పైసా సంపాదన లేదు.. అయినా సల్మాన్‌ చెల్లితో పెళ్లి చేశారు! | Aayush Sharma Recalls His Fathers Reaction When He Decided to Marry Salman Khan Sister Arpita | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ చెల్లితో పెళ్లి.. నా దగ్గర పైసా లేదు! నాన్నే పోషించాలని చెప్పా!

Published Sat, Apr 13 2024 2:24 PM | Last Updated on Sat, Apr 13 2024 7:30 PM

Aayush Sharma Recalls His Fathers Reaction When He Decided to Marry Salman Khan Sister Arpita - Sakshi

ప్రేమలో పడింది నువ్వు, పెళ్లి చేసుకునేది నువ్వు.. కానీ మీ బిల్లులు మాత్రం నేను కట్టాలా? అని నాన్న చిన్నగా కోప్పడ్డాడు. తర్వాత ఆయన రిలాక్స్‌ అయ్యాడు కానీ అమ్మ మా

బాలీవుడ్‌లోని బడా కోటీశ్వరుల్లో సల్మాన్‌ ఖాన్‌ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడికి వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ అతడి చెల్లి అర్పితఖాన్‌కు పెళ్లి చేసేటప్పుడు మాత్రం బావ సంపాదిస్తున్నాడా? లేదా? అని కూడా చూసుకోలేదు. చెల్లిని గుండెలో పెట్టి చూసుకుంటే చాలనుకున్నాడు. అలా లవ్‌ బర్డ్స్‌ అర్పిత ఖాన్‌, ఆయుశ్‌ శర్మ పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు.

అమ్మాయిని ఎలా పోషిస్తావు?
అయితే అర్పితను పెళ్లాడే సమయానికి ఆయుశ్‌ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నేను అర్పితను ప్రేమిస్తున్నానని చెప్పగానే అమ్మానాన్న షాకయ్యారు. నువ్వు ఏ పనీ చేయడం లేదు.. పైసా సంపాదించట్లేదు.. పెళ్లికి మాత్రం సిద్ధమయ్యావు. పైగా ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి పెళ్లి చేసుకున్నాక​ ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు? అని అడిగారు. నేనేం పోషించను.. అంతా మీరే చూసుకోవాలని చెప్పాను.

అమ్మ తెగ కంగారు
ప్రేమలో పడింది నువ్వు, పెళ్లి చేసుకునేది నువ్వు.. కానీ మీ బిల్లులు మాత్రం నేను కట్టాలా? అని నాన్న చిన్నగా కోప్పడ్డాడు. తర్వాత ఆయన రిలాక్స్‌ అయ్యాడు కానీ అమ్మ మాత్రం తెగ కంగారుపడిపోయింది. ఎందుకంటే నాదేమో పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ (కాంగ్రెస్‌ కీలక నేత పండిత్‌ సుఖ్‌ రామ్‌ మనవడే ఆయుశ్‌).. తనదేమో సినిమా బ్యాక్‌గ్రౌండ్‌. ఎలాగోలా వారిని ఒప్పించి సల్మాన్‌ ఖాన్‌ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాను.

కంగారు పడొద్దని సల్మాన్‌ భరోసా
అప్పుడు నాన్న.. 'మేమంతా హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండిలో నివసిస్తాం.. ఒకవేళ తప్పని పరిస్థితులు ఎదురైతే నువ్వు అక్కడికి రాగలవా?' అని అర్పితను అడిగాడు.. అందుకు సల్మాన్‌.. ఆయుశ్‌ ఎక్కడంటే అర్పిత అక్కడే ఉంటుంది. ఈ విషయంలో మీరేం కంగారుపడకండి అని భరోసా ఇచ్చాడు' అని తెలిపాడు. ఆయుశ్‌-అర్పిత జంటకు అయత్‌ అనే కూతురు, అఖిల్‌ శర్మ అనే కుమారుడు సంతానం.

చదవండి: ఎంతగానో ప్రేమిస్తే.. నన్ను మోసం చేశాడు.. ప్రతిరోజూ ఏడుపే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement