Netizens trolling new poster of Prabhas and Kriti Sanon starrer Adipurush - Sakshi
Sakshi News home page

Adipurush: ఆదిపురుష్‌పై మళ్లీ మొదలైన ట్రోలింగ్‌.. 'ఫ్యాన్స్‌ ఎడిటింగ్‌ నయంరా బాబూ!'

Published Thu, Mar 30 2023 4:24 PM | Last Updated on Thu, Mar 30 2023 4:38 PM

Netizens Trolling Adipurush New Poster - Sakshi

కృతి సీతలా కాదు కదా ఆమె చెలికత్తెలా కూడా లేదు', 'లక్ష్మణ, హనుమంతులకు గడ్డమా? మీకన్నా ఫ్యాన్‌ ఎడిట్స్‌ బాగున్నాయ్‌ కదరా..',

ఊపిరి సినిమాలో కార్తీ.. నాగార్జున బర్త్‌డేకు అందరినీ పిలిచి కేక్‌ కట్‌ చేసి సర్‌ప్రైజ్‌ చేస్తాడు. నాగ్‌ కూడా వావ్‌.. సర్‌ప్రైజ్‌ అని ఆశ్చర్యపోతుంటాడు. కానీ పక్కకు వెళ్లాక మాత్రం ప్రతి సంవత్సరం చేసేది ఇదే కదా! ఇందులో సర్‌ప్రైజ్‌ ఏముందని డీలా పడిపోతాడు. ఆదిపురుష్‌ టీమ్‌ కూడా అచ్చంగా ఇలాగే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 

ఈరోజు (మార్చి 30) శ్రీరామనవమి కావడంతో ఏదైనా ఊహించని సర్‌ప్రైజ్‌ ఉంటుందని అంచనా వేశారు ప్రభాస్‌ అభిమానులు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఎప్పటిలాగే ఓ పోస్టర్‌తో సరిపెట్టింది చిత్రయూనిట్‌. ప్రతి ఇళ్లలో ఉండే శ్రీరాముడి ఫోటో ఎలా ఉంటుందో దాదాపు అలాగే ఉందీ పోస్టర్‌. ఇది చూసిన అభిమానులు సర్‌ప్రైజ్‌కు బదులు షాకవుతున్నారు. 'దేవుడి పోస్టర్‌ను దింపారు కదరా సామీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

'నాకైతే ముఖాలను మార్ఫ్‌ చేశారనిపిస్తోంది, ఇక సినిమా ఎలా ఉంటుందో?', 'బడ్జెట్‌ బొక్క.. ఏమీ మారలేదు, పోస్టర్‌ డిజైన్‌ కూడా రాకపోతే పెద్ద పెద్ద సినిమాలు తీయడం ఎందుకో..', 'సీతమ్మ కాళ్లకు మెట్టలు లేవు, మెడలో మంగళసూత్రం లేదు, పాపిట్లో సింధూరం లేదు..', 'అసలు కృతి సీతలా కాదు కదా ఆమె చెలికత్తెలా కూడా లేదు', 'లక్ష్మణ, హనుమంతులకు గడ్డమా? మీకన్నా ఫ్యాన్‌ ఎడిట్స్‌ బాగున్నాయ్‌ కదరా..', 'ఇదంతా వర్కవుట్‌ అవ్వదు కానీ ఓటీటీలో రిలీజ్‌ చేయండి' అని ట్రోల్‌ చేస్తున్నారు.

ఆదిపురుష్‌ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌ రాముడిగా, కృతి సనన్‌ సీతగా, సైఫ్‌ అలీఖాన్‌ రావణుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్‌ 16న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement