arpita khan
-
కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన స్టార్ హీరో చెల్లెలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ సీజన్-18కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. బిగ్‌బాస్ సెట్ వద్ద దాదాపు 60 మందితో భద్రత ఏర్పాటు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ అనే రౌడీ షీటర్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తాజాగా తన ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆయన సోదరి అర్పితా ఖాన్ శర్మ ముంబయిలోని ఖర్ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ.22 కోట్లకు విక్రయించినట్లు బాలీవుడ్లో టాక్. 2017లో ఆ ఇంటిని ఆమె రూ.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబయిలోని శివయ్య సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అపార్ట్‌మెంట్‌ను అమ్మినట్లు సన్నిహితులు తెలిపారు. ఆ ప్రాంతం పరిసరాల్లోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు. -
నాకు విడాకులిస్తున్నావా? అని భార్యను అడిగా: నటుడు
సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్, నటుడు ఆయుశ్ శర్మ కామన్ ఫ్రెండ్స్ ద్వారా 2011లో కలిశారు. మొదట ఫ్రెండ్సయ్యారు. తర్వాత లవ్ బర్డ్స్ అయ్యారు. 2014లో భార్యాభర్తలయ్యారు. అనంతరం అహిల్(కుమారుడు), అయత్ (కూతురు)లకు పేరెంట్స్ అయ్యారు. అయితే 2019లో వీరిద్దరూ విడిపోతున్నట్లు రూమర్స్ వచ్చాయి.దోస తిని వచ్చేలోపుఆ పుకార్లను పటాపంచలు చేస్తూ వీరిద్దరి మధ్య బంధం ఏ యేటికాయేడు మరింత స్ట్రాంగ్ అవుతూ వస్తోంది. తాజాగా ఆయుశ్ అప్పటి విడాకుల రూమర్స్ గురించి స్పందించాడు. నా లైఫ్ గురించి పుకార్లు రాసేంత ఇంట్రస్ట్ ఎవరికీ ఉండేది కాదు. కానీ ఓసారి చిన్న సంఘటన జరిగింది. నేను నా బాబును బయటకు తీసుకెళ్లి దోస తినిపించి వస్తున్నాను. విడాకులు తీసుకుంటున్నారా?క్షణాల్లో కొందరు ఫోటోగ్రాఫర్లు నా ముందు జమగూడి అర్పిత, మీరు విడాకులు తీసుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న విని షాకయ్యాను. ఇంటికెళ్లాక అర్పిత, నేను దీని గురించి మాట్లాడుకుని నవ్వుకున్నాం. ఏంటి? నాకు విడాకులిస్తున్నావంటగా? అని అర్పితను ఆటపట్టించాను' అని ఆయుశ్ చెప్పుకొచ్చాడు.చదవండి: బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్.. బాబు ఊయల ఫంక్షన్ -
పైసా సంపాదన లేదు.. అయినా సల్మాన్ చెల్లితో పెళ్లి చేశారు!
బాలీవుడ్‌లోని బడా కోటీశ్వరుల్లో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో ఉంటాడు. ఎప్పుడూ సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడే ఇతడికి వేలకోట్ల ఆస్తులున్నాయి. కానీ అతడి చెల్లి అర్పితఖాన్కు పెళ్లి చేసేటప్పుడు మాత్రం బావ సంపాదిస్తున్నాడా? లేదా? అని కూడా చూసుకోలేదు. చెల్లిని గుండెలో పెట్టి చూసుకుంటే చాలనుకున్నాడు. అలా లవ్ బర్డ్స్ అర్పిత ఖాన్, ఆయుశ్ శర్మ పెద్దలను ఒప్పించి 2014లో పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు. అమ్మాయిని ఎలా పోషిస్తావు? అయితే అర్పితను పెళ్లాడే సమయానికి ఆయుశ్ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉన్నాడట! ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. 'నేను అర్పితను ప్రేమిస్తున్నానని చెప్పగానే అమ్మానాన్న షాకయ్యారు. నువ్వు ఏ పనీ చేయడం లేదు.. పైసా సంపాదించట్లేదు.. పెళ్లికి మాత్రం సిద్ధమయ్యావు. పైగా ఆమె ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి పెళ్లి చేసుకున్నాక ఆ అమ్మాయిని ఎలా పోషిస్తావు? అని అడిగారు. నేనేం పోషించను.. అంతా మీరే చూసుకోవాలని చెప్పాను. అమ్మ తెగ కంగారు ప్రేమలో పడింది నువ్వు, పెళ్లి చేసుకునేది నువ్వు.. కానీ మీ బిల్లులు మాత్రం నేను కట్టాలా? అని నాన్న చిన్నగా కోప్పడ్డాడు. తర్వాత ఆయన రిలాక్స్ అయ్యాడు కానీ అమ్మ మాత్రం తెగ కంగారుపడిపోయింది. ఎందుకంటే నాదేమో పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ (కాంగ్రెస్ కీలక నేత పండిత్ సుఖ్ రామ్ మనవడే ఆయుశ్).. తనదేమో సినిమా బ్యాక్‌గ్రౌండ్. ఎలాగోలా వారిని ఒప్పించి సల్మాన్ ఖాన్ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేశాను. కంగారు పడొద్దని సల్మాన్ భరోసా అప్పుడు నాన్న.. 'మేమంతా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో నివసిస్తాం.. ఒకవేళ తప్పని పరిస్థితులు ఎదురైతే నువ్వు అక్కడికి రాగలవా?' అని అర్పితను అడిగాడు.. అందుకు సల్మాన్.. ఆయుశ్ ఎక్కడంటే అర్పిత అక్కడే ఉంటుంది. ఈ విషయంలో మీరేం కంగారుపడకండి అని భరోసా ఇచ్చాడు' అని తెలిపాడు. ఆయుశ్-అర్పిత జంటకు అయత్ అనే కూతురు, అఖిల్ శర్మ అనే కుమారుడు సంతానం. చదవండి: ఎంతగానో ప్రేమిస్తే.. నన్ను మోసం చేశాడు.. ప్రతిరోజూ ఏడుపే! -
సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో భారీ దొంగతనం
ఇటీవల సెలబ్రిటీల ఇళ్లలో వరుస చోరీలు కలకలం రేపుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య రజనీకాంత్‌ల ఇళ్లలో ఈమధ్య భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో చోరీ జరిగింది. చదవండి: అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న కృతిశెట్టి? ఈనెల 16న తన డైమెండ్ ఇయరింగ్స్ పోయాయని గమనించిన అర్పితా అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాటి విలువ రూ. 5 లక్షలకు పైనే ఉంటుందని పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ఇంటిదొంగల పనే అని కనిపెట్టారు. అర్పితాఖాన్ ఇంట్లో 11మంది పనివాళ్లు ఉన్నారు. వారిలో సందీప్ హెగ్డే అనే పనిమనిషి మాత్రం దొంగతనం జరిగిన రోజు నుంచీ కనిపించకుండా పోయాడు. అతడి ఇంట్లో పోలీసులు సోదా చేయగా అర్పితా ఖాన్ చెవిపోగులు దొరికాయాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సందీప్ హెగ్డేను అరెస్ట్ చేశారు. చదవండి: శింబుకి షాక్ ఇచ్చిన దీపికా పదుకొణె.. ఆ కండీషన్స్‌కి దిమ్మతిరిగిపోయిందట -
సల్మాన్ ఖాన్ చెల్లెలా? మజాకా? కోట్లు పెట్టి కొత్త ఇల్లు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ముంబైలోని ఓ భవంతిలో 12వ అంతస్తులో ఉన్న లగ్జరీ ఫ్లాట్‌ను తన సొంతం చేసుకుంది. బీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ ఫ్లాట్ విస్తీర్ణం 1750 చదరపు గజాలు కాగా దీని కోసం అర్పిత ఏకంగా రూ.10 కోట్లు ఖర్చు పెట్టింది. రిజిస్ట్రేషన్‌లో భాగంగా స్టాంప్‌డ్యూటీ కింద రూ.40 లక్షలు చెల్లించింది. ఈ వార్త విన్న నెటిజన్లు సల్మాన్ ఖాన్ చెల్లెలా, మజాకా? ఎంతైనా వాళ్ల రేంజే వేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అర్పిత ఖాన్ నటుడు ఆయుశ్ శర్మతో కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింది. 2014 నవంబర్ 18న హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా అర్పిత దంపతులకు ఇద్దరు కుమారులు అఖిల్ శర్మ, అయత్ శర్మ జన్మించారు. -
ఆ పెళ్లితో షారుక్-సల్మాన్ల గొడవకి శుభం కార్డు
మన మధ్య వచ్చే గొడవలు, వివాదాలకు శుభకార్యాలతో శుభం పలకడం సాధారణంగా జరిగే విషయం. సామాన్యులకే కాక సెలబ్రిటీలకు కూడా ఇదే పద్దతి వర్తిస్తుంది. బాలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోల మధ్య తలెత్తిన వివాదానికి ఓ వివాహమే శుభం కార్డు వేసింది. ఏంటా వివాదం.. ఎవరిదా పెళ్లి అనే విషయాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్‌లది పాతికేళ్ల మైత్రి బంధం. అయితే కత్రినా కైఫ్ పుట్టిన రోజులో జరిగిన ఓ గొడవతో వీరి ఫ్రెండ్షిప్ బ్రేక్ అయ్యింది. ఇద్దరు స్టార్ హీరోలే.. ఇగో కూడా ఒకే రేంజ్లో ఉంటుంది. దాంతో మధ్యవర్తిత్వం లాంటి ప్రయత్నాలన్ని బెడిసి కొట్టాయి. ఇక వీరిద్దరి మధ్య దూరం శాశ్వతంగా కొనసాగుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. అయితే అనూహ్యంగా ఓ పెళ్లి కార్డు వీరి మధ్య దూరానికి శుభం కార్డు వేసింది. ఇద్దరు స్టార్లని కలిపిన ఆ పెళ్లి ఎవరిది అంటే సల్మాన్ సోదరి అర్పితా ఖాన్‌ది. (చదవండి: ‘ఐశ్వర్య విషయంలో దురదృష్ట వంతుడిని’) అవును ఈ వివాహంతోనే ఇద్దరి హీరోల మధ్య దూరం కరిగిపోయింది. సల్మాన్ తన సోదరి వివాహాన్ని ఎంతో వైభవంగా జరిపించారు. హైదరాబాద్‌లోని ఫలక్నమా ప్యాలేస్ వివాహ వేదికగా మారిపోయింది. అయితే అనూహ్యంగా ఈ వివాహానికి తాను హాజరవుతున్నట్లు షారుక్ ప్రకటించారు. ‘అర్పిత పెళ్లికి నేను తప్పక వెళ్తాను. చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి అర్పిత నాకు తెలుసు. తనను నా చేతుల్లో పెంచాను. ఆమె నాకు సోదరి. ఆహ్వానం అందకపోయినా సరే తన పెళ్లికి నేను తప్పక హాజరవుతాను. వారు నా కుటుంబ సభ్యుల్లాంటి వారు. నేను తప్పక వెళ్తాను’ అన్నారు. అయితే షారుక్ వివాహానికి కాకుండా ముంబైలో జరిగిన సంగీత్ ఫంక్షన్‌కి హాజరయ్యారు. ఇక రిసెప్షన్లో అతిథులని పలకరించి.. కుటుంబ సభ్యుడి మాదిరిగానే డ్యాన్స్ కూడా చేశారు. ఓ నెల తర్వాత ఓ కార్యక్రమంలో షారుక్.. తనకు, సల్మాన్‌కు మధ్య ఏర్పడ్డ ప్యాచ్ అప్ గురించి మాట్లాడారు. (చదవండి: ఆమెతో సల్మాన్ పెళ్లి ప్రపోజల్ రిజక్ట్ అయింది..) "అహంకారంతో కాదు, చాలా వినయంతో చెప్తున్నాను. మా ఇద్దరి జీవితాల్లో ఆనందకరమైన క్షణాలు ఎక్కువగా ఉన్నాయి. బాధపడ్డ క్షణాలు చాలా తక్కువ ఉన్నాయి. కాని నేను భరోసా ఇవ్వగల ఒక విషయం ఏమిటంటే, జీవితంలో మేం ఎల్లప్పుడూ ఒకరితోఒకరి ఆనందం, నిరాశపూరిత క్షణాలను కలిసి పంచుకుంటాం. మేం ఇప్పుడు కలిసి పోయాం. ప్రస్తుతం మా మధ్య ఉన్న బంధం గత 25 సంవత్సరాలుగా ఎలా ఉందే ఇప్పుడు అలానే ఉంది. చేడు ఉద్ధేశాలు లేవు. బయటి నుంచి చూసే వారికి మేం పొగరుబోతులుగా.. గొడవపడే వారిగా కనిపించవచ్చు. కానీ మా స్నేహం ముందు అవన్ని చాలా స్వల్పం. అర్పిత నా కళ్ళ ముందు పెరిగింది. ఇక్కడ విషయం ఏంటంఏ మా సోదరి వివాహం చేసుకోబోతుంది.. ఇలాంటి ఆనంద సమయంలో నేను తనతో ఉండాలి. అందుకే వెళ్లాను" అన్నారు షారుక్. ఇక అర్పిత, ఆయుష్ శర్మల వివాహం జరిగి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తయ్యాయి. -
ఆయనే నా సర్వస్వం : అర్పితా ఖాన్
ముంబై: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ భావోద్వేగంతో సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ చేశారు. సోదరుడే తన సర్వస్వమని తెలిపారు. ‘నా బలం, నా బలహీనత, నా గర్వం, నా సంతోషం, నా జీవితం, నా ప్రపంచం. నిన్ను, నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారందరినీ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నా. వారి చెడు దృష్టి నీపై పడకుండా నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ఇంకా ప్రకాశవంతం కావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. నీ విజయం, మంచి పనులు నిన్ను ద్వేషించే వారిని అంధుల్ని చేయాలి. లవ్ యూ భాయ్’ అని ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 1998లో నమోదైన ఈ కేసుకు సంబంధించి జోధ్‌పూర్ న్యాయస్థానం గత గురువారం తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ జోధ్‌పూర్ సెంట్రల్ జైలులో రెండు రోజులు గడిపారు. ఆ తర్వాత బెయిలుపై బయటికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ముంబయిలో ఉన్నారు. తన తర్వాతి చిత్రం షూటింగ్‌కు కూడా ఆయన వెళ్లనున్నట్లు సమాచారం. సల్మాన్ ‘టైగర్ జిందా హై’ చిత్రంతో ఇటీవల మంచి హిట్ అందుకున్నారు. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ.570 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీని తర్వాత ఆయన ‘రేస్ 3’ సినిమాలో నటిస్తున్నారు. సల్మాన్ హీరోగా ‘భారత్’, ‘దబాంగ్ 3’, ‘కిక్ 2’ సినిమాలు తెరకెక్కనున్నాయి. -
టాప్ హీరో సోదరి ఇంట్లో దొంగతనం!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. అర్పితాఖాన్, ఆమె భర్త ఆయూష్ శర్మ నివసిస్తున్న బాంద్రాలోని పసిఫిక్ హైట్స్ అపార్ట్ మెంట్ లో దొంగలు పడ్డారు. రూ. 3.5 లక్షలు విలువచేసే నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. విహారయాత్ర నుంచి ఆదివారం తిరిగివచ్చిన అర్పితాఖాన్ దంపతులు ఇంట్లో దొంగలు పడిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్పితాఖాన్ ఇంట్లో పనిచేసే ఆఫ్సా అనే పనిమనిషి మీదనే తమకు అనుమానం ఉందని, గత నెల 30వతేదీనుంచి ఆమె కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. గత ఆదివారం కన్నా ముందే అర్పితాఖాన్ ఇంట్లో దొంగతనం జరిగి ఉంటుందని వారు చెప్పారు. రూ. 2.25 లక్షలు, 10 గ్రాముల గోల్డ్ చెయిన్, డిజైనర్ దుస్తులను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు. -
మరో కొత్త వ్యాపారంలోకి సల్మాన్
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరో వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నాడట. ఈ విషయాన్ని ఆయన సోదరి అర్పిత ఖాన్ స్వయంగా వెల్లడించింది. ' రీటైల్ జ్యుయెల్లరీ ఇండియా 2016' అవార్డుల కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. సల్మాన్ ఖాన్ ఫామస్ బ్రాండ్ ది బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ద్వారా నగల వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్టు తెలిపింది. తమకెంతో ఇష్టమైన జ్యుయెల్లరీ బిజెనెస్ ను వచ్చే త్వరలోనే లాంచ్ చేయనున్నామని చెప్పింది. అందుకే తాను ఈ ఈవెంట్ కి హాజరయ్యానని వివరించింది. వచ్చే నెల నుంచే ఆభరణాల పరిశ్రమలోకి ప్రవేశించనున్నామని ప్రకటించిన అర్పిత బీయింగ్ హ్యూమన్ బ్రాండ్ ఉత్పత్తులు సరసమైన ధరలతో అన్ని రకాల వినియోగదారులకు అందుబాటులో వుండేలా చూస్తామన్నారు. ముఖ్యంగా 70 శాతం మహిళల కోసం 30శాతం పురుషులకుపయోగపడేలా తమ కలెక్షన్ ఉండబోతోందన్నారు. నటి ఇషా డియోల్, దర్శకుడు దివ్య ఖోస్లా కుమార్ అవార్డుల ప్యానెల్ లో జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. కాగా బీయింగ్ హ్యూమన్ అని రాసి ఉన్న టీషర్ట్ లతో సల్మాన్ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. దీని ద్వారా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు అందిస్తున్నాడు. మరోవైపు 1998 నాటి కృష్ణజింకలు, చింకారలని వేటాడి చంపినట్టుగా నమోదైన అభియోగాలను విచారించిన రాజస్థాన్ హై కోర్టు సల్మాన్ కు భారీ ఊరట నిచ్చింది. కింది కోర్టు తీర్పును కొట్టివేసిన హైకోర్టు... దోషిగా తేల్చడానికి సరైన ఆధారాలు లేవంటూ, సల్మాన్‌ను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మేనల్లుడితో మురిపెంగా..!
సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే తన సోదరీ, సోదరుల బిడ్డలను బాగా చూసుకుంటారు. తాజాగా ఈయనగారి ముద్దుల చెల్లి అర్పితా ఖాన్ ఒక మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ బుడతడికి అహిల్ అని పేరు పెట్టారు. మేనల్లుణ్ణి ఎత్తుకుని, సల్మాన్ ఇలా మురిసిపోయారు. -
తరలివచ్చిన తారాగణం
-
అంగరంగ వైభవంగా అర్పితాఖాన్ వివాహం
-
చెల్లెలికి రూ. 16 కోట్ల ఫ్లాట్ బహుమతి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితా ఖాన్ - ఆయుష్ శర్మల పెళ్లి కార్యక్రమం వైభవంగా జరిగింది. దీనికి పలువురు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. తన గారాల చెల్లెలి పెళ్లి సందర్భంగా సల్మాన్ ఆమెకు 16 కోట్ల రూపాయల విలువ చేసే టెర్రెస్ ఫ్లాట్‌ను కానుకగా ఇచ్చారు. ఈ ఫ్లాట్ ముంబైలో ఉంది. దాని తాళాలను పెళ్లిలో అర్పితకు ఇచ్చారు. రాత్రి ఏడు గంటలకు బారాత్ ప్రారంభం అవుతోంది. ఈ వినోద కార్యక్రమంలో సల్లూభాయ్‌తో పాటు.. బాలీవుడ్ నటీమణులు మలైకా అరోరా ఖాన్, అమృతా అరోరా తదితరులు కూడా డాన్సులు చేస్తున్నారు. కాగా, సోమవారం ముంబైలో జరిగిన సంగీత్ కార్యక్రమంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ షీలాకీ జవానీ పాటకు డాన్సు చేసింది. -
6 గంటలకు పెళ్లి.. 7 గంటలకు బారాత్
ఆకాశమంత పందిరి.. భూదేవంత పీట వేసి అంగరంగ వైభవంగా తన ముద్దుల చెల్లెలు అర్పితాఖాన్ పెళ్లి చేయిస్తున్నాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్. హైదరాబాద్‌లోని చరిత్రాత్మక ఫలక్‌నుమా ప్యాలెస్‌లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఫర్మానా, 6 గంటలకు పెళ్లి ముహూర్తం, 7 గంటలకు బారాత్ ఉంటాయని సల్మాన్ కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. వినోద కార్యక్రమంలో సల్మాన్‌ఖాన్‌తో పాటు మలైకా అరోరా ఖాన్, అమృతా అరోరా తదితరులు నృత్యాలు చేస్తారు. ఈ పెళ్లికి బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్, అలనాటి నటీమణులు చాలామంది హాజరవుతున్నారు. -
సల్మాన్ సోదరి మెహందీకి సంగీతా బిజ్లానీ
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితా ఖాన్ మెహందీ వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా గెలాక్సీ గ్రాండ్ రెసిడెన్సీలో ఈ వేడుక మొదలైంది. ఈ కార్యక్రమానికి అలనాటి అందాల నృత్యతార హెలెన్, ఇంకా సంగీతా బిజ్లానీ, అల్విదాఖాన్, అతుల్ అగ్నిహోత్రి తదితరులు హాజరయ్యారు. అంతకుముందు పెళ్లి వేడుక కోసం సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులంతా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారీ బందోబస్తు నడుమ చేరుకున్నారు. అక్కడి నుంచి వాళ్లంతా ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తరలివెళ్లారు. సోమవారం సాయంత్రం సంగీత్ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. -
దేవుడు కలిపిన బంధం!
అనంతరం రక్త సంబంధాన్ని మించినదేదీ ఈ ప్రపంచంలో లేదని అంటారు. కానీ బంధం దృఢంగా ఉండాలంటే రక్తం పంచుకోనక్కర్లేదు, ప్రేమను పంచుకుంటే చాలు అంటుంది అర్పితాఖాన్. తోడబుట్టకపోయినా సొంత తోబుట్టువులా తనను కళ్లలో పెట్టుకుని చూసే అన్న సల్మాన్‌ఖాన్ అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. అందుకే... అతడు తనకు దేవుడిచ్చిన అన్నయ్య అంటుందామె! పేగు తెంచుకు పుట్టిన పిల్లల్ని ఏ తల్లిదండ్రులైనా ప్రేమగానే చూస్తారు. కానీ తమ కడుపున పుట్టకపోయినా, తమ రక్తాన్ని పంచుకోకపోయినా, తమ కంటిపాపలా పెంచారు నన్ను అమ్మానాన్నా (సలీంఖాన్, సల్మా). ముగ్గురన్నలు, ఒక అక్క ఉన్న ఇంట్లోకి నేను చిట్టి చెల్లెలిగా అడుగుపెట్టాను. వాళ్లందరి చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగాను. అన్నయ్యలందరిలోకీ సొహైల్‌తో నేను ఎక్కువ క్లోజ్. తనతోనే ఎక్కువ ఆడేదాన్ని. తనెక్కడికి వెళ్లినా వెంట తయారైపోయేదాన్ని. తన దగ్గరే ఎక్కువ గారాబం చేసేదాన్ని. అలాగని సల్మాన్ భాయ్‌కి క్లోజ్ కాదని కాదు. తన దగ్గర చనువు ఉన్నా ఏదో గౌరవం కాస్త దూరంగా ఉంచుతూ ఉంటుంది. ఇంటికి పెద్దవాడు అన్న భయం, పెద్ద సూపర్‌స్టార్ అన్న గౌరవం మనసు నిండా నిండిపోతాయి అన్నయ్యను చూస్తే. తను చాలా సీరియస్‌గా ఉంటాడని అందరూ అనుకుంటారు. కానీ చాలా ఎమోషనల్‌గా కూడా ఉంటాడని చాలామందికి తెలియదు. రిలేషన్‌షిప్స్‌కి చాలా విలువిస్తాడు. తన అనుకున్నవారిని కంటికి రెప్పలా కాపాడతాడు. ఏ లోటూ లేకుండా చూసుకోవాలని తపిస్తాడు. ఇక నన్నయితే చాలా ముద్దు చేస్తాడు. అన్నయ్యతో బయటకు వెళ్తే ఓ వింత ప్రపంచంలోకి వెళ్లినట్టుగా ఫీలయ్యేదాన్ని చిన్నప్పుడు. ఎందుకంటే... తన చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. లేదంటే తనని అడుగు కూడా కదపనివ్వరు ఫ్యాన్స్. చుట్టుముట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అంతమందిలో నా చేయి పట్టుకుని తను నన్ను తీసుకెళ్తుంటే చాలా గర్వంగా అనిపించేది. షాపింగుకి తీసుకెళ్తాడు. కావలసినవన్నీ కొనిస్తాడు. మొన్నటికి మొన్న ఐపీఎల్ కోసం దుబాయ్ వెళ్లినప్పుడు కూడా నన్ను షాపింగుకి తీసుకెళ్లాడు. ఓ పక్క ఫ్లయిట్ టైమవుతున్నా... నన్ను ఓపిగ్గా తిప్పి, అడిగినవన్నీ కొనిచ్చాడు. ఇరవై మూడేళ్లు వచ్చినా, నన్నిప్పటికీ చిన్నపిల్లలాగే చూస్తుంటాడు. నన్ను ఎవరైనా ఏదైనా అంటే తనకి చాలా కోపమొచ్చేస్తుంది. వెంటనే సీరియస్ అయిపోతాడు. ఎంత బిజీగా ఉండే వ్యక్తి అయినా నా కోసం టైమ్ కేటాయిస్తుంటే చాలా సంతోషమేస్తుంది నాకు. అన్నయ్య గురించి ఎప్పుడూ ఏవో రూమర్లు రాస్తూనే ఉంటారు. చానెళ్లన్నీ పనిగట్టుకుని ఏవేవో కథనాలు ఇస్తూ ఉంటాయి. కానీ నాకు తెలిసి అన్నయ్యను ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదు. తన కోపం గురించే అందరూ మాట్లాడతారు తప్ప, తన ప్రేమ గురించి ఎవరూ తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. సమాజం దారుణంగా అపార్థం చేసుకున్న వ్యక్తులో మా అన్నయ్య ఒకడు. అందరూ అనుకుంటున్నట్టు తను కోపిష్టి కాదు. మంచి మనసున్నవాడు. ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ అబద్ధాలు చెప్పేవాళ్లని, మోసగాళ్లని దూరంగా ఉంచుతాడు. నచ్చని విషయాన్ని ముఖమ్మీదే చెప్పేస్తాడు. అందుకే అందరి దగ్గర చెడు అవుతుంటాడు. మా అన్నయ్య ఎంత మంచివాడో నాకంటే ఎవరికి బాగా తెలుస్తుంది!