get
-
లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఈ బుల్లితెర జంట పెళ్లి వేడుక చూశారా? (ఫొటోలు)
-
కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే రౌడీబేబీ! ధైర్యంగా ఫేస్ చేయకపోతే..!
సత్య తెలివైన విద్యార్థి. కానీ ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఐఐటీ సీట్ రాలేదు. ప్రస్తుతం లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కానీ మూడు నెలలుగా అతన్ని ఓ సమస్య వేధిస్తోంది. ఎగ్జామ్ పేపర్ చేతిలోకి తీసుకోగానే ‘‘బాగా రాయలేనేమో’’ అనే ఆలోచన మనసులోకి దూరుతోంది. అంతే.. అప్పటివరకూ గుర్తున్నది కూడా మర్చిపోతున్నాడు. ఈ సమస్యను అధిగమించాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. నాన్నకు చెప్పుకుని ఏడ్చాడు. వాణి ఒక అథ్లెట్. స్టేట్ లెవెల్లో బెస్ట్ రన్నర్‌గా నిలిచి, నేషనల్ మీట్‌కు ప్రిపేర్ అవుతోంది. కానీ రన్నింగ్ ట్రాక్ మీదకు వెళ్లగానే ‘‘నేను గెలవలేనేమో’’ అనే ఆలోచన మనసును హిట్ చేస్తోంది. అంతే.. వేగం తగ్గుతోంది. సెకన్ల వ్యవధిలో ఓడిపోతోంది. ట్రాక్ ఎక్కినప్పుడు ఆ ఆలోచన రాకుండా ఎంతో ప్రయత్నించింది. సాధ్యం కాలేదు. నేషనల్ విన్నర్ కావాలన్న తన ఆశ నెరవేరుతుందో లేదోనని తీవ్రంగా బాధపడుతోంది. సత్య, వాణిల్లానే చాలామంది విద్యార్థులు, యువతులు ఇలాంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు. అది ఐఐటీ, నీట్, ఎంసెట్, స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఏవైనా..! ఒక్క నెగటివ్ ఆలోచన వారిని.. గమ్యం నుంచి ఒక్కొక్క అడుగు వెనక్కు తీసుకువెళ్తుంది. ఆ ఒక్క నెగటివ్ ఆలోచన మూలాల్ని అర్థం చేసుకుని పరిష్కరించుకోగలిగితే.. గమ్యాన్ని చేరుకోగలరు, అనుకున్నది సాధించగలరు. లొంగకపోతే సాయం అవసరం... నెగటివ్ కామెంట్స్‌తో వేధించే రౌడీని, దాని గొంతును సరిచేయడం అందరికీ అంత సులువు కాదు. అలాంటప్పుడు సైకాలజిస్ట్ సహాయం తీసుకోవడం అవసరం. వారు రకరకాల పద్ధతుల ద్వారా నెగటివ్ సెల్ఫ్ టాక్‌ను తగ్గించుకునేందుకు సహాయపడతారు. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) అనేది వ్యక్తుల ప్రతికూల ఆలోచనలు, ప్రవర్తనలను గుర్తించడంలో, సవాలు చేయడంలో సహాయపడుతుంది. ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్, మైండ్‌ఫుల్ మెడిటేషన్, డీప్ బ్రీతింగ్ ద్వారా ఆందోళన వల్ల శరీరంలో వచ్చే మార్పులను నియంత్రించుకోవచ్చు. మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆందోళనను రేకెత్తించే పరిస్థితులను క్రమక్రమంగా పరిచయం చేసే ఎక్స్పోజర్ థెరపీ భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సత్య విషయంలో మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్, వాణి విషయంలో తక్కువ దూరం పరుగెత్తడం వంటివి ప్రాక్టీస్ చేయాలి. వారు సాధించిన విజయాలను హైలైట్ చేయడం, పర్ఫెక్షన్ కంటే ప్రోగ్రెస్‌పై దృష్టి పెట్టడం వారి విశ్వాసాన్ని పెంచుతుంది, వారి కృషిని కొనసాగించడానికి వారిని ప్రేరేపిస్తుంది. వారి ఆందోళన గురించి కుటుంబం, స్నేహితులు లేదా కోచెస్తో మాట్లాడమని ప్రోత్సహించడం అవసరమైన అవగాహనను, మానసిక మద్దతును అందిస్తుంది. రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర మానసిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. మనసులో అల్లరి చేస్తుంటుంది.. సత్య, వాణిల్లానే చాలామందికి పెద్ద పెద్ద కలలు ఉంటాయి. అవి చాలా ముఖ్యమైనవి అయినప్పుడు ఎక్కడ ఫెయిలవుతామోనని భయపడుతుంటారు. అది వారి పనితీరును దెబ్బతీస్తుంది. దీన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ అంటారు. దీనికి కారణం వారి మనసులోని రౌడీబేబీ (బులీ). చిన్నప్పుడు స్కూల్లో ఎలాగైతే ఎగతాళి చేస్తారో, ఏడిపిస్తారో (బులీయింగ్) అలాగే మనసులోని రౌడీ అల్లరి చేస్తుంటుంది. నువ్వు చేయలేవు, నువ్వు ఫెయిలవుతావు అంటూ అబద్ధాలు చెప్తుంటుంది. వారిని భయాందోళనలకు గురిచేస్తుంది. దాంతో ఆలోచనలు రేసుగుర్రాల్లా పరుగెత్తుతాయి. చేతులకు చెమటలు పడతాయి. కొందరికి చేతులు వణుకుతాయి కూడా. ఆ భయాందోళనల్లో తమకు తెలిసినదాన్ని కూడా మర్చిపోతారు. తమ పర్ఫార్మెన్స్ను కాస్తంత మందగిస్తుంది. అది చాలు కదా లక్ష్యం చేజారడానికి. లోగొంతును సవరించుకోవాలి.. మనసులోని రౌడీ బేబీని అలా వదిలేయాల్సిన అవసరంలేదు. దానిపై పోరాటం చేయవచ్చు. అందుకు మొదట చేయాల్సింది బులీకి అసలు కారణాన్ని కనుక్కోవడం. దానికి బహూశా గత వైఫల్యాలు, పర్ఫెక్ట్గా ఉండాలనే ఒత్తిడి, జడ్జ్ చేస్తారనే భయం వంటివి కారణాలు కావచ్చు. ఆ తర్వాత రౌడీ బేబీతో మాట్లాడి మచ్చిక చేసుకోవాలి. కరకుగా ఉండే రౌడీ బేబీ గొంతును కాస్తంత సరళంగా లేదా సరదాగా మార్చేయండి. నా వంతు కృషి చేయగలను, నా తప్పుల నుంచి నేర్చుకుంటాను.. అని మనసులోని మాటలను మార్చండి. నిశ్శబ్దంగా ఉండటం, నిదానంగా శ్వాస తీసుకోవడం ద్వారా రౌడీని శాంతింపచేయండి. చిన్న చిన్న పరీక్షల్లో మనసులోని రౌడీని ఎదుర్కోవడం ప్రాక్టీస్ చేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. --సైకాలజిస్ట్ విశేష్ (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
సర్కారు డబ్బులు వచ్చాయా? ఇదో రకం సైబర్ మోసం..!
‘సరోజిని ఇంట్లో పని చేసుకుంటుంటే ఫోన్ మోగింది. చేస్తున్న పని వదిలేసి, ఫోన్ అందుకుంది. గవర్నమెంట్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామనగానే తమ పొదుపు సంఘం గురించే అని, అవతలి వాళ్లు చెప్పేది వినడానికి చెవులు రిక్కించింది. ‘ప్రభుత్వం నుంచి వచ్చే పథకం మొత్తం డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయా’ అని అడిగారు అవతలి నుంచి. ‘ఇంకా రాలేదు సార్! వచ్చాక చెబుతా!’ అంది సరోజిని. ‘అంటే, మీరు వడ్డీ డబ్బులు కట్టలేదు. వడ్డీ వెంటనే కడితే వచ్చే మొత్తం జమ అవుతుంది, లేదంటే లేదు’ అని చెప్పడంతో కంగారు పడింది. ‘మా సంఘం వాళ్లందరినీ అడిగి చెబుతాను’ అంటే ‘అంత టైమ్ లేదు ఇప్పుడే కట్టేయాలి. అనడంతో తన ఖాతా నెంబర్, ఫోన్‌కి వచ్చిన నెంబర్ చెప్పింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. అంతలో అదే బృందంలో ఉండే కమల పరిగెత్తుకుంటూ వచ్చి, ‘బ్యాంక్ వాళ్లు ఫోన్ చేశారు, ఆ తర్వాత వాళ్లేదో ఓటీపీ అని అడిగారు. చెప్పగానే నా ఖాతాలో పన్నెండువేల రూపాయలు కట్ అయ్యాయి. అవి మళ్లీ వస్తాయా?!’ అని అడిగింది. అప్పుడే సరోజిని అకౌంట్ నుంచి పదివేల రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. చూశారుగా... సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు ఇవి. అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ఖాతాలో ఉన్నదంతా దోచుకుంటున్న ఈ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు సైబర్ నిపుణులు. అనుమానం రాకుండా దోపిడీ.. సైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ కార్యాలయం నుండి మాట్లాడుతున్నామంటారు. ప్రభుత్వ పథకాల పేరిట పొదుపు సంఘాల మహిళలకు ఫోన్ చేసి తెలుగు భాషలో మాట్లాడుతుంటారు. వెంటనే వడ్డీ చెల్లిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని చెబుతారు. మీ ఖాతాలో కొంత నగదు నిల్వ ఉండాలని పొదుపు సంఘాల మహిళలకు ఫోన్లు చేస్తుంటారు. ‘తమ ఖాతాలో నగదు నిల్వ లేదు’ అని మహిళలు చెబితే ‘ప్రభుత్వం డబ్బులు ఇస్తామన్నా.. మీ ఖాతాలో డబ్బులు లేకపోవడం ఏంటని, బ్యాంకులో తగినంత నగదు లేకపోతే పథకం డబ్బులు రావని చెబుతుంటారు. నేరగాళ్ల మాటలు నమ్మి, మహిళలు తమ స్మార్ట్ ఫోన్లోని మనీ యాప్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఏ మాత్రం నమ్మకూడదు. మోసగాళ్ల బారిన పడి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి ఎవరికీ చెప్పకూడదు. ఈ సైబర్ మోసాల పట్ల గ్రామీణ మహిళలు అవగాహన పెంచుకోవాలి. తెలిసిన వారు గ్రామీణ మహిళలను సైబర్ నేరాల పాలిటపడకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయాలను తెలియజేయాలి. వెబ్సైట్ అయితే.. ప్రభుత్వ సైట్లు.. అంటే, ఆయుష్మాన్ యోజన, కిసాన్ యోజన, జన్ ధన్ యోజన వంటి పోర్టల్‌లు, అనేక నకిలీ వెబ్సైట్లు ప్రజలను మోసగించడానికి స్కామర్లకు సాధారణ పద్ధతిగా మారాయి. ఈ మోసపూరిత వెబ్సైట్లు తరచుగా అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల రూపకల్పన, కంటెంట్‌ను అనుకరిస్తాయి. వారు ప్రభుత్వ పథకాలపై ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటారు. అటువంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండటానికి, మీరు తీసుకోవలసిన కొన్ని చర్యలు: అధికారిక ప్రభుత్వ డొమైన్‌తో సరిపోలుతుందని నిర్ధారించుకోవడానికి వెబ్సైట్ యుఆర్‌ఎల్‌ని చెక్ చేయాలి. ప్రభుత్వ వెబ్సైట్లు సాధారణంగా భారతదేశంలో ‘gov.in‘ వంటి స్థిరమైన డొమైన్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. డొమైన్ లో అక్షరదోషాలు లేదా వైవిధ్యాలు ఉన్న వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. వినియోగదారుల డేటాను రక్షించడానికి చట్టబద్ధమైన వెబ్సైట్లు సురక్షిత కనెక్షన్లను (HTTP) ఉపయోగిస్తాయి. సైట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి అడ్రస్ బార్ లో ప్యాడ్‌లాక్ చిహ్నాన్ని తనిఖీ చేయాలి. అధికారిక మూలాలు: అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు లేదా అధికారిక కమ్యూనికేషన్ ఛానెల్‌లలో అందించిన సమాచారం, లింక్‌లను మాత్రమే నమ్మాలి. లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుమానాస్పద ఈ–మెయిల్స్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌ల నుండి సమాచారాన్ని షేర్ చేయడం మానుకోవాలి. మీకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ పథకాన్ని అధికారిక మూలాల నుండి నేరుగా పరిశోధించాలి. ఇది మీకు అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియపై స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తెలియని వెబ్సైట్ల సమాచారంపై మాత్రమే ఆధారపడకూడదు. పథకం లేదా ఆఫర్ ప్రామాణికత గురించి మీకు ఖచ్చితంగా తెలియకుంటే, వివరాలను ధృవీకరించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారిక హెల్ప్‌లైన్ లేదా కస్టమర్ సేవను సంప్రదించాలి. ప్రభుత్వ పథకాలకు సాధారణంగా రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు కోసం ఎలాంటి ముందస్తు చెల్లింపులు అవసరం లేదు. ఏదైనా ప్రయోజనాన్ని అందించే ముందు ఫీజు చెల్లించమని వెబ్సైట్ మిమ్మల్ని అడిగితే జాగ్రత్తపడాలి. ఆఫర్ నిజం కానంత మంచిగా అనిపిస్తే, అది బహుశా అలానే ఉంటుంది. స్కామర్లు బాధితులను తమ ఉచ్చులోకి లాగేందుకు తరచుగా మనోహరమైన వాగ్దానాలను ఉపయోగిస్తారు. ఈ మోసాల గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా బాధితులుగా పడకుండా వారికి అవగాహన కల్పించండి. మోసపోయామని గ్రహిస్తే బాధితులు వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. 1930కి కాల్ చేయవచ్చు. https://www.cybercrime.gov.in ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. (చదవండి: భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!) -
మీకు రూ.75 కాయిన్ కావాలా అయితే సింపుల్ గా ఇలాచేయండి..!
-
ఈ బ్యాంకు కస్టమర్లకు...3 లక్షల క్రెడిట్, 3 లక్షల బీమా
సాక్షి,ముంబై: ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్ల కోసంఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో కలిసి సాచెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ 'గ్రూప్ క్రెడిట్ షీల్డ్'ను ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా పలు సౌలభ్యాలు అందిస్తోంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి రూ.3 లక్షల జీవిత బీమా ఆఫర్ చేస్తోంది. ప్రమాదవశాత్తూ కార్డు దారుడు మరణిస్తే నామినీకి రూ. 3 లక్షలు బీమా లభిస్తుంది. అలాగే ఈ కార్డుపై రూ.3 లక్షల వరకు క్రెడిట్ అందించడం మరో విశేషం. అయితే ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ లైఫ్ కవర్ ఒక సంవత్సరం మాత్రమే. ఈ మేరకు ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ప్రత్యేకమైన కవర్‌ను అందిస్తుంది. ఈ కార్డ్ క్రెడిట్ పరిమితి గరిష్టంగా రూ. 3 లక్షలు. ప్రస్తుతం Celesta, Imperio, Signet అనే మూడు వేరియంట్లను అందిస్తోంది. ఈ కార్డులపై కస్టమర్లకు జీవిత భద్రత కల్పిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కేవలం 3 నిమిషాల్లో దీన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని, బైట్ సైజ్, బండిల్డ్ ప్రొడక్ట్‌ల ద్వారా దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని భావిస్తున్నామని బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాలిని వారియర్ అన్నారు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ల కోసం తమగ్రూప్ క్రెడిట్ షీల్డ్ నిమిత్తం ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం చాలా సంతోషదాయకమని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హెడ్-ప్రొడక్ట్స్ కార్తిక్ రామన్ తెలిపారు. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ కస్టమర్లకు జీవిత బీమా కల్పించి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించే భారం లేకుండా వారిని కాపాడుతుందన్నారు. -
నేషనల్ పెన్షన్ స్కీమ్: నేరుగా జమ చేస్తే కమీషన్
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (నేషనల్ పెన్షన్ స్కీమ్-ఎన్పీఎస్) పరిధిలోని సభ్యులు తమ స్వచ్ఛంద పింఛను జమలకు డైరెక్ట్ రెమిట్ (నేరుగా జమ) మార్గాన్ని ఎంపిక చేసుకుంటే, పీవోపీలకు వచ్చే నెల నుంచి రూ.15-10,000 వరకు కమీషన్ లభిస్తుందని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ప్రకటించింది. పీఎఫ్ఆర్డీఏ కొత్త నిబంధన కింద ఎన్పీఎస్ చందాదారులు నేరుగా జమ మార్గాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల ఫీజుల రూపంలో నష్టపోయే పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీలు) సంస్థలకు పరిహారాన్ని ఇవ్వడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ రంగం, అటల్ పెన్షన్ యోజన పౌరులు ఎన్పీఎస్ చందాదారులుగా ఉంటారు. అయితే ఎన్పీఎస్కు, చందాదారులకు మధ్య అనుసంధానకర్తలను పీవోపీలుగా పేర్కొంటారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, ఫిన్‌టెక్ కంపెనీలు పీవోపీల కిందకు వస్తాయి. ఎన్పీఎస్ ఖాతాలను తీసుకొచ్చేందుకు ఎంతగానో కృషి చేస్తున్న పీవోపీలకు తమ నిర్ణయం మద్దతుగా నిలుస్తుందని పీఎఫ్ఆర్డీఏ పేర్కొంది. -
చదువులమ్మ చెట్టు నీడలో..
పూర్వ విద్యార్థుల సమ్మేళనం రాజమహేంద్రవరం రూరల్: ఇరవై ఏళ్ల క్రితం బొమ్మూరులోని జిల్లావిద్యాశిక్షణ కేంద్రం (డైట్)లో ఛాత్రోపాధ్యాయులుగా శిక్షణ పొంది... ఇప్పుడు ఉపాధ్యాయులుగా స్థిరపడిన 1997–98 బ్యాచ్ విద్యార్థులు ‘స్నేహ గౌతమి’పేరుతో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం చదువులమ్మ చెట్టునీడలో ఉల్లాసంగా .. ఉత్సాహంగా జరుపుకున్నారు. తమకు విద్యాబుద్దులు నేర్పించిన ఉపాధ్యాయులను గురుపౌర్ణమి సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఆనాడు తమకు లెక్చరర్‌గా ఉన్న అప్పారి జయప్రకాశరావు నేడు డైట్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా ఉండడం ఆనందంగా ఉందని స్నేహ గౌతమి అధ్యక్షుడు ఐ.మోహన్ అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన వారంతా ఉభయగోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామని సభకు పరిచయం చేసుకున్నారు. అలనాటి తీపి గుర్తులను జ్ఞాపకం చేసుకోవడంతో అప్పటి చిలిపి పేరులతో పిలుచుకుంటూ స్నేహమాధుర్యాన్ని ఒకరికొకరు పంచుకున్నారు. తమకు బోధించిన గురువులు అప్పారి జయప్రకాశరావు, గంగారాం, బాలచందర్, ఈవీఎస్.జ్యోతి, కేవీ రమణ, గోవిందు, వై.నాగేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, ఐజీహెచ్‌ఎన్.ప్రసాద్, వీవీఎన్ ఆచార్యులు, బి.వెంకట్రావు, అన్నాజీరావులను ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులను ఉద్ధేశించి డైట్ ప్రిన్సిపాల్ జయప్రకాశరావు మాట్లాడుతూ తమ వద్ద ఉపాధ్యాయ శిక్షణ పొంది, ఉపాధ్యాయులుగా పనిచేస్తూ 20 ఏళ్ల తరువాత స్నేహగౌతమి పేరుతో కలుసుకుని గురుపౌర్ణమి రోజున సత్కరించడం చాలా ఆనందరంగా ఉందన్నారు. టి.బంగారునాయుడు, కెఎస్.మల్లేశ్వరరావు, భమిడిపాటిఫణికుమార్, సత్తిబాబు, సూర్యకిరణ్, కృష్ణంరాజు, కవిత, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
సెక్యూరిటీ గార్డులకు శుభవార్త
సెక్యూరిటీ గార్డులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తీపి కబురు అందించారు. వారికి నెలవారీ కనీసం జీతాన్ని 15 వేల రూపాయలుగా నిర్ణయించనున్నట్టు తెలిపారు. అలాగే సాయుధ సెక్యూరిటీగార్డులు, సూపర్ వైజర్లను అత్యంత నైపుణ్యంగల పనివారుగా వర్గీకరించి.. వారికి నెలకు పాతికవేలు కనీస జీతాన్ని అందించేలా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రయివేట్ సెక్యూరిటీ పరిశ్రమపై నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన ఆయన ఈ శుభవార్త అందించారు. ప్రభుత్వ ప్రధాన పథకాలైన స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా లతో అనుసంధానం చేయాలన్ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం కార్మిక చట్టాల్లో గణనీయ సంస్కరణలు చేపడుతోందన్నారు. దీనికి ద్వారా సుమారు 50 లక్షల సెక్యూరిటీ గార్డులకు సహాయం అందించనున్నామన్నారు. తమ నిర్ణయం వివిధ రంగాల నుంచి సెక్యూరిటీ గార్డులకున్న భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో నియామకం, శిక్షణ, నైపుణ్యంగల కార్మిక శక్తిని రూపొందించడంలో ప్రయివేటు సెక్యూరిటీకి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. తద్వారా ప్రయివేటు సెక్యూరిటీ రంగంలో ఉన్న 50 లక్షల మంది భద్రతా సిబ్బందికి మెరుగైన వేతనాల సౌలభ్యంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు 2.5 కోట్లకు పైగా సామాజిక భద్రతను అందిస్తుందని దత్తాత్రేయ సూచించారు. ఈ విధానం సరళీకరణలో భాగంగా 44 కేంద్ర కార్మిక చట్టాల విలీన ప్రక్రియను త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ముందు ఉంచుతా మన్నారు. అలాగే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, పని పరిస్థితులు, ఆరోగ్యంమరియు రక్షణ అనే నాలుగు అంశాలపై దృష్టిపెట్టినట్టు దత్తాత్రేయ తెలిపారు -
అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి
సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాఖీ కట్టిన అనంతరం ప్రసంగించారు. కార్మికుల్లో సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నారని వారిని సోదరసోదరీమణులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సూర్యాపేట మున్సిపాలిటీ తరపున రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు పారదర్శకంగా పనిచేసి తమ విధులను నిర్వహించి మున్సిపాలిటీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని తెలిపారు. సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీఓ 14 ప్రకారం పెంచిన వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్పర్సన్ గండూరి ప్రవళికకు టీఆర్ఎస్కేవీ నాయకులు సయ్యద్ సమ్మి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, రంగినేని ఉమ, వల్దాసు దేవేందర్, రాంబాయమ్మ, రాధిక, నర్సింహ, స్వరూపరాణి, మున్సిపల్ అధికారులు రాంచందర్, విద్యాసాగర్, విజయేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, సారగండ్ల శ్రీనివాస్, సూర్గి శంకర్‌గౌడ్, గౌస్, సయ్యద్సమ్మి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలి
సూర్యాపేట సూర్యాపేట మున్సిపాలిటీకి అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక అన్నారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై సుమారు 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు రాఖీ కట్టిన అనంతరం ప్రసంగించారు. కార్మికుల్లో సోదరభావం పెంపొందించడంతో పాటు ప్రజల్లో పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తున్నామన్నారు. కార్మికులు నిత్యం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషిచేస్తున్నారని వారిని సోదరసోదరీమణులుగా భావించి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా సూర్యాపేట మున్సిపాలిటీ తరపున రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇదే స్ఫూర్తితో కార్మికులు పారదర్శకంగా పనిచేసి తమ విధులను నిర్వహించి మున్సిపాలిటీకి అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని తెలిపారు. సీఎం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారన్నారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి సీఎం కేసీఆర్ కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీఓ 14 ప్రకారం పెంచిన వేతనాన్ని బకాయిలతో సహా చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ చైర్పర్సన్ గండూరి ప్రవళికకు టీఆర్ఎస్కేవీ నాయకులు సయ్యద్ సమ్మి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి, ఆకుల లవకుశ, బైరు దుర్గయ్యగౌడ్, షేక్ తాహేర్‌పాషా, రంగినేని ఉమ, వల్దాసు దేవేందర్, రాంబాయమ్మ, రాధిక, నర్సింహ, స్వరూపరాణి, మున్సిపల్ అధికారులు రాంచందర్, విద్యాసాగర్, విజయేందర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, సారగండ్ల శ్రీనివాస్, సూర్గి శంకర్‌గౌడ్, గౌస్, సయ్యద్సమ్మి తదితరులు పాల్గొన్నారు. -
'పవర్ ఆఫ్ పాటీదార్' కు సెన్సార్ చిక్కులు!
సూరత్ః పవర్ ఆఫ్ పాటీదార్ పై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలో గుజరాత్ రాష్ట్రంలో చెలరేగిన పాటీదార్ ఆందోళన ఆధారంగా తెరకెక్కనున్న గుజరాతీ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. రాళ్ళు రువ్వుకోవడం, గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి వారి నిజమైన పేర్లను వాడటం వంటి అనేక కారణాలతో సినిమా విడుదలకు తిరస్కరించింది. పాటీదార్ అనామత్ ఆందోళన్ సమితి ఆధ్వర్యంలో గతంలో గుజరాత్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆందోళనల నేపథ్యంలో తీసిన గుజరాతీ సినిమా 'పవర్ ఆఫ్ పాటేదార్' విడుదలకు సీబీఎఫ్సీ అనుమతి నిరాకరించింది. గుజరాత్ లో జరిగిన ఆందోళనల్లో రాళ్ళు రువ్వుకోవడం వంటి సన్నివేశాలతోపాటు, ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్, ప్రధాని నరేంద్ర మోదీ మొదలైనవారి పేర్లను సినిమాలో వాడటమే కాక, ఆందోళన సమయంలో హార్థిక్ కు సహాయకులుగా ఉన్నవారే సినిమాలో పాత్రలు ధరించడంపై కూడా సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే సెన్సార్ బోర్డు ఇప్పటిదాకా సినిమాలో అభ్యంతరకర సీన్లు కట్ చేయడంపై తమకు ఎటువంటి రాత పూర్వక ఆదేశాలు జారీ చేయలేదని, అటువంటి ఆదేశాలు అందితే సెన్సార్ బోర్డ్ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సినిమా నిర్మాత మహేష్ పటేల్ తెలిపారు. సినిమాలో హార్థిక్ పటేల్ తో సహా ఆందోళనలోపాల్గొన్న అనేకమంది నాయకులకు చెందిన పేర్లను వాడటంతోనే సీబీఎఫ్సీ అడ్డు చెప్తున్నట్లు పటేల్ తెలిపారు. అంతేకాక పాటీదార్ టైటిల్ పై కూడా సీబీఎఫ్సీ అభ్యంతరం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. గుజరాత్ ఆందోళన, హార్థిక్ పటేల్ కు సంబంధించిన కథలు తెరకెక్కితే.. అది వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నదే ప్రధాన కారణం అయి ఉండొచ్చని, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ అటువంటి సినిమాలు రాకుండా చేసేందుకు ఇది.. ప్రభుత్వం చేస్తున్నప్రయత్నంలో భాగంలానే ఉందని పటేల్ అన్నారు. అలాగే ముఖ్యమంత్రి ఆనందీ బెన్ క్యారెక్టర్ ను సినిమాలో పెట్టడం కూడా అభ్యంతరానికి మరోకారణంగా తెలుస్తోందన్నారు. ఒకవేళ బోర్డు.. సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు కట్ చేసేందుకు ఆదేశిస్తే అందుకు తాము సిద్ధమేనని, కానీ సినిమా మొత్తానికే సమస్యాత్మకం చేస్తున్నారని, ఇప్పటికే కేసర్ భవానీ ఫిల్మ్ ప్రొడక్షన్ సమర్పణలో 12 కు పైగా గుజరాతీ సహా ఇతర భాషా చిత్రాలను నిర్మించిన 'పవర్ ఆఫ్ పాటీదార్' నిర్మాత పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘అడ్డదారి’ అనుమతి
ఇసుక రవాణాలో అక్రమాలు లబ్ధిదాలరుల పేరుతో వ్యాపారుల దోపిడీ అధికారులపై మండిపడుతున్న ప్రజలు మునుగోడు: అక్రమ ఇసుక రవాణాపై పోలీస్‌లు, రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపడంతో గహ నిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్రమార్కులను అరికట్టాలని అధికారులు చర్యలు చేపట్టగా.. అసలైన లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు కొంత సడలింపు ఇచ్చారు. అయితే ఈ అవకాశాన్ని ఇసుక వ్యాపారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. కొందరు అధికారులతో చేతులు కలిపి యధేచ్ఛగా ఇసుక రవాణ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారంలో రెండు రోజులు... మండలంలోని మునుగోడు, చీకటిమామిడి, కొరటికల్, ఇప్పర్తి తదితర గ్రామాల నుంచిlఇసుక రవాణా చేసేందుకు రెవెన్యూ అధికారులు ప్రతి సోమ, గురువారాల్లో అనుమతులు ఇస్తున్నారు. అయితే ఇసుక అవసరమైన ఇంటి యజమాని దరఖాస్తు రాసుకొని ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శితో ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నట్లు ధ్రువీకరణ పొంది తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. దానిని పరిశీలించి ఆయన టైంమ్తో కూడిన అనుమతి ఇస్తారు. అయితే దానిని ఆసరాగా చేసుకున్నlకొంతమంది వ్యాపారులు సంబంధిత మండల అధికారిని మచ్చిక చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. బినామీ వ్యక్తుల పేర్ల మీద దరఖాస్తు చేసుకొని ఎలాంటి ధ్రువీకరణ లేకుండానే అనుమతులు పొందుతున్నారు. అలా అడ్డదారిలో అనుమతులు ఇచ్చినందుకు సదరు అధికారికి ఒక్కోSట్రాక్టర్ యజమాని రూ.750 చొప్పున ముడుపులు ఇస్తున్నారని సమాచారం. ఇలా అనుమతులు పొందినవారు వాగుల నుంచి ఇసుకను ఎత్తుకొని పరిసర మండలాలైనా చిట్యాల, నారాయణపురం, నార్కట్‌పల్లి మండలాలకు తరలించి ఒక్కో ట్రిప్పు రూ.3500 నుంచి రూ.4 వేల వరకు విక్రయింస్తున్నారు. ఇది ఇలా ఉంటే నిజమైన లబ్ధిదారులు ఇసుక అనుమతి కావాలని దరఖాస్తు చేసుకుంటే సదరు అధికారి వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అనుమతులు ఇవ్వడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అంతేకాక డబ్బులు ఇవ్వని ట్రాక్టర్ యజమానులపై వాల్టా చట్టం కేసులను నమోదు చేస్తున్నాడని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు వ్యాపారులకు అండగా నిలిచిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. డబ్బులు ఇచ్చినవారికేSఅనుమతులు – సురిగి చలపతి, సీపీఐ మండల కార్యదర్శి ఇసుక అవసరం ఉందా లేదా అనేది కాదు. తమకు డబ్బులు ఎవ్వరూ ఇస్తే వారికే రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వకుండా అనుమతులకు వెళ్లినవారిపై అధికారి మండిపడుతూ రోజుల తరబడి తిప్పుతున్నారు. ఈ రకంగా కొన్ని వాహనాలకు మాత్రమే అనుమతులు దక్కుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే ఆందోళనలు చేపడుతాం. ఆరోపణల్లో నిజం లేదు –వై.శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ అక్రమ వ్యాపారులను ప్రొత్సహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. లబ్ధిదారులు ఆ గ్రామ కార్యదర్శితో ధ్రువీకరణ పత్రం తీసుకోని వస్తేనే అనుమతులు ఇస్తున్నాం. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని జరిమానాలు విధిస్తున్నాం. ఇకా నుంచి ఇంటి యజమానితో పాటు ఆ గ్రామ వీఆర్ఏను వెంట ఉంచి రవాణా చేసేలా ఆదేశిస్తాం. -
సముద్రంలో 'అసాధారణ శౌర్యం'!
న్యూఢిల్లీః ఆమె ధైర్య సాహసాలు ప్రపంచదృష్టినే ఆకట్టుకున్నాయి. భారత షిప్పింగ్ కార్పొరేషన్ అధికారంలోని 'సంపూర్ణ స్వరాజ్య' ఆయిల్ ట్యాంకర్ హెల్మ్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె.. సముద్రంలో ప్రదర్శించిన ఆసాధారణ సాహసాన్ని, శౌర్యాన్ని గుర్తించిన ఇంటర్నేషనల్ మారిటైం ఆర్గనైజేషన్... ఆమెను అవార్డుతో సత్కరించనుంది. దీంతో రాధికా మీనన్ ప్రపంచంలోనే సముద్ర శౌర్యానికి అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళ కానుంది. మునిగిపోతున్న పడవనుంచీ ఏడుగురు జాలర్ల జీవితాలను రక్షించి, ఒడ్డుకు చేర్చిన అత్యంత శౌర్యశాలిగా రాధికా మీనన్ ను ఇంటర్నేషనల్ మారిటైం గుర్తించింది. ఐదేళ్ళ క్రితం ఇండియన్ మర్చంట్ నేవీ లో మొదటి మహిళా కెప్టెన్ గా గుర్తింపు పొందిన మీనన్.. ఇప్పుడు ప్రపంచంలోనే సముద్రంలో శౌర్యాన్ని ప్రదర్శించిన మొదటి మహిళగా అవార్డు అందుకోనుంది. గతేడాది జూన్ సమయంలో ఉన్నట్లుండి వచ్చిన తుఫానుతో సముద్రంలో ఏడుగురు జాలర్లతో చేపల వేటకు వెళ్ళిన 'దుర్గమ్మా' అనే ఫిషింగ్ బోట్ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ నుంచి ఒడిశాలోని గోపాల్పూర్ వైపు వెళ్ళిన పడవ.. సముద్రంలో మునిగిపోతుండటాన్ని రాధికా మీనన్ బృందం గుర్తించింది. అప్పటికే జాలర్లంతా చనిపోయి ఉండొచ్చని భావించిన వారి కుటుంబ సభ్యులు ఏకంగా వారి అంతిమ సంస్కారాలకు సైంతం సిద్ధమైపోయారు. అదే సమయంలో సముద్రంలోని నేవీ బృందం అద్భుతంగా వారిని రక్షించినట్లు వినిపించిన వార్త.. మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం నింపింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సంపూర్ణ స్వరాజ్య ఆయిల్ ట్యాంకర్ నావికురాలుగా పనిచేస్తున్న కేరళ కొడుంగల్లూర్ కు చెందిన మీనన్.. తనకు అందిన గౌరవానికి, గుర్తింపునకు ఈ మెయిల్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. ఓ నావికురాలుగా, ఓడలోని నావికులకు గురువుగా ఉంటూ సముద్రంలో మునిగిపోతున్నవారి జీవితాలను రక్షించడం తన బాధ్యత, విధి నిర్వహణలో ఓ భాగం అంటూ తెలిపింది. -
పెళ్ళికోసమే ఛస్తున్నాః సల్మాన్ ఖాన్
తన మాటలతో ఇటీవల వివాదాల్లో చిక్కుకుంటున్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. ఈసారి తనడైలాగ్స్ తో అభిమానులను ఆకట్టుకునేట్లు చేశాడు. త్వరలో విడుదలకు సిద్ధమౌతున్న సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ రియాలిటీ షోలో పాల్గొన్న ఖాన్.... 'నేను పెళ్ళికోసం పడి ఛస్తున్నానని, అయితే ఇతరుల అంగీకారం కోసం వేచి చూస్తున్నానని' చెప్పడం అభిమానులకు ఆసక్తికరంగా మారింది. సింగింగ్ రియాలిటీ షో 'సా రే గా మా పా' లో పాల్గొన్న దబాంగ్ స్టార్ ను ఓ పోటీదారుడు తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో అడ్వైజ్ అడగడంతో ఖాన్ అలా సమాధానం ఇచ్చాడు. లులియా వంటోర్.. సల్మాన్ గర్ల్ ఫ్రెండ్ అని, అతడు ఆమెనే పెళ్ళి చేసుకుంటాడని వస్తున్న పుకార్లపై ఎదరయ్యే ప్రశ్నలను తప్పించుకునేందుకే సల్మాన్.. సింగింగ్ రియాలిటీ షో 'స రే గా మా పా' లో తాను పెళ్ళికోసం ఛస్తున్నానంటూ చమత్కరించి ఉండొచ్చని జనం గుసగుసలాడుతున్నారు. ఏభై ఏళ్ళ వయసున్న ప్రసిద్ధ సినీ స్టార్.. తానెప్పుడూ స్థిరపడాలనే అనుకుంటున్నానని, అయితే తనను ఇతరులు అంగీకరించడం కోసమే వేచి చూస్తున్నట్లు తెలిపాడు. స రే గా మా పా పోటీదారుడు జగ్ ప్రీత్ బజ్వా... జీవిత భాగస్వామిని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటూ సల్మాన్ ను సలహా అడగడంతో.. ''మీరు తప్పుడు వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు జగ్ ప్రీత్... ఆ విషయంలో నేను చాలా అన్ లక్కీ పర్సన్.. నా గురించి జనం అనుకుంటున్నది కూడ తప్పే..'' అంటూ సల్మాన్ చమత్కరించినట్లు.. టీవీ షో జారీ చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. పైగా... ఇది పురుషులు చెప్పే విషయం కాదని, అన్నింటినీ డిసైడ్ చేసే మహిళలే ఈ విషయాన్ని చెప్పాలని సల్మాన్ చమత్కరించాడట. మరోవైపు నేను సల్మాన్ ఖాన్ కి అతి పెద్ద ఫ్యాన్ అని, ప్రతి విషయంలోనూ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని, భాయ్ ఎప్పుడు పెళ్ళి చేసుకుంటాడో, అదే సంవత్సరంలో నేను కూడ పెళ్ళి చేసుకుంటానని కార్యక్రమానికి మెంటార్ గా ఉన్న మిల్కా సింగ్ చెప్పడం.. రియాలిటీ షో లో నవ్వులు పూయించింది. సుల్తాన్ సినిమా ప్రమోషన్ లో భాగంగా 'సా రే గా మా పా షోలో' సల్మాన్ హాజరైన ఈ భాగం టీవీలో జూన్ 26న ప్రసారం కానుంది. -
పాట రాయండి.. భారీ బహుమతి గెల్చుకోండి
న్యూఢిల్లీ: యోగాపై అవగాహన ఉందా.. సాహిత్య రచనలో ప్రవేశం ఉందా.. పాటలు బాగా పాడతారా? అయితే ఆ అయిదు లక్షలు మీరు గెల్చుకోవచ్చు... ఏంటీ.. అంతా కన్ఫ్యూజింగా ఉందా.. 'యోగగీతం పంపండి.. 5 లక్షలు గెలుచుకోండి' అని కేంద్రం ఆహ్వానిస్తోంది. జూన్ 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ శాఖ ఆ పోటీ నిర్వహిస్తోంది. దీనికోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది. తమకు అందిన వాటిల్లో ఉత్తమపాటను ఎంపికచేసి విజేతను ప్రకటిస్తారు. అత్యత్తుమ పాటగా నిలిచి దానికి రూ. 5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. వ్యక్తిగతంగా గానీ, లేదా గ్రూప్‌గా గానీ ఈ పోటీలో పాల్గొనవచ్చు. 3 - 5 నిమిషాల నిడివిలో, ఎంపీ3 ఆడియో ఫార్మాట్లో ఉన్న యోగ గీతాన్ని పోటీకి పంపవచ్చు. అయితే దీని సైజ్ 5ఎంబీ దాటకూడదనే నిబంధన విధించింది. పోటీలో పాల్గొనేవాళ్లు మార్చి 31వ తేదీలోగా తమ ఎంట్రీలను inf-moayush@gov.in అనే ఈమెయిల్ ఐడీకి పంపాలి. మరిన్ని వివరాలకు www.indiamedicine.nic.in అనే వెబ్సైట్ ను పరిశీలించుకోవచ్చని తెలిపింది. అయితే మరో ముఖ్య విషయం ఏమిటంటే పాట హిందీ భాషలో మాత్రమే ఉండాలి. -
ఆ వరుసలో ఇపుడు వెంకటేష్
హైదరాబాద్: టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాల కోసం ప్రయోగాలు చేయడం, బరువు పెరగడం తగ్గడం చాలా కామన్‌గా మారిపోయింది. దీనికోసం పస్తులు ఉండడం, కసరత్తులు చేయడం మామూలే. ఆయా పాత్రల్లో ఒదిగిపోయేందుకు నటీనటులు ఎంతటి రిస్క్ చేయడానికైనా వెనకడుగు వేయట్లేదు. ఇప్పుడు ఈ కోవలోకి టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు. తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో రూపుదిద్దుకోబోతున్న ఓ మూవీ కోసం ఆయన భారీగా బరువు పెరగనున్నారని సమాచారం. మాధవన్ హీరోగా హిందీలో సూపర్ హిట్ అయిన 'సాలా ఖుదూస్' రీమేక్ లో నటిస్తున్న వెంకీ ఈ మూవీకి అనుగుణంగా తన బాడీని మలుచుకోకున్నారట. ఒక బాక్సర్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలోని పాత్రకు న్యాయం చేసేందుకు బరువు పెరగాలని నిర్ణయించారట. దీనికోసం ఆయన భారీ కసరత్తులే చేయనున్నట్టు తెలుస్తోంది. తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైన సాలా ఖుదూస్ చిత్రంలో మాధవన్ ఓ బాక్సర్‌గా, బాక్సింగ్ కోచ్‌గా చేసిన అద్భుత నటన పలువురి ప్రశంసలందుకుంది. దీనికి దీటుగా తెలుగు రీమేక్ తీర్చిదిద్దేందుకు పక్కా ప్లాన్‌తో ముందుకువెళుతున్నాడట వెంకటేష్. 'దృశ్యం' ఇచ్చిన భారీ హిట్‌తో మాంచి కిక్ మీదున్న వెంకీ ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో 'బాబు బంగారం' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తెలుగు సినిమా దిగ్గజ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా ఆయా పాత్రల కోసం ప్రయోగాలు చేసినవారే. ప్రస్తుత హీరో హీరోయిన్లు కూడా సాహసాలకు సిద్ధపడుతున్నారు. సాలా ఖుద్దూస్ కోసం మాధవన్, పీకే సినిమా కోసం అమీర్ ఖాన్, సరభ్ జిత్ సింగ్ సినిమా కోసం రణదీప్ హూడా, నేను శైలజ సినిమా కోసం హీరో రామ్, సైజ్ జీరో కోసం అనుష్క, బాహుబలి కోసం ప్రభాస్, రానా.. ఇలా చాలామంది రకరకాల ప్రయోగాలతో వార్తల్లో నిలిచినవారే. -
అర్ధరాత్రి ముహుర్తం ఎందుకు?