ప్రతీకాత్మక చిత్రం
రిషికేష్ : అమెరికాకు చెందిన 37 ఏళ్ల మహిళపై ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని స్థానిక నివాసి అత్యాచారానికి పాల్పడ్డాడు. యోగా మీదున్న అభిరుచితో భారత్ వచ్చానని, ఈ నేపథ్యంలోనే నమ్మకస్తుడిగా ఉంటూ ఓ వ్యక్తి తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్నేహంగా మెలుగుతూ రిషికేష్ నివాసి అభినవ్ రాయ్ అనే వ్యక్తి తనపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. బాల్కనీ నుంచి తన గదిలోకి చొరబడి అతడు ఈ దురాఘతానికి ఒడిగట్టినట్టు వెల్లడించింది.
కేసు ఉపసంహరించుకోవాలని నిందితుడి తండ్రి తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఘటన జరగక ముందు నుంచి వారిద్దరి మద్య శారీరక సంబంధం ఉన్నట్లు స్థానిక పోలీసు అధికారి ఆర్కే సక్లానీ వెల్లడించారు. డ్రగ్స్, యోగా పట్ల ఉన్న ఆసక్తితోనే అభినవ్ రాయ్‌కు అమెరికా మహిళ దగ్గరైందని పేర్కొన్నారు. (పన్నెండేళ్ల బాలికపై కజిన్స్ అత్యాచారం)
Comments
Please login to add a commentAdd a comment