సెక్యూరిటీ గార్డులకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తీపి కబురు అందించారు. వారికి నెలవారీ కనీసం జీతాన్ని 15 వేల రూపాయలుగా నిర్ణయించనున్నట్టు తెలిపారు. అలాగే సాయుధ సెక్యూరిటీగార్డులు, సూపర్ వైజర్లను అత్యంత నైపుణ్యంగల పనివారుగా వర్గీకరించి.. వారికి నెలకు పాతికవేలు కనీస జీతాన్ని అందించేలా చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించారు. ఫిక్కీ ఆధ్వర్యంలో ప్రయివేట్ సెక్యూరిటీ పరిశ్రమపై నిర్వహించిన సమావేశంలో ప్రసంగించిన ఆయన ఈ శుభవార్త అందించారు. ప్రభుత్వ ప్రధాన పథకాలైన స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా లతో అనుసంధానం చేయాలన్ లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం కార్మిక చట్టాల్లో గణనీయ సంస్కరణలు చేపడుతోందన్నారు. దీనికి ద్వారా సుమారు 50 లక్షల సెక్యూరిటీ గార్డులకు సహాయం అందించనున్నామన్నారు. తమ నిర్ణయం వివిధ రంగాల నుంచి సెక్యూరిటీ గార్డులకున్న భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో నియామకం, శిక్షణ, నైపుణ్యంగల కార్మిక శక్తిని రూపొందించడంలో ప్రయివేటు సెక్యూరిటీకి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. తద్వారా ప్రయివేటు సెక్యూరిటీ రంగంలో ఉన్న 50 లక్షల మంది భద్రతా సిబ్బందికి మెరుగైన వేతనాల సౌలభ్యంతోపాటు, వారి కుటుంబ సభ్యులకు 2.5 కోట్లకు పైగా సామాజిక భద్రతను అందిస్తుందని దత్తాత్రేయ సూచించారు.
ఈ విధానం సరళీకరణలో భాగంగా 44 కేంద్ర కార్మిక చట్టాల విలీన ప్రక్రియను త్వరలోనే కేంద్ర క్యాబినెట్ ముందు ఉంచుతా మన్నారు. అలాగే రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదముద్ర పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, పని పరిస్థితులు, ఆరోగ్యంమరియు రక్షణ అనే నాలుగు అంశాలపై దృష్టిపెట్టినట్టు దత్తాత్రేయ తెలిపారు
సెక్యూరిటీ గార్డులకు శుభవార్త
Published Thu, Sep 15 2016 1:39 PM | Last Updated on Sat, Sep 15 2018 8:43 PM
Advertisement
Advertisement