trolling
-
ఆ ట్రోలింగ్‌ను పవన్, బాబు ఖండించరా?
అనంతపురం, సాక్షి: వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతున్న ప్రజాదరణను ఓర్వలేక చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు దిగిందని, ఈ క్రమంలోనే భద్రతను కుదించిందని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారిని ట్రోల్ చేసిన అంశంపైనా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.వైఎస్ జగన్‌కు భద్రత కల్పించడంలో కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) విఫలమవుతోంది. ఈ అంశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. జగన్ ప్రజల్లో తిరగకుండా చేసేందుకు భద్రత కుదించారు. ఇల్లీగల్ యాక్టివిటీస్‌కు భద్రత కల్పించలేమని చంద్రబాబు అంటున్నారు. రైతులను పరామర్శించడం చంద్రబాబు దృష్టిలో ఇల్లీగల్ యాక్టివిటీసా?. చంద్రబాబు అలా మాట్లాడడం దుర్మార్గం కాదా?.. ..కావాలనే వైఎస్ జగన్ భద్రత(YS Jagan Security)పై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. మిర్చి రైతులను జగన్ పరామర్శిస్తే తప్పేంటి?. వైఎస్ జగన్ పాలనలో 24 పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే మద్దతు ధరలు కల్పించింది. కానీ, టీడీపీ కూటమి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించటంలో విఫలమైంది.రాజకీయ విలువల్లేవా?వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో ఫోటో దిగిన చిన్నారిపై సోషల్ మీడియాలో టీడీపీ సైకోలు దుష్ప్రచారం(TDP Trolling) చేస్తున్నారు. అమ్మ ఒడి వస్తోందో.. రాలేదో... నారాయణ, చైతన్య స్కూళ్ల వద్ద అడిగినా చెబుతారు. చిన్నారిపై ట్రోలింగ్ జరుగుతుంటే చంద్రబాబు, పవన్‌లు ఖండించరా?. వాళ్లకు అసలు రాజకీయ విలువలు లేవా? అని అనంత ప్రశ్నించారు. -
రాజమౌళిపై ట్రోలింగ్.. 'మీరు ఇండియన్స్ కాదా?'
కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం (జనవరి 25న) పద్మ అవార్డులు (Padma Awards 2025) ప్రకటించింది. వీటిలో ఏడు పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మ శ్రీ పురస్కారాలున్నాయి. వీటిని అందుకున్నవారిలో ఏడుగురు తెలుగువారు ఉన్నారు. వైద్య విభాగంలో దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి పద్మ విభూషణ్ అందుకున్నారు. కేఎల్ కృష్ణ (విద్యా సాహిత్యం) , మాడుగుల నాగఫణి శర్మ (కళా రంగం), మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు), మిరియాల అప్పారావు (కళారంగం), వి. రాఘవేంద్రాచార్య పంచముఖి (సాహిత్యం, విద్య)లను పద్మశ్రీ వరించాయి. కళల విభాగంలో నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్‌కు ఎంపికయ్యారు.తెలుగువారికి ఏడు పద్మ పురస్కారాలుఈ సందర్భంగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli సోషల్ మీడియా వేదికగా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. 'ఈసారి తెలుగువారికి ఏడు పద్మ అవార్డులు రావడం సంతోషకరం. పద్మ భూషణ్‌కు ఎంపికైన నందమూరి బాలకృష్ణగారికి అభినందనలు. పద్మ పురస్కారం గెల్చుకున్న తెలుగువారితో పాటు, ఇతర భారతీయులకు శుభాకాంక్షలు అని రాసుకొచ్చాడు. మరో ట్వీట్లో బాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కపూర్, తమిళ స్టార్ అజిత్‌ను ప్రశంసించాడు.బేధాలు దేనికి?ఇది కొంతమందికి అస్సలు మింగుడుపడలేదు. తెలుగువారు అని ప్రత్యేకంగా వర్ణించడం దేనికని విమర్శిస్తున్నారు. 'తెలుగువారు దేశంలో భాగం కాదా? ఎందుకని ప్రాంతాల మధ్య అడ్డుగోడ కడుతున్నారు?', 'తెలుగుప్రజలు భారతీయులు కాదా?' అని ప్రశ్నిస్తున్నారు. 'ఉత్తరాది, దక్షిణాది మధ్య విభేదాల గురించి చర్చే లేదు. కానీ మీలాంటివాళ్లు మాత్రం ఈ అంశాన్ని బాగా వాడుకుంటారు. నార్త్ జనాలు మీ సినిమాలకు ఎందుకు సపోర్ట్ చేస్తారో నాకిప్పటికీ అర్థం కాదు. మనమంతా భారతీయులం అని చెప్పే ధైర్యం లేని వాళ్లకు మద్దతు దేనికి?' అని హిందీ ఆడియన్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు.పుట్టిన గడ్డ తర్వాతే ఏదైనా..ఈ ట్రోలింగ్ చూసిన తెలుగు సినీ ప్రియులు, అభిమానులు వారికి ధీటుగా రిప్లై ఇస్తున్నారు. పుట్టిన గడ్డ ఎవరికైనా తల్లితో సమానం. మొదటగా ప్రాంతం.., తర్వాతే దేశం వస్తుంది. అయినా రాజమౌళి తన ట్వీట్లో నార్త్, సౌత్ అని ఎక్కడా తేడా చూపించలేదు. తన మాతృభాషకు చెందిన వారికి అవార్డులు వస్తే సంతోషపడ్డాడంతే.. మీ హాఫ్ నాలెడ్జ్‌తో ఆయన్ను విమర్శించకండి అని బుద్ధి చెప్తున్నారు. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.7 Padma Awards for Telugu people this time… 👏🏻👏🏻👏🏻👏🏻Heartiest congratulations to Nandamuri Balakrishna garu on being honored with the Padma Bhushan! Your journey in Indian cinema is truly commendable… Also, congratulations to all the other distinguished Telugu & other…— rajamouli ss (@ssrajamouli) January 25, 2025 చదవండి: క్యాన్సర్‌తో పోరాటం.. అన్నీ వదిలేసి నటికి సపర్యలు చేస్తున్న ప్రియుడు -
హీరోయిన్ వీడియో.. కావాలనే చేశారట!
సినీ తారలకు ట్రోలింగ్ మాములే. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఎలాంటి తప్పు చేయకున్నా.. ట్రోల్స్ చేస్తుంటారు. అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా దారుణంగా అవమానిస్తారు. తీరా అసలు విషయం తెలిశాక అయ్యో..అలా జరిగిందా అంటారు. అలాంటి ఘటన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela)కు కూడా ఎదురైంది. ఆమెకు సంబంధించిన బాత్రూం వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అయింది. అది స్వయంగా ఊర్వశీనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆమెపై నెటిజన్స్ తీవ్రంగా మండిపడ్డారు. నెగెటివ్ కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ తట్టుకోలేక ఆ వీడియోనే డిలీట్ చేసింది. కానీ ఆమె వీడియో లీక్ చేయడం వెనుక బలమైన కారణం ఉంది. పైగా అది ఆమె ప్రైవేట్ వీడియో కాదు.. ఓ సినిమాలోని సన్నివేశం. మరి ఆ సీన్‌ని లీక్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది?కావాలనే లీక్గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొట్టింది. ఈ వీడియోను ఊర్వశి రౌతేలా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి నెటిజన్స్ అంతా షాకయ్యారు. ఇంత ఓపెన్‌గా బాత్రూం వీడియోను ఎలా షేర్ చేస్తారంటూ ఆమెపై మండిపడ్డారు. ఆ వీడియోను దారుణంగా ట్రోల్స్ చేయడంతో చివరకు ఊర్వశీనే అది డిలీట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ వీడియో లీక్‌పై ఊర్వశీ వివరణ ఇచ్చింది. ‘అది నా ప్రైవేట్ వీడియో కాదు. ఘుస్పైథియా(Ghuspaithiya) సినిమాలోని ఓ సన్నివేశం. అది మాత్రమే లీక్ చేయడానికి ఓ పెద్ద కారణం ఉంది. ఆ సినిమా మేకర్స్ ఓ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఆస్తులన్నీ అమ్మి సినిమా తీశామని.. కొన్ని కారణాల వల్ల రిలీజ్ చేయలేకపోయామని బాధ పడ్డారు. బాత్రూం వీడియో లీక్ చేస్తే సినిమాకు బజ్ వస్తుందని రిక్వెస్ట్ చేశారు.అలాగే అమ్మాయిలకు అవగాహన కలిగించినట్లు కూడా ఉంటుందని చెప్పారు. నేను ఆ ఉద్దేశంతోనే ఆ వీడియోని లీక్ చేశాను. ఇదంతా మేకర్స్ అనుమతితోనే జరిగింది. ఆ బాత్రూం సీన్ చూసి అమ్మాయిలు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటారని అలా చేశాం. అలాగే మేకర్స్ కూడా అప్పుల బాధ నుంచి బయటపడతారని అలా చేశాను’ అని ఊర్వశీ చెప్పుకొచ్చింది. కాగా, 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఓ సాంగ్ కోసం ఊర్వశీతో ఇలా కొన్ని బాత్రూం సీన్స్ షూట్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోసారి ఊర్వశీ బాత్రూం వీడియో లీక్ అవ్వడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు అసలు విషయం తెలిసి.. మంచి పనే చేశావ్లే అని ఆమెను ప్రశంసిస్తున్నారు.టాలీవుడ్లో ఫుల్ క్రేజీఊర్వశీ రౌతేలాకు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ పెరిగింది. స్పెషల్ సాంగ్స్‌కి ఫేవరేట్‌గా మారింది. వాల్తేరు వీరయ్యలో చిరంజీవితో కలిసి స్పెషల్ సాంగ్‌కి స్టెప్పులేసిన ఊర్వశీ..తాజాగా ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj)లో బాలయ్యతో కలిసి చిందులేసింది. ‘దబిడిదిబిడి’ అంటూ సాంగే ఈ ఐటం సాంగ్స్ స్టెప్పులపై కూడా దారుణమైన ట్రోలింగ్ జరిగింది. కానీ బాలయ్యతో పాటు ఊర్వశీ కూడా ఆ ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా..సక్సెస్ పార్టీలోనూ అలాంటి స్టెప్పులే వేశారు. దానికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
ఆ ట్రోల్స్ తట్టుకోలేక డ్రిపెషన్లోకి వెళ్లా: మీనాక్షి చౌదరి
సినిమా నటీనటులకు ట్రోలింగ్ అనేది మాములే. ఏదో ఒక విషయంలో వారిని ట్రోల్ చేస్తునే ఉంటారు. ఇక గాసిప్స్ గురించి చెప్పనక్కర్లేదు. పర్సనల్ విషయాల్లోనూ చాలా పుకార్లు సృష్టిస్తుంటారు. కానీ కొంతమంది హీరోహీరోయిన్లు వీటిని పెద్దగా పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుంటూ పోతారు. మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌ని భరించలేకపోతారు. భయపడతారు..బాధ పడతారు..డిప్రెషన్లోకి వెళ్తారు. హీరోయిన్ మీనాక్షి ఈ కేటగిరిలోకే వస్తుంది. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కారణంగా తాను మనస్థాపానికి గురయిందట. వారం రోజుల పాటు డిప్రెషన్లోకి వెళ్లారట. ఈ విషయాన్ని స్వయంగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary )నే చెప్పింది.‘ది గోట్’పై ట్రోలింగ్!కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(vijay), వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘ది గోట్’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ) గతేడాది సెప్టెంబర్ 5న విడుదైన సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ డ్రామా చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, శివకార్తికేయన్, త్రిష అదితి పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ఫస్ట్ డే ఓపెనింగ్ అదిరిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం డ్రాప్ అయ్యింది. ఈ చిత్రం విషయంలో మీనాక్షిపై ట్రోలింగ్ జరిగింది. ఇందులో కొడుకుగా నటించిన విజయ్ పాత్రను ఏఐ టెక్నాలజీలో రూపొందించారు. ఈ పాత్రకు జంటగా నటి మీనాక్షి చౌదరి నటించారు. రిలీజ్ తర్వాత మీనాక్షి పాత్రపై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. ఆమెను దారుణంగా ట్రోల్ చేస్తూ వీడియోలను షేర్ చేశారు. అవి చూసి మీనాక్షి చాలా బాధపడిందట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మీనాక్షి మాట్లాడుతూ.. ‘‘విజయ్ హీరోగా వచ్చిన ‘ది గోట్’ విడుదలైన తర్వాత నన్ను చాలా మంది ట్రోల్ చేశారు. అవి చూసి ఎంతో బాధపడ్డా. వారం రోజులు డిప్రెషన్లోకి వెళ్లా. తర్వాత ‘లక్కీ భాస్కర్’ విడుదలైంది. ఆ చిత్రం గొప్ప విజయాన్ని అందుకుంది. అందులో నా నటనకు ఎన్నో ప్రశంసలు లభించాయి. కథల ఎంపికలో మార్పులు చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. మంచి సినిమాలపై దృష్టిపెట్టాలని అర్థం చేసుకున్నా’ అని చెప్పారు.‘సంక్రాంతి..’తో బిజీ బిజీప్రస్తుతం మీనాక్షి చౌదరి నటించిన‘సంక్రాంతికి వస్తున్నాం’(sankranthiki vastunam Movie) సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఐశర్వర్య రాజేశ్ మరో హీరోయిన్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మీనాక్షి ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. గతంలో ఎప్పుడు చేయని విధంగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో చేస్తున్నారు మీనాక్షి. దానికి గల కారణం కూడా చెప్పారు. ‘గతేడాది ఆరు సినిమాలు చేశాను. నెలకో సినిమా రిలీజ్ అయింది. షూటింగ్ కారణంగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనే సమయం దొరకలేదు. ఈ సారి మాత్రం కాస్త గ్యాప్ దొరికింది. అందుకే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాను’ అని చెప్పింది. -
ఐశ్వర్య డ్రెస్సింగ్‌పై దారుణంగా ట్రోలింగ్ : ‘బచ్చన్’ పేరు తీసేసినట్టేనా?
అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ లుక్‌పై మరోసారి విమర్శలు చెలరేగాయి. తాజాగా దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్‌లో ఐశ్వర్య ప్రసంగించింది. ఈ సందర్బంగా ఆమె ధరించిన రాయల్ బ్లూ గౌను ధరించింది. ఈ ఔట్ఫిట్లో ఎలిగెంట్ లుక్‌తో, ఆల్ టైం ఫేవరెట్ ఓపెన్ హెయిర్, ఫ్యాషన్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నప్పటికీ, కొంతమంది అభిమానులు, నెటిజనులను మాత్రం తీవ్రంగా నిరాశపర్చింది. గ్లోబల్ ఉమెన్స్ ఫోరమ్ ఈవెంట్లో పలువురు ప్రముఖ మహిళలతో కలిసి ఐశ్వర్య వేదికను పంచుకున్నారు. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన కోచర్ లెహంగా,నేవీ బ్లూ లాంగ్ ట్రైలింగ్ జాకెట్లో ఆమె మెరిసిపోయింది. అయితే ‘అదేమి స్టైల్...మాంత్రికుడి దుస్తుల్లా ఉన్నాయంటూ’ డిజైనర్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందాల రాణిని రోజు రోజుకు మరింత ముసలిదానిలా తయారు చేస్తున్నారు అంటూ వాపోయారు. ప్రెగ్నెన్సీ అప్పటినుంచి ఆమె స్టైలింగ్‌లో చాలా మార్పు లొచ్చాయనీ, మరీ ఓల్డ్ లుక్ కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కొంపదీసి ఈ డ్రెస్‌ను జయాబచ్చన్ డిజైన్ చేసిందా అంటూ ఫన్నీగా కమెంట్ చేశారు.మరోవైపు బాలీవుడ్ క్యూట్ కపుల్ ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వ్యవహారం మీడియాలో తరచుగా కథనాలు వెలుడుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్లో స్క్రీన్ పైన ఐశ్వర్యరాయ్ పక్కన ఇంటిపేరు ‘బచ్చన్’ను తొలగించడం కూడా చర్చకు దారి తీసింది. ‘బచ్చన్’ పేరు లేదు అంటే విడాకులు ఖాయమేనా? లేక పొరబాటున జరిగిందా అనే సందేహంలో అభిమానులు పడిపోయారు. మరికొందరు నెటిజన్లు ఐశ్వర్య చాలా అందంగా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. మహిళల సాధికారతపై ఆమె చేసిన ప్రసంగానికి ఫిదా అయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో ఐశ్వర్యరాయ్ ఒక యువ అభిమానితో పోజులివ్వడం విశేషంగా నిలిచింది. కాగా ఈ ఏడాది సెప్టెంబరులో జిగిన ఫ్యాషన్ వీక్‌లో రెడ్ గౌనుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు స్టైలింగ్లోని లోపాలపై నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
తండ్రికున్న చరిష్మా ఈమెకెక్కడిది?.. షారూఖ్ కూతురిపై ట్రోలింగ్
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఈజీగా రాణించొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ అది పొరపాటు! ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా సరే టాలెంట్ ఉంటేనే జనాలు ఆదరిస్తారు. ఏమాత్రం తేడా వచ్చినా చెడుగుడు ఆడేసుకుంటారు. పైగా వారి అంచనాలు కూడా ఆకాశాన్నంటేలా ఉంటాయి. వాటిని అందుకోవడానికి సెలబ్రిటీ కిడ్స్ మరింత కష్టపడాల్సి ఉంటుంది.ఆదిలోనే ట్రోలింగ్ఇప్పుడదే జరిగింది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ కాన్ కూతురు సుహానా గతేడాది 'ద ఆర్చీస్' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తను పోషించిన వెరోనికా పాత్రకు గానూ విపరీతంగా ట్రోల్ అయింది. తాజాగా సుహానా ఓ సెల్‌ఫోన్ యాడ్‌లో నటించింది. ఇందులో ఆమె ఓ డైలాగ్ చెప్పి తర్వాత వచ్చే మ్యూజిక్కు స్టెప్పులేస్తుంటుంది. ఇప్పుడు మరోసారిఈ యాడ్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవగానే నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. తండ్రికున్న చరిష్మా కూతురికి లేదని విమర్శిస్తున్నారు. 'తన స్క్రీన్ ప్రెసెన్సే నెగెటివ్‌గా అనిపిస్తోంది, 10 సెకన్ల కంటే ఎక్కువసేపు ఆ యాడ్ చూడలేకపోతున్నా..', 'తను సైడ్ క్యారెక్టర్లకే పనికొస్తుంది తప్ప ప్రధాన పాత్రలకు కాదు' అని హేళన చేస్తున్నారు. అందరి నోళ్లు మూయిస్తుంది!కొందరు మాత్రం తన హెయిర్ స్టైల్ బాగోలేదని, డైరెక్షన్ కూడా సెట్టవలేదని.. అందుకు పూర్తిగా సుహానాదే తప్పని నిందించడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సుహానా ప్రస్తుతం తన తండ్రితో కలిసి కింగ్ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీతో అయినా తనను విమర్శించేవారి నోళ్లు మూయిస్తుందేమో చూడాలి!చదవండి: క్యారెక్టర్ తెలుస్తోందన్న విష్ణు.. తన బండారం బయటపెట్టిన రోహిణి -
స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ
ప్రముఖ హీరో అభిమానులు.. తనని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారని మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపణలు చేశారు. డబ్బులిచ్చి మరీ ఇలా చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం కాస్త బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?)మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. రీసెంట్గా లాతూర్‌లో జరిగిన ర్యాలీలో తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్ కోసం బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీ మత రాజకీయాలపై కాస్త గట్టిగానే విమర్శలు చేశాడు. మతాన్ని భోదించే వాళ్లకు చెప్పండి, మేం ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, వీటి బదులుగా మన జీవితాల్ని ప్రభావితం చేసే నిజమైన సమస్యల గురించి మాట్లాడుకుందని అన్నాడు.రితేశ్ దేశ్‌ముఖ్ వీడియోని ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో బీజేపీ సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ అభిమానులు ఈమెని టార్గెట్ చేశారు. ఈమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే విషయమై ప్రియాంక ట్వీట్ చేశారు. తనని లక్ష్యంగా చేసుకుని హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ చేసేందుకు కొందరికి డబ్బు చెల్లించారని.. అక్షయ్ కుమార్ ఫ్యాన్ క్లబ్, పెయిడ్ బ్లూ టిక్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సర్లకు హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చి మరీ తనపై ట్వీట్లు వేస్తున్నారని ఈమె ఆరోపించారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ఈమె చెప్పడం సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు)Today some Akshay Kumar fan club and paid blue tick film influencers have been given a hashtag and drafted tweets to target me.🥱 Easy to guess where it’s coming from thanks to grammatical errors in the drafted tweet bank 😂IYKYK— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 11, 2024 -
నా నవ్వు వంకరగా ఉందా? నాకు పక్షవాతమా?: ఆలియా ఫైర్
హీరోయిన్ల ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా వచ్చినా సర్జరీ చేయించుకుంది కాబోలు అని ప్రచారం చేస్తుంటారు. అంతకుముందే బాగుండేది, ఈ శస్త్ర చికిత్స తర్వాత మరింత అధ్వాన్నంగా తయారైందని తిడుతుంటారు కొందరు. ఇప్పుడు ఇంకా అందంగా మారిందని మెచ్చుకునేవాళ్లు మరికొందరు. కానీ సర్జరీ అని నింద వేసేస్తుంటారు.డాక్టర్‌పై ఆలియా ఫైర్బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా సర్జరీ చేయించుకుందని అంటున్నాడో కాస్మొటాలజిస్ట్. సర్జరీ వికటించిందని, దానివల్ల ఆమె నవ్వు కూడా వంకరగా ఉంటోందని నానా మాటలన్నాడు. దీనిపై ఆలియా స్పందించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియో చూస్తే హాస్యాస్పదంగా ఉంది. నా గురించేమన్నారు.. నా నవ్వు వంకరగా, మాట్లాడే విధానం భిన్నంగా ఉంటుందా! అక్కడితోనే ఆగిపోలేదు.. ఒకవైపు పక్షవాతం వచ్చిందన్నారు. తమాషాగా ఉందా?ఏంటి? తమాషా చేస్తున్నారా? సాక్ష్యం లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం నేరమని తెలియదా? మీ అసత్యాలతో ఎంతోమంది యువత మెదడును కలుషితం చేస్తున్నారు. వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం ఇదంతా చేస్తున్నారా? ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవాళ్లలో ఆడవాళ్లు కూడా ఉండటం సిగ్గుచేటు. ఇలాంటి ధోరణి ఎప్పటికైనా ప్రమాదకరమే.. అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. కాగా ఆలియా ఇటీవలే.. జిగ్రా సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.చదవండి: బాలీవుడ్ వ్యక్తి నుంచి సలహా.. నా నామస్మరణ అక్కర్లేదు -
ట్రంప్ ‘మెక్‌డొనాల్డ్’ షోపై భారీ ట్రోలింగ్
న్యూయార్క్:అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆదివారం(అక్టోబర్ 20) పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్లో సందడి చేశారు. అక్కడికి వచ్చిన కస్టమర్లకు ఫ్రెంచ్ ఫ్రైస్ వండి స్వయంగా వడ్డించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.POS Trump Staged the entire thing.The McDonalds was CLOSED.The “supposed customers” were vetted before drive thru He thinks we won’t notice Trump is the GOAT BALL LICKERThe People's President is Kamala pic.twitter.com/Q6txxKRDET— Larry (@SocratesBigBird) October 20, 2024ఈ దుమారానికి కారణం ట్రంప్ వెళ్లిన మెక్‌డొనాల్డ్ అవుట్లెట్ మేనేజర్ ఆదేశాలు బయటికి పొక్కడం. ఆదివారం సాయంత్రం 4 గంటల దాకా అవుట్లెట్ మూసి ఉంటుందని మేనేజర్ ఆదేశాల సారాంశం. ట్రంప్ రాకకు వీలుగా అవుట్‌లెట్‌ను మూసివేసినట్లు తెలుస్తోంది. మేనేజర్ ఆదేశాల కాపీ సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మెక్‌డొనాల్డ్‌లో జరిగింది కేవలం షో అని, సహజంగా జరిగింది కాదని డెమొక్రాట్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.ఇదీ చదవండి: మెక్‌డొనాల్డ్‌లో ఫ్రెంచ్‌ఫ్రైస్ చేసిన ట్రంప్ -
సైబర్ థ్రిల్లర్ CTRL : సోషల్‌మీడియా కంట్రోల్...కంట్రోల్
జీవితాన్ని ‘విధి’ నియంత్రించడం మాట దేవుడెరుగు... రకరకాల యాప్‌లు మాత్రం నియంత్రిస్తున్నాయి. టెక్నాలజీపై అతిగా ఆధారపడి అనర్థాలను కొని తెచ్చుకోవడం నుంచి డీప్‌ఫేక్ వరకు డిజిటల్ స్పేస్‌లోని చీకటి ప్రపంచంపై దృష్టి సారిస్తుంది కంట్రోల్. నెట్‌ఫ్లిక్స్ సైబర్–థ్రిల్లర్ ‘కంట్రోల్’ ట్రైలర్ నేపథ్యంలో సాంకేతిక వైపరీత్యాల గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది...అనగనగా ‘కంట్రోల్’ అనే యాప్. ఈ యాప్‌లోకి అడుగు పెడితే ఏ.ఐ అసిస్టెంట్ ప్రత్యక్షమౌతాడు. ‘నేను మీకు ఏ విధంగా సహాయపడగలను’ అని అడుగుతాడు.యూజర్ తన మనసులో మాట చెప్పుకోవచ్చు. ఇక అప్పటి నుంచి యూజర్ జీవితం, సంతోషం ఏఐ ఆసిస్టెంట్ నియంత్రణలోకి వెళ్లిపోతుంది.విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించిన సైబర్ థ్రిల్లర్ ‘కంట్రోల్’లో అనన్య పాండే, విహాన్ సమత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అనన్య పాత్ర పేరు... నెల్లా అవస్తీ.కంట్రోల్యాప్. ఇన్‌లోకి నెల్లా లాగిన్ కావడంతో రెండు నిమిషాల నిడివిగల ట్రైలర్ మొదలవుతుంది. ఈ యాప్‌లోకి లాగిన్ అయిన నెల్లా తన జీవితాన్ని నియంత్రించే హక్కును ఏఐ–జనరేటెడ్ పర్సన్ ఎలెన్‌కు ఇస్తుంది. నెల్లా, జో ల మధ్య ఆనందకరమైన ప్రేమ అర్ధంతరంగా విచ్చిన్నం అవుతుంది. దీనికి కారణం జో చేసిన మోసం. బ్రేకప్ తరువాత కక్షసాధింపు చర్యల్లో భాగంగా నెల్లాను విపరీతంగా ట్రోలింగ్ చేస్తుంటాడు జో. జో టార్చర్ తట్టుకోలేక ‘కంట్రోల్’ యాప్‌ను ఆశ్రయిస్తుంది నెల్లా. తన ‘ఎక్స్’ను రిమూవ్ చేయడానికి ఏఐ అసిస్టెంట్ సహాయం కోరుతుంది. దీంతో జో సోషల్ మీడియా బ్లూప్రింట్ పిక్సెల్ బై పిక్సెల్ తుడిచిపెట్టుకు΄ోతుంది. సోషల్ మీడియాలోనే కాదు రియల్ వరల్డ్‌లోనూ అతడి ఉనికి కనిపించదు. జో ‘మిస్సింగ్’ వార్త నెల్లా చెవిలో పడుతుంది. ‘నీకు కావాల్సింది ఇదే కదా’ అని నెల్లాతో ఏఐ–అసిస్టెంట్ చెప్పడంతో క్లిప్ ముగుస్తుంది.‘అన్లైన్లో మన ఉనికికి, నిజ జీవితంలో మనం ఎవరం అనే దానికి మధ్య గీసుకోవాల్సిన విభజన రేఖ గురించి కంట్రోల్ సిరీస్ దృష్టి పెడుతుంది’ అంటుంది అనన్య.ఇటీవల కాలంలో అమీర్‌ఖాన్, రణ్వీర్ సింగ్, ఆలియాభట్, రష్మిక మందనలాంటి టాప్ మూవీస్టార్స్ ‘డీప్‌ఫేక్’ బారిన పడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘చాలా భయంగా ఉంది. సెలబ్రిటీలుగా మా ముఖాలు, గొంతులు ఎప్పుడు ఏ రకంగా బయటకు వస్తాయో తెలియకుండా ఉంది. మనం ఎంత వరకు భద్రంగా ఉన్నామో తెలియడం లేదు. టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా చట్టాలు తేవాలి. గట్టిగా అమలు పర్చాలి. ఇదొక్కటే పరిష్కారం’ అంటుంది అనన్య పాండే.జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉత్సాహవంతమైనదో, సృజనాత్మకమైనదో మరో కోణంలో చూస్తే వినాశకరమైనది. డీప్‌ఫేక్ టెక్నాలజీని మహిళల విషయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ వేధింపులలో మహిళలలే బాధితులు. కృత్రిమ మేధను ఒక ప్రత్యేకమైన జీవిగా, ఒక కొత్త జాతిగా... ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు. అయితే ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసం ఉపయోగించుకోవడంలో ఆ వర్ణణలేవీ ఉపయోగపడడం లేదు.– వెరిటీ హార్డింగ్, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ జియో పాలిటిక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రియాంక చోప్రాకు ట్రోలింగ్ కొత్త కాదు. ఎన్నో సందర్భాలలో ట్రోలింగ్‌కు గురైంది అయితే చో్ర΄ా ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. డీలా పడి΄ోలేదు. ఆమె జపించే మంత్రం... సెల్ప్–లవ్. తాజాగా ప్రియాంక చోప్రా ఒక హార్ట్వామింగ్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. విశాలమైన కళ్ల అబ్బాయిలా కనిపించే తొమ్మిది సంవత్సరాల అమ్మాయి ఫొటో అది. ఆ ఫొటో చోప్రాదే. ఫొటోను షేర్ చేస్తూ ప్రియాంక ఇలా రాసింది...వార్నింగ్: నా తొమ్మిదేళ్ల చిన్నారిని ట్రోల్ చేయకండి. తన ప్రీ- టీనేజ్ హెయిర్ స్టైల్‌ను ‘కటోరి కట్’గా అభివర్ణించింది. ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి’ అంటూ సెల్ఫ్–లవ్ ప్రాముఖ్యత గురించి చెప్పింది. -
కొండా సురేఖపై ట్రోలింగ్.. రఘునందన్ సీరియస్
మెదక్, సాక్షి: రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం ఏమాత్రం మంచిది కాదని.. బీఆర్ఎస్ పార్టీకి మహిళల మీద గౌరవం లేకుండా పోయిందని మండిపడ్డారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై రఘునందన్ మీడియాతో మాట్లాడారు.‘‘బీఆర్ఎస్కు మొదటి నుంచి మహిళల మీద గౌరవం లేదు. అందుకే.. తెలంగాణ తొలి కేబినెట్ లో మహిళలకు చోటు ఇవ్వలేదు. తల్లీ, అక్కాచెల్లి మధ్య ఉండే సంబంధం గురించి సోషల్ మీడియాలో సంస్కారహీనంగా పోస్టులు పెడుతున్నారు. ఒక అక్కకు తమ్ముడిగా ఆమెను అడిగి మరీ నూలు పోగు దండ వేశా. ఇంతకు ముందు ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఇలాగే నూలు పోగు దండను వేశా. .. మెదక్ జిల్లా ఇన్ ఛార్జి మంత్రిగా సురేఖ అక్క వస్తే చేనేత సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లేలా నూలు పోగు దండ అడిగి వేశా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చి నాకు శాలువా కూడా కప్పారు. కానీ, ఆ పార్టీకి చెందిన వాళ్లు ఇంత సంస్కారహీనంగా.. సభ్యత లేకుండా మాట్లాడతారని అనుకోలేదు... అసలు బీఆర్ఎస్కు సోషల్ మీడియా మీద నియంత్రణ లేదా?. పోస్టు పెట్టిన అకౌంట్లో డీపీ హరీష్ రావు ఫోటో, కేసీఆర్ ఫోటోలు ఉన్నాయి. కేటీఆర్, హరీష్ రావులు ఈ వ్యవహారంపై స్పందించి క్షమాపణలు చెప్పాలి. తమ సోషల్ మీడియా విభాగాలను కంట్రోల్ చేసుకోవాలి. పోస్టులు పెట్టిన వారు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకి అప్పగించండి. మీకు సంబంధం లేని, మీరు జీతం ఇవ్వని వ్యక్తులు అయితే తీవ్రంగా పరిగణించండి. హరీష్ రావు ఫోటోలు వాడుకుంటున్నారు కదా.. అలాగైనా పోలీసు కంప్లయింట్ ఇవ్వండి... నా వల్ల మా అక్కకు(కొండా సురేఖ) కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నా. ఒక అక్కకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. అక్కకు మద్దతుగా ఒక వకీలుగా పోస్టులు పెట్టిన వారిని కోర్టుకు ఈడుస్తా’’ అని రఘునందన్ హెచ్చరించారు. -
కొండా సురేఖా ట్రోలింగ్ వ్యవహారంపై స్పందించిన హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో నడిచిన ట్రోలింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీష్‌రావు స్పందించారు. మహిళలను గౌరవించడం అందరి బాధ్యత అని చెబుతూ.. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు.‘‘మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరు. బీఆర్ఎస్ అయినా.. వ్యక్తిగతంగా నేనైనా ఇలాంటివి ఉపేక్షించం. సోషల్ మీడియా వేదికగా జరిగే వికృత చేష్టలను ఖండిస్తున్నా. సోషల్ మీడియాలో బాధ్యతగా వ్యవహరించాలని అందర్నీ కోరుతున్నా’’ అని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు పేర్కొన్నారు.మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అయినా, వ్యక్తిగతంగా నేనైనా ఉపేక్షించబోము. మీకు @IKondaSurekha గారికి కలిగిన అసౌకర్యానికి మీతో పాటు నేనూ చింతిస్తున్నాను. సోషల్ మీడియా వేదికగా జరిగే ఇలాంటి వికృత…— Harish Rao Thanneeru (@BRSHarish) September 30, 2024ఇదీ చదవండి: కొండా సురేఖ కంటతడి.. సీతక్క వార్నింగ్ -
నన్ను మానసికంగా వేధిస్తున్నారు.. కొండా సురేఖ కంటతడి
హైదరాబాద్, సాక్షి: మెదక్ పర్యటనలో మంత్రి కొండా సురేఖకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో కొందరు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ దండ వ్యవహారంపై నడుస్తున్న ట్రోలింగ్‌పై ఎంపీ రఘునందన్‌రావు తనకు క్షమాపణలు చెప్పారని కొండా రేఖ అన్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తోంది బీఆర్ఎస్సేనని ఆమె మండిపడ్డారు. సహచర మంత్రి కొండా సురేఖ మెడలో ఎంపీ నూలు దండ వేస్తే దాన్ని వక్రీకరించి దారుణంగా ప్రచారం చేస్తున్నారు.‘‘ఇంచార్జీ మినిస్టర్‌గా మెదక్ పర్యటనకు వెళ్లా. అక్కడి ఎంపీ రఘునందన్ చేనేత సమస్యలు నాకు చెప్పి.. గౌరవంగా చేనేత మాల నా మెడలో వేశారు. చేనేత మాల చేసేప్పుడు దాన్ని పరీక్షగా చూశాను. చేనేత వృత్తుల వారికి సంబంధించిన గౌరవప్రదమైన నూలు అది. కానీ, కొంతమంది పోగై నన్ను ట్రోల్ చేస్తున్నారు.అయినా కూడా చెప్పుకోలేని విధంగా ట్రోల్ చేస్తున్నారు. నాకు నిద్ర, తిండి లేకుండా చేస్తున్నారు. మానసికంగా నన్ను వేధిస్తున్నారు. నాకు మద్దతుగా కొందరు బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్తే వాళ్ళని కొట్టారు. అధికారం కోల్పోయి పిచ్చిపట్టి దుర్మార్గమైన ప్రచారాలు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ట్రోల్ చేయిస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఆడవాళ్లపై ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది?. చేనేత కార్మికుల ఓట్లతో గెలిచి పద్మశాలి బిడ్డను ఇంత అవమానపరుస్తారా? అంటూ కేటీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలే చేశారామె.రెండోసారి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్లో భారీ మార్పులు వచ్చాయి. నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే కేసీఆర్ మహిళకు మంత్రిపదవి ఇవ్వలేదు. బీఆర్ఎస్ నాయకులు డబ్బు మదంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు.‘‘ఉన్నత వర్గం అనే బలుపు బీఆర్ఎస్కు ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన మహిళలపై ఇలాంటి ట్రోలింగ్ చేస్తున్నారు. పనులు కావాలంటే నా దగ్గరికి రండి అని గత పాలకులు ఇబ్బంది పెట్టారు. హరీష్ డీపీ పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. కేటీఆర్ హరీశ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలి. డిస్కో డాన్సులు నేర్పిందే మీ చెల్లి. అమెరికా సంస్కృతి తెచ్చి బతుకమ్మకు అంటించింది మీ చెల్లి. బతుకమ్మ సహజత్వాన్ని చెదగొట్టిందే మీ చెల్లి’’ అంటూ సురేఖ ఘాటైన వ్యాఖ్యలు చేశారు..ఈ విషయం తెలిసి.. రఘునందన్ ఫోన్ చేశారు. అక్కా.. క్షమించు కాళ్లు మొక్కుతా అన్నారు. రాజకీయ పార్టీలకతీతంగా నన్ను అక్కా అని.. నా భర్తను బావా అని పిలుస్తారు.అలాంటిది మానసిక వేదనతో మా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు.ఇకపై ట్రోలింగ్ చేస్తే ఊరుకునేది లేదు. ఏదో ఒకరోజు ప్రజలూ తిరగబడుతారు అని కొండా సురేఖ హెచ్చరించారు.ఇక.. సహచర మంత్రి కొండా సురేఖకు మరో మంత్రి సీతక్క బాసటగా నిలిచారు. కేటీఆర్ సహా బీఆర్ఎస్ శ్రేణుల్ని ఆమె హెచ్చరించారు. ‘‘బీఆర్ఎస్ కు మహిళలు అంటే చులకన, అందుకే ట్రోల్ చేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రికార్డ్ డాన్సులు చేసుకోండి అని వ్యాఖ్యానించిన దుర్మార్గులున్న పార్టీ బీఆర్ఎస్. నా సోదరమైన మంత్రితో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా మార్ఫింగ్ చేసి దుర్మార్గంగా వ్యవహరించారు.‘‘మహిళా మంత్రులను, మహిళా నేతలను వెంటపడి మరీ బీఆర్ఎస్ సోషల్ మీడియా వేధిస్తోంది. సీఎం కుటుంబాన్ని కూడా వదలడం లేదు. రాజకీయాల్లో, ప్రజా జీవితంలో క్రీయా శీలకంగా పనిచేసే వాళ్లను లక్క్ష్యంగా చేసుకుని బురద జల్లుతున్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలోనూ మహిళలు ఉన్నారు. వాళ్లేం చేశారో.. దేశం మొత్తానికి తెలుసు. అయినా సభ్యత కాదనే మేం నోళ్లు విప్పడం లేదు. మహిళలు రాజకీయాల్లో ఉండాలా? వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి.ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లో ఎదిగిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలా?. ఇది మీ ఫ్యూడల్ మెంటాలిటికి, పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. ఆడ కూతుర్లను అత్యంత అవమానకరంగా ట్రోల్ చేసి వారిని వేయ్యేండ్లు వెనక్కు నెడుతున్నారు. మల్లి దోరల రాజ్యం తెవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న మేయర్ విజయ లక్ష్మీ, నిన్న నాపై,నేడు కొండా సురేఖపై తప్పుడు ప్రచారం చేస్తూ మహిళా నాయకత్వాన్ని వెనక్కు నెడుతోంది బీఆర్ఎస్. మహిళా నేతలపై ఈ రకంగా దుష్ప్రచారం చేస్తే మహిళలు రాజకీయాల్లోకి రాగలుగుతారా?. బీఆర్ఎస్ నేతలు దుర్మార్గపు ఆలోచనలు మానుకుని బుద్ది తెచ్చుకోండి.తక్షణమే క్షమాపణలు చెప్పి.. తమ సోషల్ మీడియా విభాగాలను కట్టడి చేయాలి అని సీతక్క హెచ్చరించారు. -
ప్రఫుల్ దేశాయ్‌పై ట్రోలింగ్!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) ప్రఫుల్ దేశాయ్‌పై వివాదాస్పద ఐఏఎస్ పూజా ఖేద్కర్ తరహాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కి చెందిన ఆయన సివిల్స్‌లో 523వ ర్యాంకుతోపాటు ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్ సర్టిఫికెట్ కూడా క్లెయిమ్ చేశారు. ఇటీవల మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్ ఖేద్కర్ తరహాలోనే ప్రపుల్ దేశాయ్ కూడా నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్ తప్పని పలువురు ‘ఎక్స్’ వేదికగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాలోని ఆయన సైక్లింగ్, హార్స్ రైడింగ్, బోటింగ్, ట్రెక్కింగ్ చేసిన ఫొటోలను ఉదహరిస్తున్నారు. కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలకు దిగుతున్నారు. ఈ పోస్టులపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ఆయన మిత్రులు, తెలిసినవారు ప్రఫుల్ దేశాయ్‌కి మద్దతుగా నిలుస్తున్నారు. ముఖ్య ంగా ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వారంతా ప్రఫుల్ కాలికి ఉన్న సమస్య నిజమైనదేనని, వాస్తవాలు తెలుసుకోకుండా ఆయన మనసు గాయపరచవద్దని హితవు పలుకుతున్నారు. అయినా, ట్రోలింగ్ ఆగడకపోవడం గమనార్హం. ఒక ఖాతా నుంచి కాకుండా వివిధ సోషల్ మీడియా ఖాతాల నుంచి ట్రోల్ చేస్తుండటంతో ఇది ఉద్దేశపూర్వక చర్యగా కరీంనగర్ కలెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు.చట్టపరమైన చర్యలు తీసుకుంటాంతనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఐఏఎస్ ప్రఫుల్ దేశాయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. అందులో.. ‘2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్(ఏఐఐఎంఎస్) మెడికల్ బోర్డు ముందు హా జరయ్యాను. వారు నాకున్న లోపాన్ని సర్టిఫై చేశారు. అనంతరం అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపారు. కొందరు నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం నా దృష్టికి వచ్చింది. ఇది ఎంతో బాధాకరం. నిజంగానే తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది. కానీ, నిజాయతీగా ఉన్న వారిని ఆన్లైన్లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చే యడం మా పనితీరును, వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమే అవుతుంది.’ అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ‘సాక్షి’కి వివరణ ఇస్తూ.. తనను ఆన్లైన్లో ట్రోల్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు.యూపీఎస్సీ స్కాం పేరిట ట్రెండింగ్మొత్తం మీద ఖేద్కర్ వ్యవహారంతో ఇప్పుడు సోషల్ మీడియాలో యూపీఎస్సీ స్కాం, ఈడబ్ల్యూఎస్, వీల్‌చైర్ యూజర్ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లలో ఎకనమిక్ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్), నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్లు తీసుకొని, సివిల్స్ ర్యాంకు సాధిస్తున్నారంటూ ఇటీవల సివిల్స్ ర్యాంకు సాధించినవారి ఫొటోలతో నేరుగా ట్రోలింగ్‌కు దిగుతున్నారు. వీటిని ప్రధాని కార్యాలయం, డీవోపీటీ, ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేస్తున్నారు. మొత్తానికి పూజా ఖేద్కర్ వివాదంతో యూపీఎస్సీ తీవ్ర విమర్శలను మూటగట్టుకుంటోంది. ఆన్లైన్లో ర్యాంకర్ల ర్యాంకులు, వారి రిజర్వేషన్లను స్క్రీన్ షాట్లు తీసి, పెడుతుండటంతో సదరు అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. -
‘వాట్సాప్ గ్రూప్‌లో సూటిపోటి మాటలు.. భరించలేకపోతున్నా!’
ఢిల్లీ: ఆమె ఓ ప్రముఖ బ్యాంకులో ఉద్యోగిణి. కానీ, పని చేసే చోట ఏదో ఒకరూపంలో వేధింపులు ఎదుర్కొంది. వేసుకునే దుస్తుల దగ్గరి నుంచి.. ఆమె తినే తీరు, మాట్లాడే విధానం.. ఇలా తోటి ఉద్యోగులు అన్నింటా ఆమెను హేళన చేస్తూ వచ్చారు. అది పరిధి దాటి వాట్సాప్ గ్రూపుల్లో ఆమెను ట్రోలింగ్ చేసే స్థాయికి చేరుకుంది. భరించలేక లేఖ బలవన్మరణానికి పాల్పడిందామె.నోయిడా యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిలేషన్షిప్ మేనేజర్‌గా పనిచేసే శివాని త్యాగి ఆత్మహత్య ఘటన ఇప్పుడు యూపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఘజియాబాద్‌లోని తన నివాసంలో శుక్రవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిందామె. ఆరు నెలలపాటు ఆఫీస్‌లో తోటి ఉద్యోగులు ఆమెను వేధించారని, అది భరించలేకే అఘాయిత్యానికి పాల్పడిందని శివాని కుటుంబం ఆరోపిస్తున్నారు. వీటికి తోడు..ఆమె గదిలో దొరికిన సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ‘సూటిపోటి మాటలతో అన్నింటా అవమానిస్తూ వస్తున్నారు.. ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లోనూ అది కొనసాగింది. భరించలేకపోతున్నా. తమ్ముడూ.. అమ్మానాన్న, చెల్లి జాగ్రత్త’ అని సూసైడ్ నోట్ రాసిందామె. లేఖలో మృతురాలు ఐదుగురి పేర్లు ప్రస్తావించింది. పని ప్రాంతంలో ఆమె వేధింపులు ఎదుర్కొందన్న విషయం లేఖ ద్వారా స్పష్టమైంది అని ఘజియాబాద్ డీసీపీ గ్యానన్‌జయ్ సింగ్ మీడియాకు కేసు వివరాల్ని వివరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఆమెను ట్రోలింగ్ చేసేందుకే ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినట్లు గుర్తించినట్లు తెలిపారాయన.వేధింపులపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోలేదు. వేధింపులు భరించలేక ఉద్యోగానికి రాజీనామా చేయాలని ఆమె చాలాసార్లు ప్రయత్నించింది. కానీ, పైఅధికారులు ఆమెను ఆపుతూ వచ్చారు. అయితే ఓ సహోద్యోగిణితో వాగ్వాదంలో శివాని ఆమెపై చెయ్యి చేసుకుంది. ఆ ఘటన తర్వాత ఆమెకు తొలగింపు నోటీసులు ఇచ్చారు. శివాని అది తట్టుకోలేకపోయింది అని ఆమె సోదరి మీడియాకు చెబుతూ కంటతడి పెట్టింది. -
Adithya S nair: యువతి ప్రాణం తీసిన ట్రోలర్స్
ట్రోలింగ్ సర్వసాధారణమైన ఈరోజుల్లో.. సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలవలేకపోతున్నారు. ఓ గీతాంజలి, ఓ రమ్య.. ఇప్పుడు ఆదిత్య ట్రోలర్స్ ధాటికి బలయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తుండడం భరించలేక నిండా ఇరవై ఏళ్లు కూడా నిండని ఆదిత్య బలవన్మరణానికి పాల్పడింది.కేరళ తిరువనంతపురం కున్నుపుజా ఏరియాకు చెందిన ఆదిత్య ఎస్ నాయర్(18) Adithya S nair ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇన్స్టాలోనే పరిచయమైన బినోయ్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ యూట్యూబ్, ఇన్‌స్టా వీడియోలతో ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. అయితే రెండు నెలల కిందట ఈ జోడీ విడిపోయినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి బినోయ్‌ను సపోర్ట్ చేస్తూ.. ఆదిత్యను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతూ వచ్చారు. అవి ఒక స్టేజ్ ధాటి మీమ్స్ వేసే దాకా వెళ్లింది. దీంతో భరించలేకపోయిన ఆమె జూన్ 10న ఉరేసుకుని తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. వారం పాటు చికిత్స పొంది కన్నుమూసింది. దీంతో అప్పటిదాకా ట్రోల్ చేసిన మీమర్లే.. సింపథీ పోస్టులు వేస్తూ వస్తున్నారు. ‘‘వాళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి తెలిసి మందలించాం. చదువు మీద ఫోకస్ పెట్టాలని ఆదిత్యకు సూచించాం. అందుకే ఆమె అతన్ని దూరం పెడుతూ వచ్చింది. కానీ, ఆ కుర్రాడు మాత్రం ఇలా మానసికంగా వేధించి నా కూతురిని చంపాడు అని ఆదిత్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్య నాయర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. బినోయ్‌ను పూజాప్పుర పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ఐశ్వర్యరాయ్ బచ్చన్
అందాల ఐశ్వర్యం, బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన లేటెస్ట్ లుక్‌తో ఇంటర్నెట్లో సంచలనం రేపుతోంది. తాజాగా కొన్ని అద్భుతమైన చిత్రాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ట్రోలర్స్‌కు షాకిచ్చింది. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన లుక్స్‌పై విపరీతంగా ట్రోల్ చేసినవాళ్లకు లేటెస్ట్ ఫోటోస్‌తో తగిన సమాధానం చెప్పింది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb)కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ప్రతిష్టాత్మక కేన్స్ చలన చిత్రోత్సవానికి హాజరైన ఐషూ రెడ్ కార్పెట్ లుక్‌తో వార్తల్లో నిలిచింది. అయితే కొంతమంది నెటిజన్లు ఆమె లుక్‌పై దారుణంగా ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో కేన్స్ 2024 కోసం సిద్ధమవుతున్నప్పటి ఫోటోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేసింది. తన కొత్త హెయిర్‌స్టైల్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచింది. తన అందమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్దులను చేసింది. దీంతో ఫ్యాన్స్ కమెంట్స్ ఒక రేంజ్లో సాగాయి. "రెడ్ కార్పెట్‌పై ఇలా దర్శనమిచ్చి ఉండి ఉంటే ఉచకోతే’’ అని ఒకరు, "కేన్స్ సమయంలో మీరు ఈ రకమైన హెయిర్‌స్టైల్ ఎంచుకుంటే భలే ఉండేది’’ మరొకరు కమెంట్ చేశారు. "భూమిపై అత్యంత అందమైన మహిళ" అని మరో యూజర్ బాలీవుడ్ దియాపై తన ప్రేమను ప్రకటించాడు. -
టెకీ రమ్య ఉదంతం : మీరొచ్చి పెంచుతారా? గాయని చిన్మయి ఆవేదన
తమిళనాడులోని కోయంబత్తూరలో ఐటీ ఉద్యోగి రమ్య ఆత్మహత్య ఘటనపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వేధించిన నెటిజన్లు వచ్చి ఇపుడా బిడ్డను పెంచుతారా అంటూ ఫైర్ అయ్యారు. ఆ మేరకు ఇన్‌స్టాలో చిన్మయి పోస్ట్ పెట్టారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) ఏప్రిల్ 28న, తిరుముల్లైవాయల్‌లోని అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని నాల్గవ అంతస్తు బాల్కనీలో రమ్య తన కుమార్తెతో ఆడుకుంటుండగా, ఎనిమిది నెలల పాప ఆమె చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిపోయింది. అయితే వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్ చేయడంతో మనస్థాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలోఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడింది. దీంతో ఆమె ఇద్దరు బిడ్డలు తల్లి లేని బిడ్డలుగా మారిపోవడం విషాదం. మరోవైపు కేసు నమోదు చేసిన కరమడై పోలీసులు ఆమె మరణాకి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది! -
సోషల్ మీడియా ట్రోలింగ్ : బిడ్డ బతికినా, పాపం తల్లి తట్టుకోలేకపోయింది!
విచక్షణ లేకుండా, చేతికొచ్చినట్టు కమెంట్లు చేయడం, సూటిపోటి మాటలతో ఎదుటివారిని చిత్రవధ చేయడం సోషల్ మీడియా ట్రోలర్లకు పరిపాటిగా మారిపోయింది. ఫలితంగా పెద్ద ప్రమాదం నుంచి బిడ్డ బయటపడిందన్న సంతోషం ఒక తల్లికి ఎంతో సేపు నిలవనీయలేదు. వేధించి, వేధించి ఆమె ఉసురు తీసిన ఘటన విషాదం నింపింది.ఇటీవలి ప్రమాదవశాత్తు తల్లి చేతుల్లోంచి జారి సన్‌షేడ్‌పై పడిన పాపను రక్షించిన సంఘటన గుర్తుందా?ఎనిమిది నెలల పాపను రక్షించే రెస్క్యూ ఆపరేషన్‌లో స్థానికులు చాకచక్యంగా వ్యవహరించి బిడ్డను కాపాడారు. కానీ ఇపుడా పాపకు తల్లిని దూరం చేసింది మాయదారి సోషల్ మీడియా. కోయంబత్తూర్‌లో పాపను రక్షించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విడియో చూసిన నెటిజన్లు "బిడ్డను చూసుకోవటం చేత కాదా?" అని ఆ తల్లిని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర డిప్రెషన్‌కి గురైన ఆమె కోయంబత్తూర్‌లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అయితే, ఆమె ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోంది.కాగా చెన్నైలోని తిరుముల్లైవాయల్‌లోని ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో నాలుగో అంతస్తులో నివసించే రమ్య, వెంకటేష్‌లకు ఇద్దరు పిల్లలు, నాలుగేళ్ల అబ్బాయి, ఏడు నెలల పాప ఉన్నారు. ఏప్రిల్ 28న, ఐటీ ఉద్యోగి రమ్య తన ఫ్లాట్‌లోని బాల్కనీలో తన పసికందుతో ఆడుకుంటూ ఉండగా, పాప ఆమె చేతుల్లోంచి జారి కింద ఉన్న తాత్కాలిక సన్షేడ్లో పడింది. దీంతో పొరుగువారు కింద దుప్పట్లు పట్టుకోగా, ఒక వ్యక్తి సన్‌షేడ్ నుండి పాపను పట్టుకుని సురక్షితంగా క్రిందికి తీసుకు రాగలిగాడు. ఈ ఘటన తర్వాత రమ్య తల్లిగారింటికి వెళ్లింది. అక్కడికి వెళ్లినా ఆమెకు ఉపశమనం లభించలేదు. దీంతో శనివారం కారమడైలోని తల్లిదండ్రుల ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఉసురు తీసుకుంది. -
చూశారుగా.. ఇక ట్రోల్ చేయండి: బుల్లితెర నటి
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిపోయింది. ప్రతి విషయాన్ని తారలు సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ట్రోల్స్ బారిన కూడా పడుతుంటారు. అయితే తాజాగా దీపిక సింగ్ అనే బుల్లితెర నటి తనను ట్రోల్ చేయమని కోరుతోంది.ట్రెండింగ్ పాటకు స్టెప్పులులేటెస్ట్గా ట్రెండ్ అవుతున్న ఓ పాటకు డ్యాన్స్ చేసిన దీపిక ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనికి ఎస్.. ఎందుకంటే ఇప్పుడిది ట్రెండ్ అవుతోంది.. ప్లీజ్ ఇప్పుడు నన్ను ట్రోల్ చేయండి అని సరదాగా రాసుకొచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్.. మీరిలాగే డ్యాన్స్ చేస్తూ ఉండండి.. సంతోషాన్ని పంచండి.. బ్యూటిఫుల్.. ట్రోల్ చేసేవాళ్లు చేస్తూనే ఉంటారు. మీరవేమీ పట్టించుకోవద్దు అని రాసుకొచ్చారు. ఆ సీరియల్‌తో ఫేమస్బహుశా తన డ్యాన్స్‌ను ట్రోల్ చేస్తున్నవాళ్లకు నటి ఇలా వెరైటీగా కౌంటరిచ్చినట్లు ఉంది. ఇకపోతే 'దియా ఔర్ బాటీ హమ్' అనే సీరియల్‌తో దీపిక సింగ్ బాగా పాపులర్ అయింది. 'ద రియల్ సోల్ మేట్‌తో ఓటీటీలోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం మంగళ్ లక్ష్మి అనే హిందీ సీరియల్లో మంగళ్గా ప్రధాన పాత్రను పోషిస్తోంది. View this post on Instagram A post shared by Deepika Singh (@deepikasingh150) చదవండి: ఒక్కరోజు కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో మూవీలో ఛాన్స్.. ఫస్ట్‌లో.. -
నన్ను అంత మాటన్నారు.. ఏడ్చేసిన నటుడు
ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. చాలామంది ఇక్కడ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరే సఫలీకృతులవుతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చెల్లిని పెళ్లాడిన ఆయుష్ శర్మ కూడా నటుడిగా ప్రయత్నించాలనుకున్నాడు. లవ్ యాత్రి అనే సినిమా చేశాడు. దీన్ని సల్మాన్ ఖాన్ నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఆయుష్ మీద విమర్శల వర్షం కురిసింది. ఆయుష్కు బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సిందని తీవ్రంగా ట్రోల్ చేశారు.నానా మాటలు..తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు ఆయుష్. 'నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలనుకున్నాను. కానీ ఆరోజు నా గురించి చాలా చెత్తగా మాట్లాడారు. ఆ సినిమా రిలీజైన రోజు నానా మాటలన్నారు. నన్ను కుక్కతో పోల్చారు. రేపు పొద్దున నా కుమారుడు పెద్దయ్యాక ఈ వార్త చదివితే నా పరిస్థితి ఏంటి? నా కూతురు.. మా నాన్న ఒక శునకం అని ఉన్న వార్తలు చూస్తే నేనేం కావాలి? వాళ్లు తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలి..నన్ను శునకంతో పోల్చారునన్ను చూసి గర్వంగా ఫీలవ్వాలి. ఒక మీడియా అయితే ఆయుష్ శర్మ ఒక కుక్క అని రాసేసింది. కానీ వాళ్లకు నేనిప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు నన్ను అవమానించడం వల్లే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను' అని ఎమోషనలయ్యాడు. కాగా ఆయుష్.. తర్వాత సల్మాన్‌తో అంతిమ్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇది హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు నటించిన రుస్లాన్ సినిమా ఏప్రిల్ 26న విడుదల కానుంది.చదవండి: అభిషేక్ అగర్వాల్ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్ ’ .. రిలీజ్ ఎప్పుడంటే? -
ట్రోలర్లకు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన ప్రాచీ: ఉచితంగా ట్రీట్ చేస్తామన్న వైద్యులు
ఉత్తరప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచిన ప్రాచీ నిగమ్ ట్రోలర్స్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఎవరేమన్నా, తన విజయమేతనకు ముఖ్యమంటూ తేల్చి చెప్పింది."ట్రోలర్లు వారి ఆలోచనలతో వారుంటారు. నా విజయమే నా ప్రస్తుత గుర్తింపు. దీంతో నే సంతోషంగా ఉన్నాను" అని అంటూ బుధవారం తొలిసారి స్పందించింది. అలాగే తన రూపాన్ని చూసి, తన కుటుంబంగానీ, తనకు చదువు చెప్పిన ఉపాధ్యాయులుగానీ, తోటి మిత్రులు గానీ ఎన్నడూ చిన్నచూపు చూడలేదని, దీంతో తన దృష్టి అంతా తన చదువుపైనే కేంద్రీకృతమైందని చెప్పుకొచ్చింది. అసలు తన రూపం గురించి తానెప్పుడూ బాధపడలేదనీ ఇంజనీర్ కావడమే లక్ష్యమని తెలిపింది. అంతిమంగా తన విజయం తప్ప తాను ఎలా ఉన్నాను అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేసింది.విశ్వనాథన్ మద్దతుమరోవైపు భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ప్రాచీకి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆమెను విద్యాపరమైన లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు. హార్మోన్ల ప్రభావం, చికిత్స ఉందిప్రాచీ నిగమ్‌కి సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్జీపీజీఐఎంఎస్) డైరెక్టర్ ప్రొఫెసర్ ఆర్కే ధీమాన్ తమ ఇన్స్టిట్యూట్ ఉచితంగా చికిత్స చేయనున్నట్లు వెల్లడించడం విశేషం. హార్మోన్ల ప్రభావంతో వచ్చే మహిళల్లో కనిపించే అవాంఛిత రోమాల పెరుగుదలను ఎండోక్రినాలజీ ద్వారా నియంత్రించవచ్చనీ, టీనేజ్ పిల్లల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్య నెలరోజుల్లో నయమవుతుందని ధీమాన్ అన్నారు.ఇటీవల విడుదలైన 10వ తరగతి 98.5 శాతం మార్కులతో యూపీలో టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా ప్రాచీ నిగమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే 600లకు గాను 591 మార్కులు సాధించిన ఆమె ప్రతిభను చూడాల్సిన నెటిజన్లు కొంతమంది ఆమె ముఖంపై ఉన్న రోమాలను మాత్రమే చూశారు. అనుచిత వ్యాఖ్యలతో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. -
హీరోయిన్‌కు బెదిరింపులు.. భరించలేకపోతున్నానంటూ..
సెలబ్రిటీలు ట్రోలింగ్ బారిన పడటం సర్వసాధారణమైపోయింది. అయితే కొందరు విమర్శలతోనే ఆగిపోవడంలేదని బెదిరింపులకు పాల్పడుతున్నారంటోంది హీరోయిన్ రైమా సేన్. ఏకంగా ఇంట్లోని తన ల్యాండ్‌లైన్‌కు కాల్ చేసి బెదిరిస్తున్నారని వాపోయింది. ప్రస్తుతం ఆమె 'మా కాళి' అనే సినిమా చేస్తోంది. 1946 ఆగస్టు 16న కలకత్తాలో జరిగిన ఓ దారుణ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోందీ మూవీ. ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజైంది. ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అది చూసిన కొందరు తనను అదే పనిగా బెదిరిస్తున్నారట. 'నాకు వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సినిమా చూసిన తర్వాత అప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. ఎందుకని ఇలా ఏదిపడితే అది అనేస్తున్నారు. మా కాళి సినిమా ఎందుకు ఒప్పుకున్నావని ప్రశ్నిస్తున్నారు. లెజెండరీ నటి సుచిత్రా సేన్ మనవరాలుయ్యండి ఇలాంటి మూవీస్ చేస్తావా? నువ్వు కూడా కోల్‌కతాలోనే ఉండేది.. అది గుర్తుంచుకో అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ బెదిరింపులు భరించలేకపోతున్నాను' అంది. తెలుగులో ఒకే ఒక సినిమా కాగా రైమా సేన్ గతేడాది ద వ్యాక్సిన్ వార్ సినిమాలో కనిపించింది. కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన ఈ మూవీ వివాదంగానే మారింది. ఇప్పుడు మా కాళి మూవీతో ఈ హీరోయిన్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ చిత్రానికి విజయ్ ఏలకంటి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈమె తెలుగులో ధైర్యం అనే సినిమాలో నటించింది. ఆమె తల్లి మూన్ మూన్ సేన్, సోదరి రియా సేన్ కూడా నటీమణులు కావడం విశేషం. View this post on Instagram A post shared by Raima Sen (@raimasen) చదవండి: నయన్- విఘ్నేశ్‌లను ఒక్కటి చేసిన హీరో ఎవరో తెలుసా? -
రాహుల్ గాంధీపై ట్రోలింగ్.. కారణం ఏంటంటే..
న్యూఢిల్లీ, సాక్షి: కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తుతోంది. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన అధికారిక కార్యక్రమంలో తీసిన ఓ ఫోటోకు రాహుల్ గాంధీ ఇచ్చిన పోజు, వేషధారణపై నెటిజన్ల నుంచి ట్రోలింగ్ వ్యక్తమవుతోంది. కొత్తగా రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సోనియా గాంధీతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దిగిన ఫొటోను ఉప రాష్ట్రపతి అధికారిక ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ఈ ఫొటోలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్‌తోపాటు సోనియాగాంధీ కుటుంబ సభ్యులుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. సోనియా గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్లమెంట్ హౌస్‌లో తీసిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే నెటిజన్లు రాహుల్ గాంధీని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. అధికారిక ఫొటోకు ఆయన ఇచ్చిన పోజు నిర్లక్ష్యంగా ఉందని, వేషధారణ హుందాగా లేదని చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే కొంత మంది రాహుల్ గాంధీకి కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఉప రాష్ట్రపతి ట్విటర్ హ్యాండిల్ హ్యాండ్లర్ కావాలనే ఇలాంటి ఫొటోను ఎంచుకుని పోస్ట్ చేశారని కొంతమంది ఆరోపిస్తున్నారు. Hon'ble Vice-President of India and Chairman, Rajya Sabha, with Smt. Sonia Gandhi ji and her family during the oath-taking ceremony for elected Members of Rajya Sabha in Parliament House today. @RahulGandhi @priyankagandhi pic.twitter.com/9LdktgtoCE — Vice President of India (@VPIndia) April 4, 2024 -
గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన కోన వెంకట్
సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా ట్రోలింగ్‌తో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కుటుంబ సభ్యులను ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు కోన వెంకట్ పరామర్శించారు. గీతాంజలి కుటుంబ సభ్యులకు రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఎప్పుడు ఏం అవసరం వచ్చినా తనకు చేయమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియా శాడిజానికి గీతాంజలి బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పవిత్ర ఆత్మను ట్రోలింగ్‌తో చంపేశారని అన్నారు. సోషల్ మీడియా సైకోయిజానికి తాను కూడా బాధితుడినేనని అన్నారు కోన వెంకట్. ఈ వేధింపులకు చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. వీటిని అడ్డుకునేందుకు వీలైతే కొత్త చట్టాలను తేవాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని చెప్పుకుంటే ట్రోల్ చేస్తున్నారని, జనాన్ని భయపెడుతున్నారని అన్నారు. కాగా తనకు ప్రభుత్వం ఇంటి స్థలం ఇవ్వడంతో సొంతింటి కల నెరవేరిందంటూ తెనాలికి చెందిన గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూపై.. టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలు అసభ్య పదజాలంతో దూషించారు. గీతాంజలి వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో తీవ్ర మనోవేదనలకు గురైన ఆమె రైలు కిందపడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో వేధించిన సైకోలను వదల్లొద్దంటూ డిమాండ్ బలంగా వినిపించింది. చదవండి: ‘పవన్ కూడా వెన్నుపోటు.. మరీ ఇంత దుర్మార్గమా?’ -
వేశ్య అని తిడుతున్నారు: హీరోయిన్
హారర్ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టింది అదా శర్మ. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్షణం, కల్కి సినిమాల్లో తళుక్కుమని మెరిసింది. కానీ ఇక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తోంది. ద కేరళ స్టోరీ, బస్తర్: ద నక్సల్ స్టోరీ వంటి వైవిధ్య చిత్రాల్లో నటించి సెన్సేషనల్ నటిగా మారింది. వివాదాస్పద సినిమాల్లో నటించిన అదాను చాలామంది తిట్టిపోస్తున్నారు. అందులో ఏం లేదు తాజాగా ఆమె ఈ సినిమాల గురించి, ట్రోలింగ్ గురించి పెదవి విప్పింది. అదా శర్మ మాట్లాడుతూ.. 'బస్తర్ మూవీ డైరెక్టర్ నన్నొక సున్నితమైన అమ్మాయిగా భావించొద్దన్నాడు. అడవుల్లో తిరిగే మనిషిగా కనిపించాలన్నాడు. అబ్బాయి ఎలా తుపాకీలు పట్టుకుని తిరుగుతాడో, అతడికి ఎలా కండలుంటాయో అలా కనిపించాలన్నాడు. నిజానికి ఈ సినిమా ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు అందులో నేను లేను. ఆ ఫోటోలో అడవులు.. దానిపై బస్తర్ అన్న టైటిల్ మాత్రమే ఉంది. అయినా సరే ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నారంటూ రకరకాలుగా విమర్శించారు. నోటికొచ్చింది తిడుతున్నారు సినిమా రిలీజ్ కాకముందే ఇంత ట్రోలింగా అనిపించింది. అప్పుడసలు ఎలా రిలాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. సినిమా చూడకముందే విమర్శలు గుప్పించాలనుకుంటే అది మీ ఇష్టం. ఏది పడితే అది కామెంట్స్ చేసే హక్కు మీకు ఉన్నట్లే నచ్చిన సినిమాలు తీసే హక్కు మాకూ ఉంది. కొందరైతే నేను ఏ పోస్ట్ పెట్టినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వేశ్య అని కామెంట్స్ చేస్తున్నారు' అని చెప్పుకొచ్చింది. కాగా అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన బస్తర్ మార్చి 15న విడుదలైంది. కానీ పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్మెంట్.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్ కంగనా రనౌత్ పుట్టినరోజు.. ఈ బ్యూటీ అమ్మ గురించి తెలుసా? -
ట్రోలింగ్.. ‘సోషల్’ కిల్లింగ్
సాక్షి, హైదరాబాద్ : సోషల్ మీడియా ట్రోలింగ్ ప్రాణాల మీదకు తెస్తోంది. ఒక్కో సందర్భంలో..ఒక్కో తరహా వేధింపులు తప్పడం లేదు. ఇందులో మహిళలే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు. తాజాగా గీతాంజలి ఆత్మహత్యే ఇందుకు నిదర్శనం. ట్రోల్ చేసి పైశాచిక ఆనందం పొందేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వర్చువల్లైఫ్ వేరు.. నిజజీవితం వేరు అని గుర్తించాలి సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని, గుర్తింపు పొందాలని ఈ మధ్య కాలంలో ఎక్కువగా రీల్స్, షార్ట్ వీడియోలు చేస్తున్నారు. అయితే, ఇలాంటి వీడియోలతో ప్రచారం ఎంత పొందుతారో, కొన్నిసార్లు ట్రోలింగ్‌కు గురవడం సహజమే అని గుర్తించాలి. పొగడ్తలకు పొంగిపోవడం కాదు..విమర్శలు వచ్చినప్పుడు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటికీ విరుగుడు సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే అని వారు పేర్కొంటున్నారు. వ్యక్తిగతంగాను, కొన్నిసార్లు పార్టీలపరంగా టార్గెట్ చేసి ఇలాంటి తప్పుడు విమర్శలు, కామెంట్లు చేస్తున్నారన్నది మరవొద్దని వారు సూచిస్తున్నారు. ఫేక్ కంటెంట్ రాసినంత మాత్రాన మన చుట్టూ ఉండేవారి దగ్గర మనం తక్కువకాము అన్నది గుర్తించాలంటున్నారు. కొన్ని రకాల ‘సోషల్’ వేధింపులు ఇలా.... సైబర్ బుల్లీయింగ్: ఈ తరహా సోషల్ మీడియా వేధింపులు యువతలో ఎక్కువగా ఉంటున్నాయి. అమ్మాయిలు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలు సైబర్ బుల్లీయింగ్ తరహా వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. ట్రోలింగ్: రాజకీయాల్లో ఉండేవారికి ఇవి తప్పడం లేదు. ప్రధానమంత్రి మొదలు అన్ని స్థాయిల్లోని రాజకీయనేతలు వీటి బారిన పడుతున్నారు. సినీతారలు, ప్రముఖ క్రీడాకారులు, ఇతర సెలబ్రెటీలకు సైతం ఇవి తలనొప్పిగా మారాయి. స్వాటింగ్: తప్పుడు మెసేజ్‌ల ద్వారా దర్యాప్తు సంస్థల పేరు చెప్పి బెదిరింపులకు గురి చేయడం. ఇది ఎక్కువగా యూఎస్, యూకేలో ఉంది. ఇది కూడా ఒక తరహా సైబర్ వేధింపులే. మన దగ్గర ఈ తరహా సైబర్ వేధింపులు ఎక్కువగా లోన్‌యాప్స్ మోసాల్లో చూస్తున్నాం. మేం చెప్పినంత డబ్బు చెల్లించకపోతే మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తాం..మా ఏజెంట్ మీ ఇంటికి వచ్చి పరువు తీస్తాడు..అంటూ బెదిరింపులకు దిగి ఆత్మహత్యలు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారు. రివేంజ్ పోర్న్: స్నేహితులుగా లేదా ప్రేమికులుగా ఒక రిలేషన్లో ఉన్నప్పుడు సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలను వారి రిలేషన్షిప్ బ్రేక్ అయిన తర్వాత బెదిరింపుల కోసం వాడడమే రివేంజ్ పోర్న్. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో పెడతామని అమ్మాయిలను వేధించడం, మానసికంగా కుంగదీయడం దీని కిందకే వస్తుంది. ఈ జాగ్రత్తలు మరవొద్దు ♦ సోషల్ మీడియాలో అవసరానికి మించి మన వ్యక్తిగత సమాచారం, ఫొటోలు, వీడియోలు షేర్ చేయకపోవడమే బెటర్. ♦ ఏ తరహా సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్నామన్నది ముందుగా గుర్తించాలి. వాటికి సంబంధించి స్క్రీన్షాట్లు తీసి పెట్టుకోవాలి. ఇవి భవిష్యత్‌లో ఆధారంగా పనికొస్తాయి. ♦వేధింపులు ఉన్నట్టు గమనిస్తే, సోషల్ మీడియా ఖాతాలకు దూరంగా ఉండటమే ఉత్తమం. వర్చువల్ ప్రపంచంలో ఎక్కడో కూర్చున్న అజ్ఞాత వ్యక్తులు చేసే కామెంట్లు పట్టించుకోవొద్దు. ♦ఎవరైనా మన సోషల్ మీడియా ఖాతాల్లోని గ్రూపులలో అభ్యంతరకర మెసేజ్‌లు పెడితే, వాటిని వెంటనే డిలీట్ చేయాలి. వాటిని ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్‌లో రిపోర్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. వాటిని వినియోగించుకోవాలి. ♦వేధింపులు మితిమీరితే 1930 నంబర్‌కు డయల్ చేసి సైబర్ క్రైం సెల్లో ఫిర్యాదు చేయాలి. ఠీఠీఠీ. ఛిyb్ఛటఛిటజీఝ్ఛ. జౌఠి. జీn పోర్టల్ ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదు చేయడం ఉత్తమం సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో ఓ భాగమైంది. విమర్శలు, వ్యక్తిగత దూషణలు వచ్చినప్పుడు మానసిక స్థైర్యం కోల్పోవద్దు. వెంటనే పోలీసులను సంప్రదించాలి. – డా.ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, న్యూఢిల్లీ -
ట్రోలింగ్స్ వల్లే మనస్తాపంతో గీతాంజలి ఆత్మహత్య
ప్రతినిధి, గుంటూరు/నగరంపాలెం : ఇంటి పట్టా రిజిస్టరై చేతికి వచ్చిన సందర్భంలో ఆనందంగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ గీతాంజలి పాలిట శాపంగా మారిందని గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ఈ వీడియోను ట్రోల్ చేయడంతో తట్టుకోలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గీతాంజలి మృతికి బాధ్యులైన ఇద్దరిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ కోసం ఐపీఎస్ అధికారి నచికేత్ షెల్కే నేతృత్వంలో జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), శ్రీనివాసరావు (ఎల్/ఓ), తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీ రమేష్‌తో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. ఈ క్రమంలో ఫేస్బుక్, ట్విటర్ ద్వారా వచ్చిన ట్రోలింగ్‌లను పరిశీలించామన్నారు. గీతాంజలి నాలుగో తేదీన లోకల్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిందని, ఆమె మాట్లాడిన మాటలు అదే రోజు సోషల్ మీడియాలో వైరలయ్యాయని తెలిపారు. దీనికి అనేక వ్యూస్ వచ్చాయని, దీంతో ఆమెను కొందరు ట్రోల్ చేయడం మొదలుపెట్టినట్లు గుర్తించామన్నారు. వీటిని చూసి అమె మనస్తాపానికి గురైందని, రెండు రోజులు డీలాగా గడిపినట్లు తెలిసిందన్నారు. ఏడో తేదీ ఉదయం ఈ ట్రోలింగ్‌పై తన సన్నిహితులు, బంధువులతో చర్చించిందని, వాటిని ఎలా తొలగించాలని వారిని అడగ్గా, అది సాధ్యం కాదని వారు ఆమెకు చెప్పారని తెలిపారు. ఈనెల ఏడో తేదిన ఆమెకు విజయవాడలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్ పోస్ట్‌కు ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిందని, ఆ తర్వాత కూడా బంధువులతో మాట్లాడిందని చెప్పారు. తనను, తన పిల్లలను, భర్తను కూడా అసభ్య పదజాలంతో తిడుతున్నారని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే గీతాంజలి తెనాలి రైల్వే ట్రాక్‌పై ఎదురుగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసిందని చెప్పారు. ఆమెను గమనించి లోకో పైలెట్ అప్రమత్తమై, బ్రేక్ వేసి రైలును నిలిపారని, అప్పటికే రైలు తగలడంతో ఆమె తలకు బలమైన గాయాలయ్యాయని చెప్పారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. తెనాలి జీఆర్పీ పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను విచారించగా, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్ల వల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేశారని అన్నారు. ఈ కేసు తీవ్రతను గుర్తించి క్రైమ్ నంబర్ 28/24/యు/ఎస్ 174 సీఆర్‌పీసీగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆ తరువాత కేసును తెనాలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ కాగా, దానిని కేసు నంబర్ 65/24సెక్షన్ 509, 306 ఐపీసీ , సెక్షన్ 67 ఐటీ యాక్ట్‌గా తిరిగి నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వెయ్యికిపైగా కామెంట్లు ఉన్నట్లు విచారణ బృందాలు గుర్తించాయన్నారు. సోషల్ మీడియాలో అటువంటి భాష ఉపయోగించడం బాధాకరమన్నారు. ట్రోలింగ్‌కు పాల్పడిన విజయవాడకు చెందిన పసుమర్తి రాంబాబు, పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన వెంకట దుర్గారావుని అరెస్టు చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామని అన్నారు. మిగతా వారిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. ట్రోల్స్‌పై ఫిర్యాదు చేయండి పిల్లలు, మహిళలు, ఎవరైనా ఇటువంటి దారుణమైన ట్రోల్స్‌కి గురైతే సచివాలయాల్లోని మహిళా పోలీసులకు, స్థానిక పోలీస్ స్టేషన్లో, దిశ పీఎస్‌లో, దిశ యాప్, డయల్ 100, స్టేట్ మహిళా హెల్ప్‌లైన్ నంబర్, సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్ 9121211100కు ఫిర్యాదు చేయాలని ఎస్పీ చెప్పారు. నేరుగా తనను కూడా సంప్రదించవచ్చన్నారు. -
ట్రోలింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో గీతాంజలి అనే మహిళ ప్రభుత్వ పథకాలు తీసుకొని ఏ విధంగా లబ్ధి పొందిందో ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరంగా చెప్పింది. ఆమె ప్రభుత్వ పథకాల వల్ల తమ కుటుంబానికి ఎంతగా లబ్ధి చేకూరిందీ, వారి పిల్ల లకి కూడా భవిష్యత్తులో ప్రభుత్వ విద్యా విధానం ఎంతగా ఉపయోగ పడనున్నదో సంతోషంగా తెలియ పరిచింది. కానీ ఆమె అభిప్రాయంపై కొందరు వ్యక్తులు (ప్రతి పక్షాల కార్యకర్తలు) అనుచిత, అన్పార్ల మెంటరీ పదాలతో కూడిన కామెంట్లు చేశారు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఇప్పుడు వారు తల్లిలేని పిల్లలయ్యారు. ఈ మధ్యకాలంలో ‘సోషల్ ట్రోలింగ్’ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా రాజ కీయాలలో ఇది మరింత తీవ్రంగా ఉంది. ఒక పార్టీనీ, ఒక వ్యక్తినీ, ఒక నాయకుణ్ణీ, ఒక విధానాన్నీ సమర్థిస్తూ మాట్లాడితే వెంటనే సామాజిక మాధ్యమాల్లో పలు పార్టీలకు సంబంధించిన వారు అదే పనిగా వారిని విమర్శించడం కనిపిస్తోంది. అయితే ఇందులో మహిళలను కించపరచడం, వారిని తక్కువ చేసి మాట్లాడటం, అనరాని మాటలు అనడం బాధాకరం. రాజకీయ చర్చల్లో సాధారణంగా చిన్న పిల్లల్నీ, మహిళలనూ కించపరచకూడదు అనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కేవలం రాజకీయ వర్గాలే కాదు సాధారణ ప్రజలు కూడా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి బాలికలు మాట్లా డిన ఇంగ్లీష్‌పై కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. పేద, మధ్య తరగతి పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశ పెట్టి వారు ముందుకు దూసుకువెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటువంటి పిల్లలు మాట్లాడే ఇంగ్లీష్‌పై వ్యంగ్యా స్త్రాలను ఆ యా వర్గాలకు చెందిన వారే కొందరు ట్రోల్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా ప్రభుత్వ పథకాల వల్ల ప్రయోజనం పొందుతున్న మహిళలూ, బడిపిల్లలను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి వారిని క్షోభ పెట్టడం ప్రతిపక్ష కార్యకర్తలకు తగదు. ఇలా చేస్తే వారు అవమానంతో ఆత్మహత్యలు చేసుకోవడం పెరుగుతుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా దిగ్గజాలు... ట్రోల్ చేసేవారిని గుర్తించి, నియంత్రించడానికి ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేయాలి. అలాగే ప్రభుత్వం కూడా తమ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా తగిన నియంత్రణా చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా అటువంటి వారికి జరిమానాలు విధించాలి. భావస్వేచ్ఛ ఉందికదా అని ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడం సరికాదుకదా? ఇటువంటి వారి ప్రవర్తన సామాజిక మాధ్య మాల్లో చురుగ్గా ఉండే యువతపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అసలు ఈ ట్రోలింగ్‌లో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది యువతే ఉండటం ఇందుకు నిదర్శనం. గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు గురు వారం ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలు ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం అని గుంటూరు ఎస్పీ తుషార్ ప్రకటించారు. ఇలా కఠినంగా వ్యవహరిస్తేనే ట్రోలింగ్‌ను అరికట్టడం సాధ్య మవుతుంది. – డా‘‘ శ్రవణ్ కుమార్ కందగట్ల sravankuc@gmail.com -
సోషల్ మీడియా చీడ పురుగులు
సాక్షి, అమరావతి:పేదింటి పిల్లలు ప్రభుత్వ బడుల్లో చదువుకుని ఇంగ్లిష్‌లో గలగలా మాట్లాడితే వారికి కడుపు మంట..వారిపై సోషల్ మీడియాలో హేళనలు... వేధింపులు ప్రభుత్వ బడిలో చదువుకుని ప్రతిభా పాటవాలతో అమెరికా వెళ్లి ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తే చాలు... సోషల్ మీడియాలో ఈసడింపులు... చీత్కారాలు.. ప్రభుత్వం తనకు ఇల్లు ఇచ్చిందని పేద మహిళ సంతోషం వ్యక్తం చేస్తే చాలు... సోషల్ మీడియాలో దూషణలు, దుర్భాషలు.. పేదలు, సామాన్యులు హాయిగా నవ్వితే ఓర్చుకోలేరు... సంతోషంగా ఉంటే తట్టుకోలేరు... జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కితే సహించలేరు. దూషణలతో వేధిస్తూ.. పరుష పదజాలంతో దూషిస్తున్నారు. చివరికి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయినా అవమానభారంతో నలుగురులోకి రాలేని పరిస్థితి తీసుకువస్తారు. తాజాగా తెనాలికి చెందిన గీతాంజలి ఉదంతమే అందుకు తార్కాణం. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా టీడీపీ, జనసేనలు సాగిస్తున్న వికృత క్రీడ ఇది. మహిళలు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికలపై ట్రోలింగ్‌తో పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారు. అందుకోసం టీడీపీ, జనసేన పార్టీలు ఏకంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి మరీ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు పాల్పడుతుండటం ఆ రెండు పార్టీల దుర్మార్గ రాజకీయాలకు పరాకాష్ట.. ఓటమిని జీర్ణించుకోలేక దిగజారుడు రాజకీయాలు 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ ఘోరపరాజయంతో చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు బరితెగించారు. సాధారణ మహిళలు, విద్యార్థులు, సామాన్యుల్ని లక్ష్యంగా చేసుకుని దుర్మార్గ రాజకీయాలకు తెరతీశారు. సోషల్ మీడియా ద్వారా అసభ్య కామెంట్లతో దాడులు చేయమని తమ పార్టీ సోషల్ మీడియా విభాగాలకు ఆదేశించారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా తోడయ్యారు. టీడీపీ, జనసేన పార్టీలు పక్కా పన్నాగంతో సోషల్ మీడియా వేదికగా కుట్రకు తెరతీశాయి. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి వందలాది మందిని తమ సోషల్ మీడియా విభాగాల్లో నియమించాయి. వేలాది ఫేక్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా సామాన్యులను వేధించడం మొదలుపెట్టాయి. టీడీపీ సీనియర్ నేతలు అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణ మూర్తిలు కూడా సోషల్ మీడియా ద్వారా సామాన్యులను వేధించడం విభ్రాంతి కలిగిస్తోంది. ఆ రెండు పార్టీల సోషల్ మీడియా విభాగాలకు చెందిన వందలాది మంది ట్రోలింగ్ పిశాచాలుగా మారి సామాన్యులను వేధింపులకు గురిచేశారు. లబ్ధిదారులే లక్ష్యం పేదలందరికీ ఇళ్లు, వైఎస్సార్ ఆసరా, వాహనమిత్ర, చేయూత, తోడు, చేదోడు, సున్నావడ్డీ, రైతు భరోసా తదితర పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తే చాలు వారిని వ్యక్తిగతంగా దూషిస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేయకుండా కట్టడిచేయాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల కుట్ర. న్యాయ వ్యవస్థపైనా ట్రోలింగే టీడీపీ, జనసేన పార్టీలు చివరికి న్యాయ వ్యవస్థను కూడా విడిచిపెట్టకపోవడం పరాకాష్ట. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోనం కేసులో అరెస్టయిన చంద్రబాబుకు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. హైకోర్టు ఆదేశాలతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయమూర్తి లక్ష్యంగా పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముల్లా ఖాజా హుస్సేన్‌ను గతేడాది నవంబర్ 27న పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, సీఐడీ కఠిన చర్యలు సామాన్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులపై పోలీసు శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. అసభ్యకర, రెచ్చగొట్టే పోస్టింగులు పెడుతున్నవారిరి ఐపీ అడ్రస్‌లతో గుర్తించి కేసులు నమోదు చేస్తోంది. సైబర్ బుల్లీషీట్లను తెరచి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఈ నాలుగున్నరేళ్లలో సీఐడీ 2,919 సైబర్ బుల్లీషీట్లను నమోదు చేసింది. సోషల్ మీడియా వేధింపులకు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సీఐడీ విభాగం కోరుతోంది. సామాన్యుల గొంతు నొక్కే కుట్ర ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించవచ్చు... పథకాల్లో లోపాలను ప్రశ్నించవచ్చు. అందుకు విరుద్ధంగా పథకాలు, కార్యక్రమాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని వారిని వ్యక్తిగతంగా వేధించేందుకు బరితెగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విధానంపై ప్రశంసలు వ్యక్తమవడం ప్రతిపక్ష పార్టీలకు నచ్చలేదు. కాకినాడ జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇంగ్లిష్‌లో అనర్గళంగా ప్రసంగించడంతో ఓర్వలేక వారిని లక్ష్యంగా చేసుకుని టీడీపీ, జనసేన నేతలు, సోషల్‌మీడియా విభాగాలు వేధింపులకు పాల్పడ్డాయి. అమెరికాలోని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులనూ అదే రీతిలో వేధించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే ఆ రెండు పార్టీల లక్ష్యం. ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి మాట్లాడకుండా చేయాలన్నదే కుతంత్రం. వేధిస్తే కఠిన శిక్షలు ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడేవారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు. 67 ఐటీ చట్టం: ఆన్లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్‌లకు పాల్పడితే ఈ సెక్షన్ కింద గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 354: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను లక్ష్యంగా చేసుకుని వేధిస్తే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. మహిళను నేరుగా గానీ ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా అదే పనిగా సంప్రదించడం, వెంటపడటం, దూషించడం, అవమానించడం, వేధించడం తీవ్రమైన నేరాలు.. అందుకు గరిష్టంగా ఐదేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 509: ఉద్దేశపూర్వకంగా ఓ మహిళను తమ మాటలు, చేతలు, సైగల ద్వారా అవమానించడం, ఆమె గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా ఐపీసీ 306: ఒకర్ని వేధించి ఆత్మహత్యకు పాల్పడేలా చేయడం. బాధ్యులకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఐపీసీ 120ఎ: ఇద్దరు గానీ అంతకంటే ఎక్కువ మంది ఉద్దేశపూర్వకంగా ఒకరిని నేరుగా లేదా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల ద్వారా వేధించడం తీవ్రమైన నేరం. ఐపీసీ 504: ఉద్దేశ పూర్వకంగా గౌరవానికి భంగం కలిగించడం తీవ్రమైన నేరం. రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఫిర్యాదు ఇలా...సైబర్ క్రైమ్ పోర్టల్: https:// cybercrime. gov. in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 ఇంగ్లిషులో మాట్లాడితే ఓర్వలేక.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి జెడ్పీ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం’ (ఎల్ఐపీ), ‘ లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు ఆంగ్ల భాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి వచ్చారు. ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడడం నేర్పించారు. అమెరికాలోని అట్లాంటా, జార్జియా ప్రాంతాల్లో ఉన్న పిల్లలు, వారి స్నేహితులతో ఆన్లైన్లో విద్యార్ధులతో డిబేట్ నిర్వహించారు. తోలెం మేఘన, తేజస్విని వంటి విద్యార్థినులు మెరికల్లా రాణించారు. అమెరికన్ యాసలో అనర్గళంగా మాట్లాడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవి టీడీపీ నేతలకు కంటగింపుగా మారాయి. ఆ విద్యార్థినులకు వ్యతిరేకంగా ట్రోల్ చేయించారు. ఆ విద్యార్థినులు టెన్త్‌లో ఫెయిల్ అయ్యారంటూ టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు నోరుపారేసుకున్నారు. ఆ విద్యార్థిని టెన్త్‌లో 478 మార్కులతో పాసైంది. ఆ విద్యార్థిని తల్లి తొండంగి పోలీసులకు 2022 జూన్‌లో ఫిర్యాదు చేయడంతో అప్పట్లో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. మేఘనపై అసభ్యకర పదజాలంతో ట్రోలింగ్ చేశారు. ఆమె తల్లి తొండంగి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ సెక్షన్ 509, ఐటీ యాక్ట్ 2020 సెక్షన్ 67 కింద ట్రోలర్స్‌పై అప్పటి ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేశారు. -
మీరో ‘గీతాంజలి’ కావద్దు
గీతాంజలి.. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలికి చెందిన వివాహిత, ఇద్దరు బిడ్డల తల్లి. ట్రోలింగ్‌కు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన విషయం మీరందరూ చదివే ఉంటారు. ఆ తర్వాత కూడా ఆమెపై ట్రోలింగ్ ఆగలేదు. రాజకీయపార్టీలు తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఆమె మరణాన్ని రకరకాలుగా వక్రీకరించే ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మరెవ్వరూ గీతాంజలిలా కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. సొరచేపలతో జాగ్రత్త... ఇంటర్నెట్ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఇందులో విలువైన ఆణిముత్యాలు ఉన్నట్లే, అమాంతం మింగేసే సొరచేపలు కూడా ఉంటాయి. ముత్యాలకోసం తీవ్రంగా అన్వేషించాలి. సొరచేపలు మాత్రం మీకేమాత్రం సంబంధం లేకుండానే మింగేస్తాయి. ట్రోలింగ్ చేసేవారు కూడా సొరచేపల్లా విపరీతమైన ఆకలితో ఉంటారు.. గుర్తింపుకోసం ఆకలి. ఆ గుర్తింపుకోసం ఎలాంటి పోస్టులు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. వారిలో మానవత్వం ఉండదు. తమ పోస్టులు వైరల్ అవ్వాలన్న కోరిక తప్ప, తన పోస్టుల వల్ల బాధపడే వ్యక్తుల పట్ల సహానుభూతి ఉండదు. ఇంకా చెప్పాలంటే బాధపడుతుంటే చూసి ఆనందించే శాడిజం ఉంటుంది. అలాంటి సొరచేపల బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. రెండువైపులా పదునున్న కత్తి... సోషల్ మీడియా రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. సక్రమంగా వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. వక్రమార్గంలో వినియోగిస్తే ప్రాణాలు తీయవచ్చు. మనకు తెలిసిన వ్యక్తిని ఒక మాట అనాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం. వారు బాధపడతారేమోనని సున్నితంగా చెప్పేందుకు ప్రయత్నిస్తాం. ఎందుకంటే వారు మనల్ని కలిసే అవకాశం ఉంది కాబట్టి. కానీ సోషల్ మీడియాలో ఎవరూ ఎవరికీ ప్రత్యక్షంగా తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ముక్కూమొహం చూపించాల్సిన అవసరం లేదు. వివరాలు తెలియకుండా, రహస్యంగా ఉంటూ ఏమైనా మాట్లాడే అవకాశం ఉంది. అందుకే ట్రోలర్స్‌లో సహానుభూతి కనిపించదు. వికృతమైన పోస్టులు పెడుతుంటారు. అసభ్య పదజాలంతో దూషిస్తుంటారు. వాటిని తట్టుకోవడం అందరికీ సులభం కాదు. గీతాంజలి లాంటి సున్నిత మనస్కులకు అసలే కాదు. చదవండి: టీడీపీ– జనసేన సైకోమూకలపై జనం కన్నెర్ర మరేం చెయ్యాలి? ►ఈత తెలిసినవారే సముద్రంలో అడుగుపెట్టాలి. అలాగే మాటల బాణాల నుంచి తప్పించుకోవడం తెలిసినవారే సోషల్ మీడియాలో అడుగుపెట్టాలి. చిన్న చిన్న విమర్శలకు కూడా విపరీతంగా బాధపడే సున్నిత మనస్తత్వం ఉన్నవారు ఈ వైపు చూడకపోవడమే మంచిది. ►మనం రాసే రాతలు, పెట్టే ఫొటోలు వీలైనంత వరకూ వివాదాస్పదం కానివిగా చూసుకోవాలి. అయినా ఒక్కోసారి మనం ఊహించని కోణాలను మనకు అంటగట్టి విమర్శిస్తుంటారు. వాటిని పట్టించుకోకుండా ఉండటం అలవాటు చేసుకోవాలి. ►మీరు ఊహించని రీతిలో విమర్శలు వస్తున్నప్పుడు, మీపై ట్రోలింగ్ నడుస్తున్నప్పుడు కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. చూసి బాధపడటం కంటే, చూడకుండా ప్రశాంతంగా ఉండటం మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది. ►సోషల్ మీడియా వల్ల కొందరు పేరు ప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకుంటున్న మాట వాస్తవమే. వారి ఉద్దేశాలు స్పష్టం. వారు విమర్శలను పట్టించుకోరు. కానీ సామాన్యుల ఉద్దేశం.. కేవలం టైమ్ పాస్ లేదా కొంచెం గ్నానం సంపాదించుకోవడం. అందువల్ల సోషల్ మీడియా లైకులు, షేర్ల గురించి ఆందోళన చెందకుండా, ఆరాటపడకుండా ఉండటం నేర్చుకోవాలి. ►ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయిన వార్తలు నిత్యం పత్రికల్లో చదువుతుంటాం, టీవీల్లో చూస్తుంటాం. అందువల్ల ఆన్లైన్ స్నేహాలను సీరియస్ గా తీసుకోకపోవడం, పరిధులు తెలుసుకుని మసలుకోవడం మంచిది. ►ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, మీ ప్రమేయం లేకుండా మీపై ట్రోలింగ్ మొదలైనప్పుడు.. వెంటనే కుటుంబ సభ్యుల, స్నేహితుల మద్దతు తీసుకోండి. ఆయా అకౌంట్లపై రిపోర్ట్ కొట్టించండి. అవసరమనుకుంటే పోలీస్ కంప్లయింట్ ఇవ్వండి. ►ట్రోలింగ్ వల్ల మీలో ఆందోళన పెరుగుతుంటే, కుంగిపోతుంటే... ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ ను కలవండి. మీ ఆందోళన తగ్గేందుకు, ఆనందాన్ని తిరిగి తెచ్చుకునేందుకు సహాయపడతాడు. సైకాలజిస్ట్ విశేష్ 8019 000066 psy.vishesh@gmail.com -
గీతాంజలి ఆత్మహత్య: ట్రోలింగ్..కిల్లింగ్ కేన్సర్!
నిపుణులు, టెక్నాలజీ పెద్దలు ఊహించినట్టుగానే సోషల్ మీడియా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ద్వారా జ్ఞానాన్ని, సమాచారాన్ని పంచాల్సిన టెక్ విప్లవం కాస్తా మనుషుల ప్రాణాల్ని బలితీసుకుంటోంది. హద్దూ, పద్దూ లేని సోషల్ మీడియా యూజర్లు విచక్షణా రహితంగా వేధిస్తున్నారు. కేన్సర్‌లా విస్తరిస్తున్న ఈ ట్రోలింగ్ చాలామందిని మానసికవేదన గురిచేస్తోంది. చివరికి తట్టుకోలేక ముఖ్యంగా మహిళలు తమ ఉసురు తీసుకుంటున్నారు. తెనాలికి చెందిన ఇద్దరు బిడ్డల తల్లి గీతాంజలి విషాద గాథ ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు , యూ ట్యూబ్ తదితర ఆన్లైన్ ఫార్మాట్లో చోటు చేసుకునే ఈ వేధింపులు మహిళలు, పిల్లల పాలిట అత్యంత ప్రమాదకరకరంగా మారుతున్నాయి. మహిళా రాజకీయ నేతలు, సెలబ్రిటీల నుంచి సామాన్య మహిళల దాకా నెట్టింట ట్రోలింగ్ భరించలేని మానసిక క్షోభకు గురి చేస్తోంది. కూచుంటే తప్పు..లేస్తే తప్పు అన్నట్టు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆఖరికి తమ అభిమాన నాయకుడి మీద అభిమానాన్ని చాటుకోవడం కూడా నేరంగా మారిపోయింది. అల్లరి మూకల దారుణమైన వ్యాఖ్యల్ని తట్టుకోలేక గీతాంజలి తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమే. కానీ ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త, ముద్దులొలికే ఇద్దరు చిన్నారులను కూడా కాదని ఇంతటి నిర్ణయం తీసుకుందంటే ఈ ట్రోలింగ్ మూకల ఆగడాలు ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మహిళా సెలబ్రిటీలు, హీరోయిన్ల విషయంలో అయితే మరీ రెచ్చిపోతారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా, నటి అనసూయ, తెలంగాణ సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్, ఆఖరికి మహిళా ఉద్యమనేతలు సంధ్య, దేవీ లాంటివాళ్లపై దుర్బాషలాడుతూ, చదవలేని రీతిలో కామెంట్లు పెడుతూ ట్రోల్స్ చేస్తుంటారు. ఇక సినిమా పరిశ్రమలోని మహిళల పరిస్థితి మరీ దారుణం. లేటుగా పెళ్లి చేసుకుంటే.. తప్పు...లేటుగా గర్భం ధరిస్తే తప్పు.. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడం, కమెంట్లు చేయడం పరి పాటిగా మారిపోయింది. ఇదే వ్యాఖ్యలు ఒక హీరో మీద చేయగలరా? భార్య ఉండగానే మరో మహిళతో బిడ్డనికంటూ, చట్టాలను గౌరవించకుండా వరుస పెళ్లిళ్లతో సమాజానికే సిగ్గు చేటుగా మారుతున్న హీరోల నైజాన్ని ప్రశ్నించగలరా? చీడపురుగులా వ్యాపిస్తున్న ట్రోలింగ్‌కు ఇకనైనా అడ్డుకట్టపడాలి. దీన్నిపెంచి పోషిస్తున్న వారెంతటివారైనా తగిన శిక్షలు పడాలి. అపుడు మాత్రమే ట్రోలింగ్ భూతం అంతమవుతుంది. అలాగే మనుషులుగా మనం కూడా విచక్షణ కోల్పోకూడదు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రాధాన్యతలు వారికి ఉంటాయనే విషయాన్ని మర్చిపోకూడదు. పరస్పరం గౌరవించుకోవాలి. అదే గీతాంజలికి మనం అర్పించే ఘన నివాళి అవుతుంది. -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
-
లోలోన కుమిలిపోతూనే.. పవర్ లెస్‌గా పవన్ కల్యాణ్
అధికారంలో వాటా తీసుకుంటాం.. ప్రశ్నిస్తాం.. బాధ్యతగా ఉంటాం.. రాష్ట్రాన్ని మోస్తాం అంటూ హడావుడి చేసిన పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు సాంతం నాకేసాడు.. సీట్ల షేరింగ్.. సింహభాగం మాకే అంటూ వచ్చిన జన సైనికులకు నోట మాట రానివిధంగా జస్ట్ 24 ఎమ్మెల్యే సీట్లు మొహాన కొట్టిన చంద్రబాబు పవన్ నోరు మూయించారు. అయితే దానికి సేనాని ఇచ్చిన సమర్థింపు చూస్తే నవ్వాగదు.. అత్యంత శక్తిమంతమైన గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము పవర్ ఫుల్ గా 24 సీట్లు తీసుకున్నాం అని సమర్థించుకున్నారు. ఇప్పుడు ఆ ఇరవై నాలుగులో మూడు సీట్లను బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అదేమీ తీరో.. అదేం పంపకమో కానీ నూట యాభై సీట్లున్న చంద్రబాబు వాటాలోంచి కాకుండా ఇరవై నాలుగు సీట్లున్న పవన్ వాటా సీట్లలోంచి మాత్రమే బీజేపీకి ఇవ్వాల్సి రావడం.. తన రాజకీయ మనుగడ మీద ఏమాత్రం సోయి ఉన్నవాడైనా దీనికి అంగీకరించరు కానీ పవన్ మాత్రం బాబు ఎలా చెబితే అలా ఆడుతున్నారు. ఇక ఇప్పుడు ఆ ఇరవై ఒక్క సీట్లకు కూడా అభ్యర్థులను చంద్రబాబే సూచిస్తారు.. అయన చెప్పినవాళ్లకే జనసేన తరఫున సీట్లు దక్కుతాయి. ఇక ఇప్పుడు 21 సీట్లకు పవన్ కల్యాణ్ పరిమితం అవ్వడం పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. ఇప్పుడిచ్చిన 21 సీట్లను ఎలా సమర్థించుకుంటావు పవన్ అంటూ ట్విట్టర్, ఫేస్బుక్కుల్లో కామెంట్స్.. చురకలు.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్కాండియం యొక్క పరమాణు సంఖ్య -21 కోడి పొదగడానికి పట్టే సమయం -21 రోజులు. ఈరోజు డేట్ 12...దాన్ని తిరగేస్తే వచ్చేది -21 వినాయకుడి కి పూజ చేసే ఆకుల రకాలు 21 మొత్తం Alphabets without vowels - 21 నేనూ ఏడు అడుగులు మూడు సార్లు వేసా 7×3=21 పెళ్లి చేసుకోడానికి కనీస వయసు -21 ఏళ్ళు. 21st century = 21 సీట్లు జగన్ పుట్టినరోజు -21... ఇలా చెప్పుకుంటూ పోస్టింగులు పెడుతున్నారు. మరోవైపు బీజేపీలోకి కూడా చంద్రబాబు తన కార్యకర్తలను పంపుతూ ఆ పార్టీని కబ్జా చేస్తున్నారని, గతంలో ఏదైతే జరిగినదో, బీజేపీకి ఎలా నష్టం చేకూర్చారో ఇప్పుడూ అదే చేస్తున్నారని హార్డ్ కొర్ బీజేపీ క్యాడర్ ఆవేదన చెందుతోంది. ఇక జనసేన పరిస్థితి కూడా ఐస్ ముక్క మాదిరి క్షణక్షణానికి కరిగిపోతూ ఎన్నికలనాటికి ఏ ఐదారు.. పది సీట్లకు పరిమితం అయినా అవ్వొచ్చని జనసైనికులు లోలోన కుమిలిపోతున్నారు. చంద్రబాబుతో పొత్తు.. మా పవన్ కల్యాణ్ చిత్తు చిత్తు అని కామెంట్స్ చేస్తున్నారు -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
సాక్షి, గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చివరగా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తారా?. ట్రోలింగ్స్ తట్టుకోలేక మా అమ్మాయి దూరమైంది. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
AP Police: ‘దిగులొద్దు.. భయపడొద్దు.. భరతం పడతాం’
టీడీపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాల వేధింపులు కొన్నాళ్లుగా వెర్రి తలలు వేస్తున్నాయి. సొంత వ్యక్తిత్వం, తమవైన అభిప్రాయాలు కలిగి ఉండటం మహానేరం అన్నట్లు కిరాయి మూకలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో.. పచ్చ మూకల కిరాతకానికి తెనాలి మహిళ గీతాంజలి దారుణంగా బలైపోయింది. అయితే ‘సోషల్ మాఫియా’ దాడులపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని.. తాము అండగా నిలబడతామని ఏపీ పోలీసులు భరోసా ఇస్తున్నారు. టీడీపీ-జనసేన సోషల్ మీడియా బ్యాచ్ గత కొంతకాలంగా మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. మహిళలు, చిన్నారులని కూడా చూడకుండా అసభ్యకర పదజాలంతో దూషిస్తూ తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. బెండపూడి స్టూడెంట్ మేఘన, కుమారీ ఆంటీ.. వీళ్లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్టలు చేశాయి. తాజాగా తెనాలి గృహిణి గీతాంజలి లక్ష్యంగా చేసుకుని తప్పుడు కామెంట్లు చేశాయి. దీంతో ఆమె ప్రాణం తీసుకుంది. అయితే.. ఆన్లైన్లో ఇలాంటి వేధింపులను ఉపేక్షించొద్దని ఏపీ పోలీసులు అంటున్నారు. వీటికి జంకితే మరింత దారుణంగా తెగబడటం ఖాయమని చెబుతున్నారు. బాధితులకు తక్షణమే రక్షణ కల్పించడం, వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు శాఖ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని గుర్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేసిన చట్టాల్ని ప్రస్తావిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చాలు వెంటనే కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని.. బాధితులు నేరుగానే కాకుండా తమ సన్నిహితులు, స్నేహితుల ద్వారా కూడా బాధితులు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. ఫిర్యాదు చేయడం ఇలా... ► ట్రోలింగ్‌కు గురయ్యేవారు, బాధితులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. గ్రామ, వార్డు సచివాలయంలోని మహిళా పోలీసు ద్వారా కూడా పోలీసులను ఆశ్రయించవచ్చు. ► సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు సంప్రదించాల్సిన వేదికలు.. సైబర్ క్రైమ్ పోర్టల్: https://cybercrime.gov.in/ సైబర్ మిత్ర వాట్సాప్ నంబర్: 9121211100 సైబర్ బుల్లీయింగ్ 4ఎస్4యు: 9071666667 గీతాంజలి కేసులో నిందితుల గుర్తింపు వైఎస్సార్సీపీ సంక్షేమంతో తనకు చేకూరిన లబ్ధి గురించి సంతోషంగా చెప్పి.. ఆనక టీడీపీ-జనసేనల చేతిలో దారుణంగా ట్రోలింగ్‌కు గురైంది గీతాంజలి. అతి జుగుప్సాకరమైన పోస్టులు చేశారు ఆమె మీద. అయితే సున్నిత మనస్కురాలైన గీతాంజలి.. ఆ పోస్టులను భరించలేకపోయింది. తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ క్రమంలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ సోమవారం వేకువఝామున కన్నుమూసింది. ఏపీలో సంచలనంగా మారిన ఈ ఆన్లైన్ వేధింపుల కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. దర్యాప్తును ముమ్మరం చేశారు. ఐటీడీపీ, పలువురు జనసేన నేతల అకౌంట్లను పరిశీలించారు. ఇప్పటికే నిందితుల్ని గుర్తించామని.. పోస్టులు చేసిన కొందరు పరారీలో ఉన్నారని.. వాళ్లందరినీ పట్టుకుని తీరతామని పోలీసులు చెబుతున్నారు. -
సోషల్ మాఫియా c/o టీడీపీ - జనసేన
మేలు చేసిన సీఎం, ఎమ్మెల్యేలను మెచ్ఛుకోవడమే ఆమె చేసిన పాపం. చాన్నాళ్ళ కు ఓ గూడు దొరికిందన్న సంతోషాన్ని మిగల్చకుండా సోషల్ మీడియా ముసుగులో టీడీపీ- జనసేన రాబందులు వాలిపోయాయి. ట్రోల్స్ తో పీక్కు తిన్నాయి. అవమానాలు తట్టుకోలేక ఆ మహిళ ఆఖరుకు ఉసురు తీసుకోవడమే మేలు అనుకుంది. రైలు చక్రాల కింద నలిగి పోయింది. సాక్షి, గుంటూరు: టీడీపీ, జనసేన వేధింపులు ఓ మహిళ ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలో ఇంటి స్థలం గురించి మాట్లాడిన మహిళను మానసికంగా హింసించి ఆమె చావుకు యమపాశంగా మారాయి. ఇళ్ల పట్టా వచ్చిందన్న ఆనందంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటు ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లను మెచ్చుకుంటూ ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడటమే ఆ మహిళ పాలిట శాపమైంది. జగనన్న ఇల్లు ఇచ్చాడని సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ టీడీపీ, జనసేన మితిమీరిన ట్రోలింగ్ కారణంగా అవమాన భారం తట్టుకోలేక రైలు కింపడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గుల్టి గీతాంజలి దేవి(29) గృహిణి, ఆమె భర్త బాలచంద్ర బంగారం పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె రిషిత నాలుగో తరగతి, చిన్న కుమార్తె రిషిక ఒకటో తరగతి చదువుతున్నారు. తెనాలిలోని ఇస్లాంపేటలో నివసిస్తున్నారు. పెద్ద కుమార్తెకు నాలుగు సార్లు ‘అమ్మ ఒడి’ వచ్చింది. ఈమెకు ఇటీవల జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది. ఈనెల 4వ తేదీన కొత్తపేటలోని తాలూకా కాలేజీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంది. ఆ తర్వాత తన సంతోషాన్ని ఓ యూట్యూబ్ ఛానల్‌తో పంచుకుంది. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నానని, స్వంత ఇళ్లు అనేది అందరి కల అని, ఇళ్ల స్థలం పొందడం ద్వారా తన కల నెరవేరిందంటూ ఎంతో ఉద్వేగంగా మాట్లాడింది. తన పిల్లలకు అమ్మ ఒడి కూడా వస్తోందని, ఇన్ని మంచి పనులు చేస్తున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ను మళ్లీ గెలిపించుకోవడం తమ బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాటలను కొందరు టీడీపీ, జనసేన కార్యకర్తలు వివరీతంగా ట్రోల్స్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టారు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురైన గీతాంజలి రెండు రోజుల క్రితం తెనాలి రైల్వేస్టేషన్ వద్ద రైలు కింద పడి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. తీవ్రంగా గాయపడటంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా సోమవారం తుదిశ్వాస విడిచింది. అయితే ఒక బీసీ మహిళ.. కేవలం ఇళ్ల పట్టా వచ్చిందన్న తన ఆనందాన్ని పంచుకోవడమే ఆమె చేసిన తప్పా అంటూ పలువురు ప్రశ్నిస్తుండగా టిడిపి సోషల్ మీడియానే దారుణమైన ట్రోల్స్ చేసి ఆమెను బలితీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మాఫీయా కేరాఫ్ ‘టీడీపీ - జనసేన’ ‘వాలంటీర్లు మాకు బీడీ కట్ట తెచ్చి పెడతారా, ఓయి వాలంటీర్ నాకు కండోమ్ తెచ్చిపెడతావా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియా చేసిన విషప్రచారంతో చేస్తున్న సేవలో కూడా హేళన ఎదుర్కొని మనస్తాపంతో మొన్న వాలంటీర్ నవీన చనిపోతే.. నిన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమెరికన్ ఇంగ్లీష్ స్లాంగ్ నేర్చుకున్న నిరుపేద మేఘన అనే బాలిక తెలుగుదేశం, జనసేన చేసిన ట్రోల్స్‌తో మానసిక వేదనకు గురైంది. నేడు ప్రభుత్వం నుంచి లబ్ది పొందాను అంటూ ధైర్యంగా చెప్పిన పాపానికి తెలుగుదేశం, జనసేన ట్రోల్ పేజీల మాఫీయా వేదింపులకి గీతాంజలి ప్రాణాలు తీసుకుంది. తమ రాజకీయ స్వలాభం కోసం, అసత్యాలను ప్రచారం చేస్తూ, అది తప్పు అని చెప్పిన సామాన్యులపై దుషణలకు దిగే సోషల్ మాఫీయాలను కోట్లు వెచ్చింది పెంచి పోషిస్తున్న తెలుగుదేశం జనసేన మాఫీయాని ఈ రాష్ట్రం నుంచే తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది.’ అంటూ నిప్పులు చెరుగుతున్నారు. -
'ఇంకా పెళ్లి చేసుకోలేదే'.. నోరు మూసుకో.. ఇంకోసారి!
నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్నా.. అని చెప్పేవాళ్లు సినిమాలోనే కనిపిస్తారు. నిజ జీవితంలో చాలా అరుదుగా ఉంటారు. అప్పుడే పెళ్లేంటి? కొన్నాళ్లు స్వేచ్ఛగా బతకనివ్వొచ్చుగా.. ఇప్పట్లో నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం, ఆసక్తి ఎంతమాత్రమూ లేదని తేల్చి చెప్తుంటారు. సెలబ్రిటీలైతే కెరీర్ వెనక పరిగెడుతూ పెళ్లి విషయాన్నే మర్చిపోతుంటారు. ఈ క్రమంలో ఎంతోమంది తారలు చాలా ఆలస్యంగా వివాహం చేసుకోగా కొందరు మాత్రం లేటైపోయిందని పెళ్లినే లైట్ తీసుకుంటారు. నీ జీవితంలో ఇంతవరకు.. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి సోదరి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ షమితా శెట్టికి 45 ఏళ్లు. ఇప్పటికీ సింగిల్‌గా లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. తనను చూసి కుళ్లుకుందో ఏమో కానీ ఓ మహిళ నోటిదూలతో సోషల్ మీడియాలో నటిపై సెటైర్లు వేసింది. 'నీకు 50 ఏళ్లు వచ్చేస్తున్నాయ్.. ఇంతవరకు నీ జీవితంలో మగాడే లేడు' అంటూ పరోక్షంగా పెళ్లి చేసుకోలేదని దెప్పిపొడిచింది. ఈ కామెంట్ చూసి చిరాకొచ్చిన షమిత దాన్ని స్క్రీన్‌షాట్ తీసి ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. నా జీవితానికి పెళ్లి.. 'ఇక్కడో దయామయురాలైన ఓ మహిళ నేను పెళ్లి చేసుకోలేదని, నన్ను చులకన చేయాలని ప్రయత్నిస్తోంది. ఆమెకోసం కాస్త సమయం కేటాయించైనా రిప్లై ఇవ్వాలనుకున్నాను.. అందుకోసమే ఇది! ముందుగా నీకు అభినందనలు. నువ్వు అనుకుంది సాధించావ్.. ఇక నువ్వు అన్న మాటలకు నా సమాధానమేంటంటే.. నా జీవితానికి పెళ్లి ఒక్కటే అర్థం, పరమార్థం కాదు. సంతోషంగా, తృప్తిగా, స్వతంత్రంగా నా కాళ్లపై నేను నిలబడి జీవిస్తున్నాను. నోరు మూసుకో.. నీ జీవితంలో కొంతైనా పాజిటివిటీతో బతుకు. ఇంకోసారి ఏ అమ్మాయిని ఇలా కిందకు లాగేందుకు ప్రయత్నించవని కోరుకుంటున్నాను. నీకు మంచి చెప్పడానికి మాటలు రాకపోతే నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉండటమే మేలు' అని ఘాటుగా కౌంటిచ్చింది. కాగా గతంలో షమితా శెట్టి.. రాకేశ్ అనే వ్యక్తిని ప్రేమించింది. వీరిద్దరూ బిగ్‌బాస్ షోలో లవ్‌లో పడ్డారు. కానీ షో అయిపోయిన కొంతకాలానికే విడిపోయారు. చదవండి: ఐశ్వర్యపై నోరు జారేసుకున్న హీరో.. అక్కడున్నవాళ్లంతా షాక్.. -
PSL 2024 తొలిసారిగా అలా షోయబ్ మాలిక్ జంట: సనాపై నెటిజన్ల ట్రోలింగ్
పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మూడో భార్య నటి సనా జావేద్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మూడో పెళ్లి చేసుకున్న మాలిక్, సనా జావేద్ జంటగా కలిసి తొలిసారిగా బహిరంగంగా కనిపించారు. ముల్తాన్ విమానాశ్రయం హోటల్‌కు వెళుతున్న దృశ్యాలు హల్చల్ చేశాయి. దీనిపై కొంతమంది ఫ్యాన్స్ సానుకూలంగా స్పందించినప్పటికీ, మరికొందమంది మాత్రం నెగిటివ్‌గా కమెంట్స్ చేశారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) తొమ్మిదో ఎడిషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ముల్తాన్ సుల్తాన్స్ vs కరాచీ కింగ్స్ మ్యాచ్‌కు ఆమె హాజరైంది. ఈ సందర్బంగా కరాచీ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మాలిక్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయింది. గట్టిగా కేకలు వేస్తూ, ఉత్సాహంగా కనిపించింది. భర్త షోయబ్‌ను ఎంకరేజ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు, చిత్రాలు వైరల్ గా మారాయి. మాజీ జీవిత భాగస్వాములను మోసం చేసిన ఈ జంటకు సిగ్గూ, శరం లేదంటూ కమెంట్ చేశారు. కొంచెం కూడా పశ్చాత్తాపం లేదంటూ విమర్శలకు దిగారు. అంతేకాదు షోయబ్ త్వరలో తన నాల్గవ భార్యను ఇంటికి తీసుకువస్తాడు, నిన్ను కూడా వదిలివేస్తాడంటూ విరుచుకుపడ్డారు. కాగా భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జాకు విడాకులిచ్చిన షోయబ్ మాలిక్ సనా జావేద్‌ను పెళ్లాడి అందర్నీ షాక్‌కు గురి చేశాడు. అలాగే 'ఖులా' ద్వారా విడిపోయారని సానియా మీర్జా తండ్రి స్వయంగా వెల్లడించారు. సనాకు ఇది రెండో పెళ్లికాగా, మాలిక్‌కు మూడో పెళ్లి. కాగా పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన కరాచీ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ మలన్ 52 పరుగులు చేయగా, రీజా హెండ్రిక్స్ 54 బంతుల్లో 79 పరుగులు చేశాడు. ఛేజింగ్‌లో కరాచీ వరుసగా వికెట్లు కోల్పోయింది.అయితే నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన మాలిక్ 35 బంతుల్లో 53 పరుగులు చేశాడు. కానీ 55 పరుగుల తేడాతో ఓడిపోయింది.మరోవైపు షోయబ్ మాలిక్ స్వార్థపరుడంటూ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ ఆరోపించడం గమనార్హం.. -
Ayodhya Ram Mandir: గాయని చిత్రపై ట్రోలింగ్
తిరువనంతపురం: జాతీయ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయని కేఎస్ చిత్ర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభ ఉత్సవాన్ని స్వాగతిస్తూ ఒక వీడియోను రెండు రోజుల క్రితం ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేయడమే ఇందుకు కారణం. ఈ నెల 22న ఆలయ ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రజలంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే రామమంత్రం జపించాలని, సాయంత్రం ఇళ్లల్లో ఐదు దీపాలు వెలిగించాలని చిత్ర పిలుపునిచ్చారు. ప్రజలందరికీ భగవంతుడి ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు. ‘లోకస్సమస్త సుఖినోభవంతు’ అంటూ తన సందేశాన్ని ముగించారు. అయితే, ఈ వీడియో సందేశంపై సోషల్ మీడియాలో పలువురు విమర్శలు చేస్తున్నారు. ఒక మతానికి మద్దతు ఇవ్వడం, దాన్ని ప్రచారం చేయడం, అయోధ్య రామమందిరానికి ప్రాచుర్యం కలి్పంచడం తప్పు అంటూ ఆక్షేపిస్తున్నారు. మరోవైపు చిత్రకు మద్దతు వెల్లువెత్తుతోంది. పారీ్టలకు అతీతంగా రాజకీయ నాయకులు, గాయనీ గాయకులు, రచయితలు, వివిధ వర్గాల ప్రజలు ఆమెకు అండగా నిలుస్తున్నారు. అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు చిత్రకు ఉందని తేలి్చచెప్పారు. ట్రోలింగ్ చేసేవారి పట్ల మండిపడుతున్నారు. చిత్రకు కేరళకు చెందిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం నాయకులు మద్దతు ప్రకటించారు. చిత్ర ఇచి్చన సందేశాన్ని వివాదాస్పదం చేయొద్దని హితవు పలికారు. రాముడి పట్ల విశ్వాసం ఉన్నవారు ఆయనను పూజిస్తారని, అందులో తప్పేముందని చిత్రకు మద్దతుగా పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి ఖుష్బూ సుందర్ సైతం చిత్రకు మద్దతు ప్రకటించారు. కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అసహనం పెరిగిపోతోందని ఆరోపించారు. -
హను-మాన్కు హిట్ టాక్.. ఆదిపురుష్ డైరెక్టర్‌ను ఆడేసుకుంటున్నారు!
సినిమా బాగుంటే నెత్తిన పెట్టేసుకుంటారు జనాలు. అదే సినిమా షెడ్డుకెళ్లిపోయిందంటే మాత్రం చిత్రయూనిట్‌ను చెడుగుడు ఆడేసుకుంటారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద రిలీజైన భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పటినుంచే ట్రోలింగ్ బారిన పడింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్‌తో ఈ ప్రయోగాలేంటని అభిమానులు మండపడ్డారు. ఆ గ్రాఫిక్స్, గెటప్స్ మార్చమని మొత్తుకున్నారు. ఓం రౌత్‌పై ట్రోలింగ్ అబ్బే, దర్శకుడికి ఏది నచ్చితే అదే ఫైనల్! ఓం రౌత్ ఎవరి సలహాలను, సూచనలను పట్టించున్న పాపాన పోలేదు. చివరకు ఏమైంది? సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఆ సమయంలో ఓం రౌత్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. తాజాగా మరోసారి ఓం రౌత్‌పై సెటైర్లు వేస్తున్నారు సినీ లవర్స్. కారణం హను-మాన్ మూవీ. ఈ సినిమాకు ఓం రౌత్‌కు సంబంధం ఏంటనుకుంటున్నారా? మరేం లేదు. ఆదిపురుష్ అంత డిజాస్టర్ అవడానికి పేలవమైన వీఎఫ్ఎక్స్ కూడా ఓ ప్రధాన కారణం. వీఎఫ్ఎక్స్ వల్లే సినిమా.. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ విజయానికి అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ప్రధాన బలంగా మారింది. ఇంకేముంది.. జనాలు హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మను ఆకాశానికెత్తుతున్నారు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను మళ్లీ ఆడేసుకుంటున్నారు. 'హనుమాన్ సినిమా ఆడే థియేటర్లలో ఓం రౌత్ కోసం ఓ సీటు వదిలేయండి', 'చిన్న సినిమా అయినా ఎలా తీశారో చూసి నేర్చుకో..' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓం రౌత్.. ఆదిపురుష్ సినిమాను రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ప్రశాంత్ వర్మ.. హను-మాన్ చిత్రాన్ని కేవలం రూ.25 కోట్లలోనే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఎక్స్(ట్విటర్)లో నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉందో కింది ట్వీట్స్‌లో మీరే చూసేయండి.. After watching #Hanuman, i want to say #Omraut come to my cabin.#JaiShreeRam 🚩 #JaiHanuman 🚩 pic.twitter.com/e2V06FFEPR — Sanatani 🚩🔱 (@Vadapallisree) January 12, 2024 #Hanuman - #OmRaut will receive more criticism in the days to come than what he received after #Adipurush#PrasanthVarma will receive more offers and calls from producers spanning from North to South pic.twitter.com/7NC4l4eJLX — Daily Culture (@DailyCultureYT) January 11, 2024 Aa budget ki oka range output and response ante 🔥🔥🔥🔥🔥 Next movie in theatres #HanuMan 🛕 Still cannot forget what #OmRaut did to #Aadipurush with spectacular cast and budget …#HanuMan pic.twitter.com/mmcyrY9EsW — Vineeth K (@DealsDhamaka) January 11, 2024 Audience to #OmRaut after watching #Hanuman 😂😂🔥#HanumanOnJan12th pic.twitter.com/cSJetincsc — Asif (@DargaAsif) January 11, 2024 Everywhere in the world, wherever there is an #Hanuman show, I request the producer and distributor to keep one seat for #OmRaut Ji 🙏🏻 - Prashanth Varma pic.twitter.com/cKuDJa0nHz — भल्लालदेव (@bhallal_deva1) January 12, 2024 Audience attacking #Omraut after watching #Hanuman #PrashanthVarma bagane irikinchesavu ga 🤣🤣🤣#HanumanOnJan12th #HanumanReview #TejaSajja pic.twitter.com/kqrpbNYXGt — Cgma Memes 🗿 (@CgmaMemes) January 11, 2024 Pb fans to @omraut after watching #Hanuman vfx#Omraut #HanumanReview #HanumanOnJan12th pic.twitter.com/v772YAGRIh — Siddu Prabhas (@Siddhartha_002) January 11, 2024 చదవండి: హను-మాన్ రివ్యూ, సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే? భారీ ధరకు 'హనుమాన్' ఓటీటీ రైట్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
నేను మీకేం అన్యాయం చేశాను.. సుప్రీత ఆవేదన
-
బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయితే: నాపై ట్రోలింగ్, బెదిరింపులు
టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ షో హిందీ, తెలుగు, కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ మలయాళం సహా ఏడు భాషల్లో ఎంత పాపులర్ అందరికీ తెలుసు. ముఖ్యంగా హిందీ, తెలుగు భాషల్లో బాగా జనాదరణ పొందింది. హిందీలో తొలి సీజన్ 2006, నవంబరులో మొదలైంది. ముఖ్యంగా ఈ షోలో వినిపించే వాయిస్‌లు ఈ షోకేపెద్ద ఆకర్షణ అని చెప్పుకోవచ్చు. అయితే హిందీ బిగ్ బాస్‌కి వాయిస్ ఇచ్చే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ , నటుడు విజయ్ విక్రమ్ సింగ్ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నాడు. ప్రముఖ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్‌ను ప్రకటించిన తర్వాత తనను చాలా ఇబ్బందులు పడుతున్నానంటూ వాపోయారు. కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని విజయ్ విక్రమ్ సింగ్ వెల్లడించారు. అలాగే తమ పిల్లల్ని బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించమంటూ ఫోర్స్ చేస్తుంటారని తెలిపాడు బాలీవుడ్ బబుల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, విజయ్ విక్రమ్ సింగ్ బిగ్ బాస్‌లో అధికారిక వ్యాఖ్యాతగా తన వాయిస్‌ని ఇవ్వడం వల్ల కలిగే నష్టాల గురించి తెలిపారు. ఈ షోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం తనకు పెద్ద డిస్‌అడ్వాంటేజ్‌గా మారిపోయిందనీ, విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తోందని తెలిపాడు. ముఖ్యంగా కీలకమైన పోటీదారుల ఎలిమినేట్ అయినపుడు మరీ దారుణంగా ఉంటుందని తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు. తన కుటుంబానికి కొన్ని ప్రత్యక్ష బెదిరింపులు కూడా వస్తుంటాయని పేర్కొన్నాడు. విన్నర్‌కు అసలు అర్హత లేదు అంటూ చాలా సార్లు కమెంట్లు వినిపిస్తుంటాయి.. కానీ, ఇది టాలెంట్ షో కాదు.. కేవలం జనం మెచ్చిన వాళ్లు విజేతలు - విజయ్ విక్రమ్ సింగ్ అసలు కంటెస్టెంట్స్‌ను తొలగించేంది తాను కాదని, ఎలిమినేషనకు తనకూ ఎలాంటి సంబంధం ఉండదని చెబుతున్నా, పట్టించుకోరన్నారు. ప్రజల ఓట్లే పోటీదారుల తొలగింపునకు దారితీస్తుందని, మరీ ముఖ్యంగా గత రెండేళ్లుగా తనపై వేధింపులు ఎక్కువయ్యాయని ఆవేదని వ్యక్తం చేశాడు. ఆ వాయిస్ తనది కాదన్నా వినరని తెలిపాడు. ప్రస్తుత సీజన్‌కు విజయ్ బదులుగా మరో నటుడు వాయిస్ ఆర్టిస్ట్ శరద్ కేల్కర్ వాయిస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ చాహ్తే హై' అంటూ హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో సంభాషణల వాయిస్ అతుల్ కపూర్, విజయ్ సింగ్లదే. బ్యాక్‌గ్రౌండ్‌లో వాయిస్ అతుల్ కపూర్ అయితే, షోను వివరించే వాయిస్, షో రీక్యాప్ లాంటి వాటికి వాయిస్ ఇచ్చేవారు విజయ్. కాగా 2010లో కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌పై వాయిస్ ఓవర్‌తో పాపులర్ అయ్యాడు విజయ్. ఆతరువాత బీబీకి వాయస్‌తో కొన్ని, వెబ్ షో, సినిమా ఆఫర్లను దక్కించుకున్నాడు. మనోజ్ బాజ్‌పాయ్ ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జ్‌తోపాటు, సుస్మితాసేన్ లీడ్ రోల్లో నటించిన తాలి, విక్కీకౌశల్ మూవీలోకూడా అవకాశాలు దక్కించుకున్నాడు. View this post on Instagram A post shared by Vijay Vikram Singh (@vijayvikram77) -
తాత దొంగతనం గురించి నిజం చెప్పాల్సింది!
సాక్షి, తిరుపతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి ఓదార్పు యాత్ర.. పేలవమైన ప్రసంగాలతో ముందుకు సాగుతోంది. ప్రభుత్వాన్ని విమర్శించేలా ఎవరో రాసిచ్చిన ప్రసంగాలను చదవలేక ఇబ్బంది పడుతున్న ఆమె.. భర్తకు సంఘీభావంగా ఇస్తున్న స్టేట్మెంట్లతో ఇటు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు దారితీస్తున్నాయి. తాజాగా తిరుపతిలో నిర్వహించిన సభలో తెలుగుదేశం మహిళా నేతలు ఆమెను వెరైటీగా ప్రశ్నలు అడగడం.. ఆ ప్రశ్నలతో అయోమయానికి గురైన ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు. అందులో తాతామనవడి సెంటిమెంట్‌ను పండించేందుకు ఆమె పడిన తాపత్రయం నవ్వులపాలు జేస్తోంది. ‘తాత ఎక్కడ అని మా మనవడు దేవాన్ష్ అడుగుతున్నాడు.. ఆయన జైల్లో ఉన్నట్లు దేవాన్ష్‌కు తెలియదు. చిన్న వయసు కావడంతో తనకు చెప్పదల్చుకోలేదు. తాత విదేశాలకు వెళ్లారని చెబుతున్నాం’ అని తెదేపా నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అధికార మదంతో, పైగా అధికారుల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడి అక్రమార్జన చేశారని ఆధారాలతో సహా బయటపెట్టింది దర్యాప్తు సంస్థ. అలాంటిది ప్రజల సొమ్ము దొంగతనం చేసి జైలుకు వెళ్లిన 73 ఏళ్ల తాత గురించి.. తొమ్మిదేళ్ల వయసున్న మనవడికైనా కనీసం నిజం చెప్పాల్సిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు. తిరుపతిలో నారా భువనేశ్వరి నిర్వహించిన నిజం గెలవాలి సభలో పలువురు @JaiTDP నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. మాజీమంత్రి అమరనాథ్ రెడ్డి, తుడా మాజీ చైర్మన్ నరసింహయాదవ్, నాయకుడు పులివర్తి నానిలను వేదికపైకి పిలవకపోవడంతో వారు సభ నుంచి అలిగి వెళ్ళిపోయారు. అలాగే భువనేశ్వరి ప్రసంగం పేలవంగా… — YSR Congress Party (@YSRCParty) October 26, 2023 -
CBN Arrest: ‘క్యాంపెయిన్‌గా జడ్జిలను ట్రోల్ చేశారు’
సాక్షి, గుంటూరు: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత.. ఆయన పిటిషన్లను విచారించిన జడ్జిలపై రాజకీయపరంగా.. ఉద్దేశపూర్వకంగానే దూషణల పర్వం కొనసాగిందని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఏపీ హైకోర్టులో ఇవాళ క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో.. టీడీపీ నేత బుద్దా వెంకన్న, గోరంట్ల బుచ్చయ్య చౌదరీ సహా 26 మందికి నోటీసులు జారీ చేయాలని బుధవారం హైకోర్టు ఏపీ డీజీపీని ఆదేశించింది. క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. ‘‘క్యాంపెయిన్‌గా జడ్జిపై ట్రోలింగ్ చేశార’’ని అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. ఇద్దరు హైకోర్టు జడ్జీలు, ఏసీబీ జడ్జి ఫ్యామిలీ టార్గెట్‌గా ట్రోలింగ్ నడిచిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. దీంతో ట్రోల్ చేసిన సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి.. ఆ 26 మందికి నోటీసులు ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. తదుపరి చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ.. నాలుగు వారాలకు పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది హైకోర్టు. యెల్లో బ్యాచ్‌తో పాటు చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైకోర్టు, దిగువ కోర్టు జడ్జిలపై దూషణల పర్వం కొనసాగింది. టీడీపీ నేతలు, చంద్రబాబు సానుభూతి పరులు న్యాయవ్యవస్థపై దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తులపై నిందలు, ఆరోపణలు, విమర్శలు చేసింది పచ్చ మీడియా. దీంతో ఈ వ్యవహారంలో బుద్దా వెంకన్న సహా 26 మంది ప్రతివాదులుగా చేర్చింది ప్రభుత్వం. బుద్దా వెంకన్నతో పాటు ఎస్. రామకృష్ణ, మరికొన్ని సోషల్ మీడియా పేజీల నిర్వాహకులకు పరిశీలన తర్వాత నోటీసులు జారీ కానున్నాయి. అలాగే ప్రతివాదులుగా ఉన్న గూగుల్, ఎక్స్(ట్విటర్), ఫేస్‌బుక్‌కు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. మహాదారుణంగా.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచింది. కోర్టులో 10 గంటల వాదనల తరువాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది. ఆపై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు కొట్టేసింది. అయితే ఈ తీర్పులను ఇచ్చిన జడ్జీలను సామాజిక మాధ్యమాల వేదికగా వికృత రూపాల్లో తూలనాడుతూ పోస్టులు వెల్లువెడ్డాయి. రాష్ట్రపతి కార్యాలయం స్పందన మరోవైపు జడ్జీలపై అభ్యంతరకర పోస్టులపై రాష్ట్రపతి భవన్ పై స్పందించి పోస్ట్ లు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ రాసింది. తదనంతరం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. -
సోషల్ మీడియా ట్రోల్స్ చాలా ఇబ్బంది పెట్టాయి: రితికా
రితికా సింగ్.. ముందు క్రీడాకారిణిగానే తెలుసు! తర్వాతే నటిగా పరిచయం. ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఎంట్రీ ఇచ్చిన ఆమె గురించి కొన్ని మాటలు. ► మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. ► ఒకరోజు ఆమెను చూసిన దర్శకురాలు సుధా కొంగర తన దర్శకత్వంలోని ‘ఇరుది సుట్రు’లో అవకాశమిచ్చారు. ఈ చిత్రాన్నే తెలుగులో ‘గురు’, హిందీలో ‘సాలా ఖడూస్’గా రీమేక్ చేశారు. ► తెలుగు, తమిళ, హిందీలో తెరకెక్కిన ఈ చిత్రంలో రితికా బాక్సర్ పాత్రను పోషించింది. ఆమె నటనకు మూడు భాషల్లోనూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతోపాటు మరెన్నో అవార్డులు వరించాయి. ► తర్వాత రాఘవ లారెన్స్ ‘శివలింగ’, ‘నీవెవరో’, ‘ఓ మై కడవులే’, ‘ఇన్కార్’ సినిమాల్లో నటించింది. ► ‘స్టోరీ ఆఫ్ థింగ్స్’ వెబ్ సిరీస్‌తో వెబ్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ► మళ్లీ చాలారోజుల తర్వాత ‘కింగ్ ఆఫ్ కొత్త’తో వెండితెర మీదా మెరిసింది. ఒకప్పుడు సోషల్ మీడియా ట్రోల్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవి. నేను కోరుకునేది ఒక్కటే ఆడవారిని అందరూ గౌరవించాలి. మిడిల్ క్లాస్ అయినా.. సెలబ్రిటీ అయినా సమానంగా చూడాలి. అమ్మాయిలకు కచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ రావాలి! – రితికా సింగ్ View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) చదవండి: విక్రమ్- ప్రశాంత్ విభేదాలు ఈనాటివి కావు.. వారిద్దరి మధ్య ఉన్న రక్తసంబంధం ఏంటి? -
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ : ప్రత్యర్థుల దారుణమైన ట్రోలింగ్
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్దిగ్గజం యాపిల్‌పై మరోసారి ట్రోలింగ్‌కు దిగింది. అమెరికాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈవెంట్లో ఐఫోన్ 15 సిరీస్‌ను తాజాగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగానే యూఎస్బీ-సీ పోర్ట్‌తో లాంచ్ తాజా ఐఫోన్లను ఎద్దేవా చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది శాంసంగ్. ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్రో యుఎస్బి-సి పోర్ట్‌లపై దారుణంగా ట్రోల్ చేస్తోంది శాంసంగ్. దీనికి మరో స్మార్ట్ఫోన్దిగ్గజం వన్‌ప్లస్ కూడా తోడైంది. అలాగే మరికొన్ని డిజిటల్ ప్లాట్‌ఫాంలు కూడా యాపిల్‌పై విమర్శలకు దిగాయి. ఎట్టకేలకు మనం ఒక మాజికల్ చేంజ్‌ను (సీ) చూస్తున్నా అంటూ పోరక్షంగా ట్వీట్ చేసింది. అయితే ఇక్కడ కొంతమంది యూజర్లు యాపిల్‌కు మద్దతుగా నిలవడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా కాలంగా USB-Cని ఉపయోగి స్తున్నాయి. నిజానికి, యాపిల్ఇపుడు యూఎస్బీ-సీ స్విచ్ చేయడానికి ఏకైక కారణం, 2024 నుంచి యూరోపియన్ యూనియన్ ఇప్పుడు అన్ని స్మార్ట్ఫోన్లు USB-C ని మాండేటరీ చేసింది. కాగా USB-Cతో Apple Watch Series 9, Airpods Proతో పాటు iPhone 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్ 15 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 79,900 నుండి ప్రారంభం. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, iPhone 15 Pro 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,34,900 గాను నిర్ణయించింది. ఇక iPhone 15 Pro Max 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 1,59,900 నుండి ప్రారంభం.స్మార్ట్‌ఫోన్ సెక్టార్లో శాంసంగ్, యాపిల్ మధ్య పోటీ గత దశాబ్ద కాలంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫోల్డబుల్ ఫోన్ లేదంటూ గత ఏడాది కూడా శాంసంగ్ యాపిల్‌పై విమర్శలు గుప్పించింది. Apple announcing USB-C… pic.twitter.com/KIzXQFIzMx — OnePlus_USA (@OnePlus_USA) September 12, 2023 -
కిందపడ్డ ఎంగిలి మెతుకులు తిన్న రైతుబిడ్డ.. బయటేమో మరోలా..
అన్నా.. రైతుబిడ్డ అన్నా.. ఒక రైతు సాధించలేనిదంటూ ఏదీ ఉండదు అని నిరూపించాలనుకుంటున్నా అన్నా.. అంటూ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. గ్రేట్.. అందరూ కలలు కంటారు, కానీ కొందరే దాన్ని నిజం చేసుకుంటారు. పల్లవి ప్రశాంత్ రెండో కేటగిరీలోకి వస్తాడు. ఎంతమంది ఎన్ని మాటలన్నా బిగ్‌బాస్ మాటనే జపం చేస్తూ పోయాడు. ఎలాగైనా ఈ సీజన్లో అడుగుపెట్టాలని కంకణం కట్టుకున్నాడు. చివరికి బిగ్‌బాస్ టీమ్ అతడికి ఆఫర్ ఇచ్చింది. ఏడో సీజన్లోకి అతడిని ఆహ్వానించింది. రైతు పడే కష్టాలు ఎలా ఉంటాయో బిగ్‌బాస్ ద్వారా అందరికీ తెలియజేస్తానన్నాడు ప్రశాంత్. కానీ హౌస్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి రతికతో పులిహోర కలుపుతూ తెగ సిగ్గుపడిపోతున్నాడు. అయితే టాస్కులో మాత్రం తగ్గేదేలే అన్న లెవల్లో ఆడుతూ తాను అందరికీ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. తాజాగా అతడు హౌస్‌లో ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. హౌస్‌లో ఎవరో తిన్నప్పుడు కింద మెతుకులు పడటం గమనించాడు ప్రశాంత్. అది చూసిన అతడు ఎవరూ లేనప్పుడు అక్కడికి వెళ్లి ఆ రెండు,మూడు ఎంగిలి మెతుకులు ఏరి.. కెమెరాలకు చూపిస్తూ తిన్నాడు. అన్నం పడేస్తే తాను తట్టుకోలేనట్లుగా ప్రవర్తించాడు. ఇది కొంచెం ఓవర్‌గా ఉందని జనాలు అనుకున్నారో లేదో అంతలో మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇక్కడ ప్రశాంత్ తన ప్లేటులో తినగా మిగిలిపోయిన కూరను, కొంత అన్నాన్ని చెత్తబుట్టలో పడేశాడు. ఇది చూసిన జనాలు అవాక్కయ్యారు. అన్నం పడేయొద్దంటూ హౌస్‌లో ఎంగిలి మెతుకులు తిన్నావు, బయటేమో నీ ప్లేటులోని అన్నం మెతులకు చెత్తలో పడేశావు.. ఇంత ఓవరాక్టింగ్ అవసరమా? అని తిడుతున్నారు.. View this post on Instagram A post shared by MALLA OCHINA (@pallaviprashanth_) చదవండి: బేబి పెళ్లికొడుకు.. రియల్ లైఫ్‌లోనూ బేబి స్టోరీ.. మూడు బ్రేకప్‌లు.. సూసైడ్ ఆలోచనలు.. -
వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్లో ఉందా?
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే యాంకర్ అనసూయ భరద్వాజ్ గుక్కపెట్టి ఏడ్చింది. తన బాధనంతా కన్నీళ్ల రూపంలో వ్యక్తపరుస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పైకి స్ట్రాంగ్ లేడీగా కనిపించే అనసూయ మనసులో ఇంత బాధ ఉందా? అసలేం జరిగింది? ఎందుకు ఇంతలా ఏడుస్తోంది? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటిది కాదని, ఐదు రోజుల క్రితంది అని పేర్కొంది అనసూయ. ఆ సమయంలో తన బాధను వ్యక్తీకరించిన క్షణాలను గుర్తుపెట్టుకునేందుకే ఈ వీడియో రికార్డు చేసినట్లు పేర్కొంది. సోషల్ మీడియా ఉన్నది దేనికి? అనసూయ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో 'హలో అందరికీ.. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా పోస్ట్ చూసి మీరందరూ ఎంతో గందరగోళానికి గురై ఉంటారు. ఇకపోతే నాకు తెలిసినంతవరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అనేవి సమాచారాన్ని పంచుకునేందుకే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సరే ఒకరితో ఒకరు కనెక్ట్ అవడానికి, ఒకరి కోసం ఒకరం ఉన్నామని చెప్పడానికి, విజ్ఞానాన్ని పంచుకోవడానికి, జీవన విధానాలను, సాంప్రదాయాలను, సంతోషాలను షేర్ చేసుకునేందుకే సోషల్ మీడియా ఉంది. ఆశ్చర్యమేంటంటే.. నిజంగా అదే జరుగుతోందా? సంతోషాన్ని షేర్ చేసుకున్నా.. ఇప్పుడు బాధను.. ఈ పోస్ట్ ఎందుకు వేశానంటే.. నేను ఏ ఫోటోషూట్ చేసినా, సరదాగా ఫోటోలు తీసుకున్నా, డ్యాన్స్ చేసినా, నవ్వుకున్నా, కౌంటర్స్ ఇచ్చినా.. ఏం చేసినా మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే అవన్నీ నా జీవితంలో భాగమే.. నా జీవితంలో బాధాకరమైన క్షణాలు కూడా ఉన్నాయి. అప్పుడు నేను బలహీనమైపోయి, కుమిలిపోయి ఏడ్చాను. దాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నా లైఫ్‌లో ఇటువంటి రోజులు కూడా ఉన్నాయని మీరు తెలుసుకోవాలనుకున్నాను. స్ట్రాంగ్‌గా ఉందామనుకున్నా.. కానీ.. మానవ జీవితం అన్నాక అన్నీ ఉంటాయి. ఒక సెలబ్రిటీగా నేను ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రయత్నించాను. ఏవీ పట్టించుకోనక్కర్లేదని భావించాను. వీలైనంతవరకు స్ట్రాంగ్‌గా ఉండాలనే ప్రయత్నించాను. అలా ఉండటమే అసలైన బలం అనుకున్నాను, కానీ అది నిజం కాదు. ప్రస్తుతం నా బాధను వ్యక్తపరచడమే నా అసలైన బలం. నా బాధనంతా కన్నీళ్ల రూపంలో బయటకు వెళ్లనిచ్చి తిరిగి చిరునవ్వుతో లేచి నిలబడతాను. ప్రతిదానికీ సర్దుకుపోవడం అంత ఈజీ కాదు. దయచేసి అలా చేయొద్దు అందరినీ నేను కోరుకునేది ఒక్కటే.. దయచేసి సహృదయంతో మెదలండి. అవతలివాళ్లు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడి వారిని ఇంకా బాధించవద్దు. కాస్త ఆలోచించండి. ఈ వీడియో ఐదు రోజుల క్రితానిది. ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నాను' అని అనసూయ రాసుకొచ్చింది. కాగా అనసూయ ఇటీవల తన భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో భర్తతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. అయితే ఆమె ఏం చేసినా తిట్టడమే పనిగా పెట్టుకున్నారు ట్రోలర్స్. ఈ క్రమంలోనే తను చాలా అప్సెట్ అయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) చదవండి: దెబ్బేసిన భోళా.. ఆగస్టు 22 కోసం మెగా ఫ్యాన్స్ వెయిటింగ్! ఎనీ సర్ప్రైజ్.. -
చంద్రబాబు చర్యలు ఊహాతీతం!
‘‘లైట్ వేసి చూపించండి. అందరూ సంఘీభావంగా ఒక్క నిమిషం లైట్ వేయండి. సెల్ఫోన్లు అందరూ కూడా ఆన్ చేయాలి. ఏం తమ్ముళ్లూ.. ఆకాశంలోని నక్షత్రాలు వెలిగిపోతున్నాయి మన టార్చ్ లైట్లతో. అది టెక్నాలజీ స్టింట్. ఇది కూడా ఇంట్రెడ్యూస్ చేసింది నేనే’’ ‘అంటే..’.. యస్ సెల్ఫోన్లో టార్చ్‌లైట్‌ను కనిపెట్టంది బాబుగారే అన్నమాట. నలభై ఏళ్లకు పైగా రాజకీయానుభవం. నోరు తెరిస్తే.. హైదరాబాద్‌ను కట్టించింది నేనే.. కంప్యూటర్ను తెప్పించింది నేనే అంటూ టెక్నాలజీ పితామహుడిలా ఉపన్యాసాలు దంచే చంద్రబాబుగోరు.. తాను మీమ్ స్టఫ్‌గా మారతానని ఏనాడూ ఊహించి ఉండరేమో!. ఓవైపు కుళ్లు రాజకీయాలు ప్రదర్శించడమే కాదు.. తన సీరియస్ కామెడీతో విపరీతంగా నవ్వించగలనని నిరూపించుకుంటూ పోతున్నారాయన. Technoooooology..#chandrababunaidu #cbn #coffeeinachaicup #ccc #politics #tdp #naralokesh #narabrahmani #telugudesamparty #andhrapradesh #TrendingNow pic.twitter.com/snzZ3YxbqV — Coffee in a Chai Cup (@coffeeinachaic1) August 17, 2023 ఒకటి కాదు.. రెండు కాదు.. వరుసపెట్టి స్టేట్మెంట్లు ఇస్తూ పోతున్నారు. ఇదేం రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న పని కాదు.. వరుసగా తాను చేస్తున్న ప్రకటనలతో మీమర్స్‌కు చేతి నిండా పని దొరుకుతుండగా.. తెలుగుతమ్ముళ్లు సైతం ఆ కామెడీని యమాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. ఆ గోలనే ఆయన పొగడ్తలు అనుకుంటున్నారేమో.. రెచ్చిపోయి మరీ స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. ఆయన ఎంటో ఆ రాఖీ నీ పూజించడం ఎంటో 🤧🤧😂#ChandraBabu #EndOfTDP #YuvaGalam #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/lE8eai5dP5 — Harsha💥 (@Harsha88889) August 18, 2023 బీకాంలో ఫిజిక్స్ స్టేట్మెంట్కు తానేమీ తీసిపోనని చెబుతూ.. బైపీసీలో ఇంజినీరింగ్ కామెంట్ చేశారు. ఆ వెంటనే 45 రోజుల రాఖీ పూజలతో బాబా అవతారం ఎత్తి.. ఫన్నీగా ట్రోల్ అయ్యాడు. మరోసారి గ్యాప్ ఇవ్వకుండానే.. సెల్‌ఫోన్.. దాని టార్చ్‌లైట్‌ను కనిపెట్టింది తానేనంటూ బాబుగోరు.. మరొకటి ఏసేశారు. నలభై ఏళ్ల పైన ఉమ్మడి రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ సుపరిచితుడైన బాబుగారు.. ఇప్పుడెలా అయ్యారసలు?. నవ్వుకోవాలో.. జాలిపడాలో అర్థం కావడం లేదు. అధికారం కోల్పోవడం.. కొడుకు లోకేశం దమ్ము లేక ‘దద్దమ్మ’ ట్యాగ్ తగిలించుకోవడం, దత్తపుత్రుడి దగ్గర సరైన మ్యాటర్ లేకపోవడంతో.. చంద్రబాబుకు మతి భ్రమించి ఉండొచ్చు అనే పొలిటికల్ కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. యస్.. చంద్రబాబు లాంటి సీనియర్ పొలిటీషియన్ చేస్తున్న చేస్తున్న వ్యాఖ్యలు విన్న జనాలు నవ్వుకుంటున్నారు. తమ అధినేత ఇలా అయిపోయారేంటని టీడీపీ కార్యకర్తలు సైతం ఫీలవుతున్నారు. అధికారం కోసం హామీలు ఇచ్చి.. వాటిని అమలు చేయకుండా ఏళ్లపాటు ప్రజల్ని మోసం చేసిన విజనరీ బ్లఫ్‌మాస్టర్ చంద్రబాబు. అధికార దాహంతో తల్లడిల్లితున్న ఆ పెద్దమనిషి.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చేసే ప్రయత్నాలు(కుట్రలు) ఫలించడం లేదు. ఇలాంటి తరుణంలో బాబుగారి ఈ కొత్త విజన్ భరించడం మాత్రం మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటున్నారు జనం. -
బాబు కొత్త అవతారం..
-
బాబు కొత్త అవతారం.. ఫ్రీగా వరాలిస్తున్న చంద్రం బాబా..
టీడీపీ అధినేత చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడంలేదనే రంది ఎక్కువైంది. దీంతో, ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తెలియక.. ఏదేదో మాట్లాడేస్తున్నాడు. అయినప్పటికీ ప్రజల నుంచి స్పందన కరువవడంతో ఈసారి కొత్తగా ప్రయత్నించాడు చంద్రబాబు. ఏకంగా బాబా అవతారమెత్తాడు చంద్రం బాబా. ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను 45 రోజులుగా కొన్ని రాఖీలకు పూజలు చేస్తున్నాని చెప్పుకొచ్చాడు. ఆ శక్తివంతమైన రాఖీలను వారికి పంపిస్తానన్నాడు. అవి కట్టుకుంటే కష్టాలు తీరిపోతాయని హామీ ఇచ్చాడు. మీ అందరికీ నేను అండగా ఉంటాను అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. 45 రోజుల చంద్రం బాబా వచ్చాడు.. అంటూ ఫన్నీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: భారీ ప్రాజెక్టులపై నమ్మకమే లేని బాబు.. దాన్ని దాచిపెట్టి మరీ..! -
బైపీసీతో ఇంజినీరింగ్.. బాబుపై పేలుతున్న మీమ్స్
ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్లో బైపీసీ చేయాలంటూ ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే బాబు మరోసారి తన అజ్జానాన్ని ప్రదర్శించి పరువును దిగజార్చుకోవడంతో ఇదెక్కడి విజనరీ బాబు అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడేసుకుంటున్నారు. ఇదేనా మీ విజనరీ పాఠాలు అంటూ ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అప్పుడెప్పుడో టీడీపీ నేత జలీల్ ఖాన్.. బీకామ్ లో ఫిజిక్స్ అంటూ బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు.. ఇంటర్లో ఇంజినీరింగ్, ఇంజినీరింగ్ కోసం బైపీసీ అంటూ హైలెట్ అయ్యారు. ప్రసంగాల్లో నేతలు తడబడటం సహజమే కానీ, మరీ ఇలా విజన్ -2047 అంటూ దేశానికే దిశా నిర్దేశం చేసేలా ప్రసంగం మొదలు పెట్టిన చంద్రబాబు ఇంటర్లో ఇంజినీరింగ్ అంటూ బుక్కయిపోవడం మాత్రం విశేషం. కాగా ఆగస్టు 15 సందర్భంగా విశాఖపట్నంలో "ఇండియా విజన్ 2047" డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. తన విజన్ గురించి వివరించే సమయంలో.. ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలి.. ఇంజినీరింగ్ చేయాలంటే ఇంటర్మీయట్‌లో బైపీసీ చేయాలి.. అని వివరిస్తూ పప్పులో కాలేశారు. చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్ సోషల్ మీడియాలో చంద్రబాబుపై పేలుతున్న మీమ్స్ ఇవే... ⬇️ -
చెప్పులేసుకుని జెండా ఎగరేసిన హీరోయిన్.. వీడియో వైరల్
పంద్రాగస్టు రోజున స్కూలు, కాలేజీలు, కార్యాలయాలే కాకుండా ప్రతి ఇంట జెండా ఎగరేశారు. హర్ ఘర్ తిరంగా పేరిట చాలామంది ఇళ్లల్లో జెండా రెపరెపలాడింది. బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా ఈ ట్రెండ్‌లో పాలు పంచుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ముంబైలోని జుహులో తన ఇంటి ముందు జెండాను ఎగరేసింది. ఈ క్రమంలో ఆమె చెప్పులు ధరించే జాతీయ పతాకాన్ని ఎగరవేసి జెండావందనం చేసింది. ఈ వీడియోను శిల్పా శెట్టి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. చెప్పులేసుకుని ఫ్లాగ్ ఎగరేయడమేంటి? కాస్తైనా బుద్ధుండక్కర్లా? అని మండిపడ్డారు. నీ చెప్పులు పక్కన విడిచి ఆ పని చేస్తే బాగుండేది అని సెటైర్లు వేశారు. అయితే కొందరు మాత్రం చెప్పులు వేసుకుని జెండా ఎగరేయడంలో తప్పే లేదని హీరోయిన్ను వెనకేసుకొచ్చారు. ఈ ట్రోలింగ్ చూసిన శిల్పా.. త్రివర్ణ పతాకాన్ని ఎగరేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై తనకు పూర్తి అవగాహన ఉందని కౌంటరిచ్చింది. చెప్పులేసుకోకూడదన్న నియమం ఫ్లాగ్ కోడ్‌లో ఎక్కడా లేదంటూ గూగుల్‌లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ షేర్ చేసింది. 'ఇలా పనిగట్టుకుని విమర్శలు చేసేవాళ్లను నేనసలు పట్టించుకోను. మీ అజ్ఞానాన్ని ప్రచారం చేయడం, నిత్యం విమర్శించడమే పనిగా పెట్టుకోవడం మెచ్చుకోదగిన విషయం కాదు. ముందు మీరు వాస్తవాలు తెలుసుకుని అప్పుడు మాట్లాడండి' అని ఘాటుగా బదులిచ్చింది. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) చదవండి: రెండేళ్లకే విడాకులు.. హీరోయిన్ జీవితంలో ఇంత విషాదం దాగి ఉందా? -
ఆ ఒక్క మాట జీవితాన్ని మార్చేసింది.. జాక్‌పాట్ కొట్టిన యువతి
ట్విటర్(ఎక్స్.కామ్)లో ట్రోలింగ్‌కు గురైన ఓ యువతి జాక్‌పాట్ కొట్టేసింది. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వెంటనే తమ సంస్థలో పనిచేసేందుకు ఆహ్వానం పంపారు ట్రూ కాలర్ సీఈవో అలాన్ మామెడి భారత్‌కు చెందిన ఏక్తా అనే యువతి కెనడాలో బయోటెక్నాలజీ విభాగంలో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ యువతి తన స్నేహితులతో సరదా గడిపేందుకు భయటకు వచ్చారు. అదే సమయంలో ఏక్తాకు ఓ యుట్యూబర్ మీ పేరు? ఎక్కడ నుంచి వచ్చారు? కెనడాకు ఎందుకు వచ్చారు?ఏం చదువుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అందులో సదరు యూట్యూబర్ ఇక్కడికి ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు ఏక్తా.. ‘భారత్‌ను వదిలి రావడం నా కల’ అంటూ బదులిచ్చారు. ఆమె అర్ధం.. బాగా చదువుకుని కెనడాలో వ్యాపార వేత్తగా ఇక్కడే స్థిరపడాలని అనుకుంటున్నాని చెప్పారు. కానీ ఆమె స్పందనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని వదిలేయడం నీ డ్రీమా అంటూ ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ ట్రోలింగ్‌పై ట్రూల్ కాలర్ సీఈవో అలాన్ మామెడి స్పందించారు.‘బయటి ప్రపంచం ఏమంటుందో వాటిని నువ్వు వినొద్దు అని ట్వీట్ చేశారు. చదువు పూర్తి చేసిన తర్వాత ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ట్రూ కాలర్ కార్యాలయంలో పనిచేసేందుకు స్వాగతం అంటూ జాబ్ ఆఫర్ ఇచ్చారు. ‘‘మీరు ఆమె మాటల్ని అపార్ధం చేసుకున్నారు. ట్రోలింగ్ చేయడం సరికాదు. ఏక్తా!! నిన్ను ఎగతాళి చేస్తున్న వారిని గురించి అస్సలు పట్టించుకోవద్దు. నువ్వు కూల్‌గా ఉండు. నీ కలల్ని నెరవేర్చుకునే దిశగా..వాటితోనే కలిసి జీవిస్తున్నావు. చదువు పూర్తి చేయ్ ట్రూ కాలర్ పనిచేసేందుకు మిమ్మల్ని స్వాగతిస్తున్నా అని పేర్కొన్నారు. ఏక్తాపై మామెడి ట్వీట్‌కు మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కొందరు అతని మాటలను ప్రశంసించగా, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూలో ఆమె ఏమన్నారో మీరూ చూసేయండి. People really want to misunderstand her to make fun of her. This is not OK!! Ekta, don't listen to all these clowns making fun of you. I think you're cool and living the dream! When you're done with school, you're welcome to work at Truecaller in any of our offices around the 🌏 https://t.co/PuotNAMwKK — Alan Mamedi (@AlanMamedi) August 3, 2023 -
ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ప్రాజెక్ట్ K'. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్టర్ కావడం, గత కొన్నేళ్లుగా ఈ చిత్రం సెట్స్ మీద ఉండటంతో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. కానీ బుధవారం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో అవన్నీ కాస్త తారుమారు అయ్యాయి అనిపించింది. ఎందుకంటే ప్రభాస్ లుక్‌పై ఘోరంగా ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఈ ఫస్ట్ లుక్‌లో ప్రభాస్ ఐరన్ మ్యాన్ పోజులో కనిపించాడు. అది ఓకే గానీ ఆ తల వేరే ఎవరో బాడీకో అతికించినట్లు ఉందని స్వయానా అభిమానులే నిరుత్సాహపడ్డారు. సోషల్ మీడియాలో 'ప్రాజెక్ట్ K' టైప్ చేసి సెర్చ్ చేయండి మీకే విషయం అర్థమైపోతుంది. ఇవన్నీ మేకర్స్ దృష్టిలో పడినట్లున్నాయి. దీంతో అధికారికంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌ని సోషల్ మీడియా ఖాతాల నుంచి డిలీట్ చేశారు. (ఇదీ చదవండి: ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్) అయితే ఇలా డిలీట్ చేసిన ఫస్ట్ లుక్ బదులు ఎలాంటి గ్రాఫిక్స్, పేర్లు లేకుండా ఉన్న అదే పోస్టర్ని పోస్ట్ చేశారు. గ్లింప్స్ వీడియో కోసం రెడీ అయిపోండి అని ట్వీట్ పెట్టారు. ఈ విషయం నిజమా కాదా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చదివిన తర్వాత 'ప్రాజెక్ట్ K' నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విట్టర్లోకి వెళ్లి చూడండి. మీకే క్లారిటీ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ట్రోలింగ్ ఎక్కువ కాకుడదనే ఉద్దేశంతోనే ఇలా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. మేకర్స్ తీసేసినా సరే ఆ ఫొటో ఇప్పటికీ ఎప్పటికీ అందుబాటులోనే ఉంటుంది. ఈ జాగ్రత్త ఏదో ముందు ఉంటే బాగుండేదని పలువురు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక 'ప్రాజెక్ట్ K'లో ప్రభాస్ తోపాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. Our Raiders are ready to conquer @Comic_Con today! 💥#ProjectK #WhatisProjectK #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms pic.twitter.com/t8TKs2GbVf — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023 (ఇదీ చదవండి: Hidimba Review: ‘హిడింబ’ మూవీ రివ్యూ) -
ఇదేం ఫస్ట్ లుక్! 'ప్రాజెక్ట్ K'పై ఘోరమైన ట్రోల్స్
Prabhas Project K First Look Trolls: డార్లింగ్ ప్రభాస్ గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న హీరో. దీంతో ప్రస్తుతం అలాంటి భారీ బడ్జెట్ సినిమాలే చేస్తున్నాడు. అయితే ప్రభాస్ కొత్త చిత్రాల అప్డేట్స్ అంటే ఎలా ఉండాలి. చూసే ప్రతిఒక్కరి మైండ్ బ్లాంక్ అయిపోవాలి. కట్ చూస్తే.. నిజంగానే అందరి బుర్ర తిరిగిపోతోంది. అయితే అది రివర్స్‌లో. ఇలా చెప్పడానికి 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్‌తోపాటు చాలానే కారణాలున్నాయి. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టాలీవుడ్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. దానికి కారణం ప్రభాస్, రాజమౌళి అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. 'బాహుబలి' సినిమాతో నటుడిగా ప్రభాస్, డైరెక్టర్‌గా రాజమౌళి బోలెడంత క్రేజ్ అందుకున్నారు. రాజమౌళి ఆస్కార్ రేంజుని అందుకున్నాడు. ప్రభాస్ కెరీర్ మాత్రం అంతంత మాత్రంగానే సాగుతోంది. కరెక్ట్ గా చెప్పాలంటే డైరెక్టర్స్ అతడితో ఆడేసుకుంటున్నారా అనే డౌట్ వస్తోంది. (ఇదీ చదవండి: సితార ఫస్ట్ యాక్టింగ్ వీడియో.. తండ్రినే మించిపోయేలా!) ఎందుకంటే 'బాహుబలి' తర్వాత 'సాహో' చేశాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఆ సినిమా పర్వాలేదనిపించింది. కాకపోతే ప్రభాస్ రేంజ్‌కి తగ్గ మూవీ కాదని అప్పట్లో అభిమానులు మాట్లాడుకున్నారు. కాస్త కేర్ తీసుకుని ఉండాల్సిందని అన్నారు. దీని తర్వాత 'రాధేశ్యామ్' వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఓకే అనిపించినా.. ఆ తర్వాత ప్రభాస్ లుక్స్ విషయంలో విమర్శలు వచ్చాయి. ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ వచ్చాయి గానీ ప్రేక్షకుల్ని ఎందుకో అలరించలేకపోయింది. ఈ మధ్య వచ్చిన 'ఆదిపురుష్' గురించి మీకు కొత్తగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఈ మూవీకి అయితే ఫస్ట్ లుక్ నుంచి థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత కూడా ఘోరమైన ట్రోలింగ్ జరిగింది. 'సలార్' టీజర్‌తో అభిమానుల కాస్త తేరుకున్నప్పటికీ... ఇప్పుడు 'ప్రాజెక్ట్ K' ఫస్ట్ లుక్ వాళ్లని మరోసారి డిసప్పాయింట్ అయ్యేలా చేసింది. ఐరన్ మ్యాన్ పోజులో ఉన్న ఈ లుక్‌లో ప్రభాస్ తల వేరే ఎవరి శరీరానికో అతికించినట్లు ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే 'మహానటి' లాంటి టిపికల్ స్క్రిప్ట్‌ని తీసిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి డైరెక్టర్ కావడం, ఒక్క లుక్‌తో మూవీ స్టేటస్ ఎలా డిసైడ్ చేస్తారు అనేది సినిమా లవర్స్ వాదన. ఇంకా 'ప్రాజెక్ట్ K' టైటిల్ కూడా రివీల్ చెయ్యలేదు. ప్రస్తుతం చిత్రబృందం అమెరికాలో ఉంది. గురువారం జరిగే కామికాన్ ఈవెంట్లో టైటిల్ ఏంటనేది బయట పెట్టబోతున్నారు. అలాగే ఈ సినిమా నుంచి గ్లింప్స్ వీడియో వస్తుంది. అవి ఈ సినిమా గురించి పూర్తి డీటైలింగ్ ఇస్తాయి. ఏది ఏమైనా ఈ మధ్య ప్రభాస్ ప్రతి సినిమా ప్రమోషనల్ మెటీరియల్, ఫస్ట్ లుక్ లాంటివి ఫ్యాన్స్‌ని నిరాశపరుస్తుండటం కాస్త వింతగా అనిపిస్తుంది. The Hero rises. From now, the Game changes 🔥 This is Rebel Star #Prabhas from #ProjectK. First Glimpse on July 20 (USA) & July 21 (INDIA). To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/oRxVhWq4Yn — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023 (ఇదీ చదవండి: Project K: దీపికా పదుకోన్ ఫస్ట్ లుక్ వచ్చేసింది) -
భర్తకు పాదపూజ చేసిన హీరోయిన్.. విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్
హీరోయిన్ ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆకట్టుకునే కళ్లతో పాటు అంద,చందాలతో తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'రభస', 'డైనమైట్', ‘అత్తారింటికి దారేది’లాంటి చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పింది. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘భీమన అమావాస్య’సందర్భంగా అనవాయితీ ప్రకారం నా భర్తకు పాదపూజ చేశాను. ప్రతి ఏడాది ఇలానే చేస్తాను. ఆ ఫోటోలను షేర్ చేసినందుకు గతంలో కూడా నేను విమర్శలు ఎదుర్కొన్నాను. అలా నన్ను ట్రోల్ చేసేవారికి ఇది పితృస్వామ్య రాజ్యంలా కనిపిస్తుందేమో కానీ నాకు మాత్రం ఈ పూజ సనాతన ధర్మంలో ఒక భాగమే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇలాంటి పూజలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎన్నో కథలు కూడా హిందూ పురాణాల్లో ఉన్నాయి. మన సంస్కృతిలో అందరి దేవతలను ఒకేలా పూజిస్తాం’అని ప్రణీత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. భీమన అమావాస్య కన్నడ నెల ఆషాడ (జూలై - ఆగస్టు)లో చంద్రుడు లేని రోజు (అమావాస్) నాడు జరుపుకుంటారు. ఈ రోజున మహిళలు తమ భర్తలు మరియు సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. ఈ ఆచారాన్ని దీపస్తంభ పూజ అని కూడా అంటారు. తుళునాడుకు ఇది పెద్ద పండగ. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాల్లో భీమన అమావాస్యను పెద్ద ఎత్తున జరుపుకొంటారు. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
నీకేమైనా పిచ్చిపట్టిందా? ఆ ఫోటో ఏంటి?: నటిపై నెటిజన్స్ ఫైర్
స్పెషల్ సాంగ్స్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకుంది బాలీవుడ్ నటి మలైకా అరోరా. మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌తో పలు చిత్రాలు నిర్మించిన ఆమె టీవీ షోలతో పాటు ఓటీటీలోనూ మెరుస్తోంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్‌తో ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె మలైకా పెళ్లెప్పుడన్నది మాత్రం చెప్పడం లేదు. తాజాగా ఆమె ప్రియుడి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నా లేజీ బాయ్(బద్ధకస్తుడు)' అంటూ అర్జున్ ఒంటిపై దుస్తులు లేని ఫోటోను వదిలింది. ఇది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. 'ప్రేమకు వయసుతో పని లేదు, సరే, మీ జీవితం మీ ఇష్టం.. కానీ ఒక టీనేజ్ పిల్లవాడికి తల్లయి ఉండి సోషల్ మీడియాలో ఇలాగేనా ప్రవర్తించేది? నువ్విలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ అబ్బాయి బయట తలెత్తుకుని ఎలా తిరుగుతాడు? ఎంతమంది అతడిని ప్రశ్నలతో గుచ్చిగుచ్చి చంపుతారు..' 'పాపం ఈమె చేసే చీప్ పనుల వల్ల అతడు తన స్కూల్ లేదా కాలేజీలో నవ్వులపాలు కావాల్సి వస్తోంది', 'అరె.. నీకేమైనా పిచ్చి పట్టిందా? మరీ హద్దు మీరుతున్నావు. ఇలాంటివి పోస్ట్ చేయడం అవసరమా?', 'సొంత కొడుకే తనతో ఎక్కువగా ఉండటానికి ఎందుకిష్టపడడో నాకిప్పుడు అర్థమవుతోంది', 'నీ బెడ్రూమ్ విషయాలు కూడా నెట్లో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు' అని ట్రోల్ చేస్తున్నారు. కాగా మలైకా మూవింగ్ ఇన్ విత్ మలైకా షోతో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. అటు అర్జున్ కపూర్ లేడీకిల్లర్ చిత్రంలో నటిస్తున్నాడు. చదవండి: హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది -
టీ-కాంగ్రెస్ లో ట్రోలింగ్ పంచాయతీ కంటిన్యూ
-
ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అలాంటి కామెంట్స్ చేశారు: కాజల్
ఇతర హీరోయిన్లకు నటి కాజల్ అగర్వాల్‌కు కాస్త వ్యత్యాసం ఉంది. నటనను విపరీతంగా ప్రేమించే నటి ఈ బ్యూటీ. బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఆ తరువాత కోలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్ ఈ మూడు భాషల్లోనూ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోలతో జత కట్టి స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది. అయితే అగ్రనటిగా రాణిస్తున్న సమయంలోనే ఎలాంటి హంగామా లేకుండా తను ప్రేమించిన వ్యక్తి గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమలహాసన్‌తో కలిసి ఇండియన్– 2 చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా తెలుగులో బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. చదవండి: చిన్నచిన్నవాటికే బాధపడేదాన్ని, అనుభవం చాలా నేర్పింది ఇలాంటి పరిస్థితుల్లో తనపై వచ్చిన విమర్శలకు స్పందించిన కాజల్ అగర్వాల్ ఒక భేటీలో పేర్కొంటూ తాను కడుపుతో ఉన్నప్పుడు చాలా లావు అయ్యానంటూ కొందరు విమర్శించానని వాటిని తాను పట్టించుకోలేదని పేర్కొంది. అలాగే బిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం కావడంపై కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేసింది. తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్ప తల్లిగా నిలిచి ఇలాంటి వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: నేను కూడా యూత్ అనిపించింది: హీరో నాని -
వెదవలకు అటెన్షన్ ఇస్తే ఇంకా రెచ్చిపోతారు : నిహారిక
సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని పట్టించుకోనని, కామెంట్స్‌ని కూడా చూడనని చెబుతోంది మెగా డాటర్ నిహారిక. నాలుగేళ్ల విరామం తర్వాత ఆమె నటిగా మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నారు. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన ‘డెడ్ పిక్సెల్స్’ వెబ్ సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. (చదవండి: ‘బంగారం' సినిమాలో చిన్నారి.. ఇంతలా మారిపోయిందేంటీ?) ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను ట్రోల్స్ చేసే వాళ్ల గురించి స్పందించింది. పని పాట లేనివాళ్లే ట్రోల్స్ చేస్తారని, అలాంటి వారి గురించి తాను పట్టించుకోబోనని చెప్పుకొచ్చింది. ‘మనం అవసరం లేనివాళ్లకి అటెన్షన్ ఇస్తాం. ప్రతి చోట ఇడియట్స్ ఉంటూనే ఉంటారు. వాళ్లను మనం పట్టించుకుంటే ‘నా వెదవతనం వల్ల ఇంత అటెన్షన్ ఇస్తున్నారు’ అనుకొని ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు. (చదవండి: శర్వానంద్ పెళ్లి ముహూర్తం ఫిక్స్.. వేదిక ఎక్కడంటే..) నా వరకు అయితే.. అలాంటి వాళ్లను అస్సలు పట్టించుకోను. నేను అంటే ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉన్నారు. నాకు ఇష్టమైన వాళ్లు కూడా ఉన్నారు. నాకు ఖాళీ సమయం దొరికితే వాళ్లకు కేటాయిస్తా. ఎవడో కోన్ కిస్కా గొట్టం గాడి గురించి నేను ఎందుకు పట్టించుకుంటా? ఒకప్పుడు సోషల్ మీడియాలో నాపై వచ్చే కామెంట్స్‌ను చూసేదాన్ని. కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ఎవడో ఏదో కామెంట్ చేస్తే నేను ఎందుకు చూడాలి. దాని వల్ల మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే సోషల్ మీడియా రూమర్స్ గురించి నేను పెద్దగా పట్టించుకోను’అని నిహారిక చెప్పుకొచ్చింది. -
టీ కాంగ్రెస్‌లో సొంత నేతలపైనే ట్రోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంటి దొంగల కదలికలు బయటపడుతున్నాయా?. సొంత నేతలను, అదీ సీనియర్లను బద్నాం చేసే కుట్రలు జరుగుతున్నాయా? సోషల్ మీడియాలో ట్రోలింగ్ రగడ వెలుగుచూసిన తరుణంలో ప్రస్తుతం ఈ అనుమానాలు తలెత్తుతున్నాయి. తనతో పాటు ఇతర నాయకులపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. తనపైనా, ఓ సీనియర్‌పైనా వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందంటూ మే 5వ తేదీన ఉత్తమ్‌కుమార్ పోలీసులను ఆశ్రయించారు. ఒక నెంబర్ నుంచే ఈ ట్రోలింగ్ జరుగుతోందని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఆ ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆ నెంబర్ భీమవరానికి చెందిన ఓ మహిళ పేరు మీద ఉందని గుర్తించారు. కానీ, ఆ నెంబర్ వాడిన లొకేషన్ మాత్రం ఉత్తమ్ ఇంటి సమీపంలోనే ఉంది. ఉత్తమ్ ఇంటి సమీపంలోని ఓ ప్లాట్ నుంచి ఈ తతంగం నడిచినట్లు పోలీసులు గుర్తించారు. చివరకు ఆ ప్లాట్ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ రూమ్ పేరు మీద ఉండడం, ఆ విభాగపు ఇంఛార్జి జయల ప్రశాంత్ తన టీంతో ఈ వ్యవహారం అంతా నడిపించినట్లు పోలీసులు ధృవీకరించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ వార్‌రూమ్‌లో సోమవారం పోలీసులు సోదాలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లు, డేటా సేకరించారు. ఐదు కంప్యూటర్లను, హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. ప్రశాంత్‌పై కేసు నమోదు మరోవైపు భట్టి విక్రమార్క ఇంట్లో జరిగిన సేవ్ కాంగ్రెస్ మీటింగ్‌లో కూడా ఆయన.. తనపైనా ఇదే తరహా ప్రచారం జరుగుతోందని అనుమానాలే వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ అనుమానాలు నిజం అయ్యాయి. తమ విచారణలో ప్రశాంత్ నేతృత్వంలో ఈ యాంటీ క్యాంపెయిన్ జరిగిందని సీసీఎస్ పోలీసులు తేల్చారు. అనుచిత పోస్టులతో ట్రోలింగ్‌కు పాల్పడినందుకుగానూ ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రేపు(బుధవారం) విచారణకు తమ ఎదుట హాజరుకావాలని సీసీఎస్ పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రశాంత్‌పై వేటు.. ఉత్తమ్‌కుమార్‌తో పాటు జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క్, మరికొందరు నేతలపైనా ఈ ట్రోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో అనుచిత పోస్టలు చేసినందుకుగానూ ప్రశాంత్‌పై పార్టీ వేటు వేసింది. అయితే.. ఈ పరిణామంపై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివనసేనారెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎవరో ఒకరు ట్వీట్ చేస్తే.. వార్‌రూమ్‌పై దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారాయన. ఈ వ్యవహారం ఇక్కడితోనే చల్లారుతుందా? లేదంటే ఇంకా ఎక్కడిదాకా అయినా వెళ్తుందా? అనే వేచిచూడాలి. -
ఓటమికి కారణం ఆ యాంకరే వామ్మో... వద్దు తల్లో అంటున్న ఫ్యాన్స్
-
బెడ్‌పై ఒకరు, మైండ్‌లో మరొకరు.. నిహారిక డైలాగ్పై ట్రోలింగ్
చాలాకాలం గ్యాప్ తర్వాత మెగా డాటర్ నిహారిక కొణిదెల మళ్లీ యాక్టింగ్ వైపు దృష్టి మళ్లించింది. ప్రస్తుతం ఆమె డెడ్ పిక్సెల్స్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ మే 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజవగా అందులో నిహారిక చెప్పిన డైలాగ్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గేమర్గా కనిపించిన నిహారిక ఆన్లైన్లో ఒకరిని ఇష్టపడుతుంది. ఆఫ్‌లైన్‌లో మరొకరిని ఇష్టపడుతుంది. ఇద్దరిలో ఎవరిని భాగస్వామిగా సెలక్ట్ చేసుకోవాలో అర్థం కాదు. ఆ సమయంలో 'నాకు బెడ్‌పై రోషన్ కావాలి.. కానీ మైండ్‌లో భార్గవ్ ఉన్నాడు (రోషన్ ఇన్ బెడ్.. భార్గవ్ ఇన్ ద హెడ్)' అని డైలాగ్ చెప్తుంది. ఇది చాలామందికి నచ్చలేదు. ఇలాంటి డైలాగులు అవసరమా? సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నావంటూ నిహారికను ఏకిపడేస్తున్నారు. మరి ఈ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో ఈ విమర్శలకు నిహారిక ఎలా చెక్ పెడుతుందో చూడాలి! ఇకపోతే నిహారిక కొంతకాలంగా విడాకుల రూమర్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. నిహారిక, ఆమె భర్త చైతన్య ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాక పెళ్లి ఫోటోలను సైతం డిలీట్ చేశారు. దీంతో వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. కానీ ఇంతవరకు దీనిపై అటు నిహారిక, ఇటు చైతన్య స్పందించనేలేదు. చదవండి: భార్యను దూరం పెట్టిన పూరీ జగన్నాథ్, ఎట్టకేలకు క్లారిటీ -
బ్రో నా కిడ్నీ తీసుకుంటావా?.. షారుక్ తనయుడిపై ట్రోలింగ్
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ సొంతంగా దుస్తుల బిజినెస్ ప్రారంభించాడు. డి యావోల్ ఎక్స్ పేరిట బ్రాండెడ్ బట్టలను విక్రయిస్తూ ఫ్యాషన్ పరిశ్రమలో అడుగుపెట్టాడు. అయితే ఆ దుస్తుల రేట్లు చూసి గుడ్లు తేలేస్తున్నారు నెటిజన్లు. ఒక్కో టీ షర్ట్ ధర రూ.22,000-24,000 మధ్య ఉంది. లెదర్ జాకెట్ ధర ఏకంగా రూ.2 లక్షలుగా నిర్ణయించారు. ఇతరత్రా హుడీలైతే రూ.45,000 పైనే ఉన్నాయి. అయినప్పటికీ అలా తను సేల్స్ ప్రారంభించాడో లేదో ఒక్క రోజులోనే అన్నీ అమ్ముడు పోవడం విశేషం. ఈ విషయాన్ని ఆర్యన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేశాడు. నెక్స్ట్ సేల్ కోసం రెడీగా ఉండండని పోస్ట్ చేశాడు. అయితే ఆ రేట్లు చూసి షాకైన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నాడు. 'దయచేసి నా కిడ్నీ తీసుకుంటారా?', 'ఓరి భగవంతుడా, నన్ను ఎందుకు ఇంత పేదవాడిగా పుట్టించావు. రూ.2 లక్షల జాకెట్ నాక్కూడా కావాలి', 'అయ్యో, రెండు ఎకరాలు అమ్మేసి డబ్బులు రెడీ చేసుకుంటే తీరా అన్నీ అమ్ముడుపోయాయని అంటున్నారే' అంటూ ట్రోల్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by @dyavol.x View this post on Instagram A post shared by Aryan Khan (@___aryan___) చదవండి: బాక్సాఫీస్‌ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలివే -
ట్రోలింగ్ సామాజిక జబ్బు!
సాక్షి, హైదరాబాద్: సెలెబ్రిటీలకే కాదు. క్రమంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామాన్యులకు సైతం ట్రోలింగ్ తప్పడం లేదు. ఎదుటి వారి ప్రతిష్టను సోషల్ మీడియాలో దెబ్బతీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు కొందరు శాడిస్టులు. మరికొందరేమో పిచ్చి, ‘పచ్చి..’వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తాము ఫేమస్ అయ్యేందుకు దిగజారుతున్నారు. వ్యూస్, లైక్, కామెంట్లు , షేర్లతో సొమ్ము చేసుకునేందుకు ఇంకొందరు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు పాల్పడుతున్న దుర్మార్గపు ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎదుటి వారికి ఎలాంటి సంబంధం లేని విషయాలను వారికి అంటగట్టి ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా కొందరు డబ్బు ఖర్చు చేసి మరీ ఇతరులతో ట్రోలింగ్‌లకు పాల్పడుతున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఎదుటివారు ప్రయోగించే ‘ట్రోలింగ్’అ్రస్తాన్ని ఎలా తిప్పికొట్టాలి..ఎలా ట్రోలింగ్‌ను ఎదుర్కోవాలన్న అంశాలపై అవగాహన ఉండాలంటున్నారు సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డా.పాటిబండ్ల ప్రసాద్. ట్రోలింగ్ అంటే.. ఆన్లైన్లో ప్రజలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం లేదా కలవరపెట్టడాన్ని మనం స్థూలంగా ట్రోలింగ్ అనవచ్చు. ఒక వ్యక్తిని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారికి ఎలాంటి సంబంధం లేనటువంటి అంశాలను సైతం అంటగడుతూ వారి సామాజిక హోదాను దెబ్బతీయడం, తద్వారా వారిని తీవ్ర ఆందోళనలో నెట్టడమే ట్రోలింగ్చేసే వారి ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. ట్రోలింగ్ రకాలు... ఫ్లేమ్ ట్రోలింగ్ నిందారోపితమైన ఆరోపణలు, ద్వేషాన్ని, ఇతరులను కించపర్చే అంశాలపై ట్రోలింగ్. ఉదాహరణకు మతపరమైన విద్వేష పూరిత భావజాలం పెంచేలా ట్రోలింగ్. ఆఫ్–టాపిక్ ట్రోలింగ్ అసందర్భమైన వ్యక్తులను, ప్రదేశాలను, స్థలాలను వివాదాల్లోకి లాగేలా చేసే ట్రోలింగ్. ఉదాహరణకు..పాత తరం రాజకీయ నాయకులను ప్రస్తుత రాజకీయాల్లోకి లాగడం..ప్రాంతాలు, మతపరమైన పాత వివాదాలు లేవనెత్తేలా ట్రోలింగ్. కన్సర్న్ ట్రోలింగ్ ఏదైన ఒక అంశాన్ని బా గా సపోర్ట్ చేస్తున్నట్టు లేదా ఆ విషయంపట్ల ఆందోళన చెందుతున్నట్టుగా నటిస్తూ వ్యాఖ్య లు.. ట్రోలింగ్ చేయడం.. ఉదాహరణకు.. మతపరమైన అంశాలపై మద్దతు పెంచడం, రెచ్చగొట్టడం ద్వారా లబ్ధి పొందేలా ట్రోలింగ్.. సోక్ పప్పెట్ ట్రోలింగ్... పెద్ద సంఖ్యలో ఫేక్ అకౌంట్లను సృష్టించి వాటి ద్వారా ఎవరైనా ఒక వ్యక్తికి మద్దతు ఇచ్చేలా లేదా కించపర్చేలా ట్రోలింగ్ చేస్తూ ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయాన్ని క్రియేట్ చేయడం.. ఉదాహరణకు..రాజకీయ నాయకుల గురించి, రాజకీయాల గురించి, మతపరమైన అంశాల గురించి డబ్బులు తీసుకుని ట్రోలింగ్ చేయడం. ట్రోలింగ్ దుష్ప్రభావాలు.. భావోద్వేగాలు రెచ్చగొట్టి బాధించడం: మానసిక క్షోభకు ట్రోలింగ్ దారితీస్తుంది. ఆందోళన, నిరాశ, ఇతర మానసిక ఆరోగ్య సమస్యలు తెచి్చపెడుతుంది. నమ్మకాన్ని పోగొట్టడం: ట్రోలింగ్ అనేది ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. నిజమైన, అర్థవంతమైన సంభాషణల్లోనూ పాల్గొనకుండా స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. చిల్లింగ్ ఎఫెక్ట్: ట్రోలింగ్ లేదా వేధింపులు భయాన్ని పెంచుతాయి. ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తి ఆన్లైన్లో తన అభిప్రాయాలు స్వేచ్ఛ చెప్పడానికి భయపడే పరిస్థితికి వస్తాడు. తప్పుడు సమాచారం: ట్రోల్లు తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేయవచ్చు. ఇది ట్రోలింగ్‌కు గురయ్యే వ్యక్తుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే బాధితులు.. ట్రోలింగ్‌కు పాల్పడాలనుకునే వారు టార్గెట్ చేసుకునేది ఎక్కువగా రాజకీయ నాయకులు, సినీ, క్రీడా తారలే ఎక్కువ ఉంటున్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారిపైనే అందరిలో ఆసక్తి ఉంటుంది. అందుకే అలాంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు. స్పందించకపోవడమే అసలు మందు.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రోలింగ్ పాల్పడే వారి లక్ష్యం ఒక్కటే మనల్ని అన్ని రకాలుగా వేధించడం. అందుకే ట్రోలింగ్‌లో చేసే వారి కామెంట్లు పట్టించుకోకపోవడం అనేది ఉత్తమం. వీలైనంత వరకు సోషల్ మీడియాలో మన వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దు. అది ట్రోలింగ్‌కు వాడే ప్రమాదం ఉంది. అలానే ట్రోలింగ్ శ్రుతి మించితే మాత్రం ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి, ఆ కంటెంట్ డిలీట్ చేయించవచ్చు. అదేవిధంగా ట్రోల్ చేసే వారిని బ్లాక్ చేయడం, మ్యూట్ వంటి ఆప్షన్లు వాడాలి. ఇలా ఎదుర్కోవచ్చు... ట్రోల్‌ను తప్పక రిపోర్ట్ చేయాలి.. మనపై ట్రోలింగ్ చేస్తూ మనల్ని కించ పర్చే వ్యాఖ్యలు ఉంటే వెంటనే ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వారికి ఫిర్యాదు చేసి ఆ కామెంట్లు డిలీట్ చేయించవచ్చు. ఈ టూల్స్ వాడొచ్చు.. సోషల్ మీడియా ఖాతాల్లో ఆయా ప్లాట్‌ఫామ్‌లు కొన్ని టూల్స్ ట్రోలింగ్‌ను ఎదుర్కొనేలా ఇస్తున్నాయి. ట్రోలింగ్ చేసే వారిని బ్లాక్ చేయ డం, మ్యూటింగ్ యూజర్స్ ఆప్షన్ పెట్టడం, ఫిల్టరింగ్ అబ్యూసివ్ లాంగ్వేజ్ ఆప్షన్ పెట్టుకోవడం వంటివి వాడుకోవాలి. -
నీలాంటివాళ్లు గుడికి ఎందుకొస్తారో? బాలీవుడ్ నటుడిపై ట్రోలింగ్
బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య కేసులో నిర్దోషిగా తేలిన నటుడు సూరజ్ పంచోలి తాజాగా ముంబైలోని సిద్ది వినాయక ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశాడు. శనివారం ఆలయాన్ని దర్శించిన అతడికి పూజారులు విఘ్నేశ్వరుడి ఫోటోతో పాటు ప్రసాదాన్ని అందజేశారు. వాటిని తీసుకుని ఆలయం వెలుపలికి వచ్చిన ఆయన అక్కడి కెమెరాల వైపు చిరునవ్వు చిందిస్తూ ఫోటోలు దిగాడు. ఈ క్రమంలో తన షూలను చేతితో పట్టుకుని పక్కన పెట్టారు. మళ్లీ అదే చేతితో వినాయకుడి ఫోటోను పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు నటుడిపై మండిపడుతున్నారు. 'నీ కాలి షూ ముట్టుకుని ఆ భగవంతుడి ఫోటో పట్టుకున్నావు. కొంచెమైనా బుద్ధుందా? అసలు ఏ పద్ధతి తెలియకుండా గుడికి ఎందుకొస్తారో?', 'షూ ముట్టుకున్న తర్వాత కనీసం నీ చేతులు కడుక్కోవచ్చు కదరా బాబూ' అని ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా నటి జియా ఖాన్ 2013, జూన్ 3న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. సుమారు ఆరు పేజీల సూసైడ్ నోట్ రాసి ఆమె ప్రాణాలు విడిచింది. ఈ లేఖ ఆధారంగా నటి ప్రియుడు సూరజ్ పంచోలిని పోలీసులు నిందితుడిగా భావించారు. ఈ కేసును దీర్ఘకాలంగా విచారించిన సీబీఐ ఏప్రిల్ 28న సూరజ్ పంచోలి నిర్దోషి అని తీర్పు వెలువరించింది. ఇన్నాళ్లకు తనకు న్యాయం జరిగిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు సూరజ్ పంచోలి. కాగా సూరజ్ పంచోలి చివరగా టైం టు డ్యాన్స్ షోలో కనిపించాడు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: భారీగా సంపాదిస్తున్న సామ్, ఒక్క పోస్టుకు ఎన్ని లక్షలంటే? -
పాపం, టైం బ్యాడ్ అంటూ ట్రోలింగ్.. స్పందించిన హీరోయిన్
ఏ రంగంలోనైనా సక్సెస్‌తోనే ఏదైనా ముడిపడి ఉంటుంది. ప్లస్ పాయింట్స్ ఎన్ని ఉన్నా విజయం వరించకపోతే అవకాశాలు దరిచేరవు. ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ పరిస్థితి ఇలాంటిదే! చూడచక్కని అందం ఈ చిన్నదాని సొంతం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని చిత్రాల్లో నిధి అగర్వాల్ నటించింది. వాటిలో తెలుగులో ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ కొట్టింది. తమిళంలో జయం రవి సరసన భూమి, శింబుతో ఈశ్వరన్, ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా కలగ తలైవన్ చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవి నిధి అగర్వాల్ కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో రకరకాల ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపై స్పందించిన నిధి అగర్వాల్ ఒక భేటీలో మాట్లాడుతూ.. నటన విషయంలో తానే కాదు పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొంది. అదే విధంగా నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. నిజమే, తాను ఇప్పటివరకు సినిమాల్లో అందంగా కనిపించాలన్న విషయంపైనే దృష్టి సారించానని, అలా గ్లామరస్ పాత్రలో నటించానని చెప్పింది. అయితే ఇప్పుడు నటన గురించి కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పింది. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న వెబ్ సిరీస్‌లను చూస్తూ తన నటనకు మెరుగులు దిద్దుకుంటున్నట్లు చెప్పింది. ఇకపై ప్రతిభావంతులైన దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కల్యాణ్‌కు జంటగా హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపింది. ఇందులో నటనకు అవకాశం ఉన్న పాత్ర పోషిస్తున్నానని, ఇది తన సినీ కెరీర్లో ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి భార్యకు విడాకులిచ్చి ప్రేయసితో నటుడి సహజీవనం -
మయాంక్ అగర్వాల్‌ను దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
-
నటి ప్రైవేట్ వీడియో లీక్, ఎప్పుడు గర్భం దాల్చావంటున్న నెటిజన్లు
నటీనటులు వేసుకునే మేకప్, డ్రెస్సింగ్ అనేది వారికి నచ్చితే సరిపోదు.. చూసేవాళ్లకు కూడా నచ్చాలి! లేదంటే నెటిజన్లు నోరేసుకుని పడిపోతారు. అదేం డ్రెస్సు, నీకేది దొరకలేదా? సరిగ్గా మేకప్ వేసుకోవడం కూడా రాదా? కనీసం ఎలా రెడీ అవ్వాలో కూడా తెలియదా? అని తిట్టిపోస్తారు. అందుకే నలుగురిలోకి వచ్చేటపుడైనా, కెమెరా ముందు నిలబడే ముందైనా అందంగా రెడీ అవ్వాల్సిందే! లేదంటే తిప్పలు తప్పవు. ఇక అందం కోసం, ఆకృతి కోసం డైటింగ్ సరే సరి! ఏమాత్రం బొద్దుగా కనిపించినా నానార్థాలు తీస్తారు, బాడీ షేమింగ్ చేస్తారు. అందుకు ఇప్పుడు చెప్పుకునే సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. భోజ్‌పురి నటి త్రిష కర్ మధు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. నేను నీ సొంతం కాదు అని దీనికి క్యాప్షన్ జత చేసింది. ఇందులో ఆమె బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ శారీలో మెరిసింది. అయితే ఈ ఫోటోల్లో ఆమె కాస్త బొద్దుగా కనిపించింది. ఇంకేముంది, ఇది చూసిన నెటిజన్లు ఏంటి? అంత లావయ్యావు. అప్పుడే ప్రెగ్నెంట్ అయ్యావా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా గతేడాది త్రిష కర్ మధుకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో లీకైంది. తన బాయ్‌ఫ్రెండ్‌తో ఏకాంతంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దయచేసి ఆ వీడియోను డిలీట్ చేయాలని అభ్యర్థించింది నటి. ఈ వీడియో దుమారం ముగిసిన తర్వాత తిరిగి మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తోంది త్రిష. View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) View this post on Instagram A post shared by Trisha Kar Madhu (@trishakarmadhuofficial) -
మేడమ్ ప్లీజ్ అంటూ భిక్షమడిగిన దివ్యాంగుడు.. పట్టించుకోని హీరోయిన్
బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ ప్రీతి జింటా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బిజీలో ఉన్న ప్రీతి అక్కడ భిక్షాటన చేస్తున్న వ్యక్తిని పట్టించుకోకుండా తన దారిన తను వెళ్లిపోయింది. అతడేమో ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతుందా అన్న ఆశతో హీరోయిన్ కారు వైపే వీల్‌చైర్ తోసుకుంటూ వెళ్లాడు. ప్లీజ్ మేడమ్ ప్లీజ్ అంటూ ఆర్తిగా అభ్యర్థించాడు. అది గమనించని ప్రీతి కారులో రయ్యిమని ముందుకు దూసుకుపోయింది. అయినా సరే ఆమె కారును అందుకుందామని ప్రయత్నించిన దివ్యాంగుడి ప్రయత్నం వృధా అయింది. ఇది చూసిన జనాలు ప్రీతిని తిట్టిపోస్తున్నారు. రూ.100 కోట్లు ఉన్న నువ్వు కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? అని తిట్టిపోస్తున్నారు. 'పాపం, ఎంతో ఆశపడ్డ అతడికి తోచినంత ఇవ్వాల్సింది, ఏమీ ఇవ్వకుండా వెళ్లిపోయినందుకు అతడు ఎంత బాధపడి ఉంటాడో' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 1998లో మణిరత్నం డైరెక్ట్ చేసిన 'దిల్ సే' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రీతి జింటా. ఈ చిత్రంతో ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. అదే ఏడాది 'ప్రేమంటే ఇదేరా' చిత్రంతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది మహేశ్‌బాబుతో 'రాజకుమారుడు'లో నటించింది. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆమె బుల్లితెరపై ప్రసారమైన పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. ఇకపోతే ప్రీతి జింటా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సహ యజమానురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
సీత మెడలో తాళి, కాలికి మెట్టలు కూడా లేవు, ఏం చేస్తున్నార్రా మీరంతా!
ఊపిరి సినిమాలో కార్తీ.. నాగార్జున బర్త్‌డేకు అందరినీ పిలిచి కేక్ కట్ చేసి సర్ప్రైజ్ చేస్తాడు. నాగ్ కూడా వావ్.. సర్ప్రైజ్ అని ఆశ్చర్యపోతుంటాడు. కానీ పక్కకు వెళ్లాక మాత్రం ప్రతి సంవత్సరం చేసేది ఇదే కదా! ఇందులో సర్ప్రైజ్ ఏముందని డీలా పడిపోతాడు. ఆదిపురుష్ టీమ్ కూడా అచ్చంగా ఇలాగే సర్ప్రైజ్ ఇచ్చింది. ఈరోజు (మార్చి 30) శ్రీరామనవమి కావడంతో ఏదైనా ఊహించని సర్ప్రైజ్ ఉంటుందని అంచనా వేశారు ప్రభాస్ అభిమానులు. కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ ఎప్పటిలాగే ఓ పోస్టర్‌తో సరిపెట్టింది చిత్రయూనిట్. ప్రతి ఇళ్లలో ఉండే శ్రీరాముడి ఫోటో ఎలా ఉంటుందో దాదాపు అలాగే ఉందీ పోస్టర్. ఇది చూసిన అభిమానులు సర్ప్రైజ్కు బదులు షాకవుతున్నారు. 'దేవుడి పోస్టర్‌ను దింపారు కదరా సామీ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'నాకైతే ముఖాలను మార్ఫ్ చేశారనిపిస్తోంది, ఇక సినిమా ఎలా ఉంటుందో?', 'బడ్జెట్ బొక్క.. ఏమీ మారలేదు, పోస్టర్ డిజైన్ కూడా రాకపోతే పెద్ద పెద్ద సినిమాలు తీయడం ఎందుకో..', 'సీతమ్మ కాళ్లకు మెట్టలు లేవు, మెడలో మంగళసూత్రం లేదు, పాపిట్లో సింధూరం లేదు..', 'అసలు కృతి సీతలా కాదు కదా ఆమె చెలికత్తెలా కూడా లేదు', 'లక్ష్మణ, హనుమంతులకు గడ్డమా? మీకన్నా ఫ్యాన్ ఎడిట్స్ బాగున్నాయ్ కదరా..', 'ఇదంతా వర్కవుట్ అవ్వదు కానీ ఓటీటీలో రిలీజ్ చేయండి' అని ట్రోల్ చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో జూన్ 16న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. Mantron se badhke tera naam Jai Shri Ram मंत्रों से बढ़के तेरा नाम जय श्री राम మంత్రం కన్నా గొప్పది నీ నామం జై శ్రీరామ్#JaiShriRam #RamNavmi#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi pic.twitter.com/YjmncsvqwG — UV Creations (@UV_Creations) March 30, 2023 Nikante Fans editing better baga unnay kadha ra.. chala mistakes unnay intha time thisukoni em chesav asalu.. Better to release in OTT — PsPk Cult Harsha 🌟 (@Harshavamshi143) March 30, 2023 Lord Sri Rama with a moustache. Lord Lakshmana with a beard. Which scriptures is this description taken from? — Ovo (@VanKhomain) March 30, 2023 Ramudu look lo Namam edho teda ga undi! Zoom chesthe pixellation. Entra 500cr tho meeru chesthundi. — #SSMB28--- MaSS Avatar ! 🔥🔥🔥 (@sreekirx) March 30, 2023 -
వారు లేకపోయుంటే ఇది జరిగేదే కాదు: కాలభైరవ పోస్ట్‌పై ఫైర్
మంచి ట్యూన్ పడితే పాట దానంతటదే వస్తుంది. కానీ ఆ పాట అందరికీ అర్థమవుతూనే ప్రజల మనసులో చోటు సంపాదించుకోవాలంటే మంచి లిరిక్స్ ఉండాలి. ఈ పాటకు ప్రాణం పోయాలంటే దీన్ని అద్భుతంగా పాడే సింగర్స్ కావాలి. తెరపై మెరుగ్గా కనిపించాలంటే స్టేజీ దద్దరిల్లేలా స్టెప్పులేసే డ్యాన్సర్లు కావాలి. ఇవన్నీ నాటు నాటు పాటకు సరిగ్గా సరిపోయాయి. కీరవాణి సంగీతం, చంద్రబోస్ లిరిక్స్.. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ గాత్రం.. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ.. తారక్, చరణ్ డ్యాన్స్ అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయి కాబట్టే అందరికీ తెగ నచ్చేసింది. ఆస్కార్ సైతం మన ఒడిలో వచ్చి చేరింది. బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో అకాడమీ అవార్డు సాధించడంపై తాజాగా సింగర్ కాలభైరవ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. 'RRRకు ఆస్కార్ రావడం, అంత పెద్ద వేదికపై లైవ్ పర్ఫామెన్స్ ఇవ్వడం.. నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఆ వేదికపై పాడానంటే అందుకు డైరెక్టర్ రాజమౌళి, నాన్న(కీరవాణి), కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్, కార్తికేయ అన్న, అమ్మ, పెద్దమ్మ.. వీళ్లంతా ముఖ్య కారణం. వీళ్ల కృషి వల్లే ఆ పాట ప్రపంచం నలుమూలలకూ వెళ్లి అందరితో స్టెప్పులేయించింది. వారు లేకుంటే ఈ అందమైన అనుభూతి పొందే అవకాశం నాకు దక్కేదే కాదు. ఆర్ఆర్ఆర్లో పాలు పంచుకునే ఛాన్స్ ఇచ్చినందుకు నేను అదృష్టవంతుడిని' అని రాసుకొచ్చాడు కాలభైరవ. అందరికీ క్రెడిట్ ఇచ్చావు కానీ హీరోలు ఏం చేశారు? అంటే నీ ఫ్యామిలీ మాత్రమే గొప్పనా? తారక్, చరణ్ డ్యాన్స్ లేకపోయుంటే ఆ పాట అంతదూరం వెళ్లేదే కాదు అని కామెంట్లు పెడుతున్నారు. దీంతో కాలభైవర తన పోస్ట్‌పై వివరణ ఇచ్చాడు. 'తారక్, చరణ్ అన్నల వల్లే నాటు నాటు పాట ఇంత సక్సెస్ అయిందన్న విషయంలో ఎటువంటి అనుమానం లేదు. నేను కేవలం అకాడమీ వేదికపై పాడటానికి సహకరించినవారి గురించి మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించాను తప్ప అంతకుమించేమీ లేదు. కానీ ఇది మీకు వేరేలా అర్థమైంది. ఇది తప్పుగా వెళ్లినందుకు నన్ను క్షమించండి' అని ట్వీట్ చేశాడు. I have no doubt Tarak anna and Charan anna are the reason for the success of naatu naatu and RRR itself. I was ONLY talking about who all helped me get my opportunity for the academy stage performance. Nothing else. I can see that it was conveyed wrongly and for that, I… https://t.co/Je17ZDqthj — Kaala Bhairava (@kaalabhairava7) March 17, 2023 -
డబ్బు గురించి మాట్లాడిన సోనమ్, నెట్టింట ట్రోలింగ్
డబ్బు విలువ ఉన్నవాడికంటే లేనివాడికే బాగా తెలుస్తుందంటారు. చెమటోడ్చి సంపాదించే పది రూపాయలు కూడా ఎంతో విలువైనవిగానే భావిస్తుంటారు కష్టజీవులు. కానీ ధనవంతులు మాత్రం తమ దగ్గర ఉన్న కోట్ల రూపాయల ముందు లక్ష రూపాయలు కూడా తక్కువే అని చులకనగా చూస్తారు. తాజాగా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ డబ్బు గురించి ఉపన్యసించింది. ఆమె చెప్పాలనుకున్నదేంటో కానీ తన దగ్గర మాత్రం బోలెడంత ఉందని డప్పు కొట్టుకుంది. ఇది చూసి నెటిజన్లు ఆమెను తిట్టిపోస్తున్నారు. డబ్బు ప్రాముఖ్యత గురించి ఆమె మాట్లాడుతూ.. 'మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేది. డబ్బుకు ఎక్కువ విలువ ఇవ్వకూడదు అని! ఎందుకంటే అది మాకు కావాల్సినంత ఉంది. కాబట్టి నేనెప్పుడూ డబ్బులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేదు' అని చెప్పుకొచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. నాకైతే రూ.65,000 పెద్ద విషయం కాదు. నా డ్రెస్ చూస్తే మీకర్థమవట్లేదా డార్లింగ్.. అంటూ నవ్వేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనేం చెప్పాలనుకుంది, ఏం చెప్పింది? బోలెడంత డబ్బు మాత్రమే ఉన్న నువ్వు ఎంత పేదదానివో, నీ మాటలు అందరూ వింటారని తెలిసే ఇలా మాట్లాడుతున్నావా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. View this post on Instagram A post shared by enough internet for tonight (@enoughinternetfortonite) -
వ్యక్తిగతంగానూ, ఫోన్ చేసి మరి విమర్శించారు: ‘ది లెజెండ్’ హీరో శరవణన్
తమిళ సినిమా: లెజెండ్ శరవణన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రముఖ వ్యాపార వేత్త, శరవణా స్టోర్స్ సంస్థల అధినేత అయిన ఈయన, ఆర్ సంస్థల ప్రచార చిత్రాల ద్వారా బహుళ ప్రాచుర్యం పొందాయి. ఆ ప్రచార చిత్రాల్లో బాలీవుడ్, సౌత్ ఇండియన్ హీరోయిన్లతో డాన్స్ చేసి సాధారణ ప్రజలకు దగ్గరయ్యారు. తరువాత ఆయన సినిమాలపై గురిపెట్టారు. అలా ది లెజెండ్ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవ్వడంతో పాటు నిర్మాతగానూ అడుగు పెట్టారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌథేలా ఇందులో హీరోయిన్గా నటించారు. భారీ బడ్జెట్లో రూపొందిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. శుక్రవారం నుంచి డిస్నీ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా తనకు ప్రారంభ దశ నుంచి ప్రచార మీడియా పెద్ద సపోర్ట్‌గా నిలిచిందన్నారు. అదే విధంగా తాను కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం ది లెజెండ్ విడుదలై మిశ్రమ స్పందనతో ప్రదర్శిత మవుతోందన్నారు. ఆ చిత్రానికి విమర్శల ద్వారా మీ విశ్లేషణలను తమ మీడియా ద్వారా పొందుపరిచారన్నారు. కొందరు వ్యక్తిగతం గానూ, ఫోన్ చేసి చెప్పారన్నారు. విమర్శలే విజయానికి తొలిమెట్టుగా భావించి తాను ముందడుగు వేస్తున్నానన్నారు. కాగా తాజాగా మరో చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. తొలి ప్రయత్నంగా సామాజిక పరమైన అంశంతో కుటుంబ కథాచిత్రంలో నటించిన లెజెండ్ శరవనన్ ఈ సారి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ఆ విషయంలో జూ. ఎన్టీఆర్, మంచు లక్ష్మిని పోల్చకండి: నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
భారతీయుడు, అన్నమయ్య వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది నటి కస్తూరి. ఆ తర్వాత నిప్పు రవ్వలో మెరిసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చదవండి: టాలీవుడ్ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ భేటీ, చిరు ట్వీట్ ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ ఇండస్ట్రీలో వివాదంలో నిలిచిన పలు అంశాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. ఈ క్రమంలో ఇటీవల ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడిన తీరును ఇండియన్ నెటిజన్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అమెరికా మీడియా, ఇంటర్య్వూలో ఎన్టీఆర్ అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంట్ వాడిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందించగా.. తెలుగు రాష్ట్రాల నెటిజన్లు ఎన్టీఆర్‌ను ట్రోల్ చేశారు. కొద్ది రోజులు దీనిపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరిగింది. దీనిపై తాజాగా నటి కస్తూరి స్పందించింది. ఆయన అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడంలో అసలు తప్పేముందంది. నిజానికి అది గర్వించదగ్గ విషయం అంటూ తారక్‌పై ప్రశంసలు కురిపించింది. ‘అమెరికా వాళ్లకి వాళ్ల స్లాంగ్‌లోనే మాట్లాడితేనే అర్థమవుతుంది. మన ఇంగ్లీష్‌లో మాట్లాడితే వారికి అర్థం కాదు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడారు. ఆ విషయంలో ఎన్టీఆర్ చేసింది కరెక్ట్. కానీ మన దగ్గర మాత్రం చాలా మంది ఆయనది ఫేక్ యాక్సెంట్ అంటూ ట్రోల్ చేశారు. అది చాలా తప్పు. నేను కూడా అమెరికాలో ఉన్నాను, అక్కడ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అమెరికా వాళ్లకి. వాళ్లలా మాట్లాడితేనే అర్థమవుతుంది. చదవండి: మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్ అదే నేను తెలుగును తమిళ యాక్సెంట్లో మాట్లాడితే ఎలా ఉంటుంది. వినడానికి ఇబ్బంది ఉంటమే కాదు అసలు అర్థం కూడా కాదు’ అంటూ వివరణ ఇచ్చింది. ఇక మంచు లక్ష్మి ఇక్కడే అమెరికన్ యక్సెంట్ వాడటంపై కూడా ఆమె స్పందించింది. ‘నిజమైన ప్రయత్నానికి.. కావాలని చేసే ఫేక్ అటెంప్ట్‌కి చాలా తేడా ఉంది. హైదరాబాద్‌కి వచ్చి అమెరికన్ యాక్సెంట్ మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. ఇక్కడ తెలుగుని స్పష్టంగా తెలుగులోనే మాట్లాడొచ్చు. కానీ తెలుగులో కూడా అక్కడి యాక్సెంట్ కలపడం ఎందుకు. వీరిద్దరికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ విషయంలో వారిద్దరిని(జూనియర్ ఎన్టీర్, మంచు లక్ష్మిని) పోల్చ కూడదు’ అని ఆమె పేర్కొంది. -
మీకు ఉర్ఫీ ఫివర్ అట్టుకుందా!: శిల్పా శెట్టిపై దారుణమైన ట్రోల్స్
శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హీరోయిన్గా ఎంతటి పాపులారిటి దక్కించుకుందో విమ్శరలతో కూడా అంతే గుర్తింపు పొందింది. ఏదొక వివాదంతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇప్పటికే ఓ నటుడితో ముద్దు కేసు, చీటింగ్, భర్త పోర్న్గ్రాఫీ, అక్రమ సంపాదన ఇలా పలు వివాదాలు ఆమెను చూట్టుముడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తన డ్రెస్సింగ్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది శిల్పా శెట్టి. ఐదు పదుల వయసులో కూడా ఓ అవార్డు ఫంక్షన్లో యంగ్ హీరోయిన్లకు పోటీగా అందాల అరబోస్తూ బోల్డ్ లుక్‌లో దర్శనిమించింది. చదవండి: ఓటీటీకి వచ్చేసిన ‘వాల్తేరు వీరయ్య’, అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్, ఎక్కడో తెలుసా? దీంతో నెటిజన్లు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో బిగ్ ఇంపాక్ట్ అవార్డ్స్ ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. దీనికి శిల్పాతో పాటు పలువురు స్టార్ నటీనటులు హజరయ్యారు. ఈ వేడుకకు శిల్పా ఫుల్ అవుట్ అండ్ అవుట్ ట్రెండీవేర్ డ్రెస్‌లో సందడి చేసింది. వైట్‌కలర్ జంప్ సూట్లో వీ నెక్ ఫుల్ డీప్ జాకెట్, స్టైలిష్ చికంకారి కోట్ ధరిచించింది. ఇందులో శిల్పా డ్రెస్పింగ్ బోల్డ్‌గా ఉండటంతో అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారాయి. చదవండి: షాకింగ్: నటుడిపై వేధింపులు.. మహిళా డైరెక్టర్ అరెస్ట్ దీంతో నెటిజన్లు శిల్పా డ్రెస్సింగ్‌పై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వయసులో ఇలాంటి డ్రెస్‌లు ఏంటీ? అంటూ శిల్పాపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరికొందరైతే ఉర్ఫీ జావేద్ ఫివర్ అంటుకుందా? ఆమెను డామినేట్ చేయాలని చూస్తున్నారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆమె ఫ్యాన్స్ ‘ప్లీజ్ మేడమ్ ఇలాంటి డ్రెస్‌లు వేయకండి.. మీ మీద చాలా గౌరవం ఉంది, దాన్ని పొగొట్టుకోకండి’ అంటూ స్పందిస్తున్నారు. కాగా ఈ అవార్డు వేడుకకు హీనా ఖాన్ సహా మలైకా ఆరోరా వంటి ఇతర నటీమణులు కూడా హాజరయ్యారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
చంద్రబాబు చరిత్ర నాకు మొత్తం తెలుసు: వల్లభనేని వంశీ
సాక్షి, కృష్ణా: గన్నవరంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సాక్షిటీవీతో మాట్లాడారు. తరచూ తనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారాయన. టీడీపీ వెబ్ సైట్, సోషల్ మీడియాలలోనే తన కుటుంబసభ్యులపై అసభ్య పదజాలంతో తిట్టిస్తున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్యే వంశీ. చంద్రబాబు చరిత్ర నాకు, కొడాలి నానికి మొత్తం తెలుసు. అందుకే మాపై చంద్రబాబు పెంపుడు కుక్కలతో మొరిగిస్తున్నాడు. బుద్ధా వెంకన్నకు స్థాయి లేదు.. అలాంటివారిని పట్టించుకోను. గన్నవరంలో నన్ను ఓడించేందుకు ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకోవచ్చు. కేవలం మా అనుచరులే దాడికి పాల్పడినట్టు ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. సంకల్పసిద్ధితో నాకు సంబంధం లేదని ఆకేసుపై విచారణ జరపాలని నేనే డీజీపీకి ఫిర్యాదు చేసాను అని వంశీ తెలిపారు. గన్నవరంలోకి బయటివాళ్లు వచ్చి గొడవ పెట్టారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఎక్కడివారో వచ్చిన ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏంటని? నిలదీశారాయన. అక్కడ జరిగే ప్రతీ సంఘటనతో నాకు సంబంధం లేదని వంశీ చెప్పుకొచ్చారు. చిన్న చిన్న విషయాల్లో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. -
కూతుళ్లపై అలాంటి కామెంట్స్.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన నటి ఖుష్బూ
సినీ, రాజకీయ రంగాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఖుష్బూ సుందర్. ఈమె ఎప్పుడూ ఏదో ఒక వివాదం, విమర్శలతో వార్తల్లో ఉంటారు. ముఖ్యంగా తన పిల్లలను ట్రోల్ చేసిన వారిని తనదైన శైలిలో కౌంటర్ ఇస్తుంటారు. తాజాగా తన కూతుళ్లను టార్గెట్ చేసిన ఓ నెటిజన్‌పై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇద్దరు కూతుళ్లు అవంతిక, ఆనందిక ఫొటోను రీసెంట్గా తన ట్విటర్లో ఖాతా ప్రోఫైల్ పిక్‌గా షేర్ చేశారు ఖుష్బూ. చదవండి: ఆ హీరోయిన్ అంటే క్రష్.. తను నన్ను బాగా ఆకట్టుకుంది: రామ్ చరణ్ ఈ ఫొటోపై ఓ నెటిజన్ స్పందిస్తూ ‘వారు తమ ముక్కుకు సర్జరీ చేసుకున్నారు!’ అని కామెంట్ చేశాడు. దీనిపై ఆమె స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు. ‘20, 22 ఏళ్ల వయసున్న పిల్లలకు కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది? చిన్న పిల్లల మీద ట్రోలింగ్ చేయడం సిగ్గుచేటు. కనీసం పిల్లలనైనా వదిలేయండి’ అంటూ ఖుష్బూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా ఖుష్బు కూతుళ్లపై ట్రోలింగ్ జరగడం ఇది తొలి సారి కాదు. చదవండి: వాలంటైన్స్ డే: తమన్నా-విజయ్ వర్మ రిలేషన్‌పై క్లారిటీ వచ్చేసింది? గతంలోనూ వారి బరువు, శరీరాకృతిపై కొందరు కామెంట్స్ చేశారు. అలా కూతుళ్లపై ట్రోలింగ్ జరిగిన ప్రతిసారి ఖుష్బు వారికి కౌంటరి ఇస్తూనే వచ్చారు. తాజాగా మరోసారి తన పిల్లల గురించి అసత్య ప్రచారం చేయడంతో ఖుష్బూ ఘాటుగా స్పందించారు. కాగా హీరోయిన్గా కెరీర్ పీక్‌లో ఉండగానే దర్శకుడు సుందర్‌ను ఖుష్బూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరికి అవంతిక, ఆనందిక అనే ఇద్దరు కూమార్తెలు జన్మించారు. Why would a 20 and a 22 yr old go under a knife?? It’s a shame when children are part of trolling. At least spare the kids. https://t.co/wJ3NSME5aN — KhushbuSundar (@khushsundar) February 13, 2023 #NewProfilePic ❤️ pic.twitter.com/PVAjL5LeBC — KhushbuSundar (@khushsundar) February 13, 2023