Arpita Khan Sharma
-
కోట్ల విలువైన ఆస్తిని అమ్మేసిన స్టార్ హీరో చెల్లెలు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హిందీ బిగ్‌బాస్ సీజన్-18కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయనకు బెదిరింపులు రావడంతో భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు. బిగ్‌బాస్ సెట్ వద్ద దాదాపు 60 మందితో భద్రత ఏర్పాటు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ అనే రౌడీ షీటర్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ తాజాగా తన ఇంటిని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఆయన సోదరి అర్పితా ఖాన్ శర్మ ముంబయిలోని ఖర్ ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను రూ.22 కోట్లకు విక్రయించినట్లు బాలీవుడ్లో టాక్. 2017లో ఆ ఇంటిని ఆమె రూ.18 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ముంబయిలోని శివయ్య సినీవైజ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి అపార్ట్‌మెంట్‌ను అమ్మినట్లు సన్నిహితులు తెలిపారు. ఆ ప్రాంతం పరిసరాల్లోనే షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లతో సహా పలువురు బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు. -
ప్లేట్లు నేలకేసి కొట్టిన హీరో సోదరి!
అబుదాబి: చేతికి అందిన ప్లేట్లను అందినట్లుగా నేలకేసి కొట్టారు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ. ఆ తర్వాత స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయమేమిటంటే.. అర్పితా ఖాన్ శర్మ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో తన ఫ్రెండ్స్‌లో కలిసి స్థానిక రెస్టారెంటుకు వెళ్లారు. ఇక అప్పటికే అక్కడ ప్లేట్లు పగులకొట్టే కార్యక్రమం మొదలైంది. దీంతో అర్పిత కూడా అందులో భాగమయ్యారు. ఆ తర్వాత మ్యూజిక్ వింటూ అందుకు అనుగుణంగా స్టెప్పులేశారు. కాగా గ్రీకు ఆచారం ప్రకారం.. దుష్టశక్తులను పారద్రోలేందుకు ఇలా ప్లేట్లను పగులగొడుతూ ఉంటారు. (చదవండి: మద్యం మత్తులో ఎస్సైపై యువతి దాడి) కాగా అర్పితా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తమ కుటుంబానికి సంబంధించిన అప్డేట్లు తెలియజేస్తూ పోస్టులు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా భాయీజాన్ సల్మాన్‌తో తన అనుబంధం, తన పిల్లలతో సల్లూభాయ్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు తరచుగా షేర్ చేస్తూ ఉంటారు. ఇక అర్పిత సల్మాన్ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. ఖాన్ కుటుంబం ఆమెను దత్తత తీసుకుంది. కాగా 2014లో ఆయుష్ శర్మతో అర్పిత పెళ్లి సందర్భంగా దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను సల్మాన్ చెల్లెలికి బహుమతిగా ఇవ్వడం అప్పట్లో వైరలైన సంగతి తెలిసిందే. (చదవండి: టీవీ నటి దివ్య భట్నాగర్ మృతి) View this post on Instagram A post shared by Sharmila Maiti Official (@sharmilashowhouse) -
మేనకోడలిపై ముద్దులు కురిపించిన సల్మాన్..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో పిల్లలు కావాలి.. కానీ భార్య వద్దూ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. కాగా పిల్లలపై భాయిజాన్‌కు ఉన్న ప్రేమను చూసి ఆయన చెల్లెలు అర్పితా ఖాన్ అన్నయ్య కోసం తన కూతురు(అయాత్)ను దత్తత ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అన్నయ్య పుట్టిన రోజు నాడే అయాత్కు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే సల్మాన్ బర్త్ డే(డిసెంబర్ 27)న ఆడబిడ్డకు జన్మనిచ్చి బహుమతిగా ఇచ్చారు ఆర్పితా దంపతులు. (బావకు బహుమతి ఇవ్వాలనే ఇలా...) స్టార్ అంబాసిడర్, స్మార్ట్‌ఫోన్ గెల్చుకునే చాన్స్ View this post on Instagram We love you Mamu @beingsalmankhan A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on Mar 7, 2020 at 3:06am PST తాజాగా కోడలు అయాత్పై భాయిజాన్ ముద్దుల వర్షం కురిపిస్తూ.. చిన్నారితో ఆడుకుంటున్న వీడిమోను ఆర్పితా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్మాన్ తన ముద్దుల కోడలికి పదే పదే ముద్దులు పెడుతూ.. తనతో ఆడుకుంటున్న ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ‘వావ్.. అయాత్ ఎంత ముద్దుగా ఉంది’, ‘మామకు కోడలంటే ఎంత ఇష్టమో’ అంటూ నెటిజన్లు హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. కాగా భాయాజాన్కు కూడా చెల్లలు అర్పితా అంటే కూడా చాలా ఇష్టం. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మనవడు ఆయుష్ శర్మతో ఆర్పితా వివాహం 2014లో జరిగింది. చెల్లెలి పెళ్లిని సల్మాన్ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇక అర్పిత సల్మాన్ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు. -
బావకు బహుమతి ఇవ్వాలనే ఇలా...
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా-అయుష్ దంపతులు డిసెంబర్ 27న రెండవ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే భాయిజాన్ పుట్టిన రోజునే ఈ దంపతులకు కూతురు జన్మించడం విశేషం. దీంతో కుటుంబ సభ్యులంతా సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతున్నారు. ఈ విషయం గురించి సల్మాన్ బావ(అర్పిత భర్త) అయుష్ శర్మ చెబుతూ.. ‘సల్మాన్ బర్త్ డే రోజే నా కూతురు అయాత్ను భూమి మీదకు తీసుకురావాలనుకున్నాను. ఇది పూర్తిగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. ఆయన పుట్టిన రోజు కానుకగా నా కూతురు అయాత్ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని చెప్పాడు. ‘అర్పిత డిసెంబర్ చివరి వారంలో కానీ జనవరి మొదటి వారంలో కానీ డెలివరి కానున్నట్లు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం చెప్పగానే సల్మాన్ భాయ్ ఎంతో సంబరపడి తనకు ఆ బిడ్డను బహుమతిగా ఇవ్వమని కోరాడు. ఇక అప్పుడే మేము గట్టిగా నిర్ణయించుకున్నాం. సల్మాన్ బర్త్ డే నాడే అర్పితకు డెలివరి చేయాలని డాక్టర్లను కోరాను’ అని తెలిపాడు. ఇక తన బర్త్‌డే రోజునే మేనకోడలు కూడా పుట్టిన సందర్భంగా సల్మాన్ ఖాన్.. ‘ఈ అందమైన ప్రపంచంలోకి అడుగు పెడుతున్న నా మేనకోడలు అయాత్కు స్వాగతం. నా పుట్టిన రోజు కానుకగా కుటుంబమంతటికీ అందమైన బహుమతిని ఇస్తున్న అర్పిత, అయుష్లకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా అర్పితా ఖాన్ వివాహం 2014లో ఆయుష్ శర్మతో హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి సందర్భంగా దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను సల్మాన్ చెల్లెలికి బహుమతిగా ఇచ్చాడు. ఇక అర్పిత సల్మాన్ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు. View this post on Instagram Welcome to this beautiful world Ayat. You’ve brought a lot of happiness into our lives. May you touch everyone’s life with a lot of love and joy A post shared by Aayush Sharma (@aaysharma) on Dec 29, 2019 at 11:27pm PST -
రెండోసారి తల్లవుతున్న అర్పిత.. ఆరోజే..
ముంబై : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మకు తన అన్నయ్య అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీలు చిక్కినప్పుడల్లా సోదరుడిపై ఉన్న ప్రేమను చాటుకుంటారు ఆమె. సోషల్ మీడియాలో తమ బంధాన్ని ప్రతిబింబించే ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. సల్మాన్ కూడా అంతే. తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా... అంతకంటే ఎక్కువ ప్రేమనే అర్పితపై కురిపిస్తాడు. ఎంత బిజీగా ఉన్నా చిట్టి చెల్లెలికి సంబంధించిన ప్రతీ వేడుకకు హాజరై ప్రత్యేక బహుమతులతో ఆమెను ఆశ్చర్యపరుస్తాడు. అంతేకాదు మేనల్లుడు ఆహిల్‌ను సైతం ఎంతో గారాబం చేస్తాడు. అయితే ఇకపై సల్మాన్ ప్రేమ కేవలం ఆహిల్‌కు మాత్రమే పంచడం కుదరదట. ఎందుకంటే అతడికి తోడుగా చెల్లెలో, తమ్ముడో త్వరలోనే అర్పిత ఇంట అడుగుపెట్టబోతున్నారట. అవును అర్పిత ఇప్పుడు గర్భవతి. త్వరలోనే ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వచ్చే నెలలోనే ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చారు. అయితే ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. తన అన్నతో ఉన్న అనుబంధానికి గుర్తుగా సల్మాన్ పుట్టినరోజు అయిన డిసెంబరు 27న డెలివరీ(సీ- సెక్షన్) చేయాల్సిందిగా అర్పితా ఖాన్ డాక్టర్లను కోరారట. ఈ క్రమంలో అర్పిత- ఆయుష్ దంపతులు రెండో బిడ్డ భాయీజాన్ బర్త్‌డే నాడే ఈ లోకంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా అర్పితా ఖాన్ వివాహం 2014లో ఆయుష్ శర్మతో హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. చౌమహల్లా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై వారిని ఆశీర్వదించారు. పెళ్లి సందర్భంగా దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను సల్మాన్ చెల్లెలికి బహుమతిగా ఇచ్చాడు. ఇక అర్పిత సల్మాన్ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు. -
ఏకిపారేసిన హీరో చెల్లెలు
తమ కుటుంబంపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ పై స్పందిచవద్దని సన్నిహితులు, శ్రేయోభిలాషులను బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ శర్మ కోరింది. పనిపాట లేనివాళ్లు చేసే వ్యాఖ్యల గురించి పట్టించుకోవద్దని సలహాయిచ్చింది. ఈ మేరకు మంగళవారం తన ఇన్స్టాగ్రామ్ పేజీలో స్ట్రాంగ్ మెసేజ్ పోస్ట్ చేసింది. 'ఏ పని లేనివాళ్లు, అసూయపరులు, అభ్రతపరులు చేసే వ్యాఖ్యలు పట్టించుకోకండి. వీరు కామెంట్స్ కు ప్రాధాన్యత ఇవ్వొద్దు. ఇలాంటి వారు చేసే వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇస్తే తర్వాత దాన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. నా ఫొటోలు, కుటుంబం, భర్త, బరువు, ముఖం, రంగు, లైఫ్ స్టయిల్ గురించి వ్యాఖ్యలు చేసినా రెస్పాండ్ కావద్దు. నా పిల్లాడితో నేను ఏం చేస్తున్నాను, వాడి గురించి ఎటువంటి కేర్ తీసుకుంటున్నాను అనే విషయాల గురించి వాళ్లకు ఎందుకు? పనిపాటా లేకుండా ఎదుటి వాళ్ల వ్యక్తిగత విషయాల గురించి కామెంట్ చేసేవాళ్లను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే బదులు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుకదా? కుక్కల్లా మొరగడం మానేసి మంచి పనులు చేయాల'ని అర్పిత హితబోధ చేసింది. తన సంసారం జీవితం, సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి మీడియాలో పుంఖాను పుంఖాలు కథనాలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించింది. -
థాంక్యూ ప్రియాంక..!
తన భర్త ఎంతగానో ఇష్టపడే హీరోను కలిపిస్తే.. ఏ భార్యకైనా సంతోషమే కదా. సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ కూడా ఇప్పుడు అలాగే ఆనందపడుతోంది. తన భర్త ఆయుష్ శర్మను హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్‌తో కలిపించినందుకు ప్రియాంకాచోప్రాకు బోలెడంత థాంక్స్ చెబుతోంది. డ్వేన్ జాన్సన్ చాలా స్వీట్‌గా ఉన్నారని కూడా చెప్పింది. క్వాంటికో స్టార్‌ను చూడటం చాలా సంతోషంగా అనిపించిందని, త్వరలోనే ముంబైలో ప్రియాంకను కూడా కలుస్తామని అర్పిత ట్వీట్ చేసింది. అర్పిత దంపతులు ఇద్దరినీ న్యూయార్క్ నగరంలో చూడటం చాలా బాగుందని, ఓ వారం రోజుల్లో ముంబైలో కలుద్దామని ప్రియాంక ఆమెకు సమాధానం ఇచ్చింది. డ్వేన్ జాన్సన్ కూడా సమయం కేటాయించినందుకు థాంక్స్ చెప్పింది. 'బే వాచ్'లో జాన్సన్ సరసన ప్రియాంకా చోప్రా నటిస్తోంది. అందులో విక్టోరియా లీడ్స్ అనే నెగెటివ్ పాత్రను ఆమె పోషిస్తోంది. Thank you @TheRock for being so sweet , thank you @priyankachopra for making this possible -
హీరో చెల్లెలి బర్త్ డే పార్టీ భగ్నం
ముంబై: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పితా ఖాన్ శర్మ బర్త్ డే పార్టీకి అనుకోని అతిథులు వచ్చారు. తన 26వ పుట్టినరోజును పురస్కరించుకుని గతవారం పాలీ హిల్స్ లోని తన నివాసంలో గతవారం అర్పిత ప్రిబర్త్ డే పార్టీ ఇచ్చింది. సల్మాన్ ఖాన్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. తెల్లవారుజాము వరకు పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఖాకీలు తెల్లవారుజామున 2.30 గంటలకు అర్పిత ఇంటి తలుపు తట్టారు. అనుకోని అతిథులుగా వచ్చిన పోలీసులను చూసి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెట్టి చుట్టపక్కలవారికి నిద్రాభంగం కలిగించిందుకు మహారాష్ట్ర పోలీసు చట్టం కింద కేసు నమోదు చేశారు. రూ. 12 వేల జరిమానా విధించి, సంగీతం ఆపుజేయించారు. తన గారాల చెల్లెలు పుట్టినరోజు పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో సల్మాన్ ఖాన్ నొచ్చుకున్నాడట. తర్వాత రోజు ఆదివారమైనా షూటింగ్ కు వెళ్లిపోయాడట.