arpitha khan
-
డబ్బు కోసమే సల్మాన్ చెల్లితో పెళ్లి? స్పందించిన నటుడు
'నువ్వు డబ్బుల కోసమే పెళ్లి చేసుకున్నావు..' ఇది జనాలు ఇప్పుడంటున్న మాట కాదు, గత తొమ్మిదేళ్లుగా ఇలా సూటిపోటి మాటలతో బాలీవుడ్ నటుడు ఆయుశ్ శర్మను జనాలు ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. 2014లో అతడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్‌ను పెళ్లాడాడు. వీరికి అహిల్ అనే కుమారుడు, అయత్ అనే కూతురు ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయుశ్ శర్మ మాట్లాడుతూ.. 'అర్పిత చాలా శక్తివంతమైన అమ్మాయి. తనలాంటి మహిళ నా భాగస్వామిగా రావడం అదృష్టం. మా మీద జరిగే ట్రోలింగ్ మమ్మల్ని అంతగా బాధించదు. ఎందుకంటే సినీరంగంలో ఉన్నవారికి ఇలాంటివి మామూలేనని మాకు బాగా తెలుసు. కానీ నేను బాగా బాధపడ్డ విషయమేంటంటే.. అర్పితను నేను కేవలం డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని, నటుడిగా ఎదగడానికి ఆమెను వాడుకున్నానని చాలామంది ట్రోల్ చేశారు. నేను డబ్బును కాదు అర్పితను ప్రేమించాను, అందుకే తనను పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం తనకు, నాకు, మా కుటుంబాలకు తెలుసు. మరో విషయమేంటంటే.. నేను ఏదైనా వెకేషన్‌కు వెళ్లినప్పుడు అందరూ నేను సల్మాన్ డబ్బులు ఖర్చు పెడుతున్నానని విమర్శించేవారు. నా పెళ్లికి సల్మాన్ రోల్స్ రాయిస్ కారు గిఫ్ట్ ఇచ్చాడని వార్తలు రాశారు. మరి ఆ రోల్స్ రాయిస్ కారు ఏమైంది? ఎక్కడుందనేది నాకిప్పటికీ అర్థం కాదు' అని చెప్పుకొచ్చాడు ఆయుశ్. కాగా మాజీ కేబినెట్ మంత్రి సుఖ్ రామ్ మనవడే ఆయుశ్. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అతడు లవ్యాత్రి, అంతిమ్ చిత్రాల్లో నటించాడు. చదవండి: ఆలియా భట్ ఇంట విషాదం.. -
సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం
ఇటీవల సెలబ్రిటీల ఇళ్లలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య రజనీకాంత్‌ల ఇళ్లలో ఈమధ్య భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. చదవండి: అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి? ఈనెల 16న తన డైమెండ్ ఇయరింగ్స్ పోయాయని గమనించిన అర్పితా అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటి విలువ రూ. 5 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ఇంటిదొంగల పనే అని కనిపెట్టారు. అర్పితాఖాన్ ఇంట్లో 11మంది పనివాళ్లు ఉన్నారు. వారిలో సందీప్ హెగ్డే అనే పనిమనిషి మాత్రం దొంగతనం జరిగిన రోజు నుంచీ కనిపించకుండా పోయాడు. అతడి ఇంట్లో పోలీసులు సోదా చేయగా అర్పితా ఖాన్ చెవిపోగులు దొరికాయాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సందీప్ హెగ్డేను అరెస్ట్ చేశారు. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట -
సల్మాన్ బర్త్‌డే పార్టీకి హాజరైన షారుక్‌ఖాన్.. ఫోటోలు వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ 57వ వసంతంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సందర్భంగా ఆయన సోదరి అర్పితా ఖాన్ గతరాత్రి తన నివాసంలో గ్రాండ్‌గా సల్మాన్ బర్త్‌డే పార్టీ నిర్వహించింది. ఈ వేడుకల్లో బాద్షా షారుక్ ఖాన్ సందడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి ఫోటోలను ఫోజులిచ్చారు. సల్మాన్-షారుక్‌ను ఒకే ఫ్రేములో చూసి ఫ్యాన్స్ తెగ సండర పడిపోతున్నారు. ఇక ఈ పార్టీకి జాన్వీకపూర్,పూజా హెగ్డే, టబు, సునీల్ శెట్టి, రితేశ్, జెనీలియా, సోనాక్షి సిన్హా, కార్తీక్ఆర్యన్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా మైనే ప్యార్ కియా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ ఆ తర్వాత హమ్ ఆప్కే హై కౌన్,బీవీ నెం.1, కుచ్ కుచ్ హోతా హై వంటి సినిమాలతో స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెరపై బిగ్‌బాస్ షోకు హోస్ట్ గానూ కొనసాగుతున్నారు. The way they hug each other , there is so much love & brotherhood ♥️#HappyBirthdaySalmanKhan pic.twitter.com/JTfXYZXhMa — Shah Rukh Khan Fc - Pune ( SRK Fc Pune ) (@SRKFC_PUNE) December 27, 2022 -
పిల్లల నుంచే నేర్చుకుంటున్నా: నటుడు
లాక్డౌన్ వల్ల పొద్దస్తమానం ఇంట్లోనే ఉండటంతో నేర్చుకోడానికి ఎంతో సమయం దొరుకుతోంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ శర్మ కూడా ప్రస్తుతం ఎంతో నేర్చుకుంటున్నాడంటున్నాడు. అది కూడా తన పిల్లలు నేర్పిస్తున్నారని చెప్తున్నాడు. ప్రస్తుతం అతను తన కుటుంబంతో కలిసి సల్మాన్ ఖాన్ ఫార్మ్ హౌస్‌లో ఉన్నాడు. పిల్లలతో గడుపుతూ కాలాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఎప్పుడూ చిరునవ్వును చెరగనివ్వని పాల బుగ్గల పిల్లలు తనకో విషయం నేర్పించాడని చెబుతున్నాడు. తనకే కాదు.. ప్రతీ పిల్లవాడు పెద్దలకు మూడు విషయాలను బోధిస్తున్నాడని పేర్కొన్నాడు. మొదటిది.. ఏ కారణం లేకుండానే సంతోషంగా ఉండటం, రెండోది ఎల్లప్పుడూ ఉత్సుకత ప్రదర్శించడం, ముచ్చటగా మూడోది నిర్విరామంగా పోరాడటం.. అని చెబుతూ తన పిల్లలు అహిల్, అయాత్ ఫొటోలను సోషల్ మీడియా పంచుకున్నాడు. (అనుష్క విషయంలో ఇదీ వదంతేనా? ) కాగా ఆయుష్.. కండలవీరుడు సల్మాన్ ఖాన్ చిన్న సోదరి అర్పితాఖాన్ను 2014లో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అహిల్, అయాత్ అనే పిల్లలున్నారు. ఇక సల్మాన్ ఖాన్ పుట్టినరోజైన డిసెబర్ 27 నాడే అయాత్ జన్మించడం విశేషం. గతంలోనూ ఆయన కుటుంబ సభ్యులతో దిగిన పలు ఫొటోలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా అందరూ ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో ఎన్నో జ్ఞాపకాలను గూడు కట్టుకోండని సూచించాడు. ఇదిలావుండగా ఆయుష్ శర్మ "క్వత" చిత్రంలో కనిపించనున్నాడు. ఇందులో హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరి ఇసాబెల్లి కైఫ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. (నిన్నెంతగా ప్రేమిస్తున్నానో తెలుసా: సాయి పల్లవి) View this post on Instagram A child can teach an Adult 3 things - To he happy for no reason - To always be curious - To fight tirelessly for something Paulo Coelho A post shared by Aayush Sharma (@aaysharma) on Apr 23, 2020 at 3:41am PDT -
తండ్రిని కాలేక పోయాను: సల్మాన్
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిన్ననే 54వ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. సల్లూ భాయ్ బర్త్‌డే విషేస్‌తో సోషల్ మీడియా హోరెత్తింది. ఇక సల్మాన్ పుట్టిన రోజునే సోదరి అర్పితా ఖాన్ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. బర్త్‌డే రోజున అన్నయ్యకు చెల్లెలు అర్పితా కోడలిని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ క్రమంలో సోదరి కూతరు అయత్‌ను చూడటానికి సల్మాన్ కుటుంబ సమేతంగా.. తల్లిదండ్రులు సలీమ్-సల్మా. సోదరుడు సోహైల్ ఖాన్‌తోకలిసి ముంబైలోని హిందుజా హస్పిటల్‌కు వెళ్లారు. ఈ ప్రయాణంలో సల్మాన్‌తో పాటు గర్ల్‌ఫ్రెండ్ లులియా వంతూర్ సైతం ఉన్నారు. కాగా సల్మాన్ మాజీ ప్రియురాలు సంగీత బిజ్లానీ సైతం అర్పితాఖాన్ కూతురిని చూడటానికి రావడం విశేషం. దీనికి ముందు సల్లూ భాయ్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి మామయ్యను అయ్యానని ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పుట్టినరోజున గొప్ప బహుమతి అందుకున్నానని.. ఇది తనకెంతో ఎంతో ప్రత్యేకమైనదన్నారు. అయత్ పేరు పెట్టడానికి కారణం అడగ్గా.. కుటుంబంలో అందరి పేర్లు ఎస్ లేదా ఏ తోనే మొదలయ్యాయని అందుకే అయత్ పేరు పెట్టామని అన్నారు. ‘మరోసారి మామయ్యను అయ్యాను కానీ తండ్రిని మాత్రం కాలేకపోయాను’ అని నవ్వుతూ అన్నారు. కాగా, ప్రభుదేవా దర్శకత్వం వహించిన దబాంగ్-3 సల్మాన్ పుట్టిన రోజునే వంద కోట్ల క్లబ్లో చేరింది. బాలీవుడ్లో వంద కోట్ల క్లబ్లో చేరిన అత్యధిక సినిమాలు సల్మాన్ ఖాతాలోనే ఉన్నాయి. -
తొలిసారి చెల్లెలు ఇంటికి అన్నయ్య
షిమ్లా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్ రిసెప్షన్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పట్టణానికి వెళుతున్నారు. ఆయనను తమ రాష్ట్రానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరుఫున హెలికాప్టర్ కూడా పంపించేందుకు హిమాచల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు తొలిసారి హాజరుకానుంది. అయూష్ శర్మతో తన చెల్లెలు అర్పితా వివాహం అయిన తర్వాత శర్మ వాళ్లింట్లో సంప్రదాయ బద్ధంగా జరిగే ధామ్ వేడుకను గ్రామీణాభివృద్ధిమంత్రి, ఆయుష్ శర్మ తండ్రి అయిన అనిల్ శర్మ ఘనంగా నిర్వహిస్తున్నారు. ! ఈ సందర్భంగా అర్పిత, ఆయుష్ రిసెప్షన్ కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు పదివేలమంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించారట. అయితే, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మాత్రం కొంత బిజీ ఉన్న కారణంగా హాజరుకావడం లేదని సమాచారం. 'ధామ్' వేడుక ఆచారం ప్రకారం వచ్చిన అతిధులందరిని నేలపైనే కూర్చొబెట్టి ఆకులో భోజనం పెడతారు. రుచికరమైన వంటలు బోలెడు ఉంటాయి. ఈ భోజనం నాలుగు దశల్లో పూర్తవుతుంది. -
సల్మాన్ సోదరి పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం
ఫలక్‌నుమాకు పెళ్లికళ నేడు మధ్యాహ్నం ముహూర్తం, రేపు విందు అమితాబ్, షారుఖ్, ఆమిర్, రజనీ, కమల్ వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్‌ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వివాహ వేడుక కోసం తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. సోమవారం సాయంత్రం సల్మాన్‌ఖాన్‌తో పాటు పెళ్లికొడుకు ఆయుష్ శర్మ కుటుంబసభ్యులంతా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం వివాహ వేడుక నిర్వహించనున్నారు. బుధవారం అతిథులందరికీ విందుభోజనం ఉంటుంది. వధూవరులిద్దరూ ముంబైకి చెందిన వారైనప్పటికీ చారిత్రక ఫలక్‌నుమాలో పెళ్లి వేడుక కోసం ఆర్నెల్ల క్రితమే ప్యాలెస్‌లోని అన్ని గదులను రిజర్వు చేసుకున్నారు. ఈ వేడుక కోసం బాలీవుడ్ మొత్తం హైదరాబాద్‌కు చేరుకుంటోంది. ఇప్పటికే కొందరు నగరానికి చేరుకోగా.. మంగళవారం పెళ్లి వేడుకకు అమితాబచ్చన్, షారుఖ్‌ఖాన్, అమీర్‌ఖాన్, రజనీకాంత్, కమలహాసన్ వంటి సూపర్ స్టార్లతో పాటు అగ్రశ్రేణి తారాగణమంతా హాజరవుతుందని సమాచారం. రాజకీయ ప్రముఖులు కూడా రానున్నారు. ఇక నగరంలో అతికొద్ది మందికి మాత్రమే ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే ఫలక్‌నుమా ప్రాంతంలో సందడి నెలకొంది. విద్యుత్ దీపాలతో ప్యాలెస్ మెరిసిపోతోంది. దాని చుట్టూ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో అభిమానులు కూడా ఇక్కడకు చేరుకుంటున్నారు. కాగా, పెళ్లి కూతురు అర్పితాఖాన్ సోమవారం ఉదయం నుంచిసాయంత్రం వరకు చుడీబజార్, చార్మినార్ పరిసరాల్లో ఎవరికంటా పడకుండా సాధారణ వ్యక్తిలా షాపింగ్ చేసినట్లు తెలిసింది. పెళ్లి విందు కోసం బిర్యానీతో పాటు పలు రకాల వంటకాలను ప్యారడైజ్ హోటల్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం. -
చెల్లి పెళ్లి వేదికకు రూ.2 కోట్ల ఖర్చు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సోదరి పెళ్లి చాలా భారీగా చేయబోతున్నాడు. ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయడానికి.. కేవలం ఒక్క వేదిక కోసమే అక్షరాలా రెండు కోట్లు ఖర్చు పెడుతున్నాడట. అది కూడా కేవలం రెండు రోజులకు చెల్లిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అర్పితాఖాన్ వివాహం ఈనెల 18న జరగనున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుక కోసం అరవై గదులున్న ఈ ప్యాలెస్ మొత్తాన్ని రెండు కోట్లు చెల్లించి సల్మాన్ బుక్ చేశారట. ఇక డెకరేషన్‌కు మళ్లీ విడిగా చెల్లించాల్సిదేనట. ఖాన్ పరివారం అంతా నవంబర్ 18నే నగరానికి చేరుకుంటుంది. పెళ్లి వేడుక అనంతరం 20వ తేదీన ముంబై తిరిగి వెళతారు. కాగా షాదీ వేడుకకు సుమారు 250 మంది అతిథులను ఆహ్వానించినట్లు పెళ్లికుతూరు అర్పిత సన్నిహితులు తెలిపారు. ఇప్పటికే సల్మాన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ టాలీవుడ్ హీరో వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు ఈ ఆహ్వానాన్ని అందుకున్నారు. వెంకటేష్ ఈ పెళ్లి వేడుకకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అయితే సురేష్ బాబు మాత్రం ప్రస్తుతం అయ్యప్ప మాలలో ఉండటంతో ఆయన హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది. ఇక వరుడు ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆయుష్ శర్మ. వీళ్లిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి రెండు కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముంది పెళ్లి ధూంధామ్‌గా చేయాలని నిర్ణయించారు. ఈ వివాహం ముస్లిం, హిందూ సంప్రదాయాల ప్రకారం జరగబోతున్నట్లు సమాచారం. నవంబర్ 18న సల్మాన్ తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్ల పెళ్లిరోజు. సరిగ్గా అదేరోజున అర్పిత పెళ్లి చేస్తున్నారు. -
వచ్చే నెలలోనే సల్మాన్ సోదరి పెళ్లి
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ పెళ్లి వచ్చే నెలలోనే జరగనుంది. తొలుత వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి జరగనున్నట్లు ప్రకటించినా, నవంబర్ 18న సల్మాన్ తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్ల పెళ్లిరోజు కావడంతో అదేరోజు అర్పితా పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆయుష్ శర్మతో అర్పితా ఖాన్ పెళ్లి నవంబర్ 18న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది.