
టాప్ హీరో సోదరి ఇంట్లో దొంగతనం!
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో దొంగతనం జరిగింది. అర్పితాఖాన్, ఆమె భర్త ఆయూష్ శర్మ నివసిస్తున్న బాంద్రాలోని పసిఫిక్ హైట్స్ అపార్ట్ మెంట్ లో దొంగలు పడ్డారు. రూ. 3.5 లక్షలు విలువచేసే నగదు, బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. విహారయాత్ర నుంచి ఆదివారం తిరిగివచ్చిన అర్పితాఖాన్ దంపతులు ఇంట్లో దొంగలు పడిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అర్పితాఖాన్ ఇంట్లో పనిచేసే ఆఫ్సా అనే పనిమనిషి మీదనే తమకు అనుమానం ఉందని, గత నెల 30వతేదీనుంచి ఆమె కనిపించడం లేదని పోలీసులు తెలిపారు. గత ఆదివారం కన్నా ముందే అర్పితాఖాన్ ఇంట్లో దొంగతనం జరిగి ఉంటుందని వారు చెప్పారు. రూ. 2.25 లక్షలు, 10 గ్రాముల గోల్డ్ చెయిన్, డిజైనర్ దుస్తులను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపారు.