ఇటీవల సెలబ్రిటీల ఇళ్లలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య రజనీకాంత్‌ల ఇళ్లలో ఈమధ్య భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. చదవండి: అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి?
ఈనెల 16న తన డైమెండ్ ఇయరింగ్స్ పోయాయని గమనించిన అర్పితా అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటి విలువ రూ. 5 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ఇంటిదొంగల పనే అని కనిపెట్టారు.
అర్పితాఖాన్ ఇంట్లో 11మంది పనివాళ్లు ఉన్నారు. వారిలో సందీప్ హెగ్డే అనే పనిమనిషి మాత్రం దొంగతనం జరిగిన రోజు నుంచీ కనిపించకుండా పోయాడు. అతడి ఇంట్లో పోలీసులు సోదా చేయగా అర్పితా ఖాన్ చెవిపోగులు దొరికాయాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సందీప్ హెగ్డేను అరెస్ట్ చేశారు. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట
Comments
Please login to add a commentAdd a comment