న్యూఢిల్లీ: యోగాపై అవగాహన ఉందా.. సాహిత్య రచనలో ప్రవేశం ఉందా.. పాటలు బాగా పాడతారా? అయితే ఆ అయిదు లక్షలు మీరు గెల్చుకోవచ్చు... ఏంటీ.. అంతా కన్ఫ్యూజింగా ఉందా.. 'యోగగీతం పంపండి.. 5 లక్షలు గెలుచుకోండి' అని కేంద్రం ఆహ్వానిస్తోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీ నిర్వహిస్తోంది. దీనికోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది.
తమకు అందిన వాటిల్లో ఉత్తమపాటను ఎంపికచేసి విజేతను ప్రకటిస్తారు. అత్యత్తుమ పాటగా నిలిచి దానికి రూ. 5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. వ్యక్తిగతంగా గానీ, లేదా గ్రూప్‌గా గానీ ఈ పోటీలో పాల్గొనవచ్చు. 3 - 5 నిమిషాల నిడివిలో, ఎంపీ3 ఆడియో ఫార్మాట్‌లో ఉన్న యోగ గీతాన్ని పోటీకి పంపవచ్చు. అయితే దీని సైజ్ 5ఎంబీ దాటకూడదనే నిబంధన విధించింది. పోటీలో పాల్గొనేవాళ్లు మార్చి 31వ తేదీలోగా తమ ఎంట్రీలను inf-moayush@gov.in అనే ఈమెయిల్ ఐడీకి పంపాలి. మరిన్ని వివరాలకు www.indiamedicine.nic.in అనే వెబ్సైట్ ను పరిశీలించుకోవచ్చని తెలిపింది. అయితే మరో ముఖ్య విషయం ఏమిటంటే పాట హిందీ భాషలో మాత్రమే ఉండాలి.
పాట రాయండి.. భారీ బహుమతి గెల్చుకోండి
Published Fri, Mar 4 2016 4:17 PM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
Advertisement
Advertisement