winner
-
కుటుంబ సమేతంగా సింహాచలం అప్పన్నను దర్శించుకున్న బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
మిస్ యూనివర్స్ ఇండియా 2024గా రియా సింఘా! 'తాజ్ మహల్ కిరీటం"..!
ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని గుజరాత్‌కి చెందిన రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో రియా సింఘా విజయకేతనం ఎగరువేశారు. ఫైనల్లో మొత్తం 51 మందితో పోటిపడి ఈ కిరీటాన్ని సొంతం చేసుకుంది రియా. 2015లో మిస్ యూనివర్స్ ఇండియాగా కిరీటాన్ని దక్కించుకున్న ఊర్వశి రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం విశేషం. ఊర్వసి చేతుల మీదుగానే 'తాజ్ మహల్ కిరీటం' పొందింది రియా. ఈ సందర్భంగా ఊర్వశీ మాట్లాడుతూ..ఆమె ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియాగా రియా కిరీటాన్ని గెలుపొందడం ఆనందంగా ఉంది. అంతేగాదు ఈ ఏడాది చివర్లో జరిగి ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీల్లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహించనుంది. ఆ పోటీల్లో కూడా రియానే గెలవాలని ఆశిస్తున్నా. ఈ పోటీలో అమ్మాయిలంతా కూడా చాలా అంకితభావంతో కష్టపడారని అన్నారు ఊర్వశి. ఇక టైటిల్ విజేత రియా మాట్లాడుతూ.. ఈ మిస్ యూనివర్స్ ఇండియా 2024 టైటిల్‌ను గెలుపొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ టైటిల్ దక్కించుకునేందుకు తాను అన్ని విధాల తగినదాన్ని అని ఆత్మవిశ్వాసంగా చెప్పింది. అలాగే తాను మునుపటి విజేతల నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని సగర్వంగా చెప్పుకొచ్చింది రియా. ఇదిలా ఉండగా, రియా ఫైనల్లో షాంపైన్ గోల్డ్ గౌనులో పుత్తడి బొమ్మలా ధగధగ మెరిసిపోయింది. అందుకు తగ్గట్టు చెవులకు ధరించిన డైమండ్ రింగులు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. కాగా, ఈ అందాల పోటీల్లో గుజరాత్‌కి చెందిన రియా సింఘా 18 ఏళ్ల వయసుకే పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. View this post on Instagram A post shared by Miss Universe India (@missuniverseindiaorg) (చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!) -
హిందీ బిగ్ బాస్ విన్నర్‌గా టాలీవుడ్ నటి (ఫోటోలు వైరల్)
-
International Cricket Council: టి20 ప్రపంచకప్ విజేతకు రూ.20.35 కోట్లు
న్యూయార్క్: అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ప్రస్తుత టి20 ప్రపంచకప్ విజేతకు ఈసారి గతం కంటే రెట్టింపు ప్రైజ్‌మనీ లభించనుంది. కప్ గెలిచిన జట్టుకు రూ. 20.35 కోట్లు (2.45 మిలియన్ అమెరికా డాలర్లు), రన్నరప్ జట్టుకు రూ. 10.63 కోట్లు (1.28 మిలియన్ డాలర్లు) అందజేస్తారు. సెమీఫైనల్స్‌తోనే ఆగిపోయిన ఇరుజట్లకు రూ. 6.54 కోట్లు (7,87,500 మిలియన్ డాలర్లు) చొప్పున ఇస్తారు. ఈనెల 29వ తేదీన ముగిసే ఈ టోర్నీలో తొలిసారి 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 93.48 కోట్లు (11.25 మిలియన్ డాలర్లు)గా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం ప్రకటించింది. ఇది గత 2022 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 46.53 కోట్ల (5.6 మిలియన్ డాలర్లు)కి రెట్టింపు మొత్తం. ట్రోఫీ గెలిచిన ఇంగ్లండ్‌కు రూ. 13.29 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) లభించాయి. -
జైలు నుంచి వచ్చాడు.. రూ.3 కోట్ల కారు కొన్నాడు!
ఇటీవల ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలిచిన బిగ్ బాస్ విన్నర్ ఎల్విశ్ యాదవ్. పాము విషం కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై విడదలయ్యారు కూడా. యూట్యూబర్‌గా సోషల్ మీడియా ద్వారా క్రేజ్ తెచ్చుకున్న ఎల్విశ్ యాదవ్ బిగ్‌బాస్ షో మరింత గుర్తింపు దక్కించుకున్నారు. ఇటీవల జైలు నుంచి బయటికొచ్చిన ఎల్విశ్ యాదవ్ ఖరీదైన లగ్జరీ కారును కొన్నారు. తాజాగా మెర్సిడెస్ గ్వాగన్ మోడల్ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు విలువ దాదాపు రూ.3 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. అయితే ఈ కారును 2022లోనే కొనాలనుకున్నట్లు తన వీడియో ఎల్విశ్ వెల్లడించారు. అప్పుడు కుదరకపోవడంతో ఈ ఏడాది తన కల నెరవేరిందని అన్నారు. కాగా.. ఎల్విశ్ యాదవ్ బిగ్ బాస్ ఓటీటీ సీజన్- 2 విజేతగా నిలిచారు. -
2024 Japanese Grand Prix: వెర్‌స్టాపెన్‌కు మూడో విజయం
సుజుకా (జపాన్): జపాన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఈ రేసును వెర్స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించాడు. నిరీ్ణత 53 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 54 నిమిషాల 23.566 సెకన్లలో పూర్తి చేసి ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ అగ్రస్థానాన్ని దక్కించుకొని కెరీర్లో 57వ టైటిల్‌ను సాధించాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది మూడో విజయంకాగా... జపాన్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో గెలుపు కావడం విశేషం. రెడ్‌బుల్ జట్టుకే చెందిన సెర్జియో పెరెజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో నాలుగు రేసుల తర్వాత వెర్స్టాపెన్ 77 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుండగా... 64 పాయింట్లతో పెరెజ్ రెండో స్థానంలో, 59 పాయింట్లతో లెక్లెర్క్(ఫెరారీ) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని ఐదో రేసు చైనా గ్రాండ్‌ప్రి ఈనెల 21న జరుగుతుంది. -
క్లాసిక్ మిసెస్ ఇండియా విజేతగా హైదరాబాదీ (ఫొటోలు)
-
మిస్ వరల్డ్ 2024 విజేత క్రిస్టినా పిస్కోవా ఎవరు?
మిస్ వరల్డ్ 2024 అందాల పోటీల ఫైనల్స్ శనివారం ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో చెక్‌రిపబ్లిక్‌కు చెందిన క్రిస్టినా పిస్కోవో విజేతగా నిలిచి కిరిటాన్ని దక్కించుకుంది. దాదాపు 115 దేశాల నుంచి పోటీదారులు పాల్గొన్నారు. వీరంతా తమ అందం, ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు. ఇంతమంది అందగత్తెలను వెనక్కి నెట్టి ఫైనల్లో క్రిస్టినా పిస్కోవా కిరిటాన్ని కైవసం చేసుకుంది. పోలాండ్‌కు చెందిన మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావ్స్క్ క్రిస్టినా పిస్కోవాకు తన కిరీటాన్ని అందించింది. ఇంతకీ ఎవరీమె అంటే.. క్రిస్టినా పిస్కోవాకి ఇంగ్లీష్, పోలిష్, స్లోవాక్, జర్మన్ తదితర భాషలపై మంచి పట్టు ఉంది. ఆమె ఎత్తు 180 సెం.మీ. చెక్ రిపబ్లిక్ నుంచి 2006 మిస్ వరల్డ్ పోటీలో గెలుపొందిన టటానా కుచరోవా తర్వాత క్రిస్టినా మళ్లీ ఈ కిరీటాన్ని దక్కించుకోవడం విశేషం. క్రిస్టినా యువత, పిల్లలు, పెద్దలు, వికలాంగులకు విద్య అందేలా ఒక ఫౌండేషన్‌ని నడుపుతోంది. అలాగే సంక్షేమ పనుల కోసం క్రిస్టినా పిస్జ్కోవా ఫౌంలడేషన్ను స్థాపించింది. ఇవిగాక టాంజానియాలో ఒక ఆంగ్ల మాధ్యమ పాఠశాలను ఏర్పాటు యువత విద్యను కొనసాగించేలా చేసింది. నిరుపేద పిల్లలకు విద్య అందేలా చేయడం వంటి పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. పెద్ద మొత్తంలో దాతృత్వక కార్యక్రమాలు చేసింది. ఆమెకు కళలంటే మక్కువ. ఆ ఆసక్తితోనే ఆర్ట్ అకాడమీలో చేరి సంగీతం, వేణువు, వయోలిన్ వంటివి వాయించడం నేర్చుకుంది. View this post on Instagram A post shared by Miss World (@missworld) (చదవండి: మిస్ వరల్డ్ పోటీల్లో పింక్ సీక్విన్ గౌనుతో మెరిసిన పూజా హెగ్డే!) -
ప్రపంచ సుందరి 2024
-
మిస్ వరల్డ్‌గా చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా
మిస్ వరల్డ్–2024 కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ సుందర్ క్రిస్టినా పిజ్కోవా గెలుచుకున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఫైనల్స్ జరిగాయి. విజేతగా నిలిచిన క్రిస్టినాకు పోలండ్‌కు చెందిన ప్రస్తుత మిస్ వరల్డ్ కరోలినా కిరీటం ధరింపజేశారు. రన్నరప్‌గా మిస్ లెబనాన్ యాస్మినా జెటౌన్ ఎంపికయ్యారు. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ముంబై వాసి ఫెమినా మిస్ ఇండియా సిని షెట్టి(22) అయిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యమిచ్చింది. -
మిస్ జపాన్‌గా ‘ఉక్రెయిన్’ యువతి!
టోక్యో: ఆమె పేరు కరోలినా షినో. వయసు 26 ఏళ్లు. ప్రఖ్యాత మోడల్. తాజాగా జరిగిన మిస్ నిప్పన్ (జపాన్ పాత పేరు) పోటీల్లో విజేతగా నిలిచింది. ఆమె మిస్ జపాన్ కిరీటం నెగ్గడంపై దేశమంతటా విపరీతమైన చర్చ జరుగుతోంది. ఆమె జన్మతః ఉక్రేనియన్ కావడమే ఇందుకు కారణం! షినోకు ఐదేళ్ల వయసులో ఆమె తల్లి ఓ జపనీయున్ని పెళ్లాడింది. ఆ వెంటనే తల్లితో పాటు ఆమె ఉక్రెయిన్ వీడి జపాన్ వచ్చేసింది. గతేడాదే షినోకు జపాన్ పౌరసత్వం కూడా లభించింది. తాను నూరుపాళ్లు జపాన్ పౌరురాలినేనని షినో చెబుతోంది. ‘‘కాకపోతే ఆ గుర్తింపు కోసం ఏళ్ల తరబడి పోరాడాల్సి వచి్చంది. పదేపదే జాతి వివక్షను ఎదుర్కొన్నా. మిస్ జపాన్ కిరీటం దక్కినందున ఆ అవమానాలకు ఇకనైనా తెర పడుతుందనే అనుకుంటున్నా’’ అంటూ ఆశాభావం వెలిబుచ్చింది. జపాన్ భిన్న జాతులకు ఆలవాలం. గతంలోనూ విదేశీ మూలాలున్న పలువురు మిస్ జపాన్ కిరీటం నెగ్గారు. -
Pallavi Prashanth Arrest: బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్!
బిగ్‌బాస్ విన్నర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కొల్గూరులో పల్లవి ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీ హిల్స్ పీఎస్‌కు స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రియాలిటీ షో ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రశాంత్‌తో పాటు అభిమానులపై కూడా పోలీసులు నమోదు చేశారు. స్టూడియో బయట జరిగిన ఘర్షణల్లో కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ గొడవలో ప్రశాంత్‌తో సహా మొత్తం ఐదుగురిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఇద్దరు అరెస్ట్ ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా.. ఎ-2గా అతడి సోదరుడు మనోహర్‌ను, ఎ-3గా అతడి స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. అయితే, ఈ కేసులో ఎ-4గా ఉన్న ఉప్పల్ మేడిపల్లికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న సాయికిరణ్ (25)ను, అంకిరావుపల్లి రాజు (23)ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తాజాగా పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడినీ అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలన్న ప్రశాంత్ లాయర్ బిగ్‌బాస్ సీజన్–7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ అన్నారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలొచ్చినా.. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆన్లైన్లో పెట్టలేదని తెలిపారు. సామాన్య రైతు బిడ్డగా వెళ్లి బిగ్‌బాస్ టైటిల్‌ను గెలుచుకున్న యువకునికి ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ ప్రశ్నించారు. -
పరారీలో రైతుబిడ్డ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పల్లవి ప్రశాంత్!
బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై తెలంగాణ పోలీసులు కేసు పెట్టిన విషయం తెలిసిందే. ముందు గేటు నుంచి రావద్దని పోలీసులు చెప్పినా కూడా ప్రశాంత్ రావడం వల్ల అక్కడ పరిస్థితి కంట్రోల్ చేయడం తమ వల్ల కాలేదేని ఆ సమయంలో పోలీసులు తెలిపారు. ఆ సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు కూడా ధ్వంసం అయ్యాయి. దీంతో సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఉదయం నుంచి పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వార్తలొచ్చాయి. ఈ విషయంపై ప్రశాంత్ లాయర్, హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ కేసుల వల్ల భయపడిన పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. అందుకే ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులను సంప్రదించినట్లు వెల్లడించారు. అయితే తాజాగా బిగ్‌బాస్ విన్నర్ ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను ఎక్కడికి పోలేదని.. ఇంటివద్దనే ఉన్నా.. కొందరు కావాలనే నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వల్ల ఇబ్బంది కలిగితే నన్ను క్షమించండి.. కొందరు కావాలనే ఇలా చేసి నాపై నెగెటివ్ చేస్తున్నారు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.. ఇంతవరకు నేను ఫోన్ కూడా పట్టుకోలే.. వేరేవాళ్ల ఫోన్లో లాగిన్ అయి వీడియోలు పెట్టానని అన్నాడు. ఎవరు టెన్షన్ పడకుర్రి.. నేను ఊర్లోనే ఉన్నానంటూ పల్లవి ప్రశాంత్ వీడియోలో మాట్లాడారు. సాక్షితో బిగ్ బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'ఇంట్లోనే ఉన్నా.. నేను ఎక్కడికి పారిపోలేదు. కావాలనే కొందరు నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. బస్సులపై దాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి చర్యలను ఖండిస్తున్నా. నా గెలుపు రైతుల విజయం. నా గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా పై వస్తున్నా తప్పుడు వార్తలతో కలత చెందా. జీవితాంతం రైతు బిడ్డగానే ఉంటా. రేపటి నుంచి వ్యవసాయ పనుల్లో ఉంటా. హౌస్‌లో శివాజీ అన్న నాకు అండగా ఉన్నారు. నాగార్జున ,శివాజీ గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటా.' అని అన్నారు. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) -
పల్లవి ప్రశాంత్ కార్ డ్రైవర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
-
Davis Cup final 2023: డేవిస్ కప్ విజేత ఇటలీ
మలాగా (స్పెయిన్): డేవిస్ కప్‌లో ఇటలీ జట్టు అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. టోర్నీ చరిత్రలో రెండో సారి ఆ జట్టు విజేతగా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరడం విశేషం. టెన్నిస్‌లో వరల్డ్ కప్‌లాంటి డేవిస్ కప్‌లో చివరిసారిగా 1998లో ఫైనల్ చేరి ఓటమిపాలైన ఇటలీ... పాతికేళ్ల తర్వాత వచి్చన అవకాశాన్ని వదులుకోలేదు. ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో 28 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. 2003లో ఆఖరి టైటిల్ సాధించిన ఆ్రస్టేలియా గత రెండు దశాబ్దాలుగా ప్రయతి్నస్తున్నా మరో ట్రోఫీని సొంతం చేసుకోలేకపోయింది. ఈ సారి కూడా ఆ జట్టు చివరి మెట్టుపై చతికిలపడింది. తొలి మ్యాచ్‌లో ఇటలీ ఆటగాడు మటియో ఆర్నాల్డి 7–5, 2–6, 6–4 స్కోరుతో అలెక్సీ పాపిరిన్పై విజయం సాధించాడు. 2 గంటల 27 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ మ్యాచ్‌లో చివరకు 22 ఏళ్ల ఆర్నాల్డిదే పైచేయి అయింది. రెండో పోరులో వరల్డ్ నంబర్ 4 జనిక్ సిన్నర్ స్థాయికితగ్గ ఆటతీరుతో చెలరేగాడు. సిన్నర్ 6–3, 6–0తో అలెక్స్‌ను చిత్తు చేశాడు. 81 నిమిషాల్లోనే ముగిసిన ఆటలో సిన్నర్ 5 ఏస్‌లు కొట్టాడు. సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు జొకోవిచ్‌ను ఓడించిన జోరులో ఉన్న సిన్నర్ తుది పోరులోనూ అదే ఫామ్‌ను కొనసాగించాడు. -
సింగపూర్ ఆహార పోటీల్లో విజేతగా ‘బిరియాని’
హైదరాబాదీ వంటకం బిరియానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సింగపూర్‌లో జరిగిన ఫేవరెట్ హాకర్ ఆహార పోటీల్లో ఈ హైదరబాదీ వంటకం విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో మొత్తం 12 ఆహార పదార్థాలను విజేతలుగా ఎంపిక చేయగా అందులో బిరియాని ఒకటిగా నిలిచింది. అక్కడ బిరియాని తయారీకి ప్రసిద్ధి చెందిన హాజీ హనీఫా ఎం అన్సారీ ఈటింగ్ హౌజ్ బహుమతిని అందుకుంది. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో భాగంగా పైప్డ్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ సిటీ ఎనర్జీ పీటీఈ లిమిటెడ్ అనే సంస్థ ఈ పోటీలను నిర్వహించింది. ఈ సంస్థ అక్కడి ఫుడ్ కోర్టులు, ఆహార దుకాణాలకు గ్యాస్‌ను సరఫరా చేస్తుంది. జులై 4 నుంచి సెప్టెంబర్ 15 వరకు దాదాపు రెండున్నర నెలలపాటు ఈ పోటీలు జరిగాయి. 13వ వార్షిక సిటీ హాకర్ (వీధి దుకాణాలు) ఫుడ్ హంట్‌లో భాగంగా సింగపూర్ ప్రత్యేకమైన హాకర్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఈ పోటీల్లో విజేతకు 500 సింగపూర్ డాలర్లు (సుమారు రూ.30 వేలు), మెడల్, సర్టిఫికెట్‌ను అందజేస్తారు. -
బిగ్ బాస్ విన్నర్‌కు బిగ్ షాక్!
బిగ్ బాస్ ఓటీటీ సీజన్-2 విన్నర్ ఎల్విష్ యాదవ్‌కు బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎల్విష్ యాదవ్‌పై నోయిడా పోలీసులు కేసు నమోదు చేశారు. పాము విషంతో రేవ్ పార్టీలను నిర్వహించారని అతనిపై ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. నోయిడాలోని ఫామ్‌హౌస్‌ల్లో ఎల్విష్, ఇతర యూట్యూబర్లతో కలిసి పాములు, వాటి విషంతో వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పీపుల్ ఫర్ యానిమల్ (పీఎఫ్ఏ) సంస్థ అధికారి గౌరవ్ గుప్తా ఫిర్యాదు చేశారు. చట్టవిరుద్ధంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని.. అంతే కాకుండా విదేశీ మహిళలతో పాటు పాము విషం, మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని గౌరవ్ ఆరోపించారు. దీంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. అటవీ శాఖ అధికారులతో కలిసి సెక్టార్ -51 సెవ్రాన్ బాంక్వెట్ హాల్‌పై దాడి చేశారు. అక్కడే ఉన్న ఢిల్లీకి చెందిన రాహుల్, టిటునాథ్, జయకరన్, నారాయణ్, రవినాథ్ అనే ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 20 మిల్లీలీటర్ల పాము విషం, ఐదు నాగుపాములు, ఒక కొండచిలువ, రెండు రెండు తలల పాములు, ఒక ఎలుక పామును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులతో పాటు ఎల్విష్‌పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ OTT సీజన్ 2లో విన్నర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఊర్వశి రౌతేలాతో కలిసి 'హమ్ తో దీవానే' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించాడు. అయితే పోలీసుల ఆరోపణలను ఎల్విష్ యాదవ్ ఖండించారు. ఇదంతా అసత్యమని.. అలాంటిదేం జరగలేదని కొట్టిపారేశాడు. pic.twitter.com/5NdfYygsXn — Elvish Yadav (@ElvishYadav) November 3, 2023 All are allegations are proven wrong, Shame on these fake news agencies.. STOP DEFAMING ELVISH#ElvishYadav𓃵 #ElvishYadav pic.twitter.com/xoowRyDitY — Rao Sahab ( Parody) (@TeamRaoSahab) November 3, 2023 -
వెర్స్టాపెన్ రికార్డు
మెక్సికో సిటీ: ఇప్పటికే ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నప్పటికీ... రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ మాత్రం ఫార్ములావన్–2023 సీజన్లో ఎదురులేకుండా దూసుకుపోతున్నాడు. మెక్సికో గ్రాండ్‌ప్రి రేసులో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ప్రధాన రేసును మూడో స్థానం నుంచి ప్రారంభించిన వెర్స్టాపెన్ తొలి మలుపు వద్ద ప్రత్యర్థి డ్రైవర్లను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత రేసు చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ 71 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 2 నిమిషాల 30.814 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది 16వ గెలుపు కావడం విశేషం. తద్వారా ఒకే ఏడాది అత్యధిక ఎఫ్1 రేసుల్లో గెలిచిన డ్రైవర్‌గా తన పేరిటే ఉన్న రికార్డును వెర్స్టాపెన్ బద్దలు కొట్టాడు. గత ఏడాది వెర్స్టాపెన్ 15 రేసుల్లో గెలుపొందాడు. ఓవరాల్‌గా వెర్స్టాపెన్ కెరీర్లో ఇది 51వ విజయం. ఈ క్రమంలో కెరీర్లో అత్యధిక ఎఫ్1 విజయాలు సాధించిన డ్రైవర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్) సరసన నిలిచాడు. -
ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్.. జాబితాలో నాలుగు - అవార్డు దేనికో?
ప్రతిష్టాత్మక 2023 ఆటో అవార్డ్స్ మూడవ సీజన్ విజేతలను ఈ రోజు సెంట్రల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ 'జితేంద్ర సింగ్' సమక్షంలో ప్రకటిస్తారు. ఇందులో అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు సిద్దమవుతాయి. ఈ రోజు ఏ విభాగంలో ఏ వాహనం విజేతగా నిలుస్తుందో అధికారికంగా తెలుస్తుంది. ఫేస్‌లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్, డిజైన్ ఆఫ్ ది ఇయర్, ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్, లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ ఆఫ్ ది ఇయర్.. ఇలా అనేక విభాగాల్లో వాహనాలు ప్రదర్శనకు వస్తాయి. ఇప్పటికే కొన్ని వాహనాలు నామినేషన్‌కు సిద్ధమయ్యాయి. తుది ఫలితాలు, విజేతలు త్వరలో తెలుస్తాయి. ఇదీ చదవండి: విలీనానికి మరో రెండు బ్యాంకులు - డేట్ ఫిక్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ (Electric Two-Wheeler of the Year) అవార్డు నామినేషన్ జాబితాలో 'అల్ట్రా వయొలెట్ ఎఫ్ 77, ఏథర్ 450 ఎక్స్ జెన్3 (మూడవ తరం ఏథర్ 450 ఎక్స్), హీరో విడా వి1, టార్క్ క్రటోస్ ఆర్' ఉన్నాయి. ఇందులో టైటిల్ విన్నర్ ఎవరనేది ఈ రోజే తెలిసిపోతుంది. -
Asian Games 2023: కూలి పనులు చేసిన ఈ చేతులు కాంస్య పతకం అందుకున్నాయి
మనం కనే కలలకు మన ఆర్థికస్థాయి, హోదాతో పనిలేదు. సంకల్పబలం గట్టిగా ఉంటే మనల్ని విజేతలను చేస్తాయి. అందరిచేతా ‘శబ్భాష్’ అనిపించేలా చేస్తాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంబాబు కూలి పనులు చేసేవాడు. ఆటల్లో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేవాడు. నిజానికి అతడి కలలకు, అతడు చేసే కూలిపనులకు పొంతన కుదరదు. అయితే లక్ష్యం గట్టిగా ఉంటే విజయం మనవైపే చూస్తుంది. కూలిపనులు చేస్తూనే కష్టపడి తన కలను నిజం చేసుకున్నాడు. ఆసియా గేమ్స్‌లో 35 కిలోమీటర్ల రేస్‌వాక్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాన్ని గెలుచుకొని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచాడు. ‘మాది పేదకుటుంబం. చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మ నన్ను మంచి స్థాయిలో చూడాలనుకునేది. కాంస్య పతకం గెలచుకోవడంతో మా తలిదండ్రులు సంతోషంగా ఉన్నారు’ అంటున్నాడు రాంబాబు. రాంబాబు కూలిపనులు చేస్తున్న ఒకప్పటి వీడియోను ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ పర్వీన్ కాశ్వాన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘అదృష్టం కష్టపడే వారి వైపే మొగ్గు చూపుతుంది అంటారు. అయితే రాంబాబుది అదృష్టం కాదు. కష్టానికి తగిన ఫలితం. లక్ష్య సాధనకు సంబంధించి సాకులు వెదుక్కునేవారికి ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
ఓ మంచి డాక్టరమ్మ -మిసెస్ తెలంగాణ
సేవకు అందమైన మాధ్యమం మిసెస్ తెలంగాణ తెచ్చిన సెలబ్రిటీ గుర్తింపుతో ఒక డాక్టర్‌గా, ఒక మహిళగా నా వంతు సామాజిక బాధ్యత అని నేను చేపట్టిన అనేక కార్యక్రమాలను ఇంకా వేగంగా తీసుకువెళ్లగలుగుతాను. వయలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. జెండర్ ఈక్వాలిటీ కోసం పని చేస్తున్నాను. భ్రూణ హత్యలకు కారణం అమ్మాయంటే ఇష్టం లేక కాదు. సమాజంలో అఘాయిత్యాలు పెచ్చుమీరిన ఈ రోజుల్లో అమ్మాయిని భద్రంగా పెంచగలమా లేదా అనే భయమే ప్రధాన కారణమని అనేక మంది మహిళల మాటల ద్వారా తెలిసింది. కొన్ని ఎన్జీవోలతో కలిసి తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి చదివే ఆడపిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడం, అబ్బాయిలను సెన్సిటైజ్ చేస్తున్నాను. ఇక ఇలాంటి కార్యక్రమాలను వేగవంతం చేయగలుగుతాను. – డాక్టర్ స్రవంతి గాదిరాజు, అసోసియేట్ ప్రోఫెసర్, లాప్రోస్కోపిక్, రోబోటిక్ సర్జన్, గైనిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గాదిరాజు... తెలంగాణ, నిజామాబాద్‌లో డాక్టర్. యూఎస్‌లో గైనిక్ ఆంకాలజీ చేసి తెలుగు రాష్ట్రాల్లోని ఆదివాసీ మహిళల్లో ఎదురవుతున్న సర్వైకల్ క్యాన్సర్ నిర్మూలన కోసం పని చేస్తున్నారు. ‘డాక్టర్ తన ఉద్యోగం హాస్పిటల్లోనే అనుకుంటే సమాజం సంపూర్ణ ఆరోగ్యవంతం కాలేదు. పేషెంట్లను వెతుక్కుంటూ వైద్యులు వెళ్లగలగాలి. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలం. అందుకోసమే ఆదివాసీలు ఎక్కువగా నివసించే, ఆరోగ్యం పట్ల కనీస అవగాహన లేని వారి ఇళ్ల ముందుకు వెళ్తున్నాను. ఆరోగ్య పరిరక్షణ అవసరాన్ని తెలియచేస్తున్నాను. నాలోని ఈ గుణమే నన్ను మిసెస్ తెలంగాణ పోటీల్లో విజేతగా నిలిపింది. నేను బ్యూటీ కాంటెస్ట్‌ల వైపు అడుగులు వేయడం సెలబ్రిటీ గుర్తింపు కోసం కాదు. ఒకవేళ సెలబ్రిటీ గుర్తింపు వస్తే... ఆ గుర్తింపుతో సమాజంలో నేను కోరుకున్న మార్పు కోసం పని చేయడం సులువవుతుంది. బ్యూటీ పజంట్గా ఇప్పుడు నేను సమాజానికి చేస్తున్న వైద్యసేవలను మరింత త్వరగా విస్తరించగలుగుతాను’ అన్నారు ‘సాక్షి’తో డాక్టర్ స్రవంతి. పేషెంట్ల దగ్గరకు వెళ్లాలి! ఈ రోజు మీకు కనిపిస్తున్న ఈ విజేత గుర్తింపు అన్నది నేను సాధించిన ఘనత అని అనుకోను. మా అమ్మానాన్నలు తీర్చిదిద్దిన కూతుర్ని. అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. నాన్న విజయ డైరీలో మేనేజర్. అమ్మ తన డ్యూటీ విషయంలో ఎంత కచ్చితంగా ఉండేదో, తన సలహా సూచనల కోసం వచ్చిన వారిని ఎంత ఆప్యాయంగా చూసుకునేదో దగ్గరగా చూశాను. ప్రభావతక్క అని అందరూ ఆమెని సొంత అక్కలా అభిమానించేవారు. అమ్మతోపాటు హాస్పిటల్‌కి వెళ్లినప్పుడు డాక్టర్ కనిపించగానే పేషెంట్లు సంతోషంగా కృతజ్ఞత వ్యక్తం చేయడం చూసి అమ్మను అడిగితే, డాక్టర్‌ను దేవుడిలా చూస్తారని చెప్పింది. అంతే! ఇది అత్యుత్తమమైన వృత్తి అనే అభి్రపాయం స్థిరపడిపోయింది. అమ్మకు నైట్ షిఫ్ట్లుండేవి. అప్పుడు నాకు జడలు వేయడం నుంచి బాక్స్‌లు పెట్టడం వరకు మా నాన్నే చేశారు. మా అన్నయ్యను, నన్ను పెంచడం, చక్కగా తీర్చిదిద్దడం కోసమే వాళ్ల జీవితాలను అంకితం చేశారు. నేను సిక్త్స్ క్లాస్ వరకు విజయవాడలో చదివాను. ఉద్యోగాల్లో బదిలీలతో గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్నీ చూశాం. నెల్లూరులోని కస్తూరిదేవి విద్యాలయం నాకు బాగా గుర్తున్న స్కూలు. ఎమ్సెట్ తొలి ప్రయత్నంలో మంచి ర్యాంకు రాలేదు. అప్పుడు అమ్మ ‘మనది మధ్యతరగతి కుటుంబం. డొనేషన్ సీట్లతో చదివించలేం. బీఎస్సీలో చేరి మళ్లీ ప్రయత్నం చెయ్యి. అప్పుడూ రాకపోతే డిగ్రీ పూర్తి చెయ్యి’ అని కరాకండిగా చెప్పి డిగ్రీలో చేర్చింది. ఆ ఉక్రోషంతో చేసిన రెండవ ప్రయత్నంలో తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజ్‌లో ఫ్రీ సీటు వచ్చింది. తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా రాకట్ల డిస్పెన్సరీలో. అప్పుడు కూడా మార్గదర్శనం చేసింది అమ్మే. ప్రైవేట్ డాక్టర్ క్రేజ్ ఉండేది నాకు. గవర్నమెంట్ ఉద్యోగం విలువ తెలుసుకోమని గట్టిగా చెప్పింది. గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టే ఉద్యోగం చేస్తూ మధ్యలో సెలవు పెట్టుకుని యూఎస్‌లో కోర్సులు చేయడం సాధ్యమైంది. అంతేకాదు. గవర్నమెంట్ ఉద్యోగం వల్ల మారుమూల ప్రదేశాలను దగ్గరగా చూడడం, అక్కడి ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడం వల్ల, ఉద్యోగ పరిధి దాటి బయటకు వచ్చి మరింత ఎక్కువగా సర్వీస్ చేయాల్సిన అవసరం తెలిసి వచ్చింది. కరీంనగర్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని ఆదివాసీ గ్రామాలకు వెళ్లి మహిళలకు మెన్స్ట్రువల్ హైజీన్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలను గుర్తించడానికి పాప్‌స్మియర్ పరీక్షలు చేయడం, బ్రెస్ట్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంలో బిజీ అయిపోయాను. నేను రోబోటిక్ గైనిక్ ఆంకాలజిస్ట్‌ని. సర్వైకల్ క్యాన్సర్‌ను రూపుమాపాలనేది నా లక్ష్యం. ఈ నెల బెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సందర్భంగా శిల్పకళావేదికలో బ్యూటీ పజంట్స్ అందరం అవేర్నెస్ ర్యాంప్ వాక్ చేస్తున్నాం. సావిత్రినయ్యాను! ఇక బ్యూటీ పజంట్ విషయానికి వస్తే... నాకు చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజ్ పోటీల్లో అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ఇష్టం. డాన్స్, పెయింటింగ్‌తోపాటు కాలేజ్‌లో ర్యాంప్ వాక్ కూడా చేశాను. మిసెస్ ఇండియా పోటీల గురించి చాలా ఏళ్లుగా పేపర్లో చూడడమే కానీ పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ మమతా త్రివేది నిర్వహిస్తున్న కాంటెస్ట్ గురించి తెలిసి గత ఏడాది నవంబర్‌లో నా ఎంట్రీ పంపించాను. కొత్తతరం పిల్లలు చాలా స్మార్ట్‌గా ఉంటున్నారు. మా పెద్దమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తోంది. తను నన్ను ఈ పోటీలకు సిద్ధం చేసింది. మా హజ్బెండ్ నా క్లాస్మేట్, దూరపు బంధువు కూడా. ఎమ్ఎన్జేలో డాక్టర్. నాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మొత్తం ఇరవై రౌండ్లు కొన్ని ఆన్లైన్, కొన్ని ఆఫ్‌లైన్‌లో జరిగాయి. ఆహార్యం రౌండ్లో మహానటి సావిత్రిని తలపించాలని టాస్క్ ఇచ్చారు. సావిత్రి పాత్రలో మెప్పించడమే నన్ను విజేతను చేసింది. మా తోటి పీజంట్లు నన్ను సావిత్రి అనే పిలుస్తున్నారిప్పుడు. నా స్మైల్‌కి కూడా ఈ పోటీల్లో మంచి గుర్తింపు వచ్చింది. విజేతలను ప్రకటించేటప్పుడు మాత్రం నర్వస్ అయ్యాను. నా ముఖంలో నవ్వు విరిసే తీర్పు వచ్చింది’’ అని చక్కగా నవ్వారు సోషల్ హెల్త్ యాక్టివిస్ట్, మిసెస్ తెలంగాణ విజేత డాక్టర్ స్రవంతి. రాబోయే డిసెంబర్లో జరిగే ‘మిసెస్ ఇండియా’ పోటీల్లో ఆమె తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారు. ‘మిసెస్ ఇండియా’ కిరీటం ఆమె కోసం ఎదురు చూస్తోందేమో!. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు : మోహనాచారి -
నోబెల్ విజేతకు ఎన్ని కోట్లు ఇస్తారు? ఎంతతో మొదలై ఎంతకు పెరిగింది?
కాటలిన్ కారికో, డ్రూ వీస్మాన్ ఈసారి ఫిజియాలజీ, మెడిసిన్‌లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. న్యూక్లియోసైడ్ ఆధారిత మార్పులకు సంబంధించిన ఆవిష్కరణలకు గాను ఈ ఇద్దరు విజేతలకు ఈ అవార్డు లభించింది. వీరి ఆవిష్కరణలు కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా, మరింత సమర్థవంతంగా పనిచేసే ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అభివృద్ధికి గణనీయంగా సహకరించాయి. ఈ విజేతలకు నోబెల్ ప్రైజ్‌తో పాటు ప్రైజ్ మనీగా ఎంత మొత్తంలో నగదు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. నోబెల్ బహుమతి విజేతలు ఈ బహుమతితో పాటు అనేక ఇతర కానుకలు అందుకుంటారు. ఇక్కడ కీలక విషయం ఏమిటంటే ఈ బహుమతి కింద వారికి ఊహకందనంత నగదు వారికి లభిస్తుంది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా వీరికి అత్యంత ఆదరణ లభిస్తుంది. ఈసారి నోబెల్ బహుమతి పొందిన వారందరికీ 1.1 కోట్ల స్వీడిష్ క్రోనర్ అందించారు. డాలర్లలో చూస్తే దాదాపు 9.86 డాలర్లు. భారతీయ రూపాయిలలో చూస్తే 8 కోట్ల రూపాయలకంటే అధికం. నోబెల్ విజేతలకు డబ్బుతో పాటు బంగారు పతకాన్ని, సర్టిఫికెట్‌ను కూడా అందజేస్తారు. 2020 సంవత్సరంలో ఈ మొత్తం ఒక కోటి స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2017వ సంవత్సరంలో ఇది 90 లక్షల స్వీడిష్ క్రోనార్‌గా ఉంది. 2012లో నోబెల్ విజేతలకు 80 లక్షల స్వీడిష్ క్రోనార్లను అందించారు. దీని ప్రకారం చూస్తే కాలక్రమేణా బహుమతిగా వచ్చే మొత్తం కూడా పెరుగుతూ వచ్చింది. 1901లో మొదటిసారి నోబెల్ బహుమతిని అందించినప్పుడు, ఒక్కో కేటగిరీ ప్రైజ్ మనీ 150,782 స్వీడిష్ క్రోనార్‌గా ఉండేది. అంటే ఆ మొత్తాన్ని ప్రస్తుత భారతీయ రూపాయల్లోకి మారిస్తే రూ.11 లక్షలకు పైగానే ఉంటుంది. అంటే తొలిసారి నోబెల్ బహుమతి మొత్తం రూ. 11 లక్షలు ఉండగా, అది ఇప్పుడు రూ. 8 కోట్లకు పెరిగింది. ఇది కూడా చదవండి: ప్రపంచ అందగత్తెల వ్యాలీ ఎక్కడుంది? వారి దీర్ఘాయువు సీక్రెట్ ఏమిటి? -
సింగపూర్ గ్రాండ్‌ప్రి విజేత కార్లోస్ సెయింజ్
సింగపూర్: ఫార్ములావన్ 2023 సీజన్లో ఎట్టకేలకు 15వ రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లు కాకుండా మరో జట్టుకు చెందిన డ్రైవర్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ చాంపియన్ అయ్యాడు. నిర్ణీత 62 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన సెయింజ్ అందరికంటే వేగంగా గంటా 46 నిమిషాల 37.418 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించాడు. 22 రేసుల ఈ సీజన్లో తొలి 14 రేసుల్లో రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్ (12), సెర్జియో పెరెజ్ (2) విజేతగా నిలిచారు. అయితే సింగపూర్ గ్రాండ్‌ప్రిలో వీరిద్దరికి నిరాశ ఎదురైంది. వెర్స్టాపెన్ ఐదో స్థానంతో, పెరెజ్ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో, లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు జపాన్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ విజేతలు ఏం చేస్తున్నారు?
టీవీ క్విజ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో పాల్గొన్న పలువురు పోటీదారులు తమ పరిజ్ఞానం ఆధారంగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా కోటీశ్వరులుగా మారారు. ఈ షో గత రెండు దశాబ్దాలుగా ప్రసారమవుతోంది. శతాబ్దపు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ అన్ని వయసుల ప్రేక్షకులను కట్టిపడేస్తుంటుంది. ఈ షోలో పాల్గొనేందుకు దేశంలోని నలుమూలల నుంచి పలువురు వస్తుంటారు. ప్రస్తుతం ఈ షో సీజన్ 15.. 2023 ఆగస్టు 14 నుండి ప్రారంభమై, విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షోలో కోటీశ్వరులుగా మారిన వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే(మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పార్టిసిపెంట్ హర్షవర్ధన్ నవాతే. అతను 2000 సంవత్సరంలో కేబీసీ మొదటి సీజన్‌కు వచ్చినప్పుడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న తర్వాత, అతను యూపీఎస్సీ ప్రిపరేషన్ నుంచి తప్పుకున్నారు. దీని తర్వాత నవాతే ఎబీఏ డిగ్రీ చేసేందుకు బ్రిటన్‌లోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం హర్షవర్థన్ నవాతే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్నారు. రవిమోహన్ సైనీ (ఐపీఎస్ అధికారి) ‘కేబీసీ జూనియర్’ 2001లో ప్రసారమయ్యింది. ఇందులో 11వ తరగతి విద్యార్థి రవిమోహన్ సైనీ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆయన ఎంబీబీఎస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గుజరాత్ కేడర్‌లో ఐపీఎస్ అధికారి అయ్యారు. రవి మోహన్ యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అనిల్ కుమార్ (కేబీసీ ట్రైనర్) కేబీసీలో అనిల్ కుమార్ సిన్హా కోటి రూపాయల మొత్తాన్ని గెలుచుకున్నారు. అనిల్ వృత్తిరీత్యా బ్యాంకు ఉద్యోగి. ప్రస్తుతం అనిల్ యూట్యూబ్‌లో సొంత ఛానల్ నడుపుతున్నారు. ఈ ఛానల్ ద్వారా కౌన్ బనేగా కరోడ్‌పతి కోసం సిద్ధం అవుతున్న ఔత్సాహికులకు సాయం చేస్తున్నారు. రహత్ తస్లీమ్(బోటిక్ నిర్వాహకురాలు) బ్రజేష్ ద్వివేది, మనోజ్ కుమార్ 2005లో కేబీసీలో ఒక్కొక్కరు కోటి రూపాయలు గెలుచుకున్నారు. రహత్ తస్లీమ్ సొంత బొటిక్‌ని తెరిచారు. ఆమె జార్ఖండ్‌లో దీనిని ఏర్పాటుచేశారు. సుశీల్ కుమార్ (ఉపాధ్యాయుడు) బీహార్‌కు చెందిన సుశీల్ కుమార్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని సుశీల్ సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. పైగా మద్యానికి బానిసయ్యారు. డబ్బునంతా పోగొట్టుకుని, ప్రస్తుతం బీహార్‌లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. సన్మీత్ (దుస్తుల బ్రాండ్ రూపకర్త) ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో రూ.5 కోట్లు గెలుచుకున్న తొలి మహిళగా సన్మీత్ కౌర్ సహానీ నిలిచారు. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటున్నారు. ఆమె నటుడు మన్మీత్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 2015లో ఢిల్లీలో దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించారు. మనోజ్ కుమార్(రైల్వే ఉద్యోగి) కేబీసీ సీజన్ 6లో రైల్వే ఉద్యోగి మనోజ్ కుమార్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. అతను శ్రీనగర్‌కు చెందినవ్యక్తి. ఉద్యోగం కారణంగా జమ్మూలో ఉంటున్నారు. ఫిరోజ్ ఫాతిమా(వైద్య ఖర్చులు) ఫిరోజ్ ఫాతిమా 2013లో కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆ డబ్బును తన తండ్రి చికిత్సకు, కుటుంబ రుణం తీర్చడానికి ఉపయోగించారు. తాజ్ మహ్మద్ (ఇద్దరు అనాథ బాలికలకు వివాహం) తాజ్ మహ్మద్ కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్నారు. తన కుమార్తె కళ్లకు చికిత్స చేయించి, గృహం నిర్మించుకున్నారు. ఇద్దరు అనాథ బాలికలకు పెళ్లిళ్లు కూడా చేశాడు. అచిన్-సార్థక్ (వ్యాపారం) కేబీసీ సీజన్ 8లో తొలిసారిగా రూ. 7 కోట్లు గెలుచుకున్న సోదర ద్వయం అచిన్- సార్థక్‌లు తమ తల్లికి క్యాన్సర్‌కు చికిత్స చేయించారు. ఇప్పుడు ఇద్దరూ సొంతంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అదే సీజన్లో కోటి రూపాయలు గెలుచుకున్న మేఘా పటేల్ క్యాన్సర్ నుంచి బయటపడ్డారు. అనామిక(సామాజిక సేవ) అనామిక సామాజిక సేవ చేస్తుంటారు. ఆమె తన సంస్థ కోసం నిధులను సేకరించడానికి కేబీసీ 2017 సీజన్‌కు వచ్చారు. కోటి రూపాయలను తన ఎన్జీవో అభివృద్ధికి వినియోగించారు. బినితా జైన్(కోచింగ్ సెంటర్) అదే ఏడాది బినితా జైన్ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సొమ్ముతో కొంతమంది పిల్లలకు చదువు చెప్పించారు.. ఇప్పుడు కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. అజిత్‌కుమార్ (జైలు సూపరింటెండెంట్) బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన అజిత్ కుమార్ 2018లో కోటి రూపాయలు గెలుచుకున్నాడు. షో ద్వారా వచ్చిన డబ్బుతో పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం జైలు సూపరింటెండెంట్‌గా ఉన్నారు. ఇంజనీర్ గౌతమ్(సీనియర్ సెక్షన్ ఇంజనీర్) అదే ఏడాది రైల్వేలో సీనియర్ ఇంజనీర్ అయిన గౌతమ్ కుమార్ ఝా కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆయన భారతీయ రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు బబిత (కుక్) 2019లో కోటీశ్వరురాలు అయిన బబితా తాడే తన స్కూల్లో వంటమనిషిగా పనిచేస్తున్నారు. షోలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేశారు. సనోజ్ కుమార్ (యూపీఎస్సీ కోసం సిద్ధం) అదే ఏడాది కేబీసీలో కోటి రూపాయలు గెలుచుకున్న సనోజ్ కుమార్ ఇప్పుడు యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. నజియా నసీమ్(కమ్యూనికేషన్ మేనేజర్) కేబీసీ సీజన్- 12 మొదటి కోటీశ్వరురాలు నజియా నసీమ్. అప్పుడు ఆమె రాయల్ ఎన్ఫీల్డ్లో కమ్యూనికేషన్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మోహిత శర్మ (ఐపీఎస్ అధికారిణి) అదే సీజన్లో జమ్మూ కాశ్మీర్లో ఐపీఎస్ అధికారిణి మోహితా శర్మ కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఆమె భర్త కూడా ఐపీఎస్ అధికారి. హిమానీ బుందేలా, సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ ఆగ్రాకు చెందిన హిమానీ బుందేలా కేబీసీ సీజన్ 13లో కోటి రూపాయలు గెలుచుకున్న మొదటి పోటీదారుగా నిలిచారు. అదే సీజన్లో సాహిల్ ఆదిత్య అహిర్వార్, గీతా గౌర్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేస్తున్నానే సమాచారం అందుబాటులో లేదు. కవితా చావ్లా, శశ్వత్ గోయల్ సీజన్ 14లో మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కి చెందిన కవితా చావ్లా కోటి రూపాయలు గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఢిల్లీకి చెందిన శశ్వత్ గోయల్ కూడా కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అయితే ఆ తర్వాత రూ.7 కోట్లు అందించే ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారు. దీంతో చివరికి రూ.75 లక్షలతో ఇంటి ముఖంపట్టారు. ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికించిన 10 భూకంపాలు -
గూగుల్ హ్యాక్ ఫర్ చేంజ్ విజేత ‘టీమ్ అగ్రి హీరోస్’
సాక్షి, హైదరాబాద్: చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి ఆండ్రాయిడ్ ఫోన్ ఆధారిత యాప్‌ను రూపొందించిన ‘టీమ్ అగ్రిహీరోస్’.. గూగుల్ ‘హ్యాక్ 4 చేంజ్’విజేతగా నిలిచింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బృందం రూ.ఐదు లక్షల నగదు బహుమతి సాధించింది. ‘ద నడ్జ్ ఇన్స్టిట్యూట్’, టీ–హబ్ సంయుక్తంగా రెండు రోజుల పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో నిర్వహించిన ‘చర్చా–23’కార్యక్రమంలో భాగంగా ఈ హ్యాకథాన్ జరిగింది. దేశం మొత్తమ్మీద చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆండ్రాయిడ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం కాగా.. మొత్తం 270 బృందాలు ఇందుకు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లోంచి గూగుల్, టీ–హబ్‌లు మొత్తం నలభై బృందాలను తుది దశ పోటీకి ఎంపిక చేశాయి. ఒక రోజు మొత్తం ఏకబిగిన సాగిన హ్యాకథాన్‌లో ‘టీమ్ అగ్రిహీరోస్’తొలిస్థానంలో నిలిచింది. ఈ బృందం తయారు చేసిన అప్లికేషన్ డీప్.. టెక్నాలజీని ఉపయోగించి పరిశోధన సంస్థలకు చిన్న, సన్నకారు రైతులకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తుంది. శాస్త్రీయ పరిశోధనల ఫలాలను రైతు సమస్యల పరిష్కారానికి వినియోగిస్తుంది. ‘టీమ్ లైట్హెడ్స్’కి మూడో బహుమతి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి సామ్యుల్ ప్రవీణ్ కుమార్, గూగుల్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ (ఇంజనీరింగ్) గురు భట్, ప్రిన్సిపల్ ఇంజనీర్ అరుణ్ ప్రసాద్ అరుణాచలం, టీ–హబ్ సీఓఓ వింగ్ కమాండర్ ఆంటోని అనీశ్, ద నడ్జ్ ఇన్స్టిట్యూట్కు చెందిన రవి త్రివేదీ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన ఈ హ్యాకథాన్‌లో ఘజియాబాద్‌కు చెందిన ‘టీమ్ ఇన్ఫెర్నోస్’రెండోస్థానంలో నిలిచి రూ.2.5 లక్షల నగదు బహుమతి అందుకుంది. వ్యవసాయంలో ఆల్టర్నేట్ రియాలటీ టెక్నాలజీని ఉపయోగించేందుకు వీలుగా ఈ బృందం ఒక అప్లికేషన్‌ను రూపొందించింది. హైదరాబాద్‌కే చెందిన ‘టీమ్ లైట్హెడ్స్’ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా పంటల ఉత్పాదకత పెంచేందుకు గరిష్ట స్థాయి దిగుబడులు సాధించేందుకు రూపొందించిన అప్లికేషన్‌కు మూడో బహుమతి( రూ.లక్ష నగదు) దక్కింది.