ఐపీఎల్ 16వ సీజన్ విజేతగా సీఎస్‌కే నిలిచింది. వర్షం కారణంగా 15 ఓవర్లలో 171 పరుగుల లక్ష్యాన్ని విధించగా.. సీఎస్‌కే నిర్ణీత 15 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఆఖరి ఓవర్లో 13 పరుగులు అవసరమైన దశలో జడేజా ఆఖరి రెండు బంతుల్లో సిక్సర్, ఫోర్ కొట్టి సీఎస్‌కేను గెలిపించాడు.
అంతకముందు ఓపెనర్లు రుతురాజ్ 26, డెవాన్ కాన్వే 47 పరుగులతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత శివమ్ దూబే 32 నాటౌట్, రహానే 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక చివర్లో జడేజా ఆరు బంతుల్లో 16 పరుగులు నాటౌట్ తన విలువేంటో మరోసారి చాటిచెబుతూ సీఎస్‌కేను ఐదోసారి చాంపియన్‌గా నిలిపాడు. ఈ విజయంతో ఐదోసారి టైటిల్ అందుకున్నసీఎస్‌కే ముంబై ఇండియన్స్‌తో కలిసి సమంగా నిలిచింది.
ధోని గోల్డెన్ డక్.. ఐదో వికెట్ కోల్పోయిన సీఎస్‌కే
గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సీఎస్‌కే 150 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. శివమ్ దూబే 25, జడేజా రెండు పరుగులతో ఆడుతున్నారు.
12 ఓవర్లలో సీఎస్‌కే 133/3
12 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే మూడు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. శివమ్ దూబే 25, అంబటి రాయుడు 9 పరుగులతో ఆడుతున్నారు.
టార్గెట్ 171.. వంద పరుగులు దాటిన సీఎస్‌కే
171 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే వంద పరుగుల మార్క్‌ను దాటింది. 10 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే రెండు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. అజింక్యా రహానే 26, శివమ్ దూబే 8 పరుగులతో ఆడుతున్నారు.
నూర్ అహ్మద్ దెబ్బ.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ధాటిగా ఆడుతున్న సీఎస్‌కేను నూర్ అహ్మద్ దెబ్బ తీశాడు. ఓపెనర్లు రుతురాజ్, కాన్వే రూపంలో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. సీఎస్‌కే విజయానికి 48 బంతుల్లో 93 పరుగులు కావాలి.
తొలి వికెట్ కోల్పోయిన సీఎస్‌కే.. రుతురాజ్ ఔట్
26 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం సీఎస్‌కే వికెట్ నష్టానికి 75 పరుగులు చేసింది.
6 ఓవర్లలో సీఎస్‌కే 72/0
ఆరు ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. కాన్వే 22 బంతుల్లో 44 పరుగులతో వేగంగా ఆడుతుండగా.. రుతురాజ్ 25 పరుగులతో సహకరిస్తున్నాడు.
దంచుతున్న రుతురాజ్, కాన్వే.. 4 ఓవర్లో సీఎస్‌కే 52/0
171 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. రుతురాజ్ 23, కాన్వే 29 పరుగులతో ధాటిగా ఆడుతున్నారు.
టార్గెట్ 171.. 2 ఓవర్లలో సీఎస్‌కే 24/0
2 ఓవర్లు ముగిసేసరికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ 11, డెవాన్ కాన్వే 12 పరుగులతో క్రీజులో ఉన్నారు.
డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో సీఎస్‌కే టార్గెట్ 15 ఓవర్లలో 171
గంటన్నర పాటు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు టార్గెట్‌ను కుదించారు. 15 ఓవర్లలో సీఎస్‌కే టార్గెట్ 171 పరుగులుగా నిర్ధేశించారు. వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.
టార్గెట్ 215.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం
గుజరాత్ టైటాన్స్, సీఎస్‌కే మధ్య ఫైనల్‌మ్యాచ్‌కు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. సీఎస్‌కే ఇన్నింగ్స్ ప్రారంభమైన తొలి ఓవర్లో నాలుగు బంతులు పడగానే వర్షం మొదలైంది. ప్రస్తుతం సీఎస్‌కే వికెట్ నష్టపోకుండా 4 పరుగులు చేసింది.
సాయి సుదర్శన్ మెరుపులు.. సీఎస్‌కే టార్గెట్ 215
సీఎస్‌కేతో జరుగుతున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (47 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు) నాలుగు పరుగలతో సెంచరీ మిస్ చేసుకున్నప్పటికి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ సాహా 54 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. గిల్ 39, పాండ్యా 21 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. సీఎస్‌కే బౌలర్లలో పతీరానా రెండు వికెట్లు తీయగా.. జడేజా, దీపక్ చహర్‌లు చెరొక వికెట్ తీశారు.
18 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 182/2
18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 79, పాండ్యా 8 పరుగుతో క్రీజులో ఉన్నారు.
సాయి సుదర్శన్ ఫిఫ్టీ.. గుజరాత్ 16 ఓవర్లలో 153/2
సీఎస్‌కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు దిశగా సాగుతుంది. సాయి సుదర్శన్ 32 బంతుల్లో ఫిఫ్టీ సాధించడంతో గుజరాత్ 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 57, పాండ్యా ఒక్క పరుగుతో క్రీజులో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన గుజరాత్.. సాహా(54)ఔట్
54 పరుగులు చేసిన సాహా దీపక్ చహర్ బౌలింగ్‌లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గుజరాత్ 131 పరుగులు వద్ద రెండో వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 36, పాండ్యా క్రీజులో ఉన్నారు.
12 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 109/1
12 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టానికి 109 పరుగులు చేసింది. సాహా 48, సాయి సుదర్శన్ 20 పరుగులతో ఆడుతున్నారు.
ధోని సూపర్ స్టంపింగ్.. గిల్(39) ఔట్
సీఎస్‌కేతో ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ధోని సూపర్‌ఫాస్ట్ స్టంపింగ్‌కు గిల్ వెనుదిరగాల్సి వచ్చింది. 39 పరుగులు చేసిన గిల్ జడ్డూ బౌలింగ్‌లో షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకు వచ్చాడు. అంతే ధోని సూపర్‌ఫాస్ట్‌గా బంతిని అందుకొని వికెట్లను గిరాటేయడంతో గిల్ స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం గుజరాత్ వికెట్ నష్టానికి 71 పరుగులు చేసింది.
3 ఓవర్లలో గుజరాత్ స్కోరు 24/0
మూడు ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. సాహా 20, గిల్ 4 పరుగులుతో ఆడుతున్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్‌కే
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు మ్యాచ్‌కు వర్షం ముప్పు అంతలా కనిపించడం లేదు. టాస్ గెలిచిన సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్/కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
🚨 Toss Update 🚨
Chennai Super Kings win the toss and elect to field first against Gujarat Titans.
Follow the match ▶️ https://t.co/WsYLvLrRhp#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/HYMcLKhfKy
— IndianPremierLeague (@IPL) May 29, 2023
ఇరుజట్లు ఇప్పటివరకు నాలుగుసార్లు తలపడగా.. గుజరాత్ టైటాన్స్ మూడుసార్లు.. సీఎస్‌కే ఒకసారి విజయం సాధించాయి. ఇక ఫైనల్లో సీఎస్‌కే గెలిచి ఐదోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందా లేక గుజరాత్ టైటాన్స్ రెండోసారి విజేతగా నిలుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment