మేనకోడలిపై ముద్దులు కురిపించిన సల్మాన్‌.. | Arpita Khan Shares a Video Of Salman Khan Plays Niece Ayat With Kisses | Sakshi
Sakshi News home page

మేనకోడలిపై ముద్దులు కురిపించిన సల్మాన్‌..

Published Tue, Mar 10 2020 6:08 PM | Last Updated on Tue, Mar 10 2020 8:05 PM

Arpita Khan Shares a Video Of Salman Khan Plays Niece Ayat With Kisses - Sakshi

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కు పిల్లలంటే ఎంతో ఇష్టమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో పిల్లలు కావాలి.. కానీ భార్య వద్దూ అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. కాగా పిల్లలపై భాయిజాన్‌కు ఉన్న ప్రేమను చూసి ఆయన చెల్లెలు అర్పితా ఖాన్‌ అన్నయ్య కోసం తన కూతురు(అయాత్‌)ను దత్తత ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం అన్నయ్య పుట్టిన రోజు నాడే అయాత్‌కు జన్మనివ్వాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్లుగానే సల్మాన్‌ బర్త్‌ డే(డిసెంబర్‌ 27)న ఆడబిడ్డకు జన్మనిచ్చి బహుమతిగా ఇచ్చారు ఆర్పితా దంపతులు. (బావకు బహుమతి ఇవ్వాలనే ఇలా...)
స్టార్‌ అంబాసిడర్‌, స్మార్ట్‌ఫోన్‌ గెల్చుకునే చాన్స్‌

We love you Mamu @beingsalmankhan

A post shared by Arpita Khan Sharma (@arpitakhansharma) on

తాజాగా కోడలు అయాత్‌పై భాయిజాన్‌ ముద్దుల వర్షం కురిపిస్తూ.. చిన్నారితో ఆడుకుంటున్న వీడిమోను ఆర్పితా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సల్మాన్‌ తన ముద్దుల కోడలికి పదే పదే ముద్దులు పెడుతూ.. తనతో ఆడుకుంటున్న ఈ వీడియోకు అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు. ‘వావ్‌.. అయాత్‌ ఎంత ముద్దుగా ఉంది’, ‘మామకు కోడలంటే ఎంత ఇష్టమో’ అంటూ నెటిజన్లు హార్ట్‌ ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు.

కాగా భాయాజాన్‌కు కూడా చెల్లలు అర్పితా అంటే కూడా చాలా ఇష్టం. హిమాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మనవడు ఆయుష్‌ శర్మతో ఆర్పితా వివాహం 2014లో జరిగింది. చెల్లెలి పెళ్లిని సల్మాన్‌ హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిపించాడు. ఇక అర్పిత సల్మాన్‌ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్‌ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement