Aayush Sharma reacts on trolls saying he married Salman Khan's sister Arpita for money - Sakshi
Sakshi News home page

Aayush Sharma: సల్మాన్‌ డబ్బులతో జల్సా.. మనీ కోసమే పెళ్లి.. నటుడి రియాక్షన్‌ ఇదీ!

Published Thu, Jun 1 2023 4:26 PM | Last Updated on Thu, Jun 1 2023 5:02 PM

Aayush Sharma On Trolls Saying he Married Salman Khan Sister Arpita For Money - Sakshi

'నువ్వు డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నావు..' ఇది జనాలు ఇప్పుడంటున్న మాట కాదు, గత తొమ్మిదేళ్లుగా ఇలా సూటిపోటి మాటలతో బాలీవుడ్‌ నటుడు ఆయుశ్‌ శర్మను జనాలు ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. 2014లో అతడు బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పిత ఖాన్‌ను పెళ్లాడాడు. వీరికి అహిల్‌ అనే కుమారుడు, అయత్‌ అనే కూతురు ఉన్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయుశ్‌ శర్మ మాట్లాడుతూ.. 'అర్పిత చాలా శక్తివంతమైన అమ్మాయి. తనలాంటి మహిళ నా భాగస్వామిగా రావడం అదృష్టం. మా మీద జరిగే ట్రోలింగ్‌ మమ్మల్ని అంతగా బాధించదు. ఎందుకంటే సినీరంగంలో ఉన్నవారికి ఇలాంటివి మామూలేనని మాకు బాగా తెలుసు. కానీ నేను బాగా బాధపడ్డ విషయమేంటంటే.. అర్పితను నేను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని, నటుడిగా ఎదగడానికి ఆమెను వాడుకున్నానని చాలామంది ట్రోల్‌ చేశారు. నేను డబ్బును కాదు అర్పితను ప్రేమించాను, అందుకే తనను పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం తనకు, నాకు, మా కుటుంబాలకు తెలుసు.

మరో విషయమేంటంటే.. నేను ఏదైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడు అందరూ నేను సల్మాన్‌ డబ్బులు ఖర్చు పెడుతున్నానని విమర్శించేవారు. నా పెళ్లికి సల్మాన్‌ రోల్స్‌ రాయిస్‌ కారు గిఫ్ట్‌ ఇచ్చాడని వార్తలు రాశారు. మరి ఆ రోల్స్‌ రాయిస్‌ కారు ఏమైంది? ఎక్కడుందనేది నాకిప్పటికీ అర్థం కాదు' అని చెప్పుకొచ్చాడు ఆయుశ్‌. కాగా మాజీ కేబినెట్‌ మంత్రి సుఖ్‌ రామ్‌ మనవడే ఆయుశ్‌. హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన అతడు లవ్‌యాత్రి, అంతిమ్‌ చిత్రాల్లో నటించాడు.

చదవండి: ఆలియా భట్‌ ఇంట విషాదం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement