
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నిర్వహిస్తున్న అలయ్ బలయ్ ఉత్సవాల సందర్భంగా బండారు దత్తాత్రేయకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దసరా అనంతరం నిర్వహించే ఈ వేడుకల ద్వారా సమాజంలోని ఐక్యత, సామరస్యస్ఫూర్తి మరింత బలోపేతమవుతాయన్నారు. ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని పెంపొందించేందుకు, వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారుల నైపుణ్యాల ప్రదర్శనకు గొప్ప వేదికగా నిలుస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment