IPL 2023 Qualifier 1, GT Vs CSK: MS Dhoni Moved A Fielder To The Off-Side A Ball Prior To Hardik Getting Dismissed, Watch Video - Sakshi
Sakshi News home page

DhoniVsPandya: ప్లాన్‌ వేసింది ఎవరు.. చిక్కకుండా ఉంటాడా?

Published Wed, May 24 2023 12:01 AM | Last Updated on Wed, May 24 2023 8:44 AM

Dhoni Move Fielder Off-side Ball Prior To Hardik Getting Dismissed Viral - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 15 పరుగుల తేడాతో విజయం సాధించి  రికార్డు స్థాయిలో పదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ విషయం పక్కనబెడితే.. ధోని వేసిన మాస్టర్‌ప్లాన్‌కు హార్దిక్‌ పాండ్యా అడ్డంగా చిక్కడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌ సమయంలో ఆరో ఓవర్‌ మహీష్‌ తీక్షణ వేశాడు. స్ట్రైక్‌లో పాండ్యా ఉండడంతో ధోని ఫీల్డ్‌ను సెట్‌ చేశాడు. ఈ క్రమంలో ఆఫ్‌సైడ్‌లో జడేజాను  ఉంచాడు.

తీక్షణ వేసిన ఐదో బంతిని పాండ్యా ఆఫ్‌సైడ్‌ దిశగానే ఆడాడు. అంతే నేరుగా బంతి జడ్డూ చేతుల్లోకి వెళ్లడంతో పాండ్యా నిరాశగా పెవిలియన్‌ చేరాడు. వీడియో చూసిన అభిమానులు.. ''ప్లాన్‌ వేసింది ఎవరు.. మాస్టర్‌మైండ్‌ ధోని.. ఇక పాండ్యా చిక్కకుండా ఉంటాడా చెప్పండి'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: 150 వికెట్లు.. 2వేలకు పైగా పరుగులు; తొలి ఆల్‌రౌండర్‌గా చరిత్ర 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement