీఎస్‌కే బౌలింగ్ కాస్త బలహీనంగా ఉంది. ఇక ఇరుజట్లు గతంలో మూడుసార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్‌నే విజయం వరించింది.
Comments
Please login to add a commentAdd a comment