
'ఆదిపురుష్' టీజర్‌పై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చారు. జిన్నా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడిన విష్ణు ఆదిపురుష్‌పై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. 'రామాయణం మీద సినిమా అంటే లైవ్ యాక్షన్ మూవీ అనుకున్నాం ఇలా యానిమేటెడ్ సినిమాలా చేస్తారని ఊహించలేదు.
ఒకవేళ టీజర్ విడుదలకు ముందే ఇదొక యానిమేషన్ సినిమా అని చెప్పి ఉంటే ఈ రకమైన ట్రోల్స్ వచ్చేవి కావు.ప్రేక్షకుల్ని మోసం చేస్తే ఇలాంటి రియాక్షన్సే వస్తాయని, టీజర్ చూసి నేను కూడా మోసపోయాను' అంటూ మంచు విష్ణు స్వయంగా కామెంట్స్ చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.
తాజాగా ఈ వార్తలపై మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీజర్‌పై తాను మాట్లాడినట్లు చక్కర్లు కొడుతోన్న సోషల్‌మీడియా కథనాల్లో ఎలాంటి నిజం లేదని, జిన్ని రిలీజ్‌కు ముందు కావాలనే కొందరు ఇలాంటి నెగిటివ్ వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. డార్లింగ్ ప్రభాస్‌కు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.
Fake News! As expected, some item raja trying to spread negative news just before #Ginna release 🙄
— Vishnu Manchu (@iVishnuManchu) October 15, 2022
I want nothing but the best for my darling brother Prabhas. ❤️✊🏽 pic.twitter.com/Aa13Vw9XsK
మరో నకిలీ వార్త! పెయిడ్ బ్యాచ్ తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది?????
— Vishnu Manchu (@iVishnuManchu) October 15, 2022
జీవితంలో కొంత ఆనందించండి. 21న #Ginna చూడండి. సానుకూలంగా ఉండండి. Please get the facts right. 🥰 pic.twitter.com/uII03Q9UMd