తొలిసారి చెల్లెలు ఇంటికి అన్నయ్య
షిమ్లా: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన చెల్లెలు అర్పితా ఖాన్ రిసెప్షన్కు హిమాచల్ ప్రదేశ్లోని మండి పట్టణానికి వెళుతున్నారు. ఆయనను తమ రాష్ట్రానికి ప్రత్యేక అతిథిగా ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరుఫున హెలికాప్టర్ కూడా పంపించేందుకు హిమాచల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సల్మాన్ ఖాన్ ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకు తొలిసారి హాజరుకానుంది. అయూష్ శర్మతో తన చెల్లెలు అర్పితా వివాహం అయిన తర్వాత శర్మ వాళ్లింట్లో సంప్రదాయ బద్ధంగా జరిగే ధామ్ వేడుకను గ్రామీణాభివృద్ధిమంత్రి, ఆయుష్ శర్మ తండ్రి అయిన అనిల్ శర్మ ఘనంగా నిర్వహిస్తున్నారు. !
ఈ సందర్భంగా అర్పిత, ఆయుష్ రిసెప్షన్ కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు పదివేలమంది ఈ కార్యక్రమానికి ఆహ్వానించారట. అయితే, ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ మాత్రం కొంత బిజీ ఉన్న కారణంగా హాజరుకావడం లేదని సమాచారం. 'ధామ్' వేడుక ఆచారం ప్రకారం వచ్చిన అతిధులందరిని నేలపైనే కూర్చొబెట్టి ఆకులో భోజనం పెడతారు. రుచికరమైన వంటలు బోలెడు ఉంటాయి. ఈ భోజనం నాలుగు దశల్లో పూర్తవుతుంది.