Alai Balai
-
దసరా స్పెషల్ : హైదరాబాద్‌లో ‘అలయ్ బలయ్’ సందడి (ఫొటోలు)
-
‘మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి’
తెలంగాణ ముఖ్యమంత్రి సెక్యూరిటీల కండకావరం... దాదాపు చావు నుంచి బయటపడ్డాను. గొంతు తొక్కి, తోసి బయట పారేశారు. నా మిత్రుడి కాలు తొక్కి పడేశారు. ఆదివారం నాడు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఆవరణలో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమం మా ప్రాణానికి వచ్చింది. సెక్యూరిటీ అంటే చంపడమా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తూ ఉంటే చుట్టూ ఉన్నవాళ్లు పోలీసులా? లేక ప్రైవేట్ సైన్యమా? సీఎం కోసం అక్కడ ఉన్న ప్రతివాడినీ చంపేయాలా? అదృష్టవశాత్తూ చావు తప్పి, బయటపడ్డాం. ఈ పరిస్థితి నాకు (మాడభూషి శ్రీధర్), సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరికీ ఎదురైంది. గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఫోన్ చేస్తే వెళ్ళకపోవడం భావ్యం కాదనుకుని ‘అలయ్ బలయ్’కి వెళ్ళాం. సీఎం వస్తున్నదశ. నేను, పాశం యాదగిరి దూరం నుంచి వేదిక వద్దకు రాకముందే సెక్యూరిటీ వారి అతి వల్ల ప్రమాదం వచ్చిపడింది. సీఎం చుట్టూ ఎవరు చచ్చిపోయినా ఫరవాలేదన్నట్టుగా రక్షకభటులు వ్యవహరించారు. నా గొంతు నొక్కేయడంతో నొప్పిగా ఉంది. యాదగిరి కాలిపైన నెత్తురు గాయమైంది. మందులు వాడుతున్నాం. ఇలాంటి రక్షణలో ఉండే సీఎం సామాన్యులకు రక్షణ ఏమిస్తారు? సీఎం చుట్టూ ఉన్నవారు మమ్మల్ని తొక్కిపారేశారు. ఒక దశలో నేను చనిపోతాననే అనిపించింది. అసలే ఆరోగ్యం పూర్తిగా బాగుకాని దశలో ఉన్నవాణ్ణి. నన్ను నేను ఏ విధంగా రక్షించుకోవాలి? నిజానికి సెక్యూరిటీ వారు మమ్మల్ని పక్కకు వెళ్లమని చెప్పి, ముఖ్యమంత్రిని భద్రంగా తీసుకువెళ్ళవచ్చు. ఆ మాత్రం కనీసపు ఇంగితం వాళ్ళకు లేకపోయింది. వీరు రక్షకులా, రజాకార్లా, కిరాయి గూండాలా? మా ప్రాణాలు పోతే ఈ ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకుంటారా? ఒకవేళ చస్తే ఏం చేస్తారు? సంతాపం చెబుతారు. లేదంటే కుటుంబానికి కొన్ని లక్షలు ఇస్తారు. మనుషుల ప్రాణాల విలువ అంతేగా! సీఎం గారూ! వేదిక వద్దకు వచ్చే ముందు జనాన్ని చంపేయకండి. మీ అలయ్ బలాయ్ లేకపోతే మానె... సామాన్యుల్ని చంపకండి. బండారు దత్తాత్రేయ గారూ! మీ అలయ్ బలయ్ పేరుతో మీ మిత్రులనుకునే వారిని కూడా చావుకు సిద్ధం కమ్మనడం న్యాయం కాదు. ఈ పని బదులు తిండిలేని వారికి అన్నదానం చేయండి. ఇంకేం వద్దు. ఇదేదో అనుకోకుండా జరిగిన చిన్నతప్పు అని తోసిపారేయకండి. ఇక ముందు ఏ వేదిక దగ్గరా ఏ మనిషినీ తోసి, తొక్కేయకండి. నా వయసు 69. యాదగిరి 73 దాటిన వారు. పదిమంది కండలు పెంచుకున్న వారి దాడులకు మేం తట్టుకోలేం. ఈ రాష్ట్రం తట్టుకోలేదు. గొంతు నొక్కకుండా, కొట్టకుండా వీలు కాకపోతే ఈ అలయ్ బలయ్ లేకపోయినా ఫరవా లేదు. మనుషుల్ని బతికించకపోయినా ఫరవాలేదు కానీ చంపకండి. - మాడభూషి శ్రీధర్, రచయిత, ప్రొఫెసర్ - పాశం యాదగిరి, సీనియర్ జర్నలిస్ట్ -
రాష్ట్ర సాధనకు తోడ్పడిన అలయ్ బలయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగించడానికి, గౌరవించడానికి రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ముందుకు వస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర సంస్కృతి నలు దిశలా వ్యాపించడానికే కాకుండా, నాటి తెలంగాణ ఉద్యమంలో భాగంగా పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ కార్యక్రమం స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలనే ఆలోచనతో బండారు దత్తాత్రేయ ప్రారంభించిన ఈ కార్యక్రమం.. చివరకు స్వరాష్ట్రం సాధించుకోవడానికి కూడా దోహదపడిందని పేర్కొన్నారు. దసరా పండుగ నేపథ్యంలో హరియాణా గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన 19వ అలయ్ బలయ్ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అలయ్ బలయ్ అంటే దత్తాత్రేయే.. ‘తెలంగాణ ప్రజలకు అతి పెద్ద పండుగ దసరా.. దసరా అంటే మొట్టమొదట పాలపిట్ట, జమ్మి చెట్టు గుర్తుకు వస్తాయి. అలాగే అలయ్ బలయ్ అంటే కూడా బండారు దత్తాత్రేయ గుర్తుకు వస్తారు. ఆయన అందించిన సంస్కృతి, వారసత్వ లక్షణాలతో దత్తాత్రేయ వారసురాలిగా బండారు విజయలక్ష్మి ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం. రాజకీయాలకు అతీతంగా మా పార్టీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు దీనికి హాజరై రాష్ట్ర సంప్రదాయాలు కొనసాగించడంలో రాజకీయాలకు తావు లేదని నిరూపించాం. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కవులు, కళాకారులు, వివిధ సంఘాల వారు కూడా ఏకమై అంతా ఒకటేనని సందేశాన్నివ్వడం అభినందనీయం..’అని సీఎం పేర్కొన్నారు. వేరే రాష్ట్రానికి గవర్నర్ అయినా తెలుగు బిడ్డనే: దత్తాత్రేయ ‘నేను ఇప్పుడు వేరే రాష్ట్రానికి గవర్నర్ అయినా తెలుగు బిడ్డనే. అందుకే స్థానిక కళాకారులు, కుటీర పరిశ్రమలకు చెందిన కుమ్మరి, కమ్మరి, చేనేత, గీత కారి్మకులు తదితర వర్గాలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశా. వారికి ప్రత్యేకంగా అంకుర సంస్థలు ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహం అందించాల్సిన అవసరముంది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదరభావంతో ముందుకు సాగాలి..’అని దత్తాత్రేయ ఆకాంక్షించారు. ఐక్యతను ప్రతిబింబిస్తుంది: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ‘విజయలక్ష్మి అలయ్ బలయ్‌ను కొనసాగించడం అభినందనీయం. గ్రామాల్లో పొలాల గెట్ల గొడవలు, ఇంట్లో మనస్పర్థలు, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ దసరా జమ్మి పూజ చేశాక అంతా కలిసి అలయ్ బలయ్ తీసుకోవడం తెలంగాణ సంస్కృతి. దత్తన్న అలయ్ బలయ్ దీనినే ప్రతిబింబిస్తుంది. రాజకీయాల్లో విమర్శలు, విభేదాలు ఉండొచ్చు కానీ ఇలా కలవడం మంచి విషయం. ఎన్నికల సమయంలో విమర్శించుకోవచ్చు.. తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇది లోపించింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ భాష మార్చుకోవాలి. ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. అలయ్ బలయ్ స్ఫూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి..’అని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉద్రేకాలు రగిలించడాన్ని నియంత్రించాలి: పొన్నం ‘రాజకీయ నాయకులు భాష మార్చుకోవాలంటూ కిషన్‌రెడ్డి చేసిన సూచన వంద శాతం సమంజసం. అదే విధంగా మత పరమైన ఉద్రేకాలను రగిలించే మాటలను కూడా నియంత్రించేలా చొరవ చూపించాల్సిన అవసరం ఉంది..’అని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సంస్కృతి కొనసాగాలిఉత్తరాఖండ్, రాజస్తాన్, మేఘాలయ గవర్నర్లు‘గతంలో బొల్లారంలోని యూనిట్లో పని చేశా. ఇక్కడి సంస్కృతి అద్భుతమైనది. శాంతికి సంకేతంలా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఉంటాయి. ఈ సంస్కృతి ఇలాగే శతాబ్దాలు కొనసాగాలని ఆశిస్తున్నా..’అని ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ గుర్మిత్ సింగ్ అన్నారు. అలయ్ బలయ్ మంచి సంస్కృతి అని రాజస్తాన్ గవర్నర్ హరిభావ్ బగాదే పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నేతల మధ్య ఆత్మీయత, అనుబంధాలను పెంచుతోందని మేఘాలయ గవర్నర్ విజయశంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీధర్‌బాబు, నేతలు ఈటల రాజేందర్, గుత్తా సుఖేందర్ రెడ్డి, రఘునందన్ రావు, కోదండరాం, వి.హన్మంతరావు, లక్ష్మణ్, కె.కేశవరావు, గోరటి వెంకన్న, వందే మాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.అద్భుతమైన సంస్కృతిగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ‘భారతీయ సంస్కృతి అంటేనే ఐకమత్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం. దీనిని ప్రతిబింబించేలా నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమం చాలా బాగుంది. ఇక్కడి సంస్కృతిలో విభిన్న మతాలను సైతం సమానంగా చూసే తత్వముంది. సీనియర్ నేత దత్తాత్రేయ అద్భుతమైన స్థానిక సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడం హర్షణీయం..’అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. -
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అలయ్ బలయ్
-
హైదరాబాద్: అలయ్ బలయ్ సందడి
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం జరుగుతోంది. బండారు దత్తత్రేయ కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్ బలయ్’ కొనసాగుతోంది. దసరా పండుగ సందర్భంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ప్రారంభించారు. ఇది 19వ సారి జరుగుతున్న ‘అలయ్ బలయ్’ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరు తెలంగాణ గవర్నర్ జిష్ణూ దేవ్ వర్మ, పలు రాష్ట్రాల గవర్నర్లు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది సినీ ప్రముఖులను కూడా నిర్వాహకులు అహ్వానించారు. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.రాజకీయాలకు అతీతంగా గౌరవించబడే బండారు దత్తాత్రేయ 19 ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ అంతరించిపోతున్న తెలంగాణ కళలు భావితరాలకు అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు అలయ్ బలయ్ స్ఫూర్తి. జెండాలకు అజెండలను పక్కన పెట్టి తెలంగాణ కోసం ఒక్కటయ్యేలా చేసింది. ఆఎస్ఎస్ టూ ఆర్ఈసీ, కాంగ్రెస్ టూ కమ్యూనిస్టుల వరకు ఒక్కటై తెలంగాణ కోసం గళం వినిపించారు. దసరా అంటే జమ్మి చెట్టు, పాలపిట్ట గుర్తుకు వస్తాయి. ‘అలయ్ బలయ్’ అంటే బండారు దత్తాత్రేయ గుర్తు వస్తారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల వారసత్వాన్ని దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి కొనసాగిస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత’’ అని అన్నారు.మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరై.. మాట్లాడారు.‘‘ స్నేహశీలి బండారు దత్తాత్రేయ. భావితరాలకు ఈ కార్యక్రమాన్ని అందించాలి. పండగలకి సామాజిక సంస్కృతి అంతే ఉంది. కలిసి మెలిసి ఉండాలన్న సంకల్పం ఈ అలయ్ బలయ్. కుటుంబ, ప్రాంత, దేశ సమైక్యత సాధించుకోవాలి. పాశ్చాత్య సంస్కృతి వదిలి పెట్టి మన అనుకునే ఐక్యత పద్దతి పాటించాలి’ అని అన్నారు.మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు మాట్లాడారు.‘‘ అలయ్ బలయ్ రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వానికి ప్రతీక . పలు రాష్ట్రాల గవర్నర్ల రాకతో దేశమంతా దిగివచ్చినట్లు ఉంది. అలయ్ బలయ్‌ను హైదరాబాద్‌తో జిల్లాలకు, ఆంధ్రపదేశ్ కు కూడా విస్తరించాలి’’ అని అన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడారు.‘‘ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసిమెలిసి ఉండాలి. అభివృద్ధిలో తెలుగురాష్ట్రాలు దేశంలో నెంబర్ వన్‌గా నిలవాలి’’ అని అన్నారు.తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడారు. ‘‘ అలయ్ బలయ్ అంటే ఐక్యత. మన సాంప్రదాయలను ప్రతిబింబించే కార్యక్రమం. తెలంగాణ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో సుందరమైనవి. అందరూ కలిసుండాలనేది మన సంస్కృతి. అన్ని మతాల వారు కలిసి విజయదశమి జరుపుకుంటున్నారు. విజయదశమి పర్వదినం చెడుపై మంచి సాధించిన విజయం. ఆ విజయం ఐక్యతతో సాధ్యం’’ అని అన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ అన్ని వర్గాల వారిని ఐక్యం చేసే అలయ్ బలయ్ గొప్ప కార్యక్రమం. రాజకీయంగా ఎన్ని ఉన్నా ఇలాంటి ప్రొగ్రాంలలో కలవడం గొప్ప విషయం. ఎన్నికలప్పుడు రాజకీయాలు, తర్వాత పేద ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలి. కానీ ప్రస్తుతం తెలంగాణలో అది లోపించింది. గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటలతో మాట్లడలేని విధంగా విమర్శించుకుంటున్నారు. వాళ్లలో మార్పు రావాలని దసరా సందర్భంగా దేవుళ్లను కోరుకుంటున్నా. మాట్లాడే భాష అంగీకారం కాదు. మార్పు రావాలి. రానున్న రోజుల్లో ప్రజలు అసహించుకునేలా మాట్లాడం రాజకీయ నాయకులకు తగదు’’ అని అన్నారు.చదవండి: పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్ రావు -
దసరా పండుగకు ఆ పేరు ఎలా వచ్చింది?
Vijayadashami: దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులూ, పదవ రోజు విజయ దశమినీ కలిపి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిచ్చేపండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికీ, తరువాతి మూడు రోజులు లక్ష్మీదేవికీ, తరువాత మూడురోజులు సరస్వతీ దేవికీ పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు.తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతు కమ్మ ఆడుతారు. విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలి చిన సందర్భమే కాక... పాండవులు అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత జమ్మి చెట్టు మీద నుంచి తమ ఆయుధాలు తీసుకున్నరోజు కూడా! ఈ సందర్భంగా ‘రావణ వధ’, జమ్మి ఆకుల పూజ వంటివి చేయటం ఆచారం. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందినందుకు 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకొంటారు.బ్రహ్మ దేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశ వంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ జన్మించింది. సర్వ దేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహమూ శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిష రూపం, సింహం రూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు మహిషం రూపంలో దేవి చేతిలో హతుడైనాడు.చదవండి: దసరా సరదాలు: "ప్యారీ మనవరాలు... పూరీ ముచ్చట్లు"తెలంగాణలో పాలపిట్టను చూసిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు పోయి పూజలు చేసి జమ్మి ఆకులు (బంగారం) పెద్ద వాళ్లకు ఇస్తూ వారి దీవెనలు తీసుకుంటారు. ఒకరినొకరు ‘అలాయ్ బలాయ్’ చేసుకుంటూ మురిసిపోతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో దసరా ఒక మహోన్నతమైన పర్వదినం. – దండంరాజు రాంచందర్ రావు -
ఘనంగా దత్తన్న ‘అలయ్ బలయ్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించేలా ‘దత్తన్న అలయ్ బలయ్’(దసరా ఆత్మీయ సమ్మేళనం) ఉత్సవం ఘనంగా జరిగింది. బుధవారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఫౌండేషన్ ప్రస్తుత చైర్మన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ కళారూపాల ప్రదర్శన, తెలంగాణ ప్రత్యేక వంటకాల రుచులు, ఇలా విభిన్న అంశాల సమాహారంగా ఈ కార్యక్రమం ఆహూతులను ఆకట్టుకుంది. అలయ్‌బలయ్ ఫౌండేషన్ బాధ్యులు విజయలక్ష్మి, డా.జిగ్నేశ్‌రెడ్డి దంపతులు, దత్తాత్రేయ, ఆయన వియ్యంకుడు బి.జనార్దనరెడ్డి, గవర్నర్లు, కేంద్రమంత్రులతో కలిసి పూజలు నిర్వహించారు. మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్ర సహాయ మంత్రులు, సినీరచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, కాంగ్రెస్ నుంచి కె.జానారెడ్డి, వి.హనుమంతరావు, మధుయాష్కీ, వైఎస్సార్సీపీ నుంచి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరాం, బీజేపీ నుంచి డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, డా.బూరనర్సయ్య గౌడ్ ఇతర పార్టీల నేతలు హాజరయ్యారు. ‘అలయ్ బలయ్ లేకుండా దసరా పూర్తికాదు’ అలయ్‌బలయ్ లేకుండా దసరా పండుగ పూర్తికాదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం, కళలు ఉట్టిపడేలా, తెలంగాణ వంటకాల రుచులు చూపిస్తూ బండారు దత్తాత్రేయ నేతృత్వంలో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన కొనియాడారు. అలయ్ బలయ్ అనే పదానికి దత్తాత్రేయ మరోపేరుగా మారారని మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. ఈ కార్యక్రమం అత్యంత శక్తివంతమైనదని జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు పెంపొందించేలా, పశ్చిమ సంస్కృతి ప్రభావంలో ఉన్న కొత్తతరానికి మన సంస్కృతి తెలియజేసేలా దీనిని 17 ఏళ్లుగా నిర్వహించడం గొప్ప విషయమని మంత్రి శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. బండారు దత్తాత్రేయ ఆశయాలు, ఆదర్శాల పరంపరను ఆయన కుమార్తె విజయలక్ష్మి కొనసాగించాలని ఆకాంక్షించారు. కులాలు, మతాలకు అతీతంగా ఐక్యతకు సంకేతంగా ఈ ఉత్సవాలు జరగడం సంతోషదాయకమని కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి చెప్పారు. అలయ్ బలయ్ సంస్కృతిపై పరిశోధన జరిపించే విషయంపై రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు విజయలక్ష్మి లేఖలు రాయాలని సీహెచ్ విద్యాసాగరరావు సూచించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్లు, కేంద్రమంత్రులు మణిపూర్‌లో సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేత వీహెచ్ అభిప్రాయపడ్డారు. అనేక సిద్ధాంత రాద్ధాంతాలున్నా ఓ మేలుకలయికగా దీనిని నిర్వహించడం గొప్పవిషయమని డా.లక్ష్మణ్ అన్నారు. తెలంగాణది చాలా గొప్ప సంస్కృతి అని, పూలను గౌరమ్మగా చేసి పూజించే సంస్కృతి అని బండారు విజయలక్ష్మి చెప్పారు. తెలంగాణ సంస్కృతి వైభవాన్ని, వారసత్వాన్ని చాటేలా అలయ్‌బలయ్‌ను బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా, ఇప్పుడు దానిని తాము కొనసాగిస్తున్నామని వెల్లడించారు. -
సింగపూర్‌లో తెలంగాణ బలగం అలయ్ బలయ్
సింగపూర్: తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) ఆధ్వర్యంలో ఫ్యామిలీ డేను తెలంగాణ బలగం అలయ్ బలయ్ -2023 పేరిట ఇక్కడి సింగపూర్ పుంగ్గోల్ పార్క్ లో ఆదివారం (జూన్ 4) ఉత్సాహంగా నిర్వహించారు. ఈ ఫ్యామిలీ డేలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన సుమారు 400 మంది ప్రవాసులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతిని, ఆటలను భావి తరాలకు అందించడానికి TCSS సభ్యులు వివిధ రకాల భారతీయ సంప్రదాయ ఆటలైన సంచి దుంకుడు, అష్టాచెమ్మ, పచ్చీస్, కచ్చకాయలు, గోళీలాట, తొక్కుడు బిళ్ళ, చార్ పల్లి, కోకో, చిర్రగోనే వంటివి ఆడించి బహుమతులు అందజేశారు. ఈ అలయ్ బలయ్ లో సర్వపిండి, పచ్చి పులుసు, చల్ల చారు, బాగారా మొదలగు నోరూరించే తెలంగాణ వంటకాలను అందరికి రుచి చూపించారు. తెలంగాణ బలగం అలయ్ బలయ్ విజయవంతంగా జరగడానికి సహకరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికి TCSS అధ్యక్షుడు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్, సొసైటీ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, గోనె నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి, కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొందుగుల రాము, నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు రోజా రమణి, రాధికా రెడ్డి నల్లా, శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, సదానందం అందె, రవి చైతన్య మైసా, భాస్కర్ రావు, సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ రెడ్డి, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు తదితరులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా శశిధర్ రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, రాధికా రెడ్డి నల్ల, కల్వ లక్ష్మణ్ రాజు, శ్రీకాంత్ కొక్కుల వ్యవహరించారు. కార్యక్రమంలో నాగ భూషణ్ రెడ్డి, రమాదేవి మల్లారెడ్డి, సందీప్. ఎమ్, ముశ్రమ్ మహేష్ తదితరులు తమ ఇంటి రుచులను అందరికీ రుచి చూపించారు. కార్యక్రమ స్పాన్సర్స్ ఏపిజే అభిరామీ జువెల్లర్స్, మై హోమ్ సయుక్, జోయాలుకాస్, ఎస్పీసిస్ నెట్, వైష్ణవి ఇన్ ఫ్, గరంటో ఎకాడమి వారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
చిరంజీవిపై గరికపాటి ఫైర్.. వారు చెప్పే శాంతి వచనాలకు విలువెక్కడిది?
రాజకీయ నాయకులు, ఆద్యాత్మిక వేత్తలు, భక్తి విషయాలకు రాజకీయ అంశాలకు ముడిపెట్టి మాట్లాడడం పద్దతేనా? ఇలాంటివాటివల్ల ప్రజలకు ఏమైనా మంచి సందేశం వెళుతుందా? ఆలయానికి వెళ్లి ప్రార్ధన చేసి, ఏవో కోర్కెలు కోరుకుని వెళ్లిపోవడం రివాజు. కాని రాజకీయ నేతలు దేశం కోసమే ప్రార్ధించామని చెబుతుంటారు. నిజంగా వారు అచ్చం ప్రజల కోసమే పూజలు చేసి ఉంటే మెచ్చుకోవలసిందే. కానీ ఎక్కువ మంది తమ అదికారం కోసమో, మరే రాజకీయ ప్రయోజనం కోసమో చేస్తుంటారు. అదేమి రహస్యం కాదు. అది తప్పుకూడా కాదు. కానీ బయటకు వచ్చి చెప్పే కబుర్లే ఒక్కోసారి అనవసర వివాదాలకు తావిస్తుంటాయి. ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు దసరా నాడు విజయవాడ కనకదుర్గమ్మ గుడిని సందర్శించుకుని పూజలాచరించిన తర్వాత అమరావతి రాజధాని విషయమై మాట్లాడిన సంగతులలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే తగులుతాయన్న భావన కలుగుతుంది. అలాగే ప్రముఖ ఆద్యాత్మిక వేత్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్య ఒకటి ఆయనలోని పరిజ్ఞానాన్ని ప్రశ్నించేలా ఉంది. ముందుగా చంద్రబాబు ఏమన్నారో చూద్దాం. మాట తప్పేవారిని దుర్గమ్మ కూడా క్షమించదని అన్నారు. ప్రజా సంకల్పం, దుర్గమ్మ ఆశీస్సులతో అమరావతి రాజధానిగా నిర్ణయించాం. ప్రస్తుతం రాజధాని అమరావతిపై రోజుకోమాట మార్చడం మంచిదికాదు.. అలాంటి వాళ్లను దుర్గమ్మ కూడా క్షమించదు .. అంటూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. రాజధానికి సంబంధించి తన వైఖరిపై రాజకీయంగా ఏమి మాట్లాడినా చంద్రబాబును ఆక్షేపించనవసరం లేదు. కాని దుర్గమ్మ తల్లికి లింక్ పెట్టి మాట్లాడడమే అభ్యంతరకరం. మాట తప్పేవారిని దుర్గమ్మ క్షమించదని అంటే, అందువల్లే ఆయన 2019 ఎన్నికలలో ఘోర ఓటమి పాలయ్యారా? రాజధాని 29 గ్రామాల పరిధిలోనే ఉండాలని, రాష్ట్ర ప్రజలందరి సొత్తు తీసుకువచ్చి ఆ గ్రామాలలోనే పెట్టాలని దుర్గమ్మ ఏమైనా చెప్పారా? (చదవండి: గరికపాటిపై ఆర్జీవీ ఘాటు వ్యాఖ్యలు, నువ్వేంటో..!) చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ బదులు ఇస్తూ, దుర్గమ్మ అన్ని ప్రాంతాల ప్రజల మేలు కాంక్షిస్తారని అన్నారు. చంద్రబాబును 23 సీట్లకే పరిమితం చేసి జగన్ కు 151 సీట్లను దుర్గమ్మ ఇచ్చినట్లే కదా? అసలు మాట తప్పడం అంటే ఏమిటి? లక్షకోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి చేయకపోవడం మాట తప్పినట్లు అవుతుందా? లేదా? కాపులను బిసిలలో చేర్చుతామని చెప్పి చేయలేకపోవడం మాట తప్పడం అవుతుందా? 400 ఎన్నికల హామీలను ఇచ్చి అమలు చేయకపోవడాన్ని ఏమంటారు. రాజకీయ నేతలు ఇలాంటి విషయాలలో సెంటిమెంట్ జోడించి ప్రసంగాలు చేస్తే అవి వారికే తగులుతాయన్న సంగతి అర్ధం చేసుకోవాలి. ఇక గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యను గమనిద్దాం. ఏడు కొండలని రెండు కొండలు చేస్తే ఏమైందో చూశాం కదా అని అన్నారు. ఇది ఫక్తు రాజకీయ విమర్శ. గతంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై రాజకీయంగా కుట్ర చేయడానికి అప్పట్లో కొందరు ఈ దుష్ప్రచారం చేశారు. నిజానికి స్థానిక ఎన్నికల వల్ల పవిత్రత దెబ్బతినకూడదని ఆనాటి ప్రభుత్వం కొంత విస్తీర్ణం పేర్కొంది. పైగా అది కూడా గత ప్రభుత్వాల టైమ్ నుంచి ఉన్నదే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మీడియా వ్యక్తి, ఆర్ఎస్ఎస్ కు చెందిన కొందరు దీనిని వివాదం చేసి వైఎస్ కు పులమడానికి యత్నం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారాన్ని నిషేధించడమే కాకుండా, తిరుమల అంటే ఏడు కొండలేనని వైఎస్ జిఓలు కూడా ఇచ్చారు. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా గరికపాటి అభ్యంతరకరంగా మాట్లాడారు. కేవలం ఏదో వ్యక్తిగత ద్వేషం పెట్టుకుని మాట్లాడారేమో అనిపిస్తుంది. పైగా అలయ్ బలయ్ వంటి ప్రోగ్రాంలో ఈ ప్రస్తావనే అవసరం లేదు. పోనీ ఏదైనా శాపం వల్లే నేతలు చనిపోతారన్నది నిజమే అని పురాణ ప్రవచనకర్త గరికపాటి భావిస్తుంటే ఆయన అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. మహాత్మా గాంధీని గాడ్సె దారుణంగా కాల్చి హత్యచేశాడు. దేశ ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రష్యాలో మరణించిన తీరు మిస్టరీ. మరో ప్రధాని ఇందిరాగాంధీ భద్రతా సిబ్బంది జరిపిన కాల్పులలోనే చనిపోయారు. ఇంకో ప్రధాని రాజీవ్ గాంధీని శ్రీలంక తీవ్రవాదులు బాంబులు పేల్చి హత్యచేశారు. ఇందిరాగాందీ రెండో కుమారుడు సంజయ్ గాందీ హెలికాఫ్టర్ కూలి మరణించారు. వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన రోజుల్లోనే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ కూడా గల్లంతైపోయింది. టిడిపి నేతలు ఎర్రన్నాయుడు, హరికృష్ణ, లాల్ జాన్ భాష లు రోడ్డు ప్రమాదాలలో మరణించారు. టిడిపి వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పదవీచ్యుతుడై కుటుంబం నుంచే ఘోర పరాభవంతో కుమిలి, కుమిలి మరణించారు. మాజీ ప్రధాని, గొప్ప నేత అయిన అటల్ బిహారీ వాజ్ పేయి తన చివరి సంవత్సరాలలో జ్ఞాపక శక్తి కోల్పోయి చాలాకాలం మంచానికే పరిమితం అయ్యారు. ఇలా చెప్పుకుంటూ చాలా ఉదాహరణలు ఉంటాయి. వీళ్లంతా గొప్పవారు. కాని వారి జీవితాలు ఇలా ముగియడం దురదృష్టకరం. కాని అంత మాత్రాన ఏదో శాపం అనో, పాపం అనో ఆద్యాత్మికవేత్తలు వ్యాఖ్యానిస్తే ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళతాయి? అందువల్ల గరికపాటి వంటివారు సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది. మరో సంగతి. ఆద్యాత్మికవేత్తలకు మరీ కోపం ఎక్కువ ఉండకూడదు. కాని అలయ్ బలయ్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించి గరికపాటి అంత కటువుగా వ్యవహరించి ఉండవలసింది కాదు. ప్రశాంతంగా ఉండవలసిన ఆద్యాత్మికవేత్తలు తోటి ప్రముఖుడిపైనే ఫైర్ అయితే, వారు చెప్పే ప్రవచనాలకు, శాంతి వచనాలకు ఏమి విలువ ఉంటుంది? వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
'మాకు ఆ ఉద్దేశం లేదు.. ఆయనను ఎవరూ తప్పుగా మాట్లాడొద్దన్న నాగబాబు'
ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావుపై చేసిన వ్యాఖ్యల పట్ల మెగాబ్రదర్ నాగబాబు వివరణ ఇచ్చారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగిన అలయ్-బలయ్ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. తాజాగా ఇవాళ వివరణ ఇస్తూ మరో ట్వీట్ చేశారు నాగబాబు. ట్విటర్లో ఆయన రాస్తూ.. 'గరికపాటి వారు ఏదో మూడ్‌లో ఆలా అని వుంటారు. ఆయన లాంటి పండితుడు అలా అని ఉండకూడదని ఆయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప.. ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు. ఏది ఏమైనా మన మెగా అభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని.. ఆయనను ఎవరు తప్పుగా మాట్లాడవద్దని నా రెక్వెస్ట్.' అంటూ పోస్ట్ చేశారు. అసలేం జరిగిందంటే: దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులు చిరంజీవితో ఫోటో సెషన్ నిర్వహించారు. మెగాస్టార్‌తో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి వారు ఏదో మూడ్ లో ఆలా అనివుంటారు ,అయన లాంటి పండితుడు ఆలా అనివుండకూడదని అయన అర్థం చేసుకోవాలి అని అన్నామే తప్ప ,ఆయనతో క్షమాపణ చెప్పించుకోవాలని మాకు కోరిక లేదు.ఏది ఏమైనా మన మెగాభిమానులు ఆయనని అర్థం చేసుకోవాలి గాని ఆయనని ఎవరు తప్పుగా మాట్లాడవద్దని మెగాభిమానులకు నా request. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 7, 2022 ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటే .. — Naga Babu Konidela (@NagaBabuOffl) October 6, 2022 -
వైభవంగా అలయ్ బలయ్.. ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తోంది
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం లభించి శత వసంతాలు పూర్తికి ముందుకు సాగుతున్న ఈ అమృతకాలంలో దేశ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ‘అలయ్–బలయ్’ తోడ్పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆయన లేఖ రాశారు. అలయ్–బలయ్ ఔన్నత్యాన్ని ప్రధాని కొనియాడారు. దశాబ్దానికి పైగా విజయవంతంగా సాగుతున్న ఈ ఉత్సవం తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, కళలు, కళాకారులు, విభిన్న రుచులకు ఒక వేదికగా నిలుస్తోందన్నారు. మన కళాకారులు, జానపద గాయకులు తమ ప్రదర్శనల ద్వారా భిన్నమైన సంస్కృతిని చాటేందుకు దోహదపడుతోందన్నారు. భారత సమాజంలోని విభిన్న వర్గాల ప్రజలు కలిసి వివిధ పండుగలను జరుపుకోవడం ఎంతోకాలంగా ఓ సంప్రదాయంగా వస్తోందని మోదీ తెలిపారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరిగే ఈ పండుగలు సామాజిక బంధాలను బలపరుస్తాయని, ఈ ఆలోచనా ధోరణిని అలయ్–బలయ్ తనలో భాగం చేసుకుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రధాని శుభాశీస్సులు అందజేశారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
సాక్షి, హైదరాబాద్: సమాజంలోని విభిన్న వర్గాల మేలుకలయికగా ‘దత్తన్న అలయ్–బలయ్’ ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. సాహితీ, సాంస్కృతిక, సినిమా, రాజకీయ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుల ఉపన్యాసాలు.. జానపద, సంగీత, కళారూపాల ప్రదర్శనలు.. నోరూరించే తెలంగాణ వంటకాల మేళవింపుగా.. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ దసరా సమ్మేళనం కొనసాగింది. గురువారం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్–బలయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి సారథ్యంలో సాగిన ఈ కార్యక్రమాన్ని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నీ తానై ముందుండి నడిపించారు. చిరంజీవితో ముచ్చటిస్తున్న గరికపాటి చిరంజీవి సినిమా తీయలేదా?: కేరళ గవర్నర్ రాజకీయాలు, కుల, మతాలకు అతీతంగా మనుషుల మధ్య స్నేహం, సాంస్కృతిక విలువలు పెంపొందించేందుకు అలయ్–బలయ్ ప్రేరణగా నిలుస్తుందని ముఖ్యఅతిథి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. కేవలం తమ కుటుంబాల కోసమే కాకుండా ఇతరుల కోసం, సమాజం కోసం ముఖ్యంగా అణగారిన వర్గాల కోసం జీవించడం గొప్ప అని పేర్కొన్నారు. ఇంత గొప్పగా ఉన్న దీనిని ఇతివృత్తంగా తీసుకుని సినీహీరో చిరంజీవి ఇంకా సినిమా తీయలేదా? అని ప్రశ్నించారు. భిన్న సంస్కృతులను ఏకం చేసేందుకే: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు సమైక్యంగా కృషి చేస్తే దేశంలోనే అగ్రగామిగా నిలుస్తాయని హరియా ణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. కేవలం శరీరాలే కాదు మనసులు ఆలింగనం చేసుకోవాలనే లక్ష్యంతో పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా భిన్న సంస్కృతులను ఏకం చేయాలనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించినట్లు తెలిపారు. గతంలో ఎన్నికలప్పుడే రాజకీయాలుండేవని, ఆ తర్వాత ప్రాంతం, దేశాభివృద్ధి కోసం పాటు పడేవారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇతర పార్టీల నేతలు కలుసుకుని మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. అధర్మంపై సత్యం, ధర్మం గెలుపునకు చిహ్నంగా నిలిచే దసరా సందర్భంగా.. స్థానిక సంస్కృతికి చిహ్నంగా దీని నిర్వహణ అద్భుతమని కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుబా కొనియాడారు. అభిమానులతో సెల్ఫీలు దిగుతున్న చిరంజీవి దేశవ్యాప్తంగా జరగాలి: గాడ్ ఫాదర్’ సినిమా విడుదలతో హుషారుగా ఉన్న సినీ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే అలయ్ –బలయ్ వంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా జరగాలి.. వ్యాపించాలని ఆయన అన్నారు. తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్న ఈ సమ్మేళనం అద్భుతమని, స్నేహానికి, సుహృద్భావానికి ప్రతీకగా ఈ కార్యక్రమం సాగుతోందని చెప్పారు. మాటలకు లొంగని వారు, హృదయ స్పందనలకు లొంగుతారని, అలాంటి ఈ సంస్కృతి మరింత ముందుకెళ్లాలన్నారు. స్ఫూర్తిదాయకం గరికపాటి ప్రవచనం: గరికపా టి గారి ప్రవచనాలను తాను ఇష్టపడతానని, అవి స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చిరంజీవి పేర్కొ న్నారు. ఆయనకు పద్మశ్రీ వచ్చినప్పుడు అభినందించానని, అయితే ఇన్నిరోజుల్లో ఆయనను కలుసుకోవడం ఇదే తొలిసారని తెలిపారు. ‘మీ ఆశీస్సులతో ముందుకెళతాం. ఎప్పుడైనా సమయం దొరికి తే మా ఇంటికి రండి’ అంటూ ఆహ్వానించారు. ‘ఏపాటి వాడికైనా..’ అంటూ నాగబాబు ట్వీట్ ఫొటో సెషన్ ఆపాలంటూ చిరంజీవిని ఉద్దేశించి ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందిస్తూ.. ‘‘ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయపడటం పరిపాటే’’.. అంటూ ట్వీట్ చేశారు. చిరంజీవి ఫొటో సెషన్ ఆపకపోతే వెళ్లిపోతా: గరికపాటి ప్రవచన కర్త గరికపాటి నర్సింహారావు ప్రసంగించేందుకు సిద్ధం కాగా, వేదికకు ఒకవైపు చిరంజీవితో కలిసి పలువురు ఫొటోలు, సెల్ఫీలు దిగుతుండడంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో గరికపాటి.. ‘ఈ ఫొటో సెషన్ చిరంజీవి వెంటనే నిలిపేయాలి. వాళ్లు దానిని ఆపకపోతే నేను మాట్లాడకుండా వెళ్లిపోతా..’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో కొంతసేపు అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. మరికొన్ని నిమిషాలు ఫొటోల కార్యక్రమం కొనసాగి ఆగిన తర్వాత గరికపాటి ప్రసంగించారు. మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సత్యకుమార్, టి.ఆచారి పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరఫున ఎంపీ కె.కేశవరావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ హాజరయ్యారు. వివిధ పార్టీల నేతలు మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, ప్రొ.ఎం.కోదండరాం, గిరీష్‌సంఘీ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, డా.కె.నారాయణ, కూనంనేని సాంబశివరావు, కె.రామకృష్ణ, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, విద్యాసాగర్, అజయ్ మిశ్రా, తదితరులు కూడా పాల్గొన్నారు. -
గరికపాటికి క్షమాపణలు చెప్పిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ నేపథ్యంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ ఏర్పాటు చేసిన అలయ్ బలయ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, పలువురు ప్రముఖలు హాజరయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అలయ్ బలయ్‌కు వచ్చిన చిరంజీవితో అభిమానులు ఫోటో సెషన్ నిర్వహించారు. అదే సమయంలో అవధాని గరికపాటి నరసింహరావు ప్రసంగం ప్రారంభించారు. చిరంజీవితో సెల్ఫీలకు జనం ఎగబడటంతో గరికపాటి ప్రసంగానికి అంతరాయం ఏర్పడింది. దీంతో సెల్ఫీలు ఆపితేనే ప్రసంగాన్ని కొనసాగిస్తానని గరికపాటి అసహనం వ్యక్తం చేశారు. ‘ అక్కడ మొత్తం ఫోటో సెషన్ ఆగిపోవాలి. లేదంటే నేను వెళ్లిపోతాను. నాకేం మోహమాటం లేదు. చిరంజీవి గారు దయచేసి మీరు ఆపేసి.. ఈ పక్కకు రండి. నేను మాట్లాడతాను. చిరంజీవి గారికి నా విజ్ఞప్తి. ఫోటో సెషన్ ఆపేసి ఇక్కడకు రావాలి. లేదంటే నాకు సెలవిప్పించండి’ అంటూ వెళ్లిపోతా’ అంటూ గట్టిగానే చెప్పారు. వెంటనే అక్కడున్న వారు ఆయనకు సర్ధిచెప్పారు. అంతేగాక సెల్ఫీలు ఆపి గరికపాటికి చిరంజీవి క్షమాపణ చెప్పారు. గరికపాటి ప్రసంగాలంటే తనకు ఇష్టమని, ఆసక్తిగా వింటానని చెప్పారు.ఒకరోజు తమ ఇంటికి భోజనానికి రావాలని గరికపాటిని చిరంజీవి ఆహ్వానించారు. చదవండి: ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి -
దత్తన్న తెలంగాణ సంస్కృతిని కాపాడుతున్నారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ఒక పెద్ద హిట్ సినిమా వచ్చిన తరువాత అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చాలా సంవత్సరాలుగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని అనుకుంటున్నా ఈ ఏడాది అవకాశం వచ్చిందని ఆయన తెలిపారు. గురువారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె బండారు విజయలక్ష్మి ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. 'దేశంలోనే సంస్కృతి సంప్రదాయాల కోసం చేపట్టిన కార్యక్రమం ఇది ఒక్కటే. పంచడం, పుచ్చుకోవడం అనేది ఎక్కడా లేదు.. ఒక్క తెలంగాణ సంప్రదాయంలో మాత్రమే ఉంది. ఇండస్ట్రీలో అందరూ కలిసున్నప్పటికీ.. అభిమానుల వరకు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం కొనసాగుతుంది. హీరోల మధ్య సహృద్భావ వాతావరణం కల్పిస్తే అందరిలో మార్పు వస్తుంది. ఇండస్ట్రీలో కూడా అందరిని పిలిచి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేశాను. తరువాత పార్టీ కూడా ఏర్పాటు చేశాను. తెలంగాణ సంస్కృతిలో దసరా పండగ రోజున జమ్మి ఆకులు ఇచ్చి పెద్దవాళ్లకి దండం పెట్టడం, తోటి వారిని కౌగిలించుకోవడం సంప్రదాయం. 17 సంవత్సరాలుగా దత్తాత్రేయ గారు ఈ కార్యక్రమం చేపట్టడం గర్వకారణం. పార్లమెంట్లో ఎంత తిట్టుకున్న బయట మాట్లాడుకునే తీరు అలయ్ బలయ్ లాంటిదిని' మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. చదవండి: (ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి) -
అలయ్ బలయ్ కు హాజరైన మెగాస్టార్ చిరంజీవి
-
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉత్సాహంగా అలయ్ బలయ్ కార్యక్రమం
-
ఉత్సాహంగా అలయ్ బలయ్.. డప్పు కొట్టిన చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, మాజీ ఎంపీ వి హనుమంతరావు సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన పలుసాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో దత్తాత్రేయ, చిరంజీవి డప్పు కొడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. -
కాసేపట్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్ కార్యక్రమం
-
ఆరోజు జరిగింది ఇదే..వీడియో రిలీజ్ చేసిన మంచు విష్ణు
Manchu Vishnu Full Stops Rumours: బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్య్రక్రమంలో మంచు విష్ణు-పవన్ కల్యాణ్ మాట్లాడుకోలేదని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. స్టేజ్‌పై ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా కనీసం పలకరించుకోలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Manchu Vishnu: నాన్న, చిరంజీవి నిన్న ఫోన్లో మాట్లాడుకున్నారు.. తాము బ్యాక్ స్టేజ్ మాట్లాడుకున్నామని, ఆ విజువల్స్ బయటకు రాకపోవడంతో తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారని, అయితే ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాజాగా అలయ్-బలయ్ కార్యక్రమం రోజు అసలు ఏం జరిగిందన్న దానిపై మంచు విష్ణు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పవన్-మంచు విష్ణు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం స్టేజ్‌పైకి వెళ్లారు. ఈ వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయ్యింది. What really went down 😎. https://t.co/6uHvs1He2S — Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021 -
పవన్ కల్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్: మంచు విష్ణు
Manchu Vishnu About Pawan Kalyan: అలయ్-బలయ్ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, తాను మాట్లాడుకోకపోవడంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం మాట్లాడుకున్నాం అని, అయితే ఉప రాష్రపతి ఉండట వల్ల స్టేజ్‌పై మాత్రమే మాట్లాడుకోలేదని పేర్కొన్నారు. ఇక కార్యక్రమం అనంతరం పోస్ట్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ..పవన్ ఫ్యాన్స్ కోసమే ఆ వీడియోను షేర్ చేసినట్లు తెలిపారు. తమ మధ్య విభేదాలు లేవని, పవన్‌కల్యాణ్ తమకు ఫ్యామిలీ ఫ్రెండ్ అని పేర్కొన్నారు. అంతేకాకుండా నిన్న తండ్రి మోహన్‌బాబు-చిరంజీవి ఫోన్లో మాట్లాడుకున్నట్లు వివరణ ఇచ్చారు. కాగా బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్యక్రమంలో మంచు విష్ణు- పవన్ కల్యాణ్ ఎదురుపడినా ఇద్దరి మధ్యా మాటల్లేవ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: శివబాలాజీ భార్యపై మోహన్ బాబు సీరియస్ Can you guess whose at the end of the video? 💪🏽 pic.twitter.com/FJyMiWRA2T — Vishnu Manchu (@iVishnuManchu) October 17, 2021 చదవండి: ‘మా’ ఎన్నికలు: ట్రోలర్స్‌పై మండిపడ్డ మంచు లక్ష్మి శ్రీవారిని దర్శించుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు అండ్ టీం -
సందడిగా అలయ్ బలయ్.. హాజరైన ప్రముఖులు
-
జలవిహార్‌లో సందడిగా ‘అలయ్- బలయ్’ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయ లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘అలయ్- బలయ్’ కార్యక్రమం ఆదివారం జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌదర్యరాజన్ ప్రారంభించారు. అనంతరం ఆమె గిరిజన మహిళలలో నృత్యం చేశారు. అలయ్- బలయ్ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ ఆర్లేకర్, కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మా అధ్యక్షుడు మంచు విష్ణు, తెలంగాణ మండలి ప్రొటెం ఛైర్మెన్ భూపాల్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలీ, నటుడు కోట శ్రీనివాస్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హర్యానా గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. కలిసి తిందాం, కలిసి పాడుదాం, కలిసి ఆడుదాం అనే సంప్రదాయం ‘అలయ్ బలాయ్’ కార్యక్రమానిదని తెలిపారు. ఏళ్లుగా ‘అలయ్ బలయ్’ కొనసాగుతోందని తెలిపారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘అలాయ్ బలాయ్’ తెలంగాణ రుచులను ప్రోత్సహిస్తూ.. ప్రతి ఒక్కరిని సమానదృష్టితో చూస్తుందని తెలిపారు. తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చిందని అన్నారు. పార్టీలకు జెండాలకు అతీతంగా అందరిని ఒకే వేదికపైకి తెచ్చేది ‘అలయ్ బలాయ్’ అని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని తరతరాలకు అందించడమే ‘అలయ్ బలాయ్’ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఏటా గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలాయ్’ కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ కూతురు విజయలక్ష్మి నిర్వహిస్తున్నారు. దసరా పండగ తర్వాత రెండో రోజు అలయ్ బలాయ్ నిర్వహిస్తారు. అలయ్ బలాయ్‌లో తెలంగాణ వంటల(వెజ్, నాన్ వెజ్)తో సిద్ధం చేశారు. -
ఐక్యతా స్ఫూర్తికి వేదిక అలయ్‌బలయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం నిర్వహిస్తున్న అలయ్ బలయ్ ఉత్సవాల సందర్భంగా బండారు దత్తాత్రేయకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దసరా అనంతరం నిర్వహించే ఈ వేడుకల ద్వారా సమాజంలోని ఐక్యత, సామరస్యస్ఫూర్తి మరింత బలోపేతమవుతాయన్నారు. ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్’ స్ఫూర్తిని పెంపొందించేందుకు, వివిధ ప్రాంతాలకు చెందిన జానపద కళాకారుల నైపుణ్యాల ప్రదర్శనకు గొప్ప వేదికగా నిలుస్తోందని శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఐక్యంగా ముందుకు సాగుదాం
సాక్షి, హైదరాబాద్: ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులు సాధించుకోవాలని నాయీ బ్రాహ్మణ నాయకులు అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆబిడ్స్‌లోని జయ ఇంటర్నేషనల్ హోటల్లో జరిగిన దసరా ఆత్మీయ సమ్మేళనంలో నాయీ బ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులు ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నారని, రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్నికల్లో తమకు సరైన అవకాశాలు దక్కడం లేదని, తమ వాటా తమకు ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నికల్లోనూ బీసీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేస్తూనే, రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకోస్తామన్నారు. నాయీ బ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలని కోరారు. తమను అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల జాబితాలో చేర్చాలని జస్టిస్ రోహిణి కమిషన్‌కు వినతులు ఇచ్చినట్టు వెల్లడించారు. కాగా, తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు నాయీ బ్రాహ్మణులు తమ సంఘీభావం తెలిపారు. 25న ధన్వంతరి జయంతి వేడుకలు వైద్య వృత్తికి ఆదిదేవుడు, నాయీ బ్రాహ్మణుల కులదైవమైన ధన్వంతరి జయంతి వేడుకలను ఈ నెల 25న నిర్వహించనున్నామని డాక్టర్ బీర్ఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. సారంగపాణి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతం చేసి నాయీ బ్రాహ్మణుల ఐక్యతను చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ధన్వంతరి స్ఫూర్తితో అన్ని రంగాల్లో ముందుడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. తమ సంఘీయుల మధ్య సృహృద్భావ సంబంధాలు ఏర్పాలడాలన్న ఉద్దేశంతో దసరా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు న్యాయవాది ఎం. రమేశ్, ఎం. గోపాలకృష్ణ. ఎ. సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేంద్రచంద్ర, కె. వెంకటేశ్వరరావు, జి. అశోక్, గంగాధర్, సీఎల్ఎన్ గాంధీ, రామానందస్వామి, నాగన్న, మద్దికుంట లింగం, సీనియర్ కార్టూనిస్ట్ నారూ, రాపోలు సుదర్శన్, వెంకట్రాయుడు, సూర్యనారాయణ, బాలరాజు, ధనరాజ్, శ్రీధర్, రాజేశ్, పసుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.