Manchu Vishnu Full Stops Rumours: బండారు దత్తాత్రేయ నిర్వహించిన అలయ్-బలయ్ కార్య్రక్రమంలో మంచు విష్ణు-పవన్ కల్యాణ్ మాట్లాడుకోలేదని సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. స్టేజ్‌పై ఇద్దరూ పక్కపక్కనే ఉన్నా కనీసం పలకరించుకోలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికే ఈ విషయంపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: Manchu Vishnu: నాన్న, చిరంజీవి నిన్న ఫోన్‌లో మాట్లాడుకున్నారు..
తాము బ్యాక్ స్టేజ్ మాట్లాడుకున్నామని, ఆ విజువల్స్ బయటకు రాకపోవడంతో తమ మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం చేశారని, అయితే ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తాజాగా అలయ్-బలయ్ కార్యక్రమం రోజు అసలు ఏం జరిగిందన్న దానిపై మంచు విష్ణు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పవన్-మంచు విష్ణు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని సరదాగా కాసేపు ముచ్చటించారు. అనంతరం స్టేజ్‌పైకి వెళ్లారు. ఈ వీడియోతో రూమర్స్‌కు చెక్ పెట్టినట్లయ్యింది.
What really went down 😎. https://t.co/6uHvs1He2S
— Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021
Comments
Please login to add a commentAdd a comment