సాగరతీరాన సౌందర్య కెరటాలు
కాకినాడ కల్చరల్: సాగరతీర నగరం కాకినాడలోని పద్మనాభ ఫంక్షన్ హాలు.. నవ్వుల పువ్వులు విరబూసే సొగసుకత్తెలకు, హŸయలు, వయ్యారాల నడుమ జరిగిన చూడముచ్చటైన పోటీలకు వేదికైంది. డ్రీమ్ మేకర్స్‌జ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి (లేట్ నైట్) జరిగిన మిస్ కాకినాడ –2016 ఫైనల్ పోటీలో స్థానిక దేవాలయం వీధికి చెందిన పూజా జైన్ మిస్ కాకినాడ కిరీటం(విన్నర్) దక్కించుకొంది.
దేవాలయం వీధికే చెందిన అనీషా అగర్వావాల్ రన్నరప్–1గా, జగన్నాథపురానికి చెందిన కె.ధరణి రన్నరప్–2గా నిలిచారు.విజేత పూజా జైన్‌కు బహుమతిగా రూ.లక్ష, రన్నర్లు అనీషా, ధరణిలకు రూ.50 వేల చొప్పున నిర్వాహకులు అందజేశారు. ఈ కార్యక్రమానికి డ్రీమ్ మేకర్స్‌జ్ ఈవెంట్స్ అధినేత్రి శాంతి అధ్యక్షత వహించారు. సామా స్కూల్ ఎండీ రాజీ, బ్యూటీషియన్ ట్రైనర్ రమ, షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ సూర్య, మోడల్ స్కూల్ కరస్పాండెంట్ పి.వంశీ మిస్–కాకినాడ ఆడిషన్స్‌కు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. చక్కటి ఆశయంతో ఏర్పాటు చేసిన మిస్ కాకినాడ ఈవెంట్‌కు ఇంత ఆదరణ చేకూర్చినందుకు డ్రీమ్ మేకర్స్‌జ్ బృందం కాకినాడ ప్రజలకు, ప్రత్యేకంగా యువతకు అభినందనలు తెలిపారు.