IPL 2023: MS Dhoni Wins Hearts As He Signs Autographs For Chepauk Groundstaff, Video Goes Viral - Sakshi
Sakshi News home page

#MSDhoni: చెపాక్‌లో ఇదే చివరిసారి అనుకున్నారేమో..!

Published Fri, May 26 2023 5:27 PM | Last Updated on Fri, May 26 2023 6:22 PM

MS Dhoni Wins Hearts As He Signs Autographs-Chepauk Groundstaff Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఫైనల్‌ చేరుకున్న సీఎస్‌కే కూల్‌గా ఉంది. ఇవాళ(మే 26న) ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య క్వాలిఫయర్‌-2 జరగనుంది. ఆదివారం(మే 28న) జరగనున్న ఫైనల్లో సీఎస్‌కే.. గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌లో ఎవరిని ఎదుర్కోనుందనేది ఆసక్తికరంగా మారింది. 

ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో సీఎస్‌కే టైటిల్‌ కొడితే ధోని రిటైర్‌ అవుతాడంటూ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇంకా గాసిప్స్‌ వదులుతూనే ఉన్నారు. ధోని కూడా వచ్చే సీజన్‌లో తాను ఆడేది లేనిది మరో ఎనిమిది-తొమ్మిది నెలల్లో చెబుతానని పేర్కొన్నాడు. అందుకే ఈ సీజన్‌లో సీఎస్‌కే కప్‌ కొడితే.. వచ్చే సీజన్‌లో ధోని జట్టుకు ప్లేయర్‌గా కాకుండా మెంటార్‌గా ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఇప్పటికే ఫైనల్‌ చేరుకున్న సీఎస్‌కే తమ ఫైనల్‌ మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా ఆడనుంది. శుక్రవారం(మే26న) సీఎస్‌కే జట్టు అహ్మదాబాద్‌కు చేరుకోనుంది. ఇక సీఎస్‌కే కెప్టెన్‌ ధోని మాత్రం చెపాక్ గ్రౌండ్‌ సిబ్బందితో సరదాగా గడిపాడు. దాదాపు 16 ఏళ్ల పాటు తనపై అభిమానం పెంచుకున్న చెపాక్‌ స్టేడియం సిబ్బందికి తన ఆటోగ్రాఫ్‌ ఇచ్చి క్యాష్‌ రివార్డ్స్‌ అందజేశాడు. అంతేకాదు వారికి థ్యాంక్స్‌ గివింగ్‌ టోకెన్‌ అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్‌కే స్వయంగా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ '' చెపాక్‌లో చివరిసారి అనుకున్నారు.. అందుకే తలాపై అభిమానంతో'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: #MI: క్వాలిఫయర్‌-2లోనే ఆపండి.. ఫైనల్‌కు వచ్చిందో అంతే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement