నన్ను అంత మాటన్నారు.. ఏడ్చేసిన నటుడు | Aayush Sharma Gets Emotional as Remember a Cruel Troll Compared him to a Dog | Sakshi
Sakshi News home page

Aayush Sharma: నా పిల్లలు చూస్తే నా పరువేం కావాలి.. నటుడు ఎమోషనల్‌

Published Fri, Apr 26 2024 12:35 PM | Last Updated on Fri, Apr 26 2024 12:35 PM

Aayush Sharma Gets Emotional as Remember a Cruel Troll Compared him to a Dog - Sakshi

ఇండస్ట్రీకి ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. చాలామంది ఇక్కడ నిలదొక్కుకోవాలని ప్రయత్నిస్తుంటారు. కానీ కొందరే సఫలీకృతులవుతారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ చెల్లిని పెళ్లాడిన ఆయుష్‌ శర్మ కూడా నటుడిగా ప్రయత్నించాలనుకున్నాడు. లవ్‌ యాత్రి అనే సినిమా చేశాడు. దీన్ని సల్మాన్‌ ఖాన్‌ నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడింది. ఆయుష్‌ మీద విమర్శల వర్షం కురిసింది. ఆయుష్‌కు బదులుగా ఓ కుక్కను పెట్టి సినిమా తీయాల్సిందని తీవ్రంగా ట్రోల్‌ చేశారు.

నానా మాటలు..
తాజాగా ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనలయ్యాడు ఆయుష్‌. 'నా పిల్లలు నన్ను చూసి గర్వపడాలను​కున్నాను. కానీ ఆరోజు నా గురించి చాలా చెత్తగా మాట్లాడారు. ఆ సినిమా రిలీజైన రోజు నానా మాటలన్నారు. నన్ను కుక్కతో పోల్చారు. రేపు పొద్దున నా కుమారుడు పెద్దయ్యాక ఈ వార్త చదివితే నా పరిస్థితి ఏంటి? నా కూతురు.. మా నాన్న ఒక శునకం అని ఉన్న వార్తలు చూస్తే నేనేం కావాలి? వాళ్లు తండ్రి గురించి మంచి విషయాలు తెలుసుకోవాలి..

నన్ను శునకంతో పోల్చారు
నన్ను చూసి గర్వంగా ఫీలవ్వాలి. ఒక మీడియా అయితే ఆయుష్‌ శర్మ ఒక కుక్క అని రాసేసింది. కానీ వాళ్లకు నేనిప్పుడు థ్యాంక్స్‌ చెప్తున్నాను. మీరు నన్ను అవమానించడం వల్లే నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను' అని ఎమోషనలయ్యాడు. కాగా ఆయుష్‌.. తర్వాత సల్మాన్‌తో అంతిమ్‌ అనే సినిమాలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. ఇది హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఇతడు నటించిన రుస్లాన్‌ సినిమా ఏప్రిల్‌ 26న విడుదల కానుంది.

చదవండి: అభిషేక్‌ అగర్వాల్‌ నుంచి ‘ది ఢిల్లీ ఫైల్స్‌ ’ .. రిలీజ్‌ ఎప్పుడంటే?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement