Bandaru Dattatreya
-
Sakshi Excellence Awards 2025: సామాజిక స్ఫూర్తికి సెల్యూట్
సమాజం ఆర్థిక సూత్రాల పై ఆధారపడి నడుస్తున్నట్టు కనిపించినా దానికి హృదయం, స్పందన ఇచ్చేది మాత్రం సామాజిక, సాంస్కృతిక అంశాలే. ‘ఇలా మారాలి’ అని సామాజిక సేనానులు బోధ చేస్తే, ‘ఇలా వికాసం పొందాలి’ అని సాంస్కృతిక సారథులు దారి చూపుతారు. సామాజిక చైతన్యం, సాంస్కృతిక వికాసం లేని సమాజంలో సంపద కేవలం పటాటోపం మాత్రమే. అందుకే అర్థవంతమైన సమాజం కోసం గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్’ నిర్వహిస్తోంది. సామాజిక రంగంలో, కళారంగంలో విశిష్ట రీతిలో పని చేస్తున్న వారికి అవార్డ్స్ ఇచ్చి గౌరవిస్తోంది. ఈ పరంపరలో 2023కు గాను ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో ఘనమైన వేడుక నిర్వహించింది. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్లు, ఎడిటర్, విశిష్ట అతిథులు పాల్గొన్న వేడుక అవార్డు గ్రహీతలకు జీవితకాల అనుభూతిగా మారింది.సమాజంలో ఉన్నటువంటి అనేక మంది సేవకు గుర్తింపు రావడం అంటే సామాన్య విషయం కాదు. వారు ఆయా రంగాల్లో చేసిన సేవను గౌరవించడానికి ఈ అవార్డులు ఇస్తున్నారు. సమాజానికి సేవ చేసిన వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం అభినందనీయం. సాక్షి గ్రూప్‌నకు, ముఖ్యంగా భారతీరెడ్డి గారికి అభినందనలు.– బండారు దత్తాత్రేయ, హరియాణ గవర్నర్సాక్షి ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో భాగస్వామి కావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డుల కార్యక్రమంతో నాకు 10 ఏళ్ల అనుబంధం ఉంది. జ్యూరీలో నన్ను భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు. అసామాన్య ప్రతిభ చూపే వారిలో ఉత్తములను ఎంపిక చేయడం కత్తిమీద సాములాంటిది. ఇందుకోసం సాక్షి టీమ్ ఎంతో కష్టపడ్డారు. ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై రీసెర్చ్ చేసి పెద్ద నోట్స్ సిద్ధం చేశారు. మేం ఎలా ముందుకు సాగాలో తెలియజెప్పేందుకు వారు పడిన కష్టం ఎంతో గొప్పది. ఎలాంటి పక్షపాతం లేకుండా అవార్డులకు ఎంపిక చేసే విధానం సాక్షిలో నాకు కనిపించిన గొప్పదనం. అవార్డులు తీసుకున్న వారందరికీ నా అభినందనలు.– శాంతా సిన్హా, జ్యూరీ చైర్పర్సన్మట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయం ప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికిప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంవీధి బాలలను చేరదీసి ఆశ్రయం కల్పించి తగిన పౌష్టికాహారం అందించి బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలనే సమున్నత ఆశయంతో పని చేస్తోంది రెయిన్ బో హోమ్స్ప్రోగ్రాం సంస్థ్థ. దేశవ్యాప్తంగా పది నగరాల్లో ఇప్పటివరకు 14,996 మంది వీధి బాలలు, 5,557 మంది చిన్నారులు, యువతీ, యువకులకు ఆశ్రయం కల్పించింది. రెయిన్ బో హోమ్స్ ప్రోగ్రామ్ సంస్థను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.కె. అనురాధ, విద్యారంగంమట్టిని పట్టుకున్నా బంగారమే అవుతుందని నిరూపించాడు కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన మావురం మల్లికార్జున్‌రెడ్డి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన తరువాత వ్యవసాయం మీదున్న ఆసక్తితో తన 12 ఎకరాల భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని సేంద్రియ వ్యవసాయంప్రారంభించారు. వరి, అల్లం, మిర్చి సాగు చేస్తూ మరోవైపు దేశీ ఆవులు, కోళ్లు పెంచుతూ సమీకృత వ్యవసాయానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. ఆయనను ‘ఎక్సలెన్స్ ఇన్ ఫార్మింగ్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మావురం మల్లికార్జున్ రెడ్డి, సేంద్రియ వ్యవసాయంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్‌గా పని చేస్తున్న హర్షవర్ధన్ ఒక డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూనే తన ప్రజా వైద్యశాలలో కేవలం ఒక్క రూపాయి ఫీజుతో కార్పోరేట్ హాస్పిటల్ స్థాయి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఏజెన్సీప్రాంత నిరుపేదలకు ఆయనొక ఆపద్బాంధవుడు. అవసరమైనవారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా సర్జరీలు చేస్తుంటారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న డాక్టర్ హర్షవర్థ్దన్ ను ‘ఎక్సలెన్స్ ఇన్ హెల్త్ కేర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.హర్షవర్థన్, ఆరోగ్య సంరక్షణచెక్కుచెదరని సంకల్పం ఉంటే సాధ్యం కానిదేమీ లేదు అని నిరూపించారు నెల్లూరుకు చెందిన సుహాస్. ఫార్మసీలో పీహెచ్డీ చేసి 3 లక్షల రూపాయల పెట్టుబడితో చిన్న ఐస్‌క్రీమ్ స్టోర్ప్రారంభించిన సుహాస్ ఇప్పుడు ఏడు రాష్ట్రాల్లో 120కి పైగా స్టోర్లకు విస్తరించారు. 14 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. ఆర్గానిక్ ఐస్‌క్రీమ్ తయారు చేస్తూ ఆదరణ పొందారు. సుహాస్ బి షెట్టిని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ – స్మాల్ అండ్ మీడియం అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.సుహాస్ బి శెట్టి, చిన్న/మధ్య తరహా వాణిజ్యంచదరంగంలో ఎత్తుకు పై ఎత్తు వేసి...ప్రత్యర్థిని చిత్తు చేయాలి.. అలాంటి టాలెంట్ పుష్కలంగా ఉన్న అర్జున్ చెస్‌లో అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నారు. హన్మకొండకు చెందిన అర్జున్ గుజరాత్లో జరిగిన జాతీయ చాంపియన్ షిప్లో అండర్ 13 విభాగంలో గోల్డ్ మెడల్ గెలుచుకుని తన విజయయాత్రనుప్రారంభించారు. 2015 ఏషియన్ యూత్ చాంపియన్ షిప్లో రజతం గెలిచి తొలి అంతర్జాతీయ పతకం సొంతం చేసుకున్నారు. 2018లో 14 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించి తెలంగాణ నుంచి జీఎం హోదా పొందిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. అర్జున్ ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్–స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అర్జున్ ఎరిగైసి, క్రీడలుఅడవులు అంతరించి పర్యావరణ సంక్షోభం ఏర్పడుతున్న ఈ కాలంలో అడవినే సృష్టించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. సూర్యాపేట జిల్లా రాఘవపురంలో 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చేశారాయన. ఆయన కృషి ఫలితంగా లక్షల చెట్లు ఊపిరి తీసుకుంటూ ఉండగా వాటితో పాటు నెమళ్లు, జింకలు, నక్కలు, అడవి పందులు... నీడ పొందుతున్నాయి. పక్షులు, జంతువుల కోసం ఆ అడవిలోనే ఏడు చెరువులు తవ్వించిన సత్యనారాయణను ‘ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.దుశర్ల సత్యనారాయణ, పర్యావరణంభద్రాచలంకు చెందిన గొంగడి త్రిష క్రికెట్లో కొత్త తారగా అవతరించింది. ఎనిమిదేళ్ల వయసులో జిల్లాస్థాయి అండర్ 16 జట్టుకు ఆడి ‘ప్లేయర్ ఆఫ్ ద సీరిస్’ గా నిలిచింది. పన్నెండేళ్ల వయసులో హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టుకు ఎంపికైన త్రిష బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను గెలుచుకుంది. ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్న ఈ లెగ్ స్పిన్నర్ ఐసీసీ అండర్–19 మహిళల టి 20 వరల్డ్ కప్–2025లో సెంచరీ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. గొంగడి త్రిషను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్– స్పోర్ట్స్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.త్రిష, క్రీడలుఖమ్మం జిల్లా కారేపల్లికి చెందిన మద్దెబోయిన మానస పుట్టుకతోనే అంధురాలు. ఇరుగు పొరుగువారి మాటలకు మానసగాని ఆమె తల్లిదండ్రులుగాని కొంచెం కూడా వెరవలేదు. డిగ్రీ వరకు చదివిన మానస తానెవరికీ తక్కువ కాదు అని పోటీ పరీక్షలపై దృష్టి సారించారు.ఇంటి వద్దనే సొంతంగా ప్రిపరేషన్ మొదలు పెట్టి గ్రూప్–4 ఉద్యోగానికి ఎంపికై తన కలను నెరవేర్చుకున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచిన మానసను ‘ యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ ఎడ్యుకేషన్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.మద్దెబోయిన మానస, విద్యారంగంవరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తికి పుట్టుకతో జన్యుపరమైన బలహీనత ఉంది. అయినా స్కూల్లో తోటి విద్యార్థులతో సమానంగా ఆటల్లో పాల్గొనేది. ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేశ్ పారా అథ్లెట్‌గా ట్రెయినింగ్ ఇచ్చారు. ఇక ఆ తరువాత మొదలైంది పతకాల వేట. 2024లో జపాన్ లో జరిగిన పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్ షిప్లో 400 మీటర్ల టి20 విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకోవడమే కాకుండా ప్రపంచ రికార్డును నెలకొల్పారు దీప్తి. దీప్తి జీవాంజిని స్పోర్ట్స్ కేటగిరిలో ‘యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.జీవాంజి దీప్తి, క్రీడలుపెద్ది శంకర్ గౌడ్ ‘రెడీ టు సర్వ్ ఫౌండేషన్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి 2011లో వనస్థలిపురంలో ఒక ఓల్డేజ్ హోమ్ప్రారంభించారు. ఏ ఆసరా లేని వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఉచిత భోజన, వైద్య సేవలు అందచేస్తోంది ఈ సంస్థ. ప్రముఖ హాస్పిటల్స్ యాజమాన్యాలను ఒప్పించి అక్కడి వైద్యుల చేత వృద్ధులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన మెడిసిన్స్ ఉచితంగా ఇస్తున్నారు. పెద్ది శంకర్ గౌడ్‌ను ‘యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ సోషల్ సర్వీస్’ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.పెద్ది శంకర్, సామాజిక సేవమద్దినేని ఉమామహేష్.. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్న ఇరవయ్యేళ్ల షూటర్. స్వస్థలం విజయవాడ. బెంగుళూరులో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో గోల్డు మెడల్ సాధించాడు. 2022లో జర్మనీలో జరిగిన ISSF జూనియర్ వరల్డ్ కప్‌లో, 2024లొ ఢిల్లీలో జరిగిన FISU వాల్డ్ యూనివర్సిటీ ఛాంపియన్ షిప్ మెన్స్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఉమా మహేష్‌ను ‘స్పోర్ట్స్ కేటగిరిలో యంగ్ అచీవర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’తో సత్కరించింది సాక్షి.మద్దినేని ఉమా మహేష్, క్రీడలుఇస్రో మాజీ శాస్త్రవేత్తలైన పవన్ కుమార్ చందన, నాగభరత్ కలిసి 2018లో స్కైరూట్ ఏరోస్పేస్నుప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల స్టార్టప్ కంపెనీ. అంతరిక్షాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో విక్రమ్–సిరీస్ ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తోంది స్కైరూట్. ఈ కంపెనీలో 350కు పైగా ప్రతిభావంతమైన అంతరిక్ష నిపుణులు పని చేస్తున్నారు. అంతరిక్ష పరిశోధనలను సరళతరం చేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీని ‘ఎక్సలెన్స్ ఇన్ స్టార్టప్ అవార్డు’తో సత్కరిస్తోంది సాక్షి మీడియా గ్రూప్.పవన్ చందన, నాగ భరత్, స్టార్టప్తలసీమియా... చిన్నారుల పాలిట శాపమైన ఈ వ్యాధికి వైద్యం చేయించలేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు పొద్దుటూరి అనిత. ఖమ్మంలో ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తూనే తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం సంకల్ప పేరిట ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. విరివిగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ తలసేమియా గురించి... రక్త దానం ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నారు. పొద్దుటూరి అనితను ‘ఎక్సలెన్స్ ఇన్ సోషల్ డెవలప్మెంట్ అవార్డు’తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.అనితప్రొద్దుటూరి, సామాజిక సేవచంద్రకాంత్ సాగర్ పుట్టుకతోనే 90 శాతం శారీరక లోపంతో జన్మించారు. అయినా ఏనాడూ కుమిలిపోలేదు. వీల్‌చైర్ నుంచే 2019లో ప్రణవ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణహిత సంచులు, సర్జికల్ మాస్కులు, పెన్నులు, పెన్సిళ్లు తయారు చేస్తూ పది మంది దివ్యాంగులకు ఉపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారి టర్నోవర్ 25 లక్షలు. చంద్రకాంత్ సాగర్ని ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ కేటగిరీ’లో స్పెషల్ జ్యూరీ రికగ్నేషన్ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్.చంద్రకాంత్ సాగర్, చిన్న/మధ్య తరహా వాణిజ్యండొక్కరి రాజేశ్ గుండె ధైర్యం, త్యాగం దేశాన్నే కాదు తెలుగు వారిని కూడా గర్వపడేలా చేసింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామానికి చెందిన డొక్కరి రాజేశ్ 2018లో ఆర్మీలో చేరి తండ్రి కలను నిజం చేశారు. మూడేళ్లలోనే నాయక్ స్థాయికి ఎదిగారు. సెలవుపై స్వగ్రామానికి వచ్చినప్పుడల్లా పేద విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టేవారు. 2024 జూలై 15న జమ్ము కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులను ఎదుర్కొంటూ వీరమరణం పొందారు. వీర జవాన్ డొక్కరి రాజేశ్‌కు సాక్షి ఎక్సలెన్స్ – పొస్తమస్ అవార్డును ఆయన కుటుంబ సభ్యులకు అందించింది సాక్షి మీడియా గ్రూప్.డొక్కరి రాజేష్ తల్లిదండ్రులు, అమర సైనికుడు→పురస్కార గ్రహీత చంద్రకాంత్‌తో భారతీరెడ్డి ∙‘సాక్షి’ మీడియా గ్రూప్ ప్రతినిధులతో ముఖ్య అతిథి బండారు దత్తాత్రేయడొక్కరి రాజేష్ తల్లిదండ్రులకు పురస్కారం అందిస్తూ... -
నేడు సాక్షి అవార్డ్స్ స్పెషల్ ఎపిసోడ్
గత పది సంవత్సరాలుగా సాక్షి మీడియా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’ వేడుక స్పెషల్ ఎపిసోడ్ సాక్షి టీవీలో శనివారం ప్రసారం కానుంది. ఫిబ్రవరి 28 శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ వేడుకలో వై.ఎస్.భారతి రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. సామాజిక రంగంలో గొప్ప సేవ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన వారికీ, కళారంగంలో గొప్ప ప్రతిభ చూపిన వారికి 2023–24 సంవత్సరాలకు గాను ఈ ఎక్సెలెన్సీ అవార్డులు బహూకరించారు. జ్యూరీ చైర్‌పర్సన్‌గా శాంతా సిన్హా వ్యవహరించారు. అవార్డులు అందుకున్న వారిలో పర్యావరణ సేవకు గాను దూసర్ల సత్యనారాయణ, సేంద్రియ వ్యవసాయానికి మల్లికార్జున రెడ్డి, అమర సైనికుడు డొక్కరి రాజేష్ (మరణానంతరం అతని తల్లిదండ్రులకు), క్రికెటర్ గొంగడి త్రిష, అథ్లెట్ జీవాంజి దీప్తి తదితరులు ఉన్నారు. సినిమా రంగంలో లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ సీనియర్ నటి రమాప్రభ అందుకున్నారు. ఎక్సెలెన్సీ అవార్డులు అందుకున్న వారిలో దర్శకుడు సాయి రాజేష్, మీనాక్షి చౌదరి, కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు. డైరెక్టర్ సుకుమార్ ‘తెలుగు పర్సన్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం, ఉత్తమ దర్శకుడి పురస్కారం అందుకున్నారు. -
సేవాభావాన్ని గుర్తించడం సామాన్యమైన విషయం కాదు
సాక్షి, హైదరాబాద్: సమాజంలో సేవ చేస్తున్న వారిని గుర్తించడం సామాన్యమైన విషయం కాదని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఎన్నో రంగాల్లో సేవ చేస్తున్నవారు నిజజీవితంలో తారసపడుతున్నప్పటికీ.. అందులో ఉత్తమమైన వారిని గుర్తించి అవార్డులు అందిస్తున్న ‘సాక్షి’కృషి అద్భుతమని ప్రశంసించారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న విశిష్ట వ్యక్తులకు ‘సాక్షి’మీడియా గ్రూప్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ‘సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ టెన్త్ ఎడిషన్’కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ.. వైఎస్ భారతిరెడ్డితో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మాట్లాడారు.ఈ కృషిని అభినందించాల్సిందే..సమాజంలో ఎలాంటి ఫలాలను ఆశించకుండా సేవచేస్తున్నవారు ఎంతోమంది ఉన్నారని.. ఆ సేవలను గుర్తించి ప్రోత్సహిస్తే, వారిలో ఉత్సాహం రెట్టింపు అవుతుందని దత్తాత్రేయ చెప్పారు. వారి జీవితం సమాజంలోని ఎంతోమందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఎక్సలెన్స్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ‘సాక్షి’మీడియా గ్రూప్ పదేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తోందని.. ఈ కృషిని అభినందించాల్సిందేనని చెప్పారు.‘‘ఎక్సలెన్స్ అవార్డుల ఎంపిక ప్రక్రియ ఆషామాషీ కాదు. సేవ చేసేవారిని గుర్తించడం, వారి సేవతో సమాజంలో వస్తున్న మార్పును విశ్లేషించడం ద్వారా విశిష్ట వ్యక్తులను గుర్తించి అవార్డులకు ఎంపిక చేయడం జ్యూరీ సభ్యులకు అతిపెద్ద సవాలు..’’అని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ అవార్డులకు ఎంపిక చేసిన విధానం అద్భుతంగా ఉందని జ్యూరీ సభ్యులను అభినందించారు. పదేళ్ల అవార్డుల ప్రదానోత్సవానికి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయం, విద్య, సామాజిక అభివృద్ధి, వ్యాపారం, పరిశ్రమలు, ఆరోగ్య పరిరక్షణ తదితర కేటగిరీలలో తొమ్మిది మందికి గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ‘సాక్షి’ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్స్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, ఇక్ఫాయ్ యూనివర్సిటీ డైరెక్టర్లు కె.ఎల్.నారాయణ, కె.ఎస్.వేణుగోపాల్‌రావు, వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ పోతూరి, సాక్షి సీఈవో, డైరెక్టర్లు, ఎడిటర్ పాల్గొన్నారు. -
నాయబ్‌సింగ్ సైనీ అనే నేను..
చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రిగా ఓబీసీ నాయకుడు నాయబ్‌సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. పంచకులలోని దసరా గ్రౌండ్లో గురువారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయనతో రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. నూతన మంత్రుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. గురువారం వాలీ్మకి జయంతి కావడంతో ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారానికి బీజేపీ నాయకత్వం ఇదే రోజును ముహూర్తంగా ఎంచుకుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, చిరాగ్ పాశ్వాన్తోపాటు బీజేపీ/ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, భూపేంద్ర పటేల్, ప్రమోద్ సావంత్, హిమంత బిశ్వ శర్మ, విష్ణుదేవ్ సాయి, పుష్కర్‌సింగ్ దామీ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కంటే ముందు సైనీ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇటీవల జరిగిన హరియాణా శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 48 స్థానాలు గెలుచుకుని వరుసగా మూడోసారి అధికారంలోకి వచి్చంది. మోదీ అభినందనలు హరియాణా సీఎం నాయబ్‌సింగ్ సైనీతోపాటు కొత్త మంత్రులకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మంత్రివర్గం కూర్పు చక్కగా ఉందని ప్రశంసించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. హరియాణా ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్ర అభివృద్ధిని నూతన శిఖరాలకు చేరుస్తుందని పేర్కొన్నారు. పేదలు, రైతులు, యువత, మహిళలతోపాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమం, సాధికారత విషయంలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందన్న విశ్వాసం తనకు ఉందన్నారు. బీజేపీతో మూడు దశాబ్దాల అనుబంధం బీజేపీ సీనియర్ సీనాయకుడు నాయబ్‌సింగ్ సైనీని మరోసారి అదృష్టం వరించింది. హరియాణా సీఎంగా వరుసగా రెండోసారి ఆయన ప్రమాణం చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. మనోహర్‌లాల్ ఖట్టర్ స్థానంలో ఆయనను బీజేపీ అధిష్టానం నియమించింది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడంతోపాటు ఓబీసీల ఓట్లపై గురిపెట్టిన కమల దళం అదే వర్గానికి చెందిన సైనీని తెరపైకి తీసుకొచి్చంది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇచి్చంది. హరియాణాలో బీజేపీ వరుసగా మూడోసారి నెగ్గింది. అనూహ్యంగా పార్టీని గెలిపించిన సైనీకే మళ్లీ సీఎం పీఠం దక్కింది. ఆయన సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు. సైనీ 1970 జనవరి 25న అంబాలా జిల్లాలోని మీర్జాపూర్ మాజ్రా గ్రామంలో జని్మంచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీలో కొనసాగుతున్నారు. పార్టీలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఎమ్మెల్యేగా, 2019లో ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మనోహర్‌లాల్ ఖట్టర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2023 అక్టోబర్‌లో హరియాణా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఖట్టర్ ఈ ఏడాది మార్చి సీఎం పదవితోపాటు కర్నాల్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఖట్టర్ స్థానంలో సైనీ ముఖ్యమంత్రి అయ్యారు. మే నెలలో జరిగిన కర్నాల్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్టోబర్ 5న జరిగిన అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో లాడ్వా స్థానం నుంచి 16,054 ఓట్ల మెజారీ్టతో జయకేతనం ఎగురవేశారు. -
దసరా స్పెషల్ : హైదరాబాద్‌లో ‘అలయ్ బలయ్’ సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్
-
హైదరాబాద్: అలయ్ బలయ్ సందడి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. బండారు దత్తత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. ఇది 19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ గవర్నర్ జిష్ణూ దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ అంతరించిపోతున్న తెలంగాణ కళలు భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి. జెండాలకు అజెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసింది. ఆఎస్ఎస్ టూ ఆర్ఈసీ, కాంగ్రెస్ టూ కమ్యూనిస్టుల వరకు ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట గుర్తుకు వస్తాయి. ‘అలయ్ బలయ్’ అంటే బండారు దత్తాత్రేయ గుర్తు వస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై.. మాట్లాడారు.‘‘ స్నేహశీలి బండారు దత్తాత్రేయ. భావితరాలకు ఈ కార్యక్రమాన్ని అందించాలి. పండగలకి సామాజిక సంస్కృతి అంతే ఉంది. కలిసి మెలిసి ఉండాలన్న సంకల్పం ఈ అలయ్ బలయ్. కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యత సాధించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి వదిలి పెట్టి మన అనుకునే ఐక్యత పద్దతి పాటించాలి’ అని అన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడారు.‘‘ అలయ్ బలయ్ రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వానికి ప్రతీక . పలు రాష్ట్రాల గవర్నర్ల రాకతో దేశమంతా దిగివచ్చినట్లు ఉంది. అలయ్ బలయ్‌ను హైదరాబాద్‌తో జిల్లాలకు, ఆంధ్రపదేశ్ కు కూడా విస్తరించాలి’’ అని అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధిలో తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని అన్నారు.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు. ‘‘ అలయ్ బలయ్ అంటే ఐక్యత. మన సాంప్రదాయలను ప్రతిబింబించే కార్యక్రమం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సుందరమైనవి. అందరూ కలిసుండాలనేది మన సంస్కృతి. అన్ని మతాల వారు కలిసి విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయం. ఆ విజయం ఐక్యతతో సాధ్యం’’ అని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే అలయ్ బలయ్ గొప్ప కార్యక్రమం. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఇలాంటి ప్రొగ్రాంలలో కలవడం గొప్ప విషయం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, తర్వాత పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది లోపించింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటలతో మాట్లడలేని విధంగా విమర్శించుకుంటున్నారు. వాళ్లలో మార్పు రావాలని దసరా సందర్భంగా దేవుళ్లను కోరుకుంటున్నా. మాట్లాడే భాష అంగీకారం కాదు. మార్పు రావాలి. రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునేలా మాట్లాడం రాజకీయ నాయకులకు తగదు’’ అని అన్నారు.చదవండి: పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు -
సీఎం రేవంత్‌ను కలిసిన బండారు విజయలక్ష్మి.. అలయ్ బలయ్‌కు ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ నేత దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి కలిశారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాల్సిందిగా సీఎంను ఆహ్వానించారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో అలయ్ బలయ్ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు బండారు విజయలక్ష్మి అందజేశారు.కాxe హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈనెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహణ జరగనుంది. దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సాంప్రాదాయాలు ప్రతిభింబించేలా.. సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో కులమతాలకు, పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చి అలయ్ బలయ్ జరుపుకుంటారు.ఈ నెల 13 న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారి కుమార్తె @vjbandarubjp గారు ముఖ్యమంత్రి @revanth_anumula గారిని ఆహ్వానించారు. వారు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.… pic.twitter.com/DO4OGSZFIR— Telangana CMO (@TelanganaCMO) October 10, 2024 -
ప్రధానిపై పాటకు ఆటోగ్రాఫ్..
సాక్షి, హైదరాబాద్: హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మనవరాలు జశోధర (6) తనపై ప్రత్యేకంగా పాడిన పాటను గుర్తుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ నగరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన కూతురు పాడిన పాటను మోదీ రీట్వీట్ చేసిన విషయాన్ని ప్రస్తావించగా..మోదీ స్పందించి త్వరలో జశోధరను కలుస్తానని తెలిపారు. అంతేకాకుండా మోదీ రీట్వీట్ చేసిన స్క్రీన్‌షాట్ ఫొటోగ్రాఫ్ పైన ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆమెను అభినందించారు. తన ఇద్దరు కూతుర్లు జశోధర, వేదాన్షీ మోదీ పైన ప్రత్యేకంగా పాటలు పాడారని విజయలక్ష్మి ప్రధానికి తెలిపారు. My grand daughter Jashodhara reciting a poem in praise of Hon'ble Prime Minister Shri @narendramodi ji. pic.twitter.com/PXQL3KiBmE— Bandaru Dattatreya (@Dattatreya) December 9, 2023 -
వికసిత భారత్ లక్ష్య సాధనకు యువతే కీలకం
స్వామి వివేకానంద, 19వ శతా బ్దపు భారతీయ తత్వవేత్త, ఆధ్యా త్మిక నాయకుడు, గొప్ప ఆలోచనా పరుడు, వక్త, కవి, యువతకు మార్గనిర్దేశకుడు. ప్రపంచ పునరు త్పాదకతకు యువతను చోదక శక్తిగా ఆయన భావించారు. యువ తలో నిక్షిప్తమై ఉన్న నిగూఢమైన శక్తిని ఉదాత్తమైన ఆదర్శాల వైపు మళ్లించడం ద్వారా సమాజంలో గొప్ప పరివర్తన తీసుకు రావచ్చని ఆయన నమ్మారు. వ్యక్తిత్వ నిర్మాణం, నైతిక సమగ్రత, బలమైన ఆత్మవిశ్వాసం వంటివి యువత అభివృద్ధికి అవసరం అని నొక్కి వక్కాణించారు. ఆధునిక విద్య, ఆధ్యాత్మిక జ్ఞానాల చక్కటి సమ్మేళనాన్ని పెంపొందించు కోవాలని ఆయన యువతను ప్రోత్సహించారు. విద్యా వ్యవస్థ జ్ఞానాన్ని అందించడంతోపాటూ సామాజిక బాధ్య తనూ, స్వావలంబననూ పెంపొందించాలని వాదించారు. స్వామి వివేకానందుని జయంతిని ప్రతి ఏడాదీ జనవరి 12న ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుకొంటున్నాం. నిర్భయులూ, నిస్వార్థపరులూ, మానవ సేవకు కట్టుబడి ఉండేవారుగా యువతరాన్ని స్వామి అభివర్ణించారు. నిర్భాగ్యులకు సేవ చేయడం అంటే దేవునికి నిజ మైన సేవ చేసినట్లని ఆయన బలంగా నమ్మారు. మాతృభూమికి, ప్రజానీకానికి సేవ చేసేందుకు దేశంలోని యువత దృఢ సంకల్ప శక్తిని కలిగి ఉండాలన్నారు. ‘మీరందరూ, ఎక్కడ ప్లేగు లేదా కరువు వ్యాప్తి చెందినా, లేదా ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉన్నారో అక్కడికి వెళ్లి, వారి బాధలను తగ్గించండి’ అని యువతకు పిలుపునిచ్చారు. స్వామి 1893 సెప్టెంబర్ 11న చికాగోలో ‘వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలిజియన్స్’(ప్రపంచ మతాల సమ్మేళనం)లో చేసిన ఉపన్యాసం వివిధ మతాలకు చెందిన వారిపై చెరగని ముద్ర వేసింది. తన హృదయాంతరాళం నుంచి పెల్లుబికిన భాతృభావంతో ‘అమెరికా సోదరీ, సోద రులారా’ అని సంబోధిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అంతే... ఒక్కసారిగా ఉరుము ఉరిమినట్లు ప్రేక్షకుల నుంచి చప్పట్ల మోత! ‘మీరు మాకు అందించిన సాద రమైన అపురూప స్వాగతానికి మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన సన్యాసుల తరఫునా, మతాలకే మాత అయిన మతం తరఫునా, హిందూ మతానికి చెందిన అన్ని వర్గాలూ, తెగలకు చెందిన లక్షలాదిమంది ప్రజల తరఫునా పేరు పేరునా ధన్యవాదాలు’ అన్నారు. అలాగే ‘ప్రపంచానికి సహనం, సార్వత్రిక అంగీకారం రెండింటినీ బోధించిన మతానికి చెందినవాడిగా నేను గర్వపడుతున్నాను. మేము సార్వత్రిక సహనాన్ని విశ్వసించడంతోపాటూ అన్ని మతా లనూ నిజమైనవిగా అంగీకరిస్తాం... భూమిపై ఉన్న అన్ని మతాలకూ, దేశాలకూ చెందిన బాధితులకూ, శరణార్థు లకూ ఆశ్రయం కల్పించిన దేశానికి చెందినవాడిగా నేను గర్విస్తున్నాను’ అని ఎలుగెత్తి చాటారు. ‘ఎరైజ్, ఎవేక్, అండ్ స్టాప్ నాట్ అంటిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్’ (లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆగకండి) అని స్వామి ఇచ్చిన పిలుపు ఎంతో ప్రసిద్ధి చెందింది. అలాగే ‘మీరు లోపల నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించరు, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా మార్చరు. మీ సొంత ఆత్మ తప్ప మరొక గురువు లేడు’ అని బోధించారు. ఒక దేశ బలం, శక్తి దాని యువత చేతుల్లోనే ఉందని నొక్కి చెప్పారు. ఆయన దృష్టిలో యువత సానుకూల మార్పుకు దీపధారులు. మంచి భవిష్యత్తును రూపొందించడానికి అవ సరమైన శక్తి, ఉత్సాహం, సృజనాత్మకతను కలిగి ఉండే వారు. ‘మీరు బలహీనులని భావించడం మహాపాపం... విశ్వంలోని అన్ని శక్తులూ ఇప్పటికే మనవి. కళ్లకు అడ్డుగా చేతులు పెట్టుకొని అంతా చీకటి అని ఏడ్చేదీ మనమే. మీ జీవితంలో రిస్క్ తీసుకోండి. మీరు గెలిస్తే, మీరే నాయకత్వం వహించవచ్చు; మీరు ఓడిపోతే, మీరు మార్గనిర్దేశం చేయవచ్చు’ అంటూ స్వామి ఇచ్చిన అద్భుత మైన సందేశాలు యువతకు అనుసరణీయాలు. యువత శారీరకంగానూ, మానసికంగానూ దారు ఢ్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు స్వామి. వారు క్రీడా మైదానాలకు వెళ్లాలన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, విశాల హృదయాలు కలిగిన యువతను ఆయన కోరుకున్నారు. అందుకే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభించారు. 21వ శతాబ్దం భారత్ శతాబ్దం కావడానికి మోదీ కృషి చేస్తు న్నారు. ఐఎమ్ఎఫ్ అంచనా ప్రకారం భారత్ జీడీపీ 5 ట్రిలి యన్ డాలర్లు దాటినందున, మనది నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అలాగే 2027 నాటికి ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది. 2047 నాటికి, భారతదేశం అభివృద్ధి చెందిన దేశానికి సంబంధించిన అన్ని లక్షణాలతో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడా నికి సిద్ధంగా ఉంది. ఇలా ‘వికసిత్ భారత్’ సాకారం కావా లంటే యువత కీలక పాత్ర పోషించవలసి ఉంది. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం అనేక మైలు రాళ్లను చేరుకుంది. ‘చంద్రయాన్’ అంతరిక్ష రంగంలో సాధించిన ప్రగతికి ఒక ఉదాహరణ. డిజిటల్ ఆవిష్కరణ పట్ల దేశం నిబద్ధతను చాటిచెప్పే ఆధార్, యూపీఐ, ఏఏ స్టాక్, కొవిన్ ప్లాట్ ఫారమ్ వంటి వాటి వల్ల భారతదేశ డిజి టల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. భారత్ గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. మన సేవల రంగం, ముఖ్యంగా ఐటీ, ఐటీయేతర డొమైన్లలో ప్రపంచ ప్రాముఖ్యం కలిగి ఉంది. 300 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ విలువ కలిగిన 100 యునికార్న్‌లను భారత్ కలిగి ఉండి, ప్రపంచంలోని మూడవ–అతిపెద్ద స్టార్ట్–అప్ పర్యా వరణ వ్యవస్థగా నిలిచింది. ఈ ‘అమృత్ కాల్’ సందర్భంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ను రూపొందించడానికి స్వామి వివేకా నంద బోధనలను ఉపయోగించుకుందాం! - వ్యాసకర్త హరియాణా గవర్నర్ -
అంతర్జాతీయ తెలుగు మహాసభలకు విచ్చేయనున్న హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత శ్రీ చైతన్యరాజులు తెలిపారు. వారిని హైదరాబాద్ లో మహా సభల సమన్వయకర్త శ్రీ కేశిరాజు రామప్రసాద్ ,ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కలసి ఆహ్వానించినట్లు తెలిపారు. 6 జనవరి 2024 సాయంత్రం 6 గంటలకు జరిగే తెలుగు తోరణం సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రముఖులకు "రాజరాజ నరేంద్ర విశిష్ట పురస్కారాలను" ప్రదానం చేసి వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు. -డా.గజల్ శ్రీనివాస్, అధ్యక్షులు, 9849013697 -
ప్రధానిపై బండారు దత్తాత్రేయ మనుమరాలి పద్యం
సాక్షి, హైదరాబాద్: హరియాణా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ మనుమరాలు జశోధర తనపై పఠించిన పద్యాన్ని విని ప్రధాని నరేంద్రమోదీ మంత్రముగ్ధులయ్యారు. జశోధర పద్య పఠనానికి సంబంధించిన వీడియోను బండారు దత్తాత్రేయ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ‘ఆమె మాటలు శక్తికి మూలం‘అని పేర్కొన్నారు. Creative and adorable. Her words are a source of great energy as well. https://t.co/9BTgtFkpH9 — Narendra Modi (@narendramodi) December 10, 2023 ఇదీ చదవండి: మధ్యప్రదేశ్ సీఎం ఎవరు? రాజస్థాన్‌లో ఏం జరుగుతోంది? -
అక్కా..మీ ఓటు మాకే
ముషీరాబాద్: హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె, ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ ఆశించిన బండారు విజయలక్ష్మికి బీఆర్ఎస్ నాయకులు తమ పార్టీ కరపత్రాన్ని అందించి మద్దతు ఇవ్వాలని కోరారు. సోమవారం అడిక్‌మెట్ డివిజన్లో ప్రచార కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ నివాసం ఉండే గల్లీలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బల్లా శ్రీనివాస్‌రెడ్డి, శ్యామ్‌సుందర్, సయ్యద్ అస్లాం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అదే వరుసలో ఉన్న దత్తాత్రేయ నివాసానికి వెళ్లగా విజయలక్ష్మికి కరపత్రాన్ని అందించి ముఠా గోపాల్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఆమె చిరునవ్వుతో కరపత్రాన్ని స్వీకరించి వారితో ఫొటో దిగారు. కార్యక్రమంలో నాయకులు కొండపల్లి సాయిప్రసన్న, ఇంద్రసేనారెడ్డి, మహ్మద్ ఖదీర్, నేత శ్రీనివాస్, చంద్రశేఖర్, మహ్మద్ జహంగీర్, రోషం బాలు తదితరులున్నారు. దత్తన్న కుమార్తె విజయలక్ష్మికి బీఆర్ఎస్ కరపత్రం -
ఘనంగా దత్తన్న ‘అలయ్ బలయ్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ‘దత్తన్న అలయ్ బలయ్’(దసరా ఆత్మీయ సమ్మేళనం) ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఫౌండేషన్ ప్రస్తుత చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ కళారూపాల ప్రదర్శన, తెలంగాణ ప్రత్యేక వంటకాల రుచులు, ఇలా విభిన్న అంశాల సమాహారంగా ఈ కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. అలయ్‌బలయ్ ఫౌండేషన్ బాధ్యులు విజయలక్ష్మి, డా.జిగ్నేశ్‌రెడ్డి దంపతులు, దత్తాత్రేయ, ఆయన వియ్యంకుడు బి.జనార్దనరెడ్డి, గవర్నర్లు, కేంద్రమంత్రులతో కలిసి పూజలు నిర్వహించారు. మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్ర సహాయ మంత్రులు, సినీరచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, కాంగ్రెస్ నుంచి కె.జానారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ, వైఎస్సార్సీపీ నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం, బీజేపీ నుంచి డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, డా.బూరనర్సయ్య గౌడ్ ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ‘అలయ్ బలయ్ లేకుండా దసరా పూర్తికాదు’ అలయ్‌బలయ్ లేకుండా దసరా పండుగ పూర్తికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, కళలు ఉట్టిపడేలా, తెలంగాణ వంటకాల రుచులు చూపిస్తూ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. అలయ్ బలయ్ అనే పదానికి దత్తాత్రేయ మరోపేరుగా మారారని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమం అత్యంత శక్తివంతమైనదని జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా, పశ్చిమ సంస్కృతి ప్రభావంలో ఉన్న కొత్తతరానికి మన సంస్కృతి తెలియజేసేలా దీనిని 17 ఏళ్లుగా నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బండారు దత్తాత్రేయ ఆశయాలు, ఆదర్శాల పరంపరను ఆయన కుమార్తె విజయలక్ష్మి కొనసాగించాలని ఆకాంక్షించారు. కులాలు, మతాలకు అతీతంగా ఐక్యతకు సంకేతంగా ఈ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమని కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి చెప్పారు. అలయ్ బలయ్ సంస్కృతిపై పరిశోధన జరిపించే విషయంపై రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు విజయలక్ష్మి లేఖలు రాయాలని సీహెచ్ విద్యాసాగరరావు సూచించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్లు, కేంద్రమంత్రులు మణిపూర్‌లో సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. అనేక సిద్ధాంత రాద్ధాంతాలున్నా ఓ మేలుకలయికగా దీనిని నిర్వహించడం గొప్పవిషయమని డా.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణది చాలా గొప్ప సంస్కృతి అని, పూలను గౌరమ్మగా చేసి పూజించే సంస్కృతి అని బండారు విజయలక్ష్మి చెప్పారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్ని చాటేలా అలయ్‌బలయ్‌ను బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, ఇప్పుడు దానిని తాము కొనసాగిస్తున్నామని వెల్లడించారు. -
ముషీరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే బరిలో దత్తాత్రేయ కుమార్తె!
హైదరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే టికెట్ కేటాయింపుపై మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి పేరు బాగా వినిపిస్తోంది. ఈ విషయంపై సాక్షి ప్రతినిధి ఆమెతో ముచ్చటించారు. పాలిటిక్స్ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బీజేపీ సిద్ధాంతాలు కూడా చాలా ఇష్టం. అందుకే అనేక సంవత్సరాలుగా పార్టీ వ్యవహారాల్లోనూ పాల్గొంటున్నాను. నాన్న అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారా? జవాబు: నాన్న చిన్నప్పటి నుంచి నేరి్పన నీతి, నైతిక విలువలు, క్రమ శిక్షణతో పాటు ఆయన కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న పార్టీ సిద్ధాంతం నచ్చి పార్టీలోకి వచ్చాను. 2014, 2019, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, బీజేపీ కార్యక్రమాల్లో చురుకుగానే పాల్గొంటూ.. వస్తున్నాను. మా నాన్న సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గత 35–40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండటంతో ప్రతి కార్యకర్త, నాయకులతో పరిచయాలు ఉన్నాయి. మా ఇళ్లు, పార్టీ వేర్వేరు అని ఏనాడు అనుకోవడం లేదు. దీనికి తోడు అత్తగారి కుటుంబం కూడా రాజకీయాలతో ముడిపడిన కుటుంబమే. మా మామయ్య చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ కూడా చేశారు. ముషీరాబాద్ టికెట్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు. మొదట పార్టీ ఆర్గనైజేషన్‌లో పనిచేయాలి. పార్టీ సిద్ధాంతాలను తెలుసుకోవాలి. నేను ఎక్కడైనా సరిపోతానని పార్టీ అనుకుంటే పార్టీ అక్కడ నిలపెడుతుంది. నా వరకు నేను ఇప్పటి వరకు ప్రత్యక్షంగా అడిగింది లేదు. నేను అక్కడ నిలుచుంటానని చెప్పడం మేము నేర్చుకున్న సిద్ధాంతం కాదు. అలా అడగడం మా పార్టీలైన్ కాదు. ప్రజలు కోరుకుంటున్నారు కదా.? ప్రజలు ఖచ్ఛితంగా బీఆర్ఎస్ నుంచి వేరే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. విజయలక్ష్మిని కోరుకుంటున్నారని నేను అనుకోను. బీజేపీ అభ్యర్థిగా విజయలక్ష్మి సరిపోతుందని పార్టీ అనుకుంటే అప్పుడు ఆలోచిస్తా.. ! డాక్టర్ లక్ష్మణ్ తరువాత మీపేరే ఎక్కువగా వినిపిస్తుంది? అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. కానీ ఎప్పుడు ఎమ్మెల్యే కావాలనే లైన్లో పనిచేసింది లేదు. బీజేపీ కార్యకర్తగానే గుర్తించబడటం నాకు ఇష్టం. ఒక వేళ అవకాశం కల్పిస్తే? అవకాశం కల్పిస్తే.. పూర్తి బాధ్యతాయుతంగా పార్టీకోసం పనిచేస్తాను. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి, తొందరగా ఒక నిర్ణయానికి వస్తే మంచిదేమో? మనం ఒక నిర్ణయానికి రావొద్దు, పార్టీ అధిష్టానం రావాలి. వేరే పారీ్టలాగ నేను ఇక్కడ నిల్చుంటేనే ఉంటా అనే పార్టీ బీజేపీ కాదు. బీజేపీకి క్రమశిక్షణ కలిగిన వ్యవస్థ ఉంటుంది. పనిచేస్తూ.. పోవాలంతే.. ఫలితం ఆశించకూడదు. -
తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలి
గచ్చిబౌలి: తొలి దశ ఉద్యమకారులను తెలంగాణ చరిత్రలో చేర్చాలని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో 82వ వర్ధంతిని పురస్కరించుకొని కేంద్ర మాజీ మంత్రి డాక్డర్ మల్లిఖార్జున్ గౌడ్ విగ్రహన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలంగాణ సేఫ్ గార్డ్స్ అనే నినాదంతో మల్లిఖార్జున్ గౌడ్ విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకొచ్చాడని గుర్తు చేశారు. ఆ ఉద్యమమే తెలంగాణ ఉద్యమంగా మారిందని మర్రి చెన్నారెడ్డి, వెంకట స్వామి, మదన్ మోహన్, మల్లిఖార్జున్ గౌడ్లు తొలిదశ ఉద్యమకారులని ఆయన పేర్కొన్నారు. వారి పేర్లను తెలంగాణ చరిత్రలో ఎక్కించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్ర అంటె ఉద్యమాలు, ఉద్యోగులు, బలిదానాలని తెలంగాణ చరిత్ర దాన్ని ప్రతిభింభించే విధంగా ఉండాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణరావాలని ఉద్రేకంగా మాట్లాడిన వారిలో వెంకట స్వామితో పాటు మల్లిఖార్జున్ గౌడ్ ఉన్నారని తెలిపారు. రక్షణ, రైల్వే మంత్రిగా పని చేసిన ఆయన మంచికి మారు పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ప్రోత్సహించిన నేతగా అయన అభివర్ణించారు. మాజీ ఎమ్మెల్యే బిక్షపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరాశలో తెలంగాణ నిరుద్యోగులు !
-
సంసద్ రత్న అందుకున్న విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి ‘సంసద్ రత్న’(పార్లమెంటరీ రత్న) అవార్డు అందుకున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనకు అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. మా కమిటీకి సంసద్ రత్న అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది . స్టాండింగ్ కమిటీలలో ప్రతి అంశంపై లోతైన చర్చ ఉంటుంది. అన్ని అంశాలను అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు చర్చిస్తారు. గతంలో కామర్స్ కమిటీ చేసిన సిఫార్సులను 95% కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది అని గుర్తు చేశారాయన. అలాగే.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తరహాలో రాష్ట్రాల్లో కూడా స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎంపీల తరహాలో, ఎమ్మెల్యేలు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్లు అవుతుందని ఆయన ఆకాంక్షించారు. ఇక సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవం.. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ చేతుల మీదుగా సాగింది. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్ కూడా అవార్డు అందుకున్నారు. రవాణా ,సాంస్కృతిక, పర్యాటక శాఖ స్టాండింగ్ కమిటీ అత్యుత్తమ పనితీరుకుగాను ఈ అవార్డు దక్కింది. ఢిల్లీలో శనివారం జరిగిన సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ హోదాలో హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ నుంచి ప్రతిష్టాత్మకమైన సంసద్ రత్న అవార్డును స్వీకరించడం జరిగింది. pic.twitter.com/bTGDxBLwuC — Vijayasai Reddy V (@VSReddy_MP) March 25, 2023 ఈ సందర్భంగా.. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కానప్పటికీ పార్లమెంట్లో బాగా పనిచేస్తున్నారని కొనియాడారు. విజయసాయిరెడ్డి ప్రతి అంశంలో ప్రభుత్వంపై అనేక ప్రశ్నలు వేస్తున్నారు. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి పనితీరును గమనించాను. ఆయన పార్లమెంటు కార్యక్రమాలలో చాలా పరిశ్రమిస్తారు అని దత్తాత్రేయ పొగిడారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. పార్లమెంటులో గందరగోళం వల్ల బిల్లులపై సరైన చర్చ జరగదని ప్రజలు భావిస్తారు. కానీ స్టాండింగ్ కమిటీలలో అధికార విపక్ష ఎంపీలు ఉంటారు. అన్ని అంశాలను కూలంకషంగా చర్చిస్తారు. స్టాండింగ్ కమిటీల పనితీరు బాగా ఉంది. పర్యాటక సాంస్కృతిక రవాణా కమిటీకి అవార్డు రావడం సంతోషకరం. చార్టెడ్ అకౌంటెంట్, మేధావి విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ కమిటీ మరింత బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. పార్లమెంట్లో సభ్యుల పనితనానికి గౌరవసూచీగా ఈ అవార్డులను అందిస్తున్నారు. ఐఐటీ మద్రాస్ సహకారంతో.. సంసద్ రత్న అవార్డులను 2010 నుంచి అందిస్తున్నారు. దేశ మాజీ రాష్ట్రపతి, సైన్స్ మేధావి ఏపీజే అబ్దుల కలాం సూచన మేరకు.. ఆయన గౌరవార్థం ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటిదాకా 90 మంది పార్లమెంటేరియన్లకు ఈ అవార్డులను అందించారు. తాజాది 13వ ఎడిషన్ కాగా.. ఇవాళ (మార్చి 25) న్యూఢిల్లీలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. -
గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం లేదు: దత్తాత్రేయ కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం/సింహాచలం: రాజ్యాంగంలోని అత్యంత కీలకమైన గవర్నర్ వ్యవస్థతో రాజకీయాలు చేయడం సరికాదని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. సోమవారం విశాఖపట్నంలోని సీతమ్మధారలో ఉన్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ మాజీ చైర్మన్ చెరువు రామకోటయ్య నివాసంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గాంధీజీ వర్థంతి సందర్భంగా మహాత్ముని చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగబద్ధమైన పదవిపై ప్రభుత్వాలు, పార్టీలు అవగాహన కల్పించుకొని.. గవర్నర్ వ్యవస్థకు గౌరవం ఇవ్వాలని హితవు పలికారు. ఆ వ్యవస్థ నచ్చకపోతే రాజకీయం చేయడం మాని పార్లమెంట్లో చర్చించాలన్నారు. ఇటీవల ఏపీలోని కొందరు ఉద్యోగులు జీతాల చెల్లింపులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన విషయంపై దత్తాత్రేయ స్పందిస్తూ.. ఈ విషయంలో గవర్నర్‌కు జోక్యం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. గవర్నర్ దృష్టికి వచ్చిన ప్రతి విషయం తిరిగి ప్రభుత్వానికే పంపించాలని, కేవలం పరిశీలించమని చెప్పే అధికారం మాత్రమే గవర్నర్‌కు ఉందని వ్యాఖ్యానించారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానన్నారు. శారదాపీఠంలో వేద పోషణ అభినందనీయం వేద పోషణ కోసం విశాఖ శ్రీశారదా పీఠం శ్రమిస్తున్న తీరు అభినందనీయమని బండారు దత్తాత్రేయ తెలిపారు. శారదాపీఠం వార్షికోత్సవాలు నాల్గవరోజైన సోమవారం వైభవంగా జరిగాయి. ఈవేడుకల్లో దత్తాత్రేయ పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజశ్యామల యాగంలోను, శ్రీనివాస చతుర్వేద హవనంలోను పాల్గొన్నారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీల ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా శారదాపీఠం ముద్రించిన మాండుక్యోపనిషత్ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పీఠం చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రసంశనీయమన్నారు. దత్తాత్రేయ వెంట ఎమ్మెల్సీ మాధవ్ ఉన్నారు. కాగా, వార్షికోత్సవాల్లో భాగంగా శారదాపీఠంలో సాయంత్రం జరిగిన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. -
Good Governance Day 2022: కలుపుకొని పోవడమే సుపరిపాలన
ఈ రోజు క్రిస్మస్ – యేసు క్రీస్తు పుట్టిన రోజు. ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం అనే ఆయన బోధనలు మాన వాళికి జీవనాడి లాంటివి. ఈ సందర్భంగా దేశ ప్రజలంద రికీ... ముఖ్యంగా క్రైస్తవ పౌరు లకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. మన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా 1924లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇదే రోజున జన్మించడం యాదృచ్ఛికం! ఆయన శాంతి, సహ జీవనం, కరుణ, అందరికీ గౌరవం, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు. కవి, రచయిత, పాత్రికేయుడు, రాజ నీతిజ్ఞుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, దార్శనికుడుగా ప్రసిద్ధులు. వాజ్‌పేయి 1932లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో ప్రచారక్ అయ్యారు. 1951లో భారతీయ జనసంఘ్‌లో సభ్యత్వం పొందడం ద్వారా అధికారి కంగా రాజకీయాల్లో చేరారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల ద్వారా ఆయన ఎంతో స్ఫూర్తి పొందారు. 1957లో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్ నుంచి ఎన్నికై... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా పార్ల మెంట్లో ఆయన చేసిన చర్చోపచర్చలకు ముగ్ధులై వాజ్‌పేయి తన స్థానాన్ని ‘ఒక రోజు’ ఆక్రమిస్తారని అంచనా వేశారు. 1980లో ఆయన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు.1977లో జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, వివిధ ముఖ్యమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల అధిపతిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి తన అత్యుత్తమ సేవలను అందించారు. ఆయన ‘నేషన్ ఫస్ట్’ అనే విశ్వాసానికి ముగ్ధుడై, అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని ఐక్య రాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించవలసిందిగా కోరారు. దౌత్య విషయాలపై ఆయన సాధికారత అద్భుతమైనది. 1996లో ఆయన బీజేపీ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. అతి కొద్దిరోజులే ఆయన ప్రభుత్వం ఉంది. తరువాత 1998లో మళ్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పోఖ్రాన్ వద్ద భారత్ రెండో దఫా అణుపరీక్షలను నిర్వహించింది. ఒకవైపు దేశ భద్రతకు కావలసిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆయన చూశారు. లాహోర్ బస్సు యాత్ర చేపట్టడం, ఆగ్రా శిఖరాగ్ర సమావేశానికి పర్వేజ్ ముషారఫ్‌ను భారత్‌కు ఆహ్వానించడం వంటివి ఆయన సాహసోపేత విధానంలో కొన్ని మెరుపులు. తర్వాత కార్గిల్ యుద్ధంలో ఆయన నాయకత్వంలో పాక్‌పై విజయం సాధించడం ముదావహం. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతులను ఉన్నతీకరించడానికి కృషి చేశారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సరళీకరణ స్ఫూర్తిని ముందుకు తీసుకు పోయి, మరిన్ని భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడానికి ఏకంగా ప్రత్యేక ‘పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ’ను సృష్టించారు. 6–14 ఏళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడానికి ‘సర్వశిక్షా అభియాన్’ను ప్రారంభిం చడం చారిత్రక నిర్ణయం. దేశంలో నదులను అను సంధానించాలనేది ఆయన చిరకాల వాంఛ. ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్ట్, ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ ద్వారా రహదారుల నిర్మాణానికి గొప్ప ఊపునిచ్చారు. అనేక దశాబ్దాలుగా పార్టీలో, పార్లమెంట్లో, అలాగే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సహాధ్యాయిగా ఉన్న నాకు... ఆయన ఒక నిష్ణాతుడైన రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ, అంకితభావం ఉన్న నాయకు డిగా తెలుసు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంత రాయం కలిగించే ప్రయత్నానికి ఎప్పుడూ ఆయన మద్దతు ఇవ్వలేదు. లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేస్తూ బిహార్‌లో అరెస్టు అయినప్పుడు నేను పార్ల మెంటు సభ్యుడిగా ఉన్నాను. ఆ సంద ర్భంగా వారం రోజులకు పైగా పార్లమెంట్ కార్య కలాపాలకు అంతరాయం ఏర్ప డింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమా వేశంలో వాజ్‌పేయి మాట్లాడుతూ... ‘పార్ల మెంటు చర్చోప చర్చలకు వేదిక. మనం చర్చకు అనుమతించాలి. మన రాజకీయ పోరాటం పార్లమెంటు వెలుపల జర గాలి...’ అన్నారు. వాజ్‌పేయి దార్శనికతను అందిపుచ్చు కుని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ వెనుకబడి ఉండకూడదు అన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ కల త్వరగా సాకారం అవ్వ డానికి సుపరిపాలన అందిస్తున్నారు. జన్‌ధన్–ఆధార్– మొబైల్ అనేవి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చాయి. వాజ్‌పేయి జయంతిని ‘జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా, ప్రజలు, నాయకులు, అధికారులు... దేశం పట్ల భక్తినీ, సమాజం పట్ల గౌరవాన్నీ కలిగి ఉండాలి. బలమైన, ఆరోగ్యకర మైన, అందరినీ కలుపుకొని పోయే దేశ నిర్మాణమే వాజ్‌పేయికి నిజమైన నివాళి. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పరిపాలనతో మాత్రమే భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్ద గలుగుతాం! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ (నేడు జాతీయ సుపరిపాలనా దినోత్సవం) -
చిరంజీవి ఫ్యాన్స్ దెబ్బకి దిగివచ్చిన గరికపాటి
-
వైభవంగా అలయ్ బలయ్.. ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
సాక్షి, హైదరాబాద్: సమాజంలోని విభిన్న వర్గాల మేలుకలయికగా ‘దత్తన్న అలయ్–బలయ్’ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. సాహితీ, సాంస్కృతిక, సినిమా, రాజకీయ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుల ఉపన్యాసాలు.. జానపద, సంగీత, కళారూపాల ప్రదర్శనలు.. నోరూరించే తెలంగాణ వంటకాల మేళవింపుగా.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ దసరా సమ్మేళనం కొనసాగింది. గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్–బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి సారథ్యంలో సాగిన ఈ కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నీ తానై ముందుండి నడిపించారు. చిరంజీవితో ముచ్చటిస్తున్న గరికపాటి చిరంజీవి సినిమా తీయలేదా?: కేరళ గవర్నర్ రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా మనుషుల మధ్య స్నేహం, సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు అలయ్–బలయ్ ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యఅతిథి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కేవలం తమ కుటుంబాల కోసమే కాకుండా ఇతరుల కోసం, సమాజం కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం జీవించడం గొప్ప అని పేర్కొన్నారు. ఇంత గొప్పగా ఉన్న దీనిని ఇతివృత్తంగా తీసుకుని సినీహీరో చిరంజీవి ఇంకా సినిమా తీయలేదా? అని ప్రశ్నించారు. భిన్న సంస్కృతులను ఏకం చేసేందుకే: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు సమైక్యంగా కృషి చేస్తే దేశంలోనే అగ్రగామిగా నిలుస్తాయని హరియా ణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కేవలం శరీరాలే కాదు మనసులు ఆలింగనం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా భిన్న సంస్కృతులను ఏకం చేయాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో ఎన్నికలప్పుడే రాజకీయాలుండేవని, ఆ తర్వాత ప్రాంతం, దేశాభివృద్ధి కోసం పాటు పడేవారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతలు కలుసుకుని మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. అధర్మంపై సత్యం, ధర్మం గెలుపునకు చిహ్నంగా నిలిచే దసరా సందర్భంగా.. స్థానిక సంస్కృతికి చిహ్నంగా దీని నిర్వహణ అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుబా కొనియాడారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న చిరంజీవి దేశవ్యాప్తంగా జరగాలి: గాడ్ ఫాదర్’ సినిమా విడుదలతో హుషారుగా ఉన్న సినీ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్ –బలయ్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలి.. వ్యాపించాలని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఈ సమ్మేళనం అద్భుతమని, స్నేహానికి, సుహృద్భావానికి ప్రతీకగా ఈ కార్యక్రమం సాగుతోందని చెప్పారు. మాటలకు లొంగని వారు, హృదయ స్పందనలకు లొంగుతారని, అలాంటి ఈ సంస్కృతి మరింత ముందుకెళ్లాలన్నారు. స్ఫూర్తిదాయకం గరికపాటి ప్రవచనం: గరికపా టి గారి ప్రవచనాలను తాను ఇష్టపడతానని, అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చిరంజీవి పేర్కొ న్నారు. ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందించానని, అయితే ఇన్నిరోజుల్లో ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. ‘మీ ఆశీస్సులతో ముందుకెళతాం. ఎప్పుడైనా సమయం దొరికి తే మా ఇంటికి రండి’ అంటూ ఆహ్వానించారు. ‘ఏపాటి వాడికైనా..’ అంటూ నాగబాబు ట్వీట్ ఫొటో సెషన్ ఆపాలంటూ చిరంజీవిని ఉద్దేశించి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందిస్తూ.. ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’’.. అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే వెళ్లిపోతా: గరికపాటి ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు ప్రసంగించేందుకు సిద్ధం కాగా, వేదికకు ఒకవైపు చిరంజీవితో కలిసి పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగుతుండడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో గరికపాటి.. ‘ఈ ఫొటో సెషన్ చిరంజీవి వెంటనే నిలిపేయాలి. వాళ్లు దానిని ఆపకపోతే నేను మాట్లాడకుండా వెళ్లిపోతా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మరికొన్ని నిమిషాలు ఫొటోల కార్యక్రమం కొనసాగి ఆగిన తర్వాత గరికపాటి ప్రసంగించారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సత్యకుమార్, టి.ఆచారి పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ హాజరయ్యారు. వివిధ పార్టీల నేతలు మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, ప్రొ.ఎం.కోదండరాం, గిరీష్‌సంఘీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, డా.కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, కె.రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, విద్యాసాగర్, అజయ్ మిశ్రా, తదితరులు కూడా పాల్గొన్నారు. -
చిరంజీవిపై ఫైర్ అయిన గరికపాటి
-
దత్తన్న తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తరువాత అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చాలా సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని అనుకుంటున్నా ఈ ఏడాది అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'దేశంలోనే సంస్కృతి సంప్రదాయాల కోసం చేపట్టిన కార్యక్రమం ఇది ఒక్కటే. పంచడం, పుచ్చుకోవడం అనేది ఎక్కడా లేదు.. ఒక్క తెలంగాణ సంప్రదాయంలో మాత్రమే ఉంది. ఇండస్ట్రీలో అందరూ కలిసున్నప్పటికీ.. అభిమానుల వరకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం కొనసాగుతుంది. హీరోల మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తే అందరిలో మార్పు వస్తుంది. ఇండస్ట్రీలో కూడా అందరిని పిలిచి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేశాను. తరువాత పార్టీ కూడా ఏర్పాటు చేశాను. తెలంగాణ సంస్కృతిలో దసరా పండగ రోజున జమ్మి ఆకులు ఇచ్చి పెద్దవాళ్లకి దండం పెట్టడం, తోటి వారిని కౌగిలించుకోవడం సంప్రదాయం. 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం చేపట్టడం గర్వకారణం. పార్లమెంట్లో ఎంత తిట్టుకున్న బయట మాట్లాడుకునే తీరు అలయ్ బలయ్ లాంటిదిని' మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. చదవండి: (ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి) -
ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో దత్తాత్రేయ, చిరంజీవి డప్పు కొడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. -
మంగళగిరిలో 51 అడుగుల పరమ శివుడి విగ్రహం.. ఆవిష్కరించిన దత్తన్న
మంగళగిరి (గుంటూరు): మంగళగిరిలో గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి (శివాలయం) వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపికృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ సభలో పేర్లు చదివే సమయంలో ఒక్క మహిళ పేరు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. తాను గతంలో మంగళగిరి విచ్చేసిన సందర్భంలో నృసింహస్వామి వారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. 51 అడుగుల పరమశివుడి విగ్రహాన్ని నిర్మాణం చేసిన మాదల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు తనచేత ఆవిష్కరింపచేయడం సంతోషంగా ఉందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి సహకరిస్తానని తెలిపారు. తొలుత బీజేపీ నాయకుడు జగ్గారపు శ్రీనివాసరావు నివాసంలో అల్పాహారం స్వీకరించి అనంతరం లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకోగా ఆలయ ఈఓలు ఏ.రామకోటిరెడ్డి, జేవీ నారాయణలు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్ యార్డు చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, శివాలయం ట్రస్ట్ బోర్టు చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మీరాధిక, బోర్డు సభ్యులు కొల్లి ముసలారెడ్డి, కొల్లి వెంకటబాబూరావు, అద్దంకి వెంకటేశ్వర్లు, నక్కా సాంబ్రాజ్యం, రేఖా వకులాదేవి, జంపని చిన్నమ్మాయి తదితరులు పాల్గొన్నారు. పరమ శివుడి విగ్రహ ఆవిష్కరణ అనంతరం కొబ్బరికాయ కొట్టిన గవర్నర్ దత్తాత్రేయ దేశం సుభిక్షంగా ఉండాలన్నదే ఆకాంక్ష.. గుంటూరు మెడికల్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారని, దేశం మొత్తం సుభిక్షంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం గుంటూరు అమరావతి రోడ్డులోని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందు సాంబశివరావు గృహంలో ఆయన విందు స్వీకరించారు. పలువురు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ గుంటూరు నగర బీజేపీ నేతలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో మాదిరిగా అలై బలై కార్యక్రమాన్ని ఏపీలో కూడా నిర్వహిస్తామన్నారు. గుంటూరులో ఉన్న శ్రేయోభిలాషులను కలిసేందుకు వచ్చినట్లు తెలిపారు. గవర్నర్‌ను కలిసిన వారిలో బీజేపీ నేతలు మాగంటి సుధాకర్ యాదవ్, జూపూడి రంగరాజు, యడ్లపాటి స్వరూపారాణి, మాధవరెడ్డి, రంగ, వెలగలేటి గంగాధర్, విజయ్, భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ, పారిశ్రామిక వేత్త అరుణాచలం మాణిక్యవేల్, విశ్రాంత డీఎస్పీ కాళహస్తి సత్యనారాయణ, ఉన్నారు. -
ఏపీ గవర్నర్‌తో హరియాణ గవర్నర్ భేటీ
సాక్షి, అమరావతి/మంగళగిరి/గుంటూరు మెడికల్ : రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు చేరుకున్న బండారు దత్తాత్రేయకు రాజ్‌భవన్ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు గవర్నర్లు సమకాలీన రాజకీయ అంశాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయను విశ్వభూషణ్ హరిచందన్ సత్కరించారు. 51 అడుగుల శివుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన దత్తాత్రేయ గుంటూరు జిల్లా మంగళగిరిలోని గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయం (శివాలయం)వద్ద దాతలు మాదల వెంకటేశ్వరరావు, గోపీకృష్ణ, వెంకటకృష్ణ దంపతులు నిర్మించిన 51 అడుగుల పరమ శివుడి విగ్రహాన్ని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం ఆవిష్కరించారు. ఆయన శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారిని, గంగా, భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, మార్కెట్ యార్డు చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు రంగరాజు కుటుంబానికి పరామర్శ గుంటూరు రైలుపేటలోని బీజేపీ నేత జూపూడి రంగరాజు నివాసానికి బండారు దత్తాత్రేయ ఆదివారం వచ్చారు. రంగరాజు తల్లి హైమావతిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యులతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. దత్తాత్రేయను జూపూడి కుటుంబ సభ్యులు యజ్ఞదత్తు, వనమా పూర్ణచంద్రరావు, మాజేటి ముత్యాలు, పలువురు బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ సేంద్రియ వ్యవసాయాన్ని తెలుగు రాష్ట్రాల్లో ప్రోత్సహించాలని సూచించారు. -
యువత నైపుణ్యాలే అభివృద్ధికి చుక్కాని
మానవ వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడంలో నైపుణ్యాలు కీలక పాత్ర పోషిస్తాయి. నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి అనేది ఒక ఆస్తి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధికి అది అత్యంత అవసరం. ప్రస్తుతం కొనసాగుతున్న ‘వరల్డ్ యూత్ స్కిల్స్ డే–2022’ అనేది బిల్డ్ బ్యాక్ ప్రాసెస్‌ను దృష్టిలో ఉంచుకుని ‘జీవితం, పని, స్థిరమైన అభివృద్ధి కోసం అభ్యాసం, నైపుణ్యాలు’ అనే అంశాలపై దృష్టి సారించింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యువ జనాభా... విధాన రూపకర్తలకు ప్రతిచోటా అనేక అవకాశాలతోపాటు అనేక సవాళ్లను విసురుతోంది. లేబర్ మార్కెట్లో మారుతున్న అవసరాలు... పెరుగుతున్న టెక్నాలజీ వినియోగం అనేవి అందులో కొన్ని. అందుకు తగినట్టుగా మన యువతను ఉపాధి, వ్యవస్థాపక నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి ప్రయత్నించాలి. తద్వారా వారు మారుతున్న ప్రపంచాన్ని ఎదుర్కోవడమే కాకుండా సానుకూల మార్పులకు క్రియాశీల ప్రతినిధులుగా కూడా మారతారు. సాంకేతిక, వృత్తి విద్య, శిక్షణా (టీవీఈటీ) సంస్థలు యువత జీవితాలలో ముఖ్యమైన వ్యవస్థాపక విలువలను ప్రోత్సహించడంలో, ఆర్థికాభివృద్ధి, స్థిరమైన సమాజ నిర్మాణంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. వ్యవస్థాపక అభ్యాసాన్ని నిర్ధారించడం నుండి వృత్తి శిక్షణలో ఉపాధి నైపుణ్యాలను ప్రధాన స్రవంతిలో చేర్చడం వరకూ... ఆరోగ్యకరమైన విధానం అవసరం. ఇందుకు టీవీఈటీ సంస్థలు, ఉద్యోగ సంఘాలు, సంస్థల యాజమాన్యాలు, విధాన రూపకర్తలు, మేధావులు, పబ్లిక్ పాలసీ నిపుణులు, అభివృద్ధి భాగస్వాములు ఇలా... అందరూ కలిసి నైపుణ్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఉద్యమ స్ఫూర్తితో అమలు చేయడం అవసరం. భవిష్యత్తు అవసరాలు, సవాళ్లకు అనుగుణంగా కొత్త జాతీయ విద్యా విధానం–2020 ఉంది. నైపుణ్యం అంతరాలను పూరించడానికి పాఠశాల స్థాయిలో వృత్తి విద్య ద్వారా తీవ్రమైన ప్రయత్నాలు జరిగాయి. పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలలో చదివే వారిలో 2025 నాటికి కనీసం 50 శాతం మంది వృత్తి విద్యను పొందగలరు. 10+2 పూర్తి చేయడానికి ముందే ప్రతి విద్యార్థికీ ఒక వృత్తి విద్యా కోర్సు నేర్పడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. 2025 నాటికి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిíఫీషియల్ ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ అనలిటిక్స్, 5ఏ వంటి వాటిని నిర్వహించడానికి నైపుణ్యాలు కలిగిన 2.23 కోట్ల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనా. అందుకే ఎన్ఈపీ–2020 శాస్త్రీయ, వృత్తి శిక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఎక్కువ యువజన జనాభా ఉన్న ప్రపంచంలోని దేశాలలో భారతదేశం ఒకటి. 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు జనాభాలో 65 శాతం ఉన్నారు. దేశ జనాభాలో 15–29 సంవత్సరాల వయస్సు గల యువత 27.5 శాతం ఉన్నారు. పోటీకి తగిన విధంగా వృత్తి నైపుణ్యానికి సంబంధించి అంతరాలు తగ్గించేలా కేవలం వృత్తి నిపుణత ఉన్న యువతే కాకుండా... రీ స్కిల్లింగ్.. అప్ స్కిల్లింగ్ వంటి లక్షణాలు ఉన్న యువత అవసరం కరోనా మహమ్మారి తర్వాత పెరిగింది. బడి బయట ఉన్న ఉపాధి, విద్య, శిక్షణ లేని యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. వారు పొందే వృత్తి నైపుణ్యాలను గుర్తించడంతోపాటు సర్టిఫై చేయడం, ఉపాధి పొందేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. భవిష్యత్తు వృత్తి నైపుణ్య అవసరాలకు తగ్గట్టుగా మన యువతను తయారు చేసుకోవాలి. ‘4వ పారిశ్రామిక విప్లవం – పరిశ్రమ 4.0 ’ అనేది ఉత్పాదకత, సామర్థ్యాన్ని పెంచడానికీ, అన్ని స్థాయిల్లో సమాచార వినిమయం... సుస్థిరత, వాతావరణ మార్పు తదితర అంశాలను సమన్వయం చేసుకోవడానికీ ఉద్దేశించింది. ‘మేక్ ఇన్ ఇండియా’ అనేది తయారీ రంగానికి పెద్దపీట వేసింది. ఈ రంగంలో మొత్తం ఉపాధి అవకాశాలు 2017–18 సంవత్సరంలో 57 మిలియన్ల ఉంటే.. అవి 2019–20 సంవత్సరంలో 62.4 మిలియన్లకు పెరిగాయి. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తయారీ రంగం దాదాపు 17 శాతం వాటాను అందిస్తుంది. దీన్ని 25 శాతానికి పెంచగలిగితే నైపుణ్యం కలిగిన కార్మికులకు మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నైపుణ్యాభివృద్ధి ఎందుకు ముఖ్యమంటే... నైపుణ్యాలు, మేధోశక్తి ఏ దేశానికైనా ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధికి చోదక శక్తులు. మెరుగైన నైపుణ్య ప్రమాణాలు కలిగిన దేశాలు దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లలోని సవాళ్లు, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మరింత సమర్థవంతంగా తమను తాము తీర్చిదిద్దుకుంటాయి. ‘భారతదేశంలో విద్య, వృత్తి శిక్షణ స్థితి’పై ఎన్ఎస్ఎస్ఓ 2011–12 (68వ రౌండ్) నివేదిక ప్రకారం, 15–59 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 2.2 శాతం మంది అధికారిక వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు తెలిసింది. మరో 8.6 శాతం మంది నాన్–ఫార్మల్ వొకేషనల్ కోర్స్‌లు చేసినట్టు నివేదిక తెలిపింది. అయితే దేశంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు భారీ ఆస్కారం ఉందనే విషయంపై మాత్రం ఎలాంటి వివాదం లేదు. వ్యవసాయం, భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్, రిటైల్, లాజిస్టిక్స్, రవాణా, గిడ్డంగులు, వస్త్రాలు, దుస్తులు, విద్య నైపుణ్యాభివృద్ధి, చేనేత, హస్తకళ, ఆటో, ఆటో విడి భాగాలు, ప్రైవేట్ భద్రతా సేవలు, ఆహార ప్రాసెసింగ్, ఇంటిపని, పర్యాటకం, ఆతిథ్యం, రత్నాలు, ఆభరణాలు, అందం, ఆరోగ్యం వంటి 24 రంగాలలో 2017–2022లో 103 మిలియన్ల మంది అవసరం ఉందని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నియమించిన ఎన్విరాన్మెంట్ స్కాన్ నివేదిక–2016 అంచనా వేసింది. (క్లిక్: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!) - బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్ (నేడు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం) -
ఇంకానా బాల కార్మిక వ్యవస్థ?
బాలలు భగవంతుడి స్వరూపాలంటారు. ఏ దేశానికైనా మూల స్తంభాలూ, భవిష్యత్తూ వాళ్లే. అమ్మ ఒడిలో, నాన్న లాలనలో, స్వేచ్ఛగా ప్రేమాభిమానాల మధ్య ఎదగడం బాలల హక్కు కావాలి. అమాయ కత్వంతో తొణికిసలాడే ఆ పసి మనసుల గురించి పట్టించుకోక పోవడం, అనాదరించడం సాంఘిక దురాచారమే అవుతుంది. ఈ 21వ శతాబ్దంలోనూ బాల కార్మిక వ్యవస్థ అతిపెద్ద ప్రపంచ సమస్యల్లో ఒకటి కావడం దురదృష్టకరం. ప్రపంచవ్యాప్తంగా కూడా బాలకార్మిక వ్యవస్థ కొన సాగేందుకు బోలెడన్ని కారణాలు ఉన్నాయి. పేదరికం, నిరక్ష రాస్యత, పెద్ద పెద్ద కుటుంబాలు, బాలలకు సులువుగా ఉపాధి దొరికే అవకాశం లేకపోవడం, ఉన్న చట్టాల అమల్లో నిర్లక్ష్యంతో పాటు అనేక ఇతర అంశాలు కూడా చేరడం వల్ల ఈ సాంఘిక ఆర్థిక, రాజకీయాలు కలిసి ఈ దురాగతం ఇంకా కొనసాగేలా చేస్తున్నాయి. అయితే బాల కార్మిక వ్యవస్థను ఒక ఆర్థిక సమస్యగా పరిగణిస్తే మాత్రం ఏ దేశమూ దీన్ని పరిష్కరింప జాలదు. సామాజిక దృక్పథంలో మార్పు రావాలి. రాజకీయం గానూ కొంత సున్నితంగా వ్యవహరించాలి. గత ఎనిమిదేళ్లలో బాల కార్మిక వ్యవస్థను నియంత్రిం చడంలో దేశం చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతమైంది. నేను కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)గా వ్యవహరిస్తున్న సమయంలో అమల్లోకి వచ్చిన ‘ద చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) అమెండ్మెంట్ యాక్ట్ 2016’ పాత్ర కూడా ఇందులో ఉండటం ముదావహం. పద్నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఏ రకంగానూ పనిలో పెట్టుకోకూడదని ఈ చట్టం చెబుతుంది. అలాగే 14–18 మధ్య వయస్కులను ప్రమాదకరమైన వృత్తుల్లో నియమించ రాదు. అయితే కుటుంబ సభ్యుల లేదా కుటుంబ వ్యాపారంలో బాలలు సాయం అందించేందుకు ఈ చట్టం అవకాశం కల్పి స్తోంది. అలాగని ప్రమాదకరమైన వృత్తులో పని చేసే అవకాశం లేదు. మా అమ్మ ఈశ్వరమ్మ ఉల్లిపాయలు అమ్మేది. స్కూల్ అయిపోయిన తరువాత నేనూ దుకాణంలో అమ్మకు సాయపడే వాడిని. అయితే 2016 నాటి చట్టం కంటే ముందు ఇలా చేయడం శిక్షార్హమైన నేరం. నా చిన్నతనపు కథనం ఎందుకు ప్రస్తావిస్తున్నానని అనుకుంటున్నారా? ఎందుకంటే ప్రమాద కరం కాని చాలా వాణిజ్య కార్యకలాపాల్లో ఇప్పటికీ తల్లిదండ్రు లకు పిల్లల సాయం అవసరమవుతూంటుంది. అటువంటి సందర్భాల్లో పిల్లలు వారికి సాయపడటంలో తప్పులేదు. ఇంకో విషయం: మా అమ్మ ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి తనకు సాయపడాలని కోరలేదు. ఆ విషయం నేనెప్పుడూ గుర్తుంచు కుంటాను. కష్టాలెన్ని ఉన్నా నాకు మంచి విద్యను అందించా లన్న ఆమె దృఢ నిర్ణయానికి నమస్సులు అర్పిస్తాను. బాలాకార్మికులు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా కేంద్రీ కృతమై ఉన్న నేపథ్యంలో వారందరిలోనూ వీలైనంత తొందరగా చైతన్యం కల్పించాల్సిన అవసరముంది. నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు కింద ఇప్పటివరకూ దాదాపు 14 లక్షల మంది బాలకార్మికులకు విముక్తి లభించింది. అంతేకాకుండా ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా వారికి బ్రిడ్జ్ కోర్సులు అందించి సాధారణ పాఠశాలల్లో విద్యనభ్యసించే అవకాశం కల్పించారు. వృత్తి నైపుణ్యాలు అందించడంతోపాటు మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య సేవలు, ఉపకార వేతనం కూడా అందించారు. బాలకార్మిక వ్యవస్థ నుంచి బయటపడ్డ వారు సొంతంగా తమ కాళ్లపై తాము నిలబడేందుకు వీలుగా సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2021 మార్చి 31 నాటికి దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 1,225 ప్రత్యేక శిక్షణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. తల్లిదండ్రుల వృత్తుల్లో బాలలు కార్మికులుగా చేరడం మనం చాలాకాలంగా చూస్తున్నాం. ఇటుక బట్టీలు, గార్మెంట్స్, వ్యవసాయం, టపాసుల తయారీల్లో బాలకార్మికుల భాగ స్వామ్యం ఉంది. ధాబాలు, చిన్న చిన్న హోటళ్లు, టీస్టాల్స్, తివాచీ, చేతిగాజుల పరిశ్రమల్లో పిల్లలు రకరకాల పనులు చేస్తున్నారు. ఇలా అసంఘటిత రంగాల్లో బాలకార్మికులు పనిచేసే అవకాశాలు ఎక్కువ. అయినప్పటికీ పాఠశాలలకు పంపకుండా పనిలో పెట్టుకుంటున్న కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇది మరింత సమర్థంగా, వేగంగా జరగాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్‌ను సక్రమంగా అమలు చేయడం కూడా బాలకార్మిక వ్యవస్థ పీడ వదిలించుకోవడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయంతో ఐదు నుంచి ఎనిమిదేళ్ల మధ్య వయస్కులు విద్యా వ్యవస్థలో భాగమయ్యేలా చూడాలి. అలాగే ‘పెన్సిల్’ (ప్లాట్ఫార్మ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్)పై సమర్థమైన నిఘా ఉంచాలి. కుటుంబాల వృత్తుల్లో పాల్గొన్న వారిని కూడా బాలకార్మికులుగా గుర్తించడం ద్వారా ప్రస్తుత పరిస్థితి మార్చలేము. అందుకే భిన్నమైన ఆలోచనతో ఈ చిక్కుముడిని విప్పాల్సి ఉంటుంది. పైగా ఈ పని కేవలం ప్రభుత్వానిది మాత్రమే అనుకుంటే తప్పు. ఎన్జీవోలు, స్వచ్ఛంద కార్యకర్తలు, సీనియర్ సిటిజెన్లు కూడా ఇందులో భాగస్వాములు కావాలి. 2022 సంవత్సరపు ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాలను ‘సార్వత్రిక సామాజిక పరిరక్షణ ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన’ అన్న అంశం ప్రధాన ఇతివృత్తంగా నిర్వహిస్తూండటం ఎంతైనా సంతోషకరం. బాల కార్మికుల్లేని ప్రపంచం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటన్న సంగతి ఇక్కడ ప్రస్తావించుకోవాలి. 2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను తుదముట్టించాలన్న లక్ష్యం ప్రపంచం ముందున్న విషయం తెలిసిందే. ఈ దిశగా భారత్ గత ఎనిమిదేళ్లల్లో ఎంతో ప్రగతి సాధించింది. కోవిడ్–19 కారణంగా ఇబ్బందులు ఎదురైనా బాలకార్మిక వ్యవస్థ మళ్లీ వేళ్లూనుకోకుండా దృఢ సంకల్పం, నిశ్చయంతో పని చేయా ల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసికట్టుగా కృషి చేస్తే దేశం త్వరలోనే బాల కార్మిక వ్యవస్థ నుంచి విముక్తి పొందగలదు! - బండారు దత్తాత్రేయ, హరియాణా రాష్ట్ర గవర్నర్ (జూన్ 12న ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం) -
మహిళలే నవ భారత నిర్మాతలు
ఎన్ని అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నారు. అసమానతలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. విజయం సాధించాలనే నిబద్ధతతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’... ఈ ఏడాది మన మహిళా దినోత్సవ నేపథ్యాంశం. మహిళలే మన నవ భారత నిర్మాతలు. గొప్ప సంప్రదాయాలు, సమున్నత విలువలతో ప్రాచీన ఘనతను కలిగి వున్న సుసంపన్న భారత దేశంలో మహిళలు ఎల్ల ప్పుడూ తమ ప్రాము ఖ్యాన్ని చాటుతూనే వచ్చారు. ఎన్ని అవ రోధాలు ఉన్నప్పటికీ భారతీయ మహిళలు తాము శక్తిమంతులమని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉన్నారు. రవీంద్రనాథ్ టాగోర్ మాటల్లో చెప్పాలంటే.. ‘మనకు స్త్రీలు అగ్నిదేవతలు మాత్రమే కాదు. భారతీయాత్మ జ్వాలలు కూడా’. ధీర వనిత ఝాన్సీరాణి లక్ష్మీబాయి, భారత దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే మొదలు... స్త్రీ విముక్తికి తన జీవితాన్ని అంకితం చేసిన రమాబాయి రణడె వరకూ ఎందరో మహి ళలు సంకల్పబలానికి తిరుగులేని నిదర్శనమై నిలి చారు. సరోజినీ నాయుడు సాహిత్య ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవలి సంవత్సరాలలో సైతం ఎందరో మహిళామణులు అత్యున్నత స్థాయిలో పెద్ద పెద్ద సంస్థల నిర్వహణ చేపట్టి దేశా నికి పథనిర్దేశకులయ్యారు. ఎస్బీఐ తొలి మహిళా చైర్మన్ అరుంధతీ భట్టాచార్య, ఓఎన్జీసీ తొలి మహిళా సీఎండీ అల్కా మిట్టల్, ‘సెయిల్’ చైర్మన్ సోమా మండల్.. ఇలా ఎంతోమంది! హరియాణా మహిళ సంతోశ్ యాదవ్ రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించి మహిళాశక్తిని శిఖరాగ్రంపై ప్రతిష్ఠిం చారు. ఇక బాక్సర్ మేరీకోమ్ పేరు తెలియని ఇల్లుందా భారత దేశంలో! మనమిప్పుడు ‘కార్యా చరణ దశాబ్దం’లోకి ప్రవేశించి ఉన్నాం. 2030 నాటికి సుస్థిరమైన అభివృద్ధిని సాధించి, ఈ భూమండలాన్ని మానవ జీవనానికి మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడం మనముందున్న లక్ష్యం. లింగ సమానత్వం; మహిళలు, బాలికల సాధికారత అనేవి కూడా సుస్థిర అభివృద్ధి లక్ష్యా లలో భాగమైనవే. అదే సమయంలో.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సంక్షోభ నిర్వహణ, సామా జిక అభివృద్ధి, సమాజంలోని బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి, సంక్షేమం.. వీటన్నిటితో కూడిన ‘సుస్థిర భవిష్యత్తు’ అనే లక్ష్యాన్ని మహిళల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యం చేసుకో గలమని మనం గ్రహించాలి. నైపుణ్యం, గుర్తింపు, గౌరవం సాధించడానికి మహిళలు తాము చేసే ప్రయత్నాలలో ఎప్పటికీ నిరుత్సాహం చెందకుండా ఉండటమే వారిని మనకు నిజమైన ఆదర్శప్రాయులుగా చేస్తోంది. మహిళల్లోని సామర్థ్యాల గురించి ప్రఖ్యాత అమెరికన్ మత గురువు బ్రిగ్హామ్ యంగ్ సరిగ్గానే చెప్పారు. ‘‘మనం ఒక వ్యక్తిని విద్యావంతుడిని చేస్తే ఆ వ్యక్తికి మాత్రమే విద్య అందుతుంది. ఒక మహి ళకు విద్యను అందిస్తే ఒక తరం వారంతా విద్యా వంతులవుతారు’’ అంటారు బ్రిగ్హామ్. ‘నేటి లింగ సమానత్వమే రేపటి సుస్థిర సమాజం’.. అనే ఈ ఏడాది మహిళా దినోత్సవ ప్రధానాంశం.. బ్రిగ్హామ్ మాటలకు చక్కగా సరిపోలుతుంది. దేశంలో కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమాన్ని విజయ వంతం చేయడంలో మహిళలే కీలకమైన పాత్ర పోషించారు. అంగన్వాడీ కార్యకర్తల నుంచి, పాలనా విభాగాలలో ఉన్నత స్థానాలలో ఉన్న మహిళా అధికారుల వరకు అందరూ ఇందుకోసం విశేషకృషి సల్పారు. కోవిడ్‌కు స్వదేశీ ‘కోవ్యాక్సిన్’ టీకాను అభివృద్ధి చేయడంలో విశ్వస్థాయి క్రియా శీలత కనబరిచిన భారత్ బయోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ‘పద్మభూషణ్’ అందు కున్నారు. 12–18 ఏళ్ల మధ్య వారికి ఇవ్వడం కోసం కోవిడ్ టీకాను అభివృద్ధి చేసిన బృందానికి బయో లాజికల్ ఇ కంపెనీ ఎండీ మహిమా దాట్ల నాయ కత్వం వహించి, తక్కువ సమయంలో ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రేరణ అయ్యారు. 6వ ఆర్థిక అధ్యయనం ప్రకారం దేశంలో 80 లక్షల 5 వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. స్టార్టప్‌లు (అంకుర సంస్థలు), ముఖ్యంగా మహిళా స్టార్టప్‌లు ఎందుకు మనకు ముఖ్య మైనవి? బెయిన్ అండ్ కంపెనీ, గూగుల్ విశ్లేషణల ప్రకారం 2030 నాటికి మన మహిళా వ్యాపార వేత్తలు 15 – 17 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తారని అంచనా. 2018–21లో దేశంలోని స్టార్టప్‌లు కల్పించిన ఉద్యోగాల సంఖ్య 5 లక్షల 90 వేలు. ఇంత ప్రాముఖ్యం ఉన్న స్టార్టప్‌లను గతంలో చేజార్చుకుని ఉండొచ్చు. వర్తమానంలో తప్పక చేజిక్కించుకోవాలి. రాణించాలనే పట్టుదల అమ్మాయిలలో బలంగా ఉంటోంది. ‘ఆజాదీ కా అమృత్ మహో త్సవ్’లో భాగంగా గతేడాది సెప్టెంబర్ 6–12 తేదీల మధ్య కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2,614 మంది స్వయం సహాయక బృందాల మహిళా వ్యాపారులకు కేవలం వారం వ్యవధిలోనే 8 కోట్ల 60 లక్షల రూపాయల రుణాలను ‘కమ్యూ నిటీ ఎంటర్ప్రైజ్ ఫండ్’ లోన్ కింద అందించింది. స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలు తమను తాము శక్తిమంతం చేసుకోవడమే కాకుండా మన ఆర్థిక వ్యవస్థకూ నిలకడైన స్థిరత్వాన్ని చేకూర్చుతున్నారు. గత 6–7 ఏళ్లలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉద్యమం విస్తృతం అయింది. నేడు దేశవ్యాప్తంగా 70 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. అర్థం చేసుకో వలసినది ఏమిటంటే, స్త్రీల శక్తి సామర్థ్యాలు దేశాన్ని గొప్ప శిఖరాలకు తీసుకు వెళతాయని! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా రాష్ట్ర గవర్నర్ -
జాతి మరువని విరాణ్మూర్తి
నేడు క్రిస్మస్ పర్వదినం. సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్ అయిన అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. జాతీయవాద లక్ష్యం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. ఆయన హయాంలో తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని ప్రతిపక్షాలు భావించేవి. మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రాధాన్యం ఇచ్చారు. సర్వశిక్షా అభియాన్, నదుల అనుసంధానం, స్వర్ణచతుర్భుజి, ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన వంటివి ఆయన మానస పుత్రికలు. వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి. నేడు క్రిస్మస్. మానవులందరికీ ప్రేమ, కారుణ్యం, మానవీయతా సందేశాన్ని అందించే పర్వదినమిది. బహుముఖ రాజకీయ వ్యక్తిత్వం కలిగిన విశిష్టమూర్తి, కవి, జర్నలిస్టు, రాజనీతిజ్ఞుడు, న్యాయం, సమానత్వం, శాంతియుత సహజీవనాలకు నిజమైన ఛాంపియన్ అయిన భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినం కూడా నేడే కావడం విశేషం. ఆయన జాతీయవాద లక్ష్యం కోసం మనస్ఫూర్తిగా తన జీవితాన్ని అంకితం చేశారు. తనకుతానుగా ఆయన ఒక సంస్థ. అయస్కాంత సదృశమైన మూర్తిమత్వంతో దేశ ప్రజల హృదయాలను ఆయన ఆకర్షించారు. అసమానమైన అనురక్తితో ఆయన ప్రజల హృదయ సామ్రాట్ అయ్యారు. ఒక్కమాటలో చెప్పాలంటే వాజ్‌పేయి భారతీయ అజాతశత్రువు. ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, వాజ్‌పేయి అందరికీ సన్నిహితుడు. రాజకీయాల్లో అయనకు శత్రువులు లేరు. ఆయన జాతీయవాద స్ఫూర్తి, దేశభక్తి అందరికీ ప్రేరణ కలిగిస్తాయి. ఆయన వాగ్దాటి, భావ వ్యక్తీకరణా శైలి అత్యంత సహజంగానూ, స్వతస్సిద్ధంగానూ ఉంటాయి. రాజకీయ జీవితంలో ప్రతి ఒక్కరూ ఆయన్ని ఇష్టపడేవారు. తన ప్రత్యర్థులను సైతం ప్రశంసించే ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన వ్యవహారాల్లో తనపై విమర్శలను కూడా ఆయన నమ్రతతో ఆమోదించేవారు. పారదర్శకతను ఆయన ఎంతో దృఢంగా విశ్వసించేవారు. సుపరిపాలన లక్ష్యాన్ని ఆయన మనసారా ఆకాంక్షించేవారు. అందుకే ఆయన జయంతిని మనం సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. బంగ్లాదేశ్ విముక్తికి దారితీసిన పాకిస్తాన్‌తో భారత్ యుద్ధ కాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీని వాజ్‌పేయి ప్రశంసించారు. ఆమె తండ్రి భారతదేశ ప్రప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని వాజ్‌పేయి గొప్పగా ప్రశంసించేవారు. దేశాన్ని దేవాలయంగా భావించే వాజ్‌పేయిని భవిష్యత్తు దార్శనిక నేతగా నెహ్రూ ఆనాడే దర్శించారు. అన్నిటికంటే దేశం ముందు అనేది వాజ్‌పేయి జీవితాంతం పాటించిన ఆదర్శం. ఆయన జీవితం తెరిచిన పుస్తకం. లక్షలాదిమంది కార్యకర్తలనూ, ఇతరులనూ అది ప్రభావితం చేయడమే కాకుండా వారిలో జాతీయవాద బీజాలను నాటింది. పార్టీ, రాజకీయాలు, పదవులు, హోదాలు ఏవీ శాశ్వతం కాదనే విషయంపై ఆయన ఎంతో స్పష్టతతో ఉండేవారు. దేశం, ప్రజాస్వామ్యం ఆయనకు అత్యంత ప్రధానమైన అంశాలు. పార్లమెంట్ ఒక చర్చా, సంభాషణా స్థలమే తప్ప పోరాట స్థలం కానీ సవాళ్లు విసిరే స్థలం కానీ కాదని ఆయన నమ్మకం. కులం, రంగు, మతం, ప్రాంతంకి సంబంధించిన సంకుచిత భావాలకు అతీతంగా ఆయన దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఉన్నత స్థాయిలో నిలిపారు. రాజకీయాల ప్రధాన దృష్టి దేశంపైనా, అన్ని వర్గాల ప్రజలను ముందుకు తీసుకుపోయే దేశాభివృద్ధిపైన మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయం. రాజకీయ పాలన పట్ల వాజ్‌పేయి వైఖరి ఎంత సమ్మిళితంగా ఉండేదంటే, ప్రతిపక్షాలు తాము కూడా ప్రభుత్వంలో భాగమై ఉంటున్నామని భావించేవి. అన్నాడీఎంకే, టీడీపీ, బీఎస్పీ, జేడీయూ, నేషనల్ కాన్ఫరెన్స్, టీఎంసీ వంటి 23 పార్టీలతో కూడిన నేషనల్ డెమాక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే)ని ఆయన ఎంతో విజయవంతంగా నిర్వ హించారు. ఆయన పాలనా కాలం భారత రాజకీయాల్లో ఒక చారిత్రక ప్రయోగం. రాజకీయాల్లో కలిసి పనిచేయడంలో విజయవంతమైన, విశిష్టమైన ప్రయోగం అది. జనతా పార్టీ ప్రభుత్వంలో వాజ్‌పేయి భారత విదేశాంగమంత్రిగా వ్యవహరించారు. అన్నిటికంటే దేశం ముందు అనే ఆయన రాజకీయ విశ్వాసంతో ప్రభావితుడైన నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతినిధి బృందంలో వాజ్‌పేయిని చేర్చారు. దౌత్య, విదేశీ వ్యవహారాలపై ఆయన సాధికారత మహత్తరమైనది. 1998లో పోఖ్రాన్–2 అణుపరీక్షలు నిర్వహించినప్పుడు అమెరికా, తదితర దేశాలు భారత్‌పై ఆంక్షలు విధించినప్పటికీ వాజ్‌పేయి చెక్కుచెదరలేదంటే ఇదే కారణం. చైనాతో సరిహద్దు వివాదాలను తగ్గించుకుని వాణిజ్య బంధాలను మెరుగుపర్చుకున్నారు. మూడు తరాల చైనా నాయకత్వంతో (మావో సేటుంగ్, డెంగ్ జియావోపింగ్, హూ జింటావో) వాజ్‌పేయి వ్యవహరించారు. అలాగే పెర్వేజ్ ముషారఫ్‌ని ఆగ్రా సదస్సుకు ఆహ్వానించడం ద్వారా పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి కూడా ఆయన సాహసించారు. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతుల వ్యవస్థ నవీకరణ, రహదారులు, రైళ్ళు, విమానయాన అనుసంధానానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. టెలికాం రంగంలో పలు సంస్కరణలను మొదలెట్టడం ద్వారా ఆయన మొబైల్, ఫోన్ అనుసంధానతను విప్లవీకరించారు. 1999లో కార్గిల్ ఘర్షణ వంటి ఘటనలతో 1998–2004 మధ్య కాలంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, 1999–2000 మధ్య రెండు తుఫానులు, 2002–2003లో కరువుతో, చమురు సంక్షోభంతో దేశం విలవిల్లాడిపోయినప్పటికీ వాజ్‌పేయి నాయకత్వంలో భారతదేశం 8 శాతం వృద్ధితో స్థిరమైన ఆర్థిక ప్రగతిని కొనసాగించింది. దేశంలో 6–14 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించే సర్వ శిక్షా అభియాన్ పథకం ప్రారంభించడానికి వాజ్‌పేయి చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ప్రారంభంతో బడి మధ్యలోనే మానేస్తున్న పిల్లల సంఖ్య 60 శాతానికి పడిపోయింది. నదుల అనుసంధాన ప్రాజెక్టు అనేది వాజ్‌పేయి చిరకాల స్వప్నాల్లో ఒకటి. అదేవిధంగా స్వర్ణ చతుర్భుజి పథకం ద్వారా రహదారుల మౌలిక వసతుల కల్పనకు ఆయిన భారీగా ప్రోత్సాహం అందించారు. ఇకపోతే ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన్ పథకం ద్వారా ఇవాళ మన గ్రామాలు సర్వకాలాల్లోను ఉపయోగంలో ఉండే రహదారులతో అనుసంధానమైన విషయం కూడా మనకు తెలుసు. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన ద్వారా ఉద్యోగాల కల్పనకు ఆయన ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఎస్సీ ఉద్యోగుల పదోన్నతిలో రిజర్వేషన్ కల్పించే నిబంధనను పునరుద్ధరించారు. ఆనాడు వాజ్‌పేయి ప్రదర్శించిన దార్శనికతను నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తార్కిక ముగింపువైపు తీసుకుపోతున్నారు. అందరికీ హితం చేకూర్చే పరిపాలన ద్వారా దేశంలో ఏ ఒక్కరినీ వెనకబడకుండా పురోగమించేలా చేస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ అనే స్వప్నాన్ని వీలైనంత త్వరగా ఫలింప చేశారు. జన్‌ధన్–ఆధార్–మొబైల్ త్రయం దేశ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకొచ్చింది. కరోనా మహమ్మారి కాలంలో దాని ప్రభావానికి గురైన ప్రజలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకే పంపించింది. సమాజంలోని పేదల్లో కెల్లా నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడింది. ప్రత్యేకించి పేదలు, అధోజగత్ సహోదరుల్లో ఏ ఒక్కరినీ పక్కన పెట్టకుండా వారిని అభివృద్ధిలో భాగం చేయాలనే ఆయన కల నేడు నెరవేరుతుండటం సంతోషకరం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలలో అనురాగాన్నీ, సమ్మిళితత్వాన్నీ, పారదర్శకతనూ ప్రోత్సహించడం ద్వారా సుపరిపాలనను అందించాలనే వాజ్‌పేయి దార్శనికతను సర్వవేళలా అనుసరించడమే ఆయనకు మనమందించే నివాళి. కోవిడ్–19 మహమ్మారి ద్వారా అనేకరంగాల్లో మనకు ఎదురుదెబ్బలు తగిలిన నేపథ్యంలో పునర్మిర్మాణ ప్రక్రియను ఇప్పుడు చేపడుతున్నాం. అందరికీ నాణ్యమైన సౌకర్యాలను, అవకాశాలను కల్పించేందుకు మనం తీవ్రమైన ప్రయత్నాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. వాజ్‌పేయితో 1980నుంచి మొదలుకుని దశాబ్దాలపాటు పనిచేయగలిగినందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేశాను. మనమంతా కష్టపడి పనిచేసి భారత్‌ను విశ్వగురువుగా మారుద్దాం. అదొక్కటే మన మహానేతకు మనం అర్పించే నిజమైన నివాళి. సర్వకాలాల్లో వాజ్‌పేయి ఆదర్శవంతమైన నాయకుడిగా నా మదిలో నిలిచి ఉంటారు. -బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ (నేడు అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి, సుపరిపాలనా దినోత్సవం) -
స్వధర్మం, స్వాభిమానం పెంపొందించేందుకే..
హిమాయత్‌నగర్: దేశ స్వాతంత్య్ర అమృతోత్సవాల్లో (ఆజాదీ కా అమృత్ మహోత్సవ్) భాగంగా హైదరాబాద్‌లోని కేశవ మెమోరియల్ కాలేజీలో గోల్కొండ సాహితీ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశ ప్రజల్లో స్వధర్మ, స్వాభిమాన, స్వరాజ్య భావాలను పెంపొందించేందుకు పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో సమాచార భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోల్కొండ సాహితీ మహోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ తరహా ఉత్సవాలు ప్రజల్లో ఉత్సాహం నింపుతాయని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. విస్మరణకు గురైన వీరుల యాదిలో.. భారత స్వతంత్ర పోరాటంలో విస్మరణకు గురైన వీరులను స్మరించుకునేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహించుకుంటున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటిషర్లను ధైర్యంగా ఎదుర్కొన్న వనవాసీ వీరుడు బిర్సా ముండా జయంతిని జాతీయ గిరిజన దినోత్సవంగా కేంద్రం ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో కూడా కుమురంభీం, రాంజీ గోండు, అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన వీరుల గాథలను పరిచయం చేసేందుకు గిరిజన మ్యూజియం ఏర్పాటుకు కేంద్రం రూ.15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాగా, డాక్టర్ రతన్ శార్దా రచించిన స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి రచించిన నిజాం రూల్ అన్మాస్క్డ్, డాక్టర్ బి.సారంగపాణి రచించిన ఆంగ్లేయుల ఏలుబడి.. పుస్తకాలను వారు ఆవిష్కరించారు. ఆకట్టుకున్న స్వాగత తోరణం కేశవ మెమోరియల్ కాలేజీ ప్రాంగణంలో రెండ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన స్వాగత తోరణం అందరినీ ఆకట్టుకుంది. ఇందులో భారత స్వంతంత్య్ర సమరయోధుల చిత్రాలు, నిజాం సంకెళ్ల నుంచి తెలంగాణను కాపాడటానికి పాటుపడ్డ కవులు, కళాకారులు, యోధుల చిత్రాలు, వారి సంక్షిప్త జీవిత చరిత్ర ఉన్నాయి. -
పవన్ కల్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్: మంచు విష్ణు
Manchu Vishnu About Pawan Kalyan: అలయ్-బలయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, తాను మాట్లాడుకోకపోవడంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మాట్లాడుకున్నాం అని, అయితే ఉప రాష్రపతి ఉండట వల్ల స్టేజ్‌పై మాత్రమే మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం అనంతరం పోస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ..పవన్ ఫ్యాన్స్ కోసమే ఆ వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. తమ మధ్య విభేదాలు లేవని, పవన్‌కల్యాణ్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న తండ్రి మోహన్‌బాబు-చిరంజీవి ఫోన్లో మాట్లాడుకున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణు- పవన్ కల్యాణ్ ఎదురుపడినా ఇద్దరి మధ్యా మాటల్లేవ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T — Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021 చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అండ్ టీం -
సందడిగా అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు
-
జలవిహార్‌లో సందడిగా ‘అలయ్- బలయ్’ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలయ్- బలయ్’ కార్యక్రమం ఆదివారం జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌదర్యరాజన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గిరిజన మహిళలలో నృత్యం చేశారు. అలయ్- బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, తెలంగాణ మండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. కలిసి తిందాం, కలిసి పాడుదాం, కలిసి ఆడుదాం అనే సంప్రదాయం ‘అలయ్ బలాయ్’ కార్యక్రమానిదని తెలిపారు. ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కొనసాగుతోందని తెలిపారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘అలాయ్ బలాయ్’ తెలంగాణ రుచులను ప్రోత్సహిస్తూ.. ప్రతి ఒక్కరిని సమానదృష్టితో చూస్తుందని తెలిపారు. తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు. పార్టీలకు జెండాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చేది ‘అలయ్ బలాయ్’ అని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించడమే ‘అలయ్ బలాయ్’ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఏటా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలాయ్’ కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. దసరా పండగ తర్వాత రెండో రోజు అలయ్ బలాయ్ నిర్వహిస్తారు. అలయ్ బలాయ్‌లో తెలంగాణ వంటల(వెజ్, నాన్ వెజ్)తో సిద్ధం చేశారు. -
ఐక్యతా స్ఫూర్తికి వేదిక అలయ్‌బలయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నిర్వహిస్తున్న అలయ్ బలయ్ ఉత్సవాల సందర్భంగా బండారు దత్తాత్రేయకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దసరా అనంతరం నిర్వహించే ఈ వేడుకల ద్వారా సమాజంలోని ఐక్యత, సామరస్యస్ఫూర్తి మరింత బలోపేతమవుతాయన్నారు. ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని పెంపొందించేందుకు, వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారుల నైపుణ్యాల ప్రదర్శనకు గొప్ప వేదికగా నిలుస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఈనెల 17న ‘అలయ్‌బలయ్’
సాక్షి, హైదరాబాద్: ఏటా దసరా సందర్భంగా ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆనవాయితీగా నిర్వహించే ‘అలయ్‌బలయ్’ కార్యక్రమం ఈనెల 17న జరగనుంది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలదృశ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదివారం జరిగిన అలయ్‌బలయ్ సన్నాహక సమావేశంలో నిర్ణయించారు. కమిటీ అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి సమావేశం అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈసారి అలయ్‌బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు బిశ్వభూషణ్ హరిచందన్, తమిళిసై సౌందరరాజన్, ఇరు రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి భూపేందర్ యాదవ్, పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురిని ఆహ్వానించనున్నట్లు ఆమె వెల్లడించారు. సమావేశంలో బండారు దత్తాత్రేయ, సభ్యులు జనార్దనరెడ్డి, జిగ్నేశ్‌రెడ్డి, ప్రదీప్‌కుమార్, సత్యం యాదవ్, మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైద్యరంగానికి కేంద్ర బిందువుగా ఎయిమ్స్
సాక్షి, యాదాద్రి: ప్రతి ఒక్కరికీ వైద్యం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ ఎయిమ్స్ కళాశాలను అభివృద్ధి చేస్తున్నా రని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. ప్రభుత్వ వైద్యరంగానికి బీబీనగర్ ఎయిమ్స్ కేంద్ర బిందువుగా మారుతోందని అన్నారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాల ఏర్పాటే ప్రధాని లక్ష్యమని.. అందుకే కేంద్ర బడ్జెట్లో రూ.2.40 లక్షల కోట్లను వైద్యరంగానికి కేటాయించారని చెప్పా రు. దత్తాత్రేయ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో అకడమిక్ సెక్షన్‌ను ప్రారంభించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. హెల్త్ డిజిటల్ ఐడీ కార్డు అందుబాటులోకి తెచ్చి ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రులలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి జరుగుతోందన్నారు. భువనగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులను ఈ బడ్జెట్లో కేటాయిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారని చెప్పారు. ఎయిమ్స్‌లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులపై పనిభారం తగ్గించేలా ఎయిమ్స్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఎయిమ్స్ ద్వారా అందించే వైద్య సేవలను, కోవిడ్ సమయంలో నిర్వహించిన సేవలను ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా వివరించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎయిమ్స్ డీన్ డాక్టర్ రాహుల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్, డాక్టర్ శ్యామల, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు, సీనియర్ నేతలు గూడూరు నారాయణరెడ్డి, బండ్రు శోభారాణీ పాల్గొన్నారు. -
ఓబీసీల హక్కులకు బాసటగా నిలవాలి
సాక్షి, హైదరాబాద్: వెనకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్(ఎన్సీబీసీ)పై ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతికి ఈ కమిషన్ మరింత పాటుపడాలని సూచించారు. ఎన్సీబీసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడి ఖైరతబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో ఆ కమిషన్ చైర్మన్ భగవాన్లాల్ సహానీ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై మాట్లాడారు. ఎన్సీబీసీ పనితీరు మెరుగ్గా ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో ఓబీసీల్లో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ వల్లే ఎన్సీబీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా దక్కాయని అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ కేబినెట్లో 27 మం ది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి బీసీల పట్ల బీజేపీ తన ప్రేమను చాటుకుందన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాలకే ఇచ్చిందని, నాగాలాండ్‌లో గిరిజనులకు అక్కడ 85 %ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తుచేశారు. విద్యతోనే భవిష్యత్తు: దత్తాత్రేయ హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొర్లు, బర్లు పంపిణీ చేస్తే లాభం ఉండదని, విద్యతోనే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. బీసీలకు కేటాయించిన 27 % రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా ఎన్సీబీసీ కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగంలో కూడా దళిత, బహుజనులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో మహిళలకు సముచితస్థానం క ల్పించాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ చేతుల మీదుగా ఎన్సీబీసీ రెండేళ్ల పురోగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి ఎన్సీబీసీ రెండేళ్ల విజయాలను సభలో వివరించారు. బీసీ గణనపై రగడ జనగణనలో బీసీ కులాలవారీగా గణాంకాలు సేకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు. దీంతో సభ కొంతసేపు గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనాకారులను అదుపులోకి తీసుకోవడంతో సభ సాఫీగా సాగింది. -
విద్యార్థిని చెక్కే శిల్పి... ఉపాధ్యాయుడు
‘వ్యక్తిత్వాన్ని నిర్మించే, మనోబలాన్ని పెంచే, బుద్ధి వైశాల్యాన్ని విస్తరించే, ఒక మనిషిని తన కాళ్ల మీద తాను నిలబడేలా చేసే విద్య మనకు కావాలి’ అంటారు స్వామి వివేకానంద. ఒక బలమైన దేశా నికి నిజమైన మూలాధారం ఉపాధ్యా యులే. వారి ప్రయత్నాలే నూతన తరాల భవిష్యత్‌ను కాంతిమయం చేస్తాయి. ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొం టున్న సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను గౌరవంగా స్మరించుకుంటాం. దౌత్యవేత్త, పండితుడు, అన్నింటికీ మించి గొప్ప ఉపాధ్యాయుడు అయిన సర్వేపల్లి, దేశానికి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అందరినీ కలుపుకొని పోయేలా సమాజాన్ని మార్చేందుకు విద్య అనేది ముఖ్యమైన సాధనం అని ఆయన భావించారు. టీచర్ అంటే కేవలం తరగతి గదికే పరిమితమైన వారు కాదు. దానికి మించిన పాత్ర వాళ్లు పోషిస్తారు. బోధన అనేది నిరంతర ప్రక్రియ. ఉపాధ్యాయులు చురుగ్గా, సృజన శీలంగా, పట్టు వదలని విక్రమార్కుల్లా, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునేలా, కాలానుగుణంగా పాత చింతకాయ భావాలను వదిలేసేలా ఉండాలి. అప్పుడే వాళ్లు అత్యుత్తమమైన మానవ వనరులను సృష్టించగలరు. జీవితంలో ఎదురయ్యే ఆటు పోట్లను తట్టుకోగలిగేలా విద్యార్థులను తీర్చిదిద్దగలరు. అత్యున్నత విద్యాసంస్థల్లో చదివినప్పటికీ, కఠినతరమైన పరీ క్షల్లో విజయులైనప్పటికీ కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న వార్తలు చదివినప్పుడు ప్రాణం విలవిల్లాడు తుంది. అందుకే బోధన అనేది కేవలం పిల్లల మెదళ్లలో జ్ఞాన తృష్ణను రగిల్చేదిగా మాత్రమే మిగలరాదు; వారి హృదయాలలో ఒక సానుకూల భావనను నెలకొనేట్టుగా చేయాలి. గూగుల్ ఎన్న టికీ గురువుకు ప్రత్యామ్నాయం కాజాలదు! ఉపాధ్యాయులు విద్యా ప్రపంచంలో వస్తున్న నూతన పరి ణామాలపట్ల వారు ఎరుకతో ఉండాలి. కోవిడ్–19 మహమ్మారి మనకు ఆన్లైన్ బోధన ప్రాధాన్యతను తెలియపర్చింది. అందుకే టీచర్లు సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న కొత్త సాధనాలైన కృత్రిమ మేధ, వస్తు అంతర్జాలం, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి వాటిపట్ల సాధికారత కలిగివుండాలి. డిజిటల్ నాలెడ్జ్ బ్యాంకును సృష్టించాలి. మన చిన్నారుల ఐక్యూను విశే షంగా పెంచడం మన లక్ష్యం కావాలి. వచ్చే సమస్యలకు వాళ్లే పరిష్కారాలు ఇవ్వగలిగేట్టు చేయాలి. ఆలోచన, చర్చ, ప్రయోగం అనేవి బోధనా శైలిలో ముఖ్యాంశాలు కావాలి. అప్పుడు మాత్రమే మనం నాయకులను, శాస్త్రవేత్తలను సృష్టించగలం. మెడికల్ సైన్స్, టెక్నాలజీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్, సైన్స్‌లాంటి విద్యలోని ప్రతి రంగంలోనూ మనం శీఘ్రగతిన పురోగతి సాధించాం. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్ర, రాష్ట్ర విశ్వ విద్యాలయాలు ఈ రోజున విద్య గరపడంలో ఎంతో ముందు న్నాయి. అత్యున్నత విద్యా సంస్థల్లో 2019–20 సంవత్సరంలో 3.85 కోట్ల మంది ఉన్నారు. 2018–19లో ఈ సంఖ్య 3.74 కోట్లు. అంటే 11.36 లక్షల పెరుగుదల. పాఠశాల విద్యలో కూడా మనం ఎన్నో రెట్ల స్థిరమైన ప్రగతిని సాధించాం. ఉపాధి ఏర్పరుచుకు నేలా, ఉద్యోగాలు సృష్టించేలా మన విద్యార్థులు, యువతకు స్థిరమైన సాధికారతనిచ్చేలా చేయడంలో మన సామూహిక కృషి, పట్టుదలకు ఈ సంఖ్యలు ఉదాహరణ. మనం గమనించవలసింది నిరుద్యోగిత, పేదరికం, అసమా నతలు, ఆఖరికి వివక్షలాంటి ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడానికి విద్య అనేది ఆచరణీయ పరిష్కారం. అందుకే సమాజంలోని బల హీన వర్గాలైన ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల చదువుల విషయంలో అదనపు కృషి అవసరం. పేదరికంవల్ల ఈ వర్గాల నుంచి ఎంతోమంది పిల్లలు చదువులు మానుకుంటున్నారు. వాళ్లను మనం పాఠశాలల్లో ఉంచేలా చేయాలి. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛా విలువలతో కూడిన నవ భారతం నిర్మించడంలో, ఆత్మ నిర్భర్ భారత్ స్వప్నాన్ని నెరవేర్చడంలో నూతన విద్యా విధానం–2020 ప్రాము ఖ్యతగల పనిముట్టు కాగలదు. మన విద్యా విధానం ఒకే మూసలో పోసినట్టుండే యంత్రాలను తయారుచేసేట్టుగా కాకుండా, నైపుణ్యం, దూరదృష్టి, హేతువుతో కూడిన బహుముఖ ప్రజ్ఞను అలవర్చేదిగా ఉండాలి. అందుకే నూతన విద్యా విధానం విద్యాసంబంధ కార్యకలాపాలకూ, సాంస్కృతిక, వృత్తి సంబంధ నైపుణ్యాలకూ మధ్య గట్టి గీత గీయడం లేదు. ఆరవ తరగతి నుంచే శిక్షణతో కూడిన వృత్తి సంబంధ విద్య ప్రారంభమ వుతుంది. కనీసం ఐదో తరగతి వరకు వారి మాతృ, ప్రాంతీయ భాషల్లో బోధన ఉంటుంది. ఇరవై ఒకటో శతాబ్దపు విద్యా విధానం సౌలభ్యం, సమత, అందుబాటు, జవాబుదారీతనం అనే మూలసూత్రాల మీద నిర్మితమైంది. ఉపాధ్యాయులు పిల్లలను ఒక మాతృమూర్తిలా సంరక్షిం చాలి. మామూలు ఉపాధ్యాయుడు కేవలం తరగతి గది పాఠా లతో మాత్రమే విద్యార్థితో సంబంధంలో ఉంటాడు. కానీ మంచి ఉపాధ్యాయుడు దానికి మించి పిల్లల మనసుల్లో ముద్రవేయ గలుగుతాడు. మాకు భౌతికశాస్త్రం బోధించిన రామయ్య సర్, తెలుగు బోధించిన శేషాచార్య నాకు ఇప్పటికీ గుర్తున్నారు. వాళ్లు అద్వితీయమైన ఉపాధ్యాయులు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సరైన భావమార్పిడికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. మార్కులు, గ్రేడ్లు మాత్రమే ముఖ్యం కాదని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. విలువలు, వ్యక్తిత్వం, పట్టుదల, వినయం కూడా అంతే ముఖ్యం. ఉపా ధ్యాయ వృత్తి గొప్పది. భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా పదవీ విరమణ అనంతరం కూడా బోధన కొనసా గించారు. బోధన అనేది ఉద్యోగం కాదు; ఉత్తమ మానవులను తీర్చిదిద్దే ఒక మతం. మన ఉపాధ్యాయులు ఈ గొప్ప ధర్మాన్ని వ్యాపింపజేసే ప్రవర్తకులు. మీ త్యాగాల వల్ల ఎవరూ విస్మరణకు గురికాని నవభారతం సాకారమయ్యే కొత్త యుగంలోకి ప్రవేశి స్తామని నా విశ్వాసం. ‘ఒక మనిషి వ్యక్తిత్వం, అంతర్వా్యప్తి, భవి ష్యత్ రూపొందించగలిగే బోధన అనేది చాలా పవిత్రమైన వృత్తి’ అన్న అబ్దుల్ కలాం మాటలతో దీన్ని ముగిస్తాను. వ్యాసకర్త:బండారు దత్తాత్రేయ హరియాణా గవర్నర్ (నేడు ఉపాధ్యాయ దినోత్సవం) -
Bandaru Dattatreya: నేనూ పేద కుటుంబం నుంచే వచ్చా
సాక్షి, జమ్మికుంట(కరీంనగర్): ‘నేనూ పేద కుటుంబంలోనే పుట్టా. కష్టపడి ఎదిగాను. కేంద్రమంత్రిగా పనిచేశా. గవర్నర్‌గా కొనసాగుతున్నా. ఇందుకు కారణం ఉన్నత చదువులు చదవడమేనని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని గొల్లకురుమలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కారసభకు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గొల్లకురుమల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ గొల్ల,కురుమలు గొర్లకాపరులుగా ఆగిపోవద్దన్నారు. వ్యాపారవేత్తలుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని సూచించారు. గొల్ల కురుమలను ఎస్సీ జాబితాలో కలపాలనే వినతిని సర్కారుకు సిఫారసు చేస్తానన్నారు. వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉన్ని పరిశ్రమ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ తుల ఉమ, నాయకులు మహిపాల్, రవీందర్, మల్లేశ్, సురేశ్, సాయిబాబా పాల్గొన్నారు. చదవండి: ఈటల గెలిస్తే ప్రభుత్వం కూలుతుందా? -
హరియాణా స్వాతంత్య్ర వేడుకల్లో ‘బతుకమ్మ’
సాక్షి, న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో హరియాణా ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో బతుకమ్మ సాంస్కృతిక ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకలకు అతిథిగా హాజరైన హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ జాతీయ జెండాను ఆవిష్కరించి కళాకారులను అభినందించారు. -
హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : హర్యానా గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణస్వీకారం చేశారు. గురువారం హర్యానా హైకోర్టు సీజే ఆయనతో ప్రమాణం చేయించారు. కాగా, ఇటీవలే హిమాచల్ ప్రదేశ్ నుంచి హర్యానా గవర్నర్‌గా దత్తాత్రేయ బదిలీ అయిన సంగతి తెలిసిందే. -
‘అన్న అంత్యక్రియల కోసం వచ్చిన నన్ను చూసి అందరు ఏడ్చారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆత్యయిక స్థితి సమయంలో జైలు నుంచి వచ్చి అన్న అంత్యక్రియల్లో పాల్గొన్న తనను చూసి అందరూ చలించిపోయారని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. 1975 జూన్ 25న అమలులోకి వచ్చిన ఆత్యయిక స్థితి నాటి రోజులు, పడిన కష్టాలు దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు. ఆత్యయిక స్థితి అమలులోకి వచ్చిన రోజును ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన రోజుగా ఆయన అభివర్ణించారు. మన దత్తన్నే.. మారు వేషంలో ‘‘ఆ సమయంలో ఆర్ఎస్ఎస్లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేస్తున్నా. ఆర్ఎస్ఎస్ను నిషేధించడంతో పలువురితో కలసి రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. మారువేషాల్లో జయప్రకాశ్ నారాయణ నాయకత్వంలోని సంఘర్షణ సమితికి పనిచేసే వాళ్లం. తొమ్మిది నెలల తర్వాత నేటి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పోలీసులు మీసా చట్టం కింద అరెస్టు చేశారు. జైలులో ఉన్న సమయంలోనే అన్న అనారోగ్యంతో మరణించారు. అంత్యక్రియల కోసం పెరోల్‌పై బయటకు వచ్చాను. పోలీసుల రక్షణ వలయంలో వ్యాన్ నుంచి దిగిన నన్ను చూసి బంధువులు, చుట్టుపక్కల వాళ్లు చలించిపోయారు’’ అని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్ -
ధరిత్రికి ప్రాణవాయువు పర్యావరణమే
పర్యావరణంతో కలిసి జీవించడం మనందరి ప్రాథమిక బాధ్యత. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్నవనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను పలు దేశాలు విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నేడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పర్యావరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను జాగృతపరిచే ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఐక్యరాజ్యసమితి 1972లో ప్రారంభించింది. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి అవసరమైన ప్రపంచ అవగాహనను పెంచడానికి ఈ రోజున కొన్ని చర్యలు చేపడతారు. భూమికి చెందిన పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన అత్యవసర అవసరాలపై ప్రజలు, ప్రభుత్వాలు, వివిధ ప్రజా సంఘాల దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించడమే ఈ సారి ఐక్యరాజ్యసమితి ముఖ్యఉద్దేశం. జీవ వైవిధ్యాన్ని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో అడవులది కీలక పాత్ర. ‘చెట్లే మనిషికి గురువులు’ అన్నాడు మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్. కానీ ఆ మానవులే నేడు చెట్లను తమ స్వార్థం కోసం అభివృద్ధి, సాంకేతికత పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. మన దేశంలో ఒక చెట్టును నరికేముందు ఐదు మొక్కలు నాటడం ఆచారంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మారిపోయింది. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా దీనికి ఆధారం భూమి. గాలి, నీరు, నింగి, నిప్పు, నేల అనే పంచభూతాల్లో ఏ ఒక్కటి లోపించినా జీవనం అస్తవ్యస్తమవుతుంది. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం.. పర్యావరణానికి పెనుముప్పుగా పరిణమించింది. భూతాపాన్ని తగ్గించే విషయంలో అడవులది కీలక పాత్ర. విస్తారమైన అడవులు భూగోళానికి ఊపిరి తిత్తులవంటివి. మన దేశంలో జాతీయ సగటు అడవుల శాతం 24.06%గా ఉంటోంది. దక్షిణ భారత దేశంలో అత్యధికంగా కేరళలో 54.42 శాతం ఉండగా, తమిళనాడు 20.17, కర్ణాటక 20.11, తెలం గాణ 18.36, ఆంధ్రప్రదేశ్ 17.88 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉండగా హిమాచల్ ప్రదేశ్ 66.52%తో ఉంది. గత దశాబ్ద కాలం (2009–2019)లో భారత దేశ పట్టణీకరణ దాదాపు 34.47% మేర పెరిగింది. పట్టణాల విస్తీర్ణం వేగంగా పెరుగుతుండటంతో అడవులు తీవ్రంగా నరికివేతకు గురవుతున్నాయి. తద్వారా వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఈ దశాబ్దం చివరినాటికి వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. అప్పుడు ఋతుపరివర్తన జరిగి అకాల వర్షాలు, వరదలు, అధిక ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడి అపార నష్టం సంభవిస్తుంది. దీనివల్ల సమస్త మానవజాతి మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ శతాబ్దం చివరికి భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలనే లక్ష్యంతో రూపొందిన పారిస్ వాతావరణ ఒప్పందానికి ప్రపంచ దేశాలు కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2030 నాటికి వార్షిక ఉద్గారాలను 44 బిలియన్ టన్నులకు పరిమితం చేయగలిగితే ఉష్ణోగ్రత 2 డిగ్రీల కన్నా పెరగకుండా చూసుకోవచ్చు. ఇది జరగాలంటే.. ఇప్పటి కన్నా 25% తక్కువగా కర్బన ఉద్గారాలు విడుదలయ్యేలా మానవాళి తన అలవాట్లను, జీవనశైలిని విప్లవాత్మకంగా మార్చుకోగలగాలి. మానవ నాగరికత నది తీరాల్లోనే మొదలైందనేది కాదనలేని సత్యం. మనదేశంలో అనేక పవిత్ర నదులు, త్రివేణి సంగమాలు ఉన్నాయి. ప్రకృతిని పవిత్రంగా భావించి, ఆరాధించి, గౌరవించే ఈ సంప్రదాయాన్ని ఈనాటి నవీన సమాజంలో మరలా ప్రారంభిం చాల్సి ఉంది. ఆయా నదులు వాటి తీరాలు ఆక్రమణకు గురి కాకుండా వాటిల్లో చెత్తా చెదారాలు వేయకుండా శుభ్రంగా చూసుకోవడం మనందరి కనీస బాధ్యత. నది తీరాల వెంబడి కాలుష్య పరిశ్రమలను స్థాపించి వాటి చెత్తా చెదారం అంతా నదుల్లోకి పారబోస్తున్నారు. ఉదాహరణకి గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమై పోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. పైగా గంగా నదిలో శవాల విసిరివేత మనందరికీ సిగ్గుచేటు. సరస్సులు, చెరువుల ఆక్రమణను అరికట్టాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకై తగు చర్యలు చేపడుతుండడం ఎంతో ముదావహం. కేంద్రం 20 వేల కోట్ల రూపాయలతో ‘నమామి గంగే’ పేరు తో గంగానది తీర ప్రక్షాళనకు పూనుకోవడం బృహత్తర చర్య. అలాగే ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ ద్వారా పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ‘టాయిలెట్స్ బిఫోర్ టెంపుల్స్’ పేరుతో దేశంలో ఇప్పటివరకు కొత్తగా 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించడం ఎంతో గొప్ప చర్య. అలాగే ‘గ్రీన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం’ ద్వారా దేశ యువతకు సరికొత్త ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు గత మూడేళ్లలో దాదాపు 6,778 చదరపు కిలోమీటర్ల మేర కొత్త అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం దాదాపు 36.73 కోట్ల ఎల్ఈడీ బల్బులను అందుబాటులోకి తెచ్చి, పెద్దఎత్తున వాటి వినియోగాన్ని ప్రోత్సహించడంతో దాదాపు 38 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగాం. ఉజ్వల పథకం కింద 8 కోట్ల కుటుంబాలకు పొగ రహిత వంటగదులు అందుబాటులోకి తెచ్చినట్లైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్ ఎనర్జీ కార్యక్రమమని చెప్పవచ్చు. హిమాచల్‌ప్రదేశ్ ‘నగర్ వన్ ఉద్యాన్‘ పేరుతో అన్ని పట్టణాలలో కృతిమ ఉద్యానవనాలు ఏర్పాటు చేస్తోంది. అలాగే ‘మోడల్ ఎకో విలేజ్ ‘పేరుతో ఉత్తమ పర్యావరణ గ్రామాలను ఎంపిక చేసి వాటికీ ప్రోత్సాహకాలు అందిస్తుంది. అయితే పర్యావరణాన్ని పరిరక్షించటానికి కేవలం చట్టాలు మాత్రమే సరిపోవు. మన జీవన విలువలలో పర్యావరణ పరిరక్షణను ఒక భాగంగా చేసుకోవలసిన అవసరం ఉంది. పర్యావరణంపై ప్రభావం చూపుతున్న పారిశ్రామిక కాలుష్య ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా అరి కట్టాలి. ప్రజలు మొక్కలను పెంచడం ఒక వ్యాపకంగా మార్చుకోవాలి. నదులను పునరుజ్జీవింప చేయడం, వ్యర్థాలు ఏమాత్రం ఉత్పత్తి చేయని జీవన విధానాలను అవలంభించడం వంటి విషయాలలో సమాజంలోని అందరినీ ముఖ్యంగా యువతను భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి అదే మానవాళికి ఒక గుణపాఠం కూడా నేర్పింది. ప్రకృతి, పర్యావరణం, వాతావరణ సమతుల్యత, వ్యక్తిగత పరిశుభ్రత, మంచి ఆహారపు అలవాట్లు మానవ మనుగడకు ఎంత ముఖ్యమో కరోనా మహమ్మారి నొక్కి చెప్పింది. దేశీయ ఆహారపు అలవాట్లు ఐన కొర్రలు, రాగులు, సజ్జలు లాంటి చిరు, తృణ ధాన్యాల వాడకం విరి విగా పెరిగింది. అలాగే శుభ్రమైన నీరు, స్వచ్ఛమైన గాలి, వాతావరణ పరిశుభ్రత యొక్క ఆవశ్యకతను నొక్కి చెప్పింది. ‘పర్యావరణం ఒక శాశ్వత ఆర్థిక వ్యవస్థ’ కానీ కొంత మంది అత్యాశ వల్ల పూర్తిగా మానవాళికి చేటు జరిగేలా ఉంది. భూమిపై అన్ని వనరులూ సక్రమంగా ఉంటేనే మానవ అభివృద్ధి నిజమవుతుంది. కానీ, అంతులేని ఆధిపత్య దాహం వల్ల భూమండలం కాలుష్య కాసారంగా మారిపోయింది. ఉపరితలంపై ఉన్న వనరులే కాదు, భూగర్భ జలాలు, ఖనిజ వనరులను విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల కాలుష్యం పెరిగి రాబోయే కొన్ని దశాబ్దాలలో సహజ వనరులు అంతరించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకుల హెచ్చరిక. పర్యావరణాన్ని రక్షించుకోవాలంటే దానిని ప్రేమిస్తే చాలు దానిని కాపాడుకోవాలనే తపన ఉంటే చాలు. మనందరి దైనందిన జీవనంలో ప్రకృతి పరిరక్షణ ఒక అలవాటుగా చేసుకుందాం. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలామ్’ ‘సస్యశ్యామలాం మాతరం వందేమాతరం’ బండారు దత్తాత్రేయ వ్యాసకర్త గవర్నర్, హిమాచల్ ప్రదేశ్ (నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా) -
శభాష్ డాక్టర్.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ ప్రశంస
సాక్షి, రామగుండం: గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాస్‌రెడ్డి బుధవారం కరోనాతో చనిపోయిన ఇద్దరు వ్యక్తుల మృతదేహాలను స్వయంగా పీపీఈ కిట్‌లో ప్యాక్ చేసి మున్సిపల్ సిబ్బందికి అప్పగించిన తీరుకు.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం రాత్రి ఫోన్ చేసి అభినందించారు. ‘ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో, ఒక డాక్టర్‌గా ఉండి మీరే స్వయంగా రెండు కోవిడ్ మృతదేహాలను ప్యాక్ చేయడం చాలా గొప్ప విషయం. మీరు చేసిన ఈ పని అభినందనీయం. సేవా భావంతోపాటు ధైర్యానికి, నిష్టకు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నాను. మీరు దేశానికి ఆదర్శంగా నిలిచారు.. నా అభినందనలు’ అంటూ ఫోన్లో సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డిని గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. కోవిడ్ మృతదేహాన్ని ప్యాక్ చేస్తున్న సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి చదవండి:హమ్మా.. నేనొస్తే గేటు తీయరా..! -
ఉగాదిరోజున సింగపూర్‌లో ఘనంగా శ్రీవారి కల్యాణం
సింగపూర్: లోక కల్యాణార్థం శ్రీప్లవ నామ సంవత్సర ఉగాది రోజున (ఏప్రిల్ 13) సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సింగపూర్‌లోని సెరంగూన్ రోడ్డులో ఉన్న శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా ఈ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. శ్రీవారికి సుప్రభాత సేవ, తోమాల సేవ, అభిషేకంతో పాటు మహా గణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి, ఆంజనేయస్వామి వార్లకు అభిషేకం మొదలగు విశేష పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం శ్రీవారి ఆస్ధానంలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం పఠించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, హిందూ ఎండోమెంట్స్ బోర్డ్ నిర్దేశించిన మార్గదర్శకాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయానికి వచ్చే భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించడం, భక్తుల వివరాల సేకరించడంతో పాటు భక్తులు భౌతిక దూరాన్ని పాటించేలా వివిధ ఏర్పాట్లు చేశారు. కలియుగ దైవం కృప అందరికీ కలగాలనే సత్సంకల్పంతో భక్తులు ఇంటి నుంచే శ్రీనివాస కల్యాణోత్సవం వీక్షించేలా ఫేస్బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని ప్రత్యేక ప్యాకెట్లో సుమారు 2000 మందికి అందించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షుడు కోటిరెడ్డి తెలుగువారందరికీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన నాగఫణి శర్మకు, బండారు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు అనిల్ కుమార్ పోలిశెట్టి, కార్యదర్శి సత్యచిర్ల పాల్గొన్నారు. చదవండి: ఉగాది.. కాలగమన సౌధానికి తొలి వాకిలి -
అణగారిన వర్గాల ఆశాజ్యోతి
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి. భారతదేశ గతిని ఉన్నతి వైపు తిప్పిన మహాను భావులు ఎందరో. అలాం టివాళ్లకు మనం రుణపడి ఉండాలి. అలాంటివారిలో ఒకరు జ్యోతిరావు ఫూలే. భార్య సావిత్రి బాయితో కలిసి ఆయన స్త్రీవిద్యకు మార్గదర్శిగా నిలిచారు. 1827 ఏప్రిల్ 11న జన్మించిన నాటి నుంచి, 1890 నవంబర్ 28న తుదిశ్వాస విడిచే వరకూ ఫూలే అవి శ్రాంతంగా సామాజిక న్యాయం కోసం పోరాడారు. ఏడాది పిల్లాడిగా ఉన్నప్పుడే తల్లి చిమ్నాబాయి మరణించింది. మాలి కులానికి చెందిన అబ్బాయి కావడం వల్ల పైకులాల వాళ్ల లాగా చదువు కోసం కలలుగనే అవకాశాలు లేకపోవడం, తమ కులంలో కూడా చదువు అనేదానికి అంతగా ప్రాధాన్యత లేకపోవడంవల్ల వాళ్ల తండ్రి ఆయన్ని బడి మాన్పిం చాడు. అయితే వాళ్ల కులంలోంచి క్రిస్టియన్‌గా మారిన ఒకాయన చొరవతో స్థానిక స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చదవగలిగాడు. జ్యోతిరావు ఫూలే ఏడాది వయసులో ఉన్నప్పుడు తల్లి చిమనాబాయి కన్నుమూసింది. దిగువ కులానికి చెందిన పిల్లవాడు అగ్రకుల పిల్లల్లాగా చదువు పట్ల ఆకాంక్ష ఉంచుకోవడం కష్టం.. పైగా విద్య ఫూలే కులానికి ప్రాధమ్యం కాదు. దీంతో ఫూలే పాఠశాలను వదిలిపెట్టాల్సి వచ్చింది. కానీ వీరి కులం నుంచి క్రిస్టియన్‌గా మారిన ఒక వ్యక్తి స్థానికంగా ఉండే స్కాటిష్ మిషన్ స్కూల్లో పూలేని చేర్పించాలని జ్యోతిరావు తండ్రికి నచ్చచెప్పడంతో తర్వాత పూలే 1847 నాటికి తన ఇంగ్లిష్ పాఠశాల చదువును పూర్తి చేశాడు. 1848లో ఒక బ్రాహ్మణ స్నేహితుడి వివాహా నికి హాజరైనప్పుడు అతడి తల్లిదండ్రుల నుంచి ఎదురైన అవమానం ఫూలేలో కులాల అసమానత మీద గట్టి పోరాటం చేయాలన్న సంకల్పాన్ని కలి గించింది. అదే సంవత్సరం క్రైస్తవ మిషనరీలు అహ్మద్‌నగర్(మహారాష్ట్ర)లో నడుపుతున్న బాలికల పాఠశాలను చూడటమూ, థామస్ పెయిన్ రాసిన ‘రైట్స్ ఆఫ్ మ్యాన్’ పుస్తకం చదవడమూ దోపిడీకి గురవుతున్న వర్గాల దాస్యవిమోచనకు విద్య అనే దాన్ని మహత్తర శక్తిగా గుర్తించేట్టు చేసింది. ఆ రోజుల్లో బాల్యవివాహాల సంప్రదాయం ఉండ టంతో ఆయనకు పదమూడేళ్లకే సావిత్రిబాయితో పెళ్లయింది. దాంతో ముందుగా భార్యకు చదవడం, రాయడం నేర్పి, అనంతరం బాలికల కోసం ఆమెతో కలిసి బడిని ప్రారంభించాడు. ఆ దంప తుల ఆధ్వర్యంలో 1852లో 273 మంది బాలిక లతో మూడు పాఠశాలలు నడుస్తుండేవి. స్త్రీవిద్యతో పాటు వితంతు పునర్వివాహాన్ని ఫూలే సమర్థించాడు. పైకులాల వితంతు మహిళలు సురక్షితంగా ప్రసవించేందుకు వీలుగా 1863లో ఆశ్రమం నెలకొల్పాడు. కాశీబాయి అనే బ్రాహ్మణ వితంతువు గర్భం దాల్చడం, ప్రసవించిన శిశువును ఆమె బావిలో తోయడం, అటుపై పట్టుబడి ఆమె జైలుకు వెళ్లడం జరిగింది. ఈ సంఘటనతో చలించిన ఫూలే, ‘వితంతువులారా, మీ శిశువులను ఇక్కడ సురక్షితంగా ప్రసవించండి. ఆ శిశువును మీరు పెంచుకుంటారా మీ ఇష్టం, లేదంటే ఆశ్ర మమే పెంచుతుంది’ అని ప్రకటన ఇచ్చాడు. బ్రాహ్మణుడు లేకుండా పెళ్లి చేసే పద్ధతిని కూడా జ్యోతిబా ప్రారంభించాడు. దాన్ని ముంబై హైకోర్టు కూడా గుర్తించింది. నిమ్నకులాల కోసం తమ మంచినీటి బావిని వాడుకోనివ్వడంతోపాటు, అణగారిన వర్గాలను సూచించడానికి మరాఠీ పదమైన దళిత పదాన్ని మొదటిసారి ఆయనే ప్రయోగించాడు. మాజీ ప్రధాని వాజ్‌పేయి 2003లో పార్లమెంట్ ప్రాంగణంలో ఫూలే విగ్ర హాన్ని ఆవిష్కరించడంతో ఆయన సేవలను గుర్తించినట్టయింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక రాజ్యాంగ పూచీ ఉండటంతో ఎస్సీలు, ఎస్టీల హక్కుల పరిరక్షణ జరిగిన మాట వాస్తవం. కానీ అదే మాట ఇతర వెనుకబడిన కులాలైన ఓబీసీల విషయంలో చెప్పలేము. మండల్ కమిషన్ నివేదిక ప్రకారం 27 శాతం రిజర్వేషన్ కల్పించడం వారి అభ్యున్నతి విష యంలో చిన్న అడుగు మాత్రమే. వారికి కేటా యించిన వాటిల్లో చాలా బ్యాక్లాగ్ పోస్టులు భర్తీకాకుండా ఉండిపోతున్నాయి, ముఖ్యంగా ఏ, బీ గ్రూపుల్లో. ఓబీసీల్లోని నిరుపేదల ఎదుగుదల కోసం సమగ్ర విధానం అవసరం. ఓబీసీల్లో ఉప వర్గీకరణ పంపకాల్లోని అసమానతలను పరిశీలించ డానికి 2017లో బీజేపీ ప్రభుత్వం జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేసింది. 2014లో ఓబీసీల కోసం ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ హోదాలో నేను దేశవ్యాప్తంగా పర్యటించాను. వివిధ ఓబీసీ బృందాలతో సంభాషించాను. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించాలనేది అప్పుడు వచ్చిన ప్రధాన డిమాండ్లలో ఒకటి. నరేంద్ర మోదీ ప్రభుత్వం అది ప్రసాదించడం, ఆ చారిత్రక ఘట్టంలో నేనూ భాగంకావడం నేను గర్వించే విషయం. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను కేవలం ఓటు బ్యాంకులుగా చూసే దృక్కోణం మారాలి. నిజమైన సమస్యలున్న నిజమైన మనుషులుగా వారిని చూడాలి. మహాత్మా ఫూలే చింతన ఈ విషయంలో మనకు తోడ్పడగలదు. నిరుపేద ఓబీసీల కోసం మోడల్ స్కూళ్లు ప్రారంభించడం, అత్యున్నత సంస్థల నుంచి వారు చదివే వీలు కల్పించేలా స్కాలర్షిప్పులు ఇవ్వడం, సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారిని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో విశ్వ విపణికి అనుసంధానం చేయడం, సూక్ష్మ పరిశ్రమలు నెలకొల్పేందుకు తగిన సాంకే తిక పరిష్కారాలను వెతకడం, బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు అందేలా చూడటం లాంటివి అత్యవసరం. వీటన్నింటికి మించి సమానత్వం అనేదాన్ని ఒక కుటుంబ విలువగా అందరిలోనూ పాదుకొల్పాలి. సామాజిక ఐక్యత, వివిధ వర్గాల మధ్య సామరస్యం కోసం ఫూలే స్థాపించిన సత్య శోధక్ సమాజ్ లాంటి ఎన్నో సంస్థలు పని చేయాల్సిన అవసరం ఉంది. బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ (నేడు మహాత్మా జ్యోతిబా ఫూలే 194వ జయంతి) -
సకల రంగాల్లో నారీలోకం ముందంజ
మనుస్మృతిలోని ‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా/ యత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్ర ఫలాః క్రియా’ అనే శ్లోకం సమాజంలో అంతర్లీనంగా వున్న మహిళల శక్తిని చాటింది. ఎక్కడైతే మహిళలు గౌరవించ బడతారో అక్కడ దేవతలు నడయాడతారని... ఎక్కడ వారికి అగౌరవం ఎదురవుతుందో అక్కడ తలపెట్టే ఎంతటి మంచి కార్యమైనా నిష్ఫలమవు తుందని దీని సారాంశం. మహిళలంటే దేవతాంశ. వారు ప్రేమకూ, దయా కారుణ్యాలకూ చిహ్నం. పవిత్రతకు మారుపేరు. అమ్మగా, సోదరిగా, బిడ్డగా, భార్యగా పురుషుల జీవితంలో వారి పాత్ర బహుముఖమైనది. స్త్రీ మూర్తి లేని సృష్టిని ఊహిం చలేం. అందుకే వారు సృజనాత్మక శక్తికి ప్రతీకగా, అజరామరమైన మన సంస్కృతీ సంప్రదాయాలకు వాహికలుగా నిలుస్తున్నారు. ఆమె మనిషికి, మాన వీయతకు మాత్రమే కాదు... సర్వ మానవాళికీ మాతృమూర్తి. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో మహిళలు సాధించిన అభివృద్ధికి గుర్తుగా ఏటా మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుతున్నారు. ఇదే రోజున 1908లో 15,000మంది మహిళలు న్యూయార్క్ నగరంలో తమ హక్కుల కోసం, మెరుగైన వేతనాల కోసం, ఓటు హక్కు కోసం ఉద్యమించారు. ఏ దేశంలోనైనా సమాజ నిర్మాణంలో, దాని అభివృద్ధిలో మొదటినుంచీ మహిళల పాత్ర ప్రముఖమైనదని చరిత్ర చాటుతోంది. మహిళా దినోత్సవంనాడు ఈ వాస్తవాలను చాటేలా, మహిళా శక్తిని అందరూ గుర్తించేలా కార్యక్రమాలు రూపొందించటం అవ సరం. అవి మహిళాభ్యున్నతికి దోహదపడతాయి. మన జాతి నాగరికతలో, సంస్కృతిలో మహిళల పాత్ర ఎనలేనిది. మన ప్రాచీన శ్రుతులు, స్మృతులు ఆనాటి సమాజంలో మహిళలకున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అధికమేనని చాటుతున్నాయి. సమస్త జీవన రంగాల్లో వారు పురుషులతో సమా నంగా పాల్గొన్న అంశాన్ని తెలియజెప్పాయి. అరుం ధతి (మహర్షి వశిష్టుడి సతీమణి), లోపాముద్ర (మహర్షి అగస్త్యుడి భార్య), అనసూయ((మహర్షి అత్రి భార్య) తదితర సాధ్వీమణులు ఇందుకు చిహ్నం. ప్రాచీన భాష్యకారులు పతంజలి, కాత్యా యన్ వేదకాలం తొలినాళ్లలోనే మహిళలు విద్యా వంతులని చెప్పారు. యుక్తవయసు వచ్చాక తమ జీవిత భాగస్వాములను ఎంచుకునే స్వేచ్ఛ ఆడ వాళ్లకు వుండేదని రుగ్వేద మంత్రాలు చాటుతు న్నాయి. అలాగే మైత్రేయి, గార్గి వంటి మహిళా రుషులు కూడా వుండేవారని రుగ్వేదం, ఉపనిష త్తులు చెబుతున్నాయి. రామాయణంలోని సీతా మాత, మహాభారతంలోని మహారాణి ద్రౌపది మన ప్రాచీనకాలంనాటి మహిళా శక్తికి నిదర్శనం. ప్రాచీన సంప్రదాయాల్లో, దుర్గాదేవి సమక్షంలో ఉన్న దేవతలు కిరీటధారిణులై ఉండటం గమనించవచ్చు. అయితే మహిళల పరిస్థితి దిగజారిపోవడం అనేది మధ్యయుగాల్లోనే మొదలైంది. మొఘలులు, తర్వాత బ్రిటిష్ పాలనలో మహిళల స్వేచ్ఛకు, హక్కులకు పరిమితులు ఏర్పడ్డాయి. బాల్యవివాహం అనే దురాచారం 6వ శతాబ్ది నుంచే ప్రారంభమైందని భావిస్తున్నారు. భారతదేశాన్ని విదేశీయులు దురాక్రమించిన తర్వాత పరిణామాలు మరింతగా దిగజారిపోయాయి. ఈ కాలంలోనే పరదా సంస్కృతి, బాల్య వివాహాలు, సతీ సహగమనం, జోహార్, దేవదాసీ వ్యవస్థ వంటి మత దురాచారాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అయితే 19వ శతాబ్ది మధ్యలో బ్రహ్మసమాజ్, ఆర్యసమాజ్, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రీబాయి పూలే వంటి సంస్థలూ, వ్యక్తులు పలు సంస్కరణోద్యమాలకు నాంది పలికి మహిళల ప్రయోజనాల కోసం కృషి చేశారు. అనేక పురాతన సంప్రదాయాలు, ఛాందసభావాలకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఇంటిపనికి వెలుపల అన్ని రంగాల్లోనూ మహిళలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. అంతరిక్షం, పాలనా రంగ సేవ, విద్య, రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం, సాహిత్యం, సైన్యం, మీడియా వంటి పలు వైవిధ్యపూరితమైన రంగాల్లో మహిళలు తమ ప్రతిభాపాటవాలను చాటుకుంటున్నారు. ఈరోజు మహిళలే అభివృద్ధికి కేంద్రబిందువు అని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. మహిళకు సంఘటితపరమైన, గౌరవప్రదమైన స్థానం లభించని చోట మంచి క్రమశిక్షణాయుతమైన సమాజాన్ని కూడా సృష్టించలేం. హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా క్రీడారంగంలో సాధిస్తున్న విజయాలు మనందరికీ తెలుసు. అంతర్జాతీయ మహిళా బాక్సర్ మేరీ కోమ్, అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి మిథాలి రాజ్ నేటి సమాజ నడకకు ఉదాహరణలు. గత ఆరేళ్లుగా సైన్యంలో మహిళల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఇప్పుడు భారతీయ సైన్యం, నేవీ, వాయుసేనలో 9,118 మంది మహిళలు పనిచేస్తున్నారు. వైద్య విభాగాన్ని మినహాయిస్తే సైన్యంలో ఇప్పుడు 6,807 మంది, వాయుసేనలో 1,607, నావిగాదళంలో 704 మంది మహిళాధికారులు పనిచేస్తున్నారు. భారత నావికాబలగానికి చెందిన నావికా సాగర్ పరిక్రమలో పూర్తిగా మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల బృందం ప్రపంచం మొత్తం సముద్రాల్లో చాపచుట్టి వచ్చింది. ఇది ప్రపంచ నావికా చరిత్రలోనే అరుదైన ఘటన. భారతీయ మిస్సైల్ మహిళగా పేరొందిన టెస్సీ థామస్ డీఆర్డీఓలో సైంటిస్టుగా పనిచేస్తూ అగ్ని–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహిరించారు. అయితే సామాజికపరమైన గణాంకాలు, నేరాల రేటు చూస్తే విచారం కలుగుతుంది. జాతీయ నేర నివేదికా మండలి ప్రకారం 2019లో మహిళలపై రోజుకు 87 అత్యాచార కేసులు నమోదు కాగా, మహిళలపై దాడి ఘటనలు 4 లక్షలకుపైగా నమోదయ్యాయి. ఏడాది మొత్తంలో 32 వేలమందికిపైగా మహిళలపై అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. మహిళల రక్షణకు, వారి సమానత్వానికి తీసుకుంటున్న ప్రతి చర్యా మహిళల పరిస్థితిని ఏదో మేరకు మెరుగుపరుస్తూనే ఉంది. కానీ సామాజిక సంస్కరణా ప్రక్రియే నత్తనడకన సాగుతోంది. ఈ రంగంలో ప్రజా చైతన్యాన్ని వేగవంతం చేయాల్సి ఉంది. విద్యను కేంద్రబిందువుగా తీసుకుని చట్టాలను సమర్థంగా అమలు చేయగలిగితే మహిళలపై నేరాలు జరగని దేశంగా భారత్‌ను సమున్నతంగా నిలపవచ్చు. భారతీయ సంస్కృతిలో స్త్రీలను దుర్గా, లక్ష్మి వంటి దేవతలకు సమానస్థాయినిచ్చారు. కాబట్టి వారికి యావత్ సమాజం తగిన గౌరవం ఇవ్వాల్సి ఉంది. (రేపు మహిళా దినోత్సవం సందర్భంగా) బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ -
దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల దాడి
సిమ్లా: బీజేపీ సీనియర్ నాయకుడు, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయకు తీవ్ర పరాభవం ఎదురయ్యింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దత్తాత్రేయపై దాడి చేశారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 22 సోమవారం నాడు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజాదా, వినయ్ కుమార్ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన సభ నేడు తిరిగి ప్రారంభం అయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన వెంటనే ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నినాదాలు చేశారు. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగం చివర్లో ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దత్తాత్రేయ కారు వద్ద ఆందోళన చేస్తోన్న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి, ప్రసంగం మొత్తం చదివినట్లుగా భావించాలని పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన విషయాలన్ని అబద్ధాలని ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యను ప్రసంగంలో చేర్చలేదన్నారు. స్పీచ్ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఖండించారు. ఇక గవర్నర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్ చేశారు. చదవండి: మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్ -
మంచుకొండల్లో ఎంజాయ్ చేసిన గవర్నర్
సిమ్లా: చలికాలం కావడంతో ప్రస్తుతం మంచు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాలు మంచు దుప్పటిలో మునిగిపోయాయి. మంచుతో నిండిన ఆ ప్రాంతాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. ఓ మంచు ప్రాంతం గవర్నర్‌గా ఉన్న తెలంగాణ వ్యక్తి ఎంజాయ్ చేస్తున్నారు. మంచు ప్రాంతాల్లో పర్యటించి అందాలను ఆస్వాదించారు. ఆయనే హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా ప్రాంతం భారీ ఎత్తున మంచు దుప్పటి కప్పేసింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన సతీమణి వసంతతో కలిసి మంచు ప్రాంతాల్లో కలియ తిరిగారు. రాజ్ భవన్ ఆవరణలోనే కురిసిన మంచును పరిశీలించారు. హిమ ఫలకాలను పట్టుకుని ఎగురవేశారు. చిన్నపిల్లాడి మాదిరి గవర్నర్ ఆ మంచుతో ఆడుకున్నారు. ఆయన వెంట రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది కూడా ఉన్నారు. హిమపాతం ప్రకృతి ఇచ్చిన వరంగా ఈ సందర్భంగా దత్తాత్రేయ కొనియాడారు. ఇది కచ్చితంగా సానుకూల శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు. హిమపాతం పండ్ల తోటలకు ఎరువుగా ఉపయోగపడుతుందని, రాబోయే కాలంలో మంచి దిగుబడికి ఇది సహాయపడుతుందని తెలిపారు. ఈ క్రమంలో మంచు కురుస్తుండడంతో అధికారులకు జాగ్రత్తలు సూచించారు. ప్రజలు ఎటువంటి అసౌకర్యాలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ దత్తాత్రేయ అధికారులను ఆదేశించారు. -
సేంద్రీయ సాగు రైతులకు మేలు
సాక్షి, అమరావతి బ్యూరో: ఆదాయం రెట్టింపు అవడంతోపాటు, ఖర్చులు తగ్గాలంటే రైతులు సేంద్రీయ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. గుంటూరులో ఓ ప్రైవేట్ క్లబ్లో మంగళవారం లైవ్ భారత్ ఫౌండేషన్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు, వివేకానంద జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో సాంకేతికత ఎంత ముఖ్యమో సేంద్రీయ విధానం కూడా అంతే ముఖ్యమని చెప్పారు. సేంద్రీయ వ్యవసాయం ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారం సాధ్యమన్నారు. దేశంలోనే అత్యధికంగా సేంద్రీయ వ్యవసాయం హిమాచల్‌ప్రదేశ్‌లో జరుగుతోందని తెలిపారు. ఏపీలో కూడా ఆ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను కలిసిన సందర్భంగా సూచించినట్లు చెప్పారు. సంక్రాంతి రైతుల పండుగ అని, రైతులు సంతోషంగా ఉంటేనే అసలైన పండుగని పేర్కొన్నారు. భారతీయత గొప్పదనం గురించి దేశవిదేశాల్లో చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువమంది యువత ఉన్న యంగ్ ఇండియా 2030 కల్లా అగ్రగామిగా ఎదుగుతుందని పేర్కొన్నారు. మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్‌బాబు, గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, లైవ్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకు సీఎం జగన్ పుష్పగుచ్చం అందించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు.. దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.(చదవండి: ‘అమ్మ ఒడి’లో ల్యాప్‌టాప్) -
దుర్గమ్మను దర్శించిన బండారు దత్తాత్రేయ
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. దర్శనం అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం గవర్నర్‌కు ఆలయ ఈవో అందజేశారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించాలని దుర్గమ్మను కోరుకున్నానని తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో యువత ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఆయన సక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: ఏపీకి వ్యాక్సిన్ వచ్చేస్తోంది..) దత్తాత్రేయను కలిసిన డీజీపీ.. పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన బండారు దత్తాత్రేయను డీజీపీ గౌతమ్ సవాంగ్ మర్యాద పూర్వకంగా కలిశారు. గేట్ వే హోటల్లో ఆయనకు పుష్ఫగుచ్ఛం అందించారు. అనంతరం డీజీపీని హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ సత్కరించారు.(చదవండి: అరుదైన బొగ్గు క్షేత్రం ఏపీఎండీసీ కైవసం) -
విశ్వగురు దార్శనికతే.. వివేకానంద తాత్వికత..
ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని పాటిస్తుంటారు. బలమైన వ్యక్తిత్వం, విజ్ఞాన శాస్త్రం లోనూ, వేదాంతంలోనూ ఆయనకున్న అపారమైన విజ్ఞానం, మానవ, జంతు జీవితం పట్ల సహా నుభూతి అనేవి ఆయన్ని శాంతి, మానవజాతి దీపశిఖగా మలిచాయి. తన బోధనల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది యువజనులకు స్ఫూర్తి కలిగించారు. లేవండి, మేల్కొనండి, లక్ష్యాన్ని చేరుకునేంతవరకు నిలిచిపోకండి అనేది యువతకు వివేకానంద ఇచ్చిన స్పష్టమైన పిలుపు. స్తంభనకు గురైన మానసిక స్థితి నుంచి బయటపడేందుకు ప్రపంచానికి ఆయన ఇచ్చిన సందేశం ఇది. భారతదేశం మతం, తత్వశాస్త్రాల పవిత్ర భూమి. ఇక్కడే మహాత్ములు, మహర్షులు ఎందరో జన్మించారు. ఇది త్యాగ భూమి. మన వాస్తవమైన అస్తిత్వాన్ని లేదా హిందూ ఆలోచనా విధానాన్ని మర్చిపోయినందువల్ల మన దేశం వేల సంవత్సరాలుగా బానిసత్వంలో ఉంటూవచ్చిందని స్వామి వివేకానంద అన్నారు. సింహం పిల్ల తన కుటుంబం నుంచి వేరుపడి మేకల మందలో చేరినప్పుడు క్రమేణా అది కూడా ఆ మేకల్లాగే ప్రవర్తించేలా అన్నమాట. తాను సింహాన్ని అనే విషయం దానికి తెలీదు. దాని పరాక్రమం కానీ, దాని స్వభావం కానీ అది మర్చిపోయి ఉంటుంది. సింహం ఆ మేకలమందపై దాడి చేసినప్పుడు సింహం పిల్ల దొరికిపోతుంది. తన బిడ్డ తన సొంత అస్తిత్వాన్నే కోల్పోయిందని సింహం గ్రహిస్తుంది. తర్వాత తన బిడ్డను అది బావి వద్దకు తీసుకెళ్లి దాని వాస్తవరూపాన్ని చూపించి దాని అసలు బలాన్ని అది తెలుసుకునేటట్టు చేస్తుంది. అదేవిధంగా భారతీయ సమాజం కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయిందని వివేకానంద చెప్పారు. అందుకే మనం హిందువులం అని గర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. హిందు ఉంటే జీవన స్థితి, జీవన శైలి అని చెప్పారు. అమెరికాలోని చికాగోలో 1893 సెప్టెంబర్ 11న నిర్వహించిన ప్రపంచ మతాల సదస్సులో స్వామి వివేకానంద సుప్రసిద్ధ ప్రసంగం చేశారు. ‘అన్ని దేశాల పీడితులకు, భూమ్మీది అన్ని మతాలకు ఆశ్రయం ఇచ్చి గౌరవించిన దేశనుంచి నేను వచ్చాను. ఈ ప్రపంచానికి సహనం అనే పాఠాన్ని, సార్వత్రిక ఆమోదాన్ని నేర్పిన మతానికి చెందినవాడిని అని చెప్పుకునేందుకు నేను గర్వపడుతున్నాను. విశ్వజనీన సహనభావాన్ని మేము విశ్వసించడమే కాదు, ప్రపంచంలోని అన్ని మతాలు చెప్పేది సత్యమని మేము అంగీకరిస్తాము’ అని ఆయన చెప్పారు. నా దేశ యువతరానికి ఉక్కునరాలు, ఇనుప కండరాలు, గొప్ప హృదయం, పిడుగులాంటి మనస్సు అవసరముంది. ఈ గుణాలతోనే వీరు దేశాన్ని మార్చగలరు. ప్రపంచరంగంలో భారతీయ హోదాను వెలిగించడంలో యువత పెద్ద పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వసించేవారు. ఒక సందర్భంలో యువత ఫుట్‌బాల్ కూడా ఆడాలని ఆయన చెప్పారు. అందుకనే ప్రధాని నరేంద్రమోదీ ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది. వ్యాయామం ఆరోగ్యానికి, దీర్ఘాయువుకు, బలానిక, సంతోషానికి కూడా దారి తీస్తుంది. ఆరోగ్యకరంగా ఉండటమే మనిషి అంతిమ గమ్యం కావాలి. అన్నిరకాల చర్యలూ ఆరోగ్యం ద్వారా మాత్రమే పూర్తవుతాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు ఆరోగ్యం పట్ల మరింత జాగరూకతతో వ్యవహరించారు. ఆరోగ్యకరమైన శరీరంలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టిందని తేలింది. ఈరోజు ప్రపంచమంతా ఆరోగ్యకరమైన శరీరానికి యోగా అవసరమని గుర్తించింది. ఇది మన ప్రాచీన జీవిత విధానంలో భాగమై ఉంటోంది. భారతీయ సంస్కృతి ప్రాధాన్యత విదేశాలు సాధించిన భౌతిక ప్రగతి భారత్‌కు అవసరమే కానీ మనం దానికోసం యాచించవద్దని స్వామి వివేకానంద విశ్వసించేవారు. మనం పాశ్చాత్య ప్రపంచానికి ఇవ్వాల్సిన దానికంటే ఎంతో ఎక్కువ మనవైపు ఉంది. పాశ్చాత్య ప్రపంచానికి మన అవసరం ఎంతో ఉంది. అలాగే పాశ్చాత్య ప్రపంచం నుంచి శాస్త్రీయ ఒరవడి విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల గురించి ఆయిన తరచూ మాట్లాడేవారు. అదే సమయంలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆయన ఎంతో గౌరవమిచ్చేవారు. ప్రాచ్యదేశాలు ఎన్నటికీ పాశ్చాత్యదేశాలు కాలేవు. అలాగే పాశ్చాత్య దేశాలు కూడా తూర్పు దేశాల్లాగా ఎన్నటికీ కాలేవు అని ఆయన చెప్పేవారు. వివేకానంద విద్యా తాత్వికత, నూతన విద్యావిధానంవ్యక్తిత్వాన్ని నిర్మించే, ఆలోచనలను పెంచే, విజ్ఞానాన్ని విస్తరించే, మన కాళ్లమీద మనం నిలబడేలా చేసే విద్య మనకు కావాలి అని వివేకానంద అన్నారు. విద్య ప్రధాన లక్ష్యం మానవ సృష్టేనని ఆయన భావించారు. సాంప్రదాయిక, ఆధునిక విద్యావ్యవస్థలను ఆయన అద్భుతంగా అనుసంధానించారు. ఆయన విద్యా తాత్వికత ఇప్పటికీ సందర్భోచితమే. సమగ్ర దృక్పథం చేపట్టి శారీరక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక, వృత్తిగత అభివృద్ధితోపాటు వివక్ష లేని విద్యను, అందరికీ అందుబాటులో ఉండే విద్యను ఆయన బలపర్చారు. అలాగే వాస్తవికమైన ఆధునిక దృక్పథంతో టెక్నాలజీ, వాణిజ్యం, పరిశ్రమ, సైన్స్‌కి సంబంధించిన పాశ్చాత్య విద్యకు కూడా ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ప్రధాని నేతృత్పంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం కూడా స్వామి వివేకానంద భావాలకు అనుగుణంగా ఉంటోంది. సైన్సుతో వేదాంతాన్ని సమగ్రపర్చాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ప్రపంచం పిరికిపందల కోసం కాదు. మరింతగా తెలుసుకోవాలని కోరుకుంటున్నవారిదే ప్రపంచం అని ఆయన చెప్పారు. దళితులు, మహిళలు, పేదల అభ్యున్నతి గురించిన భావన, కర్మ ప్రాధాన్యత అనేవి ప్రత్యేకించి స్వామి వివేకానంద ఆలోచనల్లో ఉండేవి. దరిద్రులలో నారాయణుడిని చూశారాయన. మానవ సేవే మాధవసేవ అని భావించారు. దరిద్రనారాయణ భావన ద్వారా ఆయన మానవవాదాన్ని మతంతో అనుసంధించారు. చికాగోలో సర్వమత సదస్సులో కూడా ఆయన విశ్వ సౌభ్రాతృత్వమే అన్ని మతాల సారాంశమన్నారు. ఏ దేశ అభివృద్ధి అయినా దాని యువతపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి యువతలో మేధోపరమైన సదాలోచన జాతికి అవసరం. నేడు ప్రతిరాష్ట్రమూ మాదకద్రవ్యాల సేవనం అనే సామాజిక దురాచారం పట్ల కలతచెందుతోంది. ప్రభుత్వం చట్టాలను తీసుకొస్తోంది కానీ సమాజం తన స్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. -బండారు దత్తాత్రేయ (నేడు స్వామి వివేకానంద 158వ జయంతి) వ్యాసకర్త హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ -
దత్తాత్రేయకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు సోమవారం ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా అదుపు తప్పి హైవే పైనుంచి కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో పర్యటన నిమిత్తం దత్తాత్రేయ ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ముందు మూడు, వెనుక మూడు వాహనాలతో కూడిన కాన్వాయ్‌లో దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు మధ్యలో ఉంది. సరిగ్గా 11 గంటల ప్రాంతంలో ఖైతాపురం గ్రామ శివారులోని టీఎన్ఆర్ వ్యూస్ పరిశ్రమ ముందుకు రాగానే దత్తాత్రేయ కారు ఒక్కసారిగా అదుపుతప్పి హైవే నుంచి ఎడమవైపునకు దూసుకెళ్లింది. అదే వేగంతో ముందున్న చెట్టును ఢీకొట్టి కొంతదూరం వెళ్లి ఆగిపోయింది. ప్రమాద సమయంలో కారులో దత్తాత్రేయతో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదంతో దత్తాత్రేయ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత తేరుకొని కాన్వాయ్‌లోని మరో వాహనంలో వెళ్లిపోయారు. కాపాడిన సీటు బెల్టు దత్తాత్రేయ ప్రయాణిస్తున్న ఏపీ 09 ఏఎస్ 6666 నంబరుగల బుల్లెట్‌ప్రూఫ్ బెంజ్‌కారు ప్రమాదానికి గురైన సమయంలో వేగంగానే ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు. స్టీరింగ్ ఆకస్మాత్తుగా ఎడమవైపు లాగేయడంతో కారు అదుపు తప్పిందని డ్రైవర్ మురళి చెప్పారు. ముందు సీట్లో కూర్చున్న దత్తాత్రేయ సీటుబెల్టు ధరించారు. ఇది ఆయనను కాపాడింది. సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు కిందికి దూసుకెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టడంతో పల్టీలు కొట్టకుండా నేరుగా ముందుకు వెళ్లి ఆగిపోయింది. దాంతో పెను ప్రమాదం తప్పింది. దేవుడి ఆశీస్సులతోనే... దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలతోనే ప్రమాదం తప్పిందని దత్తాత్రేయ అన్నారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానన్నారు. ప్రమాదం విషయం తెలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్లు, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీ, ఇతర ప్రముఖులు ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకున్నారని చెప్పారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
భారత ఐక్యతా వారధి సర్దార్ పటేల్
సర్దార్ వల్లభాయ్ పటేల్ గొప్ప దేశభక్తుడు, రాజనీతి జ్ఞుడు. దేశ సమగ్రత, సమైక్య తపట్ల దృఢమైన సంకల్పం, ఆయన దూరదృష్టి, చాతుర్యం దేశాన్ని తొలినాళ్లలో పలు విపత్కర సమస్యలని ఎదుర్కొని ముందుకు నడిపించడానికి ఇతోధికంగా తోడ్పడ్డాయి. ప్రముఖంగా రెండు ఘట నలను ప్రస్తావిస్తాను. గుజరాత్‌లోని జాం నగర్ పూర్వ రాజైన జాం సాహిబ్‌కు సంబంధించినది. అధికార బది లీకి ఇంకా రెండు నెలలు గడువు ఉండగా,ఈలోపే కతియవార్ రాష్ట్రాలన్నింటినీ కలిపి పాకిస్తాన్ సహా యంతో ఒక స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలోని తోటి సంస్థానాధీశులను కలవబోతున్నాడని తెలుసుకొన్న పటేల్ ఇక సమయాన్ని వృథాచేయకుండా జాం సాహిబ్ సోదరుడైన కల్నల్ హిమ్మత్ సింగ్ ద్వారా వారిని తన ఇంటికి విందుకి తీసుకురావాలని కోరాడు. భోజనసందర్భంలో పటేల్ తన ఆత్మీయతతో, ప్రేమతో జాంసాహిబ్, మహారాణి వారి హృదయాలని గెలుచుకున్నాడు. దీంతో జాంసాహిబ్ స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేయాలనే ప్రణాళికను విరమించుకున్నాడు. మరో సంఘటన షేక్ అబ్దుల్లాకు సంబంధించినది. రాజ్యాంగ పరిషత్తులో ఆర్టికల్ 370ని చర్చిస్తున్న సమయంలో అసహనంతో ఉన్న షేక్ అబ్దుల్లా తన స్థానం నుండి లేచి, ‘నేను తిరిగి కశ్మీరుకు వెళుతున్నాను’ అని సభలో ప్రకటించాడు. దీంతో ప్రధాని నెహ్రూ లేని కారణంగా అక్కడే ఉన్న పటేల్.. కశ్మీర్ వెళ్లడానికి రైలు పెట్టెలో కూర్చున్న అబ్దుల్లాకు ‘ఈరోజు సభను వదిలివెళ్లగలవు కానీ ఢిల్లీని మాత్రం విడిచి వెళ్ళలేవు’ అనే సందేశాన్ని తెలియజేశారు. దాని పరిణామాలను గ్రహించిన షేక్ అబ్దుల్లా రైలు నుంచి దిగి తన ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. అంతటి గట్టి సందేశాన్ని నిర్భీతితో ఇవ్వగల ధీశాలి పటేల్. జాతిపిత మహాత్మా గాంధీ ఆలోచనలను, భావాలను సరైన దృష్టికోణం నుండి అర్థం చేసుకున్న రాజకీయ నాయకులలో సర్దార్ పటేల్ ఒకరు. గాంధీజీ స్వరాజ్యం నుంచి సురాజ్యం గురించి చెబితే, సర్దార్ పటేల్ గారు స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్పు చేసే సుపరిపాలనకు, సంస్కరణకు దారితీసిన ఆద్యుడు. వల్లభాయ్ పటేల్ 1917 నవంబర్‌లో మొదటిసారి గాంధీజీతో పరిచయం ఏర్పడ్డప్పుడు ఆ సమయంలో వారి వేషధారణ హ్యాట్, సూట్, బూట్, ఇంగ్లిష్తో పాశ్చాత్యమైనది. కానీ గాంధీజీ సంపర్కంతో పూర్తిగా పరివర్తన చెంది ఖాదీ, ధోతి, కుర్తా, చెప్పులు స్వీకరించి స్వదేశీ వస్త్రధారణలోకి వచ్చారు. గాంధీజీ సత్య, అహింస సిద్ధాం తాల ప్రభావంతో, పటేల్ విదేశీ వస్తువులని, దుస్తుల్ని బహిష్కరించినారు. జాతీయ వ్యవహారాలలో అత్యంత కఠినంగా వ్యవహరించే పటేల్ వ్యక్తిగత విషయాలలో మాత్రం మృదువుగా ఉండే వారు. పటేల్‌తో సమావేశమై సంభాషించిన తర్వాత.. మన దేశ భవిష్యత్తు సరైన నాయకత్వం చేతుల్లో సురక్షితంగా ఉందని భావిస్తున్నాను అని జంషెడ్ జీ టాటా అన్నారు. భారత్ తొలి హోంమంత్రిగా వ్యవహరించే రోజుల్లో తన ఇంటికి ఔపచారికంగా నలభై–యాభై మంది ఐసీఎస్ అధికారులను పిలిపించుకొని వారితో దేశ ప్రజల ఆకాంక్షలకు అవసరాలకు అనుగుణంగా సేవా భావనతో, మెలగాల్సి ఉంటుందనీ, మంత్రులు ఐదేళ్లకు వస్తుంటారు పోతుం టారు కానీ మీరు ఈ వ్యవస్థలో దీర్ఘకాలంగా పని చేసేవారు, అందుకే స్వతంత్రంగా నియమావళి ప్రకారం మెలగాలనీ కోరారు. 565 పైగా సంస్థానాలను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడం వారి దృఢమైన సంకల్ప శక్తికి, నాయకత్వ సామర్థ్యాలకు నిదర్శనాలు. జూనాగఢ్ సంస్థానం సౌరాష్ట్రకు సమీపంలో ఉన్న ఒక చిన్న రాచరిక రాజ్యం. దాని నవాబు పాకిస్తాన్లో విలీనం చేస్తామని ప్రకటించినప్పుడు అత్యధిక ప్రజలు భారత్‌లోనే విలీనం కావాలని కోరుకున్నారు. అపుడు పటేల్ భారత సైన్యాన్ని జూనాగఢ్ సంస్థానానికి పంపి 1947 నవంబర్ 9న జూనాగఢ్‌ను భారతదేశంలో విలీనం చేశారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాం నవాబు తమ సంస్థానానికి సొంత కరెన్సీ, రైల్వే సైనిక వ్యవస్థను కలిగి ఉండడంతో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా ప్రకటిం చుకోవాలనే వాంఛ. అతను విలీనం కాకుండా భారత యూనియన్‌తో సంబంధాలు మాత్రమే కోరుకుంటున్నాడు. ఈ విషయాన్ని పటేల్ గ్రహించి నిజాంకు సమయం ఇవ్వడం ఉత్తమమని భావించారు. లార్డ్ మౌంట్‌బాటన్, నె్రçహూ సైతం నిజాంకు సాన్నిహిత్యంగా ఉండేవారు. వారు పటేల్‌తో చర్చలు జరిపి హైదరాబాద్ సంస్థానంపై సైనికచర్య ఉండవద్దని నిర్ణయించారు. దీన్ని ఆసరాగా తీసుకున్న నిజాం నవాబు ఒకవైపు విదేశాలతో సంబంధాలు నెరపుతూ మరోవైపు ఆయుధాలు కొనుగోలు చేస్తూ తన సైనిక శక్తిని పెంచుకొన్నారు. సంస్థానంలో హిందూ ప్రజలపై పైశాచిక దాడులను చేసి, మతాంతరీకరణలను ప్రోత్సహించారు. ఇంకోపక్కన ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌ను స్థాపిం పజేశారు. ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను పెంపొందింప జేశారు. దీన్నంతటినీ పటేల్ బాగా గమనిస్తూ హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ జనరల్‌గా మున్షిని నియమించారు. ఆయన హైదరాబాద్ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సమాచారాన్ని ఇచ్చేవారు. ఆనాటి వైస్రాయి లార్డ్ మౌంట్ బాటన్ పదవీ కాలం ముగిసిన వెంటనే ఇక పాత ఒప్పం దాలు చెల్లిపోయాయని భావించిన సర్దార్ పటేల్ సాహసంతో ఆపరేషన్ పోలో అనే సైనిక చర్యను చేపట్టి రజాకార్లను అంతం చేసి హైదరాబాద్ సంస్థానాన్ని 17 సెప్టెం బర్ 1948 న భారత యూనియన్‌లో విలీనం చేసి మువ్వన్నెల భారత పతాకాన్ని ఎగరవేయించారు. అలాగే గుజరాత్‌లోని ఖేడా, బార్డోలీ ప్రాంతంలో గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, అపూర్వమైన రైతాంగ ఉద్యమం ఆయనకు చరిత్రలో చిరస్థానం కల్పిం చాయి. భారత ప్రభుత్వం 1991లో సర్దార్ పటేల్‌ను ‘భారత రత్న’తో సత్కరించింది. ఆయన జన్మదినాన్ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటాము, ఈ భావాం జలితో ఆయనకు నివాళులు అర్పిస్తూ వారికి శత కోటి వందనాలు సమర్పించుకుందాం. -బండారు దత్తాత్రేయ వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ప్రదేశ్ -
సంస్కృతీ పథ నిర్దేశకుడు దీన్‌దయాళ్
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను పుణికిపుచ్చుకొన్న పథ నిర్దేశకుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఉత్తరప్రదేశ్‌లోని మథుర జిల్లా నాగుల చంద్రభాన్ గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంబంలో రామ్ పారి, భగవతి ప్రసాద్‌లకు జన్మించారు. చిరుప్రాయంలోనే తల్లితండ్రులను కోల్పోయి బంధువుల దగ్గర పెరిగారు. చదువులో చురుకుగా ఉండేవారు. సర్వ బోర్డు పరీక్షలో ఆయన ప్రథముడు. కాన్పూర్‌లో బీఏ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. 1937లో ఆర్ఎస్ఎస్తో పరిచయమైంది. సంఘ నిర్మాత డా. కేశవరావ్ బలిరావ్ హెగ్డేవార్‌తో కలిశారు. 1939లో లక్షిపూర్లో సంఘ్ ప్రచారక్‌గా నియమితులయ్యారు. 1945లో సంపూర్ణ ఉత్తరప్రదేశ్ ప్రచారక్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మాధవ్ సదాశివ్ గోల్వల్కర్.. దీన్‌దయాళ్ కార్య నిబద్ధతను గ్రహించారు. 1947లో స్వాతంత్య్రం లభించిన తరువాత దేశ విభజనలో కాశ్మీర్ లో జరుగుతున్న అల్లకల్లోలం, హిందువుల ఊచకోతలు మానభంగాలు, దోపిడీలు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో నెహ్రూ ప్రభుత్వం అసహాయత, నిర్లిప్తతతో అనేకమంది నిరాశకు గురయ్యారు. భారత ప్రభుత్వం కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తితో రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 1950లో నెహ్రూ లియాఖత్ అలీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి వ్యతిరేకంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. గురూజీ గోల్వాల్క ర్ను సంప్రదించి 1951లో భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు.. కేవలం కాంగ్రెస్ పార్టీని విమర్శించడమే కాకుండా ప్రత్యామ్నాయ పరిష్కారాలతో, స్పష్టమైన సిద్ధాంతాలతో సమృద్ధ భారత నిర్మాణానికీ ఈ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. తర్వాత దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ జనసంఘ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. రష్యాతో పాటు అనేక పాశ్చాత్య దేశాల్లో నూతన ప్రజాస్వామిక విలువలతో ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటిని లోతుగా అధ్యయనం చేసి భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్. అదే ఏకాత్మ మానవతా వాదం. చదువులేని వారు, దరిద్రులు, దీన హీన స్థితిలో ఉన్నవారు, నిరుపేద వ్యక్తులే నారాయణులు అని ‘దరిద్రో దేవోభవ’ అని వారు చెప్పారు. సాధారణ జీవితం.. అసాధారణ చింతన అన్నదే ఆయన ఆలోచన. పేదలు, దీనుల పట్ల దళితుల పట్ల మమత్వ భావం ఉండాలనీ, వారికి సముచిత స్థానం కల్పించాలని కూడా చెప్పారు. సిద్ధాంతాలను ఆచరించడంలో నిబద్ధతతో ఉండేవారు. ఉదాహరణకు 1953లో రాజస్తాన్‌లో 9 మంది ఎమ్మెల్యేలు జనసంఘ్ తరపున గెలిచారు. అప్పుడు జమిందారీ విధానం రద్దు చేయమని చట్టం తెస్తున్న సమయంలో 6 మంది ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకించడంతో పార్టీ సిద్ధాం తానికి వ్యతిరేకం అని వారిని దీన్‌దయాళ్ బహిష్కరిం చారు. 1967 ఎన్నికల్లో భారతీయ జనసంఘ్‌కు 9.33 శాతం ఓట్లు సంపాదించి భారత రాజకీయాల్లో కాంగ్రెస్ తర్వాతి స్థానాన్ని సంపాదించారు. సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా కృపాలాని లాంటి వారితో మంచి సంబంధాలు కొనసాగించి పార్టీకి విస్తృత స్థాయిని కల్పించారు. 1963లో కేరళలోని కాలికట్ సమావేశంలో పార్టీ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 1968 ఫిబ్రవరి 11న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్లో ఆయన హత్యకు గురయ్యారు. తన సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆయనతో పాటు కలిసి పనిచేసిన వారిలో బావురావు దేవరసు, బాలరాజ్ మండల్, అటల్ బిహారి వాజ్‌పేయ్, లాల్‌కృష్ణ అడ్వాణీ నానాదేశ్‌ముఖ్, సుందర్ సింగ్ బండారు, జగన్నాథరావు జోషి, మురళీ మనోహర్ జోషి, జేపీ మాథుర్ ముఖ్యులు. ఆనాడు దీన్‌దయాళ్ నాటిన చిన్న బీజం ఈ రోజు మహా వటవృక్షంగా మారింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే అటల్ బిహారి వాజ్‌పేయ్ 1998లో మొదటిసారి కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా ఎంపికయ్యారు. ఆనాడు ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే వాజ్‌పేయ్ ఆర్థిక సంస్కరణలు చేసి అణుబాంబు పరీక్ష కూడా నిర్వహించారు. అదే సిద్ధాంత స్ఫూర్తితో ప్రస్తుతం నరేంద్ర మోదీ తొలిసారిగా సంపూర్ణ మెజారిటీతో ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టి పలు సంస్కరణలు వేగవంతం చేస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ సిద్ధాంతాలను, ఆదర్శాలను అంకితభావంతో పాటించడమే వారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. (పండిట్ దీన్‌దయాళ్ 104వ జయంతి సందర్భంగా) వ్యాసకర్త: బండారు దత్తాత్రేయ , హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ -
మానవతకు ఇది రక్షాబంధన్!
సందర్భం భారతీయులు నిర్వహించుకునే పండుగల్లో పౌరాణిక, చారిత్రక నేపథ్యం కలిగిన పండుగ రక్షాబంధన్. రాక్షస సంహారానికి సన్నద్ధుడైన దేవేంద్రునికి శచీదేవి రక్ష కట్టి విజయ ప్రాప్తికోసం ప్రార్థిం చిందని పౌరాణిక గాథ. కాలక్రమంలో స్త్రీ పురుషుల మధ్య అన్నా చెల్లెళ్ల అనురాగాన్ని, భరతమాత సంతానమైన మనం అందరం అన్నదమ్ములమనే సహోదర భావాన్ని సమాజం అంతటికీ అలవర్చే సంస్కారమే రక్షాబంధన్ పండుగ అయింది. కొన్ని ప్రాంతాలకు కుటుంబాలకు పరిమితమై కొందరి వేడుకగా సాగుతున్న రక్షాబంధన్‌ని ఇవాళ సర్వే సర్వత్రా సామాజిక ఉత్సవంగా జరపాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్త్రీలకు గౌరవ మర్యాదలు లభించే తావుల్లో దేవతలు సంతసిస్తారు అని చాటి చెప్పిన వేదభూమి మనది. పౌరాణికంగా, చారిత్రకంగా, రాజకీయంగా మహిళలకు సమున్నత స్థానం కల్పించడం భారతీయ సంస్కృతిలో అడుగడుగునా కనిపిస్తుంది. పార్వతీ పరమేశ్వరులు, సీతారాములు అని మహిళకు ప్రథమ స్థానం కల్పించిన పౌరాణిక నేపథ్యం మనది. రాణి రుద్రమ దేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి చెన్నమ్మ వంటి మహిళాపాలకులు మన దేశ చరిత్రలో కనిపిస్తారు. జనరంజకమైన పాలనతో వారు ప్రజల మన్నన చూరగొన్నారు. ఆధునిక రాజకీయాల్లో సైతం భారతీయ మహిళకు సముచిత స్థానమే దక్కింది. భారత్ స్వతంత్ర దేశంగా అవతరిస్తూ, ప్రజాస్వామిక వ్యవస్థను స్వీకరించిన మరుక్షణమే ఎలాంటి శషభిషలు లేకుండా సార్వజనిక ఓటు హక్కుతో మహిళలకు కూడా సమాన స్థాయి కల్పిం చడం చరిత్ర. ఎలాంటి రిజర్వేషన్లు లేకుండానే ప్రతిభావంతులైన మహిళలు జాతీయ, ప్రాంతీయ స్థాయిల్లో రాజకీయ పదవులు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి మహిళా లోకానికి వన్నెతేవడం భారతీయతకు గర్వకారణం. చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించి పాలన వ్యవస్థలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ప్రయత్నాన్ని అందరూ స్వాగతించడం హర్షణీయం. వర్తకం, వాణిజ్యం, వ్యవసాయం, పరిశోధన, విద్యా, వైద్య రంగాల నుండి రక్షణ రంగందాకా భారతీయ మహిళలు ప్రవేశించి తమ సత్తా చాటని రంగమే లేదనడం అతిశయోక్తికాదు. గర్వించదగిన ఇంతటి ఘన చరిత్ర గలిగిన భరత భూమిలో నేడు మహిళల ప్రాణ, మాన, మర్యాదలు ప్రమాదంలో పడడం విషాదం. తమ మానప్రాణాలకు రక్షణ కరువైందని ఘోషిస్తున్న మహిళల ఆక్రందన మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నది. మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రభుత్వాలు తగిన చట్టాలు చేస్తున్నాయి. ‘దిశ’ వంటి చట్టాలు, ప్రత్యేక మహిళా పోలీసు స్టేషన్లు, ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు జరుగుతోంది. ప్రభుత్వాల ప్రయత్నాలు, ప్రత్యేక చట్టాలు ముమ్మరం అవుతున్నా మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు తగ్గు ముఖం పట్టకపోవడం విషాదం. మన సోదరీమణులకు భద్రత కల్పించవలసిన బాధ్యతను మనమే స్వీకరించాలి. ప్రతి పురుషుడూ మరో మహిళ చేతికి రక్ష కట్టి రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాలి. చీమలో, బ్రహ్మలో శివ కేశవులలో వెలిగే పరబ్రహ్మ ఒకటే అని ఎలుగెత్తి చాటిన సంస్కృతి మనది. సర్వధర్మ సమభావన వెల్లి విరియాల్సిన దేశంలో కుల వివక్ష, అంటరానితనం వేళ్లూను కోవడం విషాదం. రక్షాబంధన్ సందర్భంగా కట్టే రక్ష అన్నిరకాల వివక్షను అంతమొందించే వజ్రాయుధం కావాలి. రాత్రనక, పగలనక, ఎండ వానలను సైతం లెక్క చేయక దేశ సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తూ విదేశీ దురాక్రమణకారుల ప్రయత్నాలను తిప్పి కొడుతున్న మన వీర జవానులకు రక్షా బంధన్ జేజేలు తెలుపుదాం. వారికి రక్షలు పంపించి వీరులారా దేశం అంతా మీ వెనక ఉందని మద్దతు తెల్పుదాం. 1994లో నేను లోక్‌సభ సభ్యునిగా ఉన్నప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను విముక్తం చేస్తామంటూ నాటి ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో భారత పార్లమెంటు ముందుకు వచ్చిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆనందోత్సాహాలతో ఆ సందర్భంగా తెల్పిన మా మద్దతుకు సంకేతంగా చరిచిన బల్లల చప్పుడు నా చెవుల్లో ఇప్పటికీ మార్మోగుతోంది. చరిత్రాత్మకమైన ఆ తీర్మానం నేటికీ కాగితాలమీదనే ఉంది. తీర్మానసారాన్ని సాకారం చేయడానికి నేటి మన ప్రియతమ ప్రధాని మోదీ సాగిస్తున్న ప్రయత్నాలను స్వాగతిద్దాం. భారత దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వాల కోసం భారత జాతీయులమైన మనం అన్న దమ్ముల్లా కలిసి కట్టుగా కృషి చేయాలి. అలా చేస్తామని ప్రతిజ్ఞాపూర్వకంగా పరస్పరం మనం అందరం రక్షలు కట్టుకుందాం. ప్రపంచం అంతటా కరోనా ప్రబలిన వేళ భారతీయ సంస్కారమైన నమస్కారం విలువను ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నది. ఔషధగుణాలున్న శొంఠి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు వంటి భారతీయ వంటింటి దినుసుల సాయంతో పలువురు కరోనాను ఓడించినట్లు తెలుస్తున్న అనుభవాలతో భారతీయ ఆహారపు అలవాట్ల పట్ల ప్రపంచ ప్రజ లకు ఆసక్తి పెరిగింది. రోగనిరోధక శక్తిని పెంచే దివ్య ఔషధంగా భారతీయ యోగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి ఎదుట ప్రస్తావించి భారతీయ యోగాను ప్రపంచ దేశాలకు చేర్చిన మన ప్రధాని మోదీని ప్రపంచ దేశాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. కరోనా విపత్తు నుండి దేశ ప్రజ లను రక్షించడానికి కఠోర దీక్షతో పనిచేస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసు వారికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపి మన మద్దతు ప్రకటిద్దాం. ప్రభుత్వాల, వైద్యఆరోగ్య అధికారుల సూచనల ప్రకారం పరిశుభ్రతను పాటిస్తూ, మాస్కులు ధరిం చడం, సార్వజనిక స్థలాల్లో ఎడం పాటించడం వంటి జాగ్రత్తలను పాటించి కరోనాను ఓడిద్దాం. ఈ శ్రావణ పూర్ణిమ సందర్భంగా వచ్చే రక్షాబంధన్‌ను సామాజిక ప్రజాఉత్సవంగా నిర్వహించుకుందాం. వివక్షను అంతం చేసి మానవతా విలువల పరిరక్షణకు ముందు నిలిచి ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయం అవుదాం. భారతదేశంలో మహిళా భద్రతకు భరోసా కల్పిద్దాం. మాతృభూమి రక్షణలో, భారతీయ సంస్కృతి పరిరక్షణలో మనం అంతా ఏకాత్మ భావనతో ఒక్కటిగా నిలబడి నినదిద్దాం! (రేపు రక్షాబంధన్ సందర్భంగా) వ్యాసకర్త గవర్నర్, హిమాచల్‌ప్రదేశ్ బండారు దత్తాత్రేయ -
అందరి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రిగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఎవ్వరికీ భయపడేవారు కాదు. మంత్రులు, అధికా రులు, ఇతరుల మీద ఆధా రపడి రాజకీయ నిర్ణయం చేసే వారు. ఉదాహరణకు 2004లో వారు మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. హిమాయత్‌నగర్ నియోజకవర్గంలోని నారాయణగూడ వద్ద డిస్టిల్లరీ చాలా సంవత్సరాల నుండి మూతబడి ఉన్నది. ఒకవైపు భూమిని కొందరు ఆక్రమించుకుంటున్నారు. ఆ స్థలంలో స్థానిక ప్రజలు ఒక పార్కును అభివృద్ధి చేశారు. నేను కేంద్రమంత్రిగా పర్యటిస్తున్నప్పుడు ఆ పార్కును స్థానికులు అభివృద్ధి చేయమని కోరారు. 2002లోనే నేను అప్పటి ముఖ్యమంత్రికి లేఖ ద్వారా దీన్ని విన్నవించాను. అయినా 2003లో ప్రభుత్వం ఆ భూమిని వేలం వేయాలని నిర్ణ యించింది. ఆ నిర్ణయాన్ని వ్యతి రేకించి నిర్ణయాన్ని అబేయన్సు (నిలుపుదల)లో పెట్టించడం జరిగింది. 2004 ఎన్నికల అనంతరం రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఏర్పడింది. ఆ ప్రాంత నూతన శాసన సభ్యులు జి.కిషన్‌రెడ్డి ‘ఆ పార్కును అభివృద్ధి చేయ మని నేను ముఖ్యమంత్రి గారికి లేఖ రాశాను. మీరూ మాట్లాడితే మీ మాట వింటారని’ అన్నారు. అప్పుడు నేను వైఎస్సార్ గారికి ఫోన్ చేసినప్పుడు, బాగున్నారా సర్ అని నా యోగక్షేమాలు అడిగారు. ఆ పార్క్ ఎలాగైనా అభివృద్ధి చేయాలని కోరాను. ఆ ఫైల్ ప్రాసెస్ అయ్యిందనీ, దానిని మీరు మళ్లీ అబేయన్సులో పెట్టడానికి సంతకం చేస్తున్నా రని తెలిసిందని అంటే, వారు ‘గత ముఖ్యమంత్రి మీ మిత్రులే గదా’ అని అడిగారు. ‘మీరు కూడా పాత ప్రభుత్వ బాటలోనే నడుస్తారా?’ అని ప్రశ్నించాను. వారు నవ్వుతూ, మీరు చెప్పారు కదా, నేను తప్పకుండా చేస్తాననీ, నెల తరువాత మీరే మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయండనీ అన్నారు. నేను ఇప్పుడు పార్ల మెంట్ సభ్యుడిని కాదని బదులివ్వగా, మీరే శంకుస్థాపన చేయాలి, మీకు జీఓ కాపీ పంపుతానని హామీ ఇచ్చి, వెంటనే తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆవిధంగా రాజ కీయాలకు అతీతంగా నిర్ణయాలు చేసేవారు. వ్యక్తిగతంగా ఆత్మీయ మైన సంబంధం నెలకొల్పుకునే వారు. వై.ఎస్. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రాణ హిత నది గోదావరి నదిలో కలవక ముందే ఎత్తి పోతల ద్వారా తెలంగాణలో మంచినీటికి, ఐదున్నర లక్షల ఎకరాల సాగునీటికి ఉపయోగించాలని తలపెట్టి ఇందుకోసం పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేయడానికి జీవో 557 విడుదల చేసి, ఖర్చుల కోసం ఒక కోటి 66 లక్షల 40 వేల రూపాయలు విడుదల చేయడం జరి గింది. ఈ ఉత్తర్వులు ప్రాంతీయ విభే దాలకు ఆజ్యం పోసే విధంగా ఉన్నా యని నాటి మాజీ కేంద్రమంత్రి సీహెచ్. విద్యాసాగర్ రావు (ప్రస్తుత మాజీ గవర్నర్) నాకు ఫోన్ చేశారు. నేను వెంటనే ప్రభుత్వానికి లేఖ సిద్ధం చేయమనీ, బీజేపీ ప్రతినిధి బృందంతో ముఖ్యమం త్రిని కలుద్దామనీ బదు లిచ్చాను. వెంటనే ముఖ్యమంత్రి అపా యింట్మెంట్ అడ గ్గానే కేటాయిం చారు. మేము వెళ్ళగానే లేచి, పెద్దవారు వచ్చారని ఆత్మీయంగా మమ్మల్ని ఆహ్వానించి, మెమొరాండం మొత్తం చదివారు. ‘అవును నిజమే కదా’ అని కొంత ఆశ్చ ర్యానికి గురై, ఎలా జీవో జారీ చేశారని ఇరిగేషన్ కార్యదర్శి శర్మ ఐఏఎస్ గారికి ఫోన్ చేశారు. బయట మీడియా మిత్రులకు ఏమి చెప్పమం టారని అడిగితే, మీరు కోరినట్లే ప్రభుత్వం అంగీకరించిందనీ, ఐదున్నర లక్షల ఎకరాలకు బదులు పది లక్షల ఎకరాలకు సాగునీరు కొరకు, హైదరాబాద్ జంటనగరాలకు తాగునీటికి కేటాయించే విధంగా రెండు రోజుల్లో సవరించిన జీవో విడుదలవుతుందని మాట ఇచ్చినట్లు చెప్ప మన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. ఆ విధంగా పార్టీలకు అతీతంగా ప్రజాను కూల నిర్ణయాలు త్వరితగతిన తీసుకునేవారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రికి అనేక సమస్యల మీద లేఖలు వ్రాయడం ప్రారం భించాను. ఆ లేఖలకు ‘ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ’ అనే పేరు పెట్టాను. హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ విషయంలో రంగారెడ్డి జిల్లాలో అనేకమంది రైతుల భూములు కారు చవకగా తీసుకొని నష్టపరిహారం ఎకరానికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేవారు. దానిని రాజశేఖరరెడ్డి ఎకరానికి ఎనిమిది లక్షలు చేశారు. భూమికి భూమి ఇవ్వాలని ఉద్యమించాము. అప్పుడు లేఖలు 100 దాటాయి. ఒకరోజు రైతు సమస్యల మీద ఆయన్ని కలవడానికి వారి నివాసానికి వెళ్ళాము. ముఖ్య మంత్రి బయటకు వస్తూనే మమ్మల్ని చూసి రండి రండి అని మా వద్దకు వచ్చి మెమొరాండం తీసు కున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వట్టి వసంత కుమార్, బండారు దత్తాత్రేయ గారు మీకు బహిరంగ లేఖలు రాస్తూ మిమ్మల్ని విమర్శిస్తున్నా రని అన్నారు. దానికి వైఎస్సార్ చిరునవ్వుతో వారి బాధ్యత వారు నెరవేరుస్తున్నారు. వారు నాకు ఏ లేఖలు వ్రాసినా నేను వాటిని ‘ప్రేమ లేఖలు’గానే భావిస్తానని అదే చిరునవ్వుతో బదులిచ్చారు. అలా వారు ఏ విషయమైనా స్పోర్టివ్‌గానే తీసుకునేవారు. ప్రజాహితం కోసం సహృదయంతో రాజకీయాలకతీతంగా నిర్ణయం తీసుకునేవారు. వ్యాసకర్త: బండారు దత్తాత్రేయ, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ -
అయ్యా నిజం చెప్పమంటారా...!
సాక్షి, న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో తనకున్న అనుభవాలను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. ‘పీవీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నాను. అనేకసార్లు వివిధ ప్రజా సమస్యల మీద వారికి పలు వినతిపత్రాలు ఇచ్చాను. ఏపీలో పొగాకు రైతుల సమస్య తీవ్రంగా ఉండేది. ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేయకపోవడంతో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులం.. టీడీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర రావు, సీపీఎం నుంచి భీంరెడ్డి నర్సింహా రెడ్డి, సీపీఐ నుంచి ధర్మభిక్షం, బీజేపీ నుంచి నేను పీవీని కలిశాం. ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేసి రష్యాకు ఎగుమతి చేయాలని వినతి పత్రం ఇచ్చాం. ఆయన మొత్తం చదివి మమ్మల్ని చూసి.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. మీరు మంత్రిగా పనిచేశారు. మీకు పరిస్థితులు బాగా తెలుసు. దత్తాత్రేయకు మంత్రిగా అనుభవం లేదు గనుక వారికి తెలియక పోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదుగదా అన్నారు. అప్పుడు నేను ‘మీరు తెలుగు బిడ్డ. మీరు తలుచుకుంటే ఎందుకు వీలుకాదని’అన్నాను. దానికి వారు చిరునవ్వుతో ‘అయ్యా నిజం చెప్పమంటారా? అంటూ.. ఇంతకు ముందు మనం ఎగుమతిచేసిన పొగాకు డబ్బే రష్యా నేటి వరకు మనకు ఇవ్వలేదు. ఇప్పుడు అది పతనావస్థలో ఉంది. మళ్లీ అక్కడకు పొగాకు పంపితే మనకు డబ్బులు రావు. అందుకే ఇది సాధ్యం కాదని సమాధానమిచ్చారు. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి నిక్కచ్చిగా చెప్పే పీవీ.. స్థితప్రజ్ఞులు. సాధారణంగా వారి జవాబు మౌనం. కానీ దాన్ని వీడి మాకు వాస్తవాన్ని విశదీకరించారు. ప్రధాని కారుకు అడ్డం పడినా.... ఒకసారి ప్రధాన మంత్రిగా పీవీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను, జి.పుల్లారెడ్డితో కూడిన ప్రతినిధి బృందం అల్ కబీర్ సంస్థను నిషేధించాలని వినతిపత్రం ఇవ్వడానికి రాజ్ భవ¯Œ కు చేరుకున్నాం. మాకు అనుమతి లేదని భద్రతా సిబ్బంది గేటు వద్దనే ఆపారు. అప్పుడు ప్రధాని విమానాశ్రయానికి బయలుదేరి వెళుతూ.. వారు రెండో కారులో ముందు వరుసలో కూర్చొని ఉన్నారు. నేను వారి కారుకు అడ్డంగా వెళ్లాను. ప్రధాని కారుకు అడ్డుపడినపుడు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపే అవకాశం ఉన్నప్పటికీ నేను ముందుకు కదిలాను. పీవీ నన్ను గమనించి.. కారును ఆపి నన్ను తన కారులో కూర్చోబెట్టుకున్నారు. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అప్పాయింట్మెంట్ దొరకలేదేమోనని నన్ను సమాధానపరిచి, కారులోనే ఎయిర్పోర్ట్ వరకు తోడ్కొని వెళ్లి సమస్యను సాంతం విని, దానిపై చర్చించి నానుండి మెమొరాండం తీసుకున్నారు. 1998 లో నేను తొలిసారి అటల్ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వంలో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ప్రమాణం చేసిన తరువాత మర్యాదపూర్వకంగా నేను పీవీని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లా.. వారు పుస్తక పఠనం చేస్తున్నారు. నన్ను ఆప్యాయంగా పలకరించి.. మీరు చాలా కష్టపడి నేడు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మీ సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధి లో ‘శ్రీ రామానంద తీర్ధ‘సంస్థ ఉంది. దానికి చెందిన భూమిని కొందరు ఆక్రమిస్తున్నారు. భూమిని రక్షించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆ వివరాలకోసం మాజీ మంత్రి కేవీ కేశవులు కలుస్తారని తెలిపారు. నేను వెంటనే ఆ స్థలాన్ని పరిశీలించి అక్రమ కట్టడాలను తొలగింపజేసి ప్రహరీని కట్టే ఏర్పాటు చేయించాను. తరువాత పీవీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ.. మాట నిలుపుకున్నారు దత్తాత్రేయ .. అని ప్రశంసించారు. పీవీ మేధావి. బహు భాషా కోవిదులు, రాజకీయ దురంధరుడు, దేశం విపత్కర సమయంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలు తెచ్చి గాడిన పెట్టిన తొలి ప్రధాని. తెలుగు బిడ్డ, తెలంగాణవాది. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా ప్రత్యేక ముద్ర వేశారు..’అని బండారు దత్తాత్రేయ తన అనుభవాలను పంచుకున్నారు. -
దత్తన్నకు జన్మదిన శుభాకాంక్షలు
సిమ్లా : హైదరాబాద్ నగరంలోని అతి సామన్య పేద కుటుంబంలో జన్మించిన వ్యక్తి.. నేడు ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా సేవలు అందించే స్థాయికి ఎదిగారు. ఆయనే హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ బండారు దత్తాత్రేయ. నేడు దత్తాత్రేయ 74వ జన్మదినం సందర్భంగా ఆ రాష్ట్ర రాజ్‌భవన్ ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 1946 జూన్ 12 న హైదరాబాద్ గౌలిగూడలోని అతి సామాన్య పేద కుటుంబంలో జన్మించిన దత్తాత్రేయ.. చిన్నతనంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కొని బతుకు ప్రయాణం సాగించారు. ఉల్లిగడ్డలు అమ్ముకొనే తన తల్లికి సాయం చేస్తూనే రాత్రిపూట విద్యనభ్యసించారు. ఆ తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో ఏర్పడ్డ బంధం ఆయనను దేశభక్తి వైపు తీసుకెళ్లడమే కాకుండా క్రమశిక్షణతో జీవించేలా చేసింది. పేదప్రజల సమస్యల పట్ల అయన అంతులేని పోరాటాలకు, దివిసీమ ఉప్పెన లాంటి విపత్కర పరిస్థితులలో చేసిన సహాయానికి ఆర్ఎస్ఎస్ నేర్పించిన పాఠాలే ప్రేరణ అయ్యాయి. రాజకీయాలకు సంబంధించి.. మొదటి సారి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అయినా నిరంతరం ప్రజల్లో ఉంటూ.. తన ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ తర్వాత ఎంపీగా గెలుపొందారు. నాటి దివంగత వాజ్‌పేయి, ఇప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేశారు. మరోవైపు అలయ్- బలయ్ పేరుతో అయన నిర్వహించే కార్యక్రమం తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతోంది. ఎమర్జెన్సీ కాలంలో దత్తాత్రేయ మారువేషంలో తెలంగాణ లోని బెల్లంపల్లి వద్ద పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నప్పటి చిత్రాలు -
బండారు దత్తాత్రేయకు స్వల్ప అస్వస్థత
సాక్షి, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం హైదర్‌గూడలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం గురించి అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత మాట్లాడుతూ.. దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్‌రావు ఆయనకు దగ్గరుండి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. రొటీన్ చెక్అప్లో భాగంగానే ఆయన ఆసుపత్రికి వచ్చారని పేర్కొన్నారు. వైద్యపరీక్షల అనంతరం మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆ తర్వాత సాయంత్రం బండారు దత్తాత్రేయ సిమ్లాకు బయలుదేరుతారు. (హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ) చదవండి: ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: దత్తాత్రేయ -
తమిళసైకు సన్మానం
-
దేశ భవితకు ఆవిష్కరణలు అవసరం
సాక్షి, సంగారెడ్డి: సామాజిక అవసరాలకు అనుగుణంగా ఐఐటీ విద్యార్థులు నూతన ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటీహెచ్‌ను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏ వ్యక్తికైనా దేశం, ప్రజలే ప్రథమ ప్రాధాన్యతని తెలిపారు. ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెలగాలని సూచించారు. ఫస్ట్ నేషన్.. నెక్ట్స్ ఫ్యామిలీయని, అదేవిధంగా జాతి మొదటి దని, స్వార్థం చివరిది అనే భావన ప్రతి వ్యక్తిలో ఉన్నప్పుడే దేశం కోసం ఏదైనా చేయాలనే ఆకాంక్ష ఏర్పడుతుందన్నారు. ఐ ఐటీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ఆందోళన కలిగి స్తోందన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండాలని, ఇందుకు ని రంతరం యోగా సాధన చేయాలన్నారు. టిబెట్ విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఉద్యోగాలను యాచించొద్దు.. కల్పించాలి: ఐఐటీల్లో చదివి బయటకు వచ్చిన విద్యార్థులు ఉద్యోగాల కోసం యాచించవద్దని, వారే పది మందికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని బండారు దత్తాత్రేయ సూచించారు. 2030 నాటికి భారతదేశంలో 65 శాతం యువత ఉంటోందని తెలిపారు. ఇది ప్ర పంచ దేశాలన్నింటిలోకి మన దేశం చేసుకున్న అదృష్టమన్నా రు. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల ఉద్యోగాల కల్పన ఉంటే.. వీటిలో 1.5 కోట్ల ఉద్యోగాలు భారత్‌లోనే లభిస్తాయని చెప్పారు. తాను మొదటగా సామాజిక సేవా కార్యకర్తనని.. ఆ తర్వాతే రాజకీయ నాయకుడినని చెప్పారు. పలువురు విద్యార్థులు సీఏఏ, ఎన్పీఆర్, రాజకీయాలపై ప్రశ్నలు అడగగా.. తాను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నందు వల్ల అవి మాట్లాడటం తగదని తిరస్కరించారు. సమావేశంలో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మేడారం: ఎత్తుబంగారం సమర్పించిన గవర్నర్లు
సాక్షి, ములుగు: ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా కీర్తిగాంచిన మేడారం సమ్మక్క-సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్కను చిలకల గుట్ట నుంచి మేడారానికి తీసుకురాగా భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క గద్దెపై ఆసీనురాలైంది. ఈ మేడారం జాతరలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుక్రవారం పాల్గొన్నారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలకు ఎత్తు బంగారం, పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌లు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు ఘనంగా స్వాగతం పలికారు. (జాతర షురూ: కొలువుదీరిన కన్నెపల్లి వెన్నెలమ్మ) దర్శనం అనంతరం గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. గిరిజన సంప్రదాయంలో జరిగే మేడారం జాతర దేశంలోనే అతిపెద్దదని కొనియాడారు. వనదేవతలుగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మేడారాన్ని దేవభూమిగా భావిస్తున్నామని తెలిపారు. గవర్నర్ హోదాలో అమ్మవార్ల ఆశీస్సులు పొందడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి దేవతల ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని పేర్కొన్నారు. (చదవండి: గద్దెనెక్కిన వరాల తల్లి) -
‘గోవుల సంరక్షణ కోసం రూ. 25 వేలు’
సాక్షి, మెదక్ : సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామంలోని కృషి విజ్ఞాన కేంద్రాన్నిశుక్రవారం గవర్నర్ సందర్శించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువులతో సాగుచేస్తున్న పంటలను, తయారు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ.. సేంద్రీయ పద్దతుల ద్వారా వ్యవసాయం చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుంతుందని అన్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర వస్తే ఆత్మహత్యలు ఉండవని తెలిపారు. రైతులు నూతన పద్ధతులను అవలంభిస్తూ వ్యవసాయం చెయ్యాలని సూచించారు. హిమాచల్ ప్రదేశలొ గోవుల సంరక్షణ కోసం రూ.25 వేలు ఇస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. రైతులు సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని, భూసార పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. రసాయన ఎరువులతో రైతులు అనారోగ్యాల పలు అవుతున్నారని, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు మహిళ రైతులకు అవగాహన కల్పించాలని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. -
ముగిసిన ఆటా వేడుకలు
గన్‌ఫౌండ్రీ: అమెరికాలో స్థిరపడి పుట్టిన ప్రాంతానికి సేవ చేయాలనే సంకల్పంతో అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. ఈ నెల 11న ప్రారంభమైన ఆటా వేడుకలు ఆదివారం రవీంద్రభారతిలో ముగిశాయి. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. లక్ష మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ భారతీయ సంస్కృతి సం ప్రదాయాలను మరిచిపోకుండా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఎప్పుడో నిర్మించిన పాఠశాలల పునరుద్ధరణకోసం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు భారతీయ సమాజాన్ని చూసి అక్కడి సమాజం సంస్కృతి సంప్రదాయాలను నేర్చుకుందని, కానీ ప్రస్తుత మన సమాజం సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోయిందన్నారు. అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశానికి వచ్చి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహించి ఇక్కడ ఉన్న వారికి స్ఫూర్తినిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీనటుడు కృష్ణంరాజుకు జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. నీరజ్ సంపతి (వ్యాపారం, క్రీడలు), శ్రీ కళాకృష్ణ, అశ్వినీరాథోడ్ (కళలు), రాహుల్ సిప్లిగంజ్, కొమండూరి రామాచారి (సంగీతం), సౌదామిని ప్రొద్దుటూరి (మహిళా సాధికారత), కృష్ణమనేని పాపారావు (సామాజిక సేవా) రంగాల వారికి పురస్కారాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర శాసన సభ్యులు రసమయి బాలకిషన్, బొల్లం మల్లయ్య యాదవ్, ఆటా ప్రతినిధులు అనిల్ బోదిరెడ్డి, పరమేశ్ భీమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యతోనే గొల్ల, కురుమల అభివృద్ధి
కేయూ క్యాంపస్/చేర్యాల(సిద్దిపేట): గొల్ల, కురుమల్లో అనేకమంది ఇంకా ఆర్థికంగా వెనుకబాటులోనే ఉన్నారని, కుల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నవారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యతోనే వారి అభివృద్ధి జరుగుతుందని, గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో, సిద్దిపేట జిల్లా చేర్యాలలో దత్తాత్రేయ గౌరవార్థం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. హన్మకొండలో గోకుల్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళలు, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలహీనవర్గాల కోసం ముద్ర రుణాలను ఇస్తోందని, గొల్ల, కురుమలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. ఒగ్గు కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. శంషాబాద్‌లో ప్రియాంకారెడ్డి, వరంగల్‌లో మానసపై జరిగిన ఘటనలు దురదృష్టకరమని దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రియాంక హత్య ఉదంతం తనను కలచి వేసిందని చేర్యాల సభలో అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా చట్టాలు చేసేలా కృషి చేస్తానన్నారు. కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించేవారికోసం హైదరాబాద్‌లో త్వరలోనే ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. -
జలవిహార్‌లో ఘనంగా ‘అలయ్ బలయ్’
-
బర్గర్లు, చిప్స్ వద్దు.. సంప్రదాయ ఆహారమే మేలు
సాక్షి, హైదరాబాద్ : సంప్రదాయ వంటకాలతో పాటు, పోషకాహారాన్ని పిల్లలకు ఇవ్వడం ద్వారా వారిని ఆరోగ్యసౌభాగ్యవంతులుగా తయారు చేయవచ్చని రాష్ట్రంలోని మాతృమూర్తులకు గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. పిల్లల ఆధునిక జీవనశైలి కారణంగా 25%మంది ఊబకాయంతోపాటు, మరో 33 శాతం మంది పోషకాహార లేమితో బాధపడుతున్నట్టు పత్రికల్లో వచ్చిన కథనాలు చూసి తాను ఆందోళనకు గురైనట్టు చెప్పారు.తాను డాక్టర్‌ను కూడా అయినందున పిల్లలకు బర్గర్లు, చిప్స్‌కు బదులు పోషక విలువలున్న సంప్రదాయ ఆహారాన్ని ఇవ్వాలని సూచిస్తున్నానన్నారు. గురువారం జలవిహార్‌లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా మిలన్ ’అలయ్ బలయ్’లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడేందుకు సంప్రదాయబద్ధమైన ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని, 15 ఏళ్లుగా దీన్ని నిర్వహించడం గొప్ప విషయమని తమిళిసై పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన చిందు భాగవతం, యక్షగానం, గుస్సాడి, ఇతర సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. హిమాచల్, తెలంగాణల సహకారానికి కృషి : దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్‌ను తెలంగాణతో అనుసంధానించి, పర్యాటకం, పరిశ్రమలు, తదితర రంగాల్లో పరస్పర సహకరించుకోడానికి ఆ రాష్ట్ర మంత్రులు, అధికారులు ఇక్కడ పర్యటించేలా చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ప్రసంగంలో తెలిపారు. అలయ్ బలయ్ స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా దేశాభివృద్ధికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ అభినందనీయమని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. అందరినీ ఒకచోటకు చేర్చేలా ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ సంస్కృతి, తెలుగు భాషను అభివృద్ధి చేసి సాంస్కృతిక విప్లవం తేవాలని మహారాష్ట్ర మాజీ గవ ర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను సత్కరించారు. -
వారిద్దరు నాకు ఆదర్శం: తమిళి సై
సాక్షి, హైదరాబాద్ : చెడు మీద మంచి సాధించిన విజయమే విజయదశమి అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బతుకమ్మ, బోనాల పండుగ తెలంగాణ ఖ్యాతిని పెంచుతున్నాయని పేర్కొన్నారు. దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని గురువారం జలవిహార్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భావితరాలకు పండుగ ప్రాధాన్యతను తెలియజేయడానికే అలాయ్ బలాయ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రకృతి నిలయమని... ప్లాస్టిక్ భూతాన్ని అంతం చేసి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కాగా అలయ్ బలయ్ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావు, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్ మాట్లాడుతూ..తెలంగాణకు గవర్నర్‌గా రావడం తన అదృష్టమని సంతోషం వ్యక్తం చేశారు. బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు తనకు ఆదర్శం అన్నారు. పదిహేనేళ్లుగా దత్తాత్రేయ అలాయ్ బలాయ్ నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. మానవ సంబంధాలు పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయని పేర్కొన్నారు. తమిళనాడు, తెలంగాణకు భౌగోళికంగా సరిహద్దులు ఉన్నాయే గానీ... సంస్కృతి, సంప్రదాయాలు మాత్రం ఒకేలా ఉంటాయని పేర్కొన్నారు. ‘చిన్న పిల్లల టిఫిన్ బాక్సుల్లో బర్గర్లు, చిప్స్ ఉంటున్నాయి. చిన్నారుల్లో పోషకాహార లోపం తలెత్తుతోంది. చిన్నారులకు పౌష్టికాహారం ఇచ్చేలా తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి’ అని గవర్నర్ సూచించారు. ఇక విద్యాసాగర్ రావు మాట్లాడుతూ... ‘తెలంగాణలో కవులు, కళాకారులు మళ్ళీ ముందుకు రావాలి. సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలి. సాంస్కృతిక విప్లవం తీసుకువచ్చి.. భాషను రక్షించుకోవాలి’ అని పిలుపునిచ్చారు. అందరిని కలుపుతున్న పండుగ అలాయ్ బలాయ్ అని కిషన్‌రెడ్డి అన్నారు. ‘తెలంగాణ సాధనలో అలాయ్ బలాయ్ దోహదపడింది. విభేదాలు, తారతమ్యాలు పక్కన పెట్టి ప్రతీ ఒక్కరు దేశ అభివృద్ధికి పాటుపడాలి’ అని పేర్కొన్నారు. వీహెచ్ అసహనం అలయ్ బలయ్ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తమకు తగిన సమయం ఇవ్వటం లేదంటూ వేదికపైనే అసంతృప్తి వ్యక్తం చేశారు. గత గవర్నర్ కూడా తమ పట్ల ఇలాగే వ్యవహరించారంటూ అసహనానికి లోనయ్యారు. ఫ్లెక్సీల్లో కాంగ్రెస్ నాయకుల ఫోటోలు లేకపోవటం బాధాకరమని.. తెలంగాణ ఇచ్చిన సోనియాను అవమానించారన్నారు. పాత గవర్నర్‌లా చేయొద్దని.. గవర్నర్ తమిళి సైని కోరారు. హిమాచల్ గవర్నర్ తమను జరచూసుకోవాలంటూ దత్తాత్రేయను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
హైదరాబాద్ జలవిహార్‌లో అలయ్‌బలయ్ కార్యక్రమం
-
వీర పోరాటాల గడ్డ తెలంగాణ
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): ‘తెలంగాణ చరిత్ర ఐదు వేల సంవత్సరాలది. నాలుగు వేల సంవత్సరాల కింద ఇనుప పనిముట్లు, కత్తులు తదితర వస్తువుల తయారీ ఇక్కడే జరిగింది.. పురావస్తు శాఖ తవ్వకాల్లో మనకు ఆధారాలు దొరికాయి.. ఎందరో త్యాగాల ఫలితం.. వీర పోరాటాల గడ్డే మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం..’ అని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి ఆధ్వర్యంలో మూడు రోజులుగా కరీంనగర్లో నిర్వహిస్తున్న తెలంగాణ వైభవం కార్యక్రమం ఆదివారం ముగిసింది. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆయన హాజరై ప్రసంగించారు. సంసృతి లేకపోతే మనం లేమని, విలువలు క్షీణిస్తున్న ఈ రోజుల్లో పిల్లలు, యువతరానికి నిజమైన తెలంగాణ గొప్పతనం తెలియ చేయడం చాలా మెచ్చుకోదగ్గ విషయమని, రాబోయే రోజుల్లో ప్రాచీన తెలంగాణ వైభవాన్ని అన్ని జిల్లాల్లో ఇటువంటి సదస్సులు, సమావేశాల ద్వారా విసృతం చేయాలని తెలిపారు. అస్థిత్వాన్ని నిలబెట్టుకోవాలంటే చరిత్రను మరువద్దుని సూచించారు. సర్ధార్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రజాకార్ల రాక్షసత్వాన్ని అణచివేసి మనకు నిజమైన స్వాతంత్య్రాన్ని 1948 సెప్టెంబర్ 17న తెచ్చిపెట్టారని గుర్తు చేశారు. పటేల్‌కు తెలంగాణ ఎప్పుడూ రుణపడే ఉంటుందన్నారు. తెలంగాణ వైభవాన్ని అందరికీ తెలిసేలా చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కొందరు తెలంగాణ చరిత్రను తిరగేస్తున్నారని, వారి చరిత్రే రాబోయే తరాల కు అందించాలని వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమాలు చేస్తుంటే అవి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. బతుకమ్మ అంటే మనకు గౌరమ్మ అని, గౌరమ్మను దేవతగా పూజిస్తుంటే ఆ బతుకమ్మను డిస్కో ఆటగా మారుస్తున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా పటేల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. నాడు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పటేల్ ఫొటో పెట్టుకొని దేని కోసం ఉద్యమాలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక సెప్టెంబర్ 17న గొప్పగా చేసుకొందామన్న వారు ఇప్పుడు మరువడం విడ్డూరమన్నారు. పటేల్, కుమురంభీం, చాకలి అయిలమ్మ, రాణి రుద్రమాదేవి వంటి వాళ్లను మరిచి నేడు నిజాం సమాధి వద్ద మోకారిళ్లుతున్నారని విమర్శించారు. ప్రజ్ఞాభారతి రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ఎల్.రాజభాస్కర్ రెడ్డి, డి.నిరంజనాచారి మాట్లాడుతూ మూడు రోజుల్లో 2600 సంవత్సరాల చరిత్ర ఉన్న తెలంగాణ వైభవాన్ని చూపించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, ప్రజ్ఞాభారతి, ఇతిహాస సంకలన సమితి రాష్ట్ర, జిల్లా బాధ్యులు బూర్ల దక్షిణమూర్తి, రాజేందర్ చడ్డా, దత్తాత్రేయ శాస్త్రీ, గిరిధర్, రఘు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్, మురళీ మనోహరచారి, విద్యాసంస్థల భాద్యులు అనంతరెడ్డి, రమణారావు, శ్రీనివాస్‌రావు, రాజేశ్, వేద సం హిత, సత్యగిరి, విజయభారతి పాల్గొన్నారు. ప్రదర్శనలను తిలకించిన గవర్నర్.. తెలంగాణ వైభవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ఆదివారం రాత్రి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ బండి సంజయ్‌కుమార్ తిలకించారు. పురాతన కాలం నాటి నాణేలు, తెలంగాణ సంసృతిని చూపెట్టిన సమ్మక్క సారలమ్మ, ఎలగందుల ఖిల్ల, గోల్కొండ ఫోర్టు, బతుకమ్మ తదితర ప్రదర్శనలను తిలకించారు. అనంతరం పలువురు విద్యాసంస్థలకు బాధ్యులకు గవర్నర్ జ్ఞాపికలను బహూకరించారు. కాగా గవర్నర్‌ను ప్రజ్ఞా భారతి, ఇతిహాస సంకలన సమితి బాధ్యులు ఘనంగా సన్మానించారు. -
ప్రజాతెలంగాణ కోసం మరో ఉద్యమం
కవాడిగూడ: ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని, వారికి కావాల్సిన తెలంగాణ కోసం మరో ఉద్యమం చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని, మలిదశ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న ఉద్యమకారులు, పలు పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఆదివారం కవాడిగూడ డివిజన్లోని పింగళి వెంకట్రామ్రెడ్డి హాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. సుదీర్ఘకాలం తర్వాత కలుసుకున్న సందర్భంగా ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఇది అందరి తెలంగాణ.. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరాం మాట్లాడుతూ ‘త్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణ ఎవరి జాగీరు కాదు, సీఎం కేసీఆర్ ఒక్కరే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని అనుకుంటు న్నారు, ఇది కేవలం నీ తెలంగాణ కాదు.. ఇది అందరి తెలంగాణ’ అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో నౌకరీ దొరకడం లేదన్నారు. తెలంగాణకు చెందిన ప్రతీ పైసా తెలంగాణ బిడ్డలకే దక్కాలన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేయాలన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో పోస్టర్ ఆవిష్కరిస్తున్న కోదండరాం, బాలక్రిష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్, ఎంపీ మధుయాష్కి, ప్రభాకర్, చెరుకు సుధాకర్, రాములునాయక్ తదితరులు అడిగి తెచ్చుకోలేదు.. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కళాకారుల ఆటపాటతో అన్ని వర్గాల ప్రజల వద్దకు తెలంగాణ ఉద్యమం చేరిందన్నారు. ఇది అడిగి తెచ్చుకున్న తెలంగాణ కాదు, త్యాగాలు, బలిదానాలు, పోరాటాలు చేసి సాధించుకుందన్నారు. తెలంగాణఫలాలు సబ్బండ ప్రజలకు దక్కేలా నిర్మాణాత్మమైన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అన్యాయాలపై, పాలనపై ఏపూరి సోమన్న తనదైన శైలిలో గళమెత్తారు. సమ్మేళనం కన్వీనర్ జిట్టా బాలక్రిష్ణారెడ్డి, కో–ఆర్డినేటర్ కె.కె.మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, వివేక్, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డా.చెరుకు సుధాకర్ మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, మాజీ ఎంపీ మధుయాష్కి, యువతెలంగాణ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీరుద్రమదేవి, వివిధ జిల్లాల ఉద్యమకారులు పాల్గొన్నారు. -
బూర్గులకు గవర్నర్ దత్తాత్రేయ నివాళి
సాక్షి, హైదరాబాద్: నిస్వార్థ నాయకుడిగా, హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందించిన మహావ్యక్తి బూర్గుల రామకృష్ణారావు అని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. దత్తాత్రేయ శనివారం బూర్గుల వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు గవర్నర్‌గా సేవలందించిన గొప్పవ్యక్తి అని తెలిపారు. దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ హోదాలో నగరానికి రావడంతో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడీ, సీసీఆర్‌ఓ వెంకటరమణ ఘనంగా స్వాగతం పలికారు. కాగా బండారు దత్తాత్రేయ ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. -
దత్తాత్రేయ అందరి మనిషి
గన్‌ఫౌండ్రి : హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అందరి మనిషి అని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన బండారు దత్తాత్రేయకు శుక్రవారం రవీంద్రభారతిలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పౌర సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించేలా తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన వ్యక్తి దత్తాత్రేయ అని కొనియాడారు. బీసీలు ఎదుర్కొంటున్న అసమానతలను దూరం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ..గవర్నర్ పదవికి దత్తాత్రేయ వన్నె తేవాలని, భవిష్యత్‌లో మరిన్ని పదవులు స్వీకరించాలని ఆకాంక్షించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..అందరినీ కలుపుకుపోయే గొప్ప గుణం ఉన్న వ్యక్తి దత్తన్న అని ప్రశంసించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయను బీసీ సంఘాల ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీ డీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, సినీనటుడు సుమన్, జస్టిస్ చంద్రకుమార్ , విశ్రాంత ఐఏఎస్ అధికారి వినోద్‌కుమార్ అగర్వాల్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, పలు బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
హాత్ వే హెడ్ ప్రవీణ్ ఇంటికి వెళ్లిన దత్తాత్రేయ
-
గవర్నర్‌ను కలసిన బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సమావేశంలో జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, రాష్ట్ర పరిపాలనా స్థితిగతులపై చర్చించినట్లు తెలిసింది. బొకేలు వద్దు.. బుక్స్ తెండి తనను కలిసేందుకు వచ్చేవారు పూలబొకేలకు బదులు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, డిక్షనరీలు, చిన్న పిల్లల కథల పుస్తకాలు తీసుకురావాలని గవర్నర్ తమిళిసై కోరారు. వీటిని రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు పంపిణీ చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. -
‘హిందువుల ఐక్యతకు చిహ్నం ఈ ఉత్సవాలు’
సుల్తాన్‌బజార్/గన్‌ఫౌండ్రి: దేశంలోనే భాగ్యనగరంలో ఎంతో ఉత్సాహంగా సామూహిక గణేశ్ ఉత్సవాలు నిర్వహించడం హిందువుల ఐక్యతను తెలియజేస్తుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్వసంచాలక్ మోహన్ భాగవత్ పేర్కొన్నారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వినాయక నిమజ్జన కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు అధ్యక్షతన నగరంలోని మోజాంజాహి మార్కెట్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభ వేదిక నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులను ఉద్దేశించి భాగవత్ ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. దేశంలోకెల్లా నగరంలోనే ఘనంగా గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హిమాచల్ గవర్నర్‌గా దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ 27వ గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం ఉదయం 10.30కి సిమ్లాలోని రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ధరమ్ చంద్ చౌదరి.. దత్తాత్రేయతో ప్రమాణం చేయించారు. అంతకుముందు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయను నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నతాధికారి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఫైలుపై సంతకం చేసి దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం ఠాకూర్ నూతన గవర్నర్ దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దత్తాత్రేయ కుటుంబసభ్యులతోపాటు, హిమాచల్‌ప్రదేశ్ మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, జితేందర్‌రెడ్డి, డీకే అరుణ తదితరులు కార్యక్రమంలో పాల్గొని దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు. దత్తన్నకు బీజేపీ నేతల అభినందనలు సాక్షి, హైదరాబాద్: సిమ్లాలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన దత్తాత్రేయ కు రాష్ట్ర బీజేపీ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, జి.వివేక్, టి.రాజేశ్వరరావు, ధర్మారా వు, సంకినేని వెంకటేశ్వరరావు, కాసం వెంకటేశ్వ ర్లు, చింతా సాంబమూర్తి, ప్రేమేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి తదితరులు అభినందనలు తెలిపారు. జీవితంలో కొత్త అధ్యాయం: దత్తాత్రేయ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టడం తన జీవితంలో కొత్త అధ్యాయంగా భావిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 35 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్న తాను ప్రజా జీవితంలో ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేశానని, ఇప్పుడు దక్కిన ఈ రాజ్యాంగబద్ధమైన పదవి తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఈ అవ కాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. దైవభూమిగా పేరుగాంచిన హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసే అవ కాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు కృతజ్ఞతలు తెలిపారు. -
హిమచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణస్వీకారం
-
గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ రామ సుబ్రహ్మణ్యన్ ఆయనచే బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. హిమాలయ సంప్రదాయ టోపీ దరించి ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయరాం సింగ్ ఠాకూర్ , తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో సహా పలువురు బీజేపీ నేతలు, దత్తాత్రేయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. -
హిమాచల్ గవర్నర్‌గా నేడు దత్తాత్రేయ బాధ్యతలు
ముషీరాబాద్: హిమాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. మంగళవారమే ఆయన కుటుంబ సమేతంగా సిమ్లాకు బయల్దేరి వెళ్లారు. అంతకు ముందు ఆయనను గవర్నర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజ్‌భవన్ ఐపీఎస్ ఏడీసీ మోహిత్ చావ్లా దత్తాత్రేయ నివాసానికి వచ్చి అందజేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు సిమ్లాలోని రాజ్‌భవన్‌లో ఆరాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ దత్తాత్రేయతో గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం జైరాం ఠాకూర్‌తో పాటు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావులతో పాటు పార్టీ ముఖ్య నాయకులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరవుతున్నారు. -
దత్తన్న ఇంట్లో కత్తి కలకలం
ముషీరాబాద్: హిమాచల్‌ప్రదేశ్ నూతన గవర్నర్‌గా నియమితులైన బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ నివాసంలో ఒక కత్తి కలకలం రేపింది. గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయను అభినందించేందుకు నేతలు, కార్యకర్తలు అనేకమంది ఆయన ఇంటికి వస్తున్నారు. బుధవారం ఫిజియోథెరపీ ముగించుకుని దత్తాత్రేయ హాల్లోకి వచ్చిన వెంటనే ఆయనను కలిసేందుకు తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఆ సమయంలో ఓ వ్యక్తి జేబు నుంచి కత్తి (స్టేషనరీలో పేపర్ కట్టింగ్, వైర్ల కట్టింగ్ చేయడానికి ఉపయోగించేది) కిందపడింది. మాజీ డీజీపీ హెచ్‌జే దొర దత్తాత్రేయను కలవడానికి వచ్చిన సమయంలోనే ఇది చోటుచేసుకుంది. పోలీ సులు ఘటనస్థలానికి చేరుకుని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
8న తమిళసై, 11న దత్తాత్రేయ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళసై సౌందర్ రాజన్ ఈ నెల 8వ తేదీ 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ఆదివారం ఉదయం ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, పలువురు ఉన్నత అధికారులు హాజరు కానున్నారు. మరోవైపు కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ ఈ నెల 11వ తేదీన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. -
గౌలిగూడ టు సిమ్లా
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను గవర్నర్ పదవి వరించింది. ఈ మేరకు కేంద్రం ఆయన్ను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడంతో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి.నగరంలోని గౌలిగూడలో పుట్టిపెరిగిన దత్తన్న మరోసారి ఉన్నత పదవి చేపడుతుండడం గర్వకారణమనిపలువురు ఆయన్ని అభినందనలతో ముంచెత్తారు. ముషీరాబాద్: గౌలిగూడ బస్తీలో పుట్టి పెరిగి రాంనగర్ కేంద్రంగా రాజకీయాలు ప్రారంభించిన బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడంతో బీజేపీ శ్రేణులు, అభిమానుల్లో ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన దత్తన్న నగరం కేంద్రంగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనా సికింద్రాబాద్ లోక్‌సభ నుంచి అత్యధిక సార్లు విజయం సాధించటంతో పాటు రెండుమార్లు కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. తాజాగా మరో మెట్టు ఎదిగి గవర్నర్ కావడంతో నగర బీజేపీ శ్రేణులు ఆదివారం ఆయనను అభినందనలతో ముంచెత్తాయి. సింపుల్ మ్యాన్... గౌలిగూడలో ఓ సాదాసీదా ఇంటిలో నివాసం ఉన్న దత్తాత్రేయ మొదటిసారిగా 1991లో సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 1998లో రాంనగర్‌కు మకాం మార్చారు. అదే సమయంలో వాజ్‌పేయి ప్రభుత్వంలో గ్రామీణాభివద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. రాంనగర్‌లోనే నివసిస్తూ ఒక కిరాయి ఇంట్లో సుమారు రెండేళ్లు ఉండి అదే ప్రాంతంలో ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పటికీ అదే ఇంట్లో ఉంటూ దాదాపు 22 ఏళ్లుగా రాంనగర్‌తో అవినాభావ సంబంధం ఏర్పర్చుకున్నారు. ఎంపీ అయినా, కాకపోయినా అందరితో కలిసిపోవడం, ఎలాంటి ఆర్భాటాలకు పోక పోవడం ఆయన నైజం. ఎప్పుడు చూసినా సౌమ్యంగా కనబడడం, ముఖ్యంగా మధ్యతరగతి, పేదలకు అందుబాటులో ఉండ డం అతని సహజ లక్షణం. అం దుకే మినిస్టర్ కాగానే ఎంతో మం ది సన్నిహితులు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లకు వెళ్దామని ఒత్తిడి తెచ్చినా లొంగకుండా పేదలకు అందుబాటులో ఉండాలనే ఒకే ఒక్క కారణంతో రాంనగర్ను విడిచి వెళ్లలేదు. కూతురు వివాహ రిసెప్షన్లో ప్రధాని మోదీతో దత్తాత్రేయ ఆలస్యంగా వివాహం... ఆర్ఎస్ఎస్లో, సేవా కార్యక్రమాల్లో మునిగితేలిన దత్తాత్రేయ వివాహం చేసుకోవాలనే ఆసక్తి కనపర్చలేదు. వివాహం తన పార్టీ కార్యక్రమాలకు విఘాతం కల్గిస్తుందని భావించారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి సూచన మేరకు ఆర్ఎస్ఎస్ నుంచి 1980లో బీజేపీలో చేరారు. బీజేపీలో కూడా చురుకైన పాత్ర పోషించి 1981–89 వరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ సమయంలో పార్టీ పెద్దలు, సహచరులు వివాహం చేసుకోవాలని ఒకవైపు ఒత్తిడి చేస్తుండగా.. మరోవైపు సమీప బంధువైన వసంత దత్తాత్రేయనే చేసుకుంటానని, లేకపోతే పెళ్లి చేసుకోనని చెప్పడంతో చివరికి తన 42వ ఏటా పెండ్లి చేసుకున్నారు. ఆయన కూతురిని బీజేపీ ముఖ్యనాయకుడు బి.జనార్ధన్‌రెడ్ది తనయుడు డాక్టర్ జిగ్నేష్రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కుమారుడు సంవత్సరం క్రితం గుండెపోటుతో మరణించడంతో దత్తాత్రేయ మానసికంగా కుంగిపోయారు. అయినా తేరుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న సమయంలో హిమచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. అభినందనల వెల్లువ బీజేపీ అగ్రనేత బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు ఆదివారం ఉదయం వార్త వెలువడగానే ఆయన నివాసం అభిమానులతో నిండిపోయింది. అధికారిక ప్రకటన వచ్చే సమయానికి దత్తాత్రేయ నాంపల్లిలో గణేష్ ఉత్సవ సమితి సమావేశంలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఉత్సవ సమితి సభ్యులు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. కొత్త బాధ్యతల్లోకి వెళుతున్న దత్తాత్రేయను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్లు నరసింహన్, విశ్వభూషణ్ హరిచందన్, విద్యాసాగర్‌రావు, కల్రాజ్ మిశ్రా, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె.కేశవరావు, రామ్మోహన్రావు,సుజనాచౌదరి, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కేంద్ర మంత్రులు జవదేకర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్‌కుమార్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మాజీ ఎంఎల్సీ చుక్కా రామయ్య, మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు అభినందించారు. అమ్మవారికి బోనం చాంద్రాయణగుట్ట: హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయకు పాతబస్తీ ఆషాఢ మాసం బోనాలతో విడదీయరాని అనుబంధం ఉంది. ఏటా ఉత్సవాలకు హాజరై లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంతో పాటు ఈ ఏడాది కూడా అమ్మవారి ఆలయానికి కుటుంబ సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓయూలో మార్నింగ్ వాక్ ఉస్మానియా యూనివర్సిటీ: బండారు దత్తాత్రేయ నియామకం పట్ల ఓయూలో పలువురు విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓయూ క్యాంపస్‌కు ప్రతి రోజు మార్నింగ్ వాకింగ్‌కు వచ్చి అనేక మంది ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులతో వివిధ అంశాలపై చర్చించేవారు. కేంద్ర మంత్రిగా ఓయూలో ఉద్యోగ, ఉపాధి శిక్షణ కేంద్రాన్ని ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయాన్ని ప్రారంభించారు. లేడీస్ హాస్టల్లో ప్రతి ఏటా విద్యార్థినులు జరుపుకును బతుకమ్మ పండుగలో పాల్గొనేవారు. ఏబీవీపీ నాయకులను పేరుపెట్టి పిలిచేంత చనువుగా ఉండేవారు. సికింద్రాబాద్ ఎంపీగా, మంత్రిగా దత్తాత్రేయ ఓయూలో అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగించారు. కళా పురస్కారాల ప్రదానం వివేక్‌నగర్:మోహన్ ట్రస్ట్, కీర్తన ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం త్యాగరాయ గానసభలో 12గంటల పాటు తెలుగు కళా సంరంభం, సంగీత నృత్య సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళనాడు మాజీ గవర్నర్ డా.కె.రోశయ్య వివిధ రంగాల ప్రముఖుల్ని కళా పురస్కారాలతో సత్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సాంçస్కృతిక సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బీసీ కమిçషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహనరావు, దైవజ్ఞశర్మ, కొత్త కృష్ణవేణి, మహ్మద్ రఫీ, వై.రాజేంద్రప్రసాద్, మోహన్ గాంధీ, శ్రీనివాసగుప్తా, శశిబాల తదితరులు పాల్గొన్నారు. కుమ్మేసింది వర్షం కుమ్మేసింది. ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రహదారులపై వరద పోటెత్తింది. ఫలితంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హుస్సేన్‌సాగర్ (ట్యాంక్‌బండ్) నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి +513.410 అడుగులకు చేరింది. ట్యాంక్‌బండ్ సామర్థ్యం +514.910 అడుగులు కావడంతో భయపడాల్సిన అవసరం లేదని జీహెచ్ఎంసీ వర్గాలు పేర్కొన్నాయి. -
ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్(58)ను కేంద్రం నియమించింది. ఆదివారం ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు వెలువరించారు. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ(72)ను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించింది. మొత్తం ఐదు రాష్ట్రాలకు రాష్ట్రపతి కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణకు ఈఎస్ఎల్ నరసింహన్ స్థానంలో తమిళిసై సౌందరరాజన్, హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ కల్రాజ్ మిశ్రా(78)ను రాజస్తాన్ గవర్నర్‌గా, హిమాచల్ ప్రదేశ్‌కు నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ, కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, మహారాష్ట్ర గవర్నర్‌గా విద్యాసాగర్‌రావు స్థానంలో భగత్ సింగ్ కోశ్యారీ(77)ని నియమించింది. కొత్త గవర్నర్ల నియామకాలు వారు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్రపతి భవనం తెలిపింది. రాజస్తాన్ గవర్నర్‌గా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేస్తున్న యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ స్థానంలో మిశ్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాజీవ్ కేబినెట్లో మంత్రికి గవర్నర్ గిరీ కేరళ గవర్నర్‌గా నియమితులైన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్(68) సొంతరాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన గతంలో కేంద్రంలో రాజీవ్ గాంధీ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షాబానో కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని మంత్రిగా ఉన్న ఆరిఫ్ తీవ్రంగా వ్యతిరేకించారు. నిరసనగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ముస్లిం పర్సనల్ లా సంస్కరణలు చేపట్టాలని, ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేయాలని ఆరిఫ్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన ఆయన..2007 వరకు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ చట్టం చేసిన మోదీ ప్రభుత్వానికి ఆయన మద్దతు తెలిపారు. ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా ఉన్న సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి పళనిస్వామి సదాశివం స్థానంలో ఆరిఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. దక్షిణాదిలో బలపడేందుకేనా? న్యూఢిల్లీ: తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిని గవర్నర్లుగా నియమించడం దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నాల్లో భాగమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతల్ని మచ్చిక చేసుకునేందుకు, కొత్త నాయకత్వంతో సంస్థాగతంగా బలం కూడదీసుకునేందుకు ఇటీవలి కాలంలో బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ద్రవిడ రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి మార్గం సుగమమయ్యేలా తమిళనాడు బీజేపీ చీఫ్ తమిళిసై సౌందరరాజన్‌ను తెలంగాణ గవర్నర్‌గా నియమించిందని పరిశీలకులు భావిస్తున్నారు. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో టీడీపీ శ్రేణులను చేర్చుకోవడం ద్వారా బీజేపీని విస్తరించుకోవాలనే యోచనలో ఉందని అంటున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో దేశమంతటా బీజేపీ సత్తా చాటినప్పటికీ, ఇప్పటికే బలంగా ఉన్న కర్ణాటక మినహా ప్రభావం చూపలేకపోయింది. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. అయితే, 2014 ఎన్నికల్లో ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించిన బీజేపీ ఈసారి నాలుగు సీట్లు గెలుచుకుంది. అధికార టీఆర్ఎస్కు దీటుగా ఎదిగేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలను చేర్చుకోవడం వంటి చర్యలను వేగవంతం చేసింది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రాభవం తగ్గడంతో కేరళ వంటి రాష్ట్రాల్లో బలం పుంజుకునేందుకు తమ పార్టీకి మంచి అవకాశాలున్నాయని సీనియర్ నేత ఒకరు అన్నారు. అదేవిధంగా, తమిళనాడులో దిగ్గజ నేతలు జయలలిత, కరుణానిధిల మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయాలని కూడా బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. కర్ణాటకకు చెందిన బీఎల్ సంతోష్‌ను జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)గా నియమించడం కూడా దక్షిణాదిన బలపడేందుకు దోహదం చేస్తుందని పార్టీ నేతలు అంటున్నారు. -
దత్తన్నకు హిమాచలం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు జాతీయ స్థాయిలో తగిన గుర్తింపు, గౌరవం లభిస్తోంది. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిన పార్టీ జాతీయ నాయకత్వం ఇక్కడి నాయకులను వెన్నంటి ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన కిషన్‌రెడ్డికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవిని ఇచ్చిన కేంద్రం.. సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయను హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమించడంతో రాష్ట్ర పార్టీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తృతం చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిన పార్టీ అధిష్టానం.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. రాష్ట్ర నేతలకు తగిన గౌరవం ఇచ్చి ప్రోత్సహిస్తోందని పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పేర్కొన్నారు. దత్తాత్రేయను హిమాచల్ గవర్నర్‌గా నియమించడంతో పార్టీ కార్యాలయంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఆయన నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ ఎస్ నేత కె.కేశవరావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు దత్తాత్రేయను కలసి అభినందనలను తెలియజేశారు. 2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా బీజేపీ తరఫున పోటీ చేసి గెలిచిన దత్తాత్రేయ.. కేంద్ర కార్మి కశాఖ మంత్రిగా బాధ్యత లు నిర్వహించారు. అయి తే 2019 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్ల మెంట్ స్థానం నుంచి కిషన్‌రెడ్డి పోటీ చేసేందుకు అవకాశమిచ్చారు. పార్టీలో సీనియర్ నేత కావడం, చురుకుగా పనిచేస్తుండడంతో అధిష్టానం ఆయనకు గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించింది. మరోవైపు మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీహెచ్ విద్యాసాగర్‌రావు పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో భగత్‌సింగ్ కోశ్యారీని గవర్నర్‌గా నియమించింది. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ పార్టీలో ఊపందుకుంది. అలయ్ బలయ్ కొనసాగిస్తా: దత్తన్న బీజేపీలో అందరికీ అవకాశాలుంటాయని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన గురుపూజోత్సవం సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీలో పార్టీకోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ఏదో ఓ రకంగా అవకాశం, బాధ్యత లభిస్తుందన్నారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా కేంద్రం తనను నియమించడం పట్ల దత్తాత్రేయ హర్షం వ్యక్తంచేశారు. తాను ఎక్కడున్నా భాషా సంస్కృతి, సంప్రదాయాలు, దేశ ఔన్నత్యా న్ని విస్మరించబోనన్నారు. రాజ్యాంగబద్ధమైన హోదాలో అక్కడి ప్రజలకు న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు. తానెక్కడ ఉన్నా హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ‘అలయ్ బలయ్’కార్యక్రమాన్ని కొనసాగిస్తానన్నారు. చదువు చెప్పిన వారినే కాకుండా జీవితానికి మార్గదర్శనం చేసిన వారుకూడా గురువులేనన్నారు. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, దేవీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, టీటీడీ మాజీ సభ్యుడు రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయకు సముచిత గౌరవం: లక్ష్మణ్ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన దత్తాత్రేయకు కేంద్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. గవర్నర్‌గా దత్తన్న నియామకాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. దత్తన్న కృషి మరువలేనిది: కిషన్‌రెడ్డి హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. ఓ ప్రజామనిషిలా, ఏ పదవిలో ఉన్నా ఆ పదవితో సంబంధం లేకుండా ఆయన ప్రజలతోనే ఉన్నారని పేర్కొన్నారు. -
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా బండారు దత్తత్రేయ
-
తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్
-
తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర్‌రాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను బదిలీ చేస్తూ.. నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌందర్ రాజన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్ల నియమకంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించి.. అక్కడ ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న కల్రాజ్ మిశ్రాను రాజస్తాన్‌కు బదిలీ చేసింది. తెలంగాణ: తమిళిసై సౌందర్‌రాజన్ హిమాచల్ ప్రదేశ్: బండారు దత్తాత్రేయ రాజస్తాన్: కల్రాజ్ మిశ్రా మహారాష్ట్ర: భగత్‌సింగ్ కోశ్యారీ కేరళ: మహ్మద్ ఖాన్ -
నడ్డా తెలియకపోవడం విడ్డూరం: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. 2016లో నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు, ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కలిసి విన్నవించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేత తెలియకపోవడం మీ రాజకీయ అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు. -
కేటీఆర్‌కు నడ్డా ఎవరో తెలియదా?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర మాజీమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఎవరో తెలియదని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం కేటీఆర్‌కు దత్తాత్రేయ బహిరంగ లేఖ విడుదల చేశారు. 2016లో నడ్డా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటు, ఫార్మా ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కలిసి విన్నవించిన విషయం మరిచారా అని ప్రశ్నించారు. మూడుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రజాసేవలో ఉన్న నేత తెలియకపోవడం మీ రాజకీయ అజ్ఞానానికి మచ్చుతునక అన్నారు. ఆయుష్మాన్ భారత్ దేశ మన్ననలు పొందుతుంటే.. తెలంగాణలో ఆరోగ్యశ్రీ ఆపేయడంతో మధ్యతరగతి రోగులు రోడ్డు మీదకు వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 35 వేల కోట్లకు పెంచారని, గొర్రెల పంపిణీలో రూ. 3 వేల కోట్ల అవినీతి జరిగిందని కలెక్టర్లతో విచారణ జరిపించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ను డల్లాస్‌గా మార్చుతామని చెప్పి మురికికూపంగా మార్చారని విమర్శించారు. ఎన్నికలకు ముందు లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం 28 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తు చేశారు. జేపీ నడ్డాపై నిందలు మోపడం చూస్తుంటే కేటీఆర్‌కు బీజేపీ జ్వరం పట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. -
ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కాలి
సాక్షి, హైదరాబాద్: నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆ నలుగురిపాలు అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి చేయడానికి ఉద్యమకారులు మళ్లీ కదం తొక్కా లని పిలుపునిచ్చారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ ప్రసంగించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని దుయ్యబట్టారు. బీజేపీలో చేరడానికి నేతలు, కార్యకర్తలు రావడం పెను మార్పు అని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అభివర్ణించారు. టీడీపీ నేతలు ఉప్పెనలా బీజేపీలోకి తరలిరావడం శుభపరిణామమని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. బాబు బాగుండాలి: గరికపాటి ఎన్టీఆర్ చూపిన అభిమానంతో టీడీపీలో చేరానని, కష్టకాలంలో పార్టీకి వెన్నంటి ఉన్నానని ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. అయితే, తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిపోయిందన్నారు. మనసు రాయి చేసుకొని టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని వచ్చానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బీజేపీలో చేరిన టీడీపీ నేతలు వీరే... గరికపాటి మోహన్‌రావు–రాజ్యసభ సభ్యుడు, శోభారాణి–తెలుగు మహిళ అధ్యక్షురాలు, దీపక్‌రెడ్డి–టీడీపీ జనరల్ సెక్రటరీ, ఈగ మల్లేశం–వరంగల్ రూరల్ అధ్యక్షుడు, రజనీకుమారి–తుంగతుర్తి ఇన్చార్జి, పోరిక జగన్ నాయక్–మాజీ మంత్రి, ఎర్ర శేఖర్–మాజీ ఎమ్మెల్యే, మొవ్వ సత్యనారాయణ–శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇన్చార్జి, ముజఫర్–మలక్‌పేట్ టీడీపీ ఇన్చార్జి, సామ రంగారెడ్డి–రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, కోనేరు చిన్ని–కొత్తగూడం జిల్లా అధ్యక్షుడు, శ్రీకాంత్ గౌడ్–పఠాన్ చెరు ఇన్చార్జి, బోట్ల శ్రీనివాస్–జనగామ జిల్లా అధ్యక్షుడు, రాజ్యవర్ధన్రెడ్డి–కాంగ్రెస్ నేత, శ్రీనివాస్‌గౌడ్–నల్లగొండ ఇన్చార్జ్, అంజయ్య యాదవ్–నాగార్జున సాగర్ అసెంబ్లీ ఇన్చార్జి, సాధినేని శ్రీనివాస్–మిర్యాలగూడ అసెంబ్లీ ఇన్చార్జి, శ్రీకళారెడ్డి–కోదాడ నేత, ఓం ప్రకాశ్ మాజీ తెలుగు విద్యార్థి నేత, బాబురావునాయక్–టీడీపీ ఎస్టీ సెల్, విజయ్‌పాల్‌రెడ్డి–మాజీ ఎమ్మెల్యే నారాయణ ఖేడ్, ఉపేందర్–కాంగ్రెస్ నేత, సత్యం–మంచిర్యాల టీడీపీ అధ్యక్షుడు, రఘునాథ్‌రెడ్డి–భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, రామ్‌రెడ్డి–సూర్యాపేట ఇన్చార్జి, జయశ్రీ–టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి. -
ఈ ముఖ్యమంత్రి మాటల వరకే..!
సాక్షి, సంగారెడ్డి: ఎంఐఎం చేతిలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలుబొమ్మలా మారిందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు మాటల్లోనే... కానీ చేతల్లో కనిపించడం లేదని ఘాటు విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి దృష్టి అంతా కాళేశ్వరంపైనే ఉంది కానీ ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీరందించలేదని ఎద్దేవా చేశారు. కల్యాణ లక్ష్మి పథకానికి ఐదు నెలల నుంచి నిధులు మంజూరు చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయి రాష్ట్ర పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని.. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. అదేవిధంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలోని 16 మండలాల్లో కరువు తాండవం చేస్తోందని, ఇందుకోసం తక్షణమే జిల్లాకు రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు విడుదల చేసినా వాటిని ప్రభుత్వం సక్రమంగా వినియోగించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. ఇప్పటికే ఈ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ వైఫల్యాలను గ్రామ స్థాయిలో తీసుకెళ్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, బలమైన నాయకత్వం లేకపోవటంతో పార్టీలో విశ్వసనీయత లోపించిందని అభిప్రాయపడ్డారు. మైనారిటీల రక్షణ కోసం ట్రిపుల్ తలాక్ బిల్లు తీసుకొచ్చామన్నారు. గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. -
నీళ్లొస్తున్నాయని ఊరిస్తున్నారు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన ఎస్పారెస్పీ, నిజాం సాగర్, సింగూరు నీళ్లు లేక ఎండిపోతున్నా.. సీఎం కేసీఆర్ మాత్రం కాళేశ్వరం నీళ్లొస్తున్నాయంటూ మాటలతో ఊరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఆయన మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మీడియా కన్వీనర్ సుధాకరశర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓవైపు గోదావరి వరదలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో ప్రాజెక్టుల కింద ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయంటూ మాటలతో ఊరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివరకు మేడిగడ్డ నుంచి అన్నారం సుందిళ్ల, ఎల్లంపల్లి ద్వారా ఎన్ని ఎకరాలకు నీరు అందించారో సీఎం బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. -
‘టీఆర్ఎస్ గుండెల్లో గుబులు పుడుతోంది’
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు అసంతృప్తి మొదలైందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. జిల్లాకు ఎయిమ్స్ మంజూరు చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని, తామే కేంద్రం ద్వారా నిధులను తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నది కాలుష్య నివారణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, మూసీ పరివాహక రైతులకు వెంటనే నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బునాదిగాని కాలువ పూర్తి చేయకపోవడం నాయకుల వైఫల్యమేనని విమర్శించారు. మిషన్ కాకతీయ ద్వారా ఎక్కడ చెరువులు నిండాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి పెరిగిపోతుంది నయీం కేసులో నిందితులకు శిక్ష అమలు చేసి, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి ఎదురు లేదని, బీజేపీ సభ్యత్వ నమోదు చూసి టీఆర్ఎస్ గుండెల్లో గుబులు పుడుతోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం పథకం ‘ఆయుష్మాన్ భవ’ రాష్ట్రంలో అమలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతుందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోతుందని, ఆరోగ్య శ్రీ పేరిట జోరుగా అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
‘ఆ హక్కు కేసీఆర్‌కు ఎక్కడిది’
సాక్షి, ఖమ్మం : టీఆర్ఎస్ పార్టీకి బీజేపీయే ప్రత్యామ్నాయమని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఉద్ఘాటించారు. 2023లో తెలంగాణలో బీజేపీ విజయం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలు మొదలయ్యాయని తెలిపారు. ఖమ్మం సిటీలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. జిల్లాలో బీజేపీ బలపడుతోందని, సభ్యత్వ నమోదుకు వస్తున్న స్పందనే దీనికి నిదర్శమన్నారు. పాలనలో టీఆర్ఎస్ పార్టీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర ఎన్నికల సంఘం కీలు బొమ్మగా మారే పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వేషన్లను 35 నుంచి 23 కి తగ్గించే హక్కు కేసీఆర్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతోనే వాయిదా వేస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొత్త అసెంబ్లీ, సెక్రటరియేట్ నిర్మాణాలకు తమ పార్టీ పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. కమ్యూనిస్టుల ప్రభావం రోజురోజుకీ తగ్గుతోందని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ పొత్తు అనైతికమని అన్నారు. -
‘కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు’
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ఇప్పుడే కొత్తగా సీఎం అయి నట్లుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. వచ్చేనెల 15 తర్వాత అసలు పాలన ఉంటుంది అంటే మరి ఐదేళ్ల 6 నెలల పాలన నకిలీ పరిపాలనా? అని ప్రశ్నించారు. మున్సిపల్ చట్టంలో రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా బిల్లులో చాలా అంశాలున్నాయన్నారు. ‘మున్సిపల్ శాఖలో అవినీతి పెరిగి పోయిందని సీఎం అన్నారు. ఒక్క మున్సిపల్ శాఖలో కాదు అన్నింటిలోనూ అవి నీతి ఉంది’ అని శనివారం విలేకరులతో మాట్లాడు తూ స్పష్టంచేశారు. ఈఎస్ఐలోనూ అవినీతి జరిగిం దని మండిపడ్డారు. వీటన్నింటిపైన సీఎం ఎందుకు నోరు విప్పడం లేదని, ఏసీబీకి పూర్తి అధికారాలు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించా రు. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం సీఎంకి ఉందా అని సవాలు విసిరారు. -
ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు తర్వాత అసలైన పరిపాలన ఉంటుందన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ఇన్నాళ్లు చేసింది నకిలీ పరిపాలనా అనుకోవాలా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడే ముఖ్యమంత్రి అయినట్లు అసెంబ్లీలో మాట్లాడటం ఆశ్చర్యం కలిగించిందని, మున్సిపల్ చట్టం సవరణ రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచేలా ఉందన్నారు. బిల్లులోని అంశాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. శనివారం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీరుపై ధ్వజమెత్తారు. అవినీతి పెరిగిపోయింది.. ‘మున్సిపల్ శాఖతో పాటు ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి పెరిగిపోయింది. అన్నిటిపైనా ఉన్నత స్థాయి విచారణ జరుగుతున్న ఎందుకు నోరు విప్పలేదు. గొర్రెల పంపిణీ కోసం రూ.4వేల కోట్లు ఇస్తే అందులోనూ అవినీతి చోటుచేసుకుంది. వాణిజ్య పన్నులు.. ఇసుక రవాణ వంటి శాఖల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించే ధైర్యం కేసీఆర్ కు ఉందా? ఈ అవినీతిపై ప్రభుత్వానికి అన్ని వివరాలు తెలుసు. లంచం అడిగితే చెప్పుతో కొట్టమని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? తాజా మున్సిపల్ చట్టంతో అధికారం తనగుప్పెట్లో పెట్టుకొని ప్రతిపక్ష సభ్యులపై కక్ష్య సాదింపుకోసం వినియోగించుకునే ప్రమాదం ఉంది. వార్డుల విభజన.. రిజర్వేషన్లలో అక్రమంగా ప్రభుత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారు. హైకోర్టు మందలించినా కేసీఆర్‌కు పట్టడం లేదు. త సమయం గడిస్తే అంత ఇబ్బంది కలుగుతోందని.. ఎన్నికల నిర్వహణకోసం తొందరపడుతున్నారు. ఎగిరే పార్టీకాదు నిలదొక్కుకునే పార్టీ.. మున్సిపల్ బిల్లుపై కార్యాచరణ సిద్దం చేసి లోపాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం. కేటీఆర్ వ్యాఖ్యలు అహంకార పూరితంగా ఉన్నాయి. ప్రజాతీర్పును అపహాస్యం చేయడం తగదు. బీజేపీ ఎగిరే పార్టీకాదు లదొక్కుకునే పార్టీ. ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న పార్టీ. బీజేపీ గురించి చాలా చులకనగా మాట్లాడారు. ఇప్పడు బీజేపీ అంటే భయపడుతున్నట్టు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన మార్పును జీర్ణించుకోలేక పోతున్నారు. టీఆర్ఎస్ గాలి బుడగ లాంటి పార్టీ.. పునాదిలేని భవంతిలాంటిది.. తండ్రీ కొడుకుల పార్టీ. బీజేపీకీ మీరు చెప్పాల్సిన పనిలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం. గ్రామాల్లో యువత స్వచ్చందంగా వచ్చి పార్టీలో చేరుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్దం అవుతున్నాం. ఇందుకోసం 17 ఎంపీ స్థానాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి రంగంలోకి దిగుతాం. 25, 26న మున్సిపాలిటీల్లో డబల్ బెడ్రూం ఇళ్ల కోసం దరఖాస్తులు తీసుకుంటాం. 30న మున్సిపాలిటీల్లో అవినీతిపై నిరసన కార్యక్రమాలు చేపడతాం. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు మరోలా ఉండేవి.’ అని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. -
కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: రామగుండం పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయ ని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.1,500 కోట్లతో 2016లో ప్రధాని నరేంద్రమోదీ ఎన్టీపీసీ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. శరవేగంగా ఈ ప్రాజెక్టు పనులు జరుగుతుండగా, కేంద్రం నుంచి రాష్ట్రానికి రూపాయి కూడా రాలేదని సీఎం పేర్కొనడం పచ్చి అబద్ధమన్నారు. ఎన్టీపీసీ ప్లాంట్ నుంచి 1,600 మెగావాట్ల విద్యుత్ పూర్తిగా రాష్ట్రానికే వస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ చేపట్టిన 4,000 మెగావాట్ల యాదాద్రి, 1,080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్ల పనులు నత్తనడకన జరుగుతున్నాయని, దీనికి కారణమేంటో ప్రజలకు చెప్పాలన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్రంతో పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చిందని కేసీఆర్ పేర్కొనడం అబద్ధమన్నారు. మోదీ బాధ్యతలు చేపట్టాక రైతులకు ఎరువుల కష్టాలు తీర్చడంలో భాగంగా ఖాయిలా పడ్డ ఎరువుల పరిశ్రమలను పునరుద్ధరిస్తున్నారన్నారు. -
కాళేశ్వరంపై శ్వేతపత్రం ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు లేకపోతే నిధుల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.40 వేల కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటివరకు ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదని విమర్శించారు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందని అన్నారు. ఇష్టానుసారంగా ప్రాజెక్టు వ్యయాలను పెంచుతున్నారని, రూ.42 వేల కోట్లు ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకు పెంచేశారని, అలాగే 2014లో రూ.39 వేల కోట్లు ఉన్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.52 వేల కోట్లకు పెంచేశారని అన్నారు. తద్వారా అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతోందన్నారు. అసలు తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టుల డీపీఆర్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యాలపై రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసి విచారణ జరపాలని కోరనున్నట్లు తెలిపారు. ఇక కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ అనేది గోడ మీద పిల్లిలాంటిదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ గానీ, చంద్రబాబు చెప్పే మహాకూటమి గానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇక చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని, అవినీతిపరులతో చేతులు కలిపిన బాబు.. మోదీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులపై మోదీ ఉక్కుపాదం మోపడంతో చంద్రబాబు ఆయన్ను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇక తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 6 స్థానాల్లో బీజేపీ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిపారు. -
కేసీఆర్ గోడమీద పిల్లి: దత్తాత్రేయ
ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటోడు.. చంద్రబాబు పచ్చి అవకాశవాదని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం తాగునీటి ప్రాజెక్టుల విషయంలో వాగ్దానాలకే పరిమితం అయిందని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ సర్కార్, సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని దుయ్యబట్టారు. రైతులకు సాగు నీరు అందడం లేదు.. కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చేందుకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని 39 వేల కోట్ల నుంచి రూ.52 వేల కోట్లకు పెంచారని ఆరోపించారు. అలాగే ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం ప్రాజెక్టుగా పేరు మార్చి ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80 వేల కోట్లకి పెంచి, దాదాపు రూ.40 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని వ్యాక్యానించారు. ఇంటర్మీడియట్ బోర్డు అలసత్వం కారణంగా 23 మంది విద్యార్థులు బలయ్యారని ఆరోపించారు. ముగ్గురు సభ్యుల కమిటీ రిపోర్టు ఇచ్చినా కూడా గ్లోబరినా సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటిగా ప్రశ్నించారు. ఇంటర్‌బోర్డు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు. మోదీ సర్కార్ తిరిగి అధికారం చేజిక్కించుకోవడం ఖాయమన్నారు. ఫెడరల్, మహా కూటములు మా దరిదాపుల్లో కూడా లేవు.. లోక్‌సభ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీజేపీ, టీఆర్ఎస్కు గట్టిపోటీనిచ్చిందని వెల్లడించారు. -
మహిళలపై నేరాలను అరికట్టండి: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, హత్య లు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని, వెంటనే వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ నేతృత్వంలో బీజేపీ నేతల బృందం బుధవారం గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రం సమర్పించింది. తెలంగాణలో 2015 నుంచి 2017 వరకు 1,024 బాలికల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, ఇందులో చాలామంది అమ్మాయిలను బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెడుతున్నారని, మరికొందరిని హత్య చేస్తున్నారని గవర్నర్‌కు ఈ బృందం వివరించింది. హాజీపూర్ గ్రామంలో బాలికల వరుస హత్యల ఘటనలో ఆ గ్రామం నుంచి భువనగిరికి, భువనగిరి నుంచి హైదరా బాద్‌కు ప్రజారవాణా సౌకర్యం లేకపోవడంతో మర్రి శ్రీనివాస్‌రెడ్డి బాలికలకు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడ్డాడని తెలిపింది. గవర్నర్‌ను కలసిన వారిలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్, బీజేపీ మహిళా అధ్యక్షురాలు విజయ, మాధవి తదితరులు ఉన్నారు. -
మహిళా మంత్రి లేకపోవడం వల్లే ఇదంతా..
సాక్షి, హైదరాబాద్ : బొమ్మల రామారం హాజీపూర్ ఘటన దేశ ప్రజలని దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ అన్నారు. ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు తెలిపారు. బుధవారం రాజ్‌భవన్‌లో ఆయనను కలిసిన సందర్భంగా.. గత నాలుగు మాసాలుగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి వివరించినట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో వెయ్యికి పైగా మహిళలు అపహరణకు గురయ్యారన్నారు. వారి ఆచూకీ ఇప్పటివరకు దొరకకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముగ్గురు అమ్మాయిలను ఒక వ్యక్తి అత్యాచారం చేసి, హత్య చేసిన దారుణ ఘటన అందరినీ కలచివేసిందన్నారు. అలాంటి నిందితులకు ఉరి శిక్షే సరైందని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం చేయడంతో పాటుగా.. ప్రభుత్వం వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకపోవడం వల్లే మహిళలకు సరైన న్యాయం జరగడం లేదని విమర్శించారు. హాజీపూర్ హత్యోందంతంపై ఢిల్లీ వెళ్లి మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని దత్తాత్రేయ వెల్లడించారు. -
‘అందుకే అంబర్‌పేట్‌లో గొడవలు పెట్టారు’
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ప్రభుత్వం చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అంబర్‌పేట్‌లో గొడవలు పెట్టారని పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ మండిపడ్డారు. లక్ష్మణ్ నేతృత్వంలో బీజేపీ నాయకులు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడుతూ..ప్రభుత్వ డబ్బుతో నష్టపరిహారం పొందిన తర్వాత మళ్లీ మజ్లిస్ నాయకులు, బయటి వ్యక్తులతో కలిసి అదే స్థలంలో ప్రార్ధన చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. ఫ్లైఓవర్ నిర్మించడానికి కూల్చివేసిన స్థలంలో మళ్లీ గుంపులుగా నమాజ్ చేస్తే స్థానిక అంబర్ పేట్ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని విమర్శించారు. ప్రశ్నించిన స్థానికుల మీద లాఠీచార్జి చేసి బీజేపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కమిషనర్ సమక్షంలో తూలనాడారని చెప్పారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద పోలీసులు వ్యవహారం చాలా దురుసుగా ఉందని, అనేక సందర్భాల్లో చూస్తున్నామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్థలంలో షెడ్ వేసి ప్రార్ధన చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే పాషా ఖాద్రీని వదిలేసి, కాపాడటానికి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బేడీలు వేసి అరెస్ట్ చేయడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యను దృష్టి మరల్చడం కోసమే మజ్లిస్ సహకారంతో ఇలా చేశారని ఆరోపించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపుతోందని అన్నారు. ఇంత ప్రాధాన్యత ఉన్న పరిషత్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఓటు హక్కు వినియోగించుకోకపోవడం విడ్డూరమని, ఓటు వేయనందుకు ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాంతియుత వాతావారణం చెడగొట్టే యత్నం: దత్తాత్రేయ శాంతియుతంగా ఉన్నవాతావరణం చెడగొట్టే యత్నం జరుగుతోందని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. ఫ్లైఓవర్‌కు అడ్డం పడేవిధంగా అక్రమ నిర్మాణం చేయబోయిన మజ్లిస్ ఎమ్మెల్యేల మీద పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలం మీద వక్ఫ్‌బోర్డు పేరు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలకు బేడీలు వేస్తారా.. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. అరాచక శక్తులకు స్వేచ్ఛ ఇచ్చి పోలీసులు పక్షపాతధోరణి అవలంబిస్తోన్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపలేకపోతున్న ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంకా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆత్మ విశ్వాసం నింపడంలో ప్రభుత్వం విఫలమైం దని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అందుకే ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్మీడియెట్ ఫలితాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బోర్డు వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. గ్లోబరీనా సంస్థకు టెండర్ ఇవ్వడమే దీనికి కారణమని, ఈ వ్యవహారం వెనుక భారీ కుంభకోణం ఉందని ఆరోపించారు. బోర్డు తీరుపై నిరసన తెలిపితే అమానవీయంగా, ఎమర్జెన్సీని తలపించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విచారం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నిరాహార దీక్షను భగ్నం చేసేవిధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. బీజేవైఎం కార్యకార్యకర్తల మీద దాడి చేయడం నియంతృత్వానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాల తప్పులపై సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలని, వెంటనే ఇంటర్మీడియట్ బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. బోర్డు వైఫల్యాలు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మే 2న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని, అందరూ సహకరించాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదా? అని ప్రశ్నించారు. -
ఇంటర్ పోరు.. 2న తెలంగాణ బంద్
హైదరాబాద్: విద్యార్థులు, తల్లిదండ్రులలో విశ్వాసం నింపడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అందుకే ఆత్మహత్యలు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఇంటర్ అవకతవకలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా మే 2న తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ట్యాంక్‌బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. ఫలితాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. బోర్డు వైఫల్యం కారణంగానే ఇంత ఘోరం జరిగిందన్నారు. ఇంటర్ ఫలితాల అవకతవకల వెనక భారీ కుంభకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు నిరసన తెలిపితే అమానవీయంగా, ఎమెర్జెన్సీ తలపించే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తోందని విమర్శించారు. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తప్పులకు నిరసనగా బీజేపీ ఆఫీసులో బీజేపీ తెలంగాణ అధ్యక్షులు లక్ష్మణ్ సోమవారం నుంచి నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువస్తామని తెలిపారు. సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని, అలాగే ఇంటర్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. -
బండారు దత్తాత్రేయ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వం, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ ప్రగతి భవన్ ముట్టడికి బీజేపీ పిలుపు నివ్వడంతో సీఎం నివాసం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్, వాటర్ కేనన్స్‌తో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. పలుమార్లు బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ప్రగతి భవన్‌వైపు దూసుకురావడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దశల వారీగా ప్రగతి భవన్ ముట్టడి వస్తున్న బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలను అదుపుచేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. బీజేవైఎం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వినయ్ సహా 30 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. తమతో వాగ్వాదానికి దిగిన బీజేవైఎం నేత భానుప్రకాశ్‌పై పోలీసులు పిడిగుద్దులు కురిపించడంతో ఆయన ఆస్పత్రిపాలయ్యారు. కాగా, బీజేపీ నాయకుడు జితేందర్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. ప్రగతి భవన్ ముట్టడికి వస్తున్న ఎమ్మెల్సీ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్.. నిమ్స్‌లో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. -
‘ఇంటర్’ వెనుక పెద్దల హస్తం
సాక్షి, హైదరాబాద్: పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం సరిగా వ్యవహరించని కారణంగానే రాష్ట్రంలో 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఏర్పడలేదని, ఇది అసాధార ణ సమస్య అని పేర్కొన్నారు. ఇంత జరిగినా ప్రభు త్వం సరిగా వ్యవహరించకపోవటం దారుణమన్నా రు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల నుంచే తప్పిదాలు చోటు చేసుకున్నట్టు తేలినా బోర్డు సరిగా వ్యవహరించలేదని, దాన్ని పర్యవేక్షించే వారు పరిష్కారానికి చొరవ చూపలేదని, అదే ఇప్పుడు ఇందరు విద్యార్థుల మృతి, లక్షల కుటుంబాల్లో ఆవేదనకు కారణమైందన్నారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయతో కలసి మీడియాతో మాట్లాడారు. ఇంటర్ వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సారాంశంతో బీజేపీ ఏకీభవించడం లేదని తెలిపారు. ఇలాంటి పెద్ద పరీక్షలను నిర్వహించిన పరిపాలనపరమైన అనుభవం ఉన్నవారు కమిటీలో లేకపోవడం సరికాదని మురళీధర్‌రావు అభిప్రాయపడ్డారు. ఏదో కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈ నివేదికపై ప్రభావం చూపిందని స్పష్టంగా తెలుస్తోందన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం ఆశ్చర్యపరుస్తోందని, ఈ వ్యవహారానికి కారకులెవరో చెప్పకపోవటం విడ్డూరమన్నారు. ఎవరినో రక్షించేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని, ఈ వ్యవహారంలో దోషులకు ప్రభుత్వంలో పెద్దస్థాయి వారితో సన్నిహిత సంబంధాలుండటమే దీనికి కారణమనే అనుమానాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి, అసమర్ధత వల్లనే 23 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని దత్తాత్రేయ ఆరోపించారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా లేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డి పాత్రధారి అయితే సూత్రధారి ఎవరో ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల తప్పిదాల విషయంలో విద్యార్థుల కుటుంబాల పక్షాన పోరాటం చేస్తున్న రాజకీయ పార్టీలను అవహేళన చేస్తూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేసింది.విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఈ అక్రమాల వ్యవహారంలో ముఖ్య మంత్రి ఎందుకు మంత్రిపై చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించింది. గురువారం సాయంత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రతినిధి బృందం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతిపత్రం సమర్పించింది. ఇంటర్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకునేలా స్పందించాలని గవర్నర్‌ను కోరారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే ఇంటర్ స్థాయి పరీక్షల నిర్వహణ అనుభవం లేని గ్లోబరీనాకు ఎందుకు అప్పగించారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఫలితాల్లో తప్పిదాల వల్ల లక్షల మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని, 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం దిగొచ్చి న్యాయం చేసేవరకు బీజేపీ పోరాటం ఆపదని తేల్చి చెప్పారు. ఇకపై విద్యార్థులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు. ఇంత గొడవ నడుస్తున్నా వారం వరకు సీఎం కేసీఆర్ స్పందించకపోవటం విడ్డూరమని, కనీసం ఇప్పటికైనా స్పందించినందుకు సంతోషమన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేవరకు ఉద్యమం సాగుతుందని చెప్పారు. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. తమ విన్నపాన్ని గవర్నర్ తీవ్రంగానే పరిగణించారన్నారు. పిల్లలూ ధైర్యంగా ఉండండి: దత్తాత్రేయ తమ విన్నపానికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యార్థులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోవద్దని, వారు ధైర్యంగా ఉండాలని సూచించారు. వెంటనే ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇన్ని లక్షల మంది విద్యార్థుల మనోవేదనకు రాష్ట్రప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ నాయకురాలు డీకే అరుణ ఆరోపించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం కలచివేస్తోందన్నారు. ముఖ్యమంత్రి పాలన ఫామ్‌హౌస్‌కే పరిమితమైతే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆమె ఎద్దేవా చేశారు. విద్యార్థులతో చెలగాటం ఆడుతున్న సీఎంకు ఒక్క క్షణం కూడా ఆ కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. పార్టీ నేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, రామచంద్రరావు గవర్నర్‌ను కలసిన వారిలో ఉన్నారు. -
బీజేపీకి 300 సీట్లు ఖాయం
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్) : దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, ఫెడరల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏవీ కూడా బీజేపీ, ఎన్డీఏ ముందు సరితూగే పరిస్థితులు లేవని, ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు ఖాయమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ దేశ భద్రత, రైతు ఆదాయం రెట్టింపు, నిరుద్యోగ సమస్య, దేశ సౌభాగ్యం వంటి స్పష్టమైన విధానాలతో ముందుకెళ్తుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత ఫెడరల్ ఫ్రంట్ వస్తుందని ప్రచారం చేస్తున్నారని, కానీ ఆమె గెలుస్తుందన్న నమ్మకం లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య ఫలితాలు సాధిస్తుందని, ఓటింగ్ శాతం కూడా పెంచుకుంటుందన్నారు జోస్యం చెప్పారు. బీసీలకు టీఆర్ఎస్ తీరని అన్యాయం రాష్ట్రంలో టీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ ఆదరణ బాగా తగ్గిందని దత్తాత్రేయ పేర్కొన్నారు. బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్‌ను 34 శాతం నుంచి 23శాతానికి తగ్గించి తీరని అన్యాయం చేసిందన్నారు. బీసీలు టీఆర్ఎస్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. జడ్జీతో విచారణ చేయించాలి ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రంలో ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, దీనిపై జడ్జీతో విచారణ చేయించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కంటితుడుపు చర్యగా ప్రభుత్వం కమిటీని వేసిందని, ఫలితాలు పూర్తిగా తప్పులతడకగా ఉన్నాయన్నారు. ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాలన్నారు. అకాలవర్షాలు, వడగండ్లకు నష్టపోయిన రైతాంగానికి పరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యెండల లక్ష్మీనారాయణ, బస్వా లక్ష్మీనర్సయ్య, లోక భూపతిరెడ్డి, బద్దం లింగారెడ్డి, శివరాజ్, మల్లేష్‌యాదవ్, మనోహర్‌రెడ్డి, ఆకుల శ్రీనివాస్, న్యాలం రాజు, భరత్ భూషణ్, సంతోష్ పాల్గొన్నారు. ‘స్థానిక’ ఎన్నికల్లో సత్తాచాటాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ శ్రేణులు సత్తా చాటాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. సోమవారం నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశాన్ని జిల్లా ఉపాధ్యక్షుడు భరత్ భూషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఆదరణ తగ్గిందని, అందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం కానున్నాయని తెలిపారు. పార్టీ గుర్తుపై పోటీ చేసే అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త పని చేయాలని సూచించారు. జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అధిక సంఖ్యలో కైవసం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని, అందుకోసం నాయకులు, కార్యకర్తలందరూ సమష్టిగా కృషి చేయాలన్నారు. యెండల లక్ష్మీనారాయణ, లోక భూపతిరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి, బస్వా లక్ష్మీనర్సయ్య, గీతారెడ్డి, శివరాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
‘చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు’
సాక్షి, నిజామాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు గెలిచే పరిస్థితి లేదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా చంద్రబాబు పర్యటన చేస్తున్నారని.. ఆయన ప్రచారం వల్ల బీజేపీకి లాభమే కానీ నష్టం లేదన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ గాని, ఫెడరల్ ఫ్రంట్ గాని బీజేపీతో సరితూగే పరిస్థితి లేదని పేర్కొన్నారు. తమ పార్టీ 300 పైగా సీట్లు గెల్చుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిజామాబాద్‌లో ఎంపీ కవిత ఓటమి అంచుల్లో ఉన్నారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి కాబట్టే స్థానిక సంస్థల ఎన్నికల కోసం హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని అన్నివిధాల ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
దేశరక్షణ కోసం బీజేపీని గెలిపించాలి
హైదరాబాద్ : దేశరక్షణ, అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం బీజేపీని గెలిపించాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఇక్కడ సికింద్రాబాద్‌లోని హర్యానాభవన్‌లో బీజేపీ లింగ్విస్టిక్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో బాంబు పేలుళ్లతో దేశం అల్లకల్లోలమైందని, ముంబైలో జరిగిన ఉగ్రదాడికి సమాధానం చెప్పలేకపోయారని అన్నారు. పుల్వామాలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన కొద్ది రోజుల్లోనే దానికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ చేశామని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ చేసిన తర్వాత 17 దేశాల అధినేతలు మద్దతు ప్రకటించారని, పాకిస్తాన్‌ను ఏకాకిని చేశామని చెప్పారు. ఉగ్రవాదం కంటే నిరుద్యోగమే పెద్ద సమస్య అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెబుతున్నారని, కానీ ఉగ్రవాదం లేకుంటేనే ప్రతి పౌరుడు స్వేచ్ఛగా జీవించగలరని అన్నారు. ఉగ్రవాదం సమస్య కాకపోతే రాహుల్ ఎస్పీజీ రక్షణతో ఎందుకు బయటకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రతివ్యక్తి అభివృద్ధే దేశాభివృద్ధిగా భావించి మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. సంక్షేమ పథకాల డబ్బు మొత్తం నేరుగా ఇప్పుడు లబ్ధిదారులకు చేరుతుండటం హర్షించదగ్గ విషయమన్నారు. కళ్లకు గంతలు తీసి చూడాలి... ఆయుష్మాన్భారత్ పథకం ద్వారా దేశంలోని 50 కోట్ల మంది ఏడాది రూ.5 లక్షల మేరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చని చెప్పారు. యువత ఉపాధి కోసం రూ.800 కోట్ల ముద్ర రుణాలు అందించామని తెలిపారు. మోదీ ఏమి చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నిస్తున్నారని, కళ్లకు గంతలు తీసి చూస్తే అభివృద్ధి కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. నిద్రపోయే వారిని లేపవచ్చని, నిద్ర నటించేవారిని లేపడం కష్టమని విమర్శించారు. గతంలో బండారు దత్తాత్రేయను నాలుగుసార్లు ఎంపీగా గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలు ఈసారి కిషన్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి కాబట్టి ప్రజలు టీఆర్ఎస్కు ఓటు వేశారని, లోక్‌సభ ఎన్నికలు దేశానికి సంబంధించినవి కావడంతో ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో సర్కారు చెప్పే మాటలు కాకుండా ఉగ్రవాది మసూద్ అజార్ చెప్పే మాటలనే కాంగ్రెస్ విశ్వసిస్తోందన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ 15 ఏళ్లపాటు అసెంబ్లీలో ప్రజాగళం విప్పిన తనకు ఎంపీగా పార్లమెంటులో గళం విప్పే అవకాశం కల్పించాలని విన్నవించారు. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ మాత్రమేనని, ఆ పార్టీకి ఓటు వేయడం వల్ల ఒరిగేది ఏమి లేదని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంకేసీఆర్, కేటీఆర్‌కు బండారు దత్తాత్రేయ సవాల్లో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దానిని చూసి తట్టుకోలేకపోతున్న టీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు చేస్తున్నదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లకు మించి రావని మాట్లాడుతున్నారని, 300 సీట్లతో మోదీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్, కేటీఆర్ రాజకీయ సన్యాసం చేస్తారా? అని సవాల్ విసిరారు. గతంలో ఏరోజూ మోదీ గురించి, బీజేపీ గురించి మాట్లాడని కేసీఆర్ నేరుగా ప్రధానిని లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ వారు కేసీఆర్ ప్రధాని అంటూ పొగుడుతుంటే ఆయన మాత్రం నేను ప్రధాని అభ్యర్థిని కానని అంటుండటం ద్వంద్వ వైఖరని చెప్పారు. కేసీఆర్ చెప్పే ఫెడరల్ ఫ్రంట్ ఒక అతుకులబొంతని, దేశ రాజకీయాల్లో ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎవరూ గుర్తించరని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత దూషణలు చేయవద్దని చెప్పే కేసీఆర్, స్థాయి దిగజారి వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, మోదీని విమర్శించే నైతికత కేసీఆర్‌కు లేదన్నారు. తెలంగాణలో అవినీతి పెరిగిపోయిందని ఆయనే స్వయంగా అన్నారని, దానికి మీరు, మీ కుటుంబం బాధ్యులు కాదా? అని ప్రశ్నించారు. నియంతృత్వ పోకడలతో కేసీఆర్ ఆటవిక పాలనను కొనసాగిస్తున్నారని దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల విషయంలోనూ కేంద్రం రాష్ట్రానికి రూ.35 వేల కోట్లు గ్రాంట్స్ రూపంలో ఇచ్చిందన్నది వాస్తవమని, ఈ విషయంలో కేసీఆర్ రికార్డులను చూసుకోవాలన్నారు. కేంద్రం వివిధ పథకాలు, ఇతరత్రా మొత్తంగా రూ. 2.30 లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చిందని వివరించారు. జీఎస్టీ, ఐటీ కింద మేమే కేంద్రానికి ఇస్తున్నామని, కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్నది ముష్టి అని పేర్కొనడం పచ్చి అబద్ధమని చెప్పారు. -
తెలుగు ప్రజల ఓటు మోదీకే: దత్తాత్రేయ
సాక్షి,హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు నరేంద్ర మోదీకే ఓటు వేస్తారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ప్రజల్లో దేశం కోసం మోదీ, మోదీ కోసం దేశం అనే భావం ఉందన్నారు. టీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుందన్నారు. మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమితో పాటు, ఎల్బీనగర్ ప్రచారసభ జనం లేక వెలవెలపోవడం టీఆర్ఎస్కు అపశకునాలేనన్నారు. బీజేపీ కార్యాలయం లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మూడొందలకు పైగా స్థానాలు గెలుచుకుని కేంద్రంలో మోదీ ప్రభుత్వం మళ్లీ వస్తుందన్నారు. మోదీ ప్రభుత్వంలో టీడీపీతో సహా ఏ పార్టీ అయినా భాగస్వామ్యం అవుతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ దుకాణం త్వరలోనే బంద్ అవుతుందన్నారు. సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఏప్రిల్ 4న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కరీంనగర్, వరంగల్ బహిరంగసభల్లో, 2న నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం పరిధిలో జరిగే సభలో కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పాల్గొంటారని చెప్పార -
మళ్ళీ మోదీనే ప్రధాని: బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు కుటుంబ పాలన పార్టీలని బీజేపీ మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ కంటే భిన్నమైన, నైతిక విలువలు ఉన్నపార్టీ అని కొనియాడారు. బీజేపీ సేవా భావంతో పని చేసే విలువలు గల పార్టీ అని అన్నారు. నైతిక విలువలు లేని పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ ప్రధాన మంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పేరు వస్తుందని ప్రధాన మంత్రి ఫసల్ రైతు యోజనా పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం అమలులో చేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ తండాకు కోటి రూపాయలు తో నాబార్డు నిధులతో రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. దేశంలో ఇప్పటి వరకు 8 లక్షల కోట్లు రూపాయలు చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చామని తెలిపారు. -
టికెట్ ఇవ్వలేదని పార్టీ మారను
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ టికెట్ ఇవ్వలేదని పార్టీ మారే వ్యక్తిని కానని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. పార్టీ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిందని, ఈ విషయంలో తనకు పూర్తి సంతృప్తి ఉందన్నారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం 1980లో మొదలైందని, తానెప్పుడూ టికెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరలేదని చెప్పారు. శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్లో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. తాను ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిషన్‌రెడ్డికి తన ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఈ స్థానంలో బీజేపీని గెలిపిస్తామన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతున్నట్టు ఆ పార్టీ రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లను గెలుస్తుందనుకోవడం ఓ భ్రమేనని దత్తాత్రేయ వ్యాఖ్యా నించారు. తమది జాతీయ పార్టీ అని.. టీఆర్ఎస్ది ప్రాంతీయ పార్టీ మాత్ర మే అన్న విషయాన్ని గ్రహించాలన్నారు. కేసీఆర్‌కు ఒక స్పష్టమైన ఆలోచన విధానం లేదని, అయోధ్యలో రామమందిరం గురించి స్పష్టంగా మాట్లా డేది బీజేపీ మాత్రమేనన్నారు. మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సునీతా లక్ష్మారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించామన్నారు. వివిధ పార్టీల నుంచి బీజేపీలోకి వస్తారే కానీ.. బీజేపీ నుంచి ఎవరూ వెళ్లబోరని స్పష్టం చేశారు. -
మోదీపై మెత్తబడ్డ చంద్రబాబు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ గాలి వీస్తుండటంతో ఆయనను విమర్శించే విష యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మెత్తబడ్డారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఏపీ ఎన్నికల్లో గెలుస్తామో లేదో అన్న అనుమానంలో చంద్రబాబు ఉన్నారని, అందు కే మోదీని విమర్శిస్తే ఇక లాభం లేదని గ్రహిం చి ఇల్లు సర్దుకొనే పనిలో పడ్డారన్నారు. బుధవారం ఢిల్లీలో దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం చూసి టీడీపీ, టీఆర్‌ఎస్‌లతోపాటు జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల కూటమిలో కలవరపాటు మొదలైందన్నారు. ఇన్ని రోజులు ప్రధానిపై దుష్ప్రచారం చేసిన బాబు దాన్ని తగ్గించారని గుర్తు చేశారు. ఇదంతా దేశవ్యాప్తంగా ప్రజలు మోదీని కోరుకుంటుండటమే కారణమన్నారు. టీడీపీకి సీనియర్ నేతలు, ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం రాజీనామాలు చేసి వైఎస్సార్సీపీలో చేరిపోతుండటంతో బాబు ఆత్మావలోకనంలో పడ్డారన్నా రు. ఇక కేంద్రంలో సర్కారు ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని అం టున్న టీఆర్ఎస్ నేతలవి పగటి కలలే అని, టీఆర్ఎస్ మద్దతు లేకుండానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తెలంగాణలో 17 స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. తమను తక్కువ అంచనా వేయవద్దని హితవు పలికారు. ‘న్యూ ఇండియా, స్ట్రాంగ్ ఇండియా, యునైటెడ్ ఇండియా’ లక్ష్యంగా పార్టీ మేనిఫెస్టో రూపకల్పన జరుగుతోందని చెప్పారు. ఇక కేంద్రం ఇటీవల ఈడబ్ల్యూఎస్‌లకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను తెలంగాణలో అమలు చేయడం లేదని, రిజర్వేషన్లను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వా నికి ఆదేశాలివ్వాల్సిందిగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరినట్టు తెలిపారు. సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ గా తానే బరిలో ఉంటానని చెప్పారు. -
‘సికింద్రాబాద్ నుంచి నేనే పోటీ చేస్తా’
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తాను బరిలో ఉన్నానని బీజేపీ సీనియర్‌నేత బండారు దత్తాత్రేయ అన్నారు. అయితే అదిష్టానం ఆదేశిస్తేనే పోటీచేస్తానని, ఒకవేళ తనను కాదని వేరే వారి పేరును ప్రకటించిన కూడా అభ్యంతరం లేదని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 పార్లమెంట్ స్థానాల నుంచి బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే తమ పార్టీయే ముందంజలో ఉందన్నారు. కేంద్రంలో టీఆర్ఎస్ సహకారం లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో అన్ని సమస్యల పరిష్కారం నరేంద్ర మోదీ ఒక్కడి వల్లనే సాధ్యమవుతందన్న విశ్వాసం ప్రజల్లో రోజురోజుకు బలపడుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి బలం పెరగడమే కాకుండా బీజేపీ సొంతంగా 300 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్య చెప్పారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు మహాకూటమి అనే ఏర్పాటును పక్కన పెట్టి తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. తన పార్టీ గెలుపుపై నమ్మకం కోల్పోయిన చంద్రబాబు కలవరపాటుకు గురై దేశ రాజకీయాలను పక్కకు పెట్టి వచ్చారన్నారు. టీఆర్ఎస్ సొంతబలంతో కాకుండా అద్దె బలంతో గెలుచుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. త్వరలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వచ్చి ప్రచారం చేస్తారని చెప్పారు. -
టీఆర్ఎస్ ప్రధాని అభ్యర్థి ఎవరు?
హైదరాబాద్: కొన్ని రోజులుగా 16 ఎంపీ సీట్లను గెలుస్తామంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఊదరగొడుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలని కేటీఆర్‌కు సవాల్ విసిరారు. బీజేపీ, ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ గ్రౌండ్స్‌లో బీసీల ఆత్మగౌరవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ బీజేపీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యా యం జరిగిందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారని ఉద్ఘాటించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా విద్య, ఉద్యోగాల్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నా రు. కొన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుందని ఆరోపించారు. మోదీ ప్రధాని అయ్యాక కొద్ది రోజులకే కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి అన్ని అర్హతలు కల్పించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ మజ్లిస్‌తో స్నేహం చేస్తూ విచిత్రమైన రాజకీయాలకు తెరలేపుతోందన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజలంతా ఒక్కటై బీజేపీకి అత్యధిక ఎంపీ సీట్లు గెలిపించి మోదీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోదీ బీసీ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న బీసీలపై ఆయన మమకారం చూపించారన్నారు. కులం రంగు పులుముకోకుండా అగ్రకులస్తులకు కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత మోదీదే అని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీరాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నిరాశతోనే చంద్రబాబు విమర్శలు: దత్తాత్రేయ
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోవడం వల్లే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ దత్తాత్రేయ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా చోరీకి గురైందో చెప్పకుండా మోదీపై చంద్రబాబు విమర్శలు చేయడం శోచనీయమని దుయ్యబట్టారు. ఏపీకి రైల్వే జోన్ ఇచ్చినా దానిపై కూడా బాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ఇలాంటివి మానుకుని ఏపీలోని ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పార్టీ 16 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పడం ఆయన అహంభావానికి నిదర్శనమన్నారు. టీఆర్ఎస్ 6 స్థానాలు గెలిస్తే అదే గొప్ప అని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో ఖాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి లేఖ రాసినట్టు దత్తాత్రేయ తెలిపారు. -
‘టీఆర్ఎస్ 6 స్థానాలు గెలిస్తే గొప్పే’
ఢిల్లీ: తెలంగాణా పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలు గెలుస్తామనడం కేటీఆర్ అహంభావానికి ప్రతీకని సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. ఢిల్లీలో దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ..టీఆర్ఎస్ ఆరు ఎంపీ స్థానాలు గెలిస్తే గొప్పేనన్నారు. తెలంగాణాలో బీజేపీ బలంగా ఉందని, రేపు తెలంగాణాలో అమిత్ షా పర్యటిస్తారని వెల్లడించారు. తెలంగాణాలో కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే శాఖా మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీ గుర్తులపై గెలిచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించడం అప్రజాస్వామికమన్నారు. ప్రజస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడం సరికాదన్నారు. బీజేపీ తెలంగాణాలోని 17 స్థానాల్లో పోటీ చేస్తుందని, అలాగే తాను సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు. ఆ దాడులు చరిత్రలో నిలిచిపోతాయ్..! పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టడమే లక్ష్యంగా భారత వైమానిక దళం చేసిన దాడులు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్యానించారు. భారత్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ప్రపంచ దేశాలు మద్ధతుగా నిలవడం దౌత్యవిజయమన్నారు. వైమానిక దాడులను ప్రతిపక్షాలు రాజకీయం చేయడం సరికాదన్నారు. భారత వైమానిక దళం టెర్రరిస్టు స్థావరాలపై దాడులు చేయడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ఆ బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే.. ఆధార్ సమాచారాన్ని భద్రంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని దత్తాత్రేయ స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. ప్రధానిపై అభాండాలు వేసి అప్రదిష్టపాలు చేయడం సరికాదన్నారు. విశాఖ కేంద్రంగా జోన్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంటే దానిని తప్పుపట్టడం సరికాదన్నారు. డివిజన్ పేరుతో జోన్ల ఏర్పాటు ఉంటుందే తప్ప రాష్ట్రాల పేరుతో జోన్ల ఏర్పాటు ఉండదన్నారు. ఇలాంటి విషయాలను కూడా రాజకీయం చేయడం చంద్రబాబుకు తగదన్నారు. -
ఓట్ల గల్లంతుపై చర్యలు చేపట్టండి: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఓట్ల గల్లంతుపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండా రు దత్తాత్రేయ అన్నా రు. ఈ మేరకు ఆయన ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి సచివాలయంలో సీఈవో రజత్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం దత్రాత్తేయ మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఒక్క సికింద్రాబాద్‌లోనే 4 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, హైదరాబాద్ మొత్తం ఇలాగే జరిగిందని ఆరోపించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు సరిగా పనిచేయకపోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. దీనిపై కమిషనర్ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. విజయ్ సంకల్ప దివాస్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. -
వేల సంఖ్యల్లో ఓట్లు గల్లంతయ్యాయి : దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : ఓట్ల గల్లంతుపై రాష్ట్ర ప్రదాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌కు బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, రాంచదర్‌రావు ఫిర్యాదు చేశారు. 2018 ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో వేల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని దత్తాత్రేయ తెలిపారు. మల్కాజ్‌గిరిలో వేల సంఖ్యలో ఓట్లు తొలగించారని, కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నామన్నారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్ చొరవ చూపాలని కోరారు. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్యలు వస్తున్నాయన్నారు. విజయ సంకల్ప దివస్ కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతించకపోవడంపై దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్‌లో కార్యక్రమం చేసుకుంటామంటే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమన్నారు. -
మోదీ చొరవతోనే అభినందన్ విడుదల: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ చొరవతోనే అభినందన్ విడుదలయ్యారని కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. భారత దౌత్య నిర్ణయాలతో ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఏకాకి అయ్యిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..అభినందన్ భారత్‌కు తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. భారత్ చేస్తున్న పోరాటం తీవ్రవాదులపైనేనని, పాక్‌పై యుద్ధం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసే బాధ్యతను పాక్ తీసుకోవాలని, అప్పుడే శాంతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. పుల్వామా దాడుల తర్వాత భారత వైమానిక దళాల విజయ పరంపర దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఒకే తాటిపై ఉన్నాయనే సంకేతాలు ప్రపంచానికి స్పష్టమయ్యాయన్నారు. బీజేపీకి 300 సీట్లు ఖాయం మోదీ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరిగిందని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు ఖాయమని దత్తాత్రేయ జోస్యం చెప్పారు. తెలంగాణలోని అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి గెలవబోతుందని, బలమైన అభ్యర్థులు పోటీలో ఉంటారన్నారు. ఎన్నికలకు పలు కార్యక్రమాలు రూపొందించామని అవి విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పటికీ పాలన గాడిలో పడలేదన్నారు. కీలక శాఖలన్నీ కేసీఆర్ దగ్గరే పెట్టుకోవడంతో పనులు జరగడం లేదన్నారు. పురపాలక శాఖలో ఫైళ్లు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయన్నారు. యూపీఏలోని పార్టీలు జాతీయస్థాయిలో పొత్తు కుదుర్చుకుంటాయని, రాష్ట్రాల్లోనేమో కలిసి ఉండవన్నారు. -
మోదీ చొరవ వల్లే అభినందన్ విడుదల: దత్తాత్రేయ
హైదరాబాద్: పుల్వామా దాడుల తర్వాత భారత వైమానిక దళాల విజయ పరంపర ఈ దేశాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్తుందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. శుక్రవారం బండారు దత్తాత్రేయ విలేకరులతో మాట్లాడుతూ.. భారత ప్రభుత్వం తీసుకున్న దౌత్య నిర్ణయాలు పాకిస్తాన్‌ని ఏకాకి చేశాయన్నారు. అభినందన్ భారత్‌కి తిరిగి రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మోదీ చొరవ వల్లే అభినందన్ విడుదల అవుతున్నారని చెప్పారు. దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఒకే తాటిపై ఉన్నాయనే సంకేతాలు ప్రపంచానికి స్పష్టమయ్యాయని అన్నారు. భారత ప్రభుత్వం చేస్తున్న పోరాటం కేవలం తీవ్రవాదులపైనేనని అన్నారు. పాక్‌పై యుద్ధం చేయాలనేది భారత ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని వ్యాఖ్యానించారు. పాక్ ఉగ్రవాద కేంద్రాలను నాశనం చేసే బాధ్యత పాక్ తీసుకోవాలని సూచించారు. అప్పుడే శాంతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. తెలంగాణాలో అన్నిస్థానాల్లో పోటీ తెలంగాణాలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి గెలవబోతున్నామని జోస్యం చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు పోటీలో ఉంటారని వ్యాక్యానించారు. ఎన్నికల కోసం పలు కార్యక్రమాలు రూపొందించామని, అవి విజయవంతంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం పెరిగినట్లు సర్వేల ద్వారా స్పష్టమవుతోందని చెప్పారు. పాలన గాడిలో పడలేదు! కేసీఆర్ కేబినేట్ విస్తరించినప్పటికీ పరిపాలన గాడిలో పడలేదని విమర్శించారు. కీలక శాఖలన్నీ కేసీఆర్ దగ్గరే పెట్టుకోవడంతో పనులు జరగడం లేదని వివరించారు. పురపాలక శాఖల్లో ఫైల్స్ కుప్పలు కుప్పలుగా పేరుకుపోయి ఉన్నాయని అన్నారు. యూపీఏలోని పార్టీలు జాతీయస్థాయిలో పొత్తు పెట్టుకుంటాయి.. కానీ రాష్ట్రాల్లో కలిసి ఉండవని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తప్పక 300 సీట్లు గెలుస్తుందని జోస్యం చెప్పారు. -
ఉపవర్గీకరణతోనే బీసీ కులాలకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు 5వేలకు పైగా ఉన్న బీసీ కులాల వారికి న్యాయం జరగాలంటే ఉపవర్గీకరణతోనే సాధ్యపడుతుందని జాతీయ ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణి అభిప్రాయపడ్డారు.బీసీ వర్గీకరణ అనే అంశంపై దత్తాత్రేయ అధ్యక్షతన శనివారం ఎన్‌కేఎం గ్రాండ్ హోటల్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రోహిణి మాట్లాడుతూ ‘‘దేశంలో దాదాపు 5 వేలకు పైగా బీసీ కులాలున్నాయి. వీటిలో ఆరేడు మాత్రమే అభివృద్ధి చెందాయి. అన్నీ అభివృద్ధి చెందాలంటే బీసీ ఉప వర్గీకరణ చేయాలి. ఇది చేయకపోతే మరో 50 ఏళ్లయినా అత్యంత వెనుక బడిన కులాల్లో మార్పు రాదు. వృత్తుల ఆధారంగా కొన్ని బీసీ కులాలపై వివక్ష చూపించారు. ఎస్సీ, ఎస్టీ మాదిరిగా వెనకబడిన తరగతులు పదానికి స్పష్టమైన నిర్వచనాన్ని రాజ్యాంగంలో పొందుపరచ లేదు. బీసీలకు చట్టసభల్లో ఇప్పటివరకు రిజర్వేషన్లు లేవు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి. చట్టసభల్లో అవకాశం కల్పిస్తేనే వారి పక్షాన మాట్లాడే అవకాశం ఉంటుంది. బీసీల్లో అభివృద్ధి చెందిన కులాలతో అభివృద్ది చెందనివి పోటీపడలేకపోతున్నాయని అన్నారు. ఉపవర్గీకరణతో అందరికీ న్యాయం జరుగు తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కులం ఇప్పటికీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మనిషి అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అందరికీ అందాలి’’ అని అన్నారు. మోదీ వల్లే ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత.. బీసీల్లోని అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేసేందుకే ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారనీ, ఇది ప్రధాని నరేంద్రమోదీ ద్వారానే సాధ్యమైందని సభకు అధ్యక్షత వహించిన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘ఓబీసీ కమిషన్‌కు చట్టబద్దత కల్పించడం చరిత్రాత్మకం. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేకపోవడం వల్ల రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాలేదు. ఎస్సీ ఎస్టీలకు జరిగినట్లుగా ఇంతకాలం బీసీలకు న్యాయం జరగలేదు. అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టా రీతిన కులాలను బీసీల్లో కలుపుకుంటూ పోయాయి. దేశంలో వేలాదిగా ఉన్న బీసీ కులాల ఉపవర్గీకరణకు ప్రధాని మోదీ నడుంకట్టి ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడం గొప్ప విషయం. ఈ కమిషన్ ద్వారా పేద వర్గాల బీసీలకు ఎంతో న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఈ సమావేశంలో 175 మంది బీసీ నేతలు, మేధావులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
‘మంత్రివర్గంలో వారు లేకపోవడం బాధాకరం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంత్రివర్గాన్ని విస్తరించడం సంతోషకరమని, అయితే మంత్రివర్గంలో మహిళలలకు, ఎస్టీలకు స్థానం లేకపోవడం బాధాకరమని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. వారు ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నానన్నారు. గతంలో కూడా మహిళా మంత్రి లేకుండానే ప్రభుత్వం నడిచిందని, ప్రతిపక్షాలు ఎంత చెప్పినా సీఎం పట్టించుకోలేదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎంను ఉల్లంఘించి అప్పులు చేస్తోందని, కేంద్ర పథకాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలను 15వ ఆర్థిక సంఘం దృష్టికి తీసుకెళ్లామని దత్తాత్రేయ తెలిపారు. కొత్త రాష్ట్రం అయినందున ఎక్కువ నిధులను కేటాయించాలని, హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరామన్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీసీల ఆత్మగౌరవ సభ పోస్టర్, కరపత్రాన్ని విడుదల చేశారు. -
‘చంద్రబాబు, కుమారస్వామికి గుణపాఠం’
సాక్షి, హైదరాబాద్ : శారదా, రోజ్‌వ్యాలీ చిట్‌ఫండ్ కుంభకోణాలకు సంబంధించి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను విచారించేందుకు అనుమతించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. సీబీఐ ఎదుట కోల్‌కతా కమిషనర్ హాజరు కావాల్సిందేనని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ దత్తాత్రేయ స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం. అంతర్యుద్దానికి, రాజ్యాంగ సంక్షోభానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యత్నించారు. బెంగాల్ ఒక దేశమన్నట్లు వ్యవహరించరాదు’ అని హితవు పలికారు. ‘బెంగాల్ సీఎం, డీజీపీ, కోల్‌కత పోలీస్ కమీషనర్ కలిసి దీక్ష పేరుతో నాటకం ఆడారు. శారదా చిట్‌ఫండ్ కుంభకోణంలో శిక్ష తప్పించుకోవడానికే సీబీఐ అధికారులపట్ల దారుణంగా వ్యవహరించారు. నేరస్తులవలె లాక్కెళ్లారు. కానీ, అసలు నేరస్తులకు మాత్రం రక్షణ కల్పించారు. చివరకు సత్యమే జయించింది. మమతా బెనర్జీకి ఇక ముఖం చెల్లదు. వినశకాలే విపరీత బుద్ధి’ అని వ్యాఖ్యానించారు. సుప్రీం తీర్పు ప్రకారం రాజీవ్ కుమార్ విచారిస్తే నిజం నిరూపణ అవుతుందన్నారు. ‘ఏపీ సీఎం చంద్రబాబు, అఖిలేష్ యాదవ్, కుమార స్వామి, దేవేగౌడకు ఇదొక గుణ పాఠం. ఈ తీర్పు వారికి చెంపపెట్టు. ఆంధ్రప్రదేశ్‌లో పాలనా వైఫల్యాలనుంచి దృష్టి మళ్లించడానికే చంద్రబాబు కేంద్రం ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారు. మమతకు మద్దతు తెలుపుతున్నారు. అంతకుమించి ఏమీ లేదు’ అని ఒక ప్రకటలో చెప్పారు. -
ఇది నవభారత బడ్జెట్: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నవభారత నిర్మాణం కోసం ఉద్దేశించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం ఇక్కడ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్‌లో తాజా కేంద్ర బడ్జెట్‌పై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ నోట్లరద్దు, జీఎస్టీ వల్ల కోటిమంది అదనంగా ఐటీ పరిధిలోకి వచ్చారని, ఆదాయపన్ను ద్వారా దాదాపు ఆరు లక్షల కోట్ల రూపాయలు సమకూరాయన్నారు. కోటి 53 లక్షల మంది పేదలకు సొంతింటి కల సాకారం చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. డబుల్‌బెడ్ రూమ్ పథకం కేవలం పత్రికా ప్రకటనలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్ ఎంపీ దత్తాత్రేయ మాట్లాడుతూ రక్షణ రంగానికి మొదటిసారిగా రూ.మూడు లక్షల కోట్ల భారీ కేటాయింపులు జరిగాయన్నారు. ఇది పీపుల్స్ బడ్జెట్ బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూలేని విధంగా ఐదేళ్లకోసారి జరిగే సర్వే ఇప్పుడు క్వార్టర్లీగా జరుగుతోందంటూ దాని లాభాలను వివరించారు. ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌ను పీపుల్స్ బడ్జెట్‌గా అభివర్ణించారు. 33 కోట్ల కుటుంబాలకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మాట్లాడుతూ జనాకర్షణ, శాస్త్రీయత రెండూ సమపాళ్లలో ఉన్నాయని, ఇదొక ప్రాక్టికల్ బడ్జెట్ అని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంపై సీఎం విమర్శలు సరికాదు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సంఘాలపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వాటిపై దురుద్దేశాలు ఆపాదించే విధంగా ఉన్నాయని కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. ఇవి పూర్తిగా సత్యదూరమని, ముఖ్యమంత్రి హోదాకు తగినవి కాదని ఆదివారం సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పర్యటనకు 15వ ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) వస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. రాష్ట్రాల్లో పర్యటించడానికి ముందే ఆర్థికసంఘం ఓ అభిప్రాయాన్ని కలిగి ఉన్నట్టుగా సీఎం పేర్కొనడం సరికాదన్నారు. ఆర్థికపరమైన విషయాల్లో కేంద్రం–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు సవ్యంగా నిర్వహించేలా చూడటంలో ఆర్థికసంఘం పాత్ర ఉందన్నారు. ప్రధానిగా నరేంద్రమోడీ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రాలకు కేటాయింపులను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలన్న 14వ ఆర్థికసంఘం సిఫార్సులను అమలుచేశారని గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం మాత్రం స్థానికసంస్థలకు అధికారాలు, నిధుల వికేంద్రీకరణ చేయలేదన్నారు. -
రిజర్వేషన్లు ఎందుకు పెంచట్లేదు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచేందుకు చట్టం చేసే అధికారం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ప్రశ్నిం చారు. ఈ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అందుకే మైనార్టీ, ఎస్టీలకు రిజర్వేషన్లపై కేవలం తీర్మానం చేసి పంపి కేంద్రంపై నెపం నెడుతున్నారని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ సిద్ధంగా లేదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసిందన్నా రు. గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్లు కల్పించాలనుకుం టే రాష్ట్ర ప్రభుత్వాలే చట్టం చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సైతం చెప్పిందన్నారు. తెలంగాణకు వివిధ గ్రాంట్లు, ప్రాజెక్టులకు కేంద్రం ఇస్తున్న నిధులపై తాను బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. కేంద్ర సాయం విషయంలో టీఆర్ఎస్ నేతలవి తప్పుడు ఆరోపణల న్నారు. కేంద్రంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. అగ్రకులాల్లోని పేదలకు రిజర్వేషన్లు ఇస్తూ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లు చారిత్రాత్మకం అని తెలిపారు. రిజర్వాయర్లు లేకుండా దేవాదు ల ప్రాజెక్టును ఎలా చేపడతారని ప్రశ్నించారు. కంతనపల్లి వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి అనుకూలత ఉన్నా తుపాకుగూడెం వద్ద నిర్మించడం వల్ల ఏం ప్రయోజనం అని ప్రశ్నించారు. శుక్ర, శనివారాల్లో బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు తెలిపారు. -
కేంద్రంపై కేటీఆర్ విమర్శలన్నీ అబద్ధాలే..
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలు అబద్ధాలని కేంద్ర మాజీమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం నీతి, నిజాయితీలతో కొనసాగుతోందన్నారు. టీమిండియా కాన్సెప్ట్‌తో అన్ని రాష్ట్రాల సీఎంలతో కలసి ముందుకు సాగుతున్నారని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి అనుకూలంగా ఉంటా యని గ్రహించే మోదీ ప్రభుత్వంపై నిందలు వేయడం ద్వారా ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై కేం ద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ అహంకార పూరిత ధోరణిలో ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 24 గంటల కరెంట్ కేంద్రం పుణ్యమే.. నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం పైసా ఇవ్వలేదనడం అబద్ధమని దత్తాత్రేయ చెప్పా రు. కేంద్రం తెలంగాణకు వివిధ గ్రాంట్ల రూపంలో దాదాపు రూ.2 లక్షల కోట్లు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణలో 24 గంటల కరెంటు కేంద్రం పుణ్యమేనని వెల్లడించారు. 11 సాగునీటి ప్రాజెక్టులు, ఉత్తర, దక్షిణ పవర్ గ్రిడ్ల అనుసంధానం, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు రూ. 50 వేల కోట్లను కేటాయించిందన్నారు. ఎన్టీపీసీ 4 వేల మెగావాట్లు, మహబూబ్‌నగర్‌లో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో 2,400 కిలోమీటర్లు జాతీయ రహదారులుంటే కేంద్రం వాటిని 5,600 కిలోమీటర్లకు పెంచిందని చెప్పారు. తెలంగాణలో కేంద్రం ఎయిమ్స్ ఏర్పాటు, రామగుండంలో ఎరువుల పరిశ్రమను తిరిగి తెరిపిస్తోందన్నారు. వరంగల్‌లో టెక్స్టైల్స్ పార్క్, కరీంనగర్–నిజామాబాద్ రైల్వేలైన్లను పూర్తి చేసింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 2.10 లక్షల ఇళ్లను మంజూరు చేసిందన్నారు. అత్యధిక నిధులు తెలంగాణకే.. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల రూ.1,700 కోట్ల నిధులు వెనక్కి పోయే పరిస్థితి వచ్చిందని, దీనిపై కేసీఆర్ ప్రభుత్వం స్పందించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులకు తన వాటా నిధులను మంజూరు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులు వచ్చింది తెలంగాణకేనని చెప్పా రు. శబరిమల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పవన్నారు. -
కేటీఆర్ వ్యాఖ్యలు సత్యదూరం : దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన విమర్శలు సత్యదూరమని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నీతి, నిజాయితీలతో కొనసాగుతుందని తెలిపారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో కలిసి మోదీ ముందుకు సాగుతున్నారన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేంద్రంపై అహంకార పూరిత దోరణిలో ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉంటాయని గ్రహించే మోదీ ప్రభుత్వంపై నింద వేయడం ద్వారా ఓటర్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి పైసా ఇవ్వలేదనడం సరికాదని, రెండు లక్షల కోట్లను అనేక గ్రాంట్ల రూపంలో ఇవ్వడం జరిగిందన్నారు. 11 సాగునీటి ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్ సరఫరాకు ఇతర, దక్షిణ పవర్గ్రిడ్లను అనుసంధానం చేయడానికి, యాదాద్రి పవర్ ప్రాజెక్ట్‌కు రూ. 50 వేల కోట్లను కేటాయించిందని స్పష్టం చేశారు. ఎన్టీపీసీ 4వేల మెగావాట్లు, మహబూబ్‌నగర్ లో వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును కేంద్రం ఏర్పాటు చేసిందన్నారు. తెలంగాణలో 24 గంటల కరెంట్.. కేంద్ర ప్రభుత్వ పుణ్యమేనన్నారు. రాష్ట్రంలో 2400 కిలోమీటర్లు జాతీయ రహదారులను 5600 కిలోమీటర్లకు కేంద్రం పెంచిందని, దీని కోసం రూ.60వేల కోట్లను ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ఎయిమ్స్ ను ప్రకటించామని, రామగుండంలో ఎరువుల పరిశ్రమను తిరిగి తెరిపిస్తున్నామన్నారు. వరంగల్‌లో టెక్స్టైల్స్ పార్క్, కరీంనగర్-నిజామాబాద్ రైల్వే లైన్ లను పూర్తి చేసింది కేంద్రం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి 2.10 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్ల ప్రధాని సడక్ యోజన కింద రూ. 1700కోట్ల నిధులు వెనక్కి పోయె పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాలని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను మంజూరు చేయకపోవడం వల్లే కేంద్రం నుంచి రెండు వేల కోట్లు రాకుండా పోయాయన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం సిద్దంగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందన్నారు. కేంద్రం నుంచి అత్యధిక నిధులను సాధించింది రాష్ట్ర ప్రభుత్వమేనని, రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధులు, ప్రాజెక్టులు.. పథకాల పై ఈ బుక్‌ను ప్రింట్ చేసి గ్రామ గ్రామాన పంపిణీ చేస్తామన్నారు. శబరిమల విషయంలో కమ్యూనిస్టు ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని, సుప్రీంకోర్టు తీర్పును ఎవరూ వ్యతిరేకించడం లేదన్నారు. ప్రభుత్వమే బలవంతంగా ఇద్దరు మహిళలను ఆలయంలోకి పంపిందని, భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తప్పవని హెచ్చరించారు. కమ్యూనిస్టులు తమ ఉనికిని కాపాడుకోవడానికే శబరిమలలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. -
‘బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో నిర్లక్ష్యం’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు హామీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఎంపీ దత్తాత్రేయ విమర్శించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్లాంట్ ఏర్పాటుకై రాష్ట్ర ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలపై కేంద్రానికి ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదని, ఇదే విషయాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ తనకు చెప్పారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కేంద్రం అడిగిన సమాచారాన్ని ఇవ్వాలన్నారు. హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్‌లో రూ.600 కోట్లతో నిర్మాణంలో ఉన్న కొత్త ఆయిల్ టెర్మినల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, అలాగే రూ.2,321 కోట్లతో నిర్మాణంలో ఉన్న పారదీప్–హైదరాబాద్ పైప్‌లైన్‌ను కొత్త ఆయిల్ టెర్మినల్‌కు అనుసంధానంగా ఉపయోగించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలసి కోరినట్టు దత్తాత్రేయ తెలిపారు. -
మోదీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వం పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిరోజూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. విమర్శలు చేయడం ఆయనకు అలవాటుగా మారిపోయిందన్నారు. బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఇటీవల మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతూ 2004లో మోదీని వ్యతిరేకించానని, ఆయన్ని తొలగించాలని వాజ్‌పేయికి చెప్పానని పేర్కొన్నారని, మరి 2014లో ఎందుకు మోదీ కాళ్లు పట్టుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం పదవి కోసం, 2014లో గెలుపుకోసం తాపత్రయ పడ్డారని, అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారన్నా రు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు, అప్పటి గవర్నర్‌తో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి సీఎం అయిన చంద్రబాబు, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రాజ్యాంగ సంస్థలను దెబ్బతీయడంతోపాటు ప్రజాస్వామ్యాన్ని కాలరాసిన కాంగ్రెస్‌తో ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తానంటూ చంద్రబాబు బయలుదేరారని విమర్శించా రు. మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను దత్తాత్రేయ ఖండించారు. రాహుల్‌కు రాజకీయ పరిపక్వత రాలేదని, ఆర్థికపరమైన అవగాహన కూడా లేదన్నా రు. జీఎస్టీలో పన్ను శాతం తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని దత్తాత్రేయ స్వాగతించారు. రఫేల్‌లో ఎలాంటి అవినీతి లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక కూడా కాంగ్రెస్ నేతలు దాని గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఫిరాయింపులతో అవమానపరుస్తున్నారు.. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం అప్రజాస్వామికమని దత్తాత్రే య పేర్కొన్నారు. ప్రజాతీర్పును గౌరవించకుండా పార్టీ ఫిరాయింపులతో కేసీఆర్ ప్రజలను అవమాన పరుస్తున్నారని విమర్శించారు. 88 స్థానాలతో ప్రజ లు పూర్తి మెజారిటీ ఇచ్చినా కూడా సభలో ప్రతిపక్షం అనేది లేకుండా చేయడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి న శాసన మండలి చైర్మన్ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్ని విధాలుగా సహకారం అందిస్తోందన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్ర కేబినెట్ ఒప్పుకుందని, 362 కి.మీ రీజినల్ రింగు రోడ్డుకు ఆమోదం తెలిపిం దన్నారు. టీఆర్ఎస్ నేతలు ఇప్పటికైనా కేంద్రాన్ని నిందించడం మానుకోవాలని హితవు పలికారు. 54 లక్షల మంది రైతుల్లో ఇంకా 9.5 లక్షల మందికి రైతుబంధు అందలేదన్నారు. ఇంకా 5 లక్షల మందికి పాస్ బుక్లే ఇవ్వలేదని విమర్శించారు. -
కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారమని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు భారీ వ్యత్యాసం ఉంటుందని, అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర పరిస్థితిపైనే ఆధారపడి ఉంటాయన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ అంశాలతో ముడిపడి ఉంటాయని, కేంద్రంలో ప్రధాని మోదీకే భారతీయులు మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 300 సీట్లు వస్తాయని, యువత, రైతులు బీజేపీకే మద్దతిస్తున్నారని వెల్లడించారు. దేశ సమగ్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణలో మోదీని మించిన నాయకుడు లేరని కొనియాడారు. రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, భారీ మొత్తంలో ధాన్యం తడవడంతో వాటి కొనుగోలుకు ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు ప్రయత్నం టీఆర్ఎస్కు ఉపయోగపడింది’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ను బలోపేతం చేసే ప్రయత్నం అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఉపయోగపడిందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అసెంబ్లీ ఎన్నికల్లోని అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం అవుతామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు గెలుచుకొని మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్, చంద్ర బాబు కూటములు దేశ రాజకీయాల్లో పనిచేయవని ఎద్దేవా చేశారు. తెలంగాణలో జరిగే పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలలో ఈ కేటగిరి(BC-E) ఏర్పాటు చేసి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు వల్ల అనేక మంది ఓటింగ్‌లో పాల్గొనలేకపోయారని, పంచాయతీ ఎన్నికల్లో ఆ పరిస్థితి రాకుండా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో దెబ్బ తిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
బాబు భ్రమల్లో జీవిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: ‘తన వల్లే సైబరాబాద్ అభివృద్ధి చెందిందన్న భ్రమల్లో ఏపీ సీఎం చంద్రబాబు జీవిస్తున్నారు. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాజ్‌పేయి చొరవ, ప్రోత్సాహం లేకపోతే హైటెక్‌సిటీ, సైబర్టవర్స్, అంతర్జాతీయ విమానాశ్రయం, ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్లు వచ్చేవి కావు. బాబు హయాంలో పేదల భూములను లాక్కుని పెద్దలకు పంచారు. కోకాపేటలో దళితుల భూములను లాక్కుని బాబు పెద్దలకు కట్టబెట్టారు..’అని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఏ ఒక్కరి వల్ల సైబరాబాద్ అభివృద్ధి కాలేదని.. ప్రజలందరి తోడ్పాటు వల్లే అది సాధ్యమైందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాద్షాలు.. తెలంగాణ, ఏపీ సీఎంలు తమని తాము బాద్షాలుగా భావిస్తున్నారని.. పాత బాద్షాలు పోయి కొత్త బాద్షాలు పుట్టుకొచ్చారని దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే బాద్షాలు అని తెలుసుకోవాలని వారికి హితవు పలికారు. ఇద్దరు చంద్రులు మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని చెప్పారు. ఆంధ్రాలో అభివృద్ధిని గాలికొదిలేసిన బాబు తెలంగాణలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. గెలుపు కోసమే కాంగ్రెస్ పంచన.. గత ఎన్నికల్లో బీజేపీ సాయంతో ఎన్నికల్లో గెలిచిన బాబు ఈ సారి గెలుపు కోసం కాంగ్రెస్ పంచన చేరారని దత్తాత్రేయ విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే బాబు అదే కాంగ్రెస్‌తో చేతులు కలిపి ఎన్టీఆర్‌కు రెండోసారి వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రధాని మోదీ చరిష్మా ముందు ఏ కూటములు నిలవవని జోస్యం చెప్పారు. -
రూ. 5000 కోట్లతో బీసీ సంక్షేమ నిధి : దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్ : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసపూరితంగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని తెలిసినా.. కేంద్రం సహకరించడం లేదంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ... రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అధికారం ఉన్నా కేసీఆర్ ఆ పని చేయడం లేదని విమర్శించారు. సబ్‌ప్లాన్ అని చెప్పి బీసీలను కూడా మోసం చేశారని, బీసీ, ఇతర సామాజిక వర్గాల కార్పోరేషన్లకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ది మోసాల చరిత్ర అన్న దత్తాత్రేయ.. ఆయన దగ్గర మోసపూరిత విధానాలు, మాటల గారడి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. ఆయన విధానాలతో టీర్ఎస్పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. కాంగ్రెస్- టీడీపీ పొత్తు గురించి ప్రస్తావిస్తూ... చంద్రబాబు ఓ మోసకారి అంటూ దుయ్యబట్టారు. అడుగడుగునా తెలంగాణను మోసం చేసిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని.. ఆమె కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి మాత్రమే తల్లి అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. 10,000 కోట్ల తో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రూ. 10,000 కోట్లతో రైతు సంక్షేమ నిధి, రూ. 5000 కోట్లతో బీసీ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. మక్తల్, నారాయణ పేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలలాగా మారుస్తామని హామీ ఇచ్చారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లుల నియంత్రణ కోసం రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్ఎంపి, పీఎంపిలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రాసిన వారికి ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్రీడా సంస్థల్లో క్రీడాకారులే పదాధికారులుగా ఉండేలా చట్టసవరణ తీసుకువస్తామని తెలిపారు. తాండూరు, జనగామ, రంగారెడ్డి, జడ్చర్ల వరకు ఎంఎంటీఎస్ సర్వీసును విస్తరిస్తామని పేర్కొన్నారు. -
‘ఆయన్ను చూడగానే బాబు జ్వరం 104కు పోతుంది’
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రధాని నరేంద్రమోదీని చూడగానే జ్వరం 104కు పోతుందని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. చంద్రబాబుది దివాలాకోరు రాజకీయమని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విషయంలో చంద్రబాబుకు జ్వరం పట్టుకుందని, సీబీఐ అంటే ఆయనకు భయమని పేర్కొన్నారు. చంద్రబాబుకు ముందస్తు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు తీరు ఆంధ్రప్రదేశ్ అంతా నా రాజ్యం అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. బాబుకు నిజాయితీ ఉంటే సీబీఐని స్వాగతించాలన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద బాబు నివాళులు అర్పిస్తే ఆయన ఆత్మ గోషిస్తూందన్నారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘‘ బీజేపీ ఇప్పటివరకు 93 సీట్లు ప్రకటించింది. అందులో ఒకటి యువ తెలంగాణ పార్టీకి కేటాయించింది. మిగతా సీట్లు ఇవాళ ప్రకటన రావొచ్చు. ఉపాధి హామీ పథకం చక్కగా అమలు అవుతోంది. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం కల్పిస్తాం. కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు అందజేస్తాం. రోడ్ యాక్సిడెంట్ల నివారణకు ప్రత్యేక శిక్షణా తరగతులు ఏర్పాటుచేస్తాం. టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు, మిగతా వారంతా అధికారంలోకి రావడానికి తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకుంటున్నారు. టీఆర్ఎస్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతులను కూడా ప్రభుత్వం గుర్తించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞాన్ని ధన యజ్ఞంలాగా మార్చింది. మజ్లీస్‌తో పొత్తుపెట్టుకొని.. కేసీఆర్ ఏ విధంగా మత సామరస్యం తీసుకొస్తారు. కేసీఆర్ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తున్నారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలే ఇప్పటివరకు అమలు చేయలేదు, మళ్లీ కొత్తగా ఇచ్చే హామీలు అమలు చేస్తారని ఎలా నమ్మాలి ?. కోదండరాం కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగా కలుస్తారు?. 369 మంది అమరుల చావుకు కారణం అయిన కాంగ్రెస్‌తో కోదండరాం ఏ విధంగా కలుస్తార’’ని ప్రశ్నించారు. -
బీజేపీలో చేరిన బొడిగే శోభ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కమలం పార్టీ అగ్రనేతలు బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు. పార్టీ కండువాతో శోభను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కేసీఆర్‌కు మొదటి నుంచి అండగా ఉండి, తెలంగాణ కల సాకారం కావడంలో తన వంతు పాత్ర పోషించానని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ను అరెస్ట్ చేస్తే కారంపొడి పట్టుకుని పోలీసులపై తిరుగుబాటు చేశానని వెల్లడించారు. అలాంటి తనకు నేడు టీఆర్ఎస్లో ఆదరణ కరువైందని వాపోయారు. టీఆర్ఎస్లో పూర్తిస్థాయి నాయకురాలిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన తాను గత 70 రోజులుగా కేసీఆర్ పిలుపు కోసం వేచిచూశానన్నారు. కవిత, కేటీఆర్, వినోద్, కేశవరావును కలిసిన ఫలితం దక్కలేదని.. ప్రగతి భవన్లో అడుగుబెట్ట లేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల తీర్పు, సర్వే నివేదిక ప్రకారమే టికెట్ ఇస్తామని కేసీఆర్ చెబుతున్నారని, 90 శాతం ప్రజల సపోర్టు తనకున్నా ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. దళిత బిడ్డనైన తనకు తీవ్ర అన్యాయం చేశారని, మాదిగలు టీఆర్ఎస్ను వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ సడ్డకుడు(తోడల్లుడు) రవీందర్ రావు, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కారణంగానే తనకు టీఆర్ఎస్ టికెట్ రాలేదన్నారు. తెలంగాణలో కవిత ఒక్కరే చాలా? నా లాంటి బిడ్డ వద్దా? అని ప్రశ్నించారు. చొప్పదండిలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, సెగ్మెంట్ అభివృద్ధి చేస్తానని బొడిగే శోభ పేర్కొన్నారు. -
బీజేపీతో యువ తెలంగాణ పార్టీ పొత్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పొత్తు కుదిరింది. ఇప్పటికే మహాకూటమి పొత్తుల చర్చ జరుగుతుండగా, తాజాగా బీజేపీతో కొత్తగా ఏర్పడిన యువ తెలంగాణ పార్టీ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు పార్టీల ముఖ్య నేతలు గురువారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. అనంతరం వారు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. జాతీయ భావాలు కలిగిన బీజేపీనే రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. యువ తెలంగాణ పార్టీ 8 నుంచి 10 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీజేపీ ముఖ్య నేతలకు వారి అభిప్రాయా న్ని తెలియజేసినట్లు సమాచారం. అయితే 8 స్థానా లు కాకపోయినా కొన్ని స్థానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నుంచి స్పష్టమైన హామీ లభించడంతో యువ తెలంగాణ పార్టీ నేతలు జిట్టా బాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. భువనగిరి, నర్సంపేట, జనగామ స్థానాలను యువ తెలంగాణ పార్టీకి కేటాయించేందుకు బీజేపీ ముఖ్యనేతలు ఓకే చెప్పినట్లు తెలిసింది. భువనగిరి నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి, నర్సంపేట నుంచి రాణి రుద్రమ, జనగామ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి యువ తెలంగాణ పార్టీ నుంచి పోటీ చేస్తారని సమాచారం. అందుకు బీజేపీ అంగీకరించడంతోనే సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున జనగామ నుంచి పోటీచేసి ఓడిపోయిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆ తరువాత బీజేపీకి దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యువ తెలంగాణ పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు బీజేపీ ముఖ్య నేతలనుంచి హామీ లభించినట్లు తెలిసింది. దీంతో యువ తెలంగాణ పార్టీకి కేటాయించే స్థానాల్లో 3 స్థానాలపై స్పష్టత వచ్చింది. బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ పొత్తులు, స్థానాలపై చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరోవైపు బీజేపీ తరపున భువనగిరిలో పోటీ చేయాలని భావిస్తున్న పార్టీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ ఇప్పటికే అలక వహించారు. సమావేశంలో మాజీ కేంద్రమంత్రి, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, యువ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం రద్దు అప్రజాస్వామికం
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): రాష్ట్రంలో కేసీఆర్ తొమ్మిది నెలల ముందు ప్రభుత్వాన్ని రద్దు చేయడం అప్రజాస్వామికమని, ఎవరినీ సంప్రదించకుండా, మొక్కుబడిగా మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అసెంబ్లీనీ రద్దు చేశారని కేంద్ర మా జీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. సోమవారం నగరంలోని ప్రగతినగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపంలో బీజేపీ ఆధ్వర్యంలో జన సంఘటన సభను నిర్వహించారు. సభకు హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లా డుతూ తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేసి, పీసీసీ అధ్యక్షుడిని రెండుసార్లు ఓడించి న ఘనత యెండల లక్ష్మీనారాయణకు ఉందన్నారు. ఈసారి టీఆర్ఎస్ను నగర ప్రజలు చిత్తు గా ఓడించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ పార్టీలకు చరమగీతం పాడాలని, బీజేపీకి అవకాశం కల్పించాలని కోరారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొందని, కాషాయజెండా ఎగరడం ఖాయమన్నారు. ముఖ్యంగా మహిళలు, యువకులు, ముస్లిం మహిళలు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ను బీజే పీ తీసుకువచ్చి ఇబ్బందులకు గురవుతున్న ముస్లిం మహిళలకు అండగా నిలిచిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం కోసం మోదీ సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. మోదీది అభివృద్ధి మంత్రం అని, కేసీఆర్‌ది అవినీతి మంత్రం అని ఎద్దేవాచేశారు. కమీషన్లు, కలెక్షన్ల వల్లే రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగడంలేదన్నారు. కేంద్రం రెండు లక్షల ఇండ్ల నిర్మాణానికి రూ.1,157 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు కేవలం 1500 ఇళ్లు మాత్రమే నిర్మించారన్నారు. మద్యం తెలంగాణగా మార్చారు.. బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణగా మార్చారని దత్తాత్రేయ ఆరోపించారు. ఆదా యం కోసం అనేక కుటుంబాల జీవితాలను నాశనం చేస్తున్నారని, బీజేపీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని అరికడతామని హామీనిచ్చారు. ఎంతోమంది పేదలకు ఉపయోగపడే ఆయూష్మాన్ భారత్‌ను అడ్డుకుంటున్న ఘనత టీఆర్ఎస్ది అని విమర్శించారు. పీపీపీ పద్ధతిలో నిజాంషుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించి కార్మికులు, రైతులకు న్యాయం చేస్తామన్నారు. దోపిడీ లేని తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని, యెండల లక్ష్మీనారాయణను గెలిపిస్తే ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలను నిర్వర్తిస్తారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ 100 సీట్లు విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారని, కానీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణుల్లో నిరుత్సాహం ఆవరించి ఉందన్నారు. మద్యం, డబ్బుతో వాతావరణాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని, కానీ రోజురోజుకూ టీఆర్ఎస్పై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. మహాకూటమి సీట్ల సర్దుబాటుతో సతమతమవుతోందని, కాంగ్రెస్, టీడీపీ అవకాశవాద రాజకీయాలకు తెరలేపాయని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకమైన శక్తిగా ఎన్టీఆర్ నిలబడ్డారని, ఈ పొత్తుతో ఆయన ఆత్మ క్షోభిస్తోందని ఆరోపిం చారు. తన అస్థిత్వాన్ని నిలుపుకునేందుకు టీడీపీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుందని, కాంగ్రెస్ మెహర్బానీపై టీడీపీ ఆధారపడి ఉందన్నారు. దీపావళి తర్వాత ప్రధాని మోదీతో బహిరంగ సభ నిర్వహిస్తామని, ఆ తర్వాత అమిత్ షా సభ కూడా ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ వైఫల్యాలపై 9వ తేదీ తర్వాత ఛార్జీషీటు విడుదల చేస్తామని, అనంతరం బీజేపీ మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్‌లో బీజేపీ గెలుపు ఖాయంగా కన్పిస్తోందన్నారు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని, ఆ పార్టీ కార్యాలయంపై దాడి జరగడం దురదృష్టకరమన్నారు. దీనిపై ఆరా తీస్తున్నామని, భంగపడ్డ నేతలను సముదాయించి బుజ్జగిస్తామని తెలిపారు. ఈ ముక్కోణపు పోటీలో రాష్ట్రంలో 119 సీట్లలో పోటీ చేస్తున్న బీజేపీ లబ్ధి పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. రాబోయే కురుక్షేత్రంలో కార్యకర్తలు సైనికుల్లా పని చేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నగరంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి పనులు.. వాటి వైఫల్యాలను వివరించారు. గుంతలమయమైన నగర రోడ్లు.. వాటి వల్ల నాలుగేళ్లలో ప్రజలు ఎదుర్కొ న్న ఇబ్బందులు, కార్పొరేషన్లో గాడి తప్పిన పాలనను క్షుణ్ణంగా తెలియజేశారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఓ పోలీస్ అధికారిపై దాడి, కమీషన్ల కోసం మున్సిపల్ ఎంఈని బలి చేయడం, తదితర సంఘటనలను టీఆర్ఎస్ పాలనకు నిదర్శమని ఉదహరించారు. నాసిరకమైన బతుకమ్మ చీరలు, డ్వాక్రా మహిళలకు వడ్డీ మాఫీ ఇవ్వకుండా వారిని అగౌరపర్చారని విమర్శించా రు. ముఖ్యంగా సొంతింటి కలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎండగట్టారు. తనను గెలిపిస్తే ఐదేళ్లలో నగరంలో అందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని, యెండల లక్ష్మీనారాయణ మాటపై నిలబడే వ్యక్తి అని పేర్కొన్నారు. గతంలో తన పాలనను టీఆర్ఎస్ నాలుగేళ్ల పాలనతో బేరీజు చేసుకుని ప్రజలు తిరిగి తనను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. యెండలకు ఘన స్వాగతం.. నిజామాబాద్ అర్బన్ బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన యెండల లక్ష్మీనారాయణకు బీజేపీ జిల్లా, నగర నాయకులు బోర్గాం(పి) చౌరస్తాలో ఘన స్వాగ తం పలికారు. అనంతరం అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు మాధవనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజ లు చేశారు. ర్యాలీ బోర్గాం(పి) చౌరస్తా నుంచి ఫులాంగ్, ఆర్ఆర్ చౌరస్తా, పెద్దబజార్, గాంధీచౌక్, నాందేవ్‌వాడ, సుభాష్‌నగర్, ఎన్టీఆర్ చౌర స్తా మీదుగా ప్రగతినగర్ మున్నూరుకాపు కళ్యాణ మండపానికి చేరుకుంది. సమావేశంలో దత్తాత్రేయ సమక్షంలో పలువురు బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు టక్కర్ హన్మంత్‌రెడ్డి, నాయకులు బాల్‌రాజ్, యెండల సుధాకర్, జాలిగం గో పాల్, బాజిరెడ్డి రమాకాంత్, మల్లేష్ యాదవ్, న్యాలం రాజు, సుగుణ, స్వామి యాదవ్, తారక్ వేణు, రోషన్‌లాల్, మచల్ శ్రీనివాస్, ఆయా జోన్ల అధ్యక్షులు, మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. టీఆర్ఎస్కు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లే.. సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): టీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్‌కు ఓటేసినట్లేనని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ విమర్శించారు. సోమవారం నిజామాబాద్ నగరంలో నిర్వ హించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రంలో కుటుంబ పార్టీ నాలుగేళ్ల పాటు కుటుంబ పాలనను సాగించిందని ఆరోపించారు. డిప్యూటీ సీఎంలు, మంత్రులు, ఎంపీలు ఏ పత్రికలో, ఏ చానెళ్లల్లో కన్పిం చలేదని ఎద్దేవాచేశారు. నలుగురే ప్రభుత్వాన్ని నడిపించారని పేర్కొన్నారు. అదేవిధంగా టీడీ పీ, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అని అన్నారు. కేంద్రం సొమ్ముతో రాష్ట్రం సోకులు చేస్తుందని, ఈ పార్టీకి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణాగా మారుస్తామని చెప్పి మద్యం తెలంగాణగా మార్చారన్నారు. 2013–14లో మద్యం ద్వారా రాష్ట్ర ఆదాయం రూ.350 కోట్లు ఉండగా, ఈయేడాది రూ.20 వేల కోట్లు పెరిగిందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే మద్యపానాన్ని అరికడుతోందన్నారు. మహాకూటమిని దుష్టులు, ద్రోహుల కూటమని అభివర్ణించారు. -
విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి
హైదరాబాద్: విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో తెలంగాణ విశ్వబ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆత్మగౌరవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ.. త్వరలోనే జాతీయ స్థాయిలో బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. విశ్వబ్రాహ్మణులను రాజకీయంగా ప్రోత్సహించేందుకు తమ పార్టీ పలువురికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించిందన్నారు. విశ్వబ్రాహ్మణుల కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని కామన్ మిని మం ప్రోగ్రామ్‌లో పెట్టేందుకు కృషి చేస్తానని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అహంకారాని కి, ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పిలుపునిచ్చారు. తెలంగాణ ద్రోహులను ప్రోత్సహిస్తూ.. ఉద్యమ సమయంలో బలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు మాత్రం టీఆర్ఎస్ అన్యాయం చేసిందన్నారు. అడుక్కుంటే హక్కులు రావని.. పోరాడి సాధించుకోవాలని బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు బిక్షపతి కోరారు. కార్యక్రమంలో జస్టిస్ బి.చంద్రకుమార్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తల్లోజు ఆచారి, ఎంబీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కె.సి.కాలప్ప, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మాచారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనడం అబద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే తాను కాంగ్రెస్ పార్టీతో కలుస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం పచ్చి అబద్ధమని ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. రాహుల్, చంద్రబాబుల కలయికను ఒక విషాదకర కలయికగా ఆయన అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ న్యాయవాది కిలారు దిలీప్ రచించిన పుస్తకాన్ని దత్తాత్రేయ శుక్రవారం ఆయన నివాసం లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రాలో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొనడం ఏ రకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందని ప్రశ్నించారు. ఏ పార్టీనైతే కూకటివేళ్లతో పెకిలించేందుకు దివంగత ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారో ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకట్టి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇక తెలంగాణలో బీజేపీ నిర్మాణాత్మక శక్తిగా ఎదుగుతుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మంజూరులో కూడా టీఆర్ఎస్ నేతలు రూ. 86 కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుస్తుందని తెలిపారు. నవంబర్ రెండో వారంలో ప్రధాని ఎన్నికల పర్యటన ఉంటుందని వెల్లడించారు. -
టీడీపీ, కాంగ్రెస్ కలవడం విషాదకర పరిణామం
న్యూఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీతో కలిశారని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలపై పారిశ్రామికవేత్త, న్యాయవాది కిలారు దిలీప్ రూపొందించిన పుస్తకాన్ని దత్తాత్రేయ ఆవిష్కరించారు. నోట్ల రద్దు చేయమని లేఖ రాశానని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు దాన్ని తప్పుపట్టడం దేనికి సంకేతమని ధ్వజమెత్తారు. తెలుగు జాతి చరిత్రలో టీడీపీ, కాంగ్రెస్ కలవడం ఓ విషాదకర పరిణామమని అభివర్ణించారు. తెలంగాణలో మహాకూటమి అతలాకుతలంలో ఉందన్నారు. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌లో రూ.86 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆర్టీఐ సమాచారం ద్వారా తెలుస్తుందన్నారు.