ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నా వర్షంతో కనీసం టాస్ వేయడానికి వీలు పడలేదు. మధ్యలో ఒక పది నిమిషాలు తెరిపినివ్వడంతో మ్యాచ్ జరుగుతుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ కాసేపటికే వరుణుడు మళ్లీ జోరందుకున్నాడు. అప్పటినుంచి రాత్రి 11 గంటలయినా ఎంతకు తగ్గకపోవడంతో మ్యాచ్ రిఫరీ సైమన్ డౌల్.. అంపైర్లతో చర్చించి మ్యాచ్‌ను సోమవారానికి(మే 29) వాయిదా వేస్తున్నట్లు తెలిపాడు.
ఇక సోమవారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ జరగకుంటే తొలుత 5 ఓవర్లు మ్యాచ్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అదీ సాధ్యపడకపోతే సూపర్ ఓవర్ ద్వారా ఫలితం వచ్చేలా చేస్తారు. సూపర్ ఓవర్ కూడా సాధ్యపడకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి లీగ్ స్టేజీలో గ్రూప్ టాపర్‌గా నిలిచిన గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా ప్రకటిస్తారు.
The #Final of the #TATAIPL 2023 has been moved to the reserve day on 29th May - 7:30 PM IST at the Narendra Modi Stadium, Ahmedabad.
— IndianPremierLeague (@IPL) May 28, 2023
Physical tickets for today will be valid tomorrow. We request you to keep the tickets safe & intact. #CSKvGT pic.twitter.com/d3DrPVrIVD
వర్షం కారణంగా టాస్ ఆలస్యం
ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం (మే 28న) అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. వర్షం కారణంగా టాస్ ఆలస్యం కానుంది.
► ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్‌కు వేళైంది. విజేత ఎవరో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, పదోసారి ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ పోరులో ఢీ కొంటున్నాయి. అహ్మదాబాద్ స్టేడియం వేదికగా ఇరుజట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. దాంతో, పాండ్యా సేన రెండోసారి ట్రోఫీని ముద్దాడుతుందా? లేదా సీఎస్కే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోతుందా? అనే ఆసక్తి అందరిలో మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment