సాక్షి, ముంబై: ప్రస్తుతం ఎక్కడ ఐపీఎల్ 2023 ఫైనల్ చర్చ నడుస్తోంది. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న తుదిపోరు ఆదివారం వాయిదా పడటంతో ఈ ఫీవర్‌మరింత పెరిగింది. అయితే పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ చైర్మన్, ఆనంద్ మహీంద్రా ఐపీఎల్ విన్నర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కరెంట్ అఫైర్స్ నుండి జోక్స్ వరకు తన అభిప్రాయాలను నిక్కచ్చిగా ప్రకటించే మహీంద్రా ఆదివారం(మే 28) నాటి ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆశ్చర్యకర కమెంట్స్ చేశారు. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు)
గుజరాత్ టైటాన్స్ స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్, క్రికెట్ ఐకాన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మధ్య కీలకమైన ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఏ జట్టుకు మద్దతు అని అడిగారు సరే, శుబ్‌మన్ గిల్ ప్రతిభను నమ్ముతున్నాను. అతను మరింత రాణించాలను కుంటున్నా. కానీ తాను మాత్రం ఎంఎస్ ధోనీకి ఫ్యాన్‌నే అంటూ.. ఈ ఫైనల్ పోరులో కప్పు అతనిదే అన్నట్టు కమెంట్ చేశారు. చివరికి అత్యుత్తమ జట్టును గెలిపిద్దా అంటూ ట్వీట్‌చేశారు. ఈ ట్వీట్ ఇప్పటిదాకా 237.5 వేల లైక్స్‌ను సాధించింది. 2021లో ఆస్ట్రేలియాపై తన అద్భుతమైన ప్రదర్శనకు ముగ్ధుడైన ఆనంద్ మహీంద్రా మహీంద్రా థార్ ఎస్‌యూవీని శుభ్‌మాన్ గిల్‌కు బహుమతిగా ఇచ్చారు. (కేవీపీ పెట్టుబడి డబుల్ ధమాకా: పదేళ్లదాకా ఆగాల్సిన పనిలేదు!)
డోంట్ మిస్ టు క్లిక్ హియర్: సాక్షిబిజినెస్
కాగా వర్షం కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2023 టైటిల్ పోరులో, గుజరాత్ టైటాన్స్, చెన్నైసూపర్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా రిజర్వ్ డే సోమవారం జరగనున్న మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రాజేస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్‌లో 60.79 సగటుతో శుభ్‌మన్ గిల్ పరుగులు చేసిన ఆటగాడు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు సాధించాడు. అతను మొత్తం 851 పరుగులు చేశాడు. శుభ్‌మాన్ గిల్ సిక్సర్ మోత మోగించి సూపర్ ఫెర్‌ఫామెన్స్‌తో విరాట్ కోహ్లీ, ఎం ధోని, యువరాజ్ సింగ్ , సచిన్ టెండూల్కర్ లాంటి క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు దక్కించుకున్నాడు. (3వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!)
I was asked which team I’m supporting in tonight’s #IPL2023Final Well, I’m a believer in Shubhman’s talents & would like to see them flower tonight BUT I’m a bigger fan of #MSDhoni & can’t help but hope for him to blaze a trail of glory tonight. 😊So let the best team win…!
— anand mahindra (@anandmahindra) May 28, 2023
Comments
Please login to add a commentAdd a comment