వచ్చే నెలలోనే సల్మాన్ సోదరి పెళ్లి
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ పెళ్లి వచ్చే నెలలోనే జరగనుంది. తొలుత వచ్చే ఏడాది ప్రారంభంలో పెళ్లి జరగనున్నట్లు ప్రకటించినా, నవంబర్ 18న సల్మాన్ తల్లిదండ్రులు సలీమ్ ఖాన్, సల్మా ఖాన్‌ల పెళ్లిరోజు కావడంతో అదేరోజు అర్పితా పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త ఆయుష్ శర్మతో అర్పితా ఖాన్ పెళ్లి నవంబర్ 18న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరగనుంది.