కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన స్టార్ హీరో చెల్లెలు! | Salman Khan Sister Arpita Khan Sharma Sells Apartment In Mumbai For Whopping Amount, Deets Inside | Sakshi
Sakshi News home page

Arpita Khan Sharma: కోట్ల రూపాయల ఇంటిని అమ్మేసిన సల్మాన్ ఖాన్‌ చెల్లెలు!

Published Sun, Oct 20 2024 4:09 PM | Last Updated on Sun, Oct 20 2024 5:16 PM

Salman Khan sister Arpita Khan Sharma sells apartment in Mumbai

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్‌ సీజన్-18కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. బిగ్‌బాస్‌ సెట్‌ వద్ద దాదాపు 60 మందితో భద్రత ఏర్పాటు చేశారు. లారెన్స్‌ బిష్ణోయ్ అనే రౌడీ షీటర్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తాజాగా తన ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆయన సోదరి అర్పితా ఖాన్ శర్మ ముంబయిలోని ఖర్ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ.22 కోట్లకు విక్రయించినట్లు బాలీవుడ్‌లో టాక్. 2017లో ఆ ఇంటిని ఆమె రూ.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబయిలోని శివయ్య సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అపార్ట్‌మెంట్‌ను అమ్మినట్లు సన్నిహితులు తెలిపారు. ఆ ప్రాంతం పరిసరాల్లోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్‌లతో సహా పలువురు బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement