
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా, కృతిసనన్ సీతలా కనిపించనుంది. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ రాగా, ఇటీవలె జూన్16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మూవీ టీం..ఇందులో భాగంగా ట్రైలర్ అప్‌డేట్ అందించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మే9న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ట్రైలర్‌ని ఇండియాతో పాటు యూఎస్ఏ, యుకే, కెనడా, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ సహా 70 దేశాల్లో అత్యధిక స్క్రీన్స్‌లో లాంచ్ చేయనున్నారు.
ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ్లోబల్ ఈవెంట్‌గా ట్రైలర్ లాంచ్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మరి ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Jai Shri Ram
— Om Raut (@omraut) May 6, 2023
जय श्री राम
జై శ్రీరాం
ஜெய் ஸ்ரீ ராம்
ಜೈಶ್ರೀರಾಂ
ജയ് ശ്രീറാം
Trailer releasing on 9th May 2023#Adipurush #Prabhas #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @manojmuntashir pic.twitter.com/WxkpGGrg6P
Comments
Please login to add a commentAdd a comment