
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మైథలాజికల్ డ్రామా ‘ఆదిపురుష్’. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచేశాయి.
రామాయణం ఇతీహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి జానకి పాత్రలో ఉన్న కృతి సనన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది చిత్రబృందం.
(ఇది చదవండి: ఆదిపురుష్ క్రేజీ అప్‌డేట్.. ప్రభాస్ మోషన్ పోస్టర్ రిలీజ్!)
105 థియేటర్లలో ట్రైలర్
ఈ సందర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. ఈనెల 9న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో 3డీ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఏపీ, తెలంగాణలో 105 థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేశారు.
మరోసారి వాయిదా!
అయితే ఈసారి కూడా ఆదిపురుష్ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని రూమర్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆదిపురుష్ విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని మేకర్స్ తెలిపారు. త్వరలో ప్రమోషన్లు ప్రారంభమవుతాయని చిత్రబృందం వెల్లడించారు. మే 9 సాయంత్రం 5.30 గంటలకు ట్రైలర్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
(ఇది చదవండి: ఆదిపురుష్.. జానకి పోస్టర్ రిలీజ్.. పాపిట సింధూరంతో..)
కాగా.. గతంలో టీజర్‌పై వివాదం తలెత్తడంతో కొన్ని రోజులు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని రావణాసురుడు, హనుమాన్ పాత్రలను చూపించిన విధానంపై సర్వత్రా వ్యతిరేకత వచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్‌లో మరిన్ని మార్పులు చేసేందుకు చిత్రబృందం మూవీ విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఈసారి కూడా వాయిదా పడుతుందన్న వార్తల నేపథ్యంలో ఆదిపురుష్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల కానుంది.
#AdipurushTrailer Coming On 9th May!! It will be screened in 105 theaters in AP/TG. #Prabhas #Adipurush pic.twitter.com/6ARid6Vpio
— Prabhas (@PrabhasRaju) May 4, 2023
Comments
Please login to add a commentAdd a comment